
న్యూఢిల్లీ: తనపై అనర్హత వేటు ఎత్తేసి లోక్‌సభ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలంటూ లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
హత్య కేసులో ఫైజల్‌ను దోషిగా నిర్థారించి కవరత్తీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ జనవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. తీర్పుపై కేరళ హైకోర్టు స్టే విధించింది. అయినా అనర్హతను లోక్‌సభ సెక్రటేరియట్ ఎత్తేయలేదని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో ఎంపీ పేర్కొన్నారు.