జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న ఆంక్షలు | Curfew, shutdown extended in Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న ఆంక్షలు

Published Sun, Jul 31 2016 8:55 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న ఆంక్షలు - Sakshi

జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న ఆంక్షలు

శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో వేర్పాటువాదులు తమ ఆందోళనను పొడిగించారు. ఆగస్ట్ 5 వరకు బంద్ కొనసాగతుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. పుల్వామా, కుల్గాం, షోపియాన్లతో పాటు కశ్మీర్ వ్యాలీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోందని సీనియర్ పోలీస్ అధికారి ఆదివారం వెల్లడించారు. శ్రీనగర్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో సైతం ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.

భద్రతా బలగాలు శాంతిభద్రతల అంశంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. తీవ్రమైన హింస, ప్రజాధనాన్ని ధ్వసం చేసే చర్యలను అడ్డుకోవడానికే ఆంక్షలను పొడిగిస్తున్నట్లు వారు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement