
సాక్షి, విజయవాడ: కోవిడ్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కర్ఫ్యూని పోలీసులు కట్టుదిట్టం చేశారు. 12 గంటల తర్వాత ఈ-పాస్ ఉన్న వారికే ఏపీలోకి అనుమతిస్తున్నారు. ఆసుపత్రుల్లో అధికారులు బెడ్ల శాతాన్ని పెంచుతున్నారు. అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో వాక్సినేషన్ ప్రక్రియలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు.
కేంద్రం నుంచి వాక్సిన్ వచ్చేలోపు ఉన్న సమయాన్ని సద్వినియోగించుకునే విధానాలను అమలు చేస్తోంది. వాక్సిన్ కేంద్రాల సంఖ్య పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రతీ సెంటర్ వద్ద రెండు వెయిటింగ్ హాల్స్, 45 ఏళ్ళు నిండిన వారికి ముందు సెకండ్ డోస్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వలంటీర్ల ద్వారా స్లిప్పుల పంపిణి చేస్తోంది. వాక్సిన్ కేంద్రం, రావలసిన తేదీ , సమయం వివరాలతో స్లిప్పుల పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకాలు అమలు చేసేలా ప్రత్యేక సిబ్బందిని నియమించింది.
చదవండి: ప్రజలకు వాస్తవాలు వివరిద్దాం..
చంద్రబాబు కుట్ర బట్టబయలు
Comments
Please login to add a commentAdd a comment