లక్షద్వీప్‌ ఎంపీకి ఎదురుదెబ్బ | SC Setback For Lakshadweep NCP MP Mohammed Faizal Case | Sakshi
Sakshi News home page

లక్షద్వీప్‌ ఎంపీ వ్యవహారంలో మరో ట్విస్ట్‌.. సుప్రీం ఆదేశాలతో ఎదురుదెబ్బ

Published Tue, Aug 22 2023 2:31 PM | Last Updated on Tue, Aug 22 2023 3:12 PM

SC Setback For Lakshadweep NCP MP Mohammed Faizal Case - Sakshi

లోక్‌సభ అనర్హత వేటు ఎత్తేయడంతో మళ్లీ ఎంపీ అయిన ఫైజల్‌..  

ఢిల్లీ: లక్షద్వీప్‌ ఎన్సీపీ లోక్‌సభ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌కుMohammed Faizal ఎదురు దెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో ఆయనకు కేరళ హైకోర్టు ఇచ్చిన ఊరటను సుప్రీం కోర్టు మంగళవారం పక్కనపెట్టేసింది. ఈ కేసును కొత్తగా మళ్లీ పరిశీలించాలంటూ కేరళ హైకోర్టును ఆదేశిస్తూ.. ఆరువారాల గడువు ఇచ్చింది.  దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయ్యింది. 

సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో..  ఆ గడువులోగా(ఆరువారాల) లక్షద్వీప్ పరిపాలన విభాగం అప్పీల్‌ను హైకోర్టు కొత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ కేసులో లోక్‌సభ ఎంపీని దోషిగా నిర్ధారించి, శిక్ష విధించడాన్ని సస్పెండ్ చేయడంలో కేరళ హైకోర్టు అనుసరించిన విధానం తప్పు అని జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్‌ అల్లుడు మహ్మద్‌ సాలిహ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు మహ్మద్‌ ఫైజల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు  2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు.

అనర్హత వేటు.. ఎత్తివేత
అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది కవరత్తి కోర్టు. దీంతో..  ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 (3) ప్రకారం..  జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. ఆ ఆదేశాలపై ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. అది తప్పుడు కేసు అని, ఫైజల్‌ను నిర్దోషిగా తేలుస్తూ, లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అంశం పరిశీలించమని లోక్‌సభ సెక్రటేరియట్‌కు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సభ్యత్వం పునరుద్ధరణ అంశంలో లోక్‌సభ సెక్రటేరియేట్‌ మాత్రం జాప్యం చేసినా.. చివరకు మార్చి 29వ తేదీన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోట్‌ విడుదల చేసింది.  

35లో నలుగురు మాత్రమే..
ట్రయల్ కోర్టు ఇచ్చిన శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేరళ హైకోర్టు తెలిపింది. అయితే హైకోర్టు ఆదేశాలను లక్షద్వీప్ పరిపాలన సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ‘‘ఫైజల్‌కు ఉపశమనం ఇవ్వడం.. న్యాయ ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తుంది’’ అని లక్షద్వీప్‌ రిపాలన విభాగం వాదనలు వినిపించింది. సాలిహ్‌పై ఉద్దేశపూర్వకంగానే ఫైజల్‌తో పాటు మరికొందరు మారణాయుధాలతో దాడి చేశారని,  ఈ కేసులో మొత్తం 37 మంది నిందితులను చేర్చగా.. ఇద్దరు విచారణ సమయంలో మరణించారని లక్షద్వీప్‌ పరిపాలన విభాగం సుప్రీంకు నివేదించింది. చివరకు 35లో కేవలం నలుగురిని మాత్రమే దోషులుగా నిర్ధారించిన కవరత్తి కోర్టు.. పదేళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తూ మిగిలిన వాళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement