కలకలం సృష్టించిన డమ్మీ గన్‌ | Mohammed Ezaz Arrest in Fake Gun Rally in Hyderabad | Sakshi
Sakshi News home page

కలకలం సృష్టించిన డమ్మీ గన్‌

Published Tue, Feb 25 2020 10:21 AM | Last Updated on Tue, Feb 25 2020 10:21 AM

Mohammed Ezaz Arrest in Fake Gun Rally in Hyderabad - Sakshi

డమ్మీ గన్‌తో (వృత్తంలో) మహ్మద్‌ ఎజాజ

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌– 10లోని సింగాడికుంట బస్తీ అధ్యక్షుడు మహ్మద్‌ ఎజాజ్‌ ఆదివారం రాత్రి డమ్మీ గన్‌తో నిర్వహించిన ర్యాలీ స్థానికంగా సంచలనం సృష్టించింది. గన్‌ను చూపిస్తూ స్థానికులను భయభ్రాతులకు గురి చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఎజాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఎజాజ్, ఆయన కుమారుడిపై స్థానికంగా కొంతమంది కత్తులతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డారు. దాడి చేసిన వారికి ఇటీవలే బెయిల్‌ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎజాజ్‌ డమ్మీ గన్‌ చేతపట్టుకొని ర్యాలీ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ర్యాలీ ఎందుకు నిర్వహించింది, డమ్మీగన్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement