under sea
-
PM Modi Lakshadweep: ప్రధాని మోదీ.. జస్ట్ వావ్
కవరత్తి: తన పర్యటనల్లో వైవిధ్యం.. కొత్తదనం రెండూ ఉండేలా చూసుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ రెండు రోజుల పర్యటనలో ‘వావ్’ అనిపించేలా ఫోజులతో ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రధాని మోదీ గురువారం అడ్వెంచర్‌కు దిగారు. స్నార్కలింగ్ చేసినట్లు ఫొటోల్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. కళ్లజోడు తరహా ఉండి ఒక గొట్టంలాంటి భాగం(దీనిని స్నార్కల్ అంటారు)తో గాలిపీలుస్తూ నీటిలో ఈదడాన్నే స్నార్కలింగ్ అంటారు. ఆ ఫొటోలు పంచుకుంటూ.. ఉల్లాసంగా గడిపినట్లు చెప్పారాయన. అలాగే సాహసయాత్రికుల జాబితాలో లక్షద్వీప్ ఉండాల్సిందేనని సూచించారాయన. అంతకు ముందు.. And those early morning walks along the pristine beaches were also moments of pure bliss. pic.twitter.com/soQEIHBRKj — Narendra Modi (@narendramodi) January 4, 2024 ప్రకృతి అందాలతో పాటు, లక్షద్వీప్ ప్రశాంతత కూడా మంత్రముగ్దులను చేస్తుంది. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పని చేయాలో ఆలోచించే అవకాశం నాకు లభించింది అంటూ సాగర తీరాన నడుస్తూ.. సేదతీరుతూ ఫొటోల్ని షేర్ చేశారు. -
సముద్ర గర్భం గుండా ‘బుల్లెట్ ట్రైన్’.. దేశంలోనే తొలిసారి!
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి సముద్ర గర్భ సొరంగం మార్గం అందుబాటులోకి రానుంది. ఈ టన్నెల్ నిర్మాణం ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సముద్ర గర్భంలో సొరంగం పనులకు నేషనల్ హైస్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) బిడ్లను ఆహ్వానిస్తోంది. హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా మొత్తం 21 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించనుండగా.. 7 కిలోమీటర్లు సముద్రగర్భంలో తవ్వాల్సి ఉంది. మహారాష్ట్రలోని బంద్రా-కుర్లా కాంప్లెక్స్ మధ్య సాధారణ సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా.. థానే జిల్లాలోని శిల్ఫాటా ప్రాంతంలో సముద్రంలో నిర్మించాల్సి ఉంది. గతంలో అండర్‌వాటర్ టన్నెల్ నిర్మాణం కోసం ఢిల్లీ-ముంబై మధ్య యమునా నది కింద తవ్వాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, అది సాధ్యపడలేదు. మరోవైపు.. బ్రహ్మపుత్ర నది కింద అన్ని వాహనాలు వెళ్లేందుకు వీలుగా సొరంగ మార్గం ఏర్పాటు కోసం రోడ్డు, రైల్వే మంత్రిత్వ శాఖలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. 2019లోనే హైస్పీడ్ ట్రైన్ టన్నెల్ నిర్మాణానికి ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ టెండర్లు ఆహ్వానించింది. ఆ తర్వాత గత నవంబర్లోనూ మరోసారి బిడ్లను ఆహ్వానించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో కదలిక వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 29 నాటికి బిడ్లు దాఖలు చేయాలని గడువు విధించారు అధికారులు. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య చేపడుతోన్నఈ రైలు కారిడార్ మొత్తం 508.17 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. అహ్మదాబాద్ నుంచి ముంబై కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. ప్రాజెక్టును పూర్తిచేసి 2026లో తొలిదశ ట్రయల్స్‌ను నిర్వహించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆశాభావంతో ఉంది. ఇదీ చదవండి: Viral Video: మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం! -
అడ్వెంచర్: సాగర గర్భాన వందేళ్ల నాటి నౌకల అన్వేషణ
సాక్షి, విశాఖపట్నం: వందేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని సముద్రంలో మునిగిపోయిన నౌకల ఆనవాళ్లను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లను కనుగొని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఓ నౌక ఆనవాళ్లను గుర్తించిన లివిన్ అడ్వెంచర్స్ బృందానికి ఈ బాధ్యత అప్పగించింది. శ్రీకాకుళం జిల్లాకు సమీపంలో మూడుచోట్ల వివిధ సందర్భాల్లో నౌకలు మునిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ తీరంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన బ్రిటిష్ ఇండియా నావిగేషన్ కంపెనీకి చెందిన చిలకా షిప్ ఆనవాళ్లను విశాఖ జిల్లాకు చెందిన లివిన్ అడ్వెంచర్స్ బృందం 2020లో కనిపెట్టింది. బారువా తీరం చేరే సమయంలో షిప్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఈ నౌక మునిగిపోయింది. ఈ షిప్ తీరానికి ఎంత దూరంలో ఉంది, దాని శిథిలాలు ఎలా ఉన్నాయనే విషయాల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఇదే తరహాలో మరో రెండు చోట్ల నౌకలు మునిగిపోయినట్టు చరిత్ర చెబుతోంది. దీంతో శ్రీకాకుళం కలెక్టరేట్ వర్గాలు ఆ రెండుచోట్ల అన్వేషణ సాగించాలంటూ లివిన్ అడ్వెంచర్స్ సంస్థను సంప్రదించాయి. జోగంపేట, భావనపాడు బీచ్‌లలో.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్‌కు కొంత దూరంలో విదేశీ నౌక వందేళ్ల క్రితం మునిగిపోయినట్టు చరిత్రలో ఉంది. ఈ షిప్ ఎంత దూరంలో మునిగిపోయింది, ఆ షిప్ ఏ దేశానికి చెందినది, అది కార్గోనా లేక ప్రయాణికులతో వెళ్లే నౌకా అనే వివరాలు మాత్రం ఎక్కడా లేవు. అదేవిధంగా పోలాకి మండలం జోగంపేట తీరంలోనూ ఒక నౌక మునిగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1944లో జరిగిన బాంబు దాడుల్లో ఒక నౌక జోగంపేట తీరంలో ధ్వంసమైనట్టు గుర్తించారు. దీని పేరు సిలికాన్ షిప్ అని తెలిసింది. అయితే.. ఈ షిప్ ఏ దేశానికి చెందినది, ఎంతమంది ప్రయాణికులతో వచ్చింది తదితర వివరాలేవీ వెలుగులోకి రాలేదు. ఈ రెండుచోట్ల సాగర గర్భంలో చిక్కుకున్న చరిత్ర ఆనవాళ్లని అన్వేషించేందుకు లివిన్ అడ్వెంచర్స్ సంస్థ సమాయత్తమవుతోంది. ఈ నెల మొదటి వారంలో ఈ బృందం భావనపాడు తీరంలో అన్వేషణ సాగించాల్సి ఉండగా.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇన్స్ట్రక్టర్ బలరాం నాయుడు, డైవ్ మాస్టర్ రాహుల్, అడ్వాన్స్ డైవర్ లక్ష్మణ్ కలిసి సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ.. అన్వేషణ మొదలు పెట్టనున్నారు. -
నీటి అడుగున చిత్రం
కళాకారులంటేనే సృజన శీలురు. ఏ పని అయినా చాలా వినూత్నంగా చేయాలని కోరుకుంటారు. క్యూబాకు చెందిన శాండోర్ గొంజాలెజ్ చిత్రకారుడు చూసినది చూసినట్టు కాన్వాస్‌పై చిత్రించేస్తాడు. అయితే, భూ ఉపరితలంపై అన్నింటినీ చిత్రించేశాడో, లేక పైన ఎక్కడా సరైన ప్లేస్ లేదనుకున్నాడో ఏమో గాని.. సముద్రం లోపలికి వెళ్లి నేరుగా ఆ లోపలి జలరాశిని, చేపలను, సొరచేపలను, పగడపుదిబ్బలను చూస్తూ పెయింటింగ్ వేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సరంజామా అంతా ఏర్పాటు చేసుకొని సముద్రంలో మునిగాడు. శాండోర్ వయసు 42. నలుపు–తెలుపు చిత్రాలను, వేటకు సంబంధించినవి, పట్టణ, పల్లె జీవనశైలులు కాన్వాస్‌పై కళ్లకు కట్టేలా చిత్రించి అంతర్జాతీయంగా పేరొందినవాడు. ఆరేళ్ల క్రితం.. క్యూబా దీవుల్లో స్కూబా డైవింగ్‌లో పాల్గొన్నప్పుడు నీటి కింద కనిపించే ప్రశాంతత, అక్కడి ప్రకృతి అందమైన రూపాలు చూసి అబ్బురపడ్డాడు. ‘తేలికపాటి అలలు, మృదువుగా మనసును తాకే సవ్వడులు నాలో ఒక అలౌకికమైన ఆనందాన్ని నింపాయి’ అంటాడు శాండోర్. స్పెయిన్‌లో ఒక జీవశాస్త్రవేత్త నీటి అడుగున పెయింటింగ్ వేశారని ఎవరో బ్లాగర్ ద్వారా తెలుసుకున్నప్పటికీ తనకు తానుగా ఒక ప్రయోగం చేయాలనుకున్నాడు. నీళ్లలో తడిస్తే తుడుచుకుపోయే పెయింట్ కాకూడదని, భూమి పైనా ఆ చిత్రాలతో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. తెల్లటి కాన్వాసులను ఒక గంట సేపు నీళ్లలో నానబెట్టి, వాటిలో ఉప్పు ఇతర సేంద్రీయ పదార్థాలను వదిలించడానికి ప్రత్యేకంగా కడగడం ఎలాగో, వాటిని ఎలాంటి పద్ధతుల్లో ఆరబెట్టాలో నేర్చుకున్నాడు. నీ అడుగున చేరి కాన్వాస్‌పై ఏ రంగులు.. ఎలా వేయాలో తెలుసుకున్నాడు. సరైన సరంజామాతో.. స్కూబా డైవింగ్ గేర్, ఆక్సిజన్ ట్యాంక్, కాళ్లకు కట్టుకునే ఎల్లో ఫ్లిప్పర్స్, కాన్యాస్, ఇతరత్రా సామగ్రి అంతా తీసుకొని సముద్రంలో మునిగి 197 అడుగుల లోతుకు వెళ్లి తన పెయింటింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. మరో ఇరవై అడుగుల లోతులో నీటి ఉధృతి లేని చోటు చూసుకుని కాన్వాస్ టేబుల్‌ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆక్సిజన్ ట్యాంక్ పరిధి మేరకు ముప్పై నిమిషాల సేపు నీటి అడుగు లోపలి అందాలను వీక్షిస్తూ పెయింటింగ్ వేసుకొని పైకి వచ్చేస్తాడు. పారదర్శకంగా కనిపించే నీళ్లలో 200 అడుగుల లోతు నుంచి పైకి చూస్తూ ఆ కనిపించే ప్రపంచంలో ఎగిరి తిమింగళాలు, చేపలు, కదలాడుతున్నట్టు కనిపించే ఇండ్లు, చెట్లు, ఆకాశం... ఇలా ఎన్నో అందాలు ఆ చిత్రాల్లో కనిపిస్తాయి. ‘నీటి అడుగున పెయింటింగ్ వేయడం ప్రపంచంలో మరెక్కడా లేదని నేను అనుకోను. నేనైతే జలంతర్గామి పెయింటింగ్‌ను నీటిలో ఉండి చిత్రించాలనుకుంటున్నాను’ అంటూ తన ముందున్న లక్ష్యాన్ని వివరిస్తాడు శాండోర్. ఇప్పుడు క్యూబా దీవుల్లో టూరిస్టులకు, స్కూబా డైవింగ్ చేసేవారికి శాండోర్ నీటి అడుగు చిత్రాల గురించి అక్కడి స్థానికులు ప్రత్యేకంగా చెబుతుంటారు. -
మనకు సముద్రం కింద నుంచి బుల్లెట్ ట్రైన్
న్యూఢిల్లీ: బుల్లెట్ రైలు త్వరలో భారతీయ రైల్వేలో అడుగుపెట్టడమే ఒక గొప్ప అనుభూతి అనుకుంటే.. అంతకుమించిన మధురానుభూతి అతిత్వరలో లభించనుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రయాణించడం ద్వారా అది సొంతం కానుంది. ఎందుకంటే అరేబియా తీరం గుండా ఉండే ఈ రెండు ప్రాంతాల మధ్య నడిచే బుల్లెట్ రైలు సముద్రం కింద నుంచి పరుగులు పెట్టనుందట. దీని కోసం ఓ భారీ సొరంగ మార్గాన్ని ఏర్పాటుచేయనున్నారు. ముంబయి-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైలును ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ రైలు ప్రయాణించే మొత్తం 508 కిలోమీటర్లు కాగా.. అందులో 21 కిలోమీటర్లు సముద్రం క్రింది నుంచి ప్రయాణించనుంది. అందుకు ప్రధాన కారణం ధానే వద్ద ఓ పెద్ద సముద్ర చీలిక అడ్డురావడం. ఈ నేపథ్యంలోనే ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటుచేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రైలు ఏర్పాటు కోసం మొత్తం రూ.97,636 కోట్లు వెచ్చిస్తుండగా.. ఇందులో జపాన్ వద్ద నుంచే 81శాతం రుణంగా ఇస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఒప్పందం 2016 చివరినాటికి పూర్తి కానుండగా.. 2018లో పనులు ప్రారంభం కానున్నాయి.