కవరత్తి: తన పర్యటనల్లో వైవిధ్యం.. కొత్తదనం రెండూ ఉండేలా చూసుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ రెండు రోజుల పర్యటనలో ‘వావ్’ అనిపించేలా ఫోజులతో ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ప్రధాని మోదీ గురువారం అడ్వెంచర్‌కు దిగారు. స్నార్కలింగ్ చేసినట్లు ఫొటోల్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. కళ్లజోడు తరహా ఉండి ఒక గొట్టంలాంటి భాగం(దీనిని స్నార్కల్ అంటారు)తో గాలిపీలుస్తూ నీటిలో ఈదడాన్నే స్నార్కలింగ్ అంటారు. ఆ ఫొటోలు పంచుకుంటూ.. ఉల్లాసంగా గడిపినట్లు చెప్పారాయన. అలాగే సాహసయాత్రికుల జాబితాలో లక్షద్వీప్ ఉండాల్సిందేనని సూచించారాయన. అంతకు ముందు..
And those early morning walks along the pristine beaches were also moments of pure bliss. pic.twitter.com/soQEIHBRKj
— Narendra Modi (@narendramodi) January 4, 2024
ప్రకృతి అందాలతో పాటు, లక్షద్వీప్ ప్రశాంతత కూడా మంత్రముగ్దులను చేస్తుంది. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పని చేయాలో ఆలోచించే అవకాశం నాకు లభించింది అంటూ సాగర తీరాన నడుస్తూ.. సేదతీరుతూ ఫొటోల్ని షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment