Curfew
-
Nagpur issue కొనసాగుతున్న కర్ఫ్యూ, స్థానిక ఎన్నికల కోసమే ఇదంతా?
నాగ్‌పూర్: మొఘల్ పాలకుడు ఔరంగజేబు ‘సమాధి తొలగింపు’పై చెలరేగిన హింస అనంతరం నాగ్‌పూర్‌లోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొత్వాలి, గణేష్ పేత్, తహసీల్, లకద్గంజ్, పచ్పావోలి, శాంతి నగర్, సక్కర్దార, నందన్వన్, ఇమామ్‌బాడ, యశోధర నగర్. కపిల్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అదేరోజు సాయంత్రం మధ్య నాగ్‌పూర్‌లో చెలరేగిన హింసలో ముగ్గురు డీసీపీలు (డిప్యూటీ కమిషనర్లు ఆఫ్ పోలీస్) సహా 12 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. హింసకు సంబంధించి పోలీసులు 15 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో, అవసరానికి అనుగుణంగా సడలింపులపై సంబంధిత ప్రాంత డీసీపీ నిర్ణయం తీసుకుంటారని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ నాగ్‌పూర్‌లోని చిట్నిస్ పార్క్ ప్రాంతంలోని మహల్లో హింస చెలరేగింది. ఔరంగజేబు సమాధి తొలగింపు కోసం ఒక మితవాద సంస్థ చేపట్టిన ఆందోళనలో ఒక వర్గానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారన్న పుకార్లతో అల్లర్లు చెలరేగాయి. ఓల్డ్ భండారా రోడ్డు సమీపంలోని హన్సపురి ప్రాంతంలో రాత్రి 10.30 నుండి 11.30 గంటల మధ్య మరో ఘర్షణ చెలరేగింది. ఒక అల్లరి మూక అనేక వాహనాలను తగలబెట్టింది. ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లు, ఒక క్లినిక్‌ను ధ్వంసం చేసింది. ఈ సంఘటనలల్లో అనేక మంది గాయపడ్డారు. వరుసగా రెండో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. రాష్ట్రంలో కలహాలకు దారితీసే చిన్న సంఘటనలను కూడా తీవ్రంగా పరిగణించి, వాటిని మొగ్గలోనే తుంచివేయాలని మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా జిల్లా ఎస్పీలను కోరారు.నాగ్‌పూర్ అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపితమే– జరంగే ఛత్రపతి సంభాజీనగర్: నాగ్‌పూర్‌లో హింసను ప్రభుత్వ ప్రేరేపితమేనని, పట్టణంలో అశాంతికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే కారణమని మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే మంగళవారం ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం వారిదే. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే అది వారికి నిమిషంలో పని. కాంగ్రెస్ అప్పట్లో తప్పు చేసి ఉంటే ఇప్పుడు దాన్ని సరిదిద్దే అవకాశం వారికి ఉంది . ఒకే సమయంలో రెచ్చగొట్టే ప్రకటనలు అదే సమయంలో సమాధి చుట్టూ పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థంచేసుకోవాలి. ‘స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీటిలో విజయం సాధించేందుకే ఇదంతా అని వ్యాఖ్యానించారు -
మణిపూర్ కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్..
-
Bangladesh Political Crisis: సంక్షోభ బంగ్లా
ఢాకా/న్యూఢిల్లీ: పొరుగుదేశం బంగ్లాదేశ్ పెను రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. సోమవారం రోజంతా అత్యంత నాటకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రధాని షేక్ హసీనా (76)కు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా జరుగుతున్న దేశవ్యాప్త ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. నిరసనకారుల ‘లాంగ్ మార్చ్’ పిలుపునకు స్పందిస్తూ జనమంతా కర్ఫ్యూను ధిక్కరించి మరీ దేశ నలుమూలల నుంచీ రాజధాని ఢాకాకు తండోపతండాలుగా తరలారు. దాంతో ప్రజల డిమాండ్‌కు హసీనా తలొగ్గారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జనాగ్రహానికి జడిసి పలాయన మంత్రం పఠించారు. ఉన్నపళంగా దేశం వీడారు. సోదరితో కలిసి కట్టుబట్టలతో సైనిక విమానంలో భారత్ చేరుకున్నారు. వెంటనే సైన్యం పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకుంది. సైన్యాధ్యక్షుడు జనరల్ వకారుజ్జమాన్ జాతినుద్దేశించి టీవీలో ప్రసంగించారు. ప్రధాని రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. ‘‘శాంతిభద్రతలతో పాటుదేశ బాధ్యతలన్నింటినీ తాత్కాలికంగా నేనే స్వీకరిస్తున్నా. దయచేసి సహకరించండి’’ అని ప్రకటించారు. నిరసనకారులపై ఒక్క తూటా కూడా పేల్చొద్దని సైన్యాన్ని, పోలీసు శాఖను ఆదేశించారు. ‘‘అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. నిరసనకారులు ఆందోళన విరమించాలి’’ అని కోరారు. వీలైనంత త్వరగా మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆ వెంటనే పారీ్టలతో భేటీ అయ్యారు. తర్వాత ఆయా పారీ్టల నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. అధికార అవామీ లీగ్ మినహా మిగతా పక్షాలు హాజరయ్యాయి. మరోవైపు హసీనా దేశం వీడారన్న వార్తతో ఆందోళనకారులంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా బాణసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సందడి చేశారు. హసీనా అధికార నివాసంలోకి చొరబడ్డారు. సర్వం లూటీ చేసి తమ ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ఆమె తండ్రి, బంగబంధు షేక్ ముజిబుర్ రెహా్మన్ విగ్రహాన్ని సుత్తెలతో పగలగొట్టి నేలమట్టం చేశారు. అధికార అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్లమెంటులోకీ చొరబడ్డారు. పుట్టి ముంచిన రిజర్వేషన్లు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ అట్టుడికిపోతుండటం తెలిసిందే. బంగ్లా విముక్తి యుద్ధవీరుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ గత జూన్‌లో హసీనా సర్కారు తీసుకున్న నిర్ణయం చివరికి ఆమె పుట్టి ముంచింది. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. దాంతో నెల క్రితం జరిగిన భారీ ఆందోళనలు, ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ రిజర్వేషన్లను 5 శాతానికి తగ్గించింది. దాంతో సమస్య సమసినట్టేనని అంతా భావించారు. కానీ హసీనా తప్పుకోవాలంటూ వారం రోజులుగా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. 200 మంది అమాయకుల మృతికి ఆమే కారణమంటూ ఆందోళనలు తీవ్ర రూపు దాల్చాయి. హసీనా రాజీనామా డిమాండ్‌తో జనం మరోసారి రోడ్డెక్కారు. శని, ఆదివారాల్లో దేశవ్యాప్త ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించారు. హసీనా సర్కారు ఓ మెట్టు దిగి వారిని చర్చలకు ఆహా్వనించినా ససేమిరా అన్నారు. దాంతో వారిపై హసీనా తీవ్రంగా మండిపడ్డారు. ఆ క్రమంలో, ‘యువత ముసుగులో సంఘవిద్రోహ శక్తులే ఘర్షణలకు దిగుతున్నా’రంటూ ఆదివారం ఆమె చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. హసీనాను గద్దె దింపడమే లక్ష్యంగా ‘ఢాకా లాంగ్ మార్చ్’కు నిరసనకారులు పిలుపునిచ్చారు. అది చివరికి హసీనా పలాయనానికి దారితీసింది. రిజర్వేషన్ల రగడ ఆమె 15 ఏళ్ల పాలనకు చివరికిలా తెరదించింది. నాలుగోసారి అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు కూడా దాటకుండానే హసీనా సర్వం పోగొట్టుకుని శరణారి్థగా దేశం వీడాల్సి వచ్చింది! ఆలయాల విధ్వంసం హసీనా రాజీనామా చేశారన్న ప్రకటన వింటూనే దేశవ్యాప్తంగా జనం రెచ్చిపోయారు. ఢాకాలో ప్రధాని అధికార నివాసంతో పాటు హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ నివాసంలోకి చొచ్చుకెళ్లారు. వాటిని పూర్తిగా లూటీ చేశారు. హసీనా భర్త డాక్టర వాజెడ్ మియా ఇంటిని కూడా వదిలిపెట్టలేదు. దానికి నిప్పు పెట్టారు. బంగబంధు స్మారక మ్యూజియంతో పాటు బంగ్లాదేశ్‌తో భారత ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతీకగా నిలిచిన ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం తదితర కీలక భవనాలకు కూడా నిప్పు పెట్టారు. దేశ ప్రధాన న్యాయమూర్తి నివాసంపైనా అల్లరి మూకలు దాడికి దిగాయి. కాసేపటికే ఇంట్లోంచి కేకలు, ఆక్రందనలు, మూలుగులు విని్పంచినట్టు స్థానిక మీడియా పేర్కొంది. దేశవ్యాప్తంగా హింసాకాండ, ఆస్తుల విధ్వంసం తదితరాలు కొనసాగాయి. నాలుగు ఆలయాలను ధ్వంసం చేశారు. ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారుల నివాసాలు, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లపై రాళ్లు రువ్వారు. వాటికి నిప్పు పెట్టారు. రన్‌వే మీదా వెంటాడిన జనం... త్రుటిలో తప్పించుకున్న హసీనా సైనిక విమానంలో సోదరితో కలిసి ఢిల్లీకి ఉన్నపళంగా బంగ్లా వీడిన హసీనా తన సోదరి షేక్ రెహానాతో కలిసి భారత్ చేరుకున్నారు. ఆ క్రమంలో, వెల్లువెత్తిన జనాగ్రహం బారినుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్నారు! హసీనాను వెంబడిస్తూ నిరసనకారులు ఢాకా విమానాశ్రయంలోకి కూడా చొచ్చుకొచ్చారు. వారిలో పలువురు గేట్లన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ హసీనాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తూ రన్‌వే మీదికి కూడా చేరుకున్నారు. అప్పటికే ఆమె, సోదరి బంగ్లా వైమానిక దళానికి చెందిన సి–130జె రవాణా విమానం ఎక్కేశారు. దాంతో నిరసన మూక బారిన పడకుండా తప్పించుకున్నారు. కాసేపటికి వారిద్దరూ ఢిల్లీ సమీపంలో గాజియాబాద్‌లోని హిండన్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. విమానం భారత వాయుతలంలోకి ప్రవేశించగానే మన వాయుసేన విమానాలు రక్షణగా తోడు వచ్చాయి. విమానాశ్రయంలో ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు హసీనాకు స్వాగతం పలికారు. హసీనాతో దోవల్ భేటీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హిండన్ ఎయిర్‌బేస్‌లో హసీనాతో భేటీ అయ్యారు. వారు ఏం చర్చించిందీ తెలియరాలేదు. అనంతరం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఢిల్లీలో ఉన్న తన కూతురు సైమా వాజెద్‌ను కలిసిన అనంతరం హసీనా లండన్ వెళ్తారని సమాచారం. వాజెద్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆగ్నేయాసినా ప్రాంతీయ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. హసీనా ఇంటి ముట్టడి సర్వం దోచుకెళ్లిన జనం రెండేళ్ల క్రితం శ్రీలంక అంతర్యుద్ధం సందర్భంగా ఏం జరిగిందో గుర్తుందా? అధ్యక్ష నివాసాన్ని ముట్టడించిన జనం భవనమంతా కలియదిరిగారు. అధ్యక్షుని కురీ్చలో విలాసంగా కూర్చుని ఫొటోలకు పోజులిచ్చారు. సెలీ్పలు దిగారు. కిచెన్‌లో దూరి ఉన్నవన్నీ తింటూ సరదాగా గడిపారు. ఈత కొలనుల్లో ఈదులాడారు. సోమవారం ఢాకాలోనూ అవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశం వీడినట్టు తెలియగానే నిరసనకారులు సంబరాలు చేసుకున్నారు. ఆమె అధికార నివాసం ‘గణభదన్’ను భారీ సంఖ్యలో ముట్టడించారు. డ్రమ్ములు వాయిస్తూ, కొమ్ముబూరాలు ఊదుతూ విజయనాదం చేశారు. జాతీయ పతాకాలు చేబూని స్వేచ్ఛా నినాదాలు చేశారు. లాన్ల నిండా పరుగులు తీస్తూ, స్విమింగ్‌పూల్స్‌లో ఈదులాడుతూ, భవనమంతా కలియదిరుగుతూ హసీనాపై తమ ఆగ్రహాన్ని వెలిగక్కారు. భద్రతా సిబ్బందితో కలిసి ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. కొందరు ప్రధాని కుర్చీలో కూర్చున్నారు. బెడ్రూంలో మంచంపై హాయిగా సేదదీరారు. అంతటితో ఆగకుండా వంట సామగ్రి మొదలుకుని ఫరి్నచర్, పురాతన వస్తువుల దాకా సర్వం ఎత్తుకెళ్లారు. ఎవరికి ఏది చేతికందితే అది తీసుకెళ్లారు. భవనాన్ని పూర్తిగా లూటీ చేసి వదిలారు. ఒక వ్యక్తి లిప్‌స్టిక్‌లు చేతబట్టుకుని మీడియా కంటబడ్డాడు. ‘‘నియంత కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తం చేశాం. మా పోరాటానికి ప్రతీకగా ఈ లిప్‌స్టిక్‌ను నా దగ్గరుంచుకుంటా’’ అని చెప్పుకొచ్చాడు! దేశ పార్లమెంటులోకి కూడా జనం వెల్లువలా దూసుకెళ్లారు. ప్రజాప్రతినిధురల కురీ్చల్లో కూర్చుని విలాసంగా పొగ తాగుతూ, సెల్పీలు తీసుకుంటూ గడిపారు. ఇక తిరిగి రారు: కుమారుడు లండన్: హసీనా తిరిగి బంగ్లాదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టబోరని ఆమె కుమారుడు సజీవ్ వాజెడ్ జాయ్ ప్రకటించారు. ఆమె క్షేమం కోరి కుటుంబీకులమంతా ఒత్తిడి చేసిన మీదటే దేశం వీడారని బీబీసీకి ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఖలేదా జియాకు విముక్తిఢాకా: జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఖలేదా జియాను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతోపాటు దేశం విడిచిపెట్టిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం సంభవించడం గమనార్హం. అధ్యక్షుడు షహబుద్దీన్ ప్రతిపక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్ ఖలేదా జియాను తక్షణమే విడుదల చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయానికి వచ్చినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది. షేక్ హసీనా మొదటిసారిగా 1996లో దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఖలేదా జియా అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రధాని కుర్చీ వారిద్దరి మధ్య మారుతూ వచ్చింది.నిరసనలు ఇలా... జూన్ 5: స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ కోర్టు తీర్పు జూన్ 6: యూనివర్సిటీల్లో మొదలైనఆందోళనలు. దేశమంతటికీ వ్యాప్తి.జూన్ 7: విద్యార్థుల రహదారుల దిగ్బంధం జూన్ 15: పెరిగిన నిరసనల తీవ్రత జూలై 15: హింసాత్మకంగా మారిన నిరసనలు జూలై 18: ఆందోళనలు తీవ్రరూపం..19 మంది మృతి. కర్ఫ్యూ, రంగంలోకి సైన్యం జూలై 19: దేశమంతటా హింసజూలై 21: కోటాను 5 శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఆగస్ట్ 3: మృతి చెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మళ్లీ నిరసనలు ఆగస్ట్ 4: దేశవ్యాప్త ఆందోళనల్లో మరో 100 మందికి పైగా మృతి. న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం. అయినా చల్లారని జనాగ్రహం ఆగస్ట్ 5: ప్రధాని షేక్ హసీనా రాజీనామా. దేశం విడిచి పలాయనం భారత్‌పై ప్రభావం ఎంత?! బంగ్లా్లదేశ్ సంక్షోభం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. హసీనా తొలి నుంచీ భారత్‌కు గట్టి మద్దతుదారు. ఆమె హయాంలో 15 ఏళ్లుగా ద్వైపాక్షిక బంధం నానాటికీ దృఢమవుతూనే వస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని భారత వ్యతిరేకుల నోళ్లకు హసీనా గట్టిగా తాళం వేశారు. 2009లో ఆమె రెండోసారి గద్దెనెక్కినప్పుడు యూపీఏ–2 మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నారు. ఆ ఐదేళ్లలో ఇరు దేశాల బంధం గట్టిపడింది. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక సంబంధాలు మరింతగా బలపడుతూ వచ్చాయి. మన ప్రబల ప్రత్యర్థి చైనాకు బంగ్లాదేశ్ మరీ దగ్గరవకుండా ఉండేందుకు పలు అంశాల్లో బంగ్లాకు ఇతోధికంగా సాయపడుతూ వచి్చంది. ఖలీదా జియా హయాంలో ఇరు దేశాల మధ్య మనస్ఫర్ధలు తలెత్తాయి. భారత వ్యతిరేకతే జియా ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉంటూ వస్తోంది కూడా! బంగ్లాదేశ్ మేలు కంటే హసీనా, అవామీ లీగ్ రాజకీయ ప్రయోజనాల పరిరక్షణే భారత్‌కు ప్రధానమని ఆ దేశంలో ఒక వర్గంలో ఉన్న అభిప్రాయానికి ఆమె గట్టి సమర్థకురాలు. జియా హయాంలో ఉల్ఫా తీవ్రవాదులు బంగ్లా కేంద్రంగా ఈశాన్య భారతంలో ధ్వంసరచన చేశారు. కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్‌లో సాగిన ‘బాయ్‌కాట్ భారత్’ ప్రచారానికి జియా, బీఎన్పీ నేతలు బాహాటంగా మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో జియా జైలు నుంచి విడుదలవడమే గాక సైన్యం దన్నుతో కూడిన మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించవచ్చన్న వార్తలు భారత్‌కు ఇబ్బందికరమే.పరిస్థితిని సమీక్షించిన మోదీబంగ్లా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ సారథ్యంలో భద్రతపై కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి సీతారామన్ భేటీలో పాల్గొన్నారు. బంగ్లాలో తాజా పరిస్థితిని మోదీకి జైశంకర్ నివేదించారు. సరిహద్దుల్లో అప్రమత్తత బంగ్లాదేశ్‌తో 4,096 కిలోమీటర్ల పొడవునా సరిహద్దుల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. బీఎస్ఎఫ్ హై అలర్ట్ జారీ చేసింది. అదనపు బలగాలను మోహరించారు. మన విద్యార్థులు వెనక్కి ..బంగ్లాదేశ్ సంక్షోభం నేపథ్యంలో అక్కడున్న భారత విద్యార్థులు పెద్ద సంఖ్యలో వెనక్కొస్తున్నారు. జూలై చివరికల్లా 2,894 మంది తిరిగొచ్చారు. మరో 3,000 మంది త్వరలో రానున్నట్టు అధికారులు వెల్లడించారు. -
ఉత్తరాఖండ్‌లో ఉద్రిక్తత
హల్ద్వానీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన మదరసా కూల్చివేతకు స్థానిక యంత్రాంగం ప్రయత్నించడం ఇందుకు కారణం. ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు వురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితు లను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు పట్టణంలో కర్ఫ్యూ విధించడంతోపాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని బన్భూల్పూర్ ప్రాంతంలో మదరసా, ప్రార్థనలకు వినియోగించే ఒక నిర్మాణం ఉన్నాయి. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా కట్టిన ఆ నిర్మాణాలను కూల్చివేసేందుకు గురువారం సాయంత్రం మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ మొదలైంది. అరగంటలోపే భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. కొందరు చుట్టుపక్కల భవనాలపైకెక్కి మున్సిపల్ సిబ్బంది, పోలీసులపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. సంఘటన స్థలంలో గుమికూడిన వారు రాళ్లు, కర్రలు, పెట్రోలు బాంబులు, దేశవాళీ తుపాకులతో అధికారులు, సిబ్బందిని ఆగ్రహంతో ప్రశ్నిస్తూ దాడికి యత్నించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. ఆందోళనకారుల ఒక గుంపు వెంటబడగా పోలీసులు సమీపంలోని పోలీస్‌స్టేషన్ లోపలికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న గుంపు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టింది. పోలీస్ స్టేషన్‌కు సైతం నిప్పుపెట్టేందుకు ప్రయత్నించగా లోపలున్న పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని నైనిటాల్ జిల్లా మేజిస్ట్రేట్ వందనా సింగ్ చెప్పారు. పోలీస్ స్టేషన్‌తోపాటు సిబ్బందిపై దాడికి యత్నించినట్లు గుర్తించిన సుమారు 20 మందిలో నలుగురిని అరెస్ట్ చేసి, మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురికి బుల్లెట్ గాయాలు, మరో ముగ్గురికి ఇతర గాయాల య్యాయని చెప్పారు. క్షతగాత్రులైన 60 మందిలో చాలా మంది ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారని ఎస్పీ(సిటీ) హర్బన్స్ సింగ్ చెప్పారు. ఒక జర్నలిస్ట్ సహా గాయపడిన ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. -
ఉత్తరాఖండ్‌లో హింస.. ఐదుగురు మృతి
డెహ్రాడూన్: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పర్యాటక రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో హింస చెలరేగింది. హల్ద్వానీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు కూల్చేందుఉకు వచ్చిన అధికారులు, పోలీసులపై స్థానికులు దాడికి దిగారు. ఈ దాడితో హింస చెలరేగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వందమందికిపైగా గాయపడ్డారు. ఘర్షణలను అదుపు చేసేందుకు ఖర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు కోర్టు ఇటీవల ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు కూల్చివేతల కార్యక్రమం మొదలు పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు అధికారులపై రాళ్లు రువ్వడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. రాళ్లు రువ్వుతూ ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో చిర్రెత్తిపోయిన ఆందోళనకారులు పోలీసు వాహనాలను ధ్వంసంచేసి పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టారు. అల్లర్లు కొంతవరకు అదుపులోకి వచ్చిననప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. హల్ద్వానీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ శుక్రవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఇదీ చదవండి.. లైవ్‌లో మాట్లాడుతుండగానే శివసేన నేత హత్య -
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస
ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసు దుస్తుల్లో వచ్చిన దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో తౌబల్‌తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. దాంతో ఆగ్రహించిన ఒక వర్గం వారు నాలుగు కార్లకు నిప్పుపెట్టారు. కార్లు ఎవరివనే విషయం తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటనను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. దోషులను పట్టుకుని, చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్‌లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. -
Manipur Violence: మళ్లీ మణిపూర్‌లో హింస
ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో రావణకాష్టంగా మారుతున్న మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. శుక్రవారం అర్ధరాత్రిదాటాకా బిష్ణుపూర్ జిల్లాలో ఓ వర్గం వారిపై జరిగిన దాడిలో తండ్రీకుమారుడు, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. క్వాక్టా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాత్రి గాఢ నిద్రలో ఉండగా ఆందోళనకారులు వీరిపై కాల్పులు జరిపి తర్వాత కత్తులతో నరికారు. చురాచాంద్‌పూర్ ప్రాంతం నుంచి వచ్చిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. తమ వారి మరణంతో ఆగ్రహించిన స్థానికులు ప్రతీకారం తీర్చుకునేందుకు చురాచాంద్పూర్కు బయల్దేరబో యారు. వీరిని భద్రతాబలగాలు అడ్డుకున్నాయి. అయితే దాడికి ప్రతీకారంగా ఉఖా తంపాక్ పట్టణంలో పలువురి ఇళ్లను నిరసనకారులు తగలబెట్టారు. శనివారం ఉదయం మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీసుసహా ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. మళ్లీ హింసాత్మక ఘటనలు పెరగడంతో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని పాలనా యంత్రాంగం కుదించింది. బంద్ ప్రశాంతం మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక ఘటనలను నిరసిస్తూ శాంతి నెలకొనాలంటూ 27 శాసనసభ స్థానాల సమన్వయ కమిటీ ఇచ్చిన 24 గంటల సాధారణ బంద్ ఇంఫాల్ లోయలో జనజీవనాన్ని స్తంభింపజేసింది. శనివారం దాదాపు అన్ని ప్రాంతాల్లో వ్యాపారాలు, స్కూళలు మూతబడ్డాయి. అల్లర్లతో అవస్థలు పడుతున్న జనాన్ని మరింత ఇబ్బందిపెట్టడం మా ఉద్దేశం కాదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ బంద్’ అని సమన్వయ కమిటీ ఎల్.వినోద్ స్పష్టంచేశారు. కుకీ మిలిటెంట్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చాన్నాళ్ల తర్వాత చర్చలు పునరుద్ధరించబడిన తరుణంలో అల్లర్లు మొదలవడం గమనార్హం. మరోవైపు శాంతిస్థాపనకు చర్యలు చేపట్టాలని స్థానిక తెగల నేతల ఫోరం(ఐటీఎల్ఎఫ్) విజ్ఞప్తిచేసింది. -
పులి భయంతో హడలిపోతున్న గ్రామాలు..దెబ్బకు కర్ఫ్యూ, పాఠశాలలు మూసివేత
పులి భయంతో రెండు గ్రామాలు వణికిపోత్నున్నాయి. ఇద్దరు వ్యక్తులపై పులి దాడి చేసి చంపేయడంతో మరింత ఎక్కువైంది. దీంతో యంత్రాంగం కదిలి వచ్చి గ్రామంలో కర్ఫ్యూ విధించి, అంగన్ వాడిలు, పాఠశాలలను మూసివేయాలని ప్రకటించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోనిచోటు చేసుకుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్‌లోని రిఖానిఖాల్, ధూమాకోట్ తహసీల్ గ్రామాలు పులి భయంతో హడలిపోతున్నాయి. అదీగాక ఇటీవల ఇద్దరు వ్యక్తులను పులి హతమర్చాడంతో దెబ్బకు పౌరీ గర్హ్వల్ జిల్లా యంత్రాంగం కదిలి వచ్చి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. అలాగే ఆయ ప్రాంతాల్లోని అంగన్వాడీలు, పాఠశాలలను ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 18 వరకు మూసివేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను జారీ చేసింది. యంత్రాంగం ఆదేశాల మేరకు ధుమాకోట్, రిఖానిఖాల్ తహసీల్దార్లను పులి ప్రభావిత ప్రాంతాల్లో క్యాంప్ చేసి పులిబారినపడే అవకాశం ఉన్న కటుంబాలను, ఇళ్లను గుర్తించాలని సూచించింది. కాగా, లాన్స్‌డౌన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దలీప్ రావత్ ఈ ప్రాంత నివాసితులకు భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కోరారు. (చదవండి: భార్యను పాము కాటేస్తే..ఆ భర్త చేసిన పనికి వైద్యులు నివ్వెరపోయారు) -
ముంబైలో నిషేధాజ్ఞలు.. కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు
సాక్షి, ముంబై: నగరంలో పోలీసులు నిషేధాజ్ఞల కొనసాగింపుకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండేందుకే ముందస్తుగా ముంబై పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజా జీవనానికి విఘాతం కలిగే అవకాశం ఉందని, ప్రాణ-ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు.. గత మూడు నెలలుగా ఈ ఆదేశాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో.. బహిరంగ సమావేశాలు, సామూహిక ప్రదర్శనలు, ఇతర వేడుకలకు ఎక్కువగా అనుమతులు ఇవ్వడం లేదు. తాజాగా కర్ఫ్యూ, 144 సెక్షన్.. వివాహ కార్యక్రమాలు, అంత్యక్రియలకు వర్తించబోవని ముంబై నగర పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ముంబైలో ఈ మధ్య చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముందస్తుగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు డీసీపీ విశాల్ థాకూర్. కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు.. డిసెంబర్ 17వ తేదీ వరకు అమలు ఉంటుందని ముంబై పోలీసులు తెలిపారు. ఆ తర్వాత దానిని పొడగించే విషయంపై ఆలోచిస్తామని తెలిపారు. ఈ పదిహేను రోజుల పాటు రోడ్లపై ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడం, ఊరేగింపులు, మైకుల్లో ప్రచారాలు.. ప్రసంగాలు, సంగీత వాయిద్యాల ప్రదర్శన, మతపరమైన ర్యాలీలు.. ప్రదర్శనలు, రోడ్లపై బాణాసంచా పేల్చడం.. ఇలాంటి వాటిపై నిషేధం అమలు కానుంది. ఇక.. బహిరంగంగా ఆయుధాల ప్రదర్శన కూడా నిషేధమని(డిసెంబర్ 4వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ దాకా) తెలిపారు. వివాహాలు, అంత్యక్రియలు, సినిమా థియేటర్లు, కంపెనీలు.. క్లబ్బుల కీలక సమావేశాలకు మాత్రం అనుమతులు ఇస్తారు. అలాగే కోర్టులు, కార్యాలయాలకు, విద్యాసంస్థలకు కర్ఫ్యూ, 144 సెక్షన్ నుంచి మిహానయింపులు ఇచ్చారు. -
BJP MLA Raja Singh: అరెస్ట్.. టెన్షన్
సాక్షి, హైదరాబాద్ /చార్మినార్/అబిడ్స్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గురువారం మరోసారి అరెస్ట్ చేయడంతో ధూల్‌పేట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం వెస్ట్‌జోన్ పోలీసులతో పాటు టాస్‌్కఫోర్స్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజాసింగ్ ఇంటి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజాసింగ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయనను అరెస్ట్ చేశారు. ధూల్‌పేటతో పాటు గోషామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చార్మినార్ వద్ద బలగాల పహారా రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. కొంతమంది బీజేపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై వచ్చి దుకాణాలను మూసివేయించగా పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా మూసివేశారు. ఫీల్‌ఖానా, బేగంబజార్, కోల్సివాడి, ఛత్రి, మిట్టికాషేర్, సిద్దిఅంబర్ బజార్, బర్తన్‌బజార్ ప్రాంతాల్లో దాదాపు వెయ్యిమంది వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. రాజాసింగ్ అరెస్టుతో ఎంజే మార్కెట్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులు దహనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మజ్లిస్, టీఆర్ఎస్లు కక్షతోనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. బేగంబజార్, జాంబాగ్, ధూల్‌పేట్, మంగళ్‌హాట్, చుడీబజార్ తదితర ప్రాంతాల్లో ప్రజలు రాజాసింగ్ అరెస్టుపై చర్చించుకోవడం కనిపించింది. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రాజాసింగ్ అభిమానులు ఈ రోజు గడిస్తే చాలు! శుక్రవారం.. సాధారణ పరిస్థితుల్లోనే నగర పోలీసులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాంటిది ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం పాతబస్తీలోనే కాకుండా నగర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరం సోమవారం రాత్రి నుంచి అట్టుడుకుతోంది. గురువారం సాయంత్రానికి సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వకూడదని నిర్ణయించారు. దక్షిణ, తూర్పు, పశ్చిమ మండలాల్లోని పోలీసు స్టేషన్ల పరిధితో పాటు మిగిలిన చోట్లా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. బేగం బజార్లో భారీగా మోహరించిన పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు.. బారికేడ్లు, సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పికెట్ల వద్ద ఉన్న సిబ్బందికి తోడు అత్యవసర సమయాల్లో వి«నియోగించడానికి స్టైకింగ్ ఫోర్స్ టీమ్స్‌ను సిద్ధం చేస్తున్నారు. సమస్యాత్మక వ్యక్తుల కదలికలను కనిపెట్టి, వెంబడించడానికి మఫ్టీల్లో ఉండే షాడో పారీ్టలు ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి నగరంలోని ఏ ప్రాంతానికైనా తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్‌లో ఉంచారు. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల వెంట కొన్ని రిజర్వ్ టీమ్స్ ఉంటాయి. ఇవి సదరు అధికారి వెంటే ఉంటూ అవసరమైన చోటకు వెళ్తాయి. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అణువణువు నిఘా ఉంచి, చిత్రీకరించడానికి వీడియో, డిజిటల్ కెమెరాలతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. పీస్ కమిటీలతో పోలీసులు ముందుకు వెళ్తున్నారు. అత్యంత అప్రమత్తంగా.. బందోబస్తు, భద్రత ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలోని ప్రాంతాలతో పాటు మిగిలిన చోట్లా అత్యంత అప్రమత్తత ప్రకటించారు. దీనికి సంబంధించి కమిషనర్ గురువారం విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి నగర అధికారులతో పాటు బందోబస్తు కోసం జిల్లాలు, ఇతర విభాగాల నుంచి వచ్చిన అధికారులు హాజరయ్యారు. ఇందులో శుక్రవారం అమలు చేయాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. అత్యంత సున్నిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న దక్షిణ, తూర్పు, పశ్చిమ మండలాలతో పాటు సోమవారం రాత్రి నుంచి నిరసనలు చోటు చేసుకున్న చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లోని దృశ్యాలను కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద కదలికలు ఇతర వ్యవహారాలను పసిగట్టడానికి వీటిని ఉపయోగించనున్నారు. దీని కోసం కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. రాజాసింగ్ అరెస్టును నిరశిస్తూ దుకాణాలు మూసివేత బోసిపోయిన పాతబస్తీ: పాతబస్తీలో గురువారం ప్రశాంత వాతావరణం కనిపించింది. ఉదయం నుంచీ సాయంత్రం ఎలాంటి నిరసన కార్యక్రమాలు.. ఆందోళనలు జరగలేదు. శాలిబండ చౌరస్తా వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు మజ్లిస్ నాయకులతో పాటు ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన రోడ్లపైకి వచ్చి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దక్షిణ మండలం పోలీసులు లాఠీ చార్జి చేశారు. విషయం తెలుసుకున్న శాలిబండ మజ్లిస్ కార్పొరేటర్ ముజఫర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా.. రెండు మూడు రోజులుగా పాతబస్తీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చార్మినార్ వద్ద సందర్శకుల సందడి తగ్గింది. చిరు వ్యాపారాలు వెలవెలబోయాయి. నయాపూల్, మదీనా, మీరాలంమండి, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్, లాడ్‌బజార్ తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పాతబస్తీలో ఎలాంటి నిరసన ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ప్రాంతాలను బట్టి ఏర్పాట్లు.. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ బందోబస్తులో ప్రాంతాల స్థితిగతులను బట్టి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు, ఉద్రేకాలకు తావు లేని చోట్ల సాధారణ స్థాయి పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. రాజధానిలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, సోదాలు, నాకాబందీలు నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం రాత్రి నుంచే ఇవి ప్రారంభం కానున్నాయి. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. కేవలం ప్రధాన రహదారులకే పరిమితం కాకుండా గల్లీలు, మారుమూల ప్రాంతాల్లోనూ చేపట్టాలని సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బుధవారం అర్ధరాత్రి, గురువారం తెల్లవారుజామున సైతం పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. రాజేష్ మెడికల్ హాల్ వద్ద పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. వీరిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వదిలిపెట్టారు. బుధవారం మొఘల్‌పురా వద్ద పోలీసు వాహనం ధ్వంసానికి సంబంధించి స్థానిక ఠాణాలో కేసు నమోదైంది. (చదవండి: రాజా సింగ్‌పై పీడీ యాక్ట్.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి?) -
జోద్‌పూర్‌లో ఉద్రిక్తతలు.. ఇంటర్నెట్ సేవలు బంద్
జోథ్‌పూర్/జైపూర్: రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ సొంతూరు జోద్‌పూర్‌లో మత ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేయాల్సి వచ్చింది. జలోరి గేట్ ఏరియాలో సోమవారం అర్ధరాత్రి కాషాయ జెండాలను తొలగించి ముస్లిం జెండాలను ఏర్పాటు చేశారన్న వార్తలతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంగళవారం ఉదయం ఈద్గా వద్ద ప్రార్థనల తర్వాత జలోరి గేట్ ఏరియాలో దుకాణాలు, వాహనాలు, నివాసాలే లక్ష్యంగా మళ్లీ రాళ్ల వాన కురిసింది. దాంతో లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగం జరిగాయి. ముగ్గురు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ముందు జాగ్రత్తగా 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం అర్ధరాత్రి దాకా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతోపాటు నిషేధాజ్ఞలు విధించారు. ఉద్రిక్తతలకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను గహ్లోత్ ఆదేశించారు. ఇప్పటి వరకు 50 మందిని అదుపులోకి తీసుకున్నారని హోం మంత్రి రాజేంద్ర యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ విమర్శించింది. ఈ గొడవల్లో ఒకరు కత్తిపోట్లకు గురై మృత్యువుతో పోరాడుతున్నాడని, దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేయజూశారని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆరోపించారు. చదవండి: (Navneet Rana: నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్) -
నవమి వేడుకల్లో ఘర్షణలు
భువనేశ్వర్/అహ్మదాబాద్/రాంచీ: దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన శ్రీరామనవమి వేడుకల సమయంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లోని లోహర్‌దాగాలో జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోగా 12 మంది గాయపడ్డారు. గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లా ఖంభట్‌లో జరిగిన గొడవల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో అల్లర్లు చెలరేగాయి. నగరంలో కర్ఫ్యూ విధించి, 80 మందిని అరెస్ట్ చేశారు. రామనవమి ఊరేగింపుపై రాళ్లు విసిరిన దుండగులకు చెందినవిగా గుర్తించిన 50 వరకు అక్రమంగా నిర్మించిన నివాసాలు, దుకాణాల కూల్చివేత ప్రారంభించినట్లు అధికారులు తెలిపా రు. వదంతులకు కారణమైన నలుగురు ప్రభుత్వాధికారులపై చర్యలుంటాయన్నారు. అల్లర్ల సందర్భంగా ఖర్గోన్ పోలీస్ సూపరింటెండెంట్ సిద్ధార్థ చౌధరికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతోపాటు మరో ఆరుగురు పోలీసులు సహా 24 మంది గాయపడ్డారు. దోషులను గుర్తించి వారి ఆస్తులను స్వా ధీనం చేసుకుంటామని సీఎం శివరాజ్ తెలిపారు. జార్ఖండ్‌లోని లోహర్దాగా జిల్లా హిర్హి గ్రామంలో నవమి ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరు చనిపోగా 12 మంది గాయపడ్డారు. మసీదుపై కాషాయ జెండా బిహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ జిల్లా మొహమ్మద్పూర్ ఆదివారం ఒక వ్యక్తి మసీదు ప్రవేశద్వారంపై కా షాయ రంగు జెండా ఎగుర వేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది చూస్తూ కత్తులు, హాకీ స్టిక్కులు పట్టుకుని బైక్‌లపై వచ్చిన వ్యక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా వీడియోలో ఉంది. విద్వేషం, హింస దేశాన్ని బలహీనపరుస్తాయని, ప్రజలంతా సోదరభావంతో ఐకమత్యంతో మెలగాలని రాహుల్ గాంధీ కోరారు. -
వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేతకి నో!
ఆప్ సర్కార్ వర్సెస్ ఎల్జీ మరోసారి తెర మీదకు వచ్చింది. వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఒక ప్రతిపాదనతో పాటు కొవిడ్ ఆంక్షల్ని సవరించాలన్న విజ్ఞప్తిని సైతం ఆయన తోసిపుచ్చారు. కేసుల సంఖ్య ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కుదరదని లెఫ్టినెంట్ గవర్నర్ తేల్చేశారు. అయితే 50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్ని నిర్వహించుకోవడానికి మాత్రం ఎల్జీ అనుమతి ఇచ్చారు. కేసుల సంఖ్య తగ్గి, పరిస్థితి మెరుగైనప్పుడే ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం సబబుగా ఉంటుందని ఎల్జీ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వారంగా పాజిటివిటీ రేట్‌తో పాటు కేసులు తగ్గాయని, ప్రజల-వ్యాపారుల ఆర్థిక అవసరాల దృష్ట్యా వారంతపు కర్ఫ్యూను ఎత్తేయాలని ఆలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. దేశ రాజధాని రీజియన్‌లో జనవరి 1వ తేదీ నుంచి సరిబేసి విధానంలో మార్కెట్లను నిర్వహించుకోవచ్చని, అలాగే జనవరి 7వ తేదీన వీకెండ్ కర్ఫ్యూలను ప్రకటిస్తూ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోషియేషన్, సదర్ బజార్ ట్రేడర్స్, ఇతర మార్కెట్ అసోషియేషన్లు.. సరిబేసి విధానం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ఆర్థికంగా ప్రభావం చూపడంతో పాటు ఉద్యోగాలు పోతున్నాయంటూ వాపోతూ ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్నాయి. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తయారు చేసి ఆమోదం కోసం ఎల్జీకి పంపింది. ఇదిలా ఉంటే కర్ణాకటలో ఓపక్క వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయగా.. తమిళనాడులో వీకెండ్లో పూర్తిగా లాక్డౌన్, మిగతా రోజుల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. -
Weekend Curfew: బెంగళూరులో నిశ్శబ్దం
సాక్షి, శివాజీనగర (బెంగళూరు): కరోనా వారాంతపు కర్ఫ్యూ రెండో రోజు కూడా రాష్ట్రంతో పాటు బెంగళూరులో నిశ్శబ్దం నెలకొంది. మహమ్మారి నియంత్రణ కోసం గత వారం నుంచి వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేయడం తెలిసిందే. శని, ఆదివారాలు సంక్రాంతి, కనుమ సంబరాల సందడి తక్కువగానే కనిపించింది. వ్యాపార సముదాయాలు, థియేటర్లు మూతపడడంతో నగరాలు బోసిపోయాయి. కూరగాయలు, ఔషధాలు, పాలతో పాటు అత్యవసర సేవలే అందుబాటులో ఉన్నాయి. దూర ప్రాంతాలకు మాత్రం తక్కువగా కేఎస్ఆర్టీసీ బస్సులు సంచరించాయి. బెంగళూరు బస్టాండులో పెద్దసంఖ్యలో బస్సులను నిలిపివేశారు. బెంగళూరులో జనసందడి ప్రాంతాలైన కే.ఆర్.మార్కెట్, శివాజీనగర, చిక్కపేట, ఎన్పీ రోడ్డు, జయనగరతో పాటు పలు మార్కెట్లు బంద్ అయ్యాయి. చదవండి: (Hyderabad-Lockdown: మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్ పరిస్థితి) -
అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్
-
ఢిల్లీలో వీకేండ్ కర్ఫ్యూ
-
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: భారత్‌లోనూ రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరిగిపోతోంది. వరసగా 8వ రోజు కేసుల సంఖ్య పెరిగింది. దేశ రాజధానిఢిల్లీలో ఒమిక్రాన్ వేరియెంట్ విస్తృతంగా వ్యాపిస్తూ ఉండడంతో శని, ఆదివారాల్లో కర్ఫ్యూ విధించాల ని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్టుగా ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం తెలిపారు. బస్సులు, మెట్రో రైళ్లు తిరిగి 100 శాతం సామర్థ్యంతో పని చేస్తాయన్నారు. బస్సులు, మెట్రోల కోసం వేచి చూసే వారు సూపర్ స్ప్రెడర్లుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 8.37%కు చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటూ ఉండడంతో కరోనా సోకింది. మరోవైపు పంజాబ్ రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలన్నీ మూసివేసింది. సినిమా హాల్స్, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. యూపీలో జనవరి 15 వరకు విద్యాసంస్థలను మూసివేశారు. 1892కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు గత 24 గంటల్లో దేశంలో 37,379 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య 1,892కి చేరుకుంది. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాష్ట్రాలకు, కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కోవిడ్ కాలంలో అనుసరించాల్సిన విధానాలు (కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్– సీఏబీ) తప్పక పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు. వ్యాక్సినేషన్ తక్కువ, కేసులు ఎక్కువ, మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రాలకు సహాయక బృందాలను పంపాలని, పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్ కల్లోల నేపథ్యంలో కరోనా పరిస్థితులపై ఆయన గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అందరం అప్రమత్తంగా, జాగరుకతతో ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ, ఆరోగ్య వసతుల కల్పన, ఔషధాలు, ఆక్సిజన్ లభ్యత, వెంటిలేటర్లు, ఆస్పత్రి బెడ్స్ లభ్యత, మానవ వనరులు, టీకా కార్యక్రమ పురోగతి తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వల్ల తలెత్తుతున్న పరిస్థితులను, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, అధిక కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలు, పాజిటివిటీ అధికంగా ఉన్న జిల్లాల సమాచారాన్ని ప్రధాని ముందుంచారు. నవంబర్ 25 నుంచి తీసుకున్న చర్యలను, అంతర్జాతీయ విమానప్రయాణికుల నూతన నిబంధనలు, రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశాల సారాన్ని ప్రధానికి వివరించారు. పర్యవేక్షణ అనంతరం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ తగిన సహాయం అందించాలని కేంద్ర అధికారులను మోదీ ఆదేశించారు. చదవండి: దేశం ఓ మైలు రాయిని అధిగమించింది! 60% జనాభాకు.. పీఎం ఆదేశాలివే.. ► కరోనాపై కేంద్రీకృత, సహకారయుక్త పోరు సాగించాలి. ► జిల్లాస్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలి. ► రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్ సదుపాయాలు, సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలి. ► టెలిమెడిసిన్, టెలి కన్సల్టేషన్ వంటి ఐటీ సాంకేతికతలను ఉపయోగించుకోవాలి. ► కేసుల సత్వర గుర్తింపుతో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలి. ► కాంటాక్ట్ ట్రాకింగ్ సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా వ్యాప్తిని అరికట్టే చర్యలపై శ్రద్ధవహించాలి. ► తక్కువ టీకా రేటు, ఎక్కువ కేసులున్న ప్రాంతాలకు బృందాలను పంపాలి. కరోనాపై కేంద్రీకృత, సహకారయుక్త పోరు సాగించాలి. జిల్లాస్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలి. రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్ సరఫరా యంత్రాంగం ఉండేలా, అవన్నీ సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలి. – ప్రధాని మోదీ -
ఒమిక్రాన్ టెన్షన్.. 2 రోజుల పాటు కర్ఫ్యూ
సాక్షి, ముంబై: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో రెండు రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. డిసెంబర్ 11, 12 రెండు రోజుల పాటు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజులు ఊరేగింపులు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని వెల్లడించారు. (చదవండి: రెండో డోసు పూర్తైన 9 నెలలకు బూస్టర్! ) ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా 33 ఒమిక్రాన్ కేసులుండగా.. ఒక్క మహారాష్ట్రలోనే 17 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కన్నా 2-4 రెట్లు అధిక ప్రమాదమే కాక.. వ్యాప్తి రేటు ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓతో సహా నిపుణులు హెచ్చరిస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: తీవ్రతపై త్వరలో స్పష్టత! -
మహారాష్ట్ర: అమరావతి జిల్లాలో 4 రోజులపాటు కర్ఫ్యూ
-
అమరావతిలో కర్ఫ్యూ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
సాక్షి, ముంబై: త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి. అమరావతి నగరంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు చేపట్టిన బంద్ సందర్భంగా హింస చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నాలుగు రోజులపాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా మూడు రోజులపాటు ఇంటర్నెట్ సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. త్రిపురలో మైనార్టీలపై దాడిచేసి, ఓ ప్రార్థనా మందిరాన్ని దుండగులు «ధ్వంసం చేశారన్న వార్తలతో అమరావతిలో శుక్రవారం ముస్లిం సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా దుకాణాలపై కొందరు రాళ్లు రువ్వి, ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. శుక్రవారం జరిగిన హింసను వ్యతిరేకిస్తూ శనివారం అమరావతి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ సందర్భంగా అల్లరి మూకలు దుకాణాలపై రాళ్లు రువ్వాయి. ఉదయాన్నే వందలాది మంది కాషాయం జెండాలు చేతబూని వీధుల్లోకి వచ్చారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్‌కమల్ చౌక్‌తోపాటు పలు ప్రాంతాల్లో దుకాణాలపై రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు చోటుచేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అమరావతి నగర పరిధిలో కర్ఫ్యూ విధించారు. నాందేడ్, నాసిక్, యావత్మల్ తదితర ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీజేపీ నేతలు బలవంతంగా దుకాణాలు మూసివేయించారు. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, హోంశాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ విజ్ఞప్తి చేశారు. అమరావతిలో బీజేపీ కార్యకర్తల బంద్ దృశ్యం -
కోవిడ్ ఎఫెక్ట్: ఉత్తరాఖండ్‌లో కర్ఫ్యూ పొడిగింపు
డెహ్రడూన్: కరోనా మూడో వేవ్ విజృంభిస్తుండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కర్ప్యూను సెప్టెంబర్ 14(మరోవారం) వరకు పొడిగించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం గతంలో విధించిన కర్ఫ్యూ సమయం సెప్టెంబర్ 7న ముగుస్తుండటంతో.. దాన్ని మరో వారం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ కట్టడిలో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం గతనెలలో రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, వినోద సమావేశాలను నిషేధించిన సంగతి తెలిసిందే. (చదవండి: మంత్రి గారు మాస్క్ ముఖానికి పెట్టుకోవాలి, అక్కడ కాదు..!) కర్ఫ్యూ అమలవుతున్నప్పటికి వ్యాక్సిన్లు వేయడం యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ కర్ఫ్యూ సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు ఉదయం 8 గంటలు నుంచి రాత్రి 9 గంటలు వరకు మాత్రమే పనిచేసేలా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చదవండి: మంచు నిండిన ఈ ప్రదేశానికి పచ్చిక భూమి అనే పేరేంటో! -
ఏపీలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగింపు..
