ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా సముద్రంలో నీటి అడుగున సాహస క్రీడలో స్వయంగా పాల్గొన్నారు. అక్కడి జల చరాలను, వాటి జీవనాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అరేబియా సముద్రంలో ఉల్లాసకరమైన అనుభవం సొంతం చేసుకున్నానంటూ మోదీ తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. లక్షద్విప్‌లో తన పర్యటన సందర్భంగా స్నాకలింగ్‌కు ప్రయత్నించానని తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష ద్విప్ పర్యటన సందర్భంగా సముద్రంలో నీటి అడుగున సాహస క్రీడలో స్వయంగా పాల్గొన్నారు. అక్కడి జలచరాలను, వాటి జీవనాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అరేబియా సముద్రంలో ఉల్లాసకరమైన అనుభవం సొంతం చేసుకున్నానంటూ మోదీ తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సముద్రం అడుగున తన సాహసానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. అడ్వెంచర్‌ను ఇష్టపడేవారికి లక్షద్వీప్ సందర్శన అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. లక్షద్విప్‌లో తన పర్యటన సందర్భంగా స్నాకలింగ్‌ను(నీటి అడుగున సాహసం) ప్రయత్నించానని తెలిపారు.
అది మర్చిపోలేని అనుభవమని ఉద్ఘాటించారు. లక్షద్విప్ సముద్ర తీరాల్లో ఉదయం పూట నడక, బీచు ఒడ్డున కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలను సైతం మోదీ షేర్ చేశారు. ఆయన ఈ నెల 2, 3వ తేదీల్లో లక్షద్విప్‌లో పర్యటించారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. లక్షద్వీప్ అందచందాలతోపాటు అక్కడి ప్రశాంతత మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయని పేర్కొన్నాను. అలాగే అక్కడి ప్రజలు చూపిన ఆత్మియత, గౌరవం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వివరించారు. లక్షద్విప్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment