Akasa Air Crisis మరో బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సంక్షోభంలో చిక్కుకుంది. దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా ప్రధాన వాటాదారుగా గత ఏడాది సేవలను ప్రారంభించిన అకాశ ఎయిర్‌కు పైలట్ల సెగ తగిలింది. ఆకస్మాత్తుగా సంస్థకు గుడ్ బై చెప్పడంతో కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఆకాశ ఎయిర్ కూడా మూత పడనుందనే వదంతులు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి.
పైలట్ రాజీనామా ఆందోళనల మధ్య ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. విశ్వసనీయతను నిర్ధారించడానికే విమానాలను తాత్కాలికంగా తగ్గిస్తుంది తప్ప మరేమీ కాదంటూ మూసివేత రూమరన్లు ఖండించారు. కొద్ది మంది పైలట్లు ఉన్నట్టుండి రిజైన్ చేయడంతో కొన్ని తమ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించారు. పైలట్లు చట్టవిరుద్ధంగా తప్పనిసరి ఒప్పంద నోటీసు వ్యవధిని అందించకుండానే వెళ్లిపోయారంటూ దూబే తెలిపారు. దీనికి పైలట్‌లపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు ఉద్యోగులకు అందించిన ఇమెయిల్‌లో వెల్లడించారు. సంస్థ దీర్ఘకాల కార్యకలాపాలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, ఇడ్లీ బండి నడుపుకుంటున్నా!)
దాదాపు 43 మంది పైలట్ల ఆకస్మిక నిష్క్రమణ కారణంగా స్వల్పకాలంలో తమ సేవలకు అంతరామమని దూబే ఉద్యోగులకు అందించిన ఇమెయిల్ సమాచారం తెలిపారు. కొంతమంది పైలట్ల నిర్ణయం కారణంగా జూలై, సెప్టెంబర్ మధ్య విమానాలకు అంతరాయం ఏర్పడిందనీ, చివరి నిమిషంలో రద్దు చేయవలసి ఇచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు కస్టమర్ల కోసం అత్యుత్తమ విమానయాన సంస్థను నిర్మించామనీ, తమ ప్లాన్ ప్రకారం ప్రతి మైలురాయిని అధిగమించాని చెప్పారు. దీర్ఘకాలం సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ దూబే వివరణ ఇచ్చారు. (మరో భారీ బ్యాంకు స్కాం: ఏకంగా రూ.3847 కోట్లకు ముంచేశారు)
కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజా డేటా ప్రకారం, Akasa మార్కెట్ వాటా ఆగస్టులో 5.2 శాతం నుండి 4.2 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఆగస్టులో దేశీయంగా తొలి విమానాన్ని నడిపిన ఆకాశ ఎయిర్ ఆ తరువాత అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు అర్హత సాధించింది. ఆగస్టు 1న బోయింగ్ 20వ B737 మ్యాక్స్ విమానాన్ని అందుకుంది. (జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?)
Comments
Please login to add a commentAdd a comment