సాక్షి,అమరావతి: కరోనా కట్టడి కోసం విధించిన నైట్ కర్ఫ్యూను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కొనసాగుతున్న ఈ కర్ఫ్యూను ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. కాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,088 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,535 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 2,075 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. -
ఆంధ్ర ప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
-
ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, అమరావతి : ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. ఆగస్టు 14 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. కాగా, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా వీలైనంత త్వరగా ఉపాధ్యాయులకు టీకా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో పాఠశాలలను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మే, జూన్, జూలై నెలల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 43,38,000 డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 మాత్రమే వినియోగించారని, ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా ముందుకు సాగుతుందన్నారు. -
సమర్థ నిర్వహణతో 11 లక్షల డోసులు ఆదా
మూడుచోట్ల వేగంగా చిన్నారుల ఆస్పత్రులు.. ► థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి. చిన్నారుల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో నిర్మించదలచిన పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలి. పోలీస్ బెటాలియన్లలో కోవిడ్ కేర్ ఎక్విప్‌మెంట్‌తోపాటు వైద్యులను నియమించాలి. కమ్యూనిటీ ఆస్పత్రులు స్థాయి వరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. సబ్ సెంటర్ల వరకు టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రావాలి. తద్వారా పీహెచ్‌సీల వైద్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోగులకు అందుబాటులోకి వస్తారు. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమర్థ వ్యాక్సినేషన్ ద్వారా ఎక్కువ మందికి కోవిడ్ టీకాలు ఇవ్వగలిగామని, దాదాపు 11 లక్షల డోసులు ఆదా చేయగలిగినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని చెప్పారు. 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యాక ప్రాధాన్యతగా ఉపాధ్యాయులకు టీకాలివ్వాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు 35 లక్షల వ్యాక్సిన్ డోసులు కేటాయిస్తే 4,63,590 డోసులను మాత్రమే వినియోగించుకున్నందున మిగిలిపోయిన కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్ అంక్షల్లో భాగంగా ఈ నెల 22వతేదీ నుంచి రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కోవిడ్, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్ధ నిర్వహణతో టీకాల ఆదా సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కువమందికి వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్ డోసులు 1,80,82,390. ఇంకా వినియోగించాల్సిన (బ్యాలెన్స్) డోసులు 8,65,500. ఇప్పటివరకు ఇచ్చిన డోసులు సంఖ్య 1,82,49,851. వ్యాక్సిన్లు వృథా కాకుండా సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపు 11 లక్షల డోసులు ఆదా చేయగలిగాం. విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. గత మే నెల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్ డోసులు 35 లక్షలు కాగా కేవలం 4,63,590 డోసులు మాత్రమే వినియోగం జరిగింది. అందువల్ల ఆ కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరతాం. గర్భిణిలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించి చురుగ్గా టీకాల కార్యక్రమాన్ని చేపట్టాలి. మరో వారం రాత్రి కర్ఫ్యూ కోవిడ్ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు చేయాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లపై.. రాష్ట్రంలో 50 పడకలు దాటిన ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు విషయంలో పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. కలెక్టర్లు సంబంధిత జిల్లాల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు ఈమేరకు ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఇన్సెంటివ్ ఇస్తోందని సీఎం చెప్పారు. సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్పర్సన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టి.కృష్ణబాబు, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఏ.బాబు, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఏ.మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ఇలా... – సోమవారం నాటికి యాక్టివ్ కేసులు 24,708 – పాజిటివిటీ రేటు 2.83 శాతం – 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు జిల్లాలు 8 – 3 – 5 శాతం పాజిటివిటీ రేటు జిల్లాలు 5 – రికవరీ రేటు 98.05 శాతం – నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పడకల్లో చికిత్స 94.19 శాతం – ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పడకల్లో చికిత్స 76.07 శాతం – 13వ విడత ఫీవర్ సర్వే పూర్తి – 104 కాల్ సెంటర్‌కు వస్తున్న రోజువారీ కాల్స్ 1000 లోపు బ్లాక్ ఫంగస్ తగ్గుముఖం.. –గత వారం నమోదైన కేసులు 15 – మొత్తం కేసులు 4075 –చికిత్స పొందుతున్నవారు 863 వ్యాక్సినేషన్.. –మొత్తం వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,41,42,094 –సింగిల్ డోసు పూర్తయినవారు 1,00,34,337 –రెండు డోసులు పూర్తయినవారు 41,07,757 -
ఏపీలో మరో వారంపాటు నైట్ కర్ఫ్యూ పొడిగింపు
-
ఏపీలో మరో వారంపాటు నైట్ కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం పాటు నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. ‘‘పోలీస్ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్ కేర్ ఎక్విప్మెంట్ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలి. కమ్యూనిటీ ఆస్పత్రులు స్ధాయివరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండాలి. అప్పుడే వారితో పీహెచ్‌సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి వస్తారు. కోవిడ్ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగించాలి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగించాలి. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని’’ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
మాస్కుల విషయంలో మరింత కఠినంగా ఏపీ ప్రభుత్వం
-
ఏపీ: అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు
సాక్షి, అమరావతి: అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సడలింపులు ఇచ్చారు. రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసివేత, 10 గంటల తర్వాత కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కోవిడ్ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందే. ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది. -
కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు ఆధారంగా కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పాజిటివిటీ రేటు ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి మినహా మిగతా 11 జిల్లాల్లో రాత్రి పది గంటల వరకూ కర్ఫ్యూ సడలించాలని అధికారులను ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు కల్పిస్తూ సాయంత్రం 6 గంటలకే దుకాణాలను మూసివేయాల్సిందిగా స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటు ఐదు శాతంలోపు వచ్చే వరకు ఈ రెండు జిల్లాల్లో ఆంక్షలు కొనసాగించనున్నట్లు తెలిపారు. మిగతా 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపులు అమలు చేస్తూ రాత్రి 9 గంటలకే దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. ఈ సడలింపులు ఈ నెల 8వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ అమలుపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. వ్యాక్సినేషన్‌పై మరింత శ్రద్ధ.. వ్యాక్సినేషన్‌పై మరింత ధ్యాస పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 45 సంవత్సరాలు దాటిన వారికి చేపడుతున్న వ్యాక్సినేషన్ 90 శాతం పూర్తైన తర్వాత ఉపాధ్యాయులు, మిగిలిన వారికి టీకాలు ఇవ్వాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వ్యాక్సినేషన్ చేపట్టినందున ఐదేళ్లు దాటిన పిల్లలున్న తల్లులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రాధాన్యతల ప్రకారం విభాగాల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి కావాలని, గర్భిణిలకూ టీకాలు ఇవ్వాలని ఆదేశించారు. రెండు నెలల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల పనులు పూర్తి రెండు నెలల్లోగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల పనులు ఉత్పత్తి సామర్ధ్యంతో పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు వివరాలను అధికారులు తెలియచేశారు. 97 చోట్ల జరుగుతున్న 134 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల పనుల ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు. 15 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టీ.కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, 104 కాల్ సెంటర్ ఇన్చార్జ్ ఎ.బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లిఖార్జున, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు తదితరులు హాజరయ్యారు. ఆదివారం నాటికి కోవిడ్ ఇలా – రాష్ట్రంలో రికవరీ రేటు 97.47 శాతం – పాజిటివిటీ రేటు 3.66 శాతం – ఐదు జిల్లాల్లో 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు – యాక్టివ్ కేసులు 35,325 – ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 6,542 – కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 5,364 – హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు 23,419 – నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పడకల్లో చికిత్స 93.40 శాతం – ప్రైవేటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పడకల్లో చికిత్స 76.26 శాతం – 104 కాల్ సెంటర్‌కు వచ్చిన కాల్స్ 703 బ్లాక్ ఫంగస్.. – ఇప్పటివరకు నమోదైన కేసులు 3,670 – గత 24 గంటలలో 33 కేసులు నమోదు – మరణించిన వారు 295 – ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినవారు 2075 వ్యాక్సినేషన్.. – ఇప్పటివరకు వ్యాక్సినేషన్ పూర్తైన వారు 1,28,84,201 – సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తైన వారు 96,25,316 – రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైన వారు 32,58,885 -
ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు
-
ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపుల్లో పలు మార్పులు ప్రకటించింది. తాజా నిబంధనల ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు సడలింపునిచ్చిన ప్రభుత్వం.. ఆయాచోట్ల రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేసింది. అదే విధంగా.. రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చింది. అయితే, సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండాలని ఆంక్షలు విధించింది. ఇక కోవిడ్ ప్రొటోకాల్స్‌తో రెస్టారెంట్లు, జిమ్స్, కల్యాణ మండపాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం... శానిటైజర్, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పని సరి అని పునరుద్ఘాటించింది. -
ఆంధ్రప్రదేశ్‌లో జూలై 7 వరకు కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో జూలై 7వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగించారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. మిగతా 9 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈమేరకు కలెక్టర్లు, పోలీస్ అధికారులు కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో కోవిడ్ పాజిటివీటీ రేటు 5 శాతం ఉన్న జిల్లాల్లో సడలింపు సమయాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ రోజుకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పాజిటివిటీ 5 శాతానికిపైగా ఉంది. దీంతో ఈ 5 జిల్లాల్లో సడలింపు సమయాన్ని తగ్గించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉండటంతో ఆ జిల్లాలో కూడా సడలింపు సమయాన్ని పెంచారు. దీంతో మిగిలిన 4 జిల్లాల్లో మాత్రమే కర్ఫ్యూ సడలింపును ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరిమితం చేశారు. -
ఆంధ్ర ప్రదేశ్ లో 8 జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు
-
Andhra Pradesh: 8 జిల్లాల్లో ఆంక్షలు సడలింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు ఐదు శాతం కన్నా తక్కువగా ఉన్న 8 జిల్లాల్లో జూలై 1 నుంచి వారం రోజుల పాటు కర్ఫ్యూ ఆంక్షలు సడలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అనంతపురం, గుంటూరు, వైఎస్సార్, కర్నూలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్నందున ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలించనున్నారు. ఈ జిల్లాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, తదితరాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం అమల్లో ఉన్న విధంగానే సాయంత్రం 6 గంటల వరకే కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈ ఐదు జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ సడలింపులు జూలై 1 నుంచి 7 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్‌పై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులకు 104 వైద్య సేవలు కోవిడేతర కేసులకూ 104 ద్వారా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. సీజనల్ వ్యాధులకూ 104 కాల్‌సెంటర్ ద్వారా వైద్య సేవలు అందాలని స్పష్టం చేశారు. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలతోపాటు 104 కూడా ఆరోగ్యశ్రీకి రిఫరల్ పాయింట్‌గా వ్యవహరించాలన్నారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులను నియమించామని, మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రతి వైద్యుడు నెలకు రెండుసార్లు గ్రామాల్లో పర్యటించాలని, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్‌నెస్ రెండూ ఉండేలా వ్యవహరించాలన్నారు. బాధితులకు సైకలాజికల్ కౌన్సిలింగ్ కోవిడ్ బాధితులకు 190 మంది సైకియాట్రిస్టులు, 16 మంది క్లినికల్ సైకాలజిస్ట్లతో కౌన్సిలింగ్ నిర్వహిస్తూ సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం సైకలాజికల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి మందులు కూడా అందిస్తున్నామని వెల్లడించారు. సైకలాజికల్ కౌన్సిలింగ్ సమర్ధంగా ఉండాలని సీఎం సూచించారు. థర్ఢ్ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే మూడు దఫాలు నిపుణులతో వెబినార్ నిర్వహించామని అధికారులు తెలిపారు. వెబినార్‌లో చర్చించిన అంశాలపై కొత్త వైద్యులకు కూడా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. టెలీమెడిసిన్ కూడా అందుబాటులో తెస్తున్నామని అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్పర్సన్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టి.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్, వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇన్చార్జ్ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఏ.మల్లిఖార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఆదివారం నాటికి కోవిడ్ ఇలా ► రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 44,773 ► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 7,998 ► కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 5,655 ► రికవరీ రేటు 96.95 శాతం ► పాజిటివిటీ రేటు 4.46 శాతం ► నెట్వర్క్ ఆస్పత్రులలో 93.62 శాతం బెడ్లలో ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స ► 104 కాల్ సెంటర్ ద్వారా వచ్చిన కాల్స్ 868 ► బ్లాక్ ఫంగస్ కేసులు 3,329 ► చికిత్స పొందుతున్నవారు 1,441 ► మృతి చెందినవారు 253 ► డిశ్చార్జ్ అయినవారు 1,635 -
ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు
-
ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా కరోనా పాజిటివిటీ రేటు ఆధారంగా సడలిపులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉండనుంది. రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత కొనసాగుతుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుంది. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సడలింపు జిల్లాలివే... అనంతపురం, కర్నూలు,గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం.తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు ఉంటుంది. ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తిస్తాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో పూర్తి సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై సీఎం జగన్ సమీక్ష కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలను ముఖ్యమంత్రికి వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 44,773 ఉన్నాయని, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 7998 ఉన్నారన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 5,655. రికవరీ రేటు 96.95 శాతం, పాజిటివిటీ రేటు 4.46 శాతం ఉందని తెలిపారు. 8 జిల్లాల్లో ప్రస్తుతం 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదయ్యిందన్నారు. గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, వైయస్సార్ కడప, అనంతపురం, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు జిల్లాలో 5 కంటే తక్కువ పాజిటివిటీ ఉందన్నారు. నెట్వర్క్ ఆస్పత్రులలో 93.62 శాతం బెడ్లు, ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. 104 కాల్ సెంటర్ ద్వారా వచ్చిన కాల్స్ 868 మాత్రమేనని అధికారులు వివరించారు. బ్లాక్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ కేసులు 3329 చికిత్స పొందుతున్నవారు 1441 మృతి చెందినవారు 253 డిశ్చార్జ్ అయినవారు 1635 ♦థర్ఢ్ వేవ్ సమాచారం నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలతో కార్యాచరణను సీఎంకు వివరించిన అధికారులు ♦థర్డ్‌వేవ్ వస్తుందన్న సమచారంతో ఇప్పటికే మూడు దఫాలుగా నిపుణులతో వెబినార్ నిర్వహించామన్న అధికారులు ♦కొత్త వైద్యులకు కూడా ఈ వెబినార్‌లో చర్చించిన అంశాలతో అవగాహన కలిగించాలన్న సీఎం ♦టెలీమెడిసిన్ కూడా అందుబాటులో తెస్తున్నామన్న అధికారులు సైకలాజికల్ కౌన్సిలింగ్ ♦కోవిడ్ బాధితులకు మానసిక నిపుణులతో సలహాలు, సూచనలు అందిస్తున్నామన్న అధికారులు ♦190 మంది సైకియాట్రిస్టులు, 16 మంది క్లినికల్ సైకాలజిస్టులుతో కౌన్సిలింగ్ ♦సీఎంకు వివరించిన అధికారులు ♦ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం సైకలాజికల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్న అధికారులు ♦అవసరమైన వారికి మందులు కూడా అందిస్తున్నామని వెల్లడి ♦దీన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించిన సీఎం ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే... : ♦ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు ♦కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో సడలింపు ♦8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపు ♦రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేయాలి ♦రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కొనసాగనున్న కర్ఫ్యూ ♦ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు ♦ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6వరకూ కర్ఫ్యూ ♦ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున నిర్ణయం ♦జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తింపు ♦పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈజిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం ధర్ధ్ వేవ్– సన్నద్ధత ♦కోవిడ్ థర్డ్ వేవ్ సమాచార నేపథ్యంలో 104 ద్వారా పిల్లలకు చికిత్స ♦24 గంటలూ అందుబాటులోకి పీడియాట్రిక్ టెలీ సేవలు ♦150 మంది పీడియాట్రిషియన్లు టెలీ సేవలు ♦ఇది ప్రారంభించే ముందు పీడియాట్రిషియన్ల అందరికీ శిక్షణ ఇప్పించాలి ♦దీనికోసం ఎయిమ్స్‌లాంటి అత్యుత్తమ సంస్ధల నిపుణుల సేవలను వినియోగించుకోవాలి ♦జిల్లాల్లో సంబంధిత జేసీలను కూడా 104 సేవల్లో భాగస్వామ్యం చేయాలి ♦వారి ఓనర్షిప్ ఉండాలి ♦అడ్మిషన్లు అవసరమైతే తక్షణమే స్పందించి వారికి బెడ్లు ఇప్పించాలి ♦దీనికి అనుగుణమైన వ్యవస్థను బలోపేతం చేయండి ♦కోవిడ్ యేతర కేసులకూ 104 ద్వారా ఈ పద్ధతుల్లో సేవలు అందాలి ♦సీజనల్ వ్యాధులకూ 104 కాల్‌సెంటర్ ద్వారా సేవలు అందాలి ♦విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలతోపాటు 104 కూడా ఆరోగ్యశ్రీకి రిఫరెల్ పాయింట్‌గా వ్యవహరించాలి ♦మనం ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులను నియమించాం ♦మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేశాం ♦ప్రతి వైద్యుడు నెలకు రెండుసార్లు గ్రామాల్లో పర్యటించాలి ♦ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్‌నెస్ రెండూ ఉండేటట్లు రన్ చేయాలి చదవండి: ‘హుజురాబాద్ ఎన్నిక కోసమే భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు’ -
తగ్గుతున్న కేసులు.. కుదుటపడుతున్న బతుకులు
విజయవాడ భవానీపురానికి చెందిన పరిమళ సత్యవతికి గుండె నిబ్బరం పెరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం.. పగటిపూట కర్ఫ్యూ సడలిస్తున్నారనే సంకేతాలు రావడమే దీనికి కారణం. గుడి వద్ద కొబ్బరి కాయలు అమ్మితే వచ్చే ఆదాయంతోనే నలుగురు సభ్యుల ఆ కుటుంబం బతుకుతోంది. కరోనా పుణ్యమాని ఏడాదిగా కొట్టు తెరిచే వీల్లేకుండా పోయింది. దమ్మిడీ ఆదాయం లేదు. ఇలాంటి చీకటి రోజుల్లోనూ తమ కుటుంబం అప్పుల పాలవ్వకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏదో ఒక సంక్షేమ పథకంతో తమను ఆదుకుందనే కృతజ్ఞత ఆమె మాటల్లో వ్యక్తమైంది. ఇంటిముందుకే వచ్చిన రేషన్ బియ్యంతో పొట్ట నింపుకున్నామని చెప్పిందామె. త్వరలోనే మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని.. తాము కోలుకుంటామని సత్యవతి విశ్వాసం వ్యక్తం చేసింది. చిగురిస్తున్న ఆశలు కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు, పగటిపూట కర్ఫ్యూ సడలిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని చిరు వ్యాపారుల పరిస్థితిని ‘సాక్షి’ బృందం పరిశీలించింది. ఏడాదికి పైగా వెంటాడుతున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోందనే ఆనందం కాయకష్టం చేసేవాళ్లలో స్పష్టంగా కన్పిస్తోంది. తోపుడు బండితో పొట్టపోసుకునే వాళ్లు, వీధివీధినా సైకిల్‌పై తిరిగి పండ్లు అమ్ముకునే వారు, రోడ్డు పక్కన టీ దుకాణం నడుపుకునే చిరు వ్యాపారులు.. ఇలా అందరిలోనూ త్వరలోనే కోలుకుంటామనే భరోసా కనిపిస్తోంది. ‘ఇన్నాళ్లకు పండగొచ్చినంత సంతోషంగా ఉందయ్యా’ అని చెప్పింది విజయవాడలోని బందరు రోడ్డులో టీకొట్టు నడిపే లక్ష్మి. ‘మళ్లీ పనికి పిలుస్తున్నారయ్యా... పట్నం వెళ్తాం’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది గుంటూరు జిల్లాలోని ఓ పల్లెకు చెందిన రేణుక. సడలని ధైర్యం అరకొర వ్యాపారం.. తెచ్చిన సరుకంతా పాడవడంతో తెచ్చిన పెట్టుబడి అప్పుగానే మిగిలిపోయిందని ఏడాది అనుభవాన్ని చెప్పాడు నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కనకయ్య. చిన్న హోటల్ నడిపే కనకయ్య ప్రతిరోజూ చేసిన వంటలు మిగిలిపోయి నష్టం జరిగిందన్నాడు. కరోనా తగ్గుతోందనే సంకేతాలు వస్తుండటంతో ఇప్పుడిప్పుడే కస్టమర్లు వస్తున్నారని చెప్పాడు. ఇక్కడ ఆసక్తికరమైన అంశమేమంటే ఆదాయం కోల్పోయినా.. ఆత్మ నిబ్బరం మాత్రం దెబ్బతినలేదని చాలామంది చెప్పారు. కష్టకాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పుణ్యమా అని బతికేందుకు కొంత డబ్బు అందిందని పలువురు చెప్పారు. మల్లేశ్వరరావు అనే రైతు కుటుంబానికి రైతు భరోసాతో పాటు పిల్లలను బడికి పంపినందుకు వచ్చే మొత్తం చేతికి అందింది. ఈ మధ్య ఆటో నడిపే కొడుక్కి సైతం ప్రభుత్వ సాయం అందిందని చెప్పాడు. బతుకు బాటలు తెరుచుకుంటున్నాయ్ సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న నమ్మకం పెరగడంతో చిరు వ్యాపారులు తిరిగి బతుకు బాటలు వేసుకుంటున్నారు. ఏడాదిగా మూలన పడ్డ తోపుడు బండ్లకు, రోడ్డు పక్కన హోటళ్లకు మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమయ్యారు. సత్యనారాయణపురంలో రోజుకు రూ.1,500 వరకూ సంపాదించే టీకొట్టు వ్యాపారి తన షాపును తీర్చిదిద్దాడు. భవానీపురంలో జయలలిత తన తోపుడు బండికి చిన్నా చితక రిపేర్లు పూర్తి చేయించి సిద్ధంగా పెట్టుకోవడం కనిపించింది. ఏలూరు దగ్గర పల్లెటూరికెళ్లిన రోజు కూలీలు మళ్లీ సింగ్‌నగర్‌లో అద్దె ఇల్లు వెతుక్కోవడం దర్శనమిచ్చింది. ‘నిర్మాణ పనులు మొదలు పెడదామని సేటు పిలిచాడు’ అని చెప్పాడు రోజువారీ కూలీ రాంబాబు. మంచి రోజులొస్తున్నాయ్ 68 ఏళ్ల వయసులోనూ సైకిల్‌పై ఊరూరూ తిరుగుతూ పండ్లు అమ్ముకుంటున్నాను. లాక్డౌన్ ముందు వరకూ రోజుకు రూ.వెయ్యి వరకూ గిట్టుబాటు ఉండేది. ఏడాదిగా పరిస్థితి తల్లకిందులైంది. తిండికీ, మందులకు ప్రభుత్వం పథకాల ద్వారా వచ్చే సొమ్ముతో నెట్టుకొచ్చాం. ఇప్పుడు మళ్లీ మంచి రోజులొస్తున్నాయని ఆనందంగా ఉంది.– సయ్యద్ దాదాసాహేబ్, అరటి పండ్ల వ్యాపారి, రవీంద్రపాడు గ్రామం కష్టం రాకుండా కరుణించాలి కరోనా ఏమో గానీ ఇస్త్రీ కొట్టుకు ఏడాదిగా తిప్పలొచ్చాయి. ఈ కొట్టు ఉంటేనే ఇంటిల్లిపాదికీ తిండి దొరికేది. కరోనా పోతోందనే తియ్యటి కబురు విన్నాను. దీని పీడ విరగడైతే కష్టాలు తగ్గుతాయి. మళ్లీ ఈ కష్టం రాకుండా చూడాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ కష్టంలోనూ జగన్ సర్కార్ మమ్మల్ని ఆదుకుంది. – లింగాల ప్రసాద్, దోబీ, తాడేపల్లి భరోసా పెరుగుతోంది కరోనా వల్ల హోటల్ వ్యాపారం తలకిందులైంది. షాపు తెరవకున్నా పని చేసేవాళ్ళకు డబ్బులివ్వాల్సి వచ్చింది. చేసిన వంటంతా పాడైనా నష్టాన్ని భరించి అప్పుల పాలయ్యాం. లాక్డౌన్ సడలిస్తున్న సంకేతాలు కొంత భరోసా పెంచుతున్నాయి. కరోనా తగ్గితే పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేయడమే మంచిది. – అనిమిరెడ్డి వెంకట్, హోటల్ వ్యాపారి, కృష్ణలంక -
ఏపీలో ఈనెల 30 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు
-
ఏపీ కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపు
-
ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. కర్ఫ్యూ సడలింపు ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు ఉండగా, ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కచ్చితంగా అమలు చేయనున్నారు. కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కర్ఫ్యూ సడలింపు ఇదివరకటి లాగే (ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మినహాయింపు) కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్ టైమింగ్స్ అమలు చేయాలని, ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. దుకాణాలను మాత్రం సాయంత్రం 5 గంటలకే మూసి వేయనున్నారు. కోవిడ్–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రుల్లో క్రయోజనిక్ ట్యాంకర్లు ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ యూనిటే కాకుండా క్రయోజనిక్ ట్యాంకర్లను పెట్టాల్సిందిగా సీఎం ఆదేశించారు. దీనివల్ల పూర్తి స్థాయిలో ఆక్సిజన్ సరఫరాకు భరోసా ఉంటుందన్నారు. వీటితోపాటు డి–టైప్ సిలెండర్లు కూడా ఉంచడం వల్ల మూడు ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రోగులకు ఆక్సిజన్ అందించడంలో సమర్థవంతమైన ప్రత్యామ్నాయ విధానాలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మించదలచిన 350 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనివల్ల మెడికల్ ఆక్సిజన్ విషయంలో రాష్ట్రానికి స్వయంసమృద్ధి వస్తుందని పేర్కొన్నారు. అవసరం లేని సమయంలో ఆ ప్లాంట్ నుంచి వచ్చే ఆక్సిజన్‌ను పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు. ప్రతి 100 బెడ్లు, ఆపై పడకలున్న ఆస్పత్రుల వద్ద 10 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకులను స్టోరేజీ కింద పెడుతున్నామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ నియంత్రణ చర్యలు, థర్డ్ వేవ్ సన్నద్ధత గురించి వివరించారు. ఈ సమావేశంలో ఉప మఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ ప్రస్తుత పరిస్థితి – మరణాల రేటును నియంత్రించడంలో ఏపీకి దేశంలో రెండో స్థానం. – పాజిటివిటీ రేటు 5.99 శాతం. రికవరీ రేటు 95.53 శాతాతం. మరణాల రేటు 0.66 శాతం. – యాక్టివ్ కేసులు ప్రస్తుతం 69,831. – అందుబాటులో 2,562 ఐసీయూ బెడ్లు. – అందుబాటులో 13,738 ఆక్సిజన్ బెడ్లు. మే 17న 433 మాత్రమే. – 12 వేలకు పైగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన జనరల్ బెడ్లు. మే 14న 4978 మాత్రమే. – కర్నూలు జిల్లాలో అతి తక్కువగా పాజిటివిటీ రేటు 2.58 శాతం, అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 12.25 శాతం. – ఆరోగ్య శ్రీ కవరేజీ ఆస్పత్రుల్లో 90.54 శాతం బెడ్లలో ఈ పథకం కింద రోగులకు చికిత్స. – కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు కేవలం 7,056 మాత్రమే. – 104 సెంటర్‌కు కోవిడ్ కాలంలో గరిష్టంగా 19,175 కాల్స్, ప్రస్తుతం 1582 కాల్స్. – రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,584 బ్లాక్ ఫంగస్ కేసులు, 185 మంది మృతి.. 966 మంది డిశ్చార్జ్. – థర్డ్‌వేవ్‌కు సన్నద్ధతలో భాగంగా జూలై 15 నాటికి రాష్ట్రానికి రానున్న 12,187 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు. – జూన్ 24 నాటికి రాష్ట్రానికి రానున్న 10 వేల డి టైప్ సిలిండర్లు. – 50 బెడ్లు, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటుకు చర్యలు. – జూలై 5 నాటికి రాష్ట్రానికి చేరనున్న మరో 20 ఐఎస్ఓ ట్యాంకర్లు. చదవండి: తగ్గిందని అలసత్వం వద్దు -
ఒక వేళ థర్డ్ వేవ్ వస్తే పూర్తి స్థాయిలో సన్నద్థం: సీఎం జగన్
-
జూన్ 20 తర్వాత ఏపీలో కర్ఫ్యూ సడలింపులు: సీఎం జగన్
-
జూన్ 20 తర్వాత ఏపీలో కర్ఫ్యూ సడలింపులు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జూన్ 20 తర్వాత కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈనెల 20 తర్వాత సడలింపులిస్తూ కర్ఫ్యూ కొనసాగుతుందని బుధవారం జరిగిన స్పందన సమీక్షలో తెలిపారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. ఏపీలో మూడున్నర కోట్ల మందిలో 69లక్షల మందికి సింగిల్ డోసు ఇచ్చినట్టు వెల్లడించారు. ఇప్పటివరకు 26,33,351 మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ వైద్య సేవలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. 89శాతం మంది కోవిడ్ బాధితులు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసుకున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 14 వేల మందికిపైగా కోవిడ్ వైద్య సేవలు పొందుతున్నారని సీఎం అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మొదటిసారి పెనాల్టీ, రెండోసారి ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులకు చెప్పారు. థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పిల్లల వైద్యం కోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని, విశాఖ, కృష్ణా-గుంటూరు, తిరుపతిలో చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు పిల్లలకు వైద్య సేవలందిస్తాయని ఆయన పేర్కొన్నారు. (చదవండి: జానకినందన్ జయించాడు) -
ఏపీ: నేటి నుంచి మరో 10 రోజులు కర్ఫ్యూ
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరో పదిరోజుల పాటు కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా కర్ఫ్యూ లో మరో రెండుగంటలు సడలింపు ఇస్తున్నట్లు ఇప్పటికే తెలిపింది. తాజా నిర్ణయంతో సడలింపు సమయం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు వరకూ అమలు కానుంది. ఇదిలా ఉంటే రోజుకు పదహారు గంటల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగనుంది. కర్ఫ్యూ సమయంలో ఈ పాస్ ఉన్నవారికే ఏపీలోకి అనుమతి ఇస్తామని.. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్ఫ్యూ పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. చదవండి: ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు -
ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్టంలో కరోనా కట్టడికి కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కర్ఫ్యూ సమయంలో 144 సెక్షన్ యధావిధిగా కొనసాగనుంది. కాగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండనుట్లు సర్కార్ తెలిపింది. ఇక ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ యధాతధంగా కొనసాగుతున్నట్లు తెలిపింది. చదవండి: టెస్టులు, వ్యాక్సిన్‌లో ఏపీ సరికొత్త రికార్డు -
లాక్డౌన్ ఎత్తివేత.. రాత్రి కర్ఫ్యూ విధింపు
ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ పలు రాష్ట్రాల్లో ఎత్తి వేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేసి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, మేఘాలయలో లాక్డౌన్ విధిస్తూనే భారీగా సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బిహార్‌లో లాక్డౌన్ ఎత్తివేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు 50 శాతం మందితో పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం పగటిపూట కర్ఫ్యూ కొనసాగింది. తాజాగా పగటిపూట కర్ఫ్యూను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఎత్తివేశారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఉత్తర్వులు వెలువడ్డాయి. మధ్యప్రదేశ్‌లో ఈనెల 15 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరికొన్ని సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. లాక్డౌన్ ఎత్తివేసినా కరోనా నిబంధనలు మాత్రం కచ్చితంగా పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచించాయి. ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటిస్తే కరోనా మూడో దశ ముప్పు రాదని స్పష్టం చేశాయి. చదవండి: లాక్డౌన్ పొడిగింపు.. కానీ భారీ సడలింపులు -
20 వరకు కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో కర్ఫ్యూను ఈ నెల 20వతేదీ వరకు పొడిగిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంత వెసులుబాటు కల్పిస్తూ శుక్రవారం నుంచి కర్ఫ్యూ సడలింపు సమయాన్ని అదనంగా రెండు గంటల పాటు పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ నెల 10వతేదీ వరకు కర్ఫ్యూ నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్‌తో సడలింపు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కోవిడ్ కేసులు కొంత తగ్గుముఖం పట్టినందున కర్ఫ్యూ సడలింపు సమయాన్ని రెండు గంటలు పెంచనున్నారు. ఈ నెల 11 నుంచి ఇలా.. ఈ నెల 11వ తేదీ నుంచి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 144 సెక్షన్‌తో కర్ఫ్యూ సడలింపు వర్తిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచేందుకు అనుమతించనున్నారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ప్రజలు గుమికూడకుండా భౌతిక దూరం పాటిస్తూ కార్యకలాపాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ అధికార యంత్రాంగంతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు తగ్గి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ అలసత్వం వహించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. -
ఆంధ్ర ప్రదేశ్ లో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు
-
ఏపీలో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించింది. జూన్ 10 తర్వాత ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కర్ఫ్యూ సడలింపు సమయం పెంచారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయి. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈ నెల 10తో ముగియడంతో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం వైఎస్ జగన్.. మరో పది రోజులపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: 45 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సినేషన్: సుచరిత ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి -
మేలో కోటిన్నర మంది ఉపాధికి గండి
సాక్షి, అమరావతి: సెకండ్ వేవ్‌తో ఒక్క మే నెలలోనే కోటిన్నర మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా లాక్డౌన్/కర్ఫ్యూ పరిస్థితులు కొనసాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి తాజా నివేదిక వెల్లడించింది. ఆర్థిక కార్యకలాపాలు మందగించడంతో దేశంలో నిరుద్యోగిత రికార్డు స్థాయికి చేరుతుండటంతో పాటు, అసంఘటిత రంగంలో ఉన్న వారి ఆదాయంలో కోత పడింది. దేశంలో అసంఘటిత రంగంలో ఉన్న 1.75 లక్షల కుటుంబాలను సీఎంఐఈ సర్వే చేసి ఈ నివేదికను వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న ఏప్రిల్, మే నెలల్లో దేశంలో ఉపాధి అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి. ఏప్రిల్‌లో అసంఘటిత రంగంలో 39.08 కోట్ల మందికి ఉపాధి లభించగా, మేలో 37.55 కోట్ల మందికే ఉపాధి దక్కింది. ఉద్యోగిత 3.90 శాతం తగ్గడంతో కోటిన్నర మంది ఉపాధి కోల్పోయారు. జనవరి ఆఖరు నుంచి పట్టణాల్లో పెరుగుతూ వస్తున్న నిరుద్యోగిత.. మే 31 నాటికి రికార్డుస్థాయిలో 18 శాతానికి చేరుకుంది. -
కర్ఫ్యూ సడలింపు వేళల్లో సెక్షన్ 144
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కర్ఫ్యూను మరింత కట్టుదిట్టంగా అమలు చేసి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్ఫ్యూ సడలింపు సమయంలో(ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు) సెక్షన్ 144ను పటిష్టంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 10 వరకు కర్ఫ్యూ యథాతథంగా అమలు జరుగుతుందని, కర్ఫ్యూ సడలింపు వేళల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షాపులు, బజార్లు, రోడ్లపైన ప్రజలు గుమికూడవద్దని స్పష్టం చేశారు. కాగా, చేపల మార్కెట్లు, చికెన్ మార్కెట్లతో పాటు నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం షాపులకు వెళ్లే వారంతా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. -
కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి
-
విజయవాడ: కర్ఫ్యూ అమలను పరిశీలించిన సీపీ బత్తిన శ్రీనివాసులు
-
ఈ నెల 10 వరకు కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను జూన్ 10 వరకు కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల వ్యాక్సినేషన్‌కు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగ వీసాలపై విదేశాలకు వెళ్లే వారికి కూడా టీకాలు ఇచ్చి ధృవీకరణ పత్రాలు అందేలా చూడాలన్నారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ లేకున్నా బ్లాక్ ఫంగస్..! బ్లాక్‌ఫంగస్ బాధితులకు అందుతున్న వైద్యంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లు, మాత్రలు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు 1,179 నమోదు కాగా 1,068 మందికి వైద్యం అందుతోందని, 97 మందికి నయం అయిందని అధికారులు తెలిపారు. 14 మంది మరణించినట్లు వెల్లడించారు. కోవిడ్ సోకకున్నా బ్లాక్ ఫంగస్ వస్తుందన్న విషయం తమ పరిశీలనలో తేలిందని పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో 1,139 మంది కోవిడ్ సోకినవారు కాగా 40 మందికి కరోనా లేకున్నా బ్లాక్ ఫంగస్ వచ్చిందని తెలిపారు. డయాబెటిస్ ఉన్నవారికి అధికంగా వస్తోందని, కేంద్రం కేటాయింపులు ప్రకారమే ఇంజక్షన్లు వస్తున్నాయని వివరించారు. మాత్రలను అవసరమైన మేర సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంజక్షన్ల కోసం కూడా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిల్వ ట్యాంకులుండాలి... కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా, నిల్వలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఆక్సిజన్ వినియోగం 490 టన్నులకు తగ్గిందని అధికారులు వెల్లడించారు. మే 29వ తేదీన 654 టన్నులను సేకరించామని, స్థానికంగా 230 టన్నుల ఉత్పత్తి అయినట్లు తెలిపారు. ఆక్సిజన్ సేకరణ, నిల్వలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిల్వ చేసే ట్యాంకులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. సరైన పథకాల్లో మదుపు చేయాలి.. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన చిన్నారుల పేరిట సరైన పథకాల్లో డబ్బు మదుపు చేయడం ద్వారా ఆర్థిక భద్రతతోపాటు ప్రతి నెలా కనీస అవసరాల కోసం మెరుగైన వడ్డీతో డబ్బులు అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 92 మంది పిల్లలను ఇప్పటివరకూ గుర్తించామని, వీరిలో 43 మందికి రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేశామని అధికారులు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కేసులు తగ్గుముఖం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. ప్రతి పది లక్షల జనాభాకు పట్టణాల్లో 2632 కేసులు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 1859 కేసులు ఉన్నట్లు తెలిపారు. పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్నారు. మే 16న పాజిటివిట్ రేటు 25.56 శాతం ఉండగా 30వతేదీ నాటికి 15.91 శాతానికి తగ్గినట్లు చెప్పారు. ఒకదశలో రెండు లక్షలకుపైగా ఉన్న యాక్టివ్ కేసులు 1.6 లక్షలకు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడిందని, మే 7వతేదీన 84.32 శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం దాదాపు 90 శాతానికి చేరుకున్నట్లు వివరించారు. ఇక 104 కాల్‌సెంటర్‌కు మే 3వతేదీన 19,175 కాల్స్ రాగా 29వ తేదీన కేవలం 3,803 కాల్స్ మాత్రమే వచ్చాయని, కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందనేందుకు ఇది సంకేతమని పేర్కొన్నారు. – సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లిఖార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆయుష్ కమిషనర్ వి.రాములు తదితరులు పాల్గొన్నారు. -
కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవన్న ఏపీ ప్రభుత్వం
-
ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు
-
ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు యథాతథంగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌పై సమీక్ష చేపట్టారు. ఏపీలో నేటితో కర్ఫ్యూ ఆంక్షలు ముగియడంతో జూన్ 10 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన వారెప్పటికీ అనాథలు కారు..! -
విశాఖలో కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు
-
విజయవాడ లో కర్ఫ్యూ ఎలా నడుస్తోంది ?
-
ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలి
సాక్షి, విజయవాడ: కోవిడ్ సమస్యలన్నీ ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలని సీపీ స్పష్టం చేశారు. వచ్చే అంబులెన్స్‌లను పరిశీలించి అనుమతి ఇస్తున్నామన్నారు. మద్యం అక్రమ తరలింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సమస్యలు ఉన్నాయి. జీజీహెచ్‌లో అక్సిజన్ అయిపోయే ప్రమాదాన్ని అందరి సహకారంతో అరికట్టాం. పోలీసు శాఖలో 97 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది. బ్లాక్మార్కెట్లో ఇంజక్షన్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్మార్కెట్లో ఇంజక్షన్లను అమ్మే 12 గ్యాంగ్‌లను పట్టుకున్నాం. విజయవాడ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుపై కేసులు నమోదు చేశాం. కరోనా కట్టడికి పెద్ద ఎత్తున ర్యాలీలు, అవగాహన కల్పించామని’’ సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు. చదవండి: తండ్రి పేరుతో సుక్కు ఆక్సిజన్ ప్లాంట్, ప్రారంభించిన మంత్రి ‘మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్‌కు కారణం’ -
Liquor Sales Dip: తగ్గిన మద్యం అమ్మకాలు
సాక్షి, అమరావతి: మద్యం మీద వచ్చే ఆదాయం కంటే ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇందుకు కర్ఫ్యూ కూడా తోడవ్వడంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. బెల్టు షాపులను తొలగించడం, అక్రమ మద్యం విక్రయాలను, రవాణాను అడ్డుకోవడం, అమ్మకాల సమయం కుదించడం.. తదితర చర్యల ద్వారా దశలవారీ మద్యపాన నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పుడు కర్ఫ్యూ కోసం మద్యం దుకాణాల సమయాలను మరింతగా కుదించారు. దీంతో ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు రాష్ట్రంలో బీరు, లిక్కర్ కలిపి మొత్తం 21,31,558 కేసులు విక్రయించగా.. మే నెలలో 1 నుంచి 23 వరకు 16,74,343 కేసులే అమ్ముడయ్యాయి. తద్వారా మద్యం అమ్మకాలు 21.45 శాతం మేర తగ్గినట్లు తేలింది. దిగిన బీరు, లిక్కర్.. సాధారణంగా వేసవిలో బీరు విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం బీరు అమ్మకాల్లో భారీ తగ్గుదల నమోదైంది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మద్యం దుకాణాలు, బార్లలో కలిపి రోజుకు సగటున 28,184 బీరు కేసులు విక్రయించగా.. మే నెలలో కర్ఫ్యూ అమలైన 5వ తేదీ నుంచి 23 వరకు రోజుకు సగటున 13,423 బీరు కేసులే అమ్ముడయ్యాయి. తద్వారా బీరు అమ్మకాల్లో 52.37 శాతం తగ్గుదల నమోదైందని అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ అమ్మకాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మద్యం దుకాణాలు, బార్లలో కలిపి రోజుకు సగటున 63,455 లిక్కర్ కేసులు విక్రయించగా.. మే నెలలో 5 నుంచి 23 తేదీ వరకు రోజుకు సగటున 56,665 కేసుల అమ్మకాలే జరిగాయి. తద్వారా లిక్కర్ అమ్మకాలు 10.70 శాతం తగ్గినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలో ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. ఏప్రిల్‌లో 1 నుంచి 23 వరకు మద్యం అమ్మకాలతో రూ.1,531.97 కోట్లు వచ్చింది. మే నెలలో 1 నుంచి 23వ తేదీ వరకు రూ.1,318.17 కోట్ల ఆదాయమే వచ్చింది. అంటే దాదాపు 14 శాతం మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. -
దారుణం: పోలీసుల దెబ్బలకు బాలుడి మృతి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవో జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోవిడ్ నిబంధనలు అత్రికమించడనే కారణంతో పోలీసులు కొట్టిన దెబ్బలకు 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు బాలుడి మృతికి కారణమైన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ఒక హోంగార్డును విధుల నుంచి తొలగించారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మే 24 ఉదయం 7 గంటల వరకు రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూను విధించింది. ఈ క్రమంలో బంగర్మౌ పట్టణంలో మహ్మద్ ఫైసల్ అనే 17 ఏళ్ల బాలుడు శుక్రవారం మధ్యాహ్నం 3 తరువాత కర్ఫ్యూ సమయంలో మార్కెట్లో కూరగాయలు అమ్ముడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు పోలీసు విజయ్ చౌదరి, హోంగార్డ్ సత్యప్రదేశ్ బాలుడిని తీవ్రంగా కొట్టారు. పోలీసుల దాడిలో బాధితుడు స్పృహ కోల్పోడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతని పరిస్థితి మరింత క్షీణించడంతో వైద్యం నిమిత్తం బంగార్‌మౌలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే బాలుడు మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి ఇస్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకును పోలీసులు కొట్టి చంపారని ఆరపిస్తూ ఉన్నవో పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేశాడు. అంతేగాక బాలుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతిచెందిన బాధితుడి బంధువులు, స్థానికులు నిరసన చేపట్టారు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు బాలుడి మృతికి కారణమయిన కానిస్టేబుల్ విజయ్ చౌదరిని, సస్పెండ్ చేసి హోంగార్డ్ సత్యను తొలగించామని ఉన్నవో అదనపు పోలీస సూపరింటెండెంట్ శశి శేఖర్ తెలిపారు. చదవండి: బ్యుటీషియన్‌పై అత్యాచారం.. నటి బాడీగార్డ్‌పై కేసు -
కర్ఫ్యూ ఉల్లంఘించాడని పోలీసుల దాడి: బాలుడు మృతి
లక్నో: ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి పోలీసులు పగలు, రాత్రి శ్రమిస్తున్నారు. తమ విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అయితే కొంత మంది పోలీసుల చర్యలు ఆ శాఖకు మచ్చ తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ జిల్లాలకు చెందిన 17ఏళ్ల బాలుడిని కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ కానిస్టేబుల్ చితకబాదాడు. దీంతో ఆ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉన్నవ్ జిల్లాలోని బంగర్మౌ పట్టణంలో భట్పురి ప్రాంతానికి చెందిన 17ఏళ్ల బాలుడు తన ఇంటి బయట కూరగాయలు అమ్ముతున్నాడని స్థానిక పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. గాయాలకు తాళలేక బాలుడు సృహ తప్పి పడిపోయాడు. అతని పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల చర్యతో ఆగ్రహించిన స్థానికులు ధర్మాకు దిగారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా బాధితుడి కుటుంబాని పరిహారం చెల్లించి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. కాగా, దీనిపై స్పందించిన పోలీసు శాఖ.. ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక హోంగార్డును సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. ఇక కరోనా కేసులను అరికట్టడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మే24 ఉదయం 7 గంటల వరకు ‘కర్ఫ్యూ’ విధించిన విషయం తెలిసిందే. थाना बांगरमऊ क्षेत्रांतर्गत युवक की मृत्यु हो जाने के संदर्भ में संबन्धित के विरुद्ध की गई कार्यवाही के विषय में अपर पुलिस अधीक्षक उन्नाव द्वारा दी गई बाइट @Uppolice @dgpup @adgzonelucknow @Igrangelucknow pic.twitter.com/2TCyvaZMp7 — UNNAO POLICE (@unnaopolice) May 21, 2021 (చదవండి: Corona: ‘ఇండియన్ వేరియంట్’ కంటెట్ తొలగించండి) (చడవండి: 18 మిలియన్ల పోస్టులను తొలగించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) -
ఏపీ: 18వ రోజుకు కర్ఫ్యూ.. ఆంక్షలు మరింత కఠినతరం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ 18వ రోజుకు చేరుకుంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఆంక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను పోలీసులు తూచా తప్పక ఆచరిస్తున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏపీలోకి అనుమతించడం లేదు. ఈ పాస్ ఉన్న వారికే అనుమతి ఇస్తున్నారు. పెళ్లిళ్లు, శుభ,అశుభ కార్యాలకు పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిచిన వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. వాహనాలు సీజ్ చేసి ,కేసులు నమోదు చేస్తున్నారు. మాస్క్‌లు లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. 11-30 గంటలకే స్వచ్చందంగా వ్యాపార సంస్థలను మూసివేస్తున్నారు. మరో పది రోజులు ఇదే సహకారం అందించి కరోనా కట్టడికి సహకరించాలని పోలీసుల విజ్ఞప్తి చేస్తున్నారు. బాల కార్మికులు, వీధి బాలలపై ప్రత్యేక దృష్టి.. బాల కార్మికులు ,వీధి బాలాలపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. 8739 మందిని గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. 28 మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. 8724 మందిని తల్లితండ్రులకు అప్పగించారు. 15 మందిని ఛైల్డ్ కేర్ సెంటర్లకు తరలించారు. చదవండి: Cyclone Yaas: యాస్ తుపాను.. పలు రైళ్ల రద్దు ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్ -
సీఎం వై ఎస్ జగన్ ఆదేశాలను తూచా తప్పక ఆచరిస్తున్న పోలీసులు
-
విశాఖలో కఠినంగా కర్ఫ్యూ
-
ఆంధ్రప్రదేశ్‌లో మరింత కఠినంగా నిబంధనల అమలు
-
YS Jagan: నెలాఖరు దాకా కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ కట్టడిలో భాగంగా విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ నెల 5వతేదీ నుంచి 18 వరకు కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయించారు. మెరుగైన ఫలితాలు కనిపించాలంటే కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ అమల్లో ఉండాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయం, నిబంధనలను గతంలో మాదిరిగానే యథాతథంగా అమలు చేయాలని ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బ్లాక్ ఫంగస్‌కు ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స కోవిడ్ కారణంగా బ్లాక్ ఫంగస్ వ్యాధి బారినపడ్డ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. బ్లాక్ ఫంగస్‌ను ముందుగానే గుర్తించేందుకు ప్రోటోకాల్ సిద్ధం చేయాలని నిర్దేశించారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం వెంటనే అనుమతులు ఇచ్చేలా ప్రోటోకాల్ రూపొందించాలని సూచించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం నోటిఫైడ్ ఆస్పత్రులను గుర్తించాలని ఆదేశించారు. నియంత్రణలోని లేని డయాబెటిస్, విపరీతంగా స్టెరాయిడ్స్ వాడకం వల్ల బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలున్నాయని, రాష్ట్రంలో ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించామని అధికారులు తెలియచేయడంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని తదితరులు ఫీవర్ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలు.. ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో లక్షణాలు గుర్తించిన వారికి పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పరీక్షల్లో వైరస్ ఉందని తేలిన వారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు మందులు కూడా అందించాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో సదుపాయాలపై దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు. పల్లెల్లో కేసులు పెరగకుండా చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. కోవిడ్ పరిస్థితి – వైద్య సదుపాయాలు ఆరోగ్యశ్రీ చికిత్సలో 25,539 మంది రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి, వైద్య సదుపాయాలను సమీక్షలో అధికారులు వివరించారు. 625 కోవిడ్ కేర్ ఆస్పత్రుల్లో 47,825 బెడ్లు ఉండగా 38,492 పడకలు నిండాయని, వీరిలో 25,539 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కోవిడ్ ఆస్పత్రులలో ప్రస్తుతం 6,576 ఐసీయూ బెడ్లు, 23,463 నాన్ ఐసీయూ ఆక్సిజన్ బెడ్లు, 17,246 నాన్ ఐసీయూ నాన్ ఆక్సిజన్ బెడ్లు, 3,467 వెంటిలేటర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇంకా 115 కోవిడ్ కేర్ సెంటర్లలో 52,471 బెడ్లలో 17,417 పడకలు ఆక్యుపై అయినట్లు వివరించారు. ఆక్సిజన్ సరఫరా.. రాష్ట్రానికి ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నింటిలో కలిపి రోజూ 590 – 610 మెట్రిక్ టన్నుల వరకు డిమాండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ ఒక ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను 80 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో జామ్‌నగర్ నుంచి కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నామని, బళ్లారి నుంచి కూడా రోజూ కనీసం 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అధికారులు చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటివరకూ 8 ఐఎస్ఓ కంటైనర్లు రాగా మరో రెండు కూడా వస్తున్నాయని వెల్లడించారు. మాస్కులు – ఇంజక్షన్లు.. రాష్ట్రంలో ప్రస్తుతం 7,32,542 ఎన్–95 మాస్కులు, 7,55,395 పీపీఈ కిట్లు, 44,11,353 సర్జికల్ మాస్కులతో పాటు 23,382 రెమిడిసివిర్ ఇంజక్షన్లు స్టాక్ ఉన్నాయని అధికారులు వివరించారు. ఇంకా 8 లక్షల ఇంజక్షన్లు మైలాన్ నుంచి, మరో 50 వేలు రెడ్డి ల్యాబ్స్ నుంచి సేకరించేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్లు.. కేంద్రం నుంచి ఇప్పటివరకు మొత్తం 75,99,960 వ్యాక్సిన్ డోస్‌లు రాగా వాటిలో కోవిషీల్డ్ 62,60,400, కోవ్యాగ్జిన్ 13,39,560 అని అధికారులు వెల్లడించారు. ఈనెల 15వతేదీ నాటికి రాష్ట్రానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్లు 6,90,360 కేటాయించగా అంతకంటే ఎక్కువగా 8,90,360 డోస్‌లు సేకరించామని తెలిపారు. కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్ డోస్‌లు 2,27,490 కేటాయించగా కేవలం 1,25,000 మాత్రమే సరఫరా చేశారని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, 104 కాల్ సెంటర్ ఇన్చార్జ్ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఏ.మల్లికార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో మే నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు
-
ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం పేర్కొన్నారు. కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని ఆయన పేర్కొన్నారు. రూరల్ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కరోనా కట్టడి చర్యలపై సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. చదవండి: వారి అంత్యక్రియలకు రూ.15 వేలు.. ఏపీ సర్కారు ఉత్తర్వులు గ్రామ–వార్డు సచివాలయాల సేవలకు సలాం -
తీరం.. నిర్మానుష్యం
బాపట్ల: నిత్యం పర్యాటకులు, మత్స్యకారుల వేటలతో కళకళలాడే తీరం నిర్మానుష్యంగా మారింది. ఏడాదిలో వేసవి కాలంలోనే అత్యధిక పర్యాటకులతో కిటకిటలాడుతూ సూర్యలంక తీరం కనిపిస్తుంది. తాజాగా కరోనాతో పర్యాటకులకు బ్రేక్‌లు పడగా వేట నిషేధం మత్స్యకారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అయితే ప్రస్తుతం మత్స్యకారులు తమ పడవలకు మరమ్మతులు చేసుకునేందుకు కర్ఫ్యూ అడ్డుగోడగా ఎదురైంది. సూర్యలంకతోపాటు, దాన్వాయ్‌పేట, కృపానగర్, పాండురంగాపురం, రామ్‌నగర్, ఆదర్శనగర్‌లో మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. నియోజకవర్గంలోని 10 వేల మందికిపైగా ఉన్న మత్స్యకారులు వేట నిషేధం, లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారుల్లో అలజడి.. కరోనా కారణంగా పర్యాటకులు తీరానికి రాకపోవటంతో తీరం వద్ద ఉండే చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బోణీలు కూడా కాకపోవటంతో రెండునెలలుగా చిరువ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. తీరాన్ని నమ్ముకుని కనీసం 50 మందికి పైగా చిరువ్యాపారులు జీవనం సాగిస్తుంటారు. అయితే కరోనా కారణంగా పర్యాటకులు రాకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరమ్మతులకు ఇబ్బందులు.. సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే దశ కావటంతో ఏటా ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు సముద్రంలో వేట నిషేధం విధిస్తారు. అయితే గతేడాది కరోనా కారణంగా లాక్డౌన్లతో వేట నిలిచిపోగా ఈ ఏడాది కూడా అదేవిధంగా మారింది. ప్రస్తుతం లాక్డౌన్ నడుస్తుండగా వేట నిషేధం సమయం పూర్తయ్యేందుకు మరో 20 రోజులు గడువు ఉంది. వేట నిషేధానికి ముందే పడవలు, వలలను సిద్ధం చేసుకునేందుకు ప్రస్తుత కర్ఫ్యూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. బాపట్ల ప్రాంతానికి చెందిన మత్స్యకారులు పడవలు, వలల మరమ్మతులకు నిజాంపట్నం ఓడరేవుకు వెళ్లటం పరిపాటిగా మారింది. అయితే లాక్డౌన్ కారణంగా వేట నిషేధం సమయంలో కూడా మరో పనులకు వెళ్లేందుకు వీలులేకపోవటంతో పడవలు, వలలు సిద్ధం చేసుకోవటానికి కూడా అవకాశం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ మత్స్యకారుల జీవితాల్లో తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వ సాయంతో ఊరట.. మత్స్యకారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏటా వారికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారుల ఇబ్బందులను గుర్తెరిగి వారికి ఆర్థిక సాయం అందించాల్సిందిగా నిర్ణయించారు. ఈ ఆర్థిక సాయం వచ్చే నెలలో అందించనున్నారు. దీంతో మత్స్యకారులకు కొంత ఊరట లభించనుంది. -
ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం
సాక్షి, విజయవాడ: కోవిడ్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కర్ఫ్యూని పోలీసులు కట్టుదిట్టం చేశారు. 12 గంటల తర్వాత ఈ-పాస్ ఉన్న వారికే ఏపీలోకి అనుమతిస్తున్నారు. ఆసుపత్రుల్లో అధికారులు బెడ్ల శాతాన్ని పెంచుతున్నారు. అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో వాక్సినేషన్ ప్రక్రియలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. కేంద్రం నుంచి వాక్సిన్ వచ్చేలోపు ఉన్న సమయాన్ని సద్వినియోగించుకునే విధానాలను అమలు చేస్తోంది. వాక్సిన్ కేంద్రాల సంఖ్య పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రతీ సెంటర్ వద్ద రెండు వెయిటింగ్ హాల్స్, 45 ఏళ్ళు నిండిన వారికి ముందు సెకండ్ డోస్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వలంటీర్ల ద్వారా స్లిప్పుల పంపిణి చేస్తోంది. వాక్సిన్ కేంద్రం, రావలసిన తేదీ , సమయం వివరాలతో స్లిప్పుల పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకాలు అమలు చేసేలా ప్రత్యేక సిబ్బందిని నియమించింది. చదవండి: ప్రజలకు వాస్తవాలు వివరిద్దాం.. చంద్రబాబు కుట్ర బట్టబయలు -
కర్ఫ్యూ సమయంలో ఈ పాస్ తప్పనిసరి
-
ఏపీ: కర్ఫ్యూ సమయంలో ఈ పాస్ తప్పనిసరి
సాక్షి, అమరావతి: కర్ఫ్యూ సమయంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, అందుకు అవసరమైన ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన వివరాలను ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిటిజన్ సర్వీసు పోర్టర్లో appolice.gov.in, twitter@appolice100, facebook@andhrapradeshstatepolice ద్వారా ఈ పాస్ పొందవచ్చని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తగిన ధ్రువపత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత స్థానిక అధికారుల వద్ద నుంచి సరైన గుర్తింపుపత్రాలతో అనుమతులు పొందాలని సూచించారు. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ పోలీస్‌శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చదవండి: అత్యవసరమైతేనే బ్యాంకులకు రండి Ongole: కోవిడ్ కేర్ సెంటర్.. మెనూ అదుర్స్ -
అత్యవసరమైతేనే బ్యాంకులకు రండి
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్, కర్ఫ్యూ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను మంగళవారం నుంచి సవరిస్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రంలోని బ్యాంకింగ్ వేళలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరిమితం చేసింది. బ్యాంకుల కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేసినా.. లావాదేవీలకు మాత్రం 12 గంటల వరకే అనుమతించాలని ఎస్ఎల్బీసీ ఆదేశాలిచ్చింది. కర్ఫ్యూ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్ఎల్బీసీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. ఆర్బీఐ, నాబార్డు ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్–19 కట్టడిలో భాగంగా ఖాతాదారులు సాధ్యమైనంత వరకు బ్యాంకులకు రాకుండా ఇతర ప్రత్యామ్నాయ విధానాలను వినియోగించుకోవాలని ఎస్ఎల్బీసీ విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని సూచించింది. ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్, యూపీఐ, బ్యాంక్ మిత్ర వంటి సేవలను వినియోగించుకోవడం ద్వారా కరోనా కట్టడికి కృషి చేయాలని కోరింది. బ్యాంకులు కూడా ఈ దిశగా ఖాతాదారులను ప్రోత్సహించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా, వ్యాక్సినేషన్‌కు అర్హులైన ఉద్యోగుల జాబితాను పంపించాలని ఎస్ఎల్బీసీని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ కోరారు. -
కోవిడ్ మార్గదర్శకాలను మైకుల్లో వివరిస్తున్న పోలీసులు
-
ఆంధ్ర ప్రదేశ్ లో ఆరోరోజుకు చేరుకున్న కర్ఫ్యూ
-
ప్రజలే కుటుంబం.. ప్రజా రక్షణే కర్తవ్యం
సాక్షి, అమరావతి: కరోనా కట్టడిలో ఏడాది కాలంగా ఏపీ పోలీసులు అలుపెరుగకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాదిలో వచ్చిన కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సెకండ్ వేవ్ వరకు వరుస విధుల్లో శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో 70 వేల మందికి పైగా పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరంతరం కోవిడ్ విధుల్లో తలమునకలయ్యారు. కరోనా పరిస్థితుల్లో కుటుంబాలకు దూరంగా ఉంటూ.. ప్రజలే కుటుంబంగా, ప్రజా రక్షణే కర్తవ్యంగా భావిస్తూ విధులు నిర్వర్తిస్తున్న ఏపీ పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫస్ట్ వేవ్‌లో అలా.. కరోనా మొదటి వేవ్‌లో లాక్డౌన్, జోన్ సిస్టమ్‌లు అమలు చేయడంలో సమర్థవంతంగా విధులు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో నిరంతర పర్యవేక్షణతో పాటు, డ్రోన్లు, హౌస్ క్వారంటైన్ యాప్ వంటి టెక్నాలజీని వాడి సమర్థవంతంగా కరోనాను కట్టడి చేశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు, కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారి కదలికలపై నిరంతరం నిఘా పెట్టడంతోపాటు, వారి ప్రథమ కాంటాక్ట్, రెండవ కాంటాక్ట్‌లను గుర్తించి వైరస్ పరీక్షలు నిర్వహించడంలో పోలీసులు కీలకపాత్ర పోషించారు. వలస కార్మికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో పునరావాస శిభిరాలను నిర్వహించారు. సెకండ్ వేవ్‌లో ఇలా.. సెకండ్ వేవ్‌లో కరోనా కట్డడికి ప్రభుత్వం కర్ఫ్యూను అమలులోకి తేవడంతో పోలీసులు మూడు షిఫ్ట్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలించినప్పటికీ, 144 సెక్షన్ అమలుతో ప్రజలు గుమికూడకుండా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. కర్ఫ్యూలో అంతర్రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు విధించటంతో వాటిపైనా నిఘా ఉంచారు. కర్ఫ్యూ అమలును రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి, జిల్లా, నగర కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్ విధులతోపాటు, పంచాయతీ, మునిసిపల్, పరిషత్ ఎన్నికల విధులూ నిర్వర్తించారు. ఇప్పటికీ జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సులకు కాపలా, కర్ఫ్యూ అమలు వంటి వరుస విధుల్లో తలమునకలయ్యారు. -
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఈ–పాస్ అమలు
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా అంతర్రాష్ట్ర కదలికలపై పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయని, అత్యవసర ప్రయాణికులకు సోమవారం నుంచి ఈ–పాస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. విజయవాడలో కర్ఫ్యూ అమలు తీరును ఆయన ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద డీజీపీ మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతివ్వాలని, 12 గంటల తర్వాత కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయాలని సీఎం సూచించారన్నారు. ప్రతి జిల్లా నుంచి మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 5 గంటలకు కర్ఫ్యూపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే వారి కోసం సోమవారం నుంచి ఈ–పాస్ విధానాన్ని సీఎం ఆదేశాలతో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే నేరుగా ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్ ద్వారా తమ సమస్యను ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ముందస్తు అనుమతులు తప్పనిసరి శుభకార్యాలకు సంబంధించి స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయాందోళనలకు, ఆయోమయానికి గురిచేయడం సరికాదన్నారు. అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కోరారు. అత్యవసర సమయంలో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండు మాస్‌్కలను ధరించాలని, శానిటైజర్‌ను ఉపయోగించాలన్నారు. కరోనా నిబంధనలను, కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన వారి సమాచారాన్ని డయల్ 100, 112కి సమాచారం అందించాలని డీజీపీ కోరారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వారి వాహనాలను జప్తు చేస్తామన్నారు. ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్నకర్ఫ్యూ
-
అందరు రెండు మాస్కులు ధరించాలి, శానిటైజర్ ఉపయోగించాలి
-
కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ: కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. నగరంలో ఆయన ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. కర్ఫ్యూ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, అందరూ రెండు మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనాను జయిస్తామని పేర్కొన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారి కోసం రేపటి నుంచి ఈ-పాస్ విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని డీజీపీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కరోనా లక్షణాలను గుర్తించిన వారు, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 104, 108 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీజీపీ పేర్కొన్నారు. శుభ కార్యాలకు సంబంధించి ప్రభుత్వం పేర్కొన్న సంబంధిత స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా అనుమతి పొందాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. చదవండి: మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ ఆటో డ్రైవర్ పాడుపని.. యువతి కేకలు వేయడంతో.. -
విజయవాడలో కట్టుదిట్టంగా కొనసాగుతున్న కర్ఫ్యూ
-
వ్యవసాయానికి మినహాయింపు
సాక్షి, అమరావతి: కర్ఫ్యూ నుంచి వ్యవసాయ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలతో వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య, డెయిరీ శాఖల పరిధిలో జరిగే కార్యకలాపాలకు కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలతో పాటు పనిముట్లు, యంత్ర పరికరాలను తరలించే వారికి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల తరలింపు, క్రయవిక్రయాలకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక పాస్‌లు జారీ చేయాలని సూచించారు. వ్యవసాయ సంబంధిత షాపులు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంచవచ్చని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నెల 17 నుంచి సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయబోతున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే వేరుశనగ విత్తన సేకరణ 91 శాతం పూర్తయ్యిందని తెలిపారు. వేలిముద్రల ద్వారా కాకుండా ఓటీపీ విధానంలో విత్తనాలు కావాల్సిన రైతుల వివరాలను నమోదు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ నిర్మాణం జోరుగా సాగుతోందని, వాటి నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. మార్కెట్ యార్డుల్లో కార్యకలాపాలకు ఆటంకం కలగకూడదని పేర్కొన్నారు. రైతు బజార్లలో నో మాస్క్, నో ఎంట్రీ బోర్డులు పెట్టి.. భౌతిక దూరం పాటిస్తూ అమ్మకాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి వినియోగదారులు, రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు. -
‘అనవసరంగా రోడ్లపైకి వచ్చి మాకు పని కల్పించొద్దు’
సాక్షి,విజయవాడ: కర్ఫ్యూ అమలును సిటీ పోలీస్ విజయవాడ కమిషనర్ బత్తిన శ్రీనివాస్ పరిశీలించారు. గొల్లపూడి, మహానాడు సెంటర్, బెంజి సర్కిల్లో కర్ఫ్యూని సీపీ పర్యవేక్షించారు. పోలీస్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కర్ఫ్యూని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. సీపీ మాట్లాడుతూ.. కర్ఫ్యూకి ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. మరో పదిరోజులు ఇదే సహకారం అందించాలని కోరారు. సరుకులు, కూరగాయలకు మూడు రోజులకొకసారి బయటకు రావాలని సూచించారు. స్వీయ నియంత్రణ పాటించి కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి పోలీసులకు పని కల్పించవద్దన్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మినహాయింపు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ప్రయాణాలు మానుకోవాలని, ప్రజారోగ్య పరిరక్షణకోసం ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని గౌరవించాలన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని సీపీ పేర్కొన్నారు. చదవండి: జిందాల్ యాజమాన్యానికి వైద్యారోగ్యశాఖ కృతజ్ఞతలు -
ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు రద్దు
సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర సర్వీసులను ఆర్టీసీ పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఉండటంతో ఆర్టీసీ సర్వీసులను భారీగా తగ్గించింది. కరోనా సెకండ్ వేవ్ రాకముందు రోజుకు 10,553 షెడ్యూళ్లలో బస్సు సర్వీసులు నిర్వహించేది. కానీ, ప్రస్తుతం రోజుకు 3,000 షెడ్యూళ్లే నిర్వహిస్తోంది. అంటే కేవలం 30 శాతం సర్వీసులనే కొనసాగిస్తోంది. వీటిలో కూడా గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణికులనే అనుమతిస్తోంది. కరోనా ఉధృతితో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్రయాణాలను విరమించుకుంటున్నారు. దాంతో బస్సుల్లో 50 శాతం ఆక్యుపెన్సీ కూడా ఉండటం లేదు. దీనికితోడు తాజాగా 1,450 అంతర్రాష్ట్ర సర్వీసులను పూర్తిగా రద్దు చేయడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడనుంది. సాధారణ రోజుల్లో ఆర్టీసీకి టిక్కెట్ల ద్వారా రోజుకు సగటున రూ.15 కోట్లు ఆదాయం వచ్చేది. కరోనా రెండో వేవ్ ఉధృతి పెరిగాక రోజువారి ఆదాయం రూ.7 కోట్లకు పడిపోయింది. ఇక కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి రావడంతో రోజువారీ ఆదాయం కేవలం రూ.1.50 కోట్లు మాత్రమే వస్తోంది. మే అంతా దాదాపు ఇలానే ఉంటుందని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప ఆర్టీసీ ఆదాయం మళ్లీ గాడిన పడే అవకాశాల్లేవని అధికారులు చెబుతున్నారు. కర్ఫ్యూలోనూ పార్సిల్ సేవలు కర్ఫ్యూ పరిస్థితుల్లోనూ పార్సిల్ సర్వీసులు నిరం తరాయంగా కొనసాగేలా ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందుకోసం డెడికేటెడ్ కారిడార్ కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు హైదరాబా ద్‌ను అనుసంధానిస్తూ రోజుకు 9 ప్రత్యేక పార్సిల్ సర్వీసులను నిర్వహిస్తోంది. ► గుంటూరు–విశాఖపట్నం, తిరుపతి–విజయవాడ, అనంతపురం–విజయవాడ మధ్య రెండేసి పార్సిల్ సర్వీసులు నిర్వహిస్తోంది. రోజూ అటు వైపు నుంచి ఒక బస్సు, ఇటువైపు నుంచి ఒక బస్సు నడుస్తుంది. ► రాజమండ్రి–హైదరాబాద్, గుంటూరు–విజయవాడ–హైదరాబాద్, తిరుపతి–అనంతపురం మధ్య ఒక్కో పార్సిల్ సర్వీసు నిర్వహిస్తున్నారు. ► విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పార్సిళ్లను ప్రయాణికుల బస్సుల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు చేరవేస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌ను అనుసంధా నిస్తూ పార్సిల్ సేవలు అందిస్తున్నారు. -
తెలంగాణలో కరోనా నియంత్రణకు కొత్త ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్యా/మత/సాంస్కృతికపరమైన అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధించింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు గరిష్టంగా 100 మందికి మించవద్దని.. అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో 20 మందికి మించవద్దని స్పష్టం చేసింది. అదికూడా మాస్కులు, భౌతిక దూరం, ఇతర కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ చట్టం–2005 కింద ఆంక్షలను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలను, రాత్రి కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశించారు. కొన్ని వారాలుగా దేశంలో కరోనా కేసులు భారీగాపెరుగుతున్న నేపథ్యంలో, గత నెల 23న కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాత్రి కర్ఫ్యూ మరో వారం పొడిగింపు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 8వ తేదీన ఉదయం 5 గంటలతో రాత్రి కర్ఫ్యూ గడువు ముగియనుండగా.. ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని కట్టడి చేయడానికి హైకోర్టు ఆదేశాల మేరకు.. ఏప్రిల్ 20 నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాత్రి కర్ఫ్యూను సైతం కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను సీఎస్‌ఆదేశించారు. చదవండి: (వైరస్‌కు శక్తి పెరిగింది.. ఎయిర్ బోర్న్‌గా రూపాంతరం చెందింది) (కరోనాతో భవిష్యత్తులో మరో పెనుముప్పు) -
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రాత్రి పూట కర్వ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో వారంరోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మే 15 వరకు కొనసాగనున్న రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. కాగా, తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు, 46 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 4,81,540కు,2,625కు చేరాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 73,851 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. -
విశాఖలో మూడో రోజు కర్ఫ్యూ ఆంక్షలు
-
కరోనా కట్టడికి ఏపీలో పకడ్బందీగా కర్ఫ్యూ..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం రెండోరోజు గురువారం కూడా కర్ఫ్యూ కొనసాగింది. కర్ఫ్యూ సడలించిన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలు తమ పనులు చక్కబెట్టుకోవడానికి అలవాటుపడ్డారు. ప్రధానంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు బయట జనం రద్దీ పెరిగింది. కూరగాయలు, పాలు, కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు కిటకిటలాడాయి. పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం షాపుల వద్ద పెద్దసంఖ్యలో జనం క్యూ కట్టారు. కర్ఫ్యూ సడలింపు సమయాల్లో రద్దీ పెరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సడలింపు ఉన్న వేళల్లోను సెక్షన్ 144 అమల్లో ఉండటంతో జనం గుమిగూడకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని పోలీసులు మైక్‌ల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. అవసరమైన సరుకుల కోసం బయటకు వచ్చినవారు మధ్యాహ్నం 12 గంటలలోపే ఇళ్లకు చేరేందుకు వడివడిగా వెళుతుండటంతో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర ప్రధాన నగరాలతోపాటు పట్టణాల్లోను 11 నుంచి 12 గంటల సమయంలో రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారిపోయాయి. 12 గంటల అనంతరం రోడ్లు వెలవెలబోయాయి. రాష్ట్ర సరిహద్దులతోపాటు రాష్ట్రంలోని జిల్లాల్లోను చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు సోదాలు నిర్వహించారు. అత్యవసరమైతేనే కర్ఫ్యూ సమయాల్లో వాహనాలకు అనుమతిస్తున్నారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద తెలంగాణ నుంచి, మన రాష్ట్రం నుంచి వాహనాల రాకపోకలను కృష్ణాజిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, నందిగామ డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. చెక్‌పోస్ట్‌లో పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పలు ప్రాంతాల్లో పర్యటించి కర్ఫ్యూ అమలును పరిశీలించారు. చదవండి: ఏపీ: 400 మంది ప్రాణాలను కాపాడిన పోలీసులు ఏపీ: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు పునరావాసం -
12 గంటల తర్వాత నో ఎంట్రీ.. ఏపీలో కఠిన ఆంక్షలు
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఆంధ్రా- తెలంగాణా సరిహద్దుల్లో కర్ఫ్యూ ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత వచ్చిన వాహనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. అత్యవసర సేవలు, గూడ్స్ వాహనాల రాకపోకలకు మినహాయింపు ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకే స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నారు. కర్ఫ్యూకు సంపూర్ణ సహకారం అందిస్తామని వ్యాపారులు తెలిపారు. నిత్యావసరాలకు మాత్రమే బయటకు రావాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని పర్యవేక్షించిన కృష్ణా జిల్లా ఎస్పీ.. గరికపాడు చెక్ పోస్టు వద్ద కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిస్థితిని పర్యవేక్షించి.. సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వాహన దారులకు పరిస్థితిని వినయంగా వివరించి పంపాలని ఎస్పీ ఆదేశించారు. 12 గంటల తర్వాత వాహనాలను అనమతించే ప్రసక్తే లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజారోగ్యం పరిరక్షణ దృష్ట్యా కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. జిల్లాలో 52 చెక్‌పోస్టులు ఉన్నాయని.. అంతర్ జిల్లాలకు సంబంధించి 26 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. 18వ తేదీ వరకు కర్ఫ్యూకి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చదవండి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏపీలో కొత్త రకం వైరస్ లేదు -
నెల్లూరులో పకడ్బందీగా కర్ఫ్యూ అమలు
-
TSRTC: ఏపీకి వచ్చే బస్సులు రద్దు
-
రెండవ రోజు ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ
-
పకడ్బందీగా కోవిడ్ కర్ఫ్యూ .. గడప దాటని జనం
సాక్షి, రాజమహేంద్రవరం: కరోనా భయం ప్రజలను గుమ్మం దాటనివ్వలేదు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు తూ.చ. పాటిస్తున్నారు. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అమలవుతోంది. జిల్లా వ్యాప్తంగా నిర్మానుష్య వాతావరణం కనిపించింది. రోడ్లన్నీ బోసిపోయాయి. ప్రజలు ముందస్తుగా ఉదయాన్నే నిత్యావసర దుకాణాల వద్ద బారులు తీరడం కనిపించింది. గతేడాది కేంద్రం విధించిన లాక్డౌన్ పరిస్థితులే తాజా కర్ఫ్యూలో స్పష్టంగా పునరావృతమయ్యాయి. కరోనా రెండో వేవ్ విçస్తృతి వేగంగా, ప్రమాదకరంగా ఉండటంతో ప్రజలు కూడా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. కలో,గెంజో ఉన్నదే తాగుదామనే ధోరణితో ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు క్షేత్ర స్థాయిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశాయి. విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిఘా నీడన ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు అమలాపురం, రామచంద్రపురం, మండపేట, తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట తదితర పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ మండలాల్లోని పల్లెల్లో సైతం నిశ్శబ్ధ వాతావరణం కనిపించింది. ఏజెన్సీకి చెందిన 11 మండలాల్లోను గిరిజనులు సైతం స్వీయ నిర్బంధం పాటించారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దుల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మూసేశారు. రవాణా కూడా మధ్యాహ్నం 12 తరువాత నిలిచిపోయింది. అత్యవసరాలకే అనుమతి జిల్లాలో ఎనిమిది డిపోల పరిధిలో నడిచే 865 ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 12 గంటల తరువాత డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం పరిమితంగా వంద బస్సు సర్వీసులను నడిపారు. రావులపాలెం, అమలాపురం వంటి ప్రాంతాల్లో పోలీసులు పహారా కాసి బయటకు వచ్చిన వారిని తిప్పి పంపారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ రోడ్డు, రింగ్ రోడ్డు, అమలాపురం రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. రాజమహేంద్రవరం తాడితోట, మెయిన్‌రోడ్డు, జిల్లా కేంద్రం కాకినాడలోని సినిమా రోడ్డు, మెయిన్ రోడ్డు వంటి ప్రాంతాల్లో జన సంచారం లేదు. అన్ని పట్టణాల్లోను చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశాయి. ఆలయాలు, చర్చిలు, మసీదులు కూడా మూసివేశారు. మందుల దుకాణాలు, వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులు, అత్యవసర వస్తువులైన వైద్య పరికరాల రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు మురళీధర్‌రెడ్డి, అద్నాన్ నయీం అస్మీ కాకినాడలోని భానుగుడి సహా పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి కర్ఫ్యూ అమలును పర్యవేక్షించారు. సరిహద్దులు మూసివేత చింతూరు మండలం చిడుమూరు వద్ద ఆంధ్రా ఛత్తీస్‌గఢ్ సరిహద్దు, కల్లేరు వద్ద ఆంధ్రా–ఒడిశా సరిహద్దు మూతపడ్డాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి సరకు రవాణా వాహనాలు, అత్యవసర వాహనాలు తప్ప మిగిలినవి రాకుండా కట్టడి చేశారు. ఎటపాక మండలం పురుషోత్తపట్నం–భద్రాచలం చెక్‌పోస్టు వద్ద రాకపోకలు నిలిపివేశారు. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులను కూడా బారికేడ్లతో మూసివేశారు. రెండు జిల్లాలను కలిపే రావులపాలెం మండలం సిద్దాంతం–గోపాలపురం, మల్కిపురం మండలం దిండి–చించినాడ, అఖండ గోదావరిపై కొవ్వూరు–రాజమహేంద్రవరం, ఇటు విశాఖపట్నం వైపు తుని–పాయకరావుపేట తాండవ బ్రిడ్జిపై సరిహద్దులను మూసివేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తుని నుంచి రాజమహేంద్రవరం వైపు కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి, కత్తిపూడి నుంచి కాకినాడ, యానాం మీదుగా ఉన్న పామర్రు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం రద్దీగా ఉండే సామర్లకోట రైల్వే జంక్షన్ నిర్మానుష్యమైంది. చదవండి: కరోనా: ఒక్కడే.. ఆ నలుగురై! -
TSRTC: ఏపీకి వచ్చే బస్సులు రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ముందస్తు రిజర్వేషన్లను కూడా అధికారులు రద్దు చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తదితర ప్రాంతాలతోపాటు కర్నూలు, శ్రీశైలం, బెంగళూరు వైపునకు బస్ సర్వీసులు నిలిచిపోయా యి. బుధవారం కొన్ని సర్వీసులను ఏపీకి నడిపినప్పటికీ గురువారం నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి వెళ్లే అన్ని బస్సులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొ న్నారు. ‘ఏపీలో కర్ఫ్యూకు ముందే బస్సులు అక్కడికి చేరుకోవలసి ఉంటుంది. ఉదయం అక్కడికి చేరుకున్న బస్సులు తిరిగి మధ్యాహ్నం 12 లోపు ఆ రాష్ట్ర సరిహద్దులను దాటాలి. ఇది ఏమాత్రం సాధ్యం కాదు. మరోవైపు తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచే కర్ఫ్యూ అమలవుతున్న దృష్ట్యా ఏపీ నుంచి బయలు దేరిన బస్సులు రాత్రి 9 గంటలలోపు డిపోలకు చేరుకోవడం సాధ్యం కాదు’ అని ఆ అధికారి వివరించారు. ఏపీకి ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల బస్సులు మాత్రం మధ్యాహ్నం 12 లోపు ఆయా డిపోలకు చేరుకునే అవకాశం ఉంటే రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. ఈ మేరకు కోదాడ నుంచి విజయవాడ వరకు 6 బస్సులు మాత్రం తిరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపునకు వెళ్లే 48 బస్సులు కూడా నిలిచిపోయాయి. ఇక్కడ చదవండి: వారాంతపు లాక్‌డౌన్‌పై పరిశీలించి నిర్ణయం: సీఎస్ Hyderabad Railway Station: నాంపల్లి స్టేషన్ కాడా... -
పకడ్బందీగా కర్ఫ్యూ
సాక్షి, అమరావతి/గరికపాడు/వత్సవాయి/చింతూరు: రాష్ట్రంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రోజూ 18 గంటల చొప్పున ఈ నెల 18వ తేదీ వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఇచ్చారు. ప్రజలు నిత్యావసరాలకు ఆ సమయాన్ని వినియోగించుకున్నారు. పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలోనే రోడ్లపైకి వచ్చారు. అయితే కర్ఫ్యూ అమలులో లేని సమయంలో ఐపీసీ 144 సెక్షన్ అమలు చేస్తుండటంతో ఎక్కడా ఐదుగురికి మించి గుమిగూడి ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కర్ఫ్యూ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, రెస్టారెంట్లను మూసివేశారు. ప్రజా రవాణా సైతం నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను నిలిపివేశారు. అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వాహనాలను అనుమతించారు. ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ చేసే ల్యాబ్‌లు, ఔషద దుకాణాలు తదితర అత్యవసర సేవలకు అనుమతి ఇచ్చారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై విపత్తుల నిర్వహణ చట్టం–2005 సెక్షన్ 51 నుంచి 60, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్ని జిల్లాల్లోను కర్ఫ్యూ అమలు తీరును వర్చువల్ పద్ధతిలో పరిశీలించారు. జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లు కర్ఫ్యూ అమలు తీరును స్వయంగా పర్యవేక్షించారు. కర్ఫ్యూ సమయంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర ప్రధాన నగరాలతోపాటు గ్రామాల్లోని రోడ్లు సైతం నిర్మానుష్యంగా మారాయి. సరిహద్దుల్లోను ‘చెక్’పోస్టులు ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన జగ్గయ్యపేట–కోదాడ, నాగార్జునసాగర్–మాచర్ల, పొందుగల–వాడపల్లి వద్ద చెక్‌పోస్టులతో రోడ్లను మూసివేశారు. వాహనాల రాకపోకలపైన ఆంక్షలు వి«ధించారు. అత్యవసరాలకు సంబంధించిన వాహనాలను మాత్రమే రాష్ట్ర పోలీసులు అనుమతించారు. విమాన, రైల్వే, బస్ టికెట్లు ఉన్నవారిని, ఆస్పత్రి ఇతర అత్యవసర పరిస్థితులు ఉన్నవారిని గుర్తింపు కార్డులను తనిఖీలు చేసి రాష్ట్రంలోకి అనుమతించారు. ఏపీ చెక్‌పోస్టు తమ భూ భాగంలో ఉందంటూ తెలంగాణ పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఏపీకి చెందిన చెక్‌పోస్టును అక్కడి నుంచి తొలగించి జగ్గయ్యపేట వైపునకు కొత్తగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని జిల్లా సరిహద్దులోను, ప్రధాన నగరాల్లోను పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద మధ్యాహ్నం 12 గంటల తరువాత తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు వెంకటేశ్వరరావు, సోమేశ్వరరావు, మహాలకు‡్ష్మడు వెనక్కుతిప్పి పంపారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలానికి ఆనుకుని వున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. చింతూరు మండలం చిడుమూరు వద్ద ఛత్తీస్‌గఢ్ నుంచి, కల్లేరు వద్ద ఒడిశా నుంచి మన రాష్ట్రంలోకి వాహనాలు ప్రవేశించకుండా తహశీల్దార్ కరక సత్యన్నారాయణ, ఎంపీడీవో వెంకట రత్నం, ఎస్ఐ సురేష్‌బాబు పర్యవేక్షించారు. -
పరిశ్రమలు నడపడానికి ఓకే
సాక్షి, అమరావతి: కోవిడ్–19 కట్టడి కోసం రాష్ట్రంలో మధ్యాహ్నం 12 నుంచి కర్ఫ్యూ విధించినప్పటికీ తయారీ రంగ పరిశ్రమలు కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ నేపథ్యంలో పరిశ్రమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం ఉదయం వివిధ పారిశ్రామిక సంఘాలు, పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సూచనలకు అనుగుణంగా రెండు వారాల కర్ఫ్యూ సమయంలో పరిశ్రమల్లో అనుసరించాల్సిన నిబంధనలను సూచిస్తూ కోవిడ్ ప్రొటోకాల్‌ను జారీ చేశారు. నిబంధనలు ఇవీ.. ► పరిశ్రమలన్నీ వాటి అవసరాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. కోవిడ్–19 వ్యాప్తిని అరికట్టడానికి షిఫ్టుల వారీగా పనిచేసుకోవాలి. నిర్మాణంలో ఉన్న పరిశ్రమలు సింగిల్ షిఫ్ట్‌లో నిర్మాణ కార్యక్రమాలు కొనసాగించవచ్చు. ► జాతీయ నిర్మాణ, పైప్‌లైన్ పనులు యథావిధిగా కొనసాగించవచ్చు. ఐటీ, ఐటీ ఆథారిత కంపెనీలు, డేటా సెంటర్లకు అనుమతి. ► ఈ–కామర్స్ ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేయడానికి అనుమతి. ► కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థలు సొంతగానే సర్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. ► కర్ఫ్యూ తర్వాత కూడా పనిచేసే సిబ్బంది ప్రయాణానికి ఆధార్, ఉద్యోగి నంబర్ ఆధారంగా స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ► కంపెనీలే ఉద్యోగులకు అనుమతి పత్రాలు మంజూరు చేసి అవి స్థానిక అధికారులకు అందచేయాలి. ► తగిన అనుమతి పత్రాలతో కంటైనర్లు, సరకు రవాణా వాహనాల ప్రయాణానికి అనుమతి. ► పరిశ్రమల నిర్వహణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయిలో కమిటీ ఏర్పాటు. -
కరోనాకు ఏపీలో బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం: సజ్జల
-
కరోనాపై పోరులో ఏపీ ముందంజలో ఉంది: సజ్జల
అమరావతి: ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో నేటినుంచి కొనసాగుతున్న పగటిపూట కర్ఫ్యూపై బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. '' కట్టడి చర్యల్లో భాగంగానే కర్ఫ్యూ అమలు చేస్తున్నాం. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి. కరోనాపై పోరులో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉంది. వ్యాక్సిన్ ఎవరి కంట్రోల్లో ఉంటుందో చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. ' రోజుకు 6 లక్షల మందికి టీకా ఇచ్చే వ్యవస్థ ఏపీకి ఉంది. టీకా డోసులు కావాలని ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తున్నాం. కేంద్రం సరిపడా డోసులు ఇస్తే 35 రోజుల్లోనే అందరికి ఇచ్చేస్తాం. ప్రజారోగ్యం కోసం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలోకి తెచ్చాం. అవసరమైన ఆక్సిజన్, రెమిడెసివిర్లను అందుబాటులో ఉంచాం. కరోనా బాధితుల కోసం 45 వేలకు బెడ్స్‌ను పెంచాం. 29వేలకు ఆక్సిజన్ బెడ్స్‌ను అందుబాటులో ఉంచాం.'' అని తెలిపారు. -
కర్ఫ్యూని కఠినంగా అమలు చేస్తాం: కలెక్టర్ వీరపాండియన్
-
కర్ఫ్యూతో కట్టడి
-
కోవిడ్ సెకండ్ వేవ్: ఏపీలో అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రజారోగ్యం దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. నేటి నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు కానుంది.. మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఉంటుంది. కర్ఫ్యూ ఈనెల 18 వరకు కొనసాగనుంది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ప్రకటించింది. కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బ్యాంక్ సేవలు యథాతథం అయితే కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపులు ప్రకటించింది. రాష్ట్రంలో బ్యాంక్ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. బ్యాంక్ సేవలకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. అలాగే జాతీయ రహదారుల పనులు కొనసాగించేందుకు అనుమతి ఉంది.పోర్టుల్లో కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నిషేధం కాగా రోనా కట్టడి చర్యల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూను అతిక్రమించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. గుమిగూడడం, సమావేశాలు నిర్వహించడం వంటి వి పూర్తిగా నిషేధం. ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకూ 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఆ తరువాత కర్ఫ్యూ అమలవుతుంది. ఆ సమయంలో ఆటోలు, ఆర్టీసీ బస్సుల రాకపోకలపై కూడా నిషేధం ఉంది. 12 గంటల తరువాత ఆటోలు రోడ్ల పైకి వస్తే సీజ్ చేస్తా మని ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సేవల వాహనాలను మాత్రం అనుమతించనున్నారు. అలాగే మీడియా వంటి అత్యవసర ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఉదయం పూట షాపులు తెరిచే సమయంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఉంది. ఆ సమయంలో గుంపులు గుంపులుగా షాపింగ్‌లు చేయకూడదు. ఈ ఆంక్షలు రెండు వారాలు కొనసాగుతాయి. ఇప్పటికే ప్రభుత్వం రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తోంది. స్వీయ ఆంక్షలు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా ఇప్పటికే జనం స్వచ్ఛందంగా స్వీయ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు, పాలు, ఇతర నిత్యావసర సరకుల దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను మంగళవారం వరకూ సాయంత్రం 6 గంటలకే మూసివేస్తున్నారు. కొన్నిచోట్ల పగలు 12 గంటల తరువాత కొంతవరకూ స్వచ్ఛంద ఆంక్షలు విధించుకోవడంతో సాయంత్రం తర్వాత పట్టణాల్లో జనసంచారం తగ్గుతోంది. మధ్యాహ్నం నుంచి మర్నాడు ఉదయం వరకూ కర్ఫ్యూ విధిస్తే కరోనా వ్యాప్తి తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. చదవండి: Andhra Pradesh Curfew: కర్ఫ్యూ మార్గదర్శకాలు ఇవే.. -
ఆంధ్ర ప్రదేశ్ లో నేటి నుంచి కర్ఫ్యూ
-
Andhra Pradesh Curfew: కర్ఫ్యూ మార్గదర్శకాలు ఇవే..
సాక్షి, అమరావతి: కోవిడ్ కట్టడే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 5 (బుధవారం) నుంచి మే 18 వరకు రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కర్ఫ్యూ సమయంలో అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు అన్నీ మూసివేయాల్సి ఉంటుంది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు దుకాణాలు, వ్యాపారాలకు అనుమతి ఉంటుంది. కర్ఫ్యూ నుంచి మినహాయింపు వీటికే.. ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, మెడికల్ షాపులు, ప్రింట్ –ఎల్రక్టానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ ఔట్లెట్లు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, కోల్డ్ స్టోరేజీలతోపాటు గిడ్డంగులు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, అన్ని ఉత్పాదక సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతోపాటు అన్ని వ్యవసాయ పనులు. ఇవన్నీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. వీటన్నింటికీ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. వీరికి కూడా మినహాయింపు ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసేవారు డ్యూటీ పాస్‌తో కర్ఫ్యూ సమయంలో తిరగొచ్చు. ► వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది (ప్రభుత్వ, ప్రైవేటు) గుర్తింపు కార్డుతో తిరగొచ్చు. ► వైద్య సేవల కోసం వెళ్లే రోగులు, గర్భిణులు, కోవిడ్ టీకాలకు వెళ్లే వ్యక్తులు ► ఆరోగ్య సేవలు పొందడానికి వెళ్లే వ్యక్తులు ప్రైవేటు రవాణా సేవలు పొందడానికి అనుమతి ► రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి విధిగా టికెట్ ఉండాలి. అలాంటివారికి అక్కడకు వెళ్లడానికి స్థానిక అధికారులు రవాణా ఏర్పాటు చేయాలి. ► అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల ప్రజా రవాణాను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తారు. ► పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఇందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ► కర్ఫ్యూ అమలు బాధ్యతలను కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు అప్పగించారు. కర్ఫ్యూ లేని సమయంలో ప్రజలు ఎక్కువమంది గుమికూడకుండా 144 సెక్షన్‌ను అమలు చేస్తారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. -
AP Cabinet Meeting: కర్ఫ్యూతో కట్టడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బుధవారం నుంచి రెండు వారాలపాటు కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలును ఆమోదించింది. కోవిడ్ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో పడకలు, ఇంజెక్షన్లు, మందులు, తగినన్ని ఆక్సిజన్ నిల్వలు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. కరోనా పరీక్షలు నిర్వహించిన 24 గంటల్లోగా ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గ్రామీణ వైద్య వ్యవస్థను బలోపేతం చేసే ప్రణాళికను ఆమోదించింది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా విద్యా రంగంలో సంస్కరణలను మంత్రివర్గం ఆమోదించింది. ఏడో తరగతి నుంచి సీబీఎస్ఈ విద్యా విధానంలో బోధనకు సీబీఎస్ఈ బోర్డుతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. పేద విద్యార్థులకు ప్రయోజనం కలిగించేందుకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేయాలని నిర్ణయించింది. కరోనా విపత్కర పరిస్థితులతో ప్రభుత్వ ఆదాయం తగ్గుతున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రివర్గం ధృఢ సంకల్పం వ్యక్తం చేసింది. ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా క్లెయిమ్‌ల కింద రైతులకు చెల్లింపులు, వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా మత్స్యకారులకు ఈ నెలలోనే ఆర్థిక సాయం అందించేందుకు ఆమోద ముద్ర వేసింది. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ హంద్రీ–నీవా, పోలవరం, ఏలేరు–తాండవ కాల్వల లింక్ ప్రాజెక్టులో విస్తరణ పనులను ఆమోదిస్తూ పలు పనులకు నిధులు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించే అసైన్డ్ భూములకు రైత్వారీ పట్టా భూముల కంటే 10 శాతం అధిక పరిహారం చెల్లించాలని మంత్రివర్గం తీర్మానించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించారు. ఈ వివరాలను సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ... మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి నుంచి కర్ఫ్యూ రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి నియంత్రణ, నివారణపై మంత్రివర్గం సవివరంగా చర్చించింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా బుధవారం నుంచి రెండు వారాలపాటు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలును మంత్రివర్గం ఆమోదించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా రోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ సడలింపులు ఇస్తారు. ఆ సమయంలో ఐదుగురికి మించి గుమిగూడకూడదు. మధ్యాహ్నం 12 గంటల తరువాత అన్ని దుకాణాలు మూసి వేయాలి. అత్యవసరాలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రజా రవాణా (ఆర్టీసీ బస్సులు), ప్రైవేట్ బస్సులను కూడా అనుమతించరు. అంతరాష్ట్ర సర్వీసులను కూడా నిలిపివేస్తారు. మరోవైపు కోవిడ్ పరీక్షలు మరింత ముమ్మరంగా చేపట్టి ఫలితాన్ని 24 గంటల్లోనే వెల్లడించేలా చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. కోవిడ్ ఆస్పత్రులలో ఇంజక్షన్లు, ఆక్సిజన్‌కు కొరత లేకుండా ఒడిశా, తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్ సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఆక్సిజన్ సరఫరా కోసం సింగపూర్ నుంచి ప్రత్యేకంగా 25 వాహనాలను తెప్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్రం నుంచి కోవిడ్ వాక్సిన్ల సరఫరా తగినంత లేనందున 45 ఏళ్లు దాటిన వారికే మొదట టీకాలు వేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అనంతరం 18 – 45 ఏళ్ల వారికి ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్లు కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా రాయనున్నారు. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం రూ.511.79 కోట్లు వ్యయం కానుందని అంచనా. కొత్తగా 2,464 పోస్టులను మంజూరు చేశారు. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు లేదా ఒక పీహెచ్సీ, ఒక సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ఉండాలని, ప్రతి ఏజెన్సీ మండలానికి మూడు పీహెచ్‌సీలు ఉండాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్రతి పీహెచ్‌సీకి ఒక 104 వాహనాన్ని సమకూరుస్తారు. వీటన్నింటితో ప్రతి మండలంలో నలుగురు డాక్టర్లు, 104 వాహనంలో మరో ఇద్దరు వైద్యుల చొప్పున మొత్తం ఆరుగురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఈ నిర్ణయంతో ఫ్యామిలీ డాక్టర్ విధానం అందుబాటులోకి వస్తుంది. మారుమూల గ్రామంలో కూడా మంచి వైద్యం అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సీబీఎస్ఈ బోర్డుతో ఒప్పందం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీబీఎస్ఈ బోర్డుతో ప్రభుత్వం ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. రాష్ట్రంలో 44,639 ప్రభుత్వ పాఠశాలలను దశలవారీగా అనుసంధానించే ప్రక్రియతోపాటు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన కొనసాగుతుంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతోపాటు విద్యా సంస్థల అధికారులు సీబీఎస్ఈ సిలబస్, ఆ పరీక్షల నిర్వహణ తీరును అలవర్చుకునేలా తగిన అవగాహన కల్పిస్తారు. 2021–22 విద్యా సంవత్సరంలో ఏడో తరగతి విద్యార్థులు తొలిసారి సీబీఎస్ఈ సిలబస్‌తో పరీక్షలు రాయనుండగా, 2024 – 25లో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ సిలబస్‌తో తొలిసారి పరీక్షలు రాస్తారు. ఒకవైపు విద్యా ప్రమాణాల పెంపు మరోవైపు నాడు–నేడు పనులతో పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 6.12 లక్షల మంది విద్యార్థులు చేరగా వారిలో 4 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థల నుంచి వచ్చినవారు కావడం విశేషం. ‘సాల్ట్’ కు ప్రపంచ బ్యాంక్ రుణం ‘సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్సఫర్మేషన్’ (సాల్ట్)కు మంత్రివర్గం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్ నుంచి 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,860 కోట్లు) రుణం సేకరిస్తున్నారు. ఆ నిధులతో ‘నాడు–నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలల్లో పనులు పూర్తి చేస్తారు. ఉపాధ్యాయుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం లాంటి వాటి కోసం కూడా ఆ నిధులను వినియోగిస్తారు. ఎయిడెడ్ విద్యా సంస్థల టేకోవర్ ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం టేకోవర్ చేస్తుంది. ఏమాత్రం ఆర్థిక భారం పడకుండా ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. అందుకు అనుగుణంగా ఏపీ విద్యా చట్టం–1982లో సవరణలను మంత్రివర్గం ఆమోదించింది. ఎయిడెడ్ విద్యా సంస్థలను టేకోవర్ చేయడం వల్ల ఎవరికీ నష్టం కలగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో ‘ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం–2016’ సవరణను మంత్రివర్గం ఆమోదించింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతానికి మించకుండా సీట్లలో ప్రభుత్వం కోటా ఉంటుంది. ఆ కోటాలో సీట్లు కేటాయించిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు స్కాలర్షిప్ కూడా ఇస్తారు. ప్రైవేటు విద్యా సంస్థలలో 35 శాతం ప్రభుత్వ కోటా వల్ల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా నైపుణ్యాలు అభివృద్ధి చెందడంతో పాటు ఉద్యోగ అవకా«శాలు కూడా మెరుగవుతాయి. ఇక బ్రౌన్‌ఫీల్డ్ ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు వల్ల ప్రపంచ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుంది. ఉన్నత విద్యా రంగం మరింత బలోపేతం అవుతుంది. కొత్తగా రెండు వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలు శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస, చిత్తూరు జిల్లా సదూం మండల కేంద్రంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వీటిని నెలకొల్పుతారు. వెన్నెలవలసలో 30 ఎకరాల్లో నెలకొల్పే కళాశాలకు రూ.9.55 కోట్లు, సదూంలో కళాశాలకు రూ.9.55 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ప్రొద్దుటూరు ఇంజనీరింగ్ కాలేజీకి రూ.66 కోట్లు యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ప్రొద్దుటూరులో ఉన్న వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి దశలో రూ.66 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. ఇందులో రెండు టీచింగ్ పోస్టులు, ఔట్ సోర్సింగ్ విధానంలో ఆరు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించారు. వేంపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం రూ.20 కోట్లు మంజూరు చేశారు. బీసీలకు మరో పదేళ్లపాటు రిజర్వేషన్లు రాష్ట్రంలో బీసీలకు( ఏ,బీ,సీ,డీ, ఈ కేటగిరీలు) విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో బీసీలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపును కూడా అమలు చేయనున్నారు. ఈమేరకు ఈ ఏడాది జూన్ 1 నుంచి 2031 మే 31 వరకు వర్తింపజేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. డెయిరీల పునరుద్ధరణకు చర్యలు ఏపీడీడీసీఎఫ్‌కు జవసత్వాలు ఆంధ్రప్రదేశ్ పాడి అభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీడీడీసీఎఫ్)కు జవసత్వాలు కల్పిస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. మూతబడిన లేదా నిస్తేజంలో ఉన్న డెయిరీలు తిరిగి పనిచేసేలా చర్యలు చేపడతారు. అందుకోసం అమూల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు ఇప్పటికే నాలుగు జిల్లాలలో అమూల్ సంస్థ పాల సేకరణ మొదలు పెట్టింది. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని జిల్లాలలో పాల సేకరణ చేపడుతుంది. ఉపయోగంలో లేని డెయిరీలను అమూల్‌కు లీజ్‌కు ఇస్తారు. ‘ప్రకాశం’ పాల సంఘానికి రూ.69 కోట్ల రుణం.. ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘానికి ఏపీడీడీసీఎఫ్ ద్వారా రూ.69 కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు మంత్రివర్గం అనుమతిచ్చింది. తద్వారా పాడి మహిళా రైతులకు చేయూత కల్పిస్తారు. వరసగా నష్టాలబాట పట్టిన ఈ సంఘం ఉత్పాదక సామర్థ్యంలో 10 శాతం కూడా పని చేయలేకపోతోంది. సంఘాన్ని పునరుజ్జీవింప చేయడం కోసం ఈ రుణాన్ని సమకూరుస్తున్నారు. దీంతో సంఘం బాకీలన్నీ తీర్చడంతో పాటు డెయిరీ ప్లాంట్‌కు అవసరమైన మరమ్మతులు చేస్తారు. అర్చకులు, ఇమామ్‌లు, ఫాస్టర్ల వేతనాల పెంపు దైవ చింతన, పరమత సహనం, మత సామరస్యం వెల్లివిరిసేలా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌లు, పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► ఏ కేటగిరీ ఆలయాల్లో అర్చకుల వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15,625కు, బీ కేటగిరీ ఆలయాల్లో అర్చకులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ► ఇమామ్‌లకు గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు, మౌజమ్‌లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు. ► పాస్టర్లకు రూ.5 వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరు.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదించింది. ఈమేరకు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం, కర్నూలు’ అని మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు 10 శాతం ఎక్కువ పరిహారం ప్రభుత్వం ఎక్కడైనా భూసేకరణలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అసైన్డ్ భూమిని సేకరించాల్సి వస్తే రైత్వారీ పట్టాకిచ్చే భూమి విలువ కంటే 10 శాతం అదనంగా ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ రైతులకు చెల్లించేలా మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికల హమీ అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామికీకరణకు ప్రోత్సాహం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్‌లో ‘గ్రీన్‌లామ్ సౌత్ ఇండియా లిమిటెడ్’కు 66.49 ఎకరాలు భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదించింది. ఎకరం రూ.67,01,830 చొప్పున కేటాయిస్తారు. ఆ సంస్థ మొత్తం రూ.595 కోట్లు పెట్టుబడి పెడుతుంది. దాంతో ప్రత్యక్షంగా 400 మందికి, పరోక్షంగా మరో 450 ఉపాధి లభించనుంది. – బెస్టెక్ ఫుట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆడిడాస్)కు ఫ్రీ హోల్డ్ రైట్స్‌పై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ పులివెందుల వద్ద రూ.70 కోట్లు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వద్ద మరో రూ.700 కోట్లు పెట్టుబడి పెడుతుంది. తద్వారా పులివెందులలో 2 వేల మందికి, ఇనగలూరు వద్ద 10 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ‘ఎస్సార్’ స్టీల్‌కు కెఎస్‌ఎఫ్ ఎస్బీఐ క్యాప్స్ సిఫార్సుల మేరకు కడప స్టీల్ ఫ్యాక్టరీ పనులను ఎస్సార్ స్టీల్స్‌కు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అంతకు ముందు ఆ బాధ్యతలు అప్పగించిన లిబర్టీ కంపెనీ నష్టాలపాలు కావడంతో కడప స్టీల్ ఫ్యాక్టరీ పనులను ఎస్సార్ స్టీల్స్‌కు అప్పగించాలని నిర్ణయించారు. కృష్ణపట్నం నోడ్‌లో సదుపాయాలు: చెన్నై– బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ల (సీబీఐసీ)లో భాగంగా ఉన్న కృష్ణపట్నం నోడ్‌లో రూ.1,448 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. సీబీఐసీలో కృష్ణపట్నం నోడ్ కీలకం కానుంది. అక్కడ మొత్తం రూ.2,139.44 కోట్ల పెట్టుబడిని అంచనా వేస్తుండగా, 2040 నాటికి 10 లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయి. ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అభివృద్ధిలో భాగంగా ఏíపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2021–24ని మంత్రివర్గం ఆమోదించింది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తి రంగం రాష్ట్రంలో శర వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఈ రంగం విలువ 104 బిలియన్ డాలర్లు కాగా 2025 నాటికి 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. – ప్రపంచస్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)ని వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తి వద్ద అభివృద్ధి చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రత్యక్షంగా 39 వేల మందికి ఉపాధి లభించనుంది. విశాఖ పర్యాటక రంగానికి పెద్దపీట పర్యాటక రంగ అభివృద్దిలో భాగంగా విశాఖపట్నం కైలాసగిరి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ మధ్య ఉన్న ప్రాంతం అభివృద్ధి ప్రణాళికను మంత్రివర్గం ఆమోదించింది. ఈ మార్గంలో 19 కిలోమీటర్ల మేర ఆరు నుంచి ఎనిమిది వరసల రహదారి నిర్మిస్తారు. కైలాసగిరి వద్ద ఐదు ఎకరాల్లో స్కై టవర్ నిర్మిస్తారు. బంగ్లాదేశ్ నౌక ఎంవీ మా ను ప్రభుత్వమే తీసుకుని ఫ్లోటింగ్ రెస్టారెంట్‌తోపాటు అక్వేరియం టన్నెల్ ఏర్పాటు చేస్తుంది. కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ 11 బీచ్‌లను అభివృద్ది చేస్తారు. దీంతోపాటు వివిధ రకాల 12 ప్రాజెక్ట్‌లను టూరిజం ద్వారా అభివృద్ది చేసే ప్రణాళికను ఆమోదించారు. సాగునీటి పనులకు ఆమోదం హంద్రీ–నీవా... హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు (హెచ్ఎన్ఎస్ఎస్) విస్తరణకు మంత్రివర్గం ఆమోదించింది. ప్రాజెక్టు మొదటి దశ పనుల్లో భాగంగా ప్రధాన కాలువ విస్తరణ మరియు లైనింగ్ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తద్వారా కాలువలో నీటి విడుదల సామర్థ్యం 6,300 క్యూసెక్కులకు పెంచుతారు. అదనపు పంప్‌హౌజ్‌లను నిర్మిస్తారు. మొత్తం రూ.6,182 కోట్లు అంచనా వ్యయంతో ఈ పనులు చేపడతారు. ప్రాజెక్టు రెండో దశ పనులకు సంబంధించి సవరించిన అంచనాలకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఆ మేరకు రూ.9,318.14 కోట్లు సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు: పోలవరం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ స్థాయిలో (32 మీ) కూడా నీటిని తోడే ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు ప్రాజెక్టు కుడివైపున పంప్‌హౌస్, ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్‌తో పాటు, ఇతర నిర్మాణాలు చేపడతారు. అందుకు రూ.912 కోట్లు అంచనా వ్యయంతో పనులకు ఆమోదించారు. కాల్వల లింక్: ఏలేరు తాండవ కాల్వల లింక్ ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతినిచ్చారు. రూ.470.05 కోట్ల వ్యయం అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులతో కొత్తగా 5,600 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. మొత్తం 51,465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరిస్తారు. పల్నాడు ప్రాజెక్టుకు రూ.2,746కోట్ల రుణం వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టులో భాగంగా ఎలక్ట్రో మెకానిక్ పనులు, ట్రాన్స్మిషన్ పనులతో పాటు, ఇతర సివిల్ పనుల కోసం రూ.2,746 కోట్ల రుణం సేకరణకు మంత్రి మండలి అనుమతినిచ్చింది. పశుగ్రాసానికి కొరత లేకుండా.. పశుగ్రాస కొరతను తీర్చడమే లక్ష్యంగా పశుగ్రాస భద్రతా పాలసీ 2021–2026ను మంత్రివర్గం ఆమోదించింది. టెక్నాలజీని ఉపయోగించుకుని ఫాడర్ మరియు ఫీడ్ ఉత్పత్తి పెంచనున్నారు. ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న పాలసీని పరిశీలించిన మీదట మరింత ప్రయోజనకరంగా రూపొందించిన కొత్త పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. ఈ పాలసీ కింద రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ సీడ్ కార్పొరేషన్లతో ఒప్పందం చేసుకుని రైతుల భూముల్లోనే సర్టిఫైడ్ విత్తనాలు పండిస్తుంది. పశుసంవర్ధక శాఖ భూముల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా బ్రీడర్ సీడ్ లేదా ఫౌండేషన్ సీడ్ లేదా సోర్స్ సీడ్‌ను రైతులకు ఇచ్చి వారి పర్యవేక్షణలో సర్టిఫైడ్ సీడ్‌ను పండిస్తారు. నేరుగా రైతులే కాంట్రాక్ట్ ఫార్మింగ్‌పై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో పాటు 75 శాతం సబ్సిడీతో ప్రైవేట్ ఏజెన్సీల నుంచి సర్టిఫైడ్ విత్తనాలను కొనుగోలు చేసి ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తారు. మార్కెట్ యార్డుకు భూమి: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం కొటార్లపల్లిలో 4.52 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణం కోసం కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో అందించే సాయం ఇలా.... 13న వైఎస్సార్ రైతు భరోసా రైతులకు పెట్టుబడి సాయంగా ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం ద్వారా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుల ఖాతాల్లో ఈ నెల 13న నగదు జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఒక్కో రైతు ఖాతాలో రూ.7,500 చొప్పున జమ చేస్తారు. ఈ పథకంతో ఆర్ఓఎఫ్ఆర్, వాస్తవ సాగుదారులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు కూడా లబ్ధి కలుగుతుంది. 2019–20లో ఈ పథకం ద్వారా 46,69,375 మందికి రూ.6,173 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. 2020–21లో 51,59,045 మంది రైతులకు రూ.6,928 కోట్ల మేర సాయం అందింది. 23న వైఎస్సార్ ఉచిత పంటల బీమా క్లెయిమ్‌ల చెల్లింపు 2020 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో క్లెయిమ్‌ల చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదించింది. ఈ నెల 25న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. 35.75 లక్షల హెక్టార్ల భూమిలో పంట నష్టపోయిన రైతులకు ఈ ఏడాది ఖరీఫ్‌లోనే ఉపయోగపడే విధంగా ఏమాత్రం జాప్యం లేకుండా ప్రభుత్వం చెల్లించనుంది. పూర్తి పారదర్శకత కోసం రైతు భరోసా కేంద్రాలలో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శిస్తారు. దీని ద్వారా 2019కి సంబంధించి 16.77 లక్షల మంది రైతులకు రూ.15,275 కోట్లు ఇచ్చారు. 18న వైఎస్సార్ మత్స్యకార భరోసా చేపల వేట నిషేధ సమయంలో ఆదుకునేందుకు ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకం కింద ఒక్కో మత్స్యకార కుటుంబం ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున ఈ నెల 18న జమ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కింద 2019లో 1.02 లక్షల మంది మత్స్యకారులకు రూ.102.48 కోట్ల లబ్ధి చేకూరగా 2020లో దాదాపు 1.09 లక్షల మందికి రూ.109.23 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. -
విశాఖ ఏజెన్సీలో కర్ఫ్యూకు అన్ని రకాల చర్యలు
-
కర్ఫ్యూకు ప్రజలందరూ సహకరించాలి
-
జనాలతో కప్ప గంతులు వేయించిన పోలీసులు.. ఎందుకంటే!
భోపాల్: కరోనా తీవ్రరూపం దాల్చుతుండటంతో మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాత్రి కర్ఫ్యూ, పాక్షిక లాక్డౌన్ వంటి చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రభత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో లాక్‌డైన్ ఆంక్షలను అతిక్రమించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే కోవిడ్ కర్ఫ్యూను బేఖాతారు చేసిన వారికి గుణపాఠం చెప్పేందుకు మధ్యప్రదేశ్ అధికారులు వినూత్నంగా రీతిలో శిక్ష విధించారు. ఇండోర్ జిల్లాలోని డెబల్పూర్‌లోని పోలీసులు కోవిడ్ కర్ఫ్యూ సందర్భంగా వీధుల్లో తిరుగుతున్న వారిని రోడ్డుపై కప్ప గంతులు వేయించారు. దీనికితోడు డప్పు చప్పుళ్లు నడుమ వారిని గ్రామంలో కొంతదూరం పరిగెత్తేలా చేశారు. పరిమితికి మించి ఆదివారం సాయంత్రం పెళ్లి నుంచి బైక్, కార్లలో వెళుతుండగా పోలీసులు వీరిని గుర్తించి ఈ శిక్ష వేశారు. ఇలా చేయడం వల్ల ఇతర వ్యక్తులు కోవిడ్ రూల్స్ ఉల్లంఘించకుండా ఉంటుందని ఆ ప్రాంత తహసీల్దార్ జబరంగ్ బహదూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఇప్పటికే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిపాల్పూర్‌లో కరనా కర్ఫ్యూ విధించారు. వీటిని ఉల్లంఘించిన వారిపై జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుటోంది. ఇక ఆదివారం మధ్యప్రదేశ్‌లో 12,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 94 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 5,88,368కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య 5,812 కు చేరుకుంది. చదవండి: కరోనా అలర్ట్: దేశంలో 2 కోట్లు దాటిన కేసులు In Indore district's Depalpur, tehsildar makes people roaming on the streets during the #COVID19 curfew to do frog jumps. yr jeh sarkari nokar bne ha kya... jeh log to behave ese kr rha jaise raja bn gae ho... #COVIDisAirborne #CovidIndia #CoronaPandemic #CoronaCurfew pic.twitter.com/iebAZZcbaH — rockey singh (@rockeys03560226) May 3, 2021 -
ఆంధ్ర ప్రదేశ్ లో కర్ఫ్యూ
-
Andhra Pradesh: ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రేపట్నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ సడలింపు కల్పిస్తారు. ఆ సమయంలో ఐదుగురికి మించి గుమికూడరాదు. మధ్యాహ్నం 12 తరువాత షాపులన్నీ తప్పనిసరిగా మూసివేయాలి. అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బుధవారం నుంచి కర్ఫ్యూ, ఆంక్షలు అమలు చేయాలని, ప్రజలు గుమికూడకుండా 144 సెక్షన్ అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని కోణాల్లో చర్చించిన అనంతరం ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బంది కలగకుండా అవసరాలు తీర్చడంతోపాటు వ్యాపారులు, ఇతర వర్గాలకు ఇబ్బంది లేకుండా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు, పరీక్షలు, వైద్య సేవలకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా అధికారులు తెలియచేశారు. పక్కాగా పరీక్షలు.. కోవిడ్ పాజిటివ్‌గా గుర్తించిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి పరీక్షలు చేయాలని.. ఇది పక్కాగా జరగాలని సమీక్షలో సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఎంప్యానెల్ (జాబితా)లో ఆస్పత్రుల్లో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. కోవిడ్ నియంత్రణపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్, మంత్రి ఆళ్ల నాని తదితరులు ఆక్సిజన్ సరఫరా.. అన్ని ఆస్పత్రులలో రోగులకు సరిపడా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచేలా దిగుమతి చేసుకోవాలని, నిల్వ చేసేందుకు తగిన సంఖ్యలో ట్యాంకర్లు సేకరించాలని, ఏ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. 1.66 కోట్ల మందికి పరీక్షలు.. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,66,02,873 పరీక్షలు నిర్వహించామని సమీక్షలో అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 558 కోవిడ్ ఆస్పత్రుల్లో 44,599 బెడ్లు ఉండగా 37,760 మంది కోవిడ్ చికిత్స పొందుతున్నారని తెలిపారు. 3,597 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతుండగా, 1,01,204 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 81 కోవిడ్ కేర్ సెంటర్ల (సీసీసీ)లో 41,780 బెడ్లు ఉండగా మే 2వతేదీ నాటికి 9,937 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లలో ఇంకా 31,843 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 104 కాల్ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నట్లు చెప్పారు. కోటా పెంచాలని కేంద్రానికి వినతి.. జిల్లాలలో ఆక్సిజన్ వసతి ఉన్న ఆస్పత్రులు 146 ఉండగా ఆక్సిజన్ పైప్‌లైన్ ఉన్న బెడ్లు 26,446 ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రోజుకు సగటున 420 నుంచి 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగిస్తుండగా ఈనెల రెండో వారం చివరి నాటికి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా రవాణాకు అవసరమైన ట్యాంకర్లు లేక 448 మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకోగలుగుతున్నట్లు (ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కలిపి) తెలిపారు. ఆక్సిజన్ రవాణాతో పాటు స్టోరేజీకి ట్యాంకర్ల అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోటా పెంచాలని కేంద్రాన్ని కోరామని అధికారులు వెల్లడించారు. పెరంబదూరు (తమిళనాడు), బళ్లారి (కర్ణాటక) నుంచి 200 మెట్రిక్ టన్నుల చొప్పున ఆక్సిజన్ రవాణా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రవాణా కోసం వాహనాలు (ట్యాంకర్లు) ఇవ్వాలని కూడా కోరామన్నారు. 8 లక్షల ఇంజెక్షన్లకు ఆర్డర్లు.. రాష్ట్రంలో కొత్తగా మైలాన్ ల్యాబ్ నుంచి 8 లక్షల రెమిడెస్విర్ ఇంజెక్షన్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని అధికారులు తెలిపారు. ఎన్–95 మాస్కులు 5,67,844, పీపీఈలు 7,67,732, సర్జికల్ మాస్కులు 35,46,100, హోం ఐసొలేషన్ కిట్లు 2,04,960 నిల్వ ఉన్నాయని చెప్పారు. 52 లక్షల మందికి తొలివిడత టీకాలు.. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో ఇప్పటివరకు 52 లక్షల మందికి తొలి విడత వాక్సిన్ ఇచ్చినట్లు అధికారులు వివరించారు. మొత్తం 1,33,07,889 మందికి వాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు. – సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్) ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ (కోవిడ్ మేనేజ్మెంట్) ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ కర్ఫ్యూ: ఉదయం 6-12 గంటల వరకు 144 సెక్షన్
సాక్షి, విజయవాడ: కరోనా కట్టడి కోసం ఆంధ్ర్రదేశ్‌లో మే 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 6-12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి.. మధ్యాహ్నం 12 తర్వత కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని ఏకే సింఘాల్ తెలిపారు. ఉదయం 6-12 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. అత్యవసర సేవలకు ఎప్పటిలానే అనుమతి ఉంటుందన్నారు. ఇక కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటుమన్నారు ఏకే సింఘాల్. ప్రస్తుతం ఏపీలో 599 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స జరుగుతోంది.. 82 కోవిడ్ కేర్ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి అని తెలిపారు. రాష్ట్రంలోని ఆస్పత్రులకు ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 447 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామని.. 13,655 మంది కోవిడ్ కేర్ సెంటర్స్‌లో చికిత్స పొందుతున్నారని ఏకే సింఘాల్ తెలిపారు. ఆక్సిజన్ సరఫరా కోసం ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడుతున్నామని.. కేసుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లను పెంచుతున్నామన్నారు ఏకే సింఘాల్. కోవిడ్ నియంత్రణకు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారన్నారు. స్టేట్ లెవల్ ప్రొక్యూర్ కమిటీ తొలి సమావేశం నిర్వహించాం.. ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అని ఏకే సింఘాల్ తెలిపారు. చదవండి: ఏపీలో ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ -
ఏపీ: ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ!
-
ఏపీలో ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చింది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ సడలింపులు ఉంటాయి. రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది. చదవండి: Andhra Pradesh: కరోనా టెస్టుల్లో రికార్డు ఒక్కరోజులో 11,411 మంది రికవరీ -
మే 3 తర్వాత ఎన్నికలు పెట్టొద్దు
-
మే 3 తర్వాత ఎన్నికలు పెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 3న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత... కరోనా కేసులు తగ్గే వరకూ రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు నిర్వహించరాదని ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. ఏప్రిల్ 30తో రాత్రి కర్ఫ్యూ గడువు ఉత్తర్వులు ముగుస్తుండటంతో తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియజేయాలంటూ గతంలో ఆదేశించిన నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ కేసులు విచారణకు రాగా... భోజన విరామం సమయానికి ప్రభుత్వ నిర్ణయాన్ని చెబుతామని అడ్వకేట్ జనరల్ (ఏజీ) నివేదించారు. తర్వాత 1.30 గంటల ప్రాంతంలో తిరిగి ఈ కేసులు విచారణకు రాగా... ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని ఏజీ నివేదించారు. దీంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిన్నటి నుంచి విచారణను ఈ రోజుకు వాయిదా వేశాం. ఇంత తీవ్రమైన అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 24 గంటల సమయం సరిపోలేదా? ధర్మాసనం సహనాన్ని పరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందో చెప్పాలని 27న ఆదేశించాం. ఏజీ విజ్ఞప్తి మేరకు 28కి కేసు వాయిదా వేశాం. 28న ఏజీ మరోసారి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ రోజు విచారించాం. అయినా ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని చెప్పడం తీవ్ర అభ్యంతరకరం. మరికొన్ని గంటల్లో అంటే అర్ధరాత్రితో కర్ఫ్యూ గడువు ఉత్తర్వులు ముగియనున్నాయి. అర్ధరాత్రి తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు? ప్రభుత్వానికి నిర్ణయం తీసుకోవడం చేతకాకపోతే మేమే తగిన ఉత్తర్వులు జారీచేస్తాం’అని ధర్మాసనం హెచ్చరించిం ది. ఈ దశలో ఏజీ జోక్యం చేసుకొని కోర్టు ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. కార్యనిర్వహణ వ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకోరాదనే ఉద్దేశంతో అడిగినంత గడువు ఇస్తున్నామని, తమ నుంచి ఊహించిన దాని కంటే తీవ్రమైన ఉత్తర్వులు ఉంటాయని ధర్మాసనం హెచ్చరించింది. తిరిగి 45 నిమిషాల్లో ఈ కేసును విచారిస్తామని, అప్పటిలోగా ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పాలంటూ మరోసారి విచారణ వాయిదా వేసింది. కర్ఫ్యూ పొడిగించాం: ఏజీ రాత్రి కర్ఫ్యూను ఈనెల 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు జారీ చేసిన జీవోను అడ్వకేట్ జనరల్ (ఏజీ) ధర్మాసనానికి సమర్పించారు. జీవోను పరిశీలించిన ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేయకుండా తాము ఆదేశాలు జారీచేసే అవకాశం కల్పించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పింది. 3వ తేదీ తర్వాత స్థానిక సంస్థల కు, ఇతర ఉప ఎన్నికలు ఏమైనా పెడుతున్నారా అని ఏజీని ప్రశ్నించగా... లేదని తెలిపారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకూ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 5కు వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వులు జూన్ 30 వరకు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ఫుల్ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. -
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడగింపు
-
ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి
-
Night Curfew: తెలంగాణలో మరో వారం రాత్రి కర్ఫ్యూ..
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి వేళల్లో కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మే 8 వతేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి హైకోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 20 నుంచి రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మే 1న ఉదయం 5 గంటలతో రాత్రి కర్ఫ్యూ గడువు ముగియనుండగా, కర్ఫ్యూను ఎందుకు పొడిగించలేదని శుక్రవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మరో వారం రోజులపాటు కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నైట్ కర్ఫ్యూ పొడిగింపు ఉత్తర్వులను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ హోంశాఖ తరఫున మరో ప్రత్యేక ఉత్తర్వు జారీ చేశారు. కర్ఫ్యూ అమల్లో భాగంగా రాత్రి 8 గంటలకే అన్ని రకాల వ్యాపారాలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేయాలని ఏప్రిల్ 20న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఔషధ దుకాణాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ– కామర్స్ ద్వారా వస్తువుల పంపిణీ, పెట్రోల్ పంపులు వంటి అత్యవసర సేవలతోపాటు మరి కొన్ని రకాల సేవలకు ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. చదవండి: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు -
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా నియంత్రణ పిటీషన్‌పై శుక్రవారం హైకోర్ట్‌లో విచారణ ప్రారంభమయ్యింది. నేటితో నైట్ కర్ఫ్యూ ముగుస్తుండటంతో తదుపరి తీసుకోబోయే చర్యలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాక డెడ్ లైన్ విధించింది. 45 నిముషాల్లో ప్రభుత్వ నిర్ణయం తెలపాలని హైకోర్టు ఆదేశించింది. లేకపోతే తామే ఆదేశాలు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున హాజరైన ఏజీ నైట్ కర్ఫ్యూ పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపాడు. ఈ సమాధానంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. కర్ఫ్యూ జీవో ముగియడానికి 24 గంటల సమయం కూడా లేదు. అయినా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం ఏంటని కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూపై జీవో ఈరోజుతో ముగుస్తుంది.. మరీ రేపటి నుంచి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించింది. ఈ క్రమంలో రేపు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉందని ఏజీ కోర్టుకు తెలిపాడు. ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి 45 నిముషాలు సమయం ఇస్తానున్నామని.. ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలిపాలని హై కోర్టు ఆదేశించింది. పిటీషన్ పాస్ ఓవర్ చేసింది. చదవండి: ‘డ్రగ్స్’ వివరాలు ఎందుకు దాస్తున్నారు: హైకోర్టు -
తెలంగాణలో నేటితో ముగియనున్న నైట్ కర్ఫ్యూ
-
గుడిలో నా పెళ్లి సర్.. మమ్మల్ని వదిలేయండి!
సాక్షి, బెంగళూరు: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నిమిషాల్లో విహహం చేసుకోబోయే ఓ వరుడు విచిత్రమైన సంఘటన ఎదుర్కొన్నాడు. మాగడి రోడ్డులో ఆదివారం ఉదయం 10.30 గంటలకు కల్యాణ మండపానికి తన స్నేహితుడి బైక్‌పై బయలుదేరాడు. రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారాంతపు కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలియదా అంటూ వారిని ప్రశ్నించారు. బైక్ వెనక కూర్చున్న వరుడు స్పందిస్తూ.. నేను పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్నాను సర్. సమయానికి ఏ వాహనం లేకపోవడంతో నా స్నేహితుడితో బైక్‌పై కల్యాణ మండపానికి వెళ్లుతున్నట్లు తెలిపాడు. తప్పించుకోవడానికి ఏ వంకా దొరకలేదా బాబు! పెళ్లంటూ ఎందుకు అబద్దం చెబుతున్నావని పోలీసులు గట్టిగా నిలదీశారు. దీంతో పెళ్లి కొడుకు తన జేబులో ఉన్న శుభలేఖను తీసి చూపించాడు. అప్పటికీ పోలీసులకు నమ్మకం కలగలేదు. కల్యాణ మండపంలో పెళ్లి చేసుకుందామని భావించగా అక్కడ అనుమతి దొరకలేదని దీంతో స్థానిక దేవాలయంలో పెళ్లి చేసుకుంటున్నానని ఆ యువకుడు పోలీసులకు వివరించాడు. ఇప్పటికే వధువు, ఆమె కుటుంబ సభ్యులు, తమ తల్లిదండ్రులు, బంధువులు గుడికి చేరుకున్నారని తెలిపాడు. ముహూర్తానికి సమయం మించిపోతోందని తనను విడిచిపెట్టాలని పోలీసులకు కోరుకున్నాడు. ఆ యువకుడు చెప్పింది నిజమని పోలీసులు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. వివాహానికి పది నిమిషాల టైం పెట్టుకుని ఇప్పుడా వెళ్లేది అంటూ ఆ యువకుడి పెళ్లికి ముందస్తు శుభాకాంక్షలు చెప్పి వారిని వదిలిపెట్టారు. చదవండి: ఆ ట్యాంకర్ రాకుంటే...వందకు పైగా ప్రాణాలు గాల్లో కలిసేవి -
కర్య్ఫూను కేర్ చేయని ఆకతాయిలు, రోడ్డుపై హల్చల్
సాక్షి, సైదాబాద్: కరోనాలోను కొంత మంది యువత తమ ఆకాతాయి బుద్ధి మార్చుకోవడం లేదు. రాత్రయితే చాలు ఆ రహదారిపై వెళ్లాలంటే భయాందోళన తప్పదు. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి బైక్‌లపై స్టంట్స్ చేస్తారో తెలియదు. ఒక్కసారిగా పెద్దఎత్తున బైకులు రోడ్లపైకి రయ్యి రయ్యిమంటూ పెద్ద శబ్దాలు చేసుకుంటూ దూసుకెళ్తాయి. హెల్మెట్ లేకుండా.. కొన్ని బైకులకు నంబర్ ప్లేట్లు లేకుండా ఉంటాయి. యువకులు వాటిపై స్టంట్స్ చేస్తారు. బైకులపై ఎక్కి కొందరు నడపగా.. ఇంకొందరు ముందరి చక్రాన్ని గాల్లోకి ఎగిరేస్తారు. అరుపులు, కేకలతో వీరంగం సృష్టిస్తారు. ఆదివారం నల్గొండ చౌరస్తా నుంచి చంచల్‌గూడ వరకు ఉన్న ప్రధాన రహదారిపై ఆకతాయిలు హల్చల్ చేశారు. అటువైపు వెళ్లే వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఆ వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. పలువురు వాటిని పోలీసు ఉన్నతాధికారులకు పంపినట్లు తెలుస్తోంది. సరదా కోసమా.. బైక్ రేసింగ్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారా.. అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. -
ఏపీలో ప్రారంభమైన రాత్రి కర్ఫ్యూ: రోడ్లన్నీ వెలవెల
సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ శనివారం ప్రారంభమైంది. రాత్రి పది గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కర్ఫ్యూ అమల్లోకి రావడంతో రోడ్లన్నీ వెలవెలబోయాయి. వాహనదారులు, ప్రజల ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ కర్ఫ్యూను పోలీసులు పక్కాగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు. పలుచోట్ల పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనవసరంగా బయటకు వచ్చిన వాహనదారులు, ప్రజలను ప్రశ్నించారు. విశాఖపట్టణం, విజయవాడ, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురము, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు కర్ఫ్యూను పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. విశాఖపట్టణంలో రద్దీగా ఉండే ఆర్కే బీచ్, జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. నగరంలో 23 పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్... పెట్రోలింగ్ పార్టీలతో పాటు అదనపు బలగాలతో కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అన్ని దుకాణాలు మూసివేసి సహకరించాల్సిందిగా చిత్తూరు ఎస్పీ వెంకట అప్పలనాయుడు వ్యాపారులను విజ్ఞప్తి చేశారు. విజయవాడలో.. విజయవాడ: బందరు రోడ్ పీవీపీ మాల్ వద్ద నైట్ కర్వ్యూను విజయవాడ పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు పర్యవేక్షించారు. అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చినట్లు తెలిపారు. కర్ఫ్యూకు విజయవాడ నగర ప్రజలు సహకరించాలని కోరారు. 70 పికెట్స్, 62 బీట్స్ ద్వారా రాత్రి పూట కర్వ్యూను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. మొదటి రెండు రోజులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు శ్రీకాకుళం రోడ్డులో బోసిపోయిన ఓ కూడలి -
ఏపీలో నేటినుంచి రాత్రి పూట కర్ఫ్యూ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నేటినుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ మేరకు కర్ఫ్యూ విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ ఉండనుంది. తదుపరి ఉత్తర్వుల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. ఆస్పత్రులు, ల్యాబ్‌లు, ఫార్మసీలు, మీడియా, టెలికాం, కేబుల్ సేవలు, బంక్‌లు, విద్యుత్ సంస్థల కార్యాలయాలకు మినహాయింపు ఉంది. కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు మూసివేయాలని ఆదేశించింది. నైట్ కర్ఫ్యూ ఉల్లంఘిస్తే ఐపీసీ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
కర్ణాటకలో వీకెండ్ కర్ఫ్యూ
బనశంకరి: కోవిడ్‌ను కట్టడికి కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన వీకెండ్ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ నిబంధనలు సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. శని, ఆదివారాల్లో ఉదయం 6 నుంచి పది గంటల వరకు కూరగాయలు, ఇతర అత్యవసరాల కొనుగోలుకు అవకాశం ఇస్తారు. విమానాలు, రైళ్లలో వెళ్లే ప్రయాణికులు టికెట్లు చూపించాల్సి ఉంటుంది. హోటల్, రెస్టారెంట్లలో పార్శిల్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. బస్సులు, టెంపోలు, క్యాబ్స్‌లో 50 శాతం కెపాసిటీతో ప్రయాణించవచ్చు. శని, ఆదివారాల్లో బెంగళూరులో మెట్రో రైళ్లను పూర్తిగా నిలిపివేస్తారు. సోమవారం ఉదయం 7గంటలకు మెట్రో రైళ్ల సంచారం ప్రారంభమవుతుంది. వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికే అనుమతించారు. ఆక్సిజన్ పంపండి: యెడ్డీ సాక్షి, బెంగళూరు: కర్ణాటకకు 1,471 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ శుక్రవారం పది రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ కర్ణాటకలో కరోనా టీకా పంపిణీ విజయవంతంగా సాగుతోందని చెప్పారు. నాలుగైదు రోజుల్లో వైరస్ అదుపులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోందన్నారు. గురువారం ఒక్కరోజే 500 టన్నుల ఆక్సిజన్ వినియోగించినట్లు తెలిపారు. ఏప్రిల్ 30 తర్వాత ఆక్సిజన్ నిల్వలు ఖాళీ అవుతాయని, 1,471 టన్నుల ఆక్సిజన్ కేంద్రం నుంచి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ -
18-45 వయసు వారికీ ఉచితంగా వ్యాక్సిన్
-
నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ.. వారికి ఉచితంగా వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాక్సిన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ మేరకు అవసరమైనన్ని కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లకు ఆర్డర్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 18 – 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న 2,04,70,364 మందికి టీకా ఇవ్వాల్సి ఉన్నందున ఆ మేరకు డోసులు సేకరించాలని సూచించారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ... రాత్రి పూట కర్ఫ్యూ... రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలి. రెస్టారెంట్లతో సహా అన్నింటినీ మూసేయాలి. ప్రజలు ఇబ్బంది పడకుండా రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించాలి. గతంలో మాదిరిగా వార్డులలో ప్రత్యేక మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేయాలి. యథావిథిగా టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు విద్యార్థులకు నష్టం కలగకుండా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు జరపాలి. ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపవద్దు. టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కులకు చాలా ప్రాధాన్యం ఉంది. ఉద్యోగ నియామకాల్లో కంపెనీలు వీటిని పరిగణలోకి తీసుకుంటాయి. విద్యార్థులకు మంచి కాలేజీల్లో అడ్మిషన్లు దొరకాలంటే మార్కులకు ప్రాధాన్యం ఇస్తాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి పరీక్షల్లో నెగ్గుకు రావాలన్నా, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించాలన్నా మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. బాగా చదివే విద్యార్థులకు నష్టం కలగ కూడదని, అందరితో పోటీపడి మంచి ఉద్యోగాలు సాధించాలన్న వారి ఆకాంక్షలు నీరుగారరాదనే ఈ నిర్ణయం. ఔషధాలు బ్లాక్‌కు తరలకూడదు.. ఆక్సిజన్ ఉత్పత్తితో పాటు సరఫరాను హేతుబద్ధీకరించండి. కోవిడ్ చికిత్సలో ముఖ్యమైన రెమిడిస్‌విర్ ఇంజక్షన్ల కేటాయింపు, సరఫరా ఎలా ఉందన్నది సమీక్షించాలి. ఎక్కడా ఈ ఔషథం బ్లాక్ మార్కెట్ కాకుండా చూడాలి. ఏదైనా రాకెట్ ఉంటే పూర్తిగా అరికట్టాలి. ఇందుకోసం ఎస్వోపీ రూపొందించాలి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ వాక్సిన్, రెమిడిస్‌వర్ ఇంజక్షన్లు ముందుగా ఇక్కడి అవసరాలు తీర్చాలి. లేదంటే ఇక్కడ కేసులు పెరిగితే ఆ సంస్థలను మూసివేసే పరిస్థితి వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా వివరించాలి. ఏ ఒక్క ప్రాణం పోకూడదు.. కోవిడ్ పరీక్షల సంఖ్య అవసరం మేరకు పెంచండి. కోవిడ్ బారిన పడిన ప్రెమరీ కాంటాక్ట్‌లతోపాటు ఆ పరీక్ష కోరుకున్న వారందరికీ వెంటనే చేయాలి. ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడటం మనకు చాలా ముఖ్యం. ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు కోవిడ్ చికిత్స కోసం ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోండి. అవసరమైతే దాడులు జరపాలి. ఇందుకోసం ఒక సీనియర్ అధికారిని నియమించండి. 104 ప్రతి కాల్‌కు స్పందించాలి.. 104 కాల్ సెంటర్ మరింత సమర్థంగా పని చేయాలి. ప్రతి కాల్‌కు స్పందించాలి. మనం నిర్దేశించుకున్నట్లు ఫోన్ చేసిన 3 గంటల్లోనే బెడ్ కేటాయించాలి. ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే తమకు సాయం చేస్తారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి. 104 కాల్ సెంటర్‌ను జిల్లాలో ఒక జేసీకి కేటాయించండి. ఆ అధికారి అవసరం మేరకు కాల్ సెంటర్లో కూర్చుని పర్యవేక్షించాలి. అవసరమైనన్ని కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి తగిన సదుపాయాలు కల్పించాలి. ఫార్మా కంపెనీలతో మాట్లాడిన సీఎం జగన్ సమీక్షకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లాతో పాటు హెటెరో డ్రగ్స్ ఎండీ బి.పార్థసారథిరెడ్డితో మాట్లాడారు. రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా మరిన్ని కోవిడ్ వాక్సిన్ డోసులతో పాటు రెమిడిసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని వారిని కోరారు. మరిన్ని ఆక్సిజన్ రవాణా వాహనాలు రాష్ట్రంలో ఆక్సిజన్ రవాణా కోసం కేవలం 64 వాహనాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుత డిమాండ్‌ను తట్టుకునేందుకు కనీసం 100 నుంచి 120 వాహనాలు అవసరమని సమావేశంలో అధికారులు తెలిపారు. అన్ని ఆస్పత్రులలో ఆక్సిజన్ పడకలు నిండితే 515 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని, ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో రోజుకు సగటున 284 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగిస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఆర్ఐఎన్ఎల్లో రోజుకు 100 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేసి రాష్ట్రానికే ఇవ్వడంతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 208 కోవిడ్ ఆస్పత్రులలో మొత్తం 21,581 బెడ్లు ఉండగా 11,789 బెడ్లు నిండాయని, గత 24 గంటల్లో 2,506 మంది ఆస్పత్రుల్లో చేరారని వివరించారు. ఉచిత టీకాకు రూ.1,600 కోట్ల వ్యయం: మంత్రి ఆళ్ల నాని కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారికి ఉచితంగా కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.1,600 కోట్లు ఖర్చు చేయనుందని చెప్పారు. సీఎం సమీక్ష అనంతరం మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. శనివారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుందని తెలిపారు. సీటీ స్కాన్ పేరుతో కొన్ని ఆస్పత్రులు దోపిడీకి పాల్పడటాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించినట్లు వెల్లడించారు. ఇందుకు రూ.2,500 ధరగా నిర్ణయించామని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని, ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. విపత్కర పరిస్థితుల్లో దోపిడీకి పాల్పడవద్దని ఆస్పత్రులకు విజ్ఞప్తి చేశారు. కళ్యాణ మండపాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. – సీఎం సమీక్షలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ సీఎస్ సతీష్‌చంద్ర, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో ఉచితంగా వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఖర్చుతోనే ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వీరందరికి ఏపీ సర్కార్ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనుంది. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘కరోనా కట్టడిపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన విస్తృతంగా చర్చించాము. ప్రజల భాగస్వామ్యంతో పాటు వాక్సినేషన్ ముఖ్యమని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నాం. 18-45 వయసు ఉన్న వారికి ఉచితంగా టీకా వేస్తాం. ఇందుకు గాను 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాం. అలానే కరోనా కట్టడి కోసం రేపటి నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది’’ అని మంత్రి తెలిపారు. ‘‘సీటీ స్కాన్ పేరుమీద దోపిడీ చేయడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దీనికి 2,500 రూపాయల ధర నిర్ణయించాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నాం. ఇది నిరంతరం జరుగుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దోపిడీకి పాల్పడవద్దని వినతి. మాస్క్, భౌతిక దూరం వంటి కోవిడ్ నియమాల అమలులో ప్రజలను భాగస్వామ్యం చేయమని సీఎం జగన్ సూచించారు. కళ్యాణ మండపాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని సీఎం ఆదేశించారు. బెడ్స్, కోవిడ్ రిక్రూట్మెంట్ కూడా పెంచుతున్నాం. జిల్లా స్థాయిలో 104 కాల్ సెంటర్లకు జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని కోరాము’’ అని మంత్రి తెలిపారు. చదవండి: అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు -
కరీంనగర్లో నైట్ కర్ఫ్యూ.. సహకరిస్తున్న ప్రజలు
-
రాత్రి ‘కర్ఫ్యూ’ నీడలో హైదరాబాద్ నగరం.. నిర్మానుష్యంగా రోడ్లు
-
కర్ఫ్యూ భయం.. సొంత గ్రామాలకు తరలివెళ్తున్న జనం
-
పక్కాగా తెలంగాణ అంతటా కర్ఫ్యూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగి పోతుండటం, వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం పొద్దున్నే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు, విపత్తుల నిర్వహణ చట్టం-2005కు అనుగుణంగా ఈ ఆదేశాలిస్తున్నట్టు పేర్కొన్నారు. రోజూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని.. మంగళవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు (మే 1న ఉదయం 5 గంటల వరకు) అమల్లో ఉంటుందని ప్రకటించారు. అన్ని వాణిజ్య సముదాయాలు, క్లబ్‌లు, పబ్‌లు, బార్లు, వైన్‌షాప్‌లు, అత్యవసరం కాని అన్ని రకాల వాణిజ్య సంబంధిత దుకాణాలను రాత్రి 8 గంటలలోగా మూసేయాలని.. వాటిలో పనిచేసే సిబ్బంది ఇళ్లకు చేరుకోవడానికి గంటసేపు వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్‌తో రాష్ట్రంలో కొద్దిరోజులుగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం వ్యాక్సినేషన్, టెస్టులు చేయడం, ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణను పట్టించుకోవడం లేదని.. జనం యథేచ్ఛగా తిరగకుండా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘రాష్ట్రంలో లాక్‌డౌన్‌గానీ, నైట్ కర్ఫ్యూగానీ విధిస్తారా? ఇంకా ఏమేం చర్యలు తీసుకుంటారో 48 గంటల్లో తేల్చి చెప్పండి’అంటూ సోమవారం ఆదేశించింది. దానిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం నైట్ కర్ఫ్యూ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ఫ్యూ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని అందులో పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో కఠినంగా నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కర్ఫ్యూ సమయంలో కొన్ని అత్యసవర, నిరంతరం సేవలు అవసరమైన సంస్థలు, వాటిలో పనిచేసే సిబ్బందికి మినహాయింపులు ఉంటాయని తెలిపారు. గంట ముందే బంద్.. రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు తగిన ఏర్పాట్లు సిద్ధం చేశారు. బారికేడ్లు, పికెట్లు, కా>ర్డన్ ఏరియాలను ఎంపిక చేశారు. కర్ఫ్యూ అమలు కోసం మంగళవారం నుంచి రాత్రి విధుల్లో ఎక్కువ మంది సిబ్బందిని మోహరించనున్నారు. ఇక మినహాయింపు ఉన్నవి మినహా అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసేయాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగైతేనే వినియోగదారులు, ఉద్యోగులు 9 గంటలకల్లా గమ్యస్థానాలకు, ఇళ్లకు చేరడం సాధ్యమని పేర్కొన్నారు. మినహాయింపు ఉన్నవారు మినహా ఎవరైనా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మినహాయింపులున్న మరికొన్ని అంశాలు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లో పనిచేసే ఎమర్జెన్సీ సిబ్బంది తగిన గుర్తింపు కార్డులు చూపిస్తే అనుమతినిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు సంబంధించిన డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పారా మెడికల్ సిబ్బంది తమ గుర్తింపు కార్డులను చూపిస్తే అనుమతిస్తారు. గర్భిణీలు, ఆస్పత్రుల సేవలు అవసరమైన రోగులకు అనుమతి. రాష్ట్రంలోకి వచ్చే, పోయే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, జిల్లాల నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సు సర్వీసులపై ఆంక్షలు లేవు. గూడ్స్ వాహనాలకు పర్మిషన్ ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక పాసులు అవసరం లేదు. ఉదయం 6.30 నుంచి రాత్రి 7.45 వరకే మెట్రో రైళ్లు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. పొద్దున 6.30 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. ప్రయాణికులు విధిగా మాస్కులు ధరించాలని, స్టేషన్లలోకి ప్రవేశించే ముందు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ వినియోగించాలని.. స్టేషన్లు, రైలుబోగీల్లో భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. ప్రయాణికులు భయాందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొంది. 8 గంటలకే ’మద్యం’ బంద్ నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. వైన్ షాపులు, బార్లు, క్లబ్బులు, కల్లు దుకాణాలను రాత్రి 8 గంటల కల్లా మూసివేయాలని ఆదేశించింది. వైన్ షాపులు, బార్లు తెరచి ఉన్న సమయంలో కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. బార్లలో ప్రవేశద్వారం వద్దనే థర్మామీటర్లు ఏర్పాటు చేయాలని, సిబ్బంది కచ్చితంగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, భౌతిక దూరం పాటించేలా వినియోగదారులను కట్టడి చేయాలని పేర్కొంది. చదవండి: హైదరాబాద్‌లో మళ్లీ లాక్డౌన్ రోజులు.. రోడ్లన్నీ వెలవెల -
హైదరాబాద్‌లో మళ్లీ లాక్డౌన్ రోజులు: రోడ్లన్నీ వెలవెల
సాక్షి, హైదరాబాద్: మళ్లీ లాక్డౌన్ రోజులు గుర్తుకు వస్తున్నాయి. ప్రస్తుతం రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో హైదరాబాద్ రోడ్లు మళ్లీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన రోడ్లతో పాటు గల్లీ రోడ్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనా విజృంభణతో హైకోర్టు మొట్టికాయలు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కర్ఫ్యూ అమలును పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డులో మహేశ్ భగవత్, కూకట్‌పల్లిలో సజ్జనార్ కర్ఫ్యూ అమలును పర్యవేక్షించారు. కర్ఫ్యూ నేపథ్యంలో ఎల్బీనగర్ నాగోల్, ఉప్పల్, జెన్ పాక్ట్ వద్ద రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, అమీర్‌పేట, కూకట్పల్లి, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ స్పష్టంగా కనిపించింది. ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేస్తుండడంతో ప్రజలు ఎవరూ బయటకు రాలేదు. అక్కడక్కడ ప్రజలు బయటకు రాగా పోలీసులు నిలువరించి వివరాలు సేకరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. వైద్యం, ఆహారం, మీడియా తదితర రంగాలకు సంబంధించిన వారిని వదిలిపెట్టారు. హైదరాబాద్‌లో కర్ఫ్యూ ఫొటోలు -
నైట్ కర్ఫ్యూలో నిర్యానుష్యంగా నగరం
-
పౌరులతో దురుసుగా ప్రవర్తించకూడదు: డీజీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూను విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూఅమలుపై పోలీస్ ఐజీలు, కమీషనర్లు, ఎస్పీలతో తెలంగాణ డీజీపీ ఎమ్ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవోలో పేర్కొన్న విధంగా పటిష్టంగా కర్ప్యూను అమలుచేయాలని తెలిపారు. అంతేకాకుండా అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలను రాత్రి 8 గంటలకు మూసివేయాలని పేర్కొన్నారు. ఏ గూడ్స్ వాహనాలను ఆపకూడదన్నారు. కాగా, నైట్ కర్ఫ్యూలో మినహాయింపు ఉన్నవారు సెల్స్ ఐడెంటిటీ కార్డును కచ్చితంగా వెంట ఉంచుకోవాలని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని పోలీసులకు విజ్ఙప్తి చేశారు. అంతేకాకుండా కర్ఫ్యూ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలను పాటించాలని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్,జితేందర్, ఐ. జీ. లు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, రాజేష్ కుమార్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: అంతా తూచ్.. అది నకిలీ పోలీస్ నోటిఫికేషన్ -
ప్రజలంతా కర్ఫ్యూకి సహకరించాలి: మహేష్ భగవత్
సాక్షి, హైదరాబాద్: నగర వాసులు నైట్ కర్ఫ్యూని విధిగా పాటించాలని రాచకొండ కమిషనరేట్ సీపీ మహేష్ భగవత్ కోరారు. సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. ఇప్పటికే రాష్ట్రంలో 5,900 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఈరోజు నుంచి మే1 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. బార్లు, హోటల్స్, రెస్టారెంట్లు, మాల్స్, షాప్స్ రాత్రి ఎనిమిది గంటలకు ముసివేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, మెడికల్, ఎమర్జెన్సీ సర్విస్, మీడీయా ఉద్యోగులు ఐడికార్డ్స్ వెంట పెట్టుకోవాలి అని సూచించారు. ఇక ‘‘నగరం మొత్తం మీద 46 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. చాలా సీరియస్‌గా కర్ఫ్యూ అమలు ఉంటుంది. కర్ఫ్యూ నిర్వహణలో భాగంగా పాట్రోల్ మోబైల్స్, బ్లూ కోట్స్ రంగంలోకి దింపాము. నిభందనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 51 నుంచి 60 వరకు డిజార్డర్ మానేజ్ మెంట్, ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తాం. మాస్క్ ధరించకుంటే వెయ్యిరూపాలు జరిమానా విధిస్తాం. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలి’’ అని కోరారు. చదవండి: నైట్ కర్ఫ్యూ: మెట్రో సేవల్లో మార్పులివే.. -
నైట్ కర్ఫ్యూ: మెట్రో సేవల్లో మార్పులివే..
-
నైట్ కర్ఫ్యూ: మెట్రో సేవల్లో మార్పులివే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుంచే కర్ఫ్యూ నిబంధలను అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో సేవల్లో మార్పులు చేస్తున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి ఉండటంతో.. రాత్రి 7.40 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. ఇక ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని.. మాస్క్ లేని వారికి మెట్రోలోకి అనుమతి లేదన్నారు. కోవిడ్ 19 సేఫ్టీ గైడ్‌లైన్స్ ప్రకారం భౌతిక దూరం పాటించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి మే 1 వరకు నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఇక రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్ నిర్వహణకు అనుమతినిచ్చింది. చదవండి: తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ -
తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ
-
తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ విధించింది. నేటి నుంచి మే 1 వరకు నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఇక రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్ నిర్వహణకు అనుమతినిచ్చింది. అదే విధంగా మీడియా, పెట్రోల్ బంక్‌లు, ఐటీ సేవలకు అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్, విద్యుత్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని, స్థానిక, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. అదే విధంగా, ప్రయాణాలకు ఎలాంటి ప్రత్యేకమైన పాసుల అవసరం లేదని పేర్కొంది. కరోనా పరిస్థితుల ప్రభావాన్ని అనుసరించి మే 1 తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. కర్ఫ్యూ నుంచి మినహాయింపులు: ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ సర్వీసులు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు ఇ- కామర్స్ వస్తువుల డెలివరీకి అనుమతి పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, సీఎన్జీ, పెట్రోలియం, గ్యాస్ అవుట్లెట్లు శక్తి ఉత్పాదన, పంపిణీ కోల్డ్ స్టోరేజీ, వేర్‌హౌజింగ్ నీటి సరఫరా, పారిశుద్ధ్యం ప్రైవేటే సెక్యూరిటీ సర్వీసులు ప్రొడక్షన్ యూనిట్లు కర్ఫ్యూ సమయంలో వీరు మినహా మిగతా పౌరులు బయట తిరగడం నిషేధం. ►పైన పేర్కొన్న సంస్థల్లో పనిచేసేవారు(ఐడీ కార్డు తప్పక చూపించాలి) ►కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాధికారులు ఐడీ కార్డు చూపించి ప్రయాణాలు చేయవచ్చు ►డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, ఇతర ఆస్పత్రి సిబ్బందికి అనుమతి ►గర్భిణులు, వైద్య సహాయం తప్పనిసరిగా అవసరమైనవారు ►ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండు నుంచి రాకపోకలు సాగించేవాళ్లు టికెట్ చూపించాలి. గమనిక: నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 51-60, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. రాష్ట్రంలో కొత్తగా 5926 కేసులు తెలంగాణలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,926 కేసులు వెలుగుచూడగా, 18 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,61,359కు చేరగా, మరణాల సంఖ్య 1,856కు చేరుకుంది. ప్రస్తుతం 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గతకొన్ని రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే సర్కారుకు ఏమీ పట్టడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికై లాక్డౌన్ లేదా రాత్రి కర్ఫ్యూ విధించే అంశంపై 48 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. లేదంటే తామే ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. చదవండి: లాక్‌డౌన్‌పై 48 గంటల్లో చెప్పండి? -
కరోనా మారణకాండ.. నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దాడి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా కాటుకు గడిచిన 24 గంటల్లో 146 మంది చనిపోయారు. మరో 15,785 పాజిటివ్‌లు, 7,098 డిశ్చార్జిలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11,76,850కు పెరిగింది. అందులో 10,21,250 మంది కోలుకున్నారు. మరో 13,497 మంది మరణించారు. ప్రస్తుతం 1,42,084 కేసులు యాక్టివ్ కేసులుండగా అందులో 721 మంది రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈసారి మరణాలు హఠాత్తుగా పెరగడం గమనార్హం. బెంగళూరులో 9,618 కేసులు.. బెంగళూరులో తాజాగా 9,618 పాజిటివ్‌లు, 4,240 డిశ్చార్జిలు, 97 మరణాలు సంభవించాయి. నగరంలో ఇప్పటివరకు 5,220 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. ప్రస్తుతం 1,03,178 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా భయానికి తోడు కఠినమైన ఆంక్షల వల్ల బెంగళూరు నుంచి వేలాది మంది స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. కోరమంగళలోని ఇండోర్‌స్టేడియాన్ని కోవిడ్ సెంటర్‌గా మార్చుతున్నారు. అయితే ఎప్పుడు ప్రారంభిస్తారనేది చెప్పడం లేదు. మరణాలు ఎక్కడ ఎన్ని.. బెంగళూరులో 97, హాసన్‌లో 11, మైసూరులో 8, బెంగళూరు రూరల్‌లో 6, కలబురిగిలో 6, ధారవాడలో 3, బీదర్, చిక్కబళ్లాపుర, యాదగిరిలో రెండు చొప్పున, బళ్లారి, బెళగావి, హావేరి, కొడగు, కోలారు, రామనగర, తుమకూరు, ఉత్తర కన్నడ, విజయపురలో ఒక్కో మరణం నమోదైంది. 84,785 మందికి టీకా.. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 1,23,212 శాంపిళ్లు పరీక్షించారు. ఇప్పటి వరకు టెస్టులు 2,37,16,866 అయ్యాయి. కొత్తగా 84,785 మందికి కరోనా టీకా వేశారు. దీంతో మొత్తం టీకాల సంఖ్య 71,17,405 కు పెరిగింది. నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్ యశవంతపుర: రాష్ట్రంలో కరోనా నియంత్రణపై చర్చించడానికి నేడు మంగళవారం ప్రతిపక్ష పార్టీల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం బీఎస్ యడియూరప్ప నిర్ణయించారు. సీఎంకు కరోనా సోకడంతో ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం తెలిసిందే. అక్కడి నుంచే సాయంత్రం 4:30 గంటలకు కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇందులో పాల్గొనాలని ప్రతిపక్ష నేతలకు సీఎంఓ సమాచారం పంపింది. కాగా గవర్నర్ వజూభాయ్ ఆర్ వాలా ఈ సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించనున్నట్లు సమాచారం. ఈ మంగళవారం నాటి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం యడియూరప్ప, ప్రతిపక్షనేత సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామి, డీకే శివకుమార్ తదితరులు పాల్గొననున్నారు. బెడ్స్ కొరత వాస్తవమే యశవంతపుర: బెంగళూరు నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరగటంతో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. సోమవారం ఆయన బెంగళూరులో విలేకర్లతో మాట్లాడుతూ... బెంగళూరులో లాక్డౌన్ ప్రచారం జరుగుతోందని, అయితే లాక్డౌన్ ఒక్కటే పరిష్కారంకాదని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు మునిరత్న, గరుడాచార్ మాట్లాడుతూ చిక్కపేట పరిధిలో కరోనా కేసులు అధికమయ్యాయి. బెడ్ల కొరత కారణంగా రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. పరిస్థితికి అనుగుణంగా లాక్డౌన్ విధించాలని కోరారు. ప్రజలు సహకరించాలి: బొమ్మై బనశంకరి: ప్రజల సహకారం లేకపోతే ప్రభుత్వం ఎన్ని చట్టాలు అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ ప్రయోజనం లేదని హోంశాఖామంత్రి బసవరాజ బొమ్మై అన్నారు. సోమవారం నగరంలో మాట్లాడుతూ కోవిడ్ పెచ్చుమీరుతున్నందున ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనల్ని పాటించాలని కోరారు. 144 సెక్షన్, లాక్డౌన్, కర్ఫ్యూ వంటివి ప్రజలే విధించుకోవాలన్నారు. బెంగళూరులో కరోనా కట్టడికి ఎలాంటి చట్టాలను అమలు చేయాలనేదానిపై ఇప్పటికే నగర కమిషనర్‌తో చర్చించామన్నారు. పరిస్థితిని ఎదుర్కొనే శక్తి తమ పోలీసులకు ఉందని తెలిపారు. ఐసీయూలో సర్కారు: సిద్ధు.. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ సీఎం సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. సీఎం యడియూరప్ప కరోనా బారిన పడి ఆస్పత్రిలో ఉన్నారని, బీజేపీ ప్రభుత్వం ఐసీయూలో ఉందని ట్వీట్ చేశారు. కరోనా మరణాలు క్రమంగా పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. కాగా, కరోనా నియంత్రణలో భాగంగా మసీదులు మూసి వేయవద్దని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే జమీర్‌అహ్మద్, ఎమ్మెల్యే రిజ్వాన్ విన్నవించారు. చదవండి: బెంగళూరులో రాత్రి కర్ఫ్యూ.. లాక్‌డౌన్‌కు సీఎం ససేమిరా -
లాక్‌డౌన్‌పై 48 గంటల్లో చెప్పండి?
సాక్షి, హైదరాబాద్: కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ, వారాంతపు కర్ఫ్యూ విధించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుంటే.. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తామే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది. జనం గుమిగూడే ప్రదేశాలు, కార్యక్రమాలపై ఆంక్షలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, కరోనా నియంత్రణ చర్యలను ఈ నెల 22లోగా నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశిం చింది. ఈ మేరకు విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలంటే కొంత కష్టమని, మరికొంత గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించగా.. ‘‘గడువు ఇవ్వబోం.. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. ఏప్రిల్ 8న ఇచ్చిన ఆదేశాలను 10 రోజులైనా అమలు చేయలేదు. ఆదేశాల అమలుకు 240 గంటల సమ యం సరిపోలేదా?’’ అని నిలదీసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. క్లబ్బులు, పబ్స్, మాల్స్, సినిమా థియేటర్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌లో పరిమిత సంఖ్యలో జనాన్ని అనుమతించేలా ఎందుకు ఆదేశాలు జారీచేయడం లేదని ప్రశ్నించింది. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలకన్నా ఆదాయమే ముఖ్యమా అని మండిపడింది. సర్కారు చర్యలపై అసంతృప్తి కరోనా విజృంభిస్తోందని, నియంత్రణ చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. ఆర్.సమీర్ అహ్మద్, న్యాయవాది పి.తిరుమలరావు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత విచారణ సందర్భంగా తామిచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని, తాము కోరిన ఏ సమాచారం కూడా ఇవ్వలేని అసహనం వ్యక్తం చేసింది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతున్నా.. కరోనా నియంత్రణ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ మండిపడింది. అరకొర సమాచారంతో అసమగ్రంగా నివేదిక సమర్పించారంటూ కేసు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఆలోగా వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భోజన విరామం తర్వాత వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు ఇద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నారా? నిత్యం వేల కరోనా కేసులతో ఢిల్లీ భయానక పరిస్థితి ఎదుర్కొంటోందని, ఢిల్లీ లాంటి పరిస్థితి తెలంగాణలో రావాలని కోరుకుంటున్నారా అని ఉన్నతాధికారులను ధర్మాసనం నిలదీసింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించిందని, ఇక్కడ మాత్రం ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడింది. ఉప ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలోనే జనం హాజరుకావాలన్న నిబంధన ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించింది. ఆదేశాలను అమలు చేయలేదేం? ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలని.. రాష్ట్ర సరిహద్దుల్లో తప్పనిసరిగా కరోనా టెస్టింగ్ కేంద్రాలు పెట్టాలని, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్స్టేషన్లలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరామని ధర్మాసనం గుర్తు చేసింది. అయినా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మండిపడింది. మైక్రో, కంటైన్మెంట్ జోన్లను ప్రకటించాలని.. వాటిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పినా ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. జిల్లాల వారీగా కేసుల సంఖ్య, అందులో లక్షణాలున్న వారెందరు, లక్షణాల్లేని వారెందరు, మరణాలు ఎన్ని, కోలుకున్న వారెందరు, చికిత్స పొందుతున్నది ఎందరన్న వివరాలు ఇవ్వాలని అడిగినా.. అసమగ్రంగా నివేదిక సమర్పించారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించినా.. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినా పోలీసు యంత్రాంగం ఆశించిన స్థాయిలో పనిచేయలేదని పేర్కొంది. 14 ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు నివేదికలో పేర్కొన్నా.. ఎప్పటిలోగా ఏర్పాటవుతాయన్నది పేర్కొనలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. రెండు, మూడు వారాల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 49 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ కార్యదర్వి రిజ్వీ ధర్మాసనానికి నివేదించారు. 2 73 మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని, ఈ సమాచారాన్ని వైద్యారోగ్య శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. పాజిటివ్ వారిలో 80 శాతం మందికి లక్షణాలే ఉండడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్న వివరాలను కూడా ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అప్డేవ్ చేస్తున్నామన్నారు. దీనిపై స్పందించిన బెంచ్ పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలతో నివేదిక ఇవ్వండి ‘‘ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలను ఎన్ని గంటల్లో ఇస్తున్నారు.. వృద్దులు, వికలాంగులు, అనాథలు కరోనా బారినపడకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎక్స్పర్ట్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? పలుచోట్ల కుటుంబాలు మొత్తంగా కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో.. అలాంటి వారికి ఉచితంగా లేదా నామమాత్రపు ధరకు ఆహారం అందించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? రాష్ట్రవ్యాప్తంగా మందుల సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు? ఆక్సిజన్ నిల్వల కొరత రాకుండా ఏం చేస్తున్నారు?’’ తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
లాక్‌డౌనా.. కర్ఫ్యూనా.. 48 గంటల్లోగా తేల్చండి: హైకోర్టు
-
లాక్‌డౌనా.. కర్ఫ్యూనా.. 48 గంటల్లోగా తేల్చండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. 48 గంటల్లోగా రాష్ట్రంలో లాక్డౌన్ లేదా కర్ఫ్యూ విధింపుపై నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కోవిడ్ వ్యాప్తిపై ప్రభుత్వం సమీక్షలు నిర్వహించడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు అధికారులు సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. వెబ్సైట్లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలన్న హైకోర్టు.. జీహెచ్ఎంసీలో నమోదైన కరోనా కేసుల వివరాలు వార్డుల వారీగా సమర్పించాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ 24 గంటల్లోగా వచ్చేలా చూడాలని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 23కి వేసింది. చదవండి: ‘కరోనా పురుగు దొరికితే మాజీ సీఎం నోట్లో వేస్తాను’ -
రాత్రి కర్ఫ్యూ.. ఆదివారం ఫుల్ లాక్డౌన్
రాష్ట్రంలో కరోనా కట్టడి లక్ష్యంగా రాత్రి కర్ఫ్యూకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఫుల్ లాక్డౌన్ అమలు కానుంది. ప్లస్‌టూ పరీక్షలు, పోలీసు, విద్యుత్ బోర్డు పరీక్షలన్నీ వాయిదా వేశారు. ప్రైవేటు సంస్థలు యాభై శాతం ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోమ్ చేపట్టే రీతిలో ఆదేశాలు జారీ అయ్యాయి. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ప్రప్రథమంగా ఆదివారం 10 వేల 723 పాజిటివ్‌లు, 42 మరణాలు చోటుచేసుకున్నాయి. రెండు వారాల్లో మూడింతల మేరకు కేసులు పెరగడంతో నిబంధనల్ని కఠినం చేయకతప్పలేదు. అయినా, ప్రజల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించడం, నిబంధనలు తుంగలో తొక్కేవారు అధికంగా ఉండడంతో ఆంక్షల కఠినంకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం ఉదయం గ్రీన్‌వేస్ రోడ్డులోని నివాసంలో సీఎం పళనిస్వామి అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌రంజన్, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, డీజీపీ త్రిపాఠి, అధికారులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. గంటన్నర పాటు సాగిన ఈ భేటీ తర్వాత సాయంత్రం ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన చేసింది. రాత్రి కర్ఫ్యూ.. బహిరంగ ప్రదేశాలు, వేడుకలు, సమావేశాలు, సభల్లో ప్రజలు నిబంధనల్ని పాటించడం లేదని, సరైన మార్గదర్శకాలను అనుసరించడం లేదని పేర్కొంటూ, రెండు వారాల్లో ఏ మేరకు కేసుల సంఖ్య పెరిగిందో ఆ ప్రకటనలో వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రాత్రి పది గంటల నుంచి వేకువ జామున నాలుగు గంటల వరకు నైట్‌కర్ఫ్యూ విధించారు. ఈ సమయాల్లో అత్యవసర సేవల వాహనాలు, అంబులెన్స్, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లకు వెళ్లడం కోసం అద్దె, వ్యక్తిగత వాహనాలు, పాలు, పత్రికలు, సరకుల సరఫరా వాహనాలు మినహా తక్కిన, అన్ని రకాల వాహన సేవలకు అనుమతి లేదని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల మధ్య కూడా వాహన సేవలు ఉండవని స్పష్టం చేశారు. ఆ తర్వాత సమయాల్లో కరోనా నిబంధనలకు అనుగుణంగా వాహన సేవలకు అనుమతి కల్పించారు. పెట్రోల్, డీజిల్ బంక్‌లకు రాత్రుల్లోనూ అనుమతి ఇచ్చారు. రాత్రుల్లో ప్రైవేటు పరిశ్రమలు, అత్యవసర పరికరాల తయారీ పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది, వాచ్మన్లు, సెక్యూరిటీలు విధులకు వెళ్లే సమయంలో గుర్తింపు కార్డులు లేదా అనుమతి లేఖ తప్పనిసరిగా కల్గి ఉండాలని ఆదేశించారు. ప్రైవేటుసంస్థలు, ఐటీ సంస్థలు 50 శాతం సిబ్బందితో వర్క్ ఫ్రం హోమ్‌పై దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆదివారం పూర్తి లాక్డౌన్ విధిస్తూ, మాంసం, చేపలు, కూరగాయలు, సినిమా థియేటర్లు, వాణిజ్య సమూదాయాలు అంటూ అన్ని సేవలు నిలుపుదల చేయనున్నారు. అయితే, అత్యవసర, మీడియా, పాలు సేవలకు అనుమతి ఇచ్చారు. 30 వరకు అమలు హోటళ్లల్లో పార్సిల్స్ సేవలకు సమయం కేటాయించడమే కాకుండా, టాస్మాక్ దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, వస్త్ర దుకాణాలన్నీ రాత్రి 9 గంటలకే మూసివేయాలని ప్రకటించారు. స్విగ్గి, జొమాటో ఆన్లైన్ వర్తక సేవలకు సమయం కేటాయించారు. అన్ని రోజుల్లో వివాహ కార్యక్రమల్లో 100 మంది మించకుండా, అంత్యక్రియల కార్యక్రమాల్లో 50 మంది మించకుండా ఉండే రీతిలో చర్యలు తీసుకున్నారు. నీలగిరి, కొడైకెనాల్, ఏర్కాడు, ఊటీ సహా పర్యాటక కేంద్రాలు, బీచ్‌ల వైపు, పార్కులు, వినోద కేంద్రాలు, ఎగ్జిబిషన్లు అన్నీ మూసివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వీటికి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి అనుమతి లేదు. ముందుగా నిర్ణయించిన వేడుకలు, సమావేశాలు, ఉత్సవాలకు నిర్వాహకులు, 50 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అదే విధంగా ప్లస్‌టూ పరీక్షలు, పోలీసు శరీర దారుఢ్య పరీక్షలు, విద్యుత్ బోర్డు పరీక్షలన్నీ వాయిదా వేశారు. అయితే, ప్లస్‌టూ ప్రాక్టికల్స్ కొనసాగుతాయని ప్రకటించారు. విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఆన్లైన్ తరగతులు, ఆన్‌లైన పరీక్షల నిర్వహణకు అవకాశం ఇచ్చారు. వేసవి శిక్షణకు అనుమతి రద్దు చేశారు. కరోనా పాజిటివ్ కేసుల పెరుగుల దృష్ట్యా, ప్రైవేటు వసతి గృహాలు, లాడ్జీలు, హోటళ్లు, రిసార్టులను క్వారంటైన్లుగా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. అయితే, ఇందుకు ఆరోగ్య శాఖ అనుమతి తప్పనిసరి చేశారు. సినిమా థియేటర్లలో 50 శాతం మందికి మాత్రమే అనుమతిని తప్పనిసరిగా అనుసరించాలని, లేని పక్షంలో సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ అయ్యాయి. చెన్నైలో కోవిడ్ కంట్రోల్ రూం సాక్షి, చెన్నై: చెన్నైలోని 15 మండలాల్లోని ప్రజలకు కరోనా వైద్య, చికిత్సా సేవల నిమిత్తం ప్రత్యేకంగా కోవిడ్ కంట్రోల్‌రూం ఆదివారం ఏర్పాటైంది. 12,600 పడకలతో కేర్ సెంటర్లు సిద్ధం చేసినట్టు కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ వెల్లడించారు. రాష్ట్రంలోనే చెన్నైలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 3,304 కేసులు చెన్నైలో నమోదయ్యాయి. ఇక్కడ కేసుల పెరుగుదలతో కార్పొరేషన్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇంటింటా ఫీవర్ టెస్టులు, పరీక్షల్లో వెలుగు చూసే కేసుల లక్షణాలను బట్టి వారికి చికిత్స అందించడం, హోం క్వారంటైన్ సేవలపై దృష్టి పెడుతూ నగరంలో 12 చోట్ల స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పాజిటివ్ రోగి తొలుత ఈ సెంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది. రోగి వ్యాధి తీవ్రత, లక్షణాలను బట్టి చికిత్సలపై ఈ సెంటర్లలో దృష్టి పెడతారు. అలాగే, కరోనా సమాచారం, అత్యవసర సేవలు, కరోనా బారినపడి హోం క్వారంటైన్లలో ఉన్న వారు సేవలను పొందేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఆదివారం ఏర్పాటు చేశారు. 044–46122300, 25384520 నంబర్లను ఇందుకోసం కేటాయించారు. ఈ కంట్రోల్ రూంకు ఫోన్ చేస్తే, తమకు కావాల్సిన సేవలు కరోనా బాధితులకు, వారి కుటుంబాలకు అందుతాయని కమిషనర్ ప్రకాష్ ప్రకటించారు. వీడియో మెడికల్ యాప్ ఏర్పాటు చేశామని, దీని ద్వారా ఇళ్లల్లో ఉన్న వారికి మనో ధైర్యాన్ని కల్పించడమే కాకుండా, వైద్యపరంగా సహకారం అందించేందుకు డాక్టర్లు సిద్ధంగా ఉంటారని వివరించారు. టెలీ కౌన్సిలింగ్.. ఈ కంట్రోల్ రూమ్‌లో టెలీ కౌన్సిలింగ్ సదుపాయం, సైక్లాజికల్ సపోర్టింగ్ టీంను నియమించామని, మూడు షిఫ్ట్‌లుగా 150 మంది ఇక్కడ సేవల్ని అందిస్తారని వివరించారు. ఈ కంట్రోల్ రూం సేవలు చెన్నైలోని 15 మండలాల్లో ఉన్న 200 వార్డుల్లోని ప్రజలకు మాత్రమే వర్తిస్తాయని తెలిపారు. కరోనా టీకాకు వ్యతిరేకంగా ఎవరైనా ఆరోపణలు, ప్రచారాలు చేసిన పక్షంలో కేసులు తప్పవని హెచ్చరించారు. సినీ నటుడు మన్సూర్ అలీఖాన్‌పై డీజీపీకి ఫిర్యాదు వెళ్లిందని, కేసు సైతం నమోదైనట్టు తెలిపారు. చెన్నైలో 12,600 పడకలతో ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రస్తుతం 1,104 మంది ఇక్కడ చికిత్సలో ఉన్నట్టు తెలిపారు. సినీ నటుడు అధర్వ కరోనా బారినపడ్డారు. వ్యాక్సిన్ కోసం స్టాలిన్ లేఖ ... రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో పలు చోట్ల కరోనా వ్యాక్సిన్, కోవిషీల్డ్‌లకు కొరత తప్పడం లేదు. రాష్ట్రం విజ్ఞప్తి మేరకు 20 లక్షల టీకాలను త్వరితగతిన పంపించాలని, రాష్ట్రాలే టీకాను కొనుగోలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆదివారం లేఖ రాశారు. ఆదివారం కోయంబేడు మార్కెట్‌ను మూసివేయడంతో ఆ పరిసరాలు నిర్మానుష్యం అయ్యాయి. తిరునల్వేలిలోని మహేంద్రగిరి ఇస్రో కేంద్రంలో పనిచేస్తున్న వారిలో 47 మంది ఆదివారం కరోనా బారినపడ్డారు. ఈరోడ్ జిల్లా మెడకురిచ్చిలోని ఓ ప్రైవేటు సంస్థలో వంద మేరకు సిబ్బంది కరోనా బారినపడడంతో ఆ పరిసరాల్లో వైరస్ కట్టడి నిమిత్తం గ్రామాల్లో ఉన్న దుకాణాలన్నీ నాలుగు రోజులు స్వచ్ఛందంగా మూసి వేస్తూ వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 12 ఏళ్లలోపు పిల్లలు రెండు వేల మంది వైరస్ బారిన పడడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. కేసుల పెరుగుదలతో దక్షిణ రైల్వే సైతం సిద్ధమైంది. అత్యవసర సేవల నిమిత్తం బోగీలను ప్రత్యేక పడకల కోవిడ్ సెంటర్లుగా సిద్ధం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్ అయ్యాయి. చదవండి: వ్యాక్సిన్‌కు, వివేక్ మృతికి సంబంధం లేదు -
అర్ధరాత్రి నడిరోడ్డుపై యువతి చిందులేస్తూ హల్చల్
గాంధీనగర్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నారు. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా తీసుకున్న ఆంక్షలను కొందరు నిర్లక్ష్యం చేస్తూ యథేచ్ఛగా ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి చిక్కుల్లో పడింది. చివరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తన ఫాలోవర్ల కోసం చేసిన ప్రయత్నం ఆమెను చిక్కుల్లో నెట్టేసింది. గుజరాత్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అయితే రాజ్‌కోట్‌కు చెందిన యువతి ప్రిషా రాథోడ్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంటుంది. ఈ సందర్భంగా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య భారీగా ఉంది. అయితే వారిని ఆకట్టుకునేందుకు కర్ఫ్యూ రాత్రి డ్యాన్స్ చేయాలని రాత్రి 11 గంటల సమయంలో రోడ్డుపైకి వచ్చింది. ఓ ఆంగ్ల పాటకు డ్యాన్స్‌లు చేసి రికార్డు చేసింది. అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోను చూసిన కొందరు ఆమె కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వివరాలు సేకరించారు. కర్ఫ్యూ ఉల్లంఘించిందని ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే అప్పటికే ఆ వీడియోను తాను డిలీట్ చేశానని.. ఆ వీడియోను చాలా మంది షేర్ చేయడంతో బయటకు వచ్చిందని ఆ యువతి పోలీసులకు వివరణ ఇచ్చింది. ఏది ఏమున్నా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమెపై రాజ్‌కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపై ఎవరూ కూడా ఇలాంటి తుంటరి పనులు చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. చదవండి: ‘జియో’ దెబ్బకు తట్టా, బుట్టా సర్దుకున్నా చదవండి: బీజేపీకి అండగా టీఆర్ఎస్.. ఉత్తమ్‌కు కేటీఆర్ ఫోన్ -
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆయన గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సమావేశమయ్యారు. తాజా పరిస్థితిను ఆయనకు తెలిపారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఢిల్లీలో ఈ నెల 16న రాత్రి 10 గంటల నుంచి 19న ఉదయం 6 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఢిల్లీలో 5 వారాల్లో కరోనా కేసులు 25 రెట్లు పెరిగాయి. మినహాయింపులు ఎవరికి.. వీకెండ్ కర్ఫ్యూ సమయంలో జరుగబోయే వివాహాలకు ఆంక్షలతో కూడిన అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. కర్ఫ్యూ సమయంలో వివాహాలకు హాజరయ్యేందుకు ప్రజలు ఈ–పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మాల్స్, జిమ్‌లు, స్పాలు, ఆడిటోరియంలు, మార్కెట్లు, ప్రైవేట్ కార్యాలయాలను 30వ తేదీ వరకు పూర్తిగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా హాళ్లను 30 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిపించేందుకు అవకాశం ఇచ్చారు. రెస్టారెంట్లలో భోజనం చేసేందుకు అనుమతి లేదు. కేవలం హోమ్ డెలివరీ మాత్రమే ఉంటుంది. ఆసుపత్రుల్లో పడకల కొరత ఏం లేదు: కేజ్రీవాల్ కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని అన్నారు. బాధితుల కోసం 5,000 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు.