నేటి అర్ధరాత్రి నుంచి ఆటోల బంద్
సాక్షి, హైదరాబాద్: ఆటోడ్రైవర్లు బంద్‌కు పిలుపునిచ్చారు. తనిఖీల పేరిట ఆర్టీఏ, ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి (ఈ నెల 27) నుండి నిరవధిక ఆటోబంద్‌కు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ పిలుపునిచ్చింది.
బుధవారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్, జాయింట్ కన్వీనర్లు జె.రవీందర్, లక్ష్మీనర్సయ్యలు మాట్లాడారు. ఈ నెల 28న ఉదయం 11 గం టలకు ట్రాన్స్‌పోర్ట్ భవ నం ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.