Mohammed
-
నిరుపేద కుటుంబంలో వెలుగులు
సాక్షి, అమరావతి: నిరుపేద కుటుంబాన్ని పెద్దకష్టం చుట్టుముట్టింది. ఊహించని ప్రమాదంలో తొమ్మిదేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడి నోట మాటలేక, శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బాలుడి చికిత్సలకు రూ.లక్షల్లో ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో అంత డబ్బును సమకూర్చలేని నిస్సహాయత వారిది. ఆపద సమయంలో సీఎం జగన్ ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇవ్వడమే కాకుండా.. ఖరీదైన చికిత్సను చేయించింది. ఆ నిరుపేద కుటుంబంలో వెలుగులు నింపింది. స్వరపేటిక, శ్వాసనాళం చితికిపోయి.. పల్నాడు జిల్లా నకరికల్లులోని పాతూరుకు చెందిన షేక్ బాజీ, ఖాజాబీ ఇటుక బట్టీల్లో కూలీ పనులు చేసుకుంటుంటారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తొమ్మిదేళ్ల అనాస్ మహమ్మద్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ కిందపడిపోయాడు. ప్రమాదంలో బాలుడి గొంతుకు ఇనుపరాడ్ బలంగా గుచ్చుకుపోయింది. స్వరపేటిక, శ్వాసనాళం పూర్తిగా చితికిపోయాయి. హుటాహుటిన నరసరావుపేట ప్రభుత్వా్రస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అవసరమని నిర్ధారించిన వైద్యులు అంబులెన్స్‌లో వెంటిలేటర్‌పై హైదరాబాద్ తరలించారు. మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 3,257 ప్రొసీజర్లతో లక్షలాది మంది బాధితులకు అండగా సీఎం జగన్ నిలిచారు. అక్కడితో ఆగకుండా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని అరుదైన జబ్బుల బారినపడి రూ.లక్షలు, కోట్లలో వైద్యానికి ఖర్చయ్యే వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్ విషయంలోనూ సీఎం జగన్ మానవతా ధృక్పథంతో స్పందించారు. బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా వెనుకాడొద్దని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎంవో అధికారులు హైదరాబాద్‌లోని ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్‌చేసి బాలుడి శస్త్ర చికిత్సకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, వెంటనే శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించారు. దీంతో వైద్యులు అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ శస్త్ర చికిత్సను చేపట్టారు. చికిత్స అనంతరం వైద్యుల పరిశీలన ముగించుకుని ఈ నెల 14న బాలుడు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు. మరో మూడు నెలల అనంతరం ఇంకొక సర్జరీ చేస్తే బాలుడు ముందులా మాట్లాడగలుగుతాడని వైద్యులు చెబుతున్నారు. ఆపద కాలంలో సీఎం జగన్ చేసిన మేలును ఎప్పటికీ మరువలేమని ఖాజాబీ దంపతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ బిడ్డ తమకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యామని భావోద్వేగానికి గురవుతున్నారు. ఒక్క ట్వీట్‌తో స్పందించిన ప్రభుత్వం దెబ్బతిన్న స్వరపేటిక, శ్వాసనాళానికి అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించారు. ఆ చికిత్స నిర్వహణ, వైద్య పరీక్షలు, మందులకు రూ.6 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. రెక్కలు ముక్కలయ్యేలా కష్టం చేసే ఖాజాబీ దంపతులకు అంత పెద్దమొత్తంలో అప్పు పుట్టని పరిస్థితి. వారి నిస్సహాయ స్థితిని చూసిన గ్రామస్తులంతా తలా కొంత ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయినప్పటికీ.. చికిత్సకు సరిపోయేంత డబ్బు సమకూరకపోవడంతో మహమ్మద్‌ను ఆదుకోవాలంటూ ఓ డాక్టర్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఏపీ సీఎంవో అధికారులు స్పందించారు. ఈ విషయాన్నివెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దేవుడిలా ఆదుకున్నారు రోజూ పనికెళ్లి కూలి డబ్బులతో జీవిస్తున్నాం. తెచ్చుకుంటే తినాలి.. లేదంటే పస్తులుండాలి. ఇది మా జీవితం. అలాంటి మాపై ఉపద్రవంలా పెద్ద కష్టం వచ్చిపడింది. వెంటిలేటర్‌పై బాబును చూసి మాకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యాను. ఆపరేషన్‌కు రూ.6 లక్షలు ఖర్చవుతుందనగానే నా నోట మాట లేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో కూడా దిక్కుతోచని పరిస్థితి. ఆ సమయంలో దేవుడిలా సీఎం జగన్ ఆదుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చంతా భరిస్తామని చెప్పారు. ఈ రోజు మా బాబు సీఎం జగన్ దయవల్లే దక్కాడు. – షేక్ ఖాజాబీ, బాలుడి తల్లి మా పిల్లల చదువులకు అండగా నిలిచారు ఆ దేవుడు మా బిడ్డకు జన్మ ఇస్తే. సీఎం జగన్ పునర్జన్మ ఇచ్చారు. మా కుటుంబంలో వెలుగులు నింపారు. ఏమిచ్చినా ఆయన రుణం మేం తీర్చుకోలేం. అమ్మ ఒడి రూపంలో మా బిడ్డల చదువులకు చేదోడుగా ప్రభుత్వం నిలిచింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం మాకు ఇంటిస్థలం కూడా మంజూరు చేసింది. – షేక్ బాజీ, బాలుడి తండ్రి -
కేరళ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం కాలికట్ యూనివర్సిటీ సందర్శించిన క్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గవర్నర్‌కు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఆయన వాహనాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, నాయకులు అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనపై గవర్నర్ ఆరీఫ్ సీరియస్ అయ్యారు. తనపై విద్యార్థులు దాడి చేయడానికి ప్రయత్నించారని వారంతా నేరస్థులు అని మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారి వెనకాల ముఖ్యమంత్రి పినరయి విజయన్ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేయించడానికి సీఎం విజయన్.. నిరసనకారులను ఉసిగొలిపాడని మండిపడ్డారు. తనను అడ్డుకుని దాడి చేయడానికి ప్రయత్నించిన విద్యార్థులంతా నేరస్థులని, సీఎం వ్యక్తిగతంగా విద్యార్థులను తనపైకి నిరసకు దిగాలని సూచించినట్లు ఆరోపించారు. అయితే గవర్నర్ ఆరీఫ్.. పలు యూనివర్సిటీల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులను వివిధ పదవులకు నామినెట్ చేస్తున్నరని ఆరోపణలు ఉన్నాయి. వాటి నేపథ్యంలో ఆయన కలికట్ యూనివర్సిటీ సందర్శనకు రావటంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై స్పందించిన గవర్నర్.. తాను కేవలం రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారినని వెల్లడించారు. అదీకాక తాను విద్యార్థుల ముసుగులో ఉన్న నేరస్థులకు జవాబుదారి కాదని స్పష్టం చేశారు. చదవండి: మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం -
కీపిటప్..మహమ్మద్ యూనస్!
ఉదయాన్నే కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తుంటే కనిపించింది.ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఒకరు ఆత్మహత్య అని..అలా మరో పేజీ తిప్పానో లేదో సివిల్స్‌లో ఫెయిలయ్యానని బలవన్మరణం అంటూ మరోవార్త ఇదేమిటి చిన్నచిన్న కారణాలతో ఇలా చనిపోవడాలు అనిపించింది.అప్పుడే నిన్న కలిసిన మహమ్మద్ యూనస్ గుర్తొచ్చాడు.. బతుకంతా కష్టాలు ఎదుర్కొన్నా అతడి మొహంలో చెదిరిపోని ఆ చిరునవ్వు గుర్తొచ్చింది.అంగవైకల్యం వెనక్కులాగుతున్నా..ముందుకు దూసుకెళ్లాలన్న అతడిగుండెధైర్యం ఈ ఆత్మహత్యల వార్తల సమయంలో మరీ గుర్తొచ్చింది. ఆ మహమ్మద్ యూనస్ ఎవరో తెలుసుకుందాం. ఓ సాక్షి పాఠకుడి మాటల్లో అతడి కథను విందాం ఓ ఆయుర్వేద మందుల దుకాణంనుంచి మెడిసిన్స్ తెప్పించాలి. దాంతో ఒక బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ యాప్‌లో రైడర్‌ను బుక్ చేసుకుని మందులు ఇంటికి తెప్పించుకు న్నాను. కిందకు వెళ్లి అడిగాను.. డెలివరీ బాయ్ వచ్చాడా అని.. అప్పుడు నేనేనండి అంటూ నవ్వుతూ వచ్చాడు మహమ్మద్ యూనస్.. చూడగానే ఆశ్చర్యం కలిగింది.. ఎందుకంటే.. తను దివ్యాంగుడు.. ఎప్పుడూ ఈ పనిలో దివ్యాంగులను చూడని నేను ఆసక్తి తో అతడి వివరాలు అడిగాను.. అప్పుడు చెప్పాడు.. 36 ఏళ్ల యూనస్ తన కథ.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ చెందిన యూనస్‌ది పేద కుటుంబం. చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. రెండు కాళ్లూ చచ్చుబడి పోయాయి. శరీరం సహకరించక పోయినా ఇంటర్ పూర్తి చేశాడు. ఒక మీడియా సర్వీసెస్ సంస్థలో పదేళ్లు పనిచేశాడు. అది మూతపడ్డాక ఒక మొబైల్ షాపులో చేరాడు. పైగా తండ్రి మరణంతో కుటుంబ బాధ్యత ఇతడి మీదే పడింది. లాక్‌డౌన్‌తో ఆ మొబైల్ షాపు కాస్తా మూతపడటంతో బతుకు రోడ్డున పడింది. ఇదే సమయంలో అనారోగ్యంతో తన 6 నెలల బిడ్డనూ పోగొట్టుకున్నాడు. కష్టాల మీద కష్టాలు వచ్చిపడ్డాయి. కానీ గుండె ధైర్యం మాత్రం సడలలేదు. లాక్డౌన్ సడలించాక ఒక బైక్ ట్యాక్సీ యాప్ వేదికగా రైడర్‌గా మారాడు. ‘ఈ నా బండిని చూసి రోజూ ఒకరిద్దరు రైడ్ క్యాన్సిల్ చేసుకునేవారు. కన్నీళ్లు వచ్చేవి. నా వైకల్యాన్ని చూసి రైడ్ క్యాన్సిల్ చేసుకున్నారని చాలా బాధపడ్డాను. అయితే.. బతకాలంటే పని చేయాలి. అందుకే పరుగు ఆపకూడదని నిర్ణయించుకున్నాను. రైడ్ లేకపోతే సరుకు డెలివరీ అయినా ఉంటుంది. రోజూ ఖర్చులుపోను ఇంటికి రూ.300 దాకా తీసుకువెళతాను. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నా రైడ్ ఆగదు.. సార్’ అంటూ చిరునవ్వుతో సెలవు తీసుకున్నాడు యూనస్. ‘ప్రభుత్వం నుంచి రుణం అందితే ఇంటి దగ్గర మీ సేవ లేదా మొబైల్/కిరాణా దుకాణం పెట్టుకోవాలన్న ఆలోచన ఉంది.. సార్’ అని తన మనసులోని మాట చెప్పాడు. ఈ ఆత్మహత్యల వార్తలు చదివాక.. యూనస్‌ను చూశాక అనిపించింది. మనం చూడాల్సింది నిరాశ అనే నిశీధిని కాదు.. దాన్ని తరిమేసే ఆ చిరుదివ్వెను.... కష్టాల చీకట్లో మగ్గుతున్న ఎంతోమందికి ఈ యూనస్ కథ ఒక చిరుదివ్వెనే... కీపిటప్.. మహమ్మద్ యూనస్.. -
నా లోక్‌సభ సభ్యత్వాన్ని... వెంటనే పునరుద్ధరించండి
న్యూఢిల్లీ: తనపై అనర్హత వేటు ఎత్తేసి లోక్‌సభ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలంటూ లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హత్య కేసులో ఫైజల్‌ను దోషిగా నిర్థారించి కవరత్తీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ జనవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. తీర్పుపై కేరళ హైకోర్టు స్టే విధించింది. అయినా అనర్హతను లోక్‌సభ సెక్రటేరియట్ ఎత్తేయలేదని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఎంపీ పేర్కొన్నారు. -
కలకలం సృష్టించిన డమ్మీ గన్
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్‌నంబర్– 10లోని సింగాడికుంట బస్తీ అధ్యక్షుడు మహ్మద్ ఎజాజ్ ఆదివారం రాత్రి డమ్మీ గన్‌తో నిర్వహించిన ర్యాలీ స్థానికంగా సంచలనం సృష్టించింది. గన్ను చూపిస్తూ స్థానికులను భయభ్రాతులకు గురి చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఎజాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఎజాజ్, ఆయన కుమారుడిపై స్థానికంగా కొంతమంది కత్తులతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డారు. దాడి చేసిన వారికి ఇటీవలే బెయిల్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎజాజ్ డమ్మీ గన్ చేతపట్టుకొని ర్యాలీ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ర్యాలీ ఎందుకు నిర్వహించింది, డమ్మీగన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. -
టీడీపీని వీడేందుకు సిద్ధం
గుంటూరు రూరల్: తెలుగు దేశం పార్టీని 30 ఏళ్లుగా భుజాలపై మోసి అలసిపోయామని, అయినా చంద్రబాబుకు తాము అంటే చులకనగా ఉందని నూర్‌బాషా దూదేకుల సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు పీర్ మహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు శివారుల్లోని గోరంట్ల గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 30 లక్షల మందికిపైగా నూర్‌బాషా, దూదేకులున్నారని 2014లో టీడీపీ విజయానికి తామంతా ఎంతో కష్టపడితే చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. నూర్‌బాషాలకు టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చనందునే తామంతా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీకి ఒక్కరోజు సమయం ఇస్తున్నామని, వైఎస్సార్సీపీలో చేరేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూర్‌బాషా దూదేకుల సంఘం నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గతంలో తమ సంఘం ప్రతినిధులు పలుమార్లు కలిసేందుకు వెళ్లగా కనీసం అవకాశం ఇవ్వకుండా చిన్నచూపు చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో సంఘం నాయకులు డీపీ మస్తాన్, షేక్‌బాజీ, షేక్ సుభాన్, ఆదం షఫీ తదితరులు పాల్గొన్నారు. -
చేతికి స్టీరింగ్
ఆదివారం, 24. జూన్ 2018. సౌదీలో వీధులన్నీ కోలాహలంతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. న్యూ ఇయర్‌లా! అంతకన్నా ఎక్కువే. ఓ కొత్త శకంలా. అసలు శనివారం అర్ధరాత్రి గడియారం ముళ్లు 12 మీదకు రాగానే, వీధులన్నీ హర్షాతిరేకపు జల్లులతో నిండిపోయాయి. రియాద్, జెడ్డా, దమ్మమ్లలో మహిళలంతా దీపాలు పట్టుకుని తిరిగారు. ‘‘నేను మా వారి కారును ఈ రోజు ఉపయోగించుకున్నాను. త్వరలోనే నా కారు నేను కొనుక్కుందామనుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ అంతా వింతగా, కొత్తగా కనిపిస్తోంది. ఇది నిజంగానే సౌదీ మహిళలకు పండుగరోజు’’ అన్నారు సౌదీ మహిళ బయన్. సౌదీ మీడియా వీరిని అనుసరించి ప్రపంచానికి వీరి ఆనందాన్ని పంచింది. స్టీరింగ్ తమ చేతికి రావడాన్ని స్వాతంత్య్రానికి తొలి అడుగు పడినట్లు భావిస్తున్నారు సౌదీ మహిళలు. సుమారు 30 సంవత్సరాల తరవాత నిషేధాన్ని ఎత్తివేయడమే ఇంత ఆనందానికీ కారణం. 1990లో పోలీసులు, లైసెన్స్ ఏజెన్సీలు కలిసి మహిళల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసి, మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని నిషేధించిన రోజు నుంచి అక్కడి మహిళలు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. ఇటీవలే పట్టాభిషిక్తుడైన మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీలో సంస్కరణలకు నడుం బిగించారు. సాంఘిక, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగానే మహిళలు స్వేచ్ఛగా వాహనాలు నడుపుకునేలా చట్టం తీసుకొచ్చారు. ‘‘ఇక్కడ జీవితం ఒక్కోసారి దుర్భరంగా అనిపిస్తుంది’ అంటారు బయాన్. సిరియాకి చెందిన బయాన్, డమస్కస్‌లో చదువుకుంటున్న రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నారు.‘‘సూపర్ మార్కెట్‌కి వెళ్లడానికి కూడా ఇతరుల మీద ఆధారపడటం చాలా చిరాకుగా ఉండేది. కనీసం పది నిమిషాల దూరానికి కూడా స్వేచ్ఛగా ప్రయాణించ లేకపోవడం బాధాకరం. ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడటం ఎంతో ఆనందంగా ఉంది. పురుషాధిక్యం ఉన్న సౌదీ అరేబియాలో మహిళలు ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ, సెకండ్ క్లాస్ సిటిజన్‌గా, నిర్ణయాలు తీసుకోలేని వారిగా ఉండటం మాకు ఎంతో బాధగా ఉంటుంది’’ అంటున్నారు బయాన్. – రోహిణి ఎక్కడికైనా వెళ్లగలను రైడ్ హెయిలింగ్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకున్న మొట్టమొదటి సౌదీ అమ్మాయిని నేనే. ఈ రోజు నాకు స్వేచ్ఛ లభించింది. ఏ సమయంలోనైనా ఎక్కడికైనా నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే హక్కును సాధించాను. నేను డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టాను. సౌదీలో మహిళా కాల్ సెంటర్ కూడా స్థాపించాను. ఇక్కడ ఇదే ఏకైక మహిళా కాల్ సెంటర్. త్వరలోనే 20 వేల మంది మహిళా డ్రైవర్లు వచ్చేలా చూస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. – కరీమ్, సౌదీ మహిళ నా జీవితంలో మంచిరోజు ఆర్థికంగా స్వేచ్ఛగా బతకడానికి, సంఘంలో నిలదొక్కుకోవడానికి డ్రైవింగ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను హాయిగా నాకు కావలసినవారిని కలవడానికి స్వేచ్ఛగా వెళ్లగలుగుతాను. నా జీవితంలో ఇంత మంచి అవకాశం వచ్చినరోజు మరొకటి లేదేమో. – ఈనామ్ ఘాజీ అల్ అస్వాద్, సౌదీ మహిళ -
హజరత్ హుసేన్ త్యాగాలు చిరస్మరణీయం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మహమ్మద్ ప్రవక్త మనుమడు హజరత్ హుసేన్, ఆయన కుటుంబ సభ్యులు ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రాణ త్యాగాలు చేశారని హజరత్ అజీముద్దీన్ దర్గా బ్రాదరే సజ్జాదే నషీన్ సయ్యద్ తాహెర్ పాషా ఖాద్రి పేర్కొన్నారు. మొహర్రం పండుగను పురస్కరించుకుని ముహిబ్బానే అహ్లెబైత్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇస్లామియా అరబ్బిక్ కళాశాల మైదానంలో 'యాదే హుసైన్' పేరుతో గొప్ప బహిరంగ సభ నిర్వహించారు. లావుబాలీ దర్గా పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్లా హుసేని బాద్షా ఖాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మన్షాద్ పాషా ఖాద్రి, సయ్యద్ రిజ్వాన్ పాషా ఖాద్రి, సయ్యద్ షఫి పాషా ఖాద్రి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. -
అలలకు బలైన అన్నదమ్ములు
భార్యాబిడ్డలను రక్షించబోయి మృత్యువాత ఎస్‌రాయవరం: ఎస్‌రాయవరం మండలం బంగారమ్మపాలెం సమీపంలో సముద్రంలో మునిగి ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు. పాయకరావుపేటలోని శాంతినగర్ చెందిన మహ్మద్ గయాజ్(38), మహ్మద్ దావూద్‌వాహబ్(36)లు అన్నదమ్ములు. గయాజ్ పాయకరావుపేటలో తోళ్లవ్యాపారం చేస్తుండగా, వాహబ్ హైదరాబాద్‌లో సాఫ్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం వీరు తమ కుటుంబాలతో శనివారం బంగారమ్మపాలెం సముద్రతీరానికి విహారయాత్రకు వెళ్లారు. స ముద్రంలో స్నానం చేద్దామని దిగా రు. కొంచెం సమీపాన చిన్నపాటి కట్టెలపై కుటుంబ సభ్యులు ఆడుకుంటున్నారు. కెరటాల తాకిడికి పిల్లలు మునిగిపోతారేమోనని భావించి వీరిద్దరూ రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే కెరటాల తాకిడికి ఈ అన్నదమ్ములు నీటమునిగిపోయారు. అక్కడే ఉన్న నేవీసిబ్బంది ..మత్య్స కారులు వీరిని ఒడ్డుకుచేర్చారు. వీరిని నక్కపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వృతిచెందారు. ఎస్.రాయవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాలకు నక్కపల్లి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. నే వల్ సిబ్బంది ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరించే లోగా నే వీరిద్దరూ మునిగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. -
బాంబు కలకలం సృష్టించిన వ్యక్తి అరెస్ట్
నిందితుడు కర్ణాటక వాస తిరుపతి క్రైం: తిరుపతిలో బాంబు పేల్చేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫోన్ ద్వారా చెప్పి కలకలం సృష్టించిన వ్యక్తిని తిరుపతి అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. తన దగ్గర పనిచేసి నిలి చిపోయిన వ్యక్తిని ఇబ్బందులపాలు చేయబోయి తానే పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. మంగళవారం అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి వివరాలు వెల్లడించారు.. ఈనెల 11వ తేదిన తిరుపతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆ నేపథ్యంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి కర్ణాటక డీజీపీ ఆఫీసులోని 100 నెంబరుకు ఫోన్ చేశాడు. తిరుపతిలో ఉత్తమ్‌కుమార్ అనే వ్యక్త్తి బాంబు పేల్చేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. అతని సెల్ నెంబ రు కూడా ఇచ్చాడు. వారు తిరుపతి పో లీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అర్బన్ ఎస్పీ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ముఖ్య ప్రదేశాలకు టీమ్స్‌ను పంపి తనిఖీ చేశారు. ఆ ఫోన్ నెంబరు ఆధారంగా విచారించి రాజు సర్కార్ అలియాస్ ఉత్తమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని వి చారించగా తనది పశ్చిమ బెంగాల్‌లోని బాలార్ ఘాట్ జిల్లా, కలిబరి పెరూసా గ్రామమని బతుకు తెరువు కోసం తిరుపతికి వచ్చి సెంట్రింగ్ పనులతో జీవిస్తున్నానని చెప్పాడు. ఫోన్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని పట్టుకోవాలంటూ ఏఎస్పీ త్రిమూర్తులు, ఈస్ట్ డీఎ స్పీ రవిశంకర్‌రెడ్డిని ఆదేశించారు. వీరి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లు కర్ణాటక వెళ్లి కొప్పల్ జిల్లా, గంగావతి నగరంలో ఉండే మహమ్మద్ అమీరుల్ ఇస్లాం షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇబ్బంది పెట్టాలనే.. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మహమ్మద్ జరిగిన విషయం వివరంగా తెలిపాడు. కర్ణాటక రాష్ట్రంలో ఇతను సెంట్రింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అక్కడ కూలీల కొరత ఉండటంతో పశ్చిమబెంగాల్ నుంచి ఉత్తమ్‌కుమార్‌ను పిలిపించుకున్నాడు. అయితే కూలి డబ్బు చాలడం లేదని ఉత్తమ్‌కుమార్ పనిమానేసి, మహమ్మద్ వద్ద పనిచేసే మరో ఇద్దరిని వెంటబెట్టుకుని తిరుపతికి వెళ్లిపోయాడు. కూలీలు లేక పనులు నిలిచిపోయి మహమ్మద్ బాగా నష్టపోవాల్సి వచ్చింది. దీంతో ఉత్తమ్‌కుమార్‌ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని పోలీసులకు తప్పుడు సమాచారం అందించానని ఒప్పుకున్నాడు. తప్పుడు సమాచారంతో పోలీసులను తప్పుదోవ పట్టించి, అధికారులను ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అహ్మద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్టు అర్బన్ ఎస్పీ తెలిపారు. -
నేటి అర్ధరాత్రి నుంచి ఆటోల బంద్
సాక్షి, హైదరాబాద్: ఆటోడ్రైవర్లు బంద్‌కు పిలుపునిచ్చారు. తనిఖీల పేరిట ఆర్టీఏ, ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి (ఈ నెల 27) నుండి నిరవధిక ఆటోబంద్‌కు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ పిలుపునిచ్చింది. బుధవారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్, జాయింట్ కన్వీనర్లు జె.రవీందర్, లక్ష్మీనర్సయ్యలు మాట్లాడారు. ఈ నెల 28న ఉదయం 11 గం టలకు ట్రాన్స్పోర్ట్ భవ నం ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
సార్..తప్పుకున్నారు!
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. ఈ సామెత కందుకూరు పోలీస్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు, హోంగార్డులకు అతికినట్లు సరిపోతుంది. పోలీస్‌శాఖలో ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనలు కిందిస్థాయి సిబ్బందికి తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. బాస్ చెప్పింది వినకుంటే ఆయన నుంచి కక్ష సాధింపు చర్యలు.. వింటే ఆయనపై స్థాయి అధికారుల పనిష్మెంట్లు. ఫలితంగా ఉద్యోగాలు చేయలేక కిందిస్థాయి సిబ్బంది నానాతంటాలు పడుతున్నారు. కందుకూరు అర్బన్ : నాలుగు రోజుల క్రితం జరిగిన ఓ సంఘటనలో సర్కిల్ స్థాయి అధికారి చేసిన తప్పుకు ఓ కానిస్టేబుల్, హోంగార్డుపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వీరిని వీఆర్‌కు పంపి సదరు అధికారిని సేఫ్ జోన్లో ఉంచారు. వివరాలు.. స్థానిక కూరగాయల మార్కెట్ సెంటట్లో పీర్ల చావిడికి చెందిన ప్రభుత్వ భూమి ఉంది. రూ. కోట్లు విలువ చేసే ఆ భూమిని ఓ వ్యక్తి చాలా ఏళ్ల క్రితం కబ్జా చేసి కొందరితో చిన్న చిన్న బడ్డీ బంకులు పెట్టించి వారి నుంచి అద్దెలు వసూలు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నాడు. పీర్ల చావిడిలోని కొంత భాగం, మున్సిపాలిటీకి చెందిన మరికొంత భాగంలో ఎస్కే మహ్మద్ అనే వ్యక్తి చాలా కాలం నుంచి బొంకు పెట్టుకొని జీవనం సాగించాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం ఆ బొంకు దగ్ధమైంది. ఆ తర్వాత మహ్మద్ అదే ప్రాంతంలో చిన్నపాటి బొంకు పెట్టుకొని చిరు వ్యాపారం చేసుకుంటూ కొంతకాలం తర్వాత మరణించాడు. ఆయన తర్వాత పెద్ద కొడుకు హమీద్(వికలాంగుడు) వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటివల ఆ బొంకుకు హమీద్ మరమ్మతులు చేయించుకున్నాడు. దీన్ని సహించలేని సదరు ఆక్రమణదారుడు బాబు ఆ బంకు ఉన్న స్థలం తనదని, న్యాయం చేయాలని ఎస్సై వైవీ రమణయ్యను ఆశ్రయించాడు. దీంతో ఆయన స్థలానికి సంబంధించిన వివరాలు అందజేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. అది ప్రభుత్వ భూమి.. అని రెవెన్యూ అధికారులు చెప్పటంతో సివిల్ కేసులు తమకు సంబంధం లేదని ఎస్సై చెప్పారు. విషయం సర్కిల్ స్థాయి అధికారి వద్దకు చేరింది. తన్నుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లి.. ఈ సందర్భంగా సదరు అధికారి.. బాబు నుంచి ఫిర్యాదు కూడా స్వీకరించకుండా హమీద్, ఆయన తమ్ముడు అబీద్ను స్టేషన్‌కు పిలిపించి స్థలం తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇలా ఏడు సార్లకుపైగా స్టేషన్‌కు పిలిపించుకొని గంటల తరబడి ఉంచారు. నాలుగు రోజల క్రితం హమీద్‌ను తీసుకురావాలని తన సిబ్బందిని సదరు అధికారి అదేశించారు. దీంతో హోంగార్డు వినయ్‌తుల్లా, కానిస్టేబుల్ రమేష్‌లు హమీద్ వద్దకు వెళ్లారు. స్టేషన్‌కు రావాలని కోరగా తాను వికలాంగుడినని, తరచూ స్టేషన్‌కు రాలేనని చెప్పాడు. ఆయన తమ్ముడు అబీద్, రాధకృష్ణ అనే వ్యక్తి కలగజేసుకుని కాసేపటి తర్వాత పెద్దలతో కలిసి స్టేషన్‌కు వస్తామని పోలీసులకు నచ్చజెప్పారు. ఈ మేరకు విషయాన్ని సదరు అధికారికి పోలీసులు ఫోన్లో చేరవేశారు. అక్కడకు చేరుకున్న సర్కిల్ స్థాయి అధికారి అబీద్‌తో పాటు రాధాకృష్ణను కొట్టుకుంటూ తన వాహనంలో స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ కొట్టేందుకు ప్రయత్నించడంతో అబీద్ పోలీసుస్టేషన్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పలువురు నాయకులు వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం భూమిని అక్రమించిన శ్రీనుకు అండగా నిలిచి ఎలాంటి ఫిర్యాదు లేకుండా అధికారి స్వయంగా వచ్చి ఇద్దరిని కొట్టుకుంటూ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లడంపై పట్టణ ప్రజల నుంచి పలు విమర్శలు వెల్లువెత్తాయి. విషయం చినికి చినికి గాలి వానలా మారడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆ సంఘటనపై విచారణకు ఆదేశించారు. చివరకు కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డును బాధ్యులను చేస్తూ ఉన్నతాధికారులు వారిని గురువారం వీఆర్‌కు పంపారు. ఏడాది క్రితం ఇదేస్థాయి అధికారి అదేశాల మేరకు పట్టణలోని కేసరిగుంట కాలనీలో అర్ధరాత్రి ఓ ఇంటికి వెళ్లిన సంఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. అధికారుల పొరపాట్లతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కిందిస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.