shutdown
-
అమెరికాకు తప్పిన షట్‌డౌన్ గండం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు షట్‌డౌన్ గండం తప్పింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుపై అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ చివరి నిమిషంలో ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి శుక్రవారం రాత్రిలోగా బిల్లు ఆమోదం పొందకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే, గడువుకు కొన్ని గంటల ముందు స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అనంతరం ఈ బిల్లును సెనేట్‌కు పంపించారు. సెనేట్ సైతం ఆమోదించింది. దీంతో షట్‌డౌట్ గండం నుంచి అమెరికా తప్పించుకుంది. ఈ బిల్లును అధ్యక్షుడు జో బైడెన్‌కు పంపించారు.ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది. జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచి్చన ద్రవ్య వినిమయ బిల్లును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా వ్యతిరేకించారు. దీంతో వచ్చే ఏడాది మార్చి 14 వరకు ప్రభుత్వ అవసరాలకు, విపత్తుల్లో సహాయక చర్యలకు నిధులు సమకూర్చేలా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. రుణాలపై సీలింగ్‌ను రెండేళ్లపాటు రద్దు చేయడం సహా ట్రంప్ లేవనెత్తిన పలు డిమాండ్లను ఇందులో చేర్చారు. గతంలో ట్రంప్ ప్రభుత్వ పాలనలో అమెరికాలో 35 రోజులపాటు షట్‌డౌన్ కొనసాగింది. అమెరికా చరిత్రలో ఇదే సుదీర్ఘమైన షట్డౌన్గా చెబుతుంటారు. షట్‌డౌన్ వల్ల లక్షల మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు. -
మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!
జర్మనీకి చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తన ప్లాంట్లను మూసివేయాలని యోచిస్తోంది. దాంతోపాటు కాస్ట్ కటింగ్ ప్రణాళికలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని తొలగించనున్నట్లు కంపెనీ వర్క్స్ కౌన్సిల్ హెడ్ డానియెలా కావల్లో తెలిపారు. అంతర్జాతీయంగా కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు.ఈ సందర్భంగా డానియెలా కావల్లో మాట్లాడుతూ..‘యూరప్‌లో వోక్స్వ్యాగన్ సంస్థ తన తయారీ యూనిట్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిపోతోంది. దాంతో యూరప్‌లో మూడు ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించాం. అయితే ఏ ప్లాంట్లను నిలిపేయాలో ఇంకా స్పష్టత రాలేదు. కంపెనీలో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని కొలువుల నుంచి తొలగించనున్నాం. జర్మనీలోని వోక్స్వ్యాగన్ గ్రూప్‌లో దాదాపు 3,00,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!వోక్స్వ్యాగన్ కంపెనీ ఉత్పత్తులకు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్న చైనా, యూరప్ నుంచి డిమాండ్ తీవ్రంగా పడిపోయింది. దానికితోడు నిర్వహణ ఖర్చులు పెరగడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ కంపెనీ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి ఆదరణ కరవైంది. దాంతో చేసేదేమిలేక చివరకు ఉద్యోగుల తగ్గింపునకు పూనుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
లఢక్‌లో రాష్ట్ర హోదా రగడ
లఢఖ్: రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ లఢఖ్‌లో నిరసనలు మిన్నంటాయి. ప్రధానంగా నాలుగు అంశాలను నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హోదా, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడం, లడఖ్, కార్గిల్‌కు ఒక్కో పార్లమెంటరీ సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లఢఖ్ అంతటా పూర్తి బంద్‌కు పిలుపునిచ్చారు. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో భారీ నిరసన ర్యాలీలు చేశారు. లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) ఈ ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హోదాను డిమాండ్ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మెమోరాండం కూడా జనవరి 23నే సమర్పించారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడానికి 2019 నాటి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే బిల్లు ముసాయిదాను కూడా ప్రతినిధులు సమర్పించారు. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ న్యాయ సలహాదారు హాజీ గులాం ముస్తఫా మాట్లాడుతూ.. " లడఖ్ యూటిగా మారినప్పటి నుండి అపెక్స్ బాడీ, కేడీఏ నాలుగు రకాల డిమాండ్లను లేవనెత్తింది. ఇక్కడ మా అధికారాలు బలహీనపడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉన్నప్పుడు మాకు అసెంబ్లీలో నలుగురు, శాసన మండలిలో ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు." అని అన్నారు. లడఖ్ - లేహ్, కార్గిల్‌లోని రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు సంస్థల ప్రతినిధులతో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నందున క్రమంలో ఈ నిరసనలు వెల్లువెత్తాయి. డిసెంబరు 4న జరిగిన చివరి భేటీలో రెండు సంస్థల నుంచి డిమాండ్ల జాబితాను మంత్రిత్వ శాఖ లిఖితపూర్వకంగా కోరింది. ఇదీ చదవండి: బలపరీక్షలో సోరెన్ పాల్గొనవచ్చు -
సంక్షోభంలో ఆకాశ ఎయిర్, మూసివేత? సీఈవో స్పందన ఇదీ
Akasa Air Crisis మరో బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సంక్షోభంలో చిక్కుకుంది. దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా ప్రధాన వాటాదారుగా గత ఏడాది సేవలను ప్రారంభించిన అకాశ ఎయిర్‌కు పైలట్ల సెగ తగిలింది. ఆకస్మాత్తుగా సంస్థకు గుడ్ బై చెప్పడంతో కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఆకాశ ఎయిర్ కూడా మూత పడనుందనే వదంతులు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. పైలట్ రాజీనామా ఆందోళనల మధ్య ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. విశ్వసనీయతను నిర్ధారించడానికే విమానాలను తాత్కాలికంగా తగ్గిస్తుంది తప్ప మరేమీ కాదంటూ మూసివేత రూమరన్లు ఖండించారు. కొద్ది మంది పైలట్లు ఉన్నట్టుండి రిజైన్ చేయడంతో కొన్ని తమ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించారు. పైలట్లు చట్టవిరుద్ధంగా తప్పనిసరి ఒప్పంద నోటీసు వ్యవధిని అందించకుండానే వెళ్లిపోయారంటూ దూబే తెలిపారు. దీనికి పైలట్లపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు ఉద్యోగులకు అందించిన ఇమెయిల్‌లో వెల్లడించారు. సంస్థ దీర్ఘకాల కార్యకలాపాలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, ఇడ్లీ బండి నడుపుకుంటున్నా!) దాదాపు 43 మంది పైలట్ల ఆకస్మిక నిష్క్రమణ కారణంగా స్వల్పకాలంలో తమ సేవలకు అంతరామమని దూబే ఉద్యోగులకు అందించిన ఇమెయిల్ సమాచారం తెలిపారు. కొంతమంది పైలట్ల నిర్ణయం కారణంగా జూలై, సెప్టెంబర్ మధ్య విమానాలకు అంతరాయం ఏర్పడిందనీ, చివరి నిమిషంలో రద్దు చేయవలసి ఇచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు కస్టమర్ల కోసం అత్యుత్తమ విమానయాన సంస్థను నిర్మించామనీ, తమ ప్లాన్ ప్రకారం ప్రతి మైలురాయిని అధిగమించాని చెప్పారు. దీర్ఘకాలం సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ దూబే వివరణ ఇచ్చారు. (మరో భారీ బ్యాంకు స్కాం: ఏకంగా రూ.3847 కోట్లకు ముంచేశారు) కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజా డేటా ప్రకారం, Akasa మార్కెట్ వాటా ఆగస్టులో 5.2 శాతం నుండి 4.2 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఆగస్టులో దేశీయంగా తొలి విమానాన్ని నడిపిన ఆకాశ ఎయిర్ ఆ తరువాత అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు అర్హత సాధించింది. ఆగస్టు 1న బోయింగ్ 20వ B737 మ్యాక్స్ విమానాన్ని అందుకుంది. (జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?) -
మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 30 ఏళ్లుగా అందిస్తున్న సేవలకు గుడ్‌బై!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లుగా యూజర్లకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. భవిష్యత్‌లో విడుదల కానున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వర్డ్ ప్యాడ్ అనే ఫీచర్ ఇక కనపించదని స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్ 1995లో విండోస్ 95 అనే ఆపరేటింగ్ సిస్టం (OS) ను విడుదల చేసింది. కొత్తగా విడుదలైన ఈ ఓఎస్‌లో వర్డ్ ప్యాడ్ అనే వర్డ్ ప్రాసెసింగ్ టూల్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. వర్డ్ ప్యాడ్‌లో రెజ్యూమ్, లెటర్స్‌ను తయారు చేయడం, టేబుల్స్ క్రియేట్ చేయడంతో పాటు ఫోటోలను సైతం జత చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్‌లో లేని ఇటాలిక్,అండర్ లైన్, బుల్లెట్ పాయింట్స్, నెంబరింగ్, టెక్ట్స్ ఎలైన్‌మెంట్స్ వంటి అడ్వాన్స్ ఫీచర్లను సైతం ఉపయోగించుకునేలా వెసలు బాటు కల్పించింది. వర్డ్ ప్యాడ్ కనుమరుగు అయితే, ఈ తరుణంలో 30 ఏళ్లుగా వినియోగదారులకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వర్డ్ ప్యాడ్‌కు ప్రత్యామ్నాయంగా ఆఫీస్ 365 పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ వర్డ్‌ను ఉపయోగించుకోవాలని కోరింది. రిచ్ టెక్స్ డాక్యుమెంట్స్ కోసం మైక్రోసాఫ్ట్ వర్డ్, డీవోసీ అండ్. ఆర్టీఎఫ్,ప్లెయిన్ టెక్ట్స్ డాక్యుమెంట్ కోసం విండోస్ నోట్‌ప్యాడ్‌లను వినియోగించుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ నోట్‌ప్యాడ్‌లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆటోసేవ్, ఆటో రీస్టోర్ ట్యాబ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్‌లో ఎవరికైనా అవసరం అనిపిస్తే వర్డ్ ప్యాడ్ బదులు మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో పనికొస్తుందని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. చాట్‌జీపీటీకి అనువుగా కోర్టానా మైక్రోసాఫ్ట్ చివరిగా విండోస్7 విడుదల సందర్భంగా కొన్ని మేజర్ అప్డేట్ చేసింది. 1990లలో మైక్రోసాఫ్డ్ వర్డ్, వర్డ్ స్టార్లలో యూజర్లు సులభంగా సెర్చ్ చేసేలా బటన్స్, డ్రాప్ డౌన్ లిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాటిని గుర్తించేలా రిబ్బోన్ యూఐని విడుదల చేసింది. తాజాగా, ఆ యూఐ రిబ్బోన్ (Ribbon UI) స్థానంలో యూఐని తెచ్చింది. మైక్రోసాఫ్ట్ ఇటీవలే వర్చువల్ అసిస్టెంట్ కోర్టానా ( Cortana ) యాప్‌ను మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్‌కు అనుకూలంగా చాట్‌జీపీటీని అందిచంనుంది. నివేదికల ప్రకారం మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం విండోస్ 11కు లేటెస్ట్ వెర్షన్ విండోస్12 ఓఎస్‌పై పనిచేస్తుంది. దీనిని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు హైలెట్ చేశాయి. చదవండి👉 నోరు పారేసుకున్న యాంకర్..కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా -
మీకు తెలుసా! ఆ చారిత్రాత్మక రెస్టారెంట్ హఠాత్తుగా మూతపడుతోంది!
యూకే రాజధాని లండన్‌లో భారత్‌కి చెందిన ఓ ఐకానిక్ రెస్టారెంట్ మూతపడుతోంది. దీన్ని "ఇండియా క్లబ్" అని కూడా పిలుస్తారు. ఇది సెంట్రల్ లండన్‌లో రద్దీగా ఉండే రహదారిలో హోటల్ స్ట్రాండ్ కాంటినెంటల్ లోపల ఉంది. ఇది దశాబ్దాలుగా నగరంలోని దక్షిణాసియా ప్రజలకు బాగా సుపరిచితమైనది. ఎన్నో రకాల దక్షిణ భారతదేశ వంటకాలను సుపరిచితం చేసిన ఈ రెస్టారెంట్ అనూహ్యంగా మూతపడుతోంది. స్వాతంత్య్రం కోసం పోరాడిని ఎందరో త్యాగధనులకు ఆతిధ్యం ఇచ్చింది. భారతదేశ స్వాతంత్య్రానికి సంబంధించిన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం అయిన ఈ రెస్టారెంట్ ఎందుకు మూతపడనుందంటే.. నిజానికి 1950 దశకంలో భారతీయ వలసదారులను కలుసుకునేందుకు ఓ ప్రదేశం ఏర్పాటయ్యింది. ఇది సెంట్రల్ లండన్‌లో రద్దీగ ఉండే రహదారిలో హోటల్ స్ట్రాండ్ కాంటినెంటల్ లోపల ఉంది. దీన్ని ఇండియా లీగ్ సభ్యులు ప్రారంభించారు. బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ 1900లలో ఈ క్లబ్లో భారతదేశానికి స్వాతంత్య్రం కోసం ప్రచారం చేసింది. అలాగే భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు ఈ క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 1990లలో పరిపాలనాధికారులు దీన్ని లీజుకు కొనుగోలు చేశారు. స్వాతంత్య్ర కార్యకర్తలు దీన్ని సమావేశ స్థలంగా ఉపయోగించుకున్నారు. 1950, 60లలో భారతీయులు తమ భాష మాట్లాడే వారు, తమ దేశ ఆహారం తినడం కోసం ఇక్కడకు వచ్చేవారని క్రమం తప్పకుండా సందర్శించే చరిత్రకారురాలు కసూమ్ వడ్గామ చెప్పారు. ప్రజలు పుట్టిన రోజులు, వివాహాలు, దీపావళి వంటి పండుగలను జరుపుకోవడానికి తరుచుగా ఇక్కడకు వచ్చేవారు. వడ్గామా తూర్పు ఆఫ్రికా వలస పాలనలో పెరిగారు. చదువుకోవడానికి యూకే వెళ్లారు. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత సంవత్సరాలలో చాలామంది ప్రజలు యూకేకి వలస వచ్చారు. అయితే లండన్‌లో భారతీయ ప్రవాసుల కోసం సాంస్కృతిక సంస్థలు ఏవీ లేవు. ఆ లోటును ఈ ఇండియన్ క్లబ్ పూరించింది. ఈ రెస్టారెంట్లో దోశలు, పప్పులతో చేసే మసాల కర్రీలు, బట్టర్ చికెన్, కూరగాయాల వడలు, కాఫీ, మసాలా చాయ్ తదితర భారతీయ వంటకాలను అందించేది. ఈ క్లబ్ ఇంటీరియర్ కూడా భారతదేశంలోని కాఫీ షాపులను అనుకరించేలా రూపొందించారు. 70 ఏళ్ల క్రిత ఏర్పాటు చేసిన స్ట్రెయిట్ బ్యాక్డ్ కుర్చీలనే వాడుతున్నారు. ఇంకా మారలేదు. అంతేగాదు నాటి సామాజికి రాజకీయ చరిత్రకు గుర్తుగా గోడలపై భారతీయ బ్రిటీష్ వ్యక్తుల చిత్రాలు ఉన్నాయి. దాదాభాయ్ నౌరోజీ నుంచి తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ వరకు, జర్నలిస్ట్‌లు, వలసదారులకు ప్రసిద్ధమైన ప్రాంతంగా ఉంది. ఎందుకు మూతపడుతోందంటే.. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న అలాంటి క్లబ్ మూతపడుతోంది. ఆ భవనం ఉన్న ప్రదేశంలోని యజమానులు నిర్మాణంలో కొంత భాగాన్ని కూల్చివేయాలని కోరుతున్నారు. మరింత ఆధునికరించిన హోటల్‌గా మార్చాలని డిసైడ్ అయ్యారు. క్లబ్‌ని మూసివేయడం వల్ల నగర చరిత్రలో కొంత భాగాన్ని కోల్పోతుందని చాలామంది ఆవేదనగా చెబుతున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కూడా. ఆ క్లబ్ యజానులు యాద్గార్ మార్కర్, అతని కుమార్తె ఫిరోజా ఈ స్థలాన్ని కాపాడేందుకు మద్దతు కోసం వేలాది మంది నుంచి సంతకాలను తీసుకుని కూల్చివేత పోరాటంలో విజయం సాధించారు కూడా. అయితే గతవారమే వారు క్లబ్ తెరిచి ఉండటానికి సెప్టెంబర్ 17 చివరి రోజు అని ఆవేదనగా ప్రెస్‌తో చెప్పడం గమనార్హం. (చదవండి: మహిళ మెదడులో.. కొండచిలువలో ఉండే..) -
ఫేస్బుక్ మూత పడనుందా? కోర్టు సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర పోలీసులతో ఫేస్బుక్ సహకరించకపోతే, ఇండియా అంతటా తన సేవలను మూసివేసే అంశాన్ని పరిశీలిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. (సూపర్ ఆఫర్: రూ. 2749 కే యాపిల్ ఐఫోన్ 11!) సౌదీ జైలులో ఉన్న భారతీయుడి కేసు దర్యాప్తుపై రాష్ట్ర పోలీసులకు సహకరించడం లేదని ఆరోపించిన నేపథ్యంలో ఫేస్బుక్ కార్యకలాపాలను మూసివేసేలా ఆర్డర్ జారీ చేయడాన్ని పరిశీలిస్తామని కర్ణాటక హైకోర్టు బుధవారం ఫేస్‌బుక్‌ను హెచ్చరించింది. దక్షిణ కన్నడ జిల్లా నివాసి కవిత పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వారంలోగా అవసరమైన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను కోర్టు ముందుంచాలని ధర్మాసనం ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. తప్పుడు కేసులో అరెస్టు చేసిన కేసులో ఏ చర్య తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం బాధాకరం. మంగళూరు పోలీసులు కూడా తగు విచారణ చేపట్టి నివేదిక సమర్పించాల్సి ఉంటుందన్న కోర్టు, విచారణను జూన్ 22కి వాయిదా వేస్తూ కోర్టు పేర్కొంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) తన భర్త శైలేష్ కుమార్ (52) సౌదీ అరేబియాలోని ఒక కంపెనీలో 25 సంవత్సరాలు పనిచేశారని, తాను పిల్లలతో తన స్వగ్రామంలో నివసిస్తున్నారని కవిత తన పిటిషన్లో తెలిపారు.2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)కి మద్దతుగా ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడనే అభియోగంతో సౌదీ పోలీసులు శైలేష్ కుమార్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. (చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్‌కి ఎదురుదెబ్బ: సీఈవో గుడ్‌బై, ప్రత్యర్థికి సై!?) అయితే గుర్తు తెలియని వ్యక్తులు తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి రాజుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ కవిత మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫేస్‌బుక్‌కు లేఖ రాసి, నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచినట్లు సమాచారం అందించారు. అయితే ఫేస్బుక్ దీనిపై స్పందించలేదు. విచారణలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ పిటిషనర్ 2021లో హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను విడుదలకు సాయం చేయాలని కవిత కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. మరిన్ని బిజినెస్వార్తలు, ఇంట్రస్టింగ్అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
‘సింహాద్రి’లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత
పరవాడ(అనకాపల్లి జిల్లా): సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంట్‌లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. విద్యుత్ సరఫరాకు తగినంత డిమాండ్ లేని కారణంగా (రిజర్వు షట్‌డౌన్) రెండో యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యుత్‌కు తగినంత డిమాండ్ లేకపోవడం వల్ల శుక్రవారం ఉదయం సంస్థలో 3, 4 యూనిట్లలో ఉత్పత్తిని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి యూనిట్ నుంచి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. అవసరాలను బట్టి 2, 3, 4 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. అయితే, విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ లేని కారణంగా మొదటి యూనిట్‌ను కూడా త్వరలో తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
సిలికాన్ వ్యాలీ బ్యాంకు సెగ: లక్ష ఉద్యోగాలు, 10వేల స్టార్టప్‌లకు గండం
న్యూఢిల్లీ: సిలికాన్ వేలీ బ్యాంక్ (ఎస్వీబీ) మూసివేత వల్ల దానితో ముడిపడి ఉన్న అంకుర సంస్థల్లో ఆందోళన నెలకొంది. తక్షణ ఆర్థిక అవసరాలకు కావాల్సిన నిధుల కోసం అవి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్వీబీలో డిపాజిట్లు ఉన్న దాదాపు 10,000 చిన్న సంస్థలు .. వచ్చే 30 రోజుల్లో తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన పిటీషన్లో వై కాంబినేటర్ (వైసీ) తెలిపింది. దీని వల్ల 1 లక్ష పైగా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు పేర్కొంది. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ) ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా కట్టడి చేయకపోతే .. యావత్ అమెరికా టెక్నాలజీ పరిశ్రమపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 3,500 మంది పైచిలుకు సహ వ్యవస్థాపకులు, సీఈవోలు, రెండు లక్షల మంది పైగా స్టార్టప్ సంస్థల ఉద్యోగులు ఈ పిటీషన్‌పై సంతకం చేశాయి. వీటిలో పేవో, సేవ్ఇన్, శాలరీబుక్ వంటి భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఇన్క్యుబేటర్ సంస్థ అయిన వై కాంబినేటర్ కమ్యూనిటీలోని మూడో వంతు స్టార్టప్‌లకు ఎస్వీబీలో మాత్రమే ఖాతాలు ఉన్నాయి. (ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా) ఎస్వీబీలో భారీగా డిపాజిట్లు ఉన్న కొన్ని బడా టెక్ సంస్థలకు (వై కాంబినేటర్తో సంబంధమున్నవి) అమెరికాతో పాటు భారత్‌లోనూ కార్యకలాపాలు ఉన్నాయని ఫిన్‌టెక్ కంపెనీ రికర్ క్లబ్ సీఈవో ఏకలవ్య గుప్తా తెలిపారు. దేశీయంగా గిఫ్ట్ సిటీలో అకౌంట్లు తెరిచేందుకు ఆయా స్టార్టప్‌లకు తాము సహాయం అందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, గతంలోలాగా ఎస్వీబీని ప్రభుత్వం బెయిలవుట్ చేయబోదని అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ యెలెన్ స్పష్టం చేశారు. అయితే, డిపాజిటర్లందరికీ వారి సొమ్ము తిరిగి అందేలా చూసేందుకు చర్యలపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. 15 ఏళ్ల క్రితం నాటి ఆర్థిక సంక్షోభానికి నేటి పరిస్థితులకు వ్యత్యాసం ఉందని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉందని చెప్పారు. సత్వర టేకోవర్‌కు ఆస్కారం.. ఈ సమస్య స్వల్పకాలికమైనదే కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. క్లయింట్ల సొమ్మును తిరిగిచ్చేందుకు సరిపడేంత అసెట్లు ఎస్వీబీ దగ్గర ఉండటంతో పాటు, పలు ప్రముఖ సంస్థల ఖాతాలూ ఉన్న నేపథ్యంలో బ్యాంకును సత్వరమే ఏదో ఒక సంస్థ టేకోవర్ చేయొచ్చని తెలిపాయి. రాబోయే వారం రోజుల్లోనే ఇది జరగవచ్చని ఇన్‌మొబి గ్రూప్ సహ వ్యవస్థాపకుడు అభయ్ సింఘాల్ చెప్పారు. స్వల్పకాలికంగా ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కోసం 7-8 బిలియన్ డాలర్ల నిధులు అవసరం కావచ్చని, అవి అందితే ప్రస్తుతానికి సమస్య పరిష్కారం కావచ్చని పేర్కొన్నారు. ఏవో కొన్నింటిపై మినహా మిగతా స్టార్టప్‌లపై ఎస్వీబీ సంక్షోభ ప్రభావం ఉండకపోవచ్చని జెన్‌ప్యాక్ట్ వ్యవస్థాపకుడు ప్రమోద్ భాసిన్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్య స్థానికమైందే తప్ప అంతర్జాతీయ మైంది కాదన్నారు. భారతీయ స్టార్టప్‌లకు ఎస్వీబీతో చెప్పుకోతగ్గ స్థాయిలో లావాదేవీలేమీ లేవు కాబట్టి అవి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పరిశ్రమ నిపుణుడు, 5ఎఫ్ వరల్డ్ చైర్మన్ గణేష్ నటరాజన్ చెప్పారు. ఎస్వీబీతో లావాదేవీలు జరిపే సంస్థలు కూడా కాస్త ఓపిక పడితే తమ సొమ్మును తిరిగి పొందడానికి వీలుంటుందన్నారు. మరోవైపు, తమ రెండు అనుబంధ సంస్థలకు (కిడోపియా, మీడియా వర్కజ్క్) ఎస్వీబీలో సుమారు రూ. 64 కోట్లు ఉన్నాయని గేమింగ్, స్పోర్ట్స్ మీడియా ప్లాట్‌ఫామ్ సంస్థ నజారా టెక్నాలజీస్ వెల్లడించింది. అయితే, వాటి చేతిలో తగినన్ని నిధులు ఉన్నాయని, ఎస్వీబీ పరిణామం వల్ల వాటి వ్యాపారంపై ప్రభావమేమీ పడబోదని పేర్కొంది. అంకురాలతో భేటీ కానున్న కేంద్ర మంత్రి.. దేశీ సంస్థలపై ఎస్వీబీ పరిణామాల ప్రభావాన్ని అంచనా వేయడంపై కేంద్రం దృష్టి సారించింది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వారంలో దేశీ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కానున్నారు. దేశ నిర్మాణంలో కీలకంగా ఎదుగుతున్న అంకుర సంస్థలకు ప్రభుత్వం ఏ విధంగా తోడ్పాటు అందించగలదన్నది తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. -
సంక్షోభంతో అల్లాడుతున్న పాక్‌కు షాక్: మరో ప్లాంట్ షట్‌డౌన్
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడిందని పేర్కొంటూ మరో కార్ల తయారీ సంస్థ హోండా తన ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు పాక్‌కు గుడ్‌బై చెబుతుండగా, ఈ జాబితాలో తాజాగా ఆటోమొబైల్ దిగ్గజం హోండా కూడా చేరింది. ప్రస్తుతం పాక్‌లోని హోండా అట్లాస్ కార్స్ పేరుతో కార్లను అసెంబుల్ చేస్తోంది. దేశంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే మూసివేతకు కారణమని ప్రకటించింది. జియో న్యూస్ ప్రకారం మార్చి 9 నుంచి 31 వరకు హోండా తన ఫ్లాంట్‌ను మూసివేయనుంది. పాక్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉత్పత్తిని కొనసాగించలేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి స్టాక్ఎక్స్ఛేంజ్‌కు అందించిన సమాచారంలో కంపెనీ తెలిపింది. ప్రభుత్వం పూర్తి నాక్-డౌన్ కిట్ల దిగుమతి కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ నిషేధం, ముడిసరుకు, విదేశీ చెల్లింపుల స్తంభన లాంటి చర్యలతో సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతిందని కంపెనీ తెలిపింది. కాగా అధిక ద్రవ్యోల్బణం, పాక్ కరెన్సీ క్షీణత, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన పాకిస్తాన్ ఆటో పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని జియో న్యూస్ నివేదించింది. వాణిజ్య లోటును నియంత్రించేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిగుమతుల ఆంక్షలతో ఆటో పరిశ్రమ కూడా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించింది. ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతినడమే కాకుండా కంపెనీలు తమ సీకేడీ మోడళ్ల ధరలను కూడా పెంచాయి, ఇది ఇప్పటికే ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాక్‌లోని టయోటా-బ్రాండ్ ఆటోమొబైల్స్‌కు చెందిన సుకుజీ మోటార్ కంపెనీ (PSMC) ఇండస్ మోటార్ కంపెనీ (IMC) అసెంబ్లర్లు కూడా తమ ఉత్పత్తి ప్లాంట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. -
అమెజాన్‌లో ఏం జరుగుతోంది? భారత్‌లో మరో బిజినెస్ మూసివేత!
దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల్లో రెసిషన్ భయాలు వెంటాడుతున్న తరుణంలో భారత్‌లో ఏ మాత్రం లాభసాటి లేని బిజినెస్‌లను షట్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలోనే అమెజాన్ తన ఫుడ్ డెలివరీ,ఎడ్యుకేషన్ సర్వీస్‌ను మూసిసేంది. తాజాగా మరో బిజినెస్‌కు స్వస్తి పలికినట్లు సమాచారం. అమెజాన్ దేశీయంగా డిస్ట్రిబ్యూషన్ సేవల్ని అందిస్తుంది. డిస్ట్రిబ్యూషన్ యూనిట్ కంపెనీల నుండి వినియోగదారులకు, రీటైలర్లకు సంబంధిత ప్రొడక్ట్‌లను డెలివరీ చేస్తుంది. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో డిస్టిబ్యూషన్ సర్వీస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. కంపెనీ ఇప్పుడు ప్రధాన వ్యాపారాలపై మరింత దృష్టి పెడుతుందని పేర్కొంది. అమెజాన్ అకాడమీ టూ అమెజాన్ ఫుడ్ అమెజాన్ ఇండియా తన వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్ష ప్రక్రియలో భాగంగా ఫుడ్ డెలివరీ సర్వీసుల్ని నిలిపివేసింది. వారం రోజుల ముందు ఎడ్ టెక్ సర్వీస్, అమెజాన్ అకాడమీని సైతం షట్ డౌన్ చేసింది. ముఖ్యంగా కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో బైజూస్, అన్ అకాడమీ, వేదాంతు’లు భారీ లాభాల్లో గడిస్తున్న సమయంలో అమెజాన్ అకాడమీని ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్ -
పేటీఎం సేవల్లో అంతరాయం, యాప్‌లో మీ డబ్బులు ఆగిపోయాయా?
దేశ వ్యాప్తంగా ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం సేవలు స్తంభించిపోయాయి. యాప్‌లో లాగిన్ సమస్యలు ఉత్పన్నం కావడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ యాప్‌లో,వెబ్సైట్లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆటోమెటిక్‌గ్గా లాగవుట్ అవుతుందని ట్విట్టర్లో పేటీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో పేటీఎం యూజర్లు మనీ ట్రాన్స్ఫర్ విషయంలో జాగ్రత్తలు వహించాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సంస్థకు సంబంధించిన సేవల అంతరాయాల్ని గుర్తించే డౌన్ డిక్టేటర్ సైతం దేశ వ్యాప్తంగా యూజర్లు పేటీఎం యాప్ నుంచి సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. దేశంలో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో పేటీఎం యాప్ పని తీరు మందగించినట్లు తన నివేదికలో పేర్కొంది. Due to a network error across Paytm, a few of you might be facing an issue in logging into the Paytm Money App/website. We are already working on fixing the issue at the earliest. We will update you as soon as it is resolved — Paytm Money (@PaytmMoney) August 5, 2022 నెట్వర్క్ ఎర్రర్ పేటీఎం సేవల్లో అంతరాయం కలగడంపై ఆ సంస్థ యాజమాన్యం స్పందించింది. నెట్ వర్క్ ఎర్రర్ వల్లే ఈ సమస్య ఏర్పడిందని తెలిపింది. అయితే ఇప్పుడా నెట్ వర్క్ ఇష్యూని పరిష్కరించామని పేటీఎం ట్వీట్ చేసింది. ఐటీ సిబ్బంది ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ట్వీట్ చేసింది. We understand that few of our Trading & F&O users would have faced real issues with their trades & positions. In our continued efforts to always have your back & to be fair & transparent, we request you write to us over email at exg.support@paytmmoney.com with your concerns (2/5) — Paytm Money (@PaytmMoney) August 5, 2022 ఆ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోలేం యూజర్ల అంతరాయానికి చింతిస్తున్నాం. యాప్, వెబ్ సైట్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాం. యాప్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే సమయంలో నెట్ వర్క్ సమస్య, మనీ స్ట్రక్ అవ్వడంతో పాటు ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు ట్వీట్లు చేస్తున్నారు.ఈ క్లిష్ట సమయాల్లో ఆ ట్వీట్లను పరిగణలోకి తీసులేం. తమకు ఫిర్యాదు చేయాలనుకుంటే 'సపోర్ట్@పేటీఎంమనీ.కాం.' కు మెయిల్ చేయాలని కోరింది. -
Digital Emergency: కనెక్షన్ కట్.. 2012 నుంచి 665 సార్లు.. టాప్ ప్లేస్‌లో భారత్!
డిజిటల్ ఎమర్జెన్సీ. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం. ఈ ధోరణి భారత్‌లో రానురాను బాగాపెరిగిపోతోంది. ఎక్కడ ఏ చిన్న ఆందోళన జరిగినా, ఉద్రిక్తత తలెత్తినా ప్రభుత్వాలు తీసుకునే తొలి చర్య నెట్ కనెక్షన్ కట్ చేయడమే. ఇది వివాదానికి కూడా దారి తీస్తోంది. ఇంటర్నెట్ షట్డౌన్లలో నాలుగేళ్లుగా ప్రపంచంలో భారతే టాప్ ప్లేస్‌లో ఉంది! అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అగ్గి రాజుకున్నా, ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా రాజస్థాన్‌లో జరిగిన హత్యపై ఉద్రిక్తతలు తలెత్తినా, సాగు, పౌరసత్వ సవరణ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటినా... ప్రభుత్వం విధిగా తీసుకున్న తొలి చర్య ఇంటర్నెట్ షట్‌డౌనే. ఇంటర్నెట్ లేకుండా అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యలేని కాలమిది. ఏ ఉద్యమమైనా సోషల్ మీడియా వేదికలను వినియోగించుకునే వ్యూహాలు పన్నుతున్నారు. ఆ సాంకేతిక బాసట లేకుండా చేసేందుకు ప్రభుత్వాలు వెంటనే ఇంటర్నెట్ సర్వీసుల్ని నిలిపేస్తున్నాయి. శాంతిభద్రతల కారణంతో ఒకప్పుడు కశ్మీర్‌కే పరిమితమైన ఈ ధోరణి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నిచోట్లకూ విస్తరించడం వివాదాస్పదమవుతోంది. కరోనా అనంతరం వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయిన నేపథ్యంలో ఇంటర్నెట్ లేకుండా పూట గడవని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి హెచ్చరికలూ లేకుండా ఉన్నట్టుండి నెట్ సర్వీసులు నిలిపివేస్తుండటంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంతోమంది జీవనోపాధిపైనా దెబ్బ పడుతోంది. 6 నెలల్లో 59 సార్లు... భారత్‌లో ఇంటర్నెట్ షట్‌డౌన్స్‌పై అధ్యయనం చేస్తున్న సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ (ఎస్ఎఫ్ఎల్సీ) ప్రకారం 2012 నుంచి ఇప్పటివరకు ఏకంగా 665సార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గళమెత్తే గొంతుకల్ని అణిచివేయడానికి నెట్ నిలిపివేతను ఆయుధంగా వాడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని సంస్థ చెబుతోంది. ఈ ఏడాదిలోనే జూన్ నాటికి దేశంలో ఏకంగా 59 సార్లు నెట్ కనెక్షన్ కట్ అయింది! జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో విధించిన ఇంటర్నెట్ షట్‌డౌన్ దేశంలోనే అత్యంత సుదీర్ఘమైనది. కశ్మీర్ ప్రజలు ఏకంగా 552 రోజుల పాటు నెట్ సౌకర్యానికి దూరమయ్యారు. తరచూ నెట్‌ను నిలిపేస్తున్న రాష్ట్రాల జాబితాలో కశ్మీర్ తర్వాత రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. పౌర హక్కులకు భంగమేనా? ఇలా చీటికీమాటికీ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం పౌరులకు రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులకు భంగకరమేనని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) అనే న్యాయవాదుల గ్రూపు వాదిస్తోంది. దీనిపై ఈ సంస్థ పలుమార్లు కోర్టుకెక్కింది కూడా. ఇంటర్నెట్ సదుపాయముంటే విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయే తప్ప, అది ఉంటే వారు వాస్తవాలు తెలుసుకునే అవకాశమూ ఉంటుందని ఆలోచించలేకపోతోందన్నది దాని వాదన. ప్రభుత్వాలేమంటున్నాయి... సామాజిక మాధ్యమాల వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో తప్పుడు సమాచారం, వదంతులు వాటి ద్వారా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయన్నది ప్రభుత్వాల వాదన. ఉద్రిక్త పరిస్థితులకు ఇవి ఆజ్యం పోస్తాయి కాబట్టే నెట్ కట్ చేస్తున్నట్టు అవి చెబుతున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా టెలికాం నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు నెట్ సేవలను నిలిపేసే అధికారం 2017 దాకా సీఆర్పీసీ సెక్షన్ 144 ప్రకారం జిల్లా జడ్జిలకు ఉండేది. ఇంటర్నెట్ సేవలు ఆపేయడం తప్పనిసరైతే మధ్యేమార్గంగా వదంతులను వ్యాప్తి చేసే ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్ వంటి సోషల్ ప్లాట్ఫారంలను ఆపేసి మిగతావి కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థికంగానూ ప్రభావమే... ఇంటర్నెట్ షట్డౌన్లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. 2019లో 4 వేల గంటల పాటు దేశంలో నెట్ సేవలు ఆగిపోవడంతో 130 కోట్ల డాలర్లకు పైగా నష్టం కలిగిందన్నది ప్రపంచ బ్యాంకు అంచనా. ఇంటర్నెట్ లేక తాను పత్రికను ప్రింట్ చేసుకోలేకపోతున్నానని, మరెందరో జీవనోపాధి కోల్పోతున్నారని కశ్మీర్‌కు చెందిన అనూరాధా భాసిన్ అనే జర్నలిస్టు సుప్రీంకోర్టుకెక్కారు. నిరవధికంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేయడం ఆమోదయోగ్యం కాదని ఆమె పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది కూడా. అంతేకాదు, ‘వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, వృత్తి, వ్యాపారాలను నిర్వహించుకునే హక్కులను రాజ్యాంగంలోని 19(1)(ఎ), ఆర్టికల్ 19(1)(జి) ఆర్టికళ్లలో పేర్కొన్న మేరకు పరిరక్షించాల్సిందే’ అని ఆదేశించింది. అయినప్పటికీ తాత్కాలికం అన్న పేరు చెబుతూ ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నాయి. అలా పొడిగించుకుంటూ వెళుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అనూహ్య నిర్ణయం! ఏటీఎంలు అన్నీ బంద్..!
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్రిప్టోకరెన్సీలు బిట్‌కాయిన్, ఈథిరియం, డోజీకాయిన్ విలువ గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయా క్రిప్టోకరెన్సీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కూడా అమాంతం పెరిగాయి. ఇదిలా ఉండగా బిట్‌కాయిన్ క్రిప్టో కరెన్సీ ఏటీఎంలపై యుకే ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద్దమైనవే..! యూకేలోని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు ఆ దేశ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ) గట్టి షాక్‌ను ఇచ్చింది. క్రిప్టో ఎక్సేఛేంజ్స్పై కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. క్రిప్టో ఏటీఎం ఆపరేటర్లు వారి మెషీన్లు క్లోజ్ చేయాలని ఆదేశించింది. లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కొత్త రూల్స్ ప్రకారం క్రిప్టో ఎక్స్చేంజ్ సర్వీసులు అందించే క్రిప్టో కరెన్సీ ఏటీఎంలు అన్నీ ఎఫ్సీఏ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రిప్టో ఏటీఎంలు అన్నీ యూకే మనీ ల్యాండరింగ్ నిబంధనలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుంది. చట్టవిరుద్దంగా క్రిప్టో కరెన్సీ ఏటీఎం సర్వీసులు అందిస్తే మాత్రం కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలను జారీ చేసింది. క్రిప్టో లావాదేవీలు సులువు..! యుకేతో పాటుగా పలు దేశాల్లో ఇన్వెస్టర్లకు సులవుగా క్రిప్టోలను కొనుగోలు లేదా సేల్ చేసేందుకుగాను క్రిప్టో ఎటీఎంలను ఎక్సేఛేంజ్స్ ఏర్పాటుచేశాయి. ఇవి సాధారణ ఎటీఎం వలె కన్పిస్తాయి. ప్రజలు తమ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి బిట్‌కాయిన్ వంటి క్రిప్టో-కరెన్సీ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.కాగా యుకేలోని క్రిప్టో-కరెన్సీ సేవలను అందించే ఏ కంపెనీకి క్రిప్టో-ATMని ఆపరేట్ చేయడానికి లైసెన్స్ లేదు. క్రిప్టో ఏటీఎం డైరెక్టరీ కాయిన్ ఎటీఎం రాడార్ ప్రకారం..యుకేలో సుమారుగా 81 ఫంక్షనల్ క్రిప్టో ఎటీఎంలు ఉన్నాయి.ఎఫ్సీఏ నిర్ణయంతో ఆ దేశ క్రిప్టో ఇన్వెస్టర్లకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టనుంది. చదవండి: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..? -
China Power Crisis: చైనాలో చీకట్లు !
షెన్యాంగ్: చైనాలో స్మార్ట్ ఫోన్ వెలుగులో ప్రజలు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. చాలా నగరాల్లో విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యాలను చేరుకోవడానికి విద్యుత్ కోతలు అమలు చేశారని కొందరు ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తూ ఉంటే , ఇటీవల కాలంలో బొగ్గు ధరలు ఆకాశాన్నంటడంతో డిమాండ్‌కి తగ్గ సప్లయ్ చేయలేమని విద్యుత్ కంపెనీలు చేతులెత్తేసినట్టు వార్తలు వస్తున్నాయి. చైనాలో కొన్ని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఫలితంగా స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి. ఇటీవల చైనా విద్యుత్ వినియోగం రెట్టింపు అయింది. దీంతో కర్బన ఉద్గారాలు అధిక స్థాయిలో వెలువడి వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు అక్టోబర్ 12–13 తేదీల్లో చైనాలోని కన్మింగ్‌లో జరగనుంది. ఆతిథ్య దేశంగా ఉంటూ ఈ స్థాయిలో ఇంధనాన్ని వినియోగిస్తే అంతర్జాతీయంగా విమర్శలు వస్తాయి. దీంతో అధ్యక్షుడు జిన్ పింగ్‌పై సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఆ లక్ష్యాలను చేరుకోవడానికే భారీగా విద్యుత్ కోతలు విధించారని తెలుస్తోంది. చైనాలో దాదాపుగా 20 ప్రాంతాల్లో అత్యధికంగా ఇంధనాన్ని వినియోగిస్తూ, ఉత్పత్తులు భారీగా చేపట్టడంతో కాలుష్యం పెరిగిపోయింది. చైనాలోని ఓ ఇంట్లో సెల్‌ఫోన్ వెలుగులో భోజనం చేస్తున్న కుటుంబ సభ్యులు -
వీటిలో ఇంటర్నెట్ సేవలు బంద్..!
రేపటి నుంచి అనగా సెప్టెంబర్ 30 నుంచి పలు డివైజ్‌ల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. Let’s Encrypt’sకు చెందిన IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ గడువు రేపటితో ముగియనుంది. దీంతో పలువురు ఈ సర్టిఫికేట్లను కల్గిన డివైజ్‌లో వరల్డ్ వైడ్ వెబ్సేవలను పొందలేరని టెక్నికల్ నిపుణులు పేర్కొన్నారు. లెట్స్ ఎన్‌క్రిప్ట్ (Let's Encrypt) అనేది నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మొబైల్, ల్యాప్‌టాప్, పర్సనల్కంప్యూటర్స్ వంటి పరికరాల మధ్య ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఈ ఆర్గనైజేషన్ ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఈ సర్టిఫికేషన్ సహాయంతో మనం వాడే డివైజ్‌లకు ఏలాంటి హాని లేకుండా, సురక్షితమైన ఇంటర్నెట్ సేవలు అందుతాయి. అంతేకాకుండా మీ పర్సనల్ డేటాను హ్యక్ కాకుండా చూస్తోంది. మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు యూఆర్ఎల్ అడ్రస్‌లో మొదట హెఛ్టీటీపీఎస్తో ఆయా వెబ్సైట్ వస్తోంది. ఈ విషయాన్ని మనలో కొంత మంది గమనించే ఉంటాం. హెఛ్టీటీపీఎస్ ప్రారంభమయ్యే వెబ్సైట్ అత్యంత సురక్షితమని అర్థం. ఈ ప్రాసెస్ పూర్తిగా IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ సహాయంతోనే జరుగుతుంది. చదవండి: Jeans Could Get Pricey: జీన్స్, టీషర్ట్స్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్...! ప్రభావం ఎక్కువగా వీటిపైనే..! IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ ఆప్డేట్ అయిన డివైజ్‌లకు ఏలాంటి ప్రాబ్లమ్ లేదు. ఏళ్ల తరబడి ఎలాంటి ఆప్డేట్కు నోచుకొని డివైజ్‌ల్లో ఇంటర్నెట్ సేవలు ముగియనున్నాయి. టెక్ క్రచ్ నివేదిక ప్రకారం...మాక్ఓఎస్ 2016 వర్షన్, పలు ఓల్డ్ ఐఫోన్స్, విండోస్ ఎక్స్పీ(విత్ సర్వీస్ పాక్ 3), ప్లే స్టేషన్ కన్సోల్ 3. ప్లేస్టేషన్ 4 వంటి అప్‌గ్రేడ్ కాని వాటిలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయి. ఇలా చేస్తే బెటర్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత 7.1.1 కంటే పాత వెర్షన్లను కలిగి ఉన్న అన్ని ఆండ్రాయిడ్ డివైజ్ లలో ఇంటర్నెట్ పని చేయదు. ఐవోఎస్ 10 కంటే పాత వెర్షన్లను కలిగి ఉన్న ఐఫోన్లలో కూడా ఇంటర్నెట్ సేవలు పని చేయవు. మీ డివైజ్ లలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, వెంటనే మీ ఫోన్ లో చెక్ చేసి, పాత వర్షన్ ఉంటే వెంటనే అప్డేట్ చేయండి. ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ వర్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు మోజిలా ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చునని తెలుస్తోంది. చదవండి: భారీ డిస్కౌంట్లతో ముందుకువస్తోన్న షావోమీ..! సుమారు రూ. 75 వేల వరకు తగ్గింపు..! -
టీవీ సీరియల్స్‌కు బ్రేక్.. షూటింగ్‌లు రద్దు
ముంబై : దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు అధికమవుతుండటంతో మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే మినీ లాక్ డౌన్ (పాక్షిక లాక్ డౌన్)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూతోపాటు వీకెండ్లో అంటే వచ్చే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు వరకు (శని, ఆది) సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది.తాజాగా కరోనాను అదుపుచేసే చర్యల్లో భాగంగా రాష్ష్ర్ట ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మినీ లాక్డౌన్లో భాగంగా ఇప్పటికే హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్‌లు, సెలూన్లు మూసి వేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,45,384 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే కరోనాతో 794 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1, 32,05,926కు చేరుకుంది. కాగా మొత్తం మరణాల సంఖ్య 1,68,436కి చేరుకుంది.నిన్న కరోనా నుంచి కోలుకుని 77,567 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 19,90,859 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ సంఖ్య 10,46,631కి చేరుకుంది. చదవండి: మహారాష్ట్రలో మినీ లాక్డౌన్ సంపూర్ణ లాక్డౌన్: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్ -
ఆ బిల్లు తెస్తే అర్ధగంటలో దేశం అంధకారం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లు-2021ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెడితే.. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగులందరూ మెరుపు సమ్మెకు దిగుతారని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రత్నాకర్‌రావు హెచ్చరించారు. లోక్‌సభ వెబ్సైట్లో బిల్లును లిస్టింగ్ చేసిందని, బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారో మూడు రోజుల ముందు వరకు కూడా తెలియనుందన్నారు. తమ వ్యతిరేకతను పట్టించుకోకుండా బిల్లును తెస్తే అర్ధగంటలో యావత్ దేశం అంధకారమవుతుందని హెచ్చరించారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి విద్యుదుత్పత్తి కేంద్రాలు, లోడ్ డిస్పాచ్ సెంటర్లు వంటి అత్యవసర విభాగాల ఉద్యోగులందరూ సమ్మెకు దిగుతారని చెప్పారు. 12 తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలతో కలసి బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. బడా పారిశ్రామికవేత్తలకు విద్యుత్ సంస్థల ఆస్తులను దోచిపెట్టడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోందని ఆరోపించారు. లైసెన్స్ లేకుండా విద్యుత్ పంపిణీ రంగంలో వ్యాపారం చేసేందుకు ప్రైవేటు వ్యాపారులకు అవకాశం కల్పించడానికి ఈ బిల్లును తీసుకువస్తున్నారని ఆరోపించారు. వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులతోపాటు విద్యుత్ సంస్థలకు ఈ బిల్లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగదారులకు ప్రస్తుతమున్న రాయితీలు ఇక ముందు లభించవని, ప్రైవేటు కంపెనీలు మాఫియాగా ఏర్పడి విద్యుత్ చార్జీలు భారీగా పెంచేస్తాయన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి ఉత్పన్నం అవుతుందని, వ్యవసాయ పంప్సెట్లకు సైతం మీటర్లు బిగించనున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ బిల్లును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు విద్యుత్ బిల్లును వ్యతిరేకించే పార్టీలకే విద్యుత్ ఉద్యోగుల మద్దతు ఉంటుందని రత్నాకర్‌రావు తెలిపారు. విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలో సీఎం కేసీఆర్ తీర్మానం చేశారని, ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని విద్యుత్ ఉద్యోగులను కోరారు. విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వారికి మద్దతు తెలిపారు. సమావేశంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ స్టాఫ్ అసోసియేషన్, 1104 యూనియన్, 1535 యూని యన్, టీవీఈఏ, టీఈడబ్ల్యూఈఏ, బీసీ/ ఎస్సీ, ఎస్టీ/ ఓసీ/ ఎస్టీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేషనల్ 'షాక్' ఎక్స్చేంజ్!
ముంబై: దేశీయంగా ప్రధాన స్టాక్ ఎక్సే్చంజీల్లో ఒకటైన ఎన్ఎస్ఈ బుధవారం ట్రేడర్లకు చెమట్లు పట్టించింది. సాంకేతిక సమస్య కారణంగా ఎన్ఎస్ఈలో దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. ఎఫ్‌అండ్‌వో ఎక్స్పైరీకి సరిగ్గా ముందు రోజు ఇలా జరగడంతో ట్రేడింగ్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టెక్నికల్ సమస్య పరిష్కారమయ్యాక చివర్లో అసాధారణంగా ట్రేడింగ్ వేళలు సాయంత్రం అయిదింటి దాకా పొడిగించడం కొంత ఊరటనిచ్చింది. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యలకు కారణమంటూ ఎన్ఎస్ఈ పేర్కొనగా.. దీనిపై సమగ్రంగా వివరణ ఇవ్వాలంటూ ఎక్సే్చంజీని సెబీ ఆదేశించింది. ఏం జరిగిందంటే... నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) మరోసారి సాంకేతిక లోపాలతో కుదేలైంది. బుధవారం ఉదయం దాదాపు 10 గం.ల ప్రాంతంలో నిఫ్టీతో పాటు ఇతర ఎన్ఎస్ఈ సూచీల టికర్లు సరిగ్గా పనిచేయడం లేదంటూ డీలర్లు ఫిర్యాదు చేయడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. చివరికి సాంకేతిక సమస్యల కారణంగా క్యాష్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగాల్లో ట్రేడింగ్ నిలిపివేస్తున్నట్లు 11.40 గం.లకు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఆ తర్వాత సాయంత్రం 3.30 గం.ల దాకా ట్రేడింగ్ నిల్చిపోయింది. గురువారంతో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉండటంతో ట్రేడర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అసాధారణంగా ట్రేడింగ్ వేళలను పొడిగించారు. సాధారణ ట్రేడింగ్ సమయం సాయంత్రం 3.30 గం.లకు ముగిసిపోయాక 3.45 గం.ల నుంచి ట్రేడింగ్ మళ్లీ ప్రారంభమై సాయంత్రం 5 దాకా సాగింది. దీనికనుగుణంగా బీఎస్ఈ, మెట్రోపాలిటన్ ఎక్సే్చంజీ ఆఫ్ ఇండియా ట్రేడింగ్ వేళలను కూడా సాయంత్రం 5 దాకా పొడిగించారు. కనెక్టివిటీ సమస్యలే కారణం.. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యకు కారణమని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఎన్ఎస్ఈకి రెండు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అనేక టెలికం లింకులు ఉన్నాయి. తమ టెలికం లింకుల్లో సమస్యలు ఉన్నాయంటూ అవి మాకు సమాచారం ఇచ్చాయి. ఇది ఎన్ఎస్ఈ సిస్టమ్‌పై ప్రతికూల ప్రభావం చూపింది‘ అని వివరించింది. వివరణ కోసం సెబీ ఆదేశం.. ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపాల వ్యవహారాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తీవ్రంగా పరిగణించింది. కనెక్టివిటీ సమస్యలు తలెత్తుతున్నప్పుడు ట్రేడింగ్‌ను డిజాస్టర్ రికవరీ సైట్‌కు ఎందుకు మళ్లించలేదని ప్రశ్నించింది. సత్వరం దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. అలాగే, ’ట్రేడింగ్ హాల్ట్’కి మూలకారణాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సూచించింది. అనూహ్య సమస్యలు తలెత్తినప్పుడు కార్యకలాపాలపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయంగా డిజాస్టర్ రికవరీ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇక ఎన్ఎస్ఈ వర్గాలతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ట్లు సెబీ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిణామాలను మార్కెట్ వర్గాలకు తెలియజేయాలంటూ ఎన్ఎస్ఈకి సూచించినట్లు పేర్కొన్నారు. ఇదే మొదటిసారి కాదు.. ఎన్ఎస్ఈ ఇలా సాంకేతిక సమస్యలు ఎదుర్కొనడం ఇదే తొలిసారి కాదు. 2020 జూన్‌లో బ్యాంక్ ఆప్షన్ సెగ్మెంట్ ధరలు ఎక్సే్చంజీలోని టెర్మినల్‌లో ప్రతిఫలించలేదు. 2019 సెప్టెంబర్‌లో.. ట్రేడింగ్ చివర్లో సిస్టమ్ పనిచేయలేదు. 2017లోనూ ఇలాంటి సమస్యే వచ్చి దాదాపు 5 గంటల పాటు ట్రేడింగ్ ఆగిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలను పటిష్టం చేసుకోవాలంటూ అప్పట్లోనే ఎన్ఎస్ఈకి సెబీ గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. కానీ నాలుగేళ్లు తిరగకుండానే ఎన్ఎస్ఈ మళ్లీ అలాంటి సమస్యలోనే చిక్కుకుంది. బీఎస్ఈలో యథావిధిగా ట్రేడింగ్.. ఎన్ఎస్ఈ డౌన్ అయినప్పటికీ బీఎస్ఈలో యథావిధిగానే పనిచేసింది. అయితే, బ్రోకర్లంతా పొలోమంటూ బీఎస్ఈకి మళ్లడంతో ట్రేడింగ్ వాల్యూమ్ .. రోజువారీ సాధారణ స్థాయికన్నా తొమ్మిది రెట్లు పైగా పెరిగింది. ట్రేడర్లు తమ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు హడావుడి పడటంతో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని స్టాక్స్ హఠాత్తుగా లోయర్ సర్క్యూట్లకు కూడా పడిపోయాయంటూ పలువురు ట్రేడర్లు తెలిపారు. తాము తీసుకున్న పొజిషన్ల పరిస్థితి ఏమిటన్నది తెలియక వారిలో గందరగోళం నెలకొంది. మిగతా దేశాల్లోనూ... ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోని ఎక్సే్చంజీల్లోనూ గతంలో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆస్ట్రేలియా సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ (2020) ట్రేడింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసిన తర్వాత ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 10.24 గం.లకు ట్రేడింగ్ ఆగిపోయింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో మిగతా రోజంతా కూడా నిలిపివేశారు. టోక్యో స్టాక్ ఎక్సే్చంజ్ (2020) మార్కెట్ వివరాలను రిలే చేసే హార్డ్‌వేర్‌లో సమస్యలు తలెత్తడంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 9 గం.లకు ట్రేడింగ్ నిల్చిపోయింది. బ్యాకప్ వ్యవస్థ కూడా విఫలం కావడంతో మిగతా రోజంతా కూడా ట్రేడింగ్ సాగలేదు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2018) సాంకేతిక సమస్యల కారణంగా అమెజాన్, ఆల్ఫాబెట్ సహా అయిదు దిగ్గజ కంపెనీల షేర్లలో పూర్తి రోజంతా ట్రేడింగ్ నిలిపివేశారు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2015) చాలా భారీ సాంకేతిక లోపం తలెత్తడంతో అన్ని షేర్లలో ట్రేడింగ్ నిల్చిపోయింది. దాదాపు నాలుగు గంటల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. అంతర్గతంగా సాంకేతిక సమస్య ఇందుకు కారణమంటూ ఎన్వైఎస్ఈ తెలిపింది. లండన్ స్టాక్ ఎక్సే్చంజ్ (2008) సాంకేతిక సమస్య కారణంగా దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. మార్కెట్ ప్రారంభమైన అరగంట తర్వాత అమ్మడానికి, కొనడానికి షేర్ల ధరలు కనిపించడం లేదంటూ ట్రేడర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ట్రేడింగ్ నిలిపివేశారు. దాదాపు 7 గంటల తర్వాత ముగింపు సమయానికి అరగంట ముందు తిరిగి ప్రారంభమైంది. మళ్లీ 52 వేల పైకి సెన్సెక్స్ ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో నెలకొన్న సాంకేతిక అంతరాయం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయలేకపోయింది. ఆర్థిక రంగ షేర్లు రాణించడంతో బుధవారం మార్కెట్ భారీ లాభాలను మూటగట్టుకుంటుంది. సెన్సెక్స్ 1,030 పాయింట్లు పెరిగి తిరిగి 50 వేల పైన 50,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 15 వేల స్థాయిని అందుకున్నప్పటికీ.., ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. చివరకు 274 పాయింట్లు లాభంతో 14,982 వద్ద నిలిచింది. మొదటి సెషన్లో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. సాంకేతిక అంతరాయం తొలగి మార్కెట్ తిరిగి ప్రారంభమైన తర్వాత ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు దూసుకెళ్లాయి. నేడు (గురువారం) ఎఫ్అండ్ఓ ముగింపు నేప«థ్యంలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌తో పాటు తమ పోజిషన్లను రోలోవర్ చేసుకోవడంతో సూచీలు ర్యాలీ చేసినట్లు నిపుణులు తెలిపారు. ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఇకపై అన్ని ప్రైవేటు బ్యాంకులనూ అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపద రూ.2.60 లక్షల కోట్లు అప్ మార్కెట్ 2% లాభంతో ఇన్వెస్టర్లు రూ.2.60 కోట్లు ఆర్జించారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.203 లక్షల కోట్లకు చేరింది. -
కరోనా వేళ.. క్రిస్మస్ ఎలా..!
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల ఉత్సాహం కరోనా పుణ్యమా అని మసకబారుతోంది. ఒకపక్క ఈ మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చిందని సంతోషించేలోగానే, కొత్త రూపు సంతరించుకొని దాడి చేయడం ఆరంభించింది. దీంతో పలు దేశాలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని దేశాలు కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకురాగా, కొన్ని దేశాలు తేలికపాటి ఆంక్షలు తెచ్చాయి. ప్రజలు సమూహంగా గుమిగూడటం నుంచి విందు భోజనాల వరకు అనేక అంశాలపై పరిమితులు విధించాయి. నూతన సంవత్సర వేడుకల్లో కొత్తరూపంలో కరోనా దాడి చేయకుండా దేశాల మధ్య ప్రయాణాలపై నిషేధాజ్ఞలు పెరిగాయి. యూరప్ దేశాలైతే దాదాపు భయం గుప్పిట్లోకి జారాయి. ఆయా దేశాల వాతావరణ, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించుకున్నాయి. –లండన్ బ్రిటన్‌లో షట్‌డౌన్ నిన్నమొన్నటి వరకు క్రిస్మస్ సమయంలో ఆంక్షలన్నీ రద్దు చేయాలని బ్రిటన్ భావించింది. వ్యాక్సినేషన్ కూడా ఆరంభించింది. అయితే ఒక్కమారుగా కొత్త స్ట్రయిన్ బయటపడడంతో ఉలిక్కిపడింది. ప్రస్తుతం పాత ప్లాన్లన్నీ రద్దు చేసి పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐలాండ్‌ల్లో వివిధ రూపాల్లో లాక్‌డౌన్‌ను పునఃప్రారంభించారు. లండన్‌లోనైతే ఇంట్లో కూడా సామూహిక వేడుకలు వద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు డజన్ల కొద్దీ దేశాలు బ్రిటన్‌కు విమానాలు నిలిపివేశాయి. లెబనాన్ తీరేవేరు ఆర్థికంగా కూనారిల్లుతున్న ఎకానమీని గట్టెక్కించడానికి విదేశీ మారక ద్రవ్యార్జనే మార్గమని భావించిన లెబనాన్ చాలా ఆంక్షలు ఎత్తివేసింది. నైట్‌క్లబ్బులు తెరిచిఉంచేందుకు అనుమతినిచ్చింది. అయితే క్లబ్బుల్లో డ్యాన్సులను నిషేధించింది. అమెరికాలోరాష్ట్రాలదే నిర్ణయం అమెరికా ప్రభుత్వం దేశవ్యాప్తం ప్రయాణాలపై జాతీయ స్థాయిలో నిషేధం విధించలేదు. ఆయా రాష్ట్రాలే ఈ విషయంపై నిర్ణయం తీసుకునే వీలు కల్పించింది. కానీ వీలయినంత వరకు ఇంట్లోనే ఉండమని ప్రజలకు సూచించింది. దక్షిణాఫ్రికాలో మందు బం§Š క్రిస్మస్ రోజు దేశంలో మందు అమ్మకాలను దక్షిణాఫ్రికా నిలిపివేసింది. దేశంలో పలు చోట్ల నైట్‌కర్ఫ్యూ విధించింది. క్రిస్మస్, న్యూఇయర్ రోజును బీచ్‌లు మూసివేస్తున్నట్లు తెలిపింది. సామూహికంగా తిరగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇంట్లో మాత్రం 100 మంది వరకు కలుసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు దక్షిణాఫ్రికాకు విమానాలు నిలిపివేస్తున్నాయి. బ్రెజిల్లో మీ ఇష్టం ఆది నుంచి కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బోల్సెనారో ప్రభుత్వం క్రిస్మస్ సమయంలో ఎలాంటి కొత్త ఆంక్షలు లేవని తెలిపింది. సోపౌలో నగర గవర్నర్ మాత్రం స్వల్ప ఆంక్షలు విధించారు. సోపౌలో, రియో, సాల్వ డార్లో డిసెంబర్ 31న బాణసంచా కాల్చడాన్ని నిలిపివేశారు. జర్మనీలో పాటలు నిషిద్ధం వచ్చే నెల 10వరకు కొత్త ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 24–26 మధ్య మాత్రం స్వల్ప సడలింపులుంటాయని తెలిపింది. మ తపరమైన సమావేశాలు జరపవచ్చని, కానీ పాటలు మాత్రం నిషిద్ధమని తెలిపింది. ఇతర దేశాల్లో... ► పెరూలో క్రిస్మస్ రోజు కారు డ్రైవింగ్‌ను నిషేధించారు. ► ఫ్రాన్స్‌లో సామూహిక విందు భోజనాల్లో పాల్గొనేవారి సంఖ్యను ఆరుకు పరిమితం చేశారు. వచ్చే నెల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. ► చిలీలో విందు భోజనాలకు 15మంది వరకు అనుమతినిస్తున్నారు. ► ఇటలీలో వచ్చే రెండువారాల వరకు ప్రయాణాలు నిషేధించారు. ► పోర్చుగల్‌లో క్రిస్మస్కు కొంతమేర సడలింపులిచ్చి న్యూఇయర్‌కు కఠిన ఆంక్షలు విధించనున్నారు. ► స్పెయిన్‌లో స్వల్ప సడలింపులతో వేడుకలకు అనుమతించారు. ► దక్షిణ కొరియాలో వచ్చే నెల 3వరకు ఐదుగురి కన్నా ఎక్కువమంది గుమిగూడడంపై ఆంక్షలు తెచ్చారు. ► రష్యాలో వచ్చేనెల 15వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. -
25న షట్డౌన్కు రైతు సంఘాల పిలుపు
అమృత్సర్ : వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించిన నేపథ్యంలో పంజాబ్, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈనెల 25న పంజాబ్ షట్డౌన్కు 31 రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అమృత్‌సర్‌లో రైలు పట్టాలపై కూర్చుని రైల్ రోకో ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. అమృత్‌సర్‌తో పాటు ఫిరోజ్‌పూర్‌లోనూ రైతులు రైల్ రోకోలో పాల్గొని రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని, బిల్లులకు అనుకూలంగా ఓటు వేసిన వారిని బాయ్‌కాట్ చేయాలని రైతు సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు. బర్నాలా, సంగ్రూర్‌లో భారతీయ కిసాన్ యూనియన్ కార్యకర్తలు రైలు పట్టాలపై ఆందోళన చేపట్టారు. ఇక రైతుల ఆందోళనతో ప్రత్యేక రైళ్లను రైల్వేలు రద్దు చేశాయి. మూడు రోజుల పాటు 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్టు రైల్వేలు ప్రకటించాయి. ప్రయాణీకుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా వ్యవసాయ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందడంతో కనీస మద్దతు ధర వ్యవస్ధ కుప్పకూలుతుందని, బడా కార్పొరేట్ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై తాము ఆధారపడాల్సి వస్తుందనే భయం పంజాబ్ రైతులను వెంటాడుతోంది. మరోవైపు వ్యవసాయ బిల్లులతో రైతాంగానికి మేలు జరుగుతుందని, కనీస మద్దతు ధర విధానం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోంది. చదవండి : బిల్లులపై రైతుల ఆందోళన ఎందుకు ?! -
పబ్‌లకు తాళం వేయకుంటే..
బెంగళూర్ : పబ్‌లు యువతను నాశనం చేస్తున్నాయని దక్షిణ కన్నడ జిల్లాలో పబ్‌లన్నింటినీ మూసివేయాలని కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కతీల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో వీటిపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని తాను తమ పార్టీ యువజన విభాగాన్ని కోరతానని ఆయన స్పష్టం చేశారు. కతీల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పబ్‌లు, క్లబ్‌లు యువతను నాశనం చేస్తున్నాయని దక్షిణ కన్నడ జిల్లాలో వీటిని మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే న్యాయస్ధానాలను ఆశ్రయించాలని పార్టీ యువజన విభాగాన్ని కోరతానని చెప్పుకొచ్చారు. కరోనా కట్టడికి విధించిన సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం అన్‌లాక్ 4 మార్గదర్శకాలకు అనుగుణంగా కర్ణాటకలో బార్లు, రెస్టారెంట్లు తెరుచుకున్న నేపథ్యంలో కతీల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 1 నుంచి మద్యం విక్రయాలకు అనుమతించడంతో కర్ణాటకలోని పబ్‌లు, క్లబ్‌ల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా సాగుతున్నాయి. ఇక 9366 తాజా కరోనా వైరస్ కేసులతో కర్ణాటకలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 5,00,000కు చేరువైంది. ఇక మరణాల సంఖ్య 7629కి ఎగబాకింది. బెంగళూర్ నగరంలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,84,082కు ఎగబాకింది. చదవండి : దొరికాడ్రా కొడుకు, ఉతుకుడే ఉతుకుడు! -
టిక్‌టాక్ : ట్రంప్ తాజా డెడ్‌లైన్
వాషింగ్టన్ : చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ ‘టిక్‌టాక్’ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి విక్రయించాలని, లేనట్లయితే ఆ యాప్‌ను తమ దేశంలో నిషేధిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. (మైక్రోసాఫ్ట్ ‘టిక్‌టాక్’ షో!) టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించడానికి ఆరు వారాల గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చుకోవాలని లేదంటే నిషేధం తప్పదని స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ , లేదా మరో పెద్ద సంస్థ ఏదైనా తనకు అభ్యంతరం లేదు కానీ సురక్షితమైన అమెరికన్ సంస్థ కావాలి అని ట్రంప్ అన్నారు. భద్రతతో తమకు ఎటువంటి సమస్య ఉండకూడదని తెలిపారు. అలాగే ఈ ఒప్పందం నుండి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటుందని చెప్పారు. మరోవైపు టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్టు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేస్తామని, సమాచార భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కరోనా : వజ్రాల పరిశ్రమ మూసివేత
అహ్మదాబాద్ : సూరత్‌లోని వజ్రాల పరిశ్రమలో కరోనా కేసులు అంతకంతకూ పెరుతూనే ఉన్నాయి. దీంతో ఆయా సంస్థలను మూసివేయాలని శనివారం సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసి) తెలిపింది. మిగతా సిబ్బంది కూడా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలని సూచించింది. దేశంలోని అతిపెద్ద డైమండ్ కటింగ్, పాలిషింగ్ హబ్‌లుగా పేరున్న సూరత్‌లోని వజ్రాల పరిశ్రమలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. (‘పిల్ల’ దొరికిందని 1.55లక్షలు అప్పు ఇస్తే.. ) గత మూడు రోజుల్లోనే ఎనిమిది డైమండ్ యూనిట్లలో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఈ ఎనిమిది యూనిట్లను మూసివేస్తున్నట్లు ఎస్ఎంసి డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ ఆశిష్ నాయక్ శనివారం తెలిపారు. అంతేకాకుండా సామాజిక దూరం పాటించని యూనిట్లకు ఒక్కొక్కరికి రూ. 10,000 జరిమానా విధించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి సామాజిక దూరం, ఫేస్ మాస్క్ , శానిటైజేషన్ లాంటి నిబంధనలు పాటిస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు వజ్రాల యూనిట్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. సూరత్‌లో సుమారు 6,000 డైమండ్ యూనిట్లు ఉండగా, దాదాపు 6.5 లక్షలమంది కార్మికులు పనిచేస్తుంటారు. జూన్ 1న పరిశ్రమలు తెరిచేందుకు కేంద్రం అనుమతివ్వడంతో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ యూనిట్లలో 2 నుంచి 2.25 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. (సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు..) -
3 జిల్లాల్లో షట్‌డౌన్ ఎత్తివేత: డీజీపీ
ఒడిశా, భువనేశ్వర్: రాష్ట్రంలోని 3 జిల్లాల్లో షట్‌డౌన్ ఎత్తివేస్తున్నట్లు డీజీపీ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) అభయ్ ఆదివారం ప్రకటించారు. ఉదయం నుంచే జాజ్‌పూర్, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో కొనసాగుతున్న షట్‌డౌన్ తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోవడంతో ఆయా ప్రాంతాల్లో 60 గంటల షట్డౌన్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసిత్‌కుమార్ త్రిపాఠి నుంచి ఉత్తర్వులు అందాయని, ఈ మేరకు గురువారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు షట్‌డౌన్ అమలు చేసినట్లు ఆయన వివరించారు. అయితే షట్‌డౌన్ కాల వ్యవధిలో ప్రజల నుంచి అందిన సహకారం మరువలేనిదని డీజీపీ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. లోగడ జారీచేసిన నిబంధనలకు అనుగుణంగా ప్రజలంతా భౌతికదూరం పాటిస్తూకరోనా నియంత్రణకు సహకరించాలని పిలుపునిచ్చారు.