Will close down Facebook in India, Karnataka HC warns social media giant - Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ మూత పడనుందా? కోర్టు సంచలన వ్యాఖ్యలు

Published Thu, Jun 15 2023 12:47 PM | Last Updated on Thu, Jun 15 2023 1:27 PM

 Will close down Facebook in India Karnataka HC warns social media giant - Sakshi

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర పోలీసులతో ఫేస్‌బుక్ సహకరించకపోతే,  ఇండియా  అంతటా తన సేవలను మూసివేసే అంశాన్ని పరిశీలిస్తామంటూ  ఆగ్రహం వ్యక్తం చేసింది. (సూపర్‌ ఆఫర్‌: రూ. 2749 కే యాపిల్‌ ఐఫోన్‌ 11!)

సౌదీ జైలులో ఉన్న భారతీయుడి కేసు దర్యాప్తుపై రాష్ట్ర పోలీసులకు సహకరించడం లేదని ఆరోపించిన నేపథ్యంలో ఫేస్‌బుక్‌ కార్యకలాపాలను మూసివేసేలా ఆర్డర్ జారీ చేయడాన్ని పరిశీలిస్తామని కర్ణాటక హైకోర్టు బుధవారం ఫేస్‌బుక్‌ను హెచ్చరించింది.

దక్షిణ కన్నడ జిల్లా నివాసి కవిత పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వారంలోగా అవసరమైన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను కోర్టు ముందుంచాలని ధర్మాసనం ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. తప్పుడు కేసులో అరెస్టు చేసిన కేసులో ఏ చర్య తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం బాధాకరం. మంగళూరు పోలీసులు కూడా తగు విచారణ చేపట్టి నివేదిక సమర్పించాల్సి ఉంటుందన్న కోర్టు,  విచారణను జూన్ 22కి వాయిదా వేస్తూ కోర్టు పేర్కొంది. (అపుడు పాల ప్యాకెట్‌ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)

తన భర్త శైలేష్ కుమార్ (52) సౌదీ అరేబియాలోని ఒక కంపెనీలో 25 సంవత్సరాలు పనిచేశారని, తాను పిల్లలతో తన స్వగ్రామంలో నివసిస్తున్నారని కవిత తన పిటిషన్‌లో తెలిపారు.2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ)కి మద్దతుగా ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టాడనే అభియోగంతో  సౌదీ పోలీసులు శైలేష్ కుమార్‌ను అరెస్టు చేసి  జైల్లో పెట్టారు. (చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌కి ఎదురుదెబ్బ: సీఈవో గుడ్‌బై, ప్రత్యర్థికి సై!?)

అయితే గుర్తు తెలియని వ్యక్తులు తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి రాజుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ కవిత మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫేస్‌బుక్‌కు లేఖ రాసి, నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచినట్లు సమాచారం అందించారు. అయితే ఫేస్‌బుక్ దీనిపై స్పందించలేదు. విచారణలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ పిటిషనర్ 2021లో హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను విడుదలకు సాయం చేయాలని కవిత కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు.

మరిన్ని బిజినెస్‌వార్తలు, ఇంట్రస్టింగ్‌అప్‌డేట్స్‌ కోసం చదవండి: సాక్షిబిజినెస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement