e pass
-
నచ్చిన రాఖీ.. మెచ్చిన సందేశం..
సాక్షి, హైదరాబాద్: వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫొటోల్లో నచ్చిన రాఖీని ఎంపిక చేసుకొని.. అక్కడే ఉన్న నచ్చిన సందేశాన్ని కూడా క్లిక్ చేసి పంపాల్సిన చిరునామా టైప్ చేసేసి.. రూ.100 చెల్లిస్తే స్పీడ్ పోస్టులో సందేశంతోపాటు ఎంపిక చేసిన రాఖీ ఆ అడ్రస్‌కు చేరిపోతుంది. తొలిసారి రాఖీని ఈ–షాప్ పద్ధతిలో సోదరులకు పంపే ఏర్పాటు చేసింది. తపాలాశాఖ ఠీఠీఠీ.్ఛటజిౌp.్టటఞౌట్టట.జీn వెబ్సైట్ ద్వారా ఈ అవకాశం లభించనుంది. శుక్రవారం తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ రాజేంద్రకుమార్ దీన్ని ప్రారంభించారు. వెబ్సైట్లో రకరకాల నమూనాల రాఖీల చిత్రాలుంటాయి. పోస్టల్ కవర్, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ సందేశాలుంటాయి. -
ట్రంప్, అమితాబ్‌లకు లాక్డౌన్ పాసులు!!
సిమ్లా: లాక్డౌన్ టైంలో జనాల అత్యవసరాల సేవల కోసం పోలీసులు ఈ-పాస్‌లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హిమాచల్ ప్రదేశ్ పోలీసుల నిర్వాకంపై జనాలు నవ్వుకుంటున్నారు ఇప్పుడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌లకు లాక్డౌన్ ఈ-పాస్‌లు జారీ చేశారు అక్కడి పోలీసులు. ఈ వ్యవహారం మీడియాలో హైలైట్ కాగా, ఈ వ్యవహారం వెనుక ఉన్న జర్నలిస్ట్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో వ్యవహారం కోర్టుకి చేరింది. లాక్డౌన్ టైంలోనూ ప్రైవేట్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో యథేచ్చగా తిరుగుతుండడంతో అమన్ కుమార్ భరద్వాజ్ అనే జర్నలిస్ట్ ‘ఈ-పాస్ వ్యవహారం’పై అనుమానపడ్డాడు. తన ఆధార్ వివరాల్ని ఇచ్చి.. ట్రంప్, అమితాబ్ ఫొటోలతో పాస్‌ల కోసం పోలీస్ ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కనీసం ఆ ఫొటోల్ని కూడా పట్టించుకోకుండా, దరఖాస్తుల్ని కూడా వెరిఫై చేయకుండానే పాస్‌లు జారీ చేశారు పోలీసులు. ఈ వ్యహారంపై మే 5న అమన్ కుమార్ రిపోర్ట్ చేసిన స్టోరీ టీవీ ఛానెల్లో టెలికాస్ట్ అయ్యింది. దీంతో పోలీసులు అదే రోజు సాయంత్రం ఆ జర్నలిస్ట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద అరెస్ట్ కోసం ప్రయత్నించారు. ఈలోపే అమన్ అప్రమత్తమై హైకోర్టును ఆశ్రయించాడు. ఈ-పాస్‌ల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం బయటపడిందని, పత్రికా స్వేచ్ఛను పోలీసులు అణిచివేయాలని చూస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే అతని విజ్ఞప్తిని మన్నించిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు.. ఈ వ్యవహారంలో పోలీసులపై అక్షింతలు వేసింది. అంతేకాదు ఈ కేసు విచారణలో తదుపరి వాదనల వరకు అమన్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. చదవండి: సంసారానికి పనికి రాడనడం దాని కిందకే లెక్క! -
e- pass: కావాలా.. ఇలా అప్లై చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ అమలు నేపథ్యంలో అత్యవసర ప్రయాణాల నిమిత్తం పోలీసులు ఈ–పాసులు జారీ చేస్తున్నారు. https://policeportal.tspolice.gov.in వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ సూచించిన విధంగా వివరాలు నమోదు చేసి తగిన ఆధారాలు/డాక్యుమెంట్లు సమర్పించాలి. అయితే అత్యవసరాలు, వైద్యసేవలు, వివాహాలు, మరణాలకు మాత్రమే తక్షణం పాసులు జారీ చేస్తున్నారు. కారణాలు సహేతుకంగా లేకున్నా, డాక్యుమెంట్లు సరిగా లేకున్నా తిరస్కరిస్తున్నారు. విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు చేసేవారు ఎలాంటి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణవాసులైతే ఇలా.. https://policeportal.tspolice.gov.inవెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో ముందుగా మీరు కంటైన్మెంట్ జోన్లో లేనని, తాను కంటైన్మెంట్ ప్రాంతానికి ప్రయాణించడంలేదని, తనకు కోవిడ్ అనుమానిత లక్షణాలు ఏమీ లేవని, తాను సమర్పించే అన్ని వివరాలు నిజమైనవేనని స్వయం ధ్రువీకరణ ఇవ్వాలి. తర్వాత అందులోని ఒక్కో కాలమ్‌ను నింపాలి. పేరు చిరునామా, వాహనం వివరాలు, దాని సీటింగ్ సామర్థ్యం, ప్రయాణం తేదీ, తిరుగు ప్రయాణం తేదీ, ఏ రూట్లో వెళ్లి వస్తారు తదితర అన్ని వివరాలు నింపాలి. ఆఖర్లో నిర్దేశించిన మూడు కీలకమైన కాలమ్స్‌లో మీ ఫొటో (80కేబీ), ఆధార్ (500కేబీ), తరువాత ఏ కారణం వల్ల ప్రయాణం చేస్తున్నామో సంబంధిత ధ్రువీకరణ పత్రం (500కేబీ, ఆసుపత్రి, వివాహం, మెడికల్ ఎమర్జెన్సీ, డెత్ సర్టిఫికెట్) తదితరాలు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఇతర రాష్ట్రాల వారికి.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి కూడా మార్గదర్శకాలు దాదాపుగా ఒకటే. ఈ సదుపాయాన్ని మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. కాకపోతే, ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారు? నివాస పూర్తి చిరునామా, తెలంగాణలోని ఏ జిల్లా, ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వెళ్తున్నారు? ఆ చిరునామా? ఏ రూట్లో వచ్చి వెళతారు? తదితర వివరాలు అదనంగా జోడించాల్సి ఉంటుంది. మిగిలిన ధ్రువీకరణ పత్రాలు యథావిధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు 1,24,225 పాసులు జారీ చేశారు. -
కొన్ని ప్రాణాలు కాపాడగలిగామన్న సంతృప్తి ఉంది: నిఖిల్.
‘‘బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కోసం రిక్వెస్ట్ వస్తే మణికొండ నుంచి నా భార్యతో రాజేంద్రనగర్‌లోని ఫార్మా ఫ్యాక్టరీ గోడౌన్ వరకూ వెళ్లి, అక్కడ్నుంచి సోమాజిగూడ ఆసుపత్రి దాకావెళ్లి ఆ మెడిసిన్ అందజేశాను. రాత్రి 2 గంటల టైమ్‌లో నేనొస్తానని ఊహించలేదేమో.. ఆ కుటుంబ సభ్యుల కన్నీళ్లు చూస్తే నాకు కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు హీరో నిఖిల్. నాలుగు రోజుల క్రితం నిఖిల్ అవసరార్ధుల కోసం సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రికి మెడిసిన్స్ తీసుకెళుతున్న సమయంలో పోలీసులు ‘ఈ పాస్’ లేదని అడ్డుకున్నారు. ‘‘ఆ రోజు ఏం జరిగిందంటే... మందులు తీసుకెళుతున్నప్పుడు పోలీసులు ఆపారు. మాస్క్ తీసి ముఖం చూపలేదు కానీ, ప్రిస్క్రిప్షన్ చూపించి, ఎమర్జెన్సీ అని చెప్పినా ‘ఈ పాస్’ ఉండాల్సిందే అన్నారు. రోడ్డు మీదే 20నిమిషాలు ట్రై చేసినా పాస్ దొరకలేదు. ఆ విషయాన్నే ట్వీట్ చేశా’’ అన్నారు నిఖిల్. ఈ ఉదంతం బయటకు వచ్చేవరకూ నిఖిల్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో నిఖిల్ పంచుకున్న అనుభవాలివి.. తుపాన్లు, వరదలు వస్తే నష్టాన్ని అంచనా వేసి తలా ఇంత అని సాయం చేయడం వేరు. కానీ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క, మందులు దొరక్క ప్రాణాలు పోయే పరిస్థితులు.. అంచనాలకు అందని వ్యాధులు.. వీటి మధ్య అవసరార్ధులకే కాదు సాయం చేయాలనుకున్నవారికీ కష్టమే. గత ఏప్రిల్‌లో నా భార్య, మా అంకుల్ కోవిడ్ బారిన పడినప్పుడు ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం ఎదుర్కొన్న ఇబ్బందులు నన్ను ఆలోచింపజేశాయి. అప్పటికే ట్విట్టర్లో చూస్తే... పెద్ద సంఖ్యలో సాయం కోరుతూ రిక్వెస్టులు. కొంతమందికైనా సహాయం చేయాలనుకున్నాను. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్‌లలో వచ్చిన ప్రతీ రిక్వెస్ట్‌నీ పరిశీలించి, వీలైనంతవరకూ అటెండయ్యాం. ఇంజక్షన్ కావాలన్నవారికి ఇంజక్షన్, మెడిసిన్స్ అంటే మెడిసిన్స్, ఆసుపత్రి బిల్ కట్టలేకపోయిన వారికి బిల్లు... ఇలా వందలాది పేషెంట్స్‌కి కావాల్సినవి సమకూర్చగలిగాం. కాకినాడ కేజీహెచ్‌లో ఒకరికి బ్లాక్ ఫంగస్, విజయవాడ కామినేని ఆసుపత్రిలో ఇలా కొందరి గురించి ఆరోగ్యాంధ్రకు వారిని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తే.. వారు కూడా ఆయా పేషెంట్స్‌కి ఉచితంగా చికిత్స చేయించారు. నాకు విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ ఆసుపత్రుల్లో మంచి పరిచయాలు ఉండడం హెల్ప్ అయింది. రిక్వెస్టులు తగ్గాయి ఈ నెల 15 వరకూ రోజుకు దాదాపు 1000 దాకా రిక్వెస్టులు వచ్చాయి. అయితే ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టడం వల్ల, బెడ్స్ బాగా పెరిగి అందుబాటులోకి రావడం వల్లనేమో ఆ తర్వాత తగ్గాయి. గతంలో తిత్లీ తుపాన్ టైమ్‌లో కూడా బాధితులకు సేవ చేసిన అనుభవం ఉంది. అయితే ఇన్ని రోజులు ఇంత కంటిన్యూగా చేయడం చాలా కొత్త అనుభవాలను, పాఠాలను నేర్పింది. ఒక అబ్బాయికి ఆక్సిజన్ సిలిండర్ పంపిస్తే అది ఇంటికి చేరేలోపు చనిపోయాడు. ఇలా చివరి నిమిషాల్లో రిక్వెస్ట్‌లు పెట్టడం వల్ల ప్రాణాలు కాపాడలేకపోవడమనే బాధ కలచివేసింది. ఏదేమైనా కొన్ని ప్రాణాలైనా కాపాడగలిగాం, కొంతమందికైనా ఉపశమనం ఇచ్చామనే సంతృప్తి అయితే ఉంది. పుట్టినరోజుకి ఫస్ట్ లుక్ నిఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ‘బన్ని’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘18 పేజెస్’ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అయితే బుధవారం అప్డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘18 పేజెస్’ టైటిల్ ఫిక్స్ చేసినప్పటినుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. గోపీసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బాబు, కెమెరా: వసంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శరణ్ రాపర్తి, అశోక్ బి. -
ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలి
సాక్షి, విజయవాడ: కోవిడ్ సమస్యలన్నీ ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలని సీపీ స్పష్టం చేశారు. వచ్చే అంబులెన్స్‌లను పరిశీలించి అనుమతి ఇస్తున్నామన్నారు. మద్యం అక్రమ తరలింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సమస్యలు ఉన్నాయి. జీజీహెచ్‌లో అక్సిజన్ అయిపోయే ప్రమాదాన్ని అందరి సహకారంతో అరికట్టాం. పోలీసు శాఖలో 97 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది. బ్లాక్మార్కెట్లో ఇంజక్షన్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్మార్కెట్లో ఇంజక్షన్లను అమ్మే 12 గ్యాంగ్‌లను పట్టుకున్నాం. విజయవాడ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుపై కేసులు నమోదు చేశాం. కరోనా కట్టడికి పెద్ద ఎత్తున ర్యాలీలు, అవగాహన కల్పించామని’’ సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు. చదవండి: తండ్రి పేరుతో సుక్కు ఆక్సిజన్ ప్లాంట్, ప్రారంభించిన మంత్రి ‘మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్‌కు కారణం’ -
నిబంధనలు అనుసరించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారు ఆయా రాష్ట్రాల్లో ఈ పాస్ నిబంధనల్ని ముందుగానే గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తున్న వారు సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద అవస్థలు పడుతున్న దృష్ట్యా డీజీపీ కార్యాలయం సోమవారం సూచనలు జారీ చేసింది. ఏపీకి రావాలంటే.. ఏపీలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రాష్ట్రానికి రావాలనుకొనే వారు ఉదయం 6 నుంచి 12 గంటల మధ్యనే ప్రయాణించేలా.. ఆ లోపే గమ్యానికి చేరుకునేలా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. అటువంటి వారికి పాస్‌లు అవసరం లేదు. మిగతా సమయంలో ప్రయాణిస్తే ఈ–పాస్ కచ్చితంగా తీసుకోవాలి. ప్రభుత్వం పేర్కొన్న అత్యవసర సేవలు, అంబులెన్స్ తదితర సేవలు, సంబంధిత సిబ్బందికి ఈ–పాస్ అవసరం లేదు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు అంబులెన్స్‌లో ప్రయాణించే పేషెంట్లతో ఉండే సహాయకులకు అనుక్షణం సహాయ, సహకారాలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సామాజిక మాధ్యమాలు (ట్విట్టర్, ఫేస్బుక్) ద్వారా నిరంతరం అందుబాటులో ఉంటుంది. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు లోబడి సంబంధిత స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రాలతో అనుమతి పొందాలి. ప్రతి ఒక్కరూ అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయంలో ఇంటిపట్టున ఉంటూ స్వీయ రక్షణ పొందాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఏపీలో ప్రయాణించాలంటే.. ఏపీ పరిధిలో ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్యే ప్రయాణించేలా.. ఆలోపే గమ్యాన్ని చేరుకునేలా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలిగితే ఎలాంటి పాస్‌లు అవసరం లేదు. మిగతా సమయాల్లో ప్రయాణిస్తే మాత్రం ఈ–పాస్ కచ్చితంగా తీసుకోవాలి. అటువంటి వారు తగిన ధ్రువీకరణ పత్రాలతో ఈ–పాస్‌కు దరఖాస్తు చేసి అనుమతి పొందాలి. ఏపీలో కర్ఫ్యూ సమయంలో ప్రయాణానికి సిటిజన్ సర్వీస్ పోర్టల్ (http://appolice. gov.in), ట్విట్టర్ (@ APPOLICE100), ఫేస్ బుక్ (@ ANDHRAPRADESHSTATEPOLICE) ద్వారా ఈ–పాస్ పొందవచ్చు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే.. ► తెలంగాణ వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి. అక్కడ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూ ఉండదు. మిగతా సమయాల్లో కర్ఫ్యూ ఉంటుంది. కానీ తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించాలంటే.. కర్ఫ్యూ ఉన్నా లేకపోయినా ఈ పాస్ తప్పనిసరి. https://policeportal. tspolice.gov.in/ ద్వారా తెలంగాణ ఈ–పాస్ పొందిన తర్వాతే ప్రయాణించాల్సి ఉంటుంది. ► తమిళనాడులో పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమల్లో ఉంది. తమిళనాడు భూ భాగంలోకి ప్రవేశించాలంటే ఈ–పాస్ తప్పనిసరి. https:// eregister.tnega.org/ ద్వారా తమిళనాడు ఈ–పాస్ పొందవచ్చు. ► ఒడిశాలో పూర్థిస్థాయిలో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఆ రాష్ట్రంలోకి ప్రవేశించాలన్నా ఈ–పాస్ తప్పనిసరి. https://covid19regd. odisha.gov.in/ లింక్ ద్వారా ఈ–పాస్ పొందవచ్చు. ► కర్ణాటకలోనూ పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమలులో ఉంది. కర్ణాటక భూభాగంలోకి ప్రవేశించాలంటే ఈ పాస్ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లింక్ ద్వారా కర్ణాటకలోకి వెళ్లేవారు ఈ–పాస్ పొందవచ్చు. కర్ణాటక ప్రభుత్వం అవసరాన్ని బట్టే వారి భూ భాగంలోకి ప్రవేశానికి అనుమతి ఇస్తుంది. -
ఈ-పాస్‌కు సంబంధించి ఏపీ పోలీస్ శాఖ కీలక సూచనలు
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈ-పాస్‌కు సంబంధించి కీలక సూచనలు చేసింది. ఈ-పాస్ లేకుంటే రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద సమస్య వస్తోందని, కనుక ఈ-పాస్ నిబంధనల ప్రకారం ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలిని సూచించింది. ఏపీలో ఉ.6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు ఉంటుందని, మిగతా సమయాల్లో ఏపీకి రావాలనుకునే వారికి ఈ-పాస్ తప్పనిసరిని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. అంబులెన్స్‌లు, అత్యవసర సేవలకు ఈ-పాస్ అవసరం లేదని తెలిపింది. దరఖాస్తు చేసిన గంట వ్యవధిలోనే ఈ-పాస్ మంజూరు చేయనున్నట్లు తెలిపింది. చదవండి: బ్లాక్ ఫంగస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి: సీఎం జగన్ -
పృథ్వీ షాకు చేదు అనుభవం.. అడ్డుకున్న పోలీసులు
ముంబై: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షాకు చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్రలో లాక్డౌన్ అమల్లో ఉండడంతో అధికారుల అనుమతి లేకుండా గోవాకు వెళుతున్న పృథ్వీ షాను అంబోలీ జిల్లా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విషయంలోకి వెళితే.. కరోనా సెగతో ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా హోం ఐసోలేషన్‌ను ఇటీవలే పూర్తి చేసుకున్నాడు. కాగా ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు పృథ్వీ షాను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో పృథ్వీ కాస్త సమయం దొరకడంతో గోవాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్రం అన్ని విమానాలపై నిషేధం విధించింది. దీంతో తన సొంత కారులో పృథ్వీ షా గోవాకు బయలుదేరాడు. అయితే కరోనా విజృంభిస్తున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్న ఈ పాస్ ఉంటేనే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అయితే పృథ్వీ షా వద్ద ఈ పాస్ లేకపోవడంతో అంబోలీ జిల్లా చెక్‌పోస్టు వద్ద పోలీసులు అతని కారును అడ్డుకున్నారు. ఈ పాస్ లేకపోవడంతో గోవా వెళ్లడం కుదరదన్నారు. పృథ్వీ షా ఎన్నిసార్లు అడిగినా పోలీసులు ఒప్పుకోకవడంతో.. గంటపాటు వేచిఉండి తన మొబైల్ నుంచే ఈ పాస్ అప్లై చేయగా.. అనుమతి వచ్చిన తర్వాత పోలీసులు ఒప్పుకున్నారు. ఇక ఆసీస్ పర్యటనలో ఘోరంగా విఫలం కావడంతో ఉద్వాసనకు గురైన పృథ్వీ ఆ తర్వాత దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోపీలో దుమ్మురేపాడు. నాలుగు సెంచరీలు సాధించి 800 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచి తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 14వ సీజన్లోనూ అదే జోరును కంటిన్యూ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 41 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. చదవండి: పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం! -
ఈ-పాస్ కోసం అప్లై..‘సిక్స్’ తెచ్చిన తంటాతో పరేషాన్
తిరువనంతపురం: ఒక్క పదం తప్పుగా రాయడంతో ఓ వ్యక్తి అష్టకష్టాలు పడ్డాడు. ఈ పాస్ కావాలని సిక్స్‌కు బదులు సెక్స్ అని రాశాడు దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. ఈ సంఘటన వైరల్‌గా మారింది. ‘‘సాయంత్రం సెక్స్ కోసం వెళ్లాలి’ పాస్ ఇవ్వండి అని ఈ పాస్ రిజిస్ట్రేషన్ ఓ వ్యక్తి చేసుకున్నాడు. పోలీసులు ఇది చూసి షాక్‌కు గురయ్యారు. ఆకతాయి పనిగా భావించి పోలీసులు అతడిని గుర్తించి ఇంటికెళ్లి స్టేషన్‌కు తరలించారు. విచారణ చేయగా అతడు చెప్పిన సమాధానం వింటే పోలీసులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం కేరళలో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో బయటకు వెళ్లేందుకు కన్నూర్‌లోని కన్నాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎందుకోసం వెళ్లాలి? అనే కాలమ్‌లో మనోడు ‘సాయంత్రం సెక్స్ కోసం వెళ్లాలి’ (Need To Go For Sex) అని రాశాడు. దీన్ని చూసిన పోలీసులు అసిస్టెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన విచారణ చేయమని ఆదేశించాడు. వెంటనే వల్లపట్టణం పోలీసులు అతడిని గుర్తించి విచారించారు. అప్పుడు ఆ వ్యక్తి తాను చేసిన తప్పును చూసి కంగారు పడ్డాడు. తాను తప్పు రాశానని.. ఆరు గంటలకు రాయబోయి సిక్స్ బదులు సెక్స్ అని రాసినట్లు తెలిపాడు. చూసుకోకుండా అలా పంపానని పోలీసులకు వివరణ ఇచ్చాడు. మొత్తం వివరాలు తెలుసుకుని అతడు చెప్పింది.. వాస్తవమేనని నమ్మి వదిలేశారు. అతడు క్షమాపణలు చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ పాస్ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా వినియోగించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. సరైన కారణాలు ఉంటేనే పాస్‌లు జారీ చేస్తున్నారు. చదవండి: కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: సీఎం పిలుపు చదవండి: కరోనా వేళ ఒక్క పిలుపు: కదిలొస్తున్న తారలు -
తెలంగాణ: ఈ-పాస్ కోసం ధరఖాస్తు చేసుకోవడం ఎలా?
హైదరాబాద్: తెలంగాణలో పదిరోజుల పాటు కఠిన లాక్డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ లాక్డౌన్ కాలంలో వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందజేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో అందచేసే ఈ- పాస్ లకు కోసం https://policeportal.tspolice.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులకు గాను లాక్డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించే వారికి మాత్రమే పాసులను జారీ చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు మాత్రమే పాస్‌లను జారీ చేయనునట్లు తెలిపారు. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుంచే పాస్‌లు జారీ చేస్తాయని అన్నారు. హైదరాబాద్ లో ఒక కమిషనరేట్ నుంచి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమిషనరేట్ నుంచే పాసులు జారీ చేస్తారని వివరించారు. లాక్డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే మిగతా సమయంలో ప్రయాణించే వారు మాత్రం వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-పాస్ ధరఖాస్తు విధానం: ► మొదట ఈ-పాస్ వెబ్సైట్(https://policeportal.tspolice.gov.in/) ఓపెన్ చేసి ఈ-పాస్ మీద క్లిక్ చేయండి. ► మీరు ప్రస్తుతం నివసిస్తున్న జిల్లా/కమిషనరేట్‌ను ఎంపిక చేసుకోవాలి ► ఆ తర్వాత మీ పేరు, ఆధార్ నెంబర్, వాహనం, ఎంతమంది, పాస్ ఎందుకు, దేని కోసం, ఫోన్ నెంబర్లు, మీరు వెళ్లాల్సిన పోలీస్ స్టేషన్ పరిధి, డిస్టెన్స్, తదితర వివరాలతోపాటు.. ఫొటో, పర్పస్ డాక్యుమెంట్, కేవైసీ ఫాంలను అప్లోడ్ చేయాలి. ► ఆ తర్వాత మీకు ఒక acknowledgment number(రశీదు సంఖ్య) వస్తుంది. ► ఇప్పుడు మీరు వెనక్కి వెళ్లి సిటిజన్ ప్రింట్ పాస్ క్లిక్ చేసి రశీదు సంఖ్య నమోదు చేయండి. ► మీరు వెళ్లాలి అనుకున్న పరిధుల్లోని కమిషనరేట్, ఎస్పీల నుంచి ఈ పాస్ మంజూరు అవుతుంది. ► ఈ పాస్ చూపించి రాష్ట్రం పరిధిలోని జిల్లాలకు ఆంక్షల సమయంలో ప్రయాణం చేయవచ్చు. చదవండి: పోస్టాఫీసు ఖాతాదారులకు అలర్ట్! -
ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం
సాక్షి, విజయవాడ: కోవిడ్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కర్ఫ్యూని పోలీసులు కట్టుదిట్టం చేశారు. 12 గంటల తర్వాత ఈ-పాస్ ఉన్న వారికే ఏపీలోకి అనుమతిస్తున్నారు. ఆసుపత్రుల్లో అధికారులు బెడ్ల శాతాన్ని పెంచుతున్నారు. అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో వాక్సినేషన్ ప్రక్రియలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. కేంద్రం నుంచి వాక్సిన్ వచ్చేలోపు ఉన్న సమయాన్ని సద్వినియోగించుకునే విధానాలను అమలు చేస్తోంది. వాక్సిన్ కేంద్రాల సంఖ్య పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రతీ సెంటర్ వద్ద రెండు వెయిటింగ్ హాల్స్, 45 ఏళ్ళు నిండిన వారికి ముందు సెకండ్ డోస్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వలంటీర్ల ద్వారా స్లిప్పుల పంపిణి చేస్తోంది. వాక్సిన్ కేంద్రం, రావలసిన తేదీ , సమయం వివరాలతో స్లిప్పుల పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకాలు అమలు చేసేలా ప్రత్యేక సిబ్బందిని నియమించింది. చదవండి: ప్రజలకు వాస్తవాలు వివరిద్దాం.. చంద్రబాబు కుట్ర బట్టబయలు -
కర్ఫ్యూ సమయంలో ఈ పాస్ తప్పనిసరి
-
ఏపీ: కర్ఫ్యూ సమయంలో ఈ పాస్ తప్పనిసరి
సాక్షి, అమరావతి: కర్ఫ్యూ సమయంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, అందుకు అవసరమైన ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన వివరాలను ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిటిజన్ సర్వీసు పోర్టర్లో appolice.gov.in, twitter@appolice100, facebook@andhrapradeshstatepolice ద్వారా ఈ పాస్ పొందవచ్చని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తగిన ధ్రువపత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత స్థానిక అధికారుల వద్ద నుంచి సరైన గుర్తింపుపత్రాలతో అనుమతులు పొందాలని సూచించారు. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ పోలీస్‌శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చదవండి: అత్యవసరమైతేనే బ్యాంకులకు రండి Ongole: కోవిడ్ కేర్ సెంటర్.. మెనూ అదుర్స్ -
ఈ-పాస్ లేక.. ఐసోలేషన్‌కి ప్రేమజంట
సాక్షి, చెన్నై: ఈ–పాస్ లేకుండా ప్రియురాలిని వెతుక్కుంటూ చెన్నై నుంచి తిరువణ్ణామలైకు వచ్చిన యువకుడిని ప్రియురాలితో పాటు అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గత మార్చి 24వ తేదీ నుంచి కర్ఫ్యూ ఉత్తర్వులు అమలులో ఉన్న విషయం తెలిసిందే. జిల్లా నుంచి మరో జిల్లా వెళ్లేందుకు ఈ–పాస్ తప్పనిసరి. వివాహం, మరణం, అత్యవసర వైద్య చికిత్సలు వంటి కారణాలకు మాత్రమే ఈ–పాస్ అందజేస్తున్నారు. అనుమతి లేకుండా సరిహద్దులు దాటే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఉండగా తన ప్రియురాలిని కలుసుకోలేక నాలుగు నెలలుగా అవస్థలు పడుతూ వచ్చిన చెన్నై యువకుడు ఈ–పాస్ లేకుండా చెక్‌పోస్టులను రహస్యంగా అధిగమించి తిరువణ్ణామలైకు చేరుకున్నాడు. ఆపై అధికారులకు పట్టుబడ్డాడు. ఇతన్ని ప్రియురాలితోపాటు ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ప్రియురాలిని కలిసేందుకు చెన్నై నుంచి వచ్చిన యువకుడు రెండు రోజులుగా తిరువణ్ణామలైలోని వివిధ ప్రాంతాలకు, దుకాణాలకు వెళ్లి వస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందింది. రెట్టైపిళ్లయార్ ఆలయం సమీపంలోని ఒక దుకాణంలో ప్రియురాలు, ప్రియుడు మాట్లాడుకోవడాన్ని అధికారులు కనుగొన్నారు. విచారణలో యువకుడు కన్యాకుమారికి చెందిన వాడని, చెన్నైలోని సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ప్రతినెలా తిరువణ్ణామలైకు గిరిప్రదక్షిణ కోసం రాగా ప్రేమ చిగురించినట్లు సమాచారం. నాలుగు నెలలుగా ప్రియురాలిని చూడకుండా అవస్థలు పడ్డాడు. చెక్‌పోస్టు అడ్డంకులను దాటుకుని వచ్చినట్లు యువకుడు తెలిపాడు. ఈ ప్రేమికులను తిరువణ్ణామలైలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అక్కడ వారికి కరోనా పరీక్షలు జరిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. చదవండి: ప్రియురాలి కోసం వెళ్లిన యువకుడిపై.. -
లభించని ఈ–పాస్.. సరిహద్దులోనే వివాహం
చెన్నై, టీ.నగర్: ఈ–పాస్ లభించకపోవడంతో కేరళ సరిహద్దులో మంగళవారం శంకరన్ కోవిల్‌కు చెందిన ఇంజినీర్‌కు వివాహం జరిగింది. కరోనా వైరస్ కారణంగా తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాల మధ్య రవాణ సౌకర్యాలు నిలిపివేశారు. అత్యవసర పనులకు మాత్రమే ప్రభుత్వం ఈ–పాస్‌లు అందిస్తోంది. ఇది వరకే శంకరన్ కోవిల్, వెంకటాచలపురం ఉత్తర వీధికి చెందిన అరవింద్ (29)కు కేరళ రాష్ట్రం పత్తనందిట్ట జిల్లాకు చెందిన ప్రశాంతి (23)తో వివాహం నిశ్చయమైంది. వివాహం రోజు సమీపించగా వారికి ఈ–పాస్ లభించలేదు. ఈ క్రమంలో కేరళలో ఉన్న వధువు, శంకరన్ కోవిల్లో ఉన్న వరుడు కేరళ సరిహద్దు అయిన అరియంగావు చెక్‌పోస్టు సమీపంలోకి బంధువులతో సహా మంగళవారం చేరుకున్నారు. వీరంతా ముఖాలకు మాస్కులు ధరించారు. అక్కడున్న నారాయణగురు మంత్రం అనే ప్రాంతంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ వివాహ కార్యకమానికి తక్కువ సంఖ్యలో కుటుంబీకులు, బంధువులు హాజరై వధూవరులకు ఆశీస్సులందించారు. ఆ తరువాత అధికారుల సాయంతో వధూవరులు ఇరువురు శంకరన్ కోవిల్ బయలుదేరారు. -
ఈ పాసులకు పోటెత్తిన దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల, రాష్ట్రాల ప్రజలు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ సైట్ https://tsp.koopid.ai/epass కి అనూహ్య స్పందన వచ్చింది. ఉదయం నుంచే వేలాది మంది తమ సొంత ప్రదేశాలకు వెళ్లడానికి పోలీసులు ఇచ్చిన లింకులో దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకంగా 7 వేల దరఖాస్తులు స్వీకరించి, వారికి ఆన్ లైన్ లోనే పాసులు జారీ చేశారు. మరో 13 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. కానీ వేలాదిమంది ఒక్కసారిగా సైట్ ఓపెన్ చేయడంతో సైట్ మీద భారం పడి హ్యాంగ్ అయింది. దీంతో 3.30 తరువాత సైట్ పనిచేయడం నిలిచిపోయింది. ఒకేసారి అధిక దరఖాస్తులు రావడం వల్ల సైట్ క్రాష్ అయిందని, త్వరలోనే పునరుద్ధరిస్తామన్న సమా చారం కనిపించింది. రాష్ట్రంలోని పలు జిల్లా లకు చెందిన అనేక మంది పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ఇతర ప్రాంతాలకు వచ్చారు. మార్చి 22 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడంతో 40 రోజులకి పైగా వారంతా ఇక్కడే చిక్కుకుపోయారు. ఆరు వారాలుగా చిక్కుకుపోయిన వీరు పోలీసులు అవకాశం ఇవ్వడంతో ఒక్కసారిగా దరఖాస్తు చేసుకున్నారని, దీంతో సైట్ హ్యాంగ్ అయిం దని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
లక్షన్నర మందికి ఫీజు కట్!
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి 1.5 లక్షల మంది విద్యార్థులకు శాపంగా మారింది. రాష్ట్రంలో 968 కాలేజీలు తమ గుర్తింపును రెన్యువల్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోకపోవడంతో విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్‌కు దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. 2 నెలల్లో విద్యా సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఫీజులు, స్కాలర్‌షిప్‌లపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకున్నవి 6,161 కాలేజీలే రాష్ట్రంలో 7,129 పోస్టుమెట్రిక్ కాలేజీలున్నాయి. వాటిలో 16 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. ఇందులో 13.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తులు సమర్పించారు. ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించిన సంక్షేమ శాఖలు.. వాటిని పరిశీలించి పథకాలకు అర్హత ఉందో లేదో తేల్చాలి. దరఖాస్తుల పరిశీలనలో ముందుగా కాలేజీకి గుర్తింపు ఉందా లేదా? అన్న అంశాన్ని పరిశీలిస్తారు. సంబంధిత బోర్డు/ యూనివర్సిటీ నుంచి గుర్తింపు పత్రాన్ని సమర్పిస్తేనే ఆ కాలేజీల్లో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను అమలు చేస్తారు. ప్రతి కాలేజీకి సంబంధిత బోర్డు/యూనివర్సిటీ గుర్తింపు ఉన్నప్పటికీ... ఏటా ఆ గుర్తింపును రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ పలు కాలేజీలు ఈ గుర్తింపు రెన్యువల్‌కు దరఖాస్తు కూడా చేసుకోలేదు. దీంతో ఆ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అయోమయం నెలకొంది. రాష్ట్రంలో 7,129 కాలేజీలు ఉండగా.. వాటిలో 2017–18 విద్యా సంవత్సరానికి 6,161 కాలేజీలు మాత్రమే గుర్తింపు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 5,812 కాలేజీల గుర్తింపు రెన్యువల్ అయింది. మరో 1,317 కాలేజీల రెన్యువల్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఇంకా 968 కాలేజీలు గుర్తింపు రెన్యువల్‌కు దరఖాస్తులు సమర్పించలేదు. దీంతో ఈ–పాస్ వెబ్సైట్లోనూ ఆ కాలేజీ వివరాలు అప్డేట్ కాలేదు. దీంతో ఆ కాలేజీల్లో దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన సందిగ్ధంలో పడింది. అవకాశం చేజారుతోంది.. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గతనెల రెండో వారంలో ముగిసింది. దాదాపు ఆర్నెళ్లపాటు సాగిన ఈ ప్రక్రియతో 98 శాతం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా గుర్తింపు రెన్యువల్ చేసుకున్న కాలేజీల వివరాలే ఈపాస్ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యేవి. రెన్యువల్ చేయించని కాలేజీలు వెబ్సైట్లో లేకపోవడంతో ఆయా కాలేజీల విద్యార్థులు దరఖాస్తు సైతం చేసుకునే అవకాశం లేకపోయేది. విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కాలేజీల వివరాలను వెబ్సైట్లో అనుమతిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. కానీ కాలేజీ గుర్తింపు రెన్యువల్ అయ్యాకే దరఖాస్తుల పరిశీలన, ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ జారీ చేసేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ ముగిసినా చాలా కాలేజీలు గుర్తింపును అప్డేట్ చేసుకోకపోవడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం కాలేజీలు: 7,129 గుర్తింపు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నవి: 6,161 ఇప్పటివరకు రెన్యువల్ పత్రాలు పొందినవి: 5,812 రెన్యువల్ కోసం దరఖాస్తులు సమర్పించనివి: 968 రెన్యువల్ పెండింగ్‌లో ఉన్నవి: 1,317 -
ఊరట
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏడాదికాలంగా ఎదురు చూస్తున్న ఆహారభద్రతా కార్డులను పరిశీలించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 20,787 మందికి ఊరట కలుగనుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ ఈ–పాస్ పద్ధతి ప్రవేశపెట్టింది. ఈ విధానం అమలులో అవరోధాలు రాకుండా కొత్త రేషన్‌కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం తీసుకునే నాటికి అంటే 2017 మే నెల వరకు 20,787 దరఖాస్తులు మీ–సేవ ద్వారా యంత్రాంగానికి చేరాయి. అప్పటి నుంచి కార్డుల కోసం వేచిచూస్తున్న అర్జీదారులకు ప్రభుత్వ తాజా నిర్ణయం ఆశలు రేకెత్తిస్తోంది. పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిశీలించి పక్షం రోజుల్లో ఆమోదముద్ర వేయాలని ఆదేశించింది. దరఖాస్తుదారు వ్యక్తిగత సమాచారం, బీపీఎల్ కుటుంబమా కాదా? ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా, వ్యవసాయ భూమి తదితర వివరాలతో కూడిన చెక్స్లిప్ను పంపింది. దీనికి అనుగుణంగా ధ్రువీకరిస్తే కొత్త కార్డులను జారీచేయాలని నిర్దేశించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకే తెల్ల రేషన్‌కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఆరోగ్యశ్రీ, రెండు పడక గదుల ఇల్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాల అమలులో ఈ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్న కారణంగా ప్రతి వ్యక్తి ఆహారభద్రతాకార్డు కోసం దరఖాస్తు చేయడం అలవాటుగా మారింది. దీంతోనే ఇబ్బడిముబ్బడిగా అర్జీలు వచ్చాయని యంత్రాంగం అంటోంది. రేషన్‌కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయనే అభిప్రాయం తప్పని, కేవలం రేషన్ సరుకులు మాత్రమే ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసినా పెద్దగా మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయని తెలుస్తోంది. కొత్తవాటి సంగతేంటి? గత ఏడాది మే వరకు పెండింగ్‌లో ఉన్న వాటికే మోక్షం కలిగించమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత వచ్చిన సుమారు 10వేల దరఖాస్తులపై ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంతో ప్రజల్లో గందరగోళానికి తావిస్తోంది. పాత వాటిని పరిశీలించి.. కొత్త అర్జీలను పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధులకు కూడా తలనొప్పిగా మారే అవకాశంలేకపోలేదు. యంత్రాంగం మాత్రం తొలుత పాత దరఖాస్తులను పరిష్కరించి.. ఆ తర్వాత తాజాగా వచ్చేవాటిపై దృష్టిసారించే వీలుందని అంటోంది. అర్హులకు ఆహారభద్రత పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తున్నాం. ఆన్లైన్లో నమోదైనవాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తాం. అర్జీదారుల సమాచారం సేకరించమని తహసీల్దార్లకు సూచనలు చేశాం. అక్కడి నుంచి రాగానే కార్డుల జారీకి చర్యలు తీసుకుంటాం. –గౌరీశంకర్, డీఎస్ఓ -
ఈ–పాస్‌తో కూపన్లకు బ్రేక్!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : రేషన్ సరఫరాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టిన సంస్కరణలతో పౌరసరఫరాల శాఖకు మిగులుబాటు కనిపిస్తున్నా అర్హులైన లబ్ధిదారులకు కొత్త కార్డులు దక్కకుండా పోతున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీకి ఎప్పుడో మంగళం పాడిన ప్రభుత్వం చివరకు ఆహార భద్రత కార్డులకూ ఎర్రజెండా చూపింది. ఫలితంగా.. రేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుల జారీ నిలిపివేసి పదినెలలు కావస్తోంది. రేషన్ దుకాణాలు కేంద్రాలుగా జరుగుతున్న అక్రమాలకు బ్రేక్ వేసే ఉద్దేశంతో ఈ–పాస్ (ఎలక్ట్రానికి పాయింట్ ఆఫ్ సేల్) విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో మొదట మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ–పాస్ అమలును మొదలు పెట్టిన సమయంలో అనూహ్యంగా పెరిగిన అదనపు కూపన్ల జారీని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌కార్డులు కానీ, కొత్త కూపన్లు జారీ చేయొద్దని నిర్ణయించారు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందకుండా అయ్యింది. మొత్త కార్డుల్లో ఇప్పుడున్న యూనిట్ల స్థానంలో కొత్తగా ఎవరినీ చేర్చడం, లేదా తొలగించడం వంటి మార్పులు చేర్పులనూ బంద్ చేశారు. నల్లగొండ జిల్లా పరిధిలోని 943 రేషన్‌షాపులు, సూర్యాపేట జిల్లాలో 605 షాపులు, యాదాద్రి జిల్లా పరిధిలో 461 రేషన్‌షాపుల్లో ఈ–పాస్ యంత్రాలు అమర్చ డం పూర్తయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినా, కొత్త కార్డుల జా రీ, కార్డుల్లో మార్పులు చేర్పులు, కొత్త కూపన్ల జారీ వంటి అంశాలపై ఎలాంటి నిర్ణయమూ వెలువడకపోవడంతో అర్హులు సరుకులు పొందలేక పోతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా పెరగడం వల్లే ! జిల్లాలో ఆహార భద్రత కార్డుల సంఖ్య ఎప్పటికప్పటికీ పెరిగిపోవడం వల్లే అసలుకు ఎసరు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీ–సేవా కేంద్రాలనుం చి వెళ్లిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చాకే ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇక, తహసీల్దార్లు ఆమోదించిన దరఖాస్తులను సివిల్ సప్లయీస్ అధికారులు యధాతధంగా ఆమోదిస్తున్నారు. కొత్త కార్డులకు వస్తున్న దరఖాస్తులు, ఉన్న కార్డుల్లో కొత్తగా పేర్లు జత చేయడంలో రెవెన్యూ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు శాఖా కమిషనర్‌కు వెళ్లడంతోనే కూపన్ల జారీకి బ్రేక్ వేశారని చెబుతున్నారు. అక్రమాలకు చెక్ ఇలా.. లబ్ధిదారులు దుకాణాలకు వచ్చి వేలిముద్రలు వేస్తేనే, డీలర్లు వారికి సరుకులు పంపిణీ చేస్తారు. కార్డుపై ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైన వేలిముద్రలు వేసి సరుకులు పొందే వీలుంది. ప్రస్తుతం కార్డుదారులు రేషన్‌షాప్‌కు రాకున్నా, సరుకులు తీసుకోకపోయినా వచ్చినట్లు జాబితాలో చూపించి డీలర్లు సరుకులు స్వాహా చేస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి అక్రమాలకు ఈ–పాస్ విధానంతో చెక్ పడుతుంది. బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, ఆహారభద్రత కార్డుతో కూడా రేషన్‌కార్డును అనుసంధానం చేస్తారు. దీనిల్ల సరుకులు తీసుకోని లబ్ధిదారులకు సంబంధించిన కోటా అంతా మిగులుగానే డీలర్ల దగ్గర ఉండిపోతుంది. మిగులును బట్టే మరుసటి నెలకు డీలర్లకు సరుకుల కోటాను నిర్ణయిస్తారు. ఇంకా...ఎదురుచూపులే! ఈ–పాస్ విధానం మొదట ప్రయోగాత్మకంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అమలు చేయడం ద్వారా సివిల్ సప్లయీస్ శాఖకు అయిన ఆదాను పరిగణనలోకి తీసుకుని జిల్లాలకు విస్తరించారు. గతేడాది ఏప్రిల్ నుంచి జిల్లాలో ఈ–పాస్ యం త్రాలను రేషన్ షాపుల్లో బిగిస్తున్నారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 461 రేషన్ దుకాణల్లో ఈ–పాస్ అమల్లోకి వచ్చింది. ఆ జిల్లాలో ఉన్న 2లక్షల పైచిలు కు కార్డుల్లో జనవరిలో లక్షా 80వేల మంది కొనుగోళ్లు జరిపారు. ఒక్క నెలలో ఈ–పాస్ అమలు ద్వారా యాదాద్రి భువనగిరిలో రూ.93లక్షలు ఆదా అయ్యింద ని సమాచారం. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే నల్లగొండ, సూర్యాపేట జి ల్లాలో ఈ–పాస్ యంత్రాలను అమర్చడం పూర్తి చేశారు. ఫిబ్రవరి ఆఖరుకు ఈ జిల్లాలో జరిగే విక్రయాలను బట్టి ఎంత ఆదా అవుతుందో ఓ నిర్ణయానికి రానున్నారు. ఆ తర్వాతే కొత్త కార్డులు, మార్పులు చేర్పులు, కొత్త కూపన్ల జారీ చేస్తారని అంటున్నారు. దీంతో అర్హులై ఉండి కార్డులు, కూపన్లు లేని వారు మరికొన్ని నెలలు ఎదురుచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. -
ప్రాణం తీసిన ఈ–పాస్
కడెం(ఖానాపూర్) : రేషన్ సరుకుల్లో అవకతకలను నిరోధించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ–పాస్ విధానం ఓ మహిళ ప్రాణాలు బలిగొంది. కడెం మండలం గంగాపూర్ గ్రామం నాయకపుగూడకు చెందిన ఏదుల లస్మవ్వ(45) రేషన్ సరుకుల కోసం వెళ్లి మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడి మృతి చెందింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పాస్ యంత్రాలు 4జీ నెట్‌వర్క్‌తోనే పని చేస్తాయి. కానీ మారుమూల గ్రామమైన గంగాపూర్‌లో సిగ్నల్స్ సరిగ్గా రావు. దీంతో డీలర్ వినియోగదారుల వేలిముద్రలు తీసుకునేందుకు బంగ్లాపైన సిగ్నల్స్ రావడంతో అక్కడ ఈ పాస్ యంత్రం ద్వారా వేలిముద్రలు తీసుకుంటూ, సరుకులు అందజేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఏదుల లస్మవ్వ రేషన్ సరుకుల కోసం బంగ్లాపైకి వెళ్లి తిరిగి దిగే సమయంలో మెట్లపై నుంచి(మెట్లకు పక్కన గోడలు లేవు) పడి తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గొర్ల ఆజయ్‌బాబు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు బుధవారం ఘటనా స్థలాన్ని జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారి సుదర్శన్, తహసీల్దార్ నర్సయ్య, ఎన్ఫోర్స్మెంట్ డీటీ రహీమొద్దీన్ సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన కొందరు భాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయగా అపద్బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తామని తహసీల్దార్ తెలిపారు. -
ఇక పక్కాగా.. ప్రజాపంపిణీ
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరాలశాఖ సమాయత్త మవుతోంది. ఆ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ–పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) విధానాన్ని త్వరలో జిల్లాలో ప్రవేశపెట్టబోతోంది. దీనిలో భాగంగా జిల్లాలోని తహసీల్దార్లు, రేషన్‌డీలర్లు, సివిల్ సప్లయీస్ విజిలెన్స్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డివిజన్ల వారీగా నిర్వహించిన శిక్షణలు ఇటీవల ముగి శాయి. ఫిబ్రవరి ఒకటినుంచి డీలర్లు నిత్యావసర వస్తువులను ఈ–పాస్ మిషన్ల సాయంతోనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. తూకాల్లో మోసాలకు పాల్పడకుండా ఎలక్ట్రానిక్ కాంటాలు కూడా త్వరలో అన్ని రేషన్ దుకాణాలకు పంపిణీ చేయనున్నారు. నల్లగొండ : జిల్లాలో 31 మండలాల పరిధిలో 990 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆహారభద్రత కార్డులు 4,49,912 కుటుంబాలు కలిగి ఉన్నాయి. దీంట్లో సభ్యులు 13,68,366 మంది ఉన్నారు. ఈ మొత్తం కార్డుదారులకు ప్రతినెలా సబ్సిడీ బియ్యం 87,758 క్వింటాళ్లు, కిరోసిన్ 444 కిలోలీటర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా అన్నయోజన కార్డుదారులకు 289 క్వింటాళ్ల పంచదార పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డుదారులకు రూపాయికి కిలోచొప్పున ఒక్కొక్కరికి నాలుగు కిలోలు చొప్పున అందజేస్తుండగా..అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం చౌకధరకు బియ్యం పంపిణీ చేస్తుంటే అదే బియ్యం బహిరంగ మార్కెట్లో కిలో రూ.20– 25 ధర పలుకుతోంది. కిరోసిన్ లీటరు రూ.21 లభిస్తే మార్కెట్లో రూ.30–35 పలుకుతోంది. దీనినే అదునుగా భావించిన డీలర్లు, మిలర్ల సహకారంతో బియ్యం, కిరోసిన్ పక్కదారి పట్టిస్తున్నారు. ఈ అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు సివిల్ సప్లయ్ ఈ–పాస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. వేలిముద్ర తప్పనిసరి... వచ్చే నెలనుంచి కార్డుదారులు రేషన్ దుకాణాలకు వెళ్తేనే సరుకులు ఇస్తారు. గతంలో వెళ్లకపోయినా...వారి పేరిట సరుకులు తీసుకున్నట్టుగా రిజిస్టర్లో నమోదు చేసుకుని వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ వ్యవహారానికి అడ్డుకట్ట వేస్తూ ఈ–పాస్ పేరిట కొత్త విధానం అమలు చేయనున్నారు. ఈ విధానంలో ఆహారభద్రత కార్డులో నమోదైన సభ్యుల్లో ఎవరో ఒకరు వెళ్లి బయోమెట్రిక్ యంత్రంపై వేలిముద్ర వేస్తేనే సరుకులు ఇస్తారు. లేదంటే ఈ సరుకులు అలాగే ఉంచి మరుసటి నెలలో తీసుకునే అవకాశం కల్పిస్తారు. దీనివల్ల కార్డుదారులకు తెలియకుండా సరుకులు పంపిణీ చేయడం కుదరదు. ఈ–పాస్ మిషన్‌లోనే వివరాలు నిక్షిప్తం... ఈ–పాస్ విధానంలో వేలిముద్రలు తీసుకునేందుకు వీలుగా బయోమెట్రిక్ మిషన్ ప్రతి రేషన్ దుకాణానికి పంపిణీ చేశారు. ఈ మిషన్‌లో కార్డుదారుల పూర్తిసమాచారం నిక్షిప్తమై ఉంటుంది. వారి ఆధార్ సంఖ్యతో సహా ఇతర వివరాలన్నీ నమోదై ఉంటాయి. ఈ మిషన్‌లో సెల్ఫోన్లో ఉండే సిమ్‌ను వినియోగిస్తారు. ఏ రోజున ఎంత మేర సరుకు పంపిణీ అయ్యింది..? ఎంతమంది కార్డుదారులు సరుకులు తీసుకున్నారనే సమాచారం ఇంటర్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు జిల్లా, రాష్ట్రస్థాయిలో తమ సెల్ఫోన్ల ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు. గోదాములనుంచి సరుకు రవాణా కూడా వేగవంతమవుతుంది. సరుకు నిల్వలు నిండుకోగానే విడతలవారీగా రేషన్ దుకాణాలకు బియ్యం, చక్కెర, కిరోసిన్ వెంటనే సరఫరా చేస్తారు. అధికారుల పర్యవేక్షణ కూడా ఇప్పుడున్నంత స్థాయిలో ఉండదు. అక్రమాలకు అడ్డుకట్ట... ఈ–పాస్ మిషన్లు పనిచేయాలంటే నెట్వర్క్ ప్రధానమైంది. జిల్లాలో మారుమూల ప్రాం తాల్లో సెల్ఫోన్లకే సరిగా సిగ్నల్స్ అందని పరిస్థితి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సాంకేతికపరమైన అంతరాయం కలగకుండా ఆయా ప్రాంతాల్లో నెట్వర్క్ సిగ్నల్స్ వచ్చే సిమ్‌కార్డులనే ఈ–పాస్ మిషన్‌లో ఉంచారు. దీంతో సిగ్నల్స్ అందడం లేదనే సమస్య తలెత్తదు. దీంతో పాటు సిగ్నల్స్‌లో అంతరాయం తలెత్తకుండా బూస్టర్ యాంటీనాలు కూడా డీలర్లకు అందజేశారు. ఈ–పాస్ మిషన్లకు అనుసంధానంగా ఈ–కాంటాలు (ఎలక్ట్రానిక్ కాంటాలు) కూడా ఉంటాయి. రెండు, మూడు రోజుల్లో ఈ–కాంటాలు డీలర్లకు నేరుగా పంపిస్తామని అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల తూకాల్లో డీలర్లు మోసాలకు పాల్పపడకుండా ఈ–కాంటాలు నిరోధిస్తాయి. ఉదాహరణకు బియ్యం తూకం వేసేక్రమంలో వందగ్రాములు తక్కువ ఉన్నా ఈ–కాంటా అంగీకరించదు. ఈ–మిషన్లకు ఈ–కాంటాలకు లింకై ఉంటుంది కావున కార్డుదారులకు ఎంత కోటా రేషన్ ఇవ్వాలో కచ్చితంగా అంత మొత్తం తూకం వేయాల్సిందే. ఇదే పద్ధతి ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కూడా అమలు చేయనున్నారు. ఈ–కాంటాలపైన తూకం వేసిన తర్వాతే ఎంఎల్ఎస్ పాయింట్లనుంచి సరుకులను డీలర్లకు రవాణా చేస్తారు. ఈ నెల 15న క్లోజింగ్ బ్యాలెన్స్ చేశాక మిగిలిన బియ్యంతో ప్రయోగాత్మకంగా డీలర్లు ఈ–పాస్ మిషన్లు ఉపయోగించి కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసే అవకాశం కల్పించారు. అవకతవకలకు ఆస్కారం ఉండదు ఫిబ్రవరి ఒకటినుంచి ఈ–పాస్ మిషన్లు వినియోగించాలి. డీలర్లు, రెవెన్యూ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం పూర్తికావొచ్చింది. రేషన్ వ్యవస్థలో అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉండేం దుకు ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇంటర్నెట్ సిగ్నల్స్ ఇబ్బంది లేకుండా ప్రత్యేక యాంటీనాలు కూడా ఇస్తున్నాం. ఫిబ్రవరినుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ–పాస్ మిషన్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. – ఉదయ్ కుమార్, డీఎస్ఓ -
ఉపకార దరఖాస్తుకు మరో చాన్స్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తుకు ప్రభుత్వం మరోసారి అవకాశం ఇవ్వనుంది. గతనెల 30తో దరఖాస్తుల ప్రక్రియ ముగియగా... క్షేత్రస్థాయిలో దాదాపు 30వేల మంది విద్యార్థులు ఈపాస్ వెబ్‌సైట్‌ఉపకార దరఖాస్తుకు మరో చాన్స్!ఉపకార దరఖాస్తుకు మరో చాన్స్!లో వివరాలు నమోదు చేసుకోలేకపోయారు. ఈక్రమంలో గడువు ముగియడంతో ఆయా విద్యార్థుల నుంచి సంక్షేమ శాఖలకు వినతులు వెల్లువెత్తాయి. మరోవైపు బీఈడీ, లాసెట్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియ సైతం గతనెలాఖరుకు ముగియకపోవడంతో ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో దరఖాస్తుల నమోదుకు అవకాశం ఇవ్వాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈమేరకు రెండ్రోజుల క్రితం ఆ శాఖ సంచాలకులు కరుణాకర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. నెలరోజులు పెంపు! 2017–18 వార్షిక సంవత్సరంలో పోస్టుమెట్రిక్ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు 13.05 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 13.30 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేయగా... 25వేల దరఖాస్తులు తగ్గాయి. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి జూన్ 20న ప్రారంభమైన నమోదు ప్రక్రియ ఆగస్టు వరకు సాగింది. ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతోపాటు ఇతర వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల్లోనూ జాప్యం జరిగింది. దీంతో అక్టోబర్, నవంబర్‌లో దరఖాస్తుకు మళ్లీ అవకాశం కల్పించింది. 95శాతం మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందకపోవడంతో పలువురు విద్యార్థులు దరఖాస్తుకు దూరమయ్యారు. తాజాగా ఆయా విద్యార్థులతో పాటు, బీఈడీ, లాసెట్, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 50వేల మందికి అవకాశం కల్పించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నుంచి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడితే వచ్చే ఏడాది జనవరి నెల మొత్తం దరఖాస్తులు స్వీకరిస్తామని సంక్షేమాధికారులు చెబుతున్నారు. -
ఈ..ఫార్స్!
- ఈ-పాప్ విధానంలో లోపాలు - కొనసాగుతున్న అక్రమాలు - పక్కదారి పడుతున్న సరుకులు - పేదలకు అందని రేషన్ - కొందరు డీలర్ల చేతివాటం - అరికట్టలేకపోతున్న ప్రభుత్వం జిల్లాలో రేషన్ కార్డులు: 10.76 లక్షలు జనవరి నెలలో కొత్తగా వచ్చినవి : 87 వేలు డిసెంబర్, జనవరి నెలల్లో రేషన్ పంపిణీ : 90 శాతం గతంలో 80 శాతం ప్రజాపంపిణీ ఉండేది కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన ఈ- పాస్ విధానం అపహాస్యమవుతోంది. పేదలందరికీ రేషన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానం కొందరు డీలర్లకు కాసుల పంట పండిస్తోంది. జిల్లాలో అక్రమాలకు పాల్పడుతూ 149 మంది డీలర్లు సస్పెండ్ అయ్యారంటే కుంభకోణం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత మంది డీలర్లు సస్పెండ్ అయినా ఈ-పాస్ తీరులో మార్పు రాలేదు. ఇప్పటికీ అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సెప్టెంబరు, అక్టోబరు నెలలతో పోలిస్తే డిసెంబరు, జనవరి నెలల్లో 3000 కార్డులకు పైగా ఎక్కువగా సరుకులు పంపిణీ కావడం విమర్శలకు తావిచ్చింది. ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసి రేషన్ సరుకులను కొల్లగొట్టిన వ్యవహారం అక్టోబర్ నెలలో వెలుగు చూసింది. ఇప్పటికీ ఈ వ్యవహారం నడుస్తోంది. అదెలాగంటే.. రెండేళ్ల క్రితం ఆధార్ నంబర్లతో రేషన్ కార్డులను అనుసంధానం చేశారు. ఈ బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లకు అప్పగించారు. డీలర్లు ఈ కార్యక్రమంలో అడ్డుగోలుగా వ్యవహరించారు. ఆధార్ కార్డు దొరికితే చాలు తమ దగ్గర ఉన్న కార్డులకు లింకప్ చేసుకున్నారు. ఆధార్ కార్డు నంబర్ల కోసం జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇటీవల కొత్త ఎత్తుగడలు వేశారు. ఎన్ఐసీ ప్రధాన సర్వర్ నుంచే అధార్ లింకప్ను తమ వద్ద ఉన్న రేషన్ కార్డులతో లింకప్ చేసుకున్నారు. ఆన్లైన్లో వివరాలు చూసుకున్న కొందరు ప్రజలు.. తమ రేషన్ కార్డుకు వేరొకరి ఆధార్ కార్డు లింకప్ కావడంతో తప్పులను సరిచేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్ అందకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి ఫిర్యాదులు ప్రస్తుతం డీఎస్ఓ, ఎఎస్‌ఓ, తహసీల్దారు కార్యాలయాల్లో వేలాదిగా ఉన్నాయి. కర్నూలులో వారిదే హవా.. ఈ పాస్ కుంభకోణంలో ఇటీవల కర్నూలులో నూరు మంది డీలర్ల సస్పెండ్ అయ్యారు. వారి స్థానంలో ఇన్చార్జీలను నియమించారు. అయితే చాల వరకు సస్పెండ్ అయిన డీలర్లే సరుకులు పంపిణీ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. అక్రమాలు ఇవీ.. కర్నూలుకు చెందిన కళావతికి వైఏపీ 1382065ఎ0141 నంబరు రేషన్ కార్డు ఉంది. ఆధార్ నెంబరు 534513319754. ఆరు నెలల క్రితం వరకు ఎలాంటి సమస్య లేదు. ఇపుడు అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన డబ్ల్యూఏపీ 1286026ఎ0199 రేషన్ కార్డుకు కళావతి ఆధార్ నెంబరు లింకప్ అయింది. పత్తికొండ ప్రాంతానికి చెందిన కురువ హనుమన్న రేషన్ కార్డు నెంబరు డబ్ల్యూఏపీ 135103600049. ఆధార్ నెంబరు 852236000236. ఇటీవలి వరకు ఇక్కడే కార్డు ఉంది. కాని ఉన్నట్టుండి విశాఖపట్టణం జిల్లాకు చెందిన కార్డుకు ఈ ఆధార్ కార్డు అనుసంధానం అయింది. బోయ అనంతయ్యకు పత్తికొండలో రేషన్ కార్డు ఉంది. కార్డు నంబరు డబ్ల్యూఏపీ 135102200162. ఆధార్ నంబరు 296480428799. ఇపుడు ఈ ఆధార్ కార్డు నెల్లూరు జిల్లాకు రేషన్ కార్డుకు అనుసంధానం అయింది. -
ఆన్లైన్లో ఫీజు చెల్లింపులు
కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రతి స్కూల్, కాలేజీలో ఫీజు చెల్లింపులు ఆన్లైన్లో జరగాలని..ఇందుకు ఈపోస్ మిషన్లు ఇస్తామని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. సోమవారం స్థానిక సునయన ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలపై అవగహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం నరసింహారావు, డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి.జనార్దన్‌రెడ్డి, పుల్లయ్యలు, ప్రైవేటు స్కూళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పది మంది రేషన్ దొంగల అరెస్టు
కర్నూలు: రేషన్ పంపిణీలో ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్ కేసును పోలీసులు నీరుగారుస్తున్నారనే విమర్శల నేపథ్యంలో పది మంది చౌక డిపో డీలర్లను అరెస్టు చేశారు. వీరిలో కర్నూలులో ఐదుగురు, నందవరంలో ఐదుగురు ఉన్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి బుధవారం సాయంత్రం సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది, టూటౌన్ పీఎస్ పరిధిలో 42 మంది, త్రీటౌన్ పీఎస్ పరిధిలో 15 మంది, ఫోర్త్‌టౌన్ పీఎస్ పరిధిలో 11 మంది డీలర్లపై కేసులు నమోదయ్యాయి. ఇందులో వన్‌టౌన్ పరిధిలో ఖాశీం, శ్రీనివాసులు, టూటౌన్ పరిధిలో షేక్ చాంద్ బాషా, చంద్రబాబు, ఫోర్త్‌టౌన్ పీఎస్ పరిధిలో సోము సాయిబాబాలను పోలీసులు అరెస్టు చేశారు. చౌక దుకాణాల్లో అవినీతిని అడ్డుకోవడానికి గత ఏడాది ఈ–పాస్ మిషన్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్‌తో క్లోజింగ్ బ్యాలెన్స్‌లో తక్కువ చూపించి రూ.లక్షల్లో ప్రభుత్వానికి గండి కొట్టారు. జిల్లా వ్యాప్తంగా 149 మంది డీలర్లు ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసులు దర్యాప్తులో తేల్చారు. పౌర సరఫరాల, రెవెన్యూ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కర్నూలు డివిజన్లో 121, నందికొట్కూరు పట్టణ పరిధిలో 12, కర్నూలు అర్బన్ తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో 5, శ్రీశైలం పీఎస్ పరిధిలో 3, వెల్దుర్తి పీఎస్ పరిధిలో 1, పాణ్యం పీఎస్ పరిధిలో 3, నంద్యాల డివిజన్ పరిధిలో 3, దేవనకొండలో 3, నందవరంలో 7, ఎమ్మిగనూరు పట్టణ పరిధిలో 15, ఆదోని డివిజన్ పరిధిలో 25 మంది డీలర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్‌కు పాల్పడిన డీలర్లందరినీ త్వరలో అరెస్టు చేస్తామని, వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఒకటవ పట్టణ సీఐ కృష్ణయ్య, తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి, నాల్గవ పట్టణ సీఐ నాగరాజ రావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మిగనూరులో... రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడిన కేసులో నందవరం మండలానికి చెందిన ఐదుగురు డీలర్లను అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. బుధవారం రాత్రి స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్ఓ, ఆర్డీఓ, తహసీల్దార్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. అరెస్ట్ చేసిన వారిలో నందవరం మండలం గంగవరానికి చెందిన డీలర్ సత్యనారాణయశెట్టి, నాగలదిన్నెకు చెందిన డీలర్లు సుమిత్రబాయి, షబ్బిర్, ప్రేమకుమారి, కనకవీడు డీలర్ బోయ కోటేష్‌లు ఉన్నట్లు చెప్పారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారన్నారు. ఇకపోతే పట్టణంలో 13 మంది, రూరల్‌లో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయని.. వీరంతా పరారీలో ఉన్నట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో నందవరం ఎస్ఐ జగన్మోహన్ పాల్గొన్నారు. -
డీలర్లపై వేటు
దేవనకొండ: ఈ–పాసును బైపాస్ చేసి నిత్యావసర సరుకుల పంపిణీలో అవినీతికి పాల్పడిన రేషన్‌డీలర్లపై అధికారులు చేపట్టారు. దేవనకొండలోని 17, 18, 30కు చెందిన ముగ్గురు డీలర్లపై సస్పెన్షన్ వేటు పడినట్లు ఆర్ఐ ఆదిమల్లన్నబాబు శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీ నందవరం : మండలంలోని 7గురు డీలర్లపై వేటుపడింది. నందవరంలో 3వ షాపు లచ్చప్ప, గంగవరంలో 8వ షాపు సత్యనారాయణశెట్టి, నాగలదిన్నెలో 12వ షాపు తిప్పన్న, 13వ షాపు షబ్బీర్, 33వ షాపు ప్రేమ్‌కుమార్, టి.సోమలగూడూరులో 17వ షాపు మాదన్న, కె.పేటలో 21వ షాపు ఈరన్న అనే డీలర్లు వేటు చేసినట్లు తహసీల్దార్ హుశేన్‌సాహెబ్ తెలిపారు. ఈ నెలలో ఆయా డీలర్లు ద్వార డీడీ కట్టించుకోవడం లేదని, కొత్త డీలర్లు వచ్చే వరకు ఇన్‌చార్జ్‌ల ద్వార డీడీలు కట్టించి కార్డుదారులకు సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్దార్ తెలిపారు. ఎమ్మిగనూరు రూరల్: మండలంలో 15 మంది డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మండలంలో ఇద్దరు, పట్టణంలో 13 మంది డీలర్లపై రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటూ వారి నుంచి రికవరీకి చేస్తున్నట్లు సమాచారం. -
ఈపాస్‌లో ‘విద్యార్థి సేవ’లకు బ్రేక్!
నిలచిన ఉపకార, రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియ.. కొత్త జిల్లాల నేపథ్యంలో వెబ్సైట్ పునరుద్ధరణ సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ఈపాస్ వెబ్సైట్లో ‘విద్యార్థి సేవల (స్టూడెంట్ సర్వీస్)’కు బ్రేక్ పడింది. ఫ్రెషర్స్‌తోపాటు రెన్యువల్ విద్యార్థులు తాజా విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అయితే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు అందుబాటులోకి రావడంతో వెబ్సైట్లో ఈ సర్వీసులు నిలచిపోయాయి. కొత్త జిల్లాలు, మండలాల సమాచారాన్ని పాతవాటి నుంచి విడదీసి నూతన వివరాలను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే దరఖాస్తుదారుడికి వివరాలు వెబ్‌పేజీలో ప్రత్యక్షమవుతాయి. అయితే వెబ్సైట్లో వివరాలు నమోదు చేయడంలో జాప్యం జరిగింది. దీంతో పాత వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకునే వీలు లేనందున వెబ్సైట్లో విద్యార్థి సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆరు రోజులుగా సర్వీసులకు బ్రేక్ వేయడంతో విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. వచ్చే నెలాఖరుతో దరఖాస్తు గడువు ముగియనుంది. వెబ్సైట్లో సర్వీసులు నిలిచిపోవడం, ఎన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన సర్వీసులు సైతం నిలిచిపోయాయి. కాగా, విద్యార్థి సేవలు, కల్యాణలక్ష్మి సర్వీసులు తిరిగి ప్రారంభం కావాలంటే మరో వారం ఆగాల్సిందే. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సమాచారాన్ని వెబ్సైట్లో నిక్షిప్తం చేసి.. వాటి పరిధిలోకి వచ్చే కళాశాలలు, హాస్టళ్ల సమాచారాన్ని విభజించి, జిల్లా అధికారులకు కొత్త లాగిన్ ఐడీ ఇవ్వాలి. ఇప్పటికే ఉన్న సమాచారాన్ని భద్రపర్చడంతోపాటు కొత్త జిల్లాల వారీగా విభజించాలి. ఈ ప్రక్రియ అంత సులువుగా జరిగేది కాదని, దీనికి కనిష్టంగా వారం సమయం పడుతుందని అధికారులు చెపుతున్నారు. -
‘ఈ స్టాంప్స్’ కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న వివిధ ప్రాజెక్టులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆన్లైన్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ప్రవేశపెట్టిన 'ఈస్టాంప్స్' ప్రాజెక్టుతోపాటు మరికొన్ని ప్రాజెక్టులకూ ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు లభించాయి. 'ఈ స్టాంప్స్'తోపాటు పౌరసరఫరాల, మార్కెటంగ్ శాఖలు నిర్వహిస్తోన్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్), ఈ-పీడీఎస్, ఎస్సీఎం (సప్లై చైన్ మేనేజ్మెంట్), ఓపీఎంఎస్ (ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ సిస్టం), ఫిర్యాదుల పరిష్కారం వంటి ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డులకు ఎంపికయ్యాయి. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో గురువారం జరిగిన 45వ జాతీయ స్కోచ్ సదస్సులో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ స్టాంప్స్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ వి.శ్రీనివాసులు పురస్కారాన్ని అందుకున్నారు. -
కార్డులకే పరిమితం...సరుకులకు దూరం!
సాక్షి, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ఆహార భద్రత (రేషన్) కార్డుదారుల్లో అనర్హులు అక్షరాల నాలుగున్నర లక్షల పైనే ఉనట్లు బహిర్గతమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఈ-పాస్ అమలు వాస్తవ పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. గత మూడు నెలలుగా ఈ-పాస్ (వేలి ముద్రల) ద్వారా సరుకులు పంపిణీ చేస్తుండటంతో వినియోగం లేని కార్డుల చిట్టా బయటపడుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయనే కక్కుర్తితో ఆర్థికంగా ఉన్న వారు సైతం ఆహార భద్రత కార్డులు పొందారు. కానీ, నెలసరి రేషన్ సరుకులకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వారి కోటా పక్కదారి పట్టి ప్రతి నెల వందల కోట్ల రూపాయల సబ్సిడీ బియ్యం స్వాహాకు గురైనట్లు స్పష్టమవుతోంది. ఈ -పాస్ అమలుకు ముందు ప్రతినెల సుమారు 90 నుంచి 95 శాతం వరకు కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తుండగా.... ఈ-పాస్ పూర్తి స్థాయి అమలుతో సరుకులకు దూరంగా ఉంటున్న కార్డుల సంఖ్య ఒకేసారి 60 శాతానికి పడిపోయింది. గత మూడు నెలల పరిస్థితిని పరిశీలించిన సంబంధిత అధికారగణం సరుకులకు దూరంగా ఉంటున్న కార్డుదారును అనర్హులు గుర్తించి ఏరివేసేందుకు చర్యలకు దిగుతోంది. ఇదీ పరిస్థితి.. గ్రేటర్ హైదరాబాద్‌లో 13 లక్షలకు పైగా కార్డుదారులున్నారు. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 11 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెల్లరేషన్ కార్డులు రద్దు చేసి ఆహార భద్రత పథకం కింద దరఖాస్తులు అహ్వనించడంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. నిరుపేదలతో పాటు ఆర్థికంగా బలపడ్డ వారు సైతం దరఖాస్తులు చేసుకున్నారు. పౌరసరఫరాల అధికారులు కనీసం క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండా కేవలం ఆధార్ అనుసంధానంతో కార్డులు మంజూరు చేస్తూ వచ్చారు. దీంతో అర్హులతో పాటు అనర్హులకు కూడా కార్డులు మంజూరయ్యాయి. ఫలితంగా కార్డుల సంఖ్య ఒకేసారి పెరిగింది. కార్డులు మంజూరైన అనర్హులు మాత్రం సరుకులకు దూరంగా ఉంటూ వస్తూన్నారు. అయితే ఆహార భద్రత పధకం కింద కార్డులోని యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున బియ్యం కోటా కేటాయించడంతో చౌకధరల దుకాణాల డీలర్లకు అనర్హుల కార్డులు వరప్రసాదంగా మారాయి. గత ఏడాదిన్నర కాలంగా వినియోగం లేని కార్డులు కోటా కూడా డ్రా అవుతూ వచ్చింది. తాజాగా ఈ పాస్ అమలుతో వినియోగం లేని కార్డుల సంఖ్య బయటపడి వారి అవినీతికి అడ్డుకట్టపడినట్లయింది. -
ఈ-పాస్ అక్కడ ఫెయిల్
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో రేషన్ షాపులతో పాటు అంగన్వాడీ కేంద్రాలకూ ఈపాస్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చినా జిల్లాలో అమలు కావడం లేదు. చాలా చోట్ల సాధారణ పద్ధతుల్లోనే సరుకులను అందజేస్తున్నారు. దీనిపై జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్ ఇచ్చిన ఆదేశాలు అమలు కావడంలేదు. జిల్లాలో 3,728 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటికి గతంలో కాంట్రాక్టు పద్ధతిలో సరుకులు ఇచ్చేవారు. కాంట్రాక్టు పొందిన వారు బియ్యం తదితర సరుకులను ఇచ్చేవారు. ఏప్రిల్ నుంచి అంగన్వాడీలకు కూడా ఈ-పాస్ వర్తింపజేయాలనీ, కార్యకర్తల వేలిముద్రలు తీసుకుని సరుకులు ఇవ్వాలని సూచిం చారు. దీనివల్ల చాలా వరకూ అనధికార హాజరు తగ్గి, సరుకులు చాలావరకూ మిగులుతాయని భావించారు. రేషన్‌డీలర్ల ఇబ్బందులు దీనిపై పలువురు రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. తమకు సాధారణ రేషన్ సరుకులకే కమీషన్ ఇవ్వడం లేదనీ, అంగన్వాడీల బాధ్యతను అప్పగించినా దానికీ కమీషన్ లేదని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలతో అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు ఇవ్వలేకపోతున్నామని డీలర్లే స్వయంగా చెబుతున్నారు. ముఖ్యం గా జిల్లాలోని పంపిణీ చేయాల్సిన సరుకులన్నీ ఒకేసారి పంపించకుండా నచ్చినప్పుడు పంపించడంతో ఇబ్బందు లు పడుతున్నట్టు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రపు రామారావు తెలిపారు. కమీషన్లు ఇవ్వకుండా ఇలా సాంకేతిక తప్పిదాలతో అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారన్నారు. ఇదే కొనసాగితే రాష్ట్ర నాయకులతో చర్చించి త్వరలోనే రేషన్ పంపిణీని నిలిపివేస్తామని తెలిపారు. దీనిపై ఐసీడీఎస్ పీడీ ఏఈ రాబర్ట్స్ మాట్లాడుతూ అతి తక్కువ కేంద్రాలకు మాత్రమే మాన్యువల్‌గా ఇస్తున్నామని, చాలావరకూ ఈ-పాస్ విధానంలోనే ఇస్తున్నామని తెలిపారు. -
కదలని ఈ-పాస్
♦ రేషన్ దుకాణాల్లో ప్రకటనలకే పరిమితమైన యంత్రాల ఏర్పాటు ♦ డీలర్ల ఒత్తిడితో ఎటూ తేల్చలేక పోతున్న పౌర సరఫరాల శాఖ సాక్షి, హైదరాబాద్: ‘రేషన్‌కార్డుల డిజిటలైజేషన్, వంద శాతం ఆధార్ సీడింగ్ ద్వారా బోగస్ కార్డులను ఏరివేసినట్లే... మరింత సాంకేతికతను వినియోగంలోకి తెచ్చి రేషన్ లీకేజీలకు అడ్డుకట్ట వేస్తాం. రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాల ద్వారా 10శాతం బోగస్‌ను నివారించగలిగాం. ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టి అక్రమాలను నివారిస్తాం..’.. దాదాపు ఏడాది కింద ప్రభుత్వం చేసిన ప్రకటన ఇది. ఆ ప్రకటనకు తగ్గట్టే అడుగు ముందుకు వేసిన ప్రభుత్వం... డీలర్ల ఒత్తిళ్లు, మధ్యలో వచ్చిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ-పాస్ యంత్రాలపై వెనక్కి తగ్గింది. గతేడాది ఆగస్టు నాటికే పూర్తికావాల్సిన ఈ ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. సబ్సిడీ పక్కదారి పట్టకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ. 2,200 కోట్ల సబ్సిడీని భరిస్తూ పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తోంది. రూపాయికి కిలో బియ్యం, రూ15కే లీటర్ కిరోసిన్‌తో పాటు గోధుమలు, చక్కెర, కందిపప్పు వంటివీ సరఫరా చేస్తోంది. అయితే పేదలకు అందాల్సిన సరుకులను డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఏటా బియ్యం అక్రమాల ద్వారా రూ.150కోట్ల మేర అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. కిరోసిన్, గోధుమలు, కందిపప్పు సైతం పక్కదారి పడుతున్నాయని పేర్కొన్నాయి. ఇలా ఏటా వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుండడంతో... దీన్ని కట్టడి చేయడానికి రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈపాస్ యంత్రాల ఏర్పాటును తెరపైకి తెచ్చింది. సుమారు రూ.230కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17వేలకు పైగా రేషన్ దుకాణాల్లో వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతేడాది జూన్‌నాటికే ఏర్పాటు చేయాలని భావించారు. కానీ టెండర్ల ప్రక్రియలో జాప్యంతో ఆలస్యమైంది. డీలర్ల వ్యతిరేకత... డీలర్లు ఈ-పాస్‌పై తొలి నుంచి నిరాసక్తంగా ఉన్నారు. పౌరసరఫరాల శాఖ గత నెలలో సర్కిల్ వారీగా ఈ-పాస్ యంత్రాలపై శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే దాన్ని బహిష్కరించారు. యంత్రాలు అందుబాటులో ఉం చినా వాటిని తీసుకునేందుకు ముందుకు రాలే దు. సంబంధిత అధికారులు డీలర్లకు బలవంతంగా ఈ-పాస్ యంత్రాలను అప్పజెప్పినా..పాత పద్దతిలోనే సరుకులు పంపిణీ చేస్తున్నా రు. మరోవైపు డీలర్ల సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి అధికమైంది. దీనికి స్థానిక నేత లు సైతం జత కలవడంతో ఈ-పాస్ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. దాంతో అక్రమాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. -
పల్లెల్లోనూ ఈ- పాస్
ఆగస్టు 1నుంచి అమలుకు ఏర్పాట్లు 500 డిపోలకు బయోమెట్రిక్ మెషిన్లు మండలాలకు చేరిన పరికరాలు డీలర్లకు పూర్తయిన శిక్షణ అక్రమాల నిరోధమే లక్ష్యం నరసన్నపేట :సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్ర స్థాయిలో రేషన్సరకుల పంపిణీలో అక్రమాలను నివారించేందుకు జిల్లా పౌర సరఫరాల విభాగం సన్నద్ధమైంది. ఆగస్టు ఒకటి నుంచి జిల్లాలో రెండో విడతగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 500 రేషన్‌డిపోల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్(ఈ-పాస్) అమలుచేయనున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. నియోజకవర్గ స్థాయిలో డీలర్లకు ఈ -పాస్ యంత్రాల వినియోగంపై శిక్షణ కూడా పూర్తి చేశారు. ఇందులో భాగంగా నరసన్నపేటలో 21న నాలుగు మండలాలకు చెందిన డీలర్లకు శిక్షణ నిచ్చారు. ఈ-పాస్ అమలైతే రేషన్‌డిపోల్లో అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొదటి విడతగా మండల కేంద్రాలు, మున్సిపాల్టీల్లోని 282 రేషన్‌డిపోల్లో అమలు చేశారు. ఒక్క నరసన్నపేట మండలంలోనే నెలకు 50 క్వింటాళ్ల వరకూ బియ్యం ఆదా కన్పించింది. 500 కార్డు దారులు సరుకులు విడిపించలేదు. దీనివల్ల ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చింది. ఇక పల్లెల్లోనూ వీటిని ఉపయోగించడం ద్వారా మరిన్ని ఫలితాలు సాధించవచ్చని, ప్రభుత్వానికి అధికంగా మిగులు చూపించవచ్చని అధికారులు భావించి ఆగస్టు నుంచి అమలుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఉన్న అన్ని రేషన్ షాపుల్లో మరో రెండు నెలల్లో ఈ-పాస్ అమలు కానుంది. జిల్లాలో మొత్తం 2020 రేషన్‌షాపులున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ-పాస్ అమలైతే 20 శాతం వరకూ సరకులు మిగిలే అవకాశం ఉంది. ఆమదాలవలసలో 15, సరుబుజ్జిలి మండలంలో 13, బూర్జలో 11, పొందూరులో 13 డిపోల్లో ఈ-పాస్ అమలు కానుంది. అలాగే ఎచ్చెర్ల, కంచిలి, పోలాకి, సోంపేట, జలుమూరు, పాలకొండ, మందస, మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, గార, కోటబొమ్మాళి, నందిగాం, సంతకవిటిమండలాల్లో 13 డిపోల చొప్పున్న ఈ-పాస్ అమలు చేయనున్నారు. అలాగే లావేరు, రణస్థలం, నరసన్నపేట, కొత్తూరు, రాజాం మండలాల్లో 15 డిపోలు చొప్పున అమలు చేస్తారు. జి.సిగడాంలో 11, ఇచ్ఛాపురంలో 14, కవిటిలో 12, భామినిలో11, సీతంపేటలో 8, పలాసలో10, వీరఘట్టంలో 11, వంగరలో 12, శ్రీకాకుళం రూరల్ మండలంలో 20, టెక్కలిలో 17 డిపోల్లో ఈ-పాస్ అమలు చేస్తారు. డీలర్లలో ఆందోళన జిల్లా సివిల్ సపై్ల అధికారులు ఈ-పాస్ అమలుకు ఒక వైపు చర్యలు తీసుకుంటుంటే మరో వైపు రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ పాస్‌తో చిన్న తప్పు చేయలేమనీ, కచ్చినమైన తూకం అమలు చేయాలని దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని భయపడుతున్నారు. అన్ని స్థాయిల్లో అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లించుకుని నిజాయితీగా సరకులు అందిస్తే తాము చేతులు కాల్చుకోవాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం, పంచదార, పప్పు ఇతర సరుకులు ఇస్తున్నప్పుడు తూకంవేసి అప్పగించడంలేదనీ, ప్రతీ బస్తాకు కనీసం రెండు నుంచి 4 కేజీలు తరుగు ఉంటోందని చెబుతున్నారు. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. కమీషన్ పెంచకుండా... నిర్బంధంగా ఈపాస్ అమలు చేస్తే డీలర్షిప్ కొనసాగించలేమని స్పష్టం చేస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లో తూకంవేసి సరకులు అప్పగించాలి ఈ-పాస్ అమలు మంచిదే. అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టి, నష్టాలకు గురి చేసి ఈ పద్ధతి అమలు చేయడం సరికాదు. ఈ-పాస్ అమలు చేస్తున్న డిపోలకు కచ్చితంగా సరకులు సరైన తూకంతో అప్పగించాలి. అలాగైతే పూర్తిగా సహకరిస్తాం. డీలర్లకు ఇచ్చే కమీషన్ పెంచాలి. ఇతర ఖర్చులుతగ్గించాలి.పాసిన ఆదెయ్య. డీలరు, గంగివలస -
ఈ పాస్‌తో ఫోర్జరీకి చెక్
- అమల్లోకి వచ్చిన సేవలు - నర్సీపట్నం డివిజన్లో 1732 పాస్ పుస్తకాలు జారీ నర్సీపట్నం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పాస్ పుస్తక విధానం అమల్లోకి వచ్చింది. ఈపాస్ పుస్తకాల వల్ల ఫోర్జరీలు, భూ అక్రమాలు నివారించడంతో పాటు భూహక్కుదారులకు రక్షణగా నిలవడమే కాకుండా నకిలీ పాసు పుస్తకాల సమస్యకు అడ్డుకట్ట పడనుంది. జిల్లాలో తక్కువ సంఖ్యలో ఇవి తహశీల్దార్ కార్యాలయాలకు చేరాయి. సాధారణంగా ఇచ్చే వాటిని నిలిపివేశారు. ఈ నేపధ్యంలో నర్సీపట్నం డివిజన్లో 1,732 పాస్‌పుస్తకాలను జారీ చేశారు. పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చెన్నై కేంద్రంగా ఇవి జారీ అవుతున్నాయి. భూమి యజమాని ఫొటో, తహశీల్దార్ సంతకం విస్తీర్ణం వివరాలు, భూమి స్వభావం, పట్టా నంబరు, భూమి హక్కుదారుని చిరునామా నమోదు చేసిన తేదీ, వ్యవసాయదారుని సంతకం, తహశీల్దార్ సంతకం చేసిన వ్యవసాయదారుని ఫొటో పొందుపరిచారు. దీనివల్ల నకిలీ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడినట్టే. ప్రస్తుతం తాజాగా దరఖాస్తుచేసుకున్న రైతులకు వీటిని అందిస్తున్నా, భవిష్యత్తులో అందరికీ అందించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ పాస్ పుస్తకాల వల్ల బ్యాంకులకు మేలు జరగనుంది. ఆన్లైన్ కావడం వల్ల రుణాల మంజూరు సులభతరం కానుంది. ఈ పాస్ పుస్తకాలకు ఆధార్ అనుసంధానమైతే ఎక్కడనుంచైనా భూ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రైతులకు ఎంతో ప్రయోజనం ఈపాసు పుస్తకాల వల్ల రైతులకు మేలు జరుగుతుంది. బ్యాంకుల వద్ద రుణాలు పొందడానికి సులభంగా ఉంటుంది. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఒకరి భూమిని మరొకరు అక్రమించుకోవడంకుదరదు. వీటి కోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ ఈపాస్ పుస్తకాలు అందజేస్తున్నామన్నాం. పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అన్లైన్లో పొందు పరచాలని తహశీల్దార్లను ఆదేశించాం. జిల్లాలో నర్సీపట్నం డివిజన్లో అధికంగా ఈపాస్ పుస్తకాలు ఇచ్చాం. -
ఈ-పాస్ పరేషాన్
నెల్లూరు(రెవెన్యూ) : రేషన్ కార్డుదారులకు ఈ-పాస్ తలనొప్పిగా మారింది. రేషన్ కోసం చౌకదుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. వేలాదిమంది కార్డుదారులకు ఆధార్ అనుసంధానం కాక నానా అవస్థలుపడుతున్నారు. వృద్ధులు, కార్మికులు వేలిముద్రలు పడక రేషన్ కోసం నానా ఇబ్బందులుపడుతున్నారు. నూతన ఈ-పాస్ విధానంతో తాము చౌకదుకాణాల చుట్టు తిరగాల్సి వస్తోందని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత విధానంలో ఇబ్బందులు లేకుండా సకాలంలో రేషన్ సరఫరా చేసేవారని కార్డుదారులు అంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 73 శాతం రేషన్ పంపిణీ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 1,774 చౌకదుకాణాలు ఉన్నాయి. 8.24 లక్షల మంది రేషన్‌కార్డుదారులు ఉన్నారు. 320 చౌక దుకాణాల్లో ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నారు. కార్డుదారులకు ప్రతినెలా బియ్యం, చక్కెర, కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. చౌకదుకాణాల్లో అవినీతి అక్రమాలను అరికట్టి కార్డుదారులకు సక్రమంగా రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించింది. అక్రమాలను అరికట్టడం అటుంచితే రేషన్ కోతే లక్ష్యంగా ఈ-పాస్ విధానాన్ని అమలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-పాస్ విధానం ద్వారా ప్రభుత్వానికి రూ.1500 కోట్లు మిగులుతుందని సీఎంకు చెప్పడంతో మరో అలోచన చేయకుండా అమలు చేయమని ఆదేశాలు జారీచేశారని అధికారులే చెబుతున్నారు. ఎంత తిరిగినా ఫలితం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 8 వేల మందికి రేషన్ పంపిణీ చేయాల్సి ఉంది. 8 వేలమంది రేషన్ కోసం ఈ నెల 4వ తేదీ నుంచి చౌకదుకాణం చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదు. వేలిముద్రలు పడకపోవడం, ఆధార్ అనుసంధానం కాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ-పాస్ యంత్రాలు గంట పనిచేస్తే మరో రెండు గంటలు మోరాయిస్తున్నాయి. కార్డుదారులు మాత్రం గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సి వస్తోంది. ఈ-పాస్ విధానం ప్రారంభించి మూడు నెలలు పూర్తయిన అనేక ప్రాంతాల్లో ఇంకా లోపాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆరు జిల్లాలకు ఒకటే సర్వర్ ఏర్పాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డీలర్లు అంటున్నారు. లోపాలను సవరించేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. గతంలో రేషన్‌కార్డుల ఆధార్ అనుసంధానం చేశారు. సుమారు 97 శాతం ఆధార్ పూర్తయిందని అధికారులు తెలిపారు. కానీ ప్రస్తుతం ఆధార్ సీడింగ్ కాలేదంటు డీలర్లు కార్డుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆధార్ అనుసంధానం కోసం కార్డుదారులు కలెక్టరేట్ వద్ద బారులుతీరుతున్నారు. 97 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి అయితే కలెక్టరేట్లో బారులు తీరుతున్నా కార్డుదారులు అర్హులా, అనర్హులా అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
ఈ పాస్ ఫెయిల్..అయినా రేషన్
ఈ నెలకు పాతపద్ధతిలోనే సరకుల పంపిణీ వేలిముద్రలు తీసుకుని పంపిణీకి పౌరసరఫరాల అధికారులకు ఆదేశం సాక్షి, విశాఖపట్నం : ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా అమలు చేస్తున్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) మిషన్లు జిల్లా ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మిషన్లు మొరాయించడం, సర్వర్లు డౌన్ కావడం, సెల్నెట్వర్క్ పనిచేయకపోవడంతో జిల్లావ్యాప్తంగా వినియోగ దారులు నరకంచూస్తున్నారు. ఈపాస్ మిషన్ల ద్వారా మాత్రమే పంపిణీ చేయాలని జిల్లాఅధికారులు తేల్చి చెప్పడంతో డీలర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆది నుంచి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న డీలర్లు పనిచేయని మిషన్లను మూలన పెట్టేస్తున్నారు. కొత్త విధానంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కనీసం 30 శాతం మంది కార్డుదారులు రేషన్‌కు నోచుకోలేదు. యలమంచిలి, అనకాపల్లి, భీమిలి, నర్సీపట్నం పట్టణాల్లో 274 షాపులపరిధిలో మిషన్లు పని చేయకపోయినా, సర్వర్లు ఇబ్బంది పెడుతున్నా అతికష్టమ్మీద ఇప్పటి వరకు 60 శాతం కార్డు దారులకు రేషన్ సరఫరా చేయగలిగారు. వీటిలో ఈపాస్ మిషన్ల ద్వారా 20 శాతం కార్డుదారులకు సరకులివ్వగా, మిగిలిన 40 శాతం కార్డుదారులకు పాతపద్ధతిలోనే పంపిణీ చేశారు. ఇక విశాఖలోని 412 రేషన్ షాపుల్లో కొత్త విధానాన్ని ఒకేసారి అమలు చేశారు. ఈ షాపుల పరిధిలో 3,71,625 కార్డులుండగా, ఇప్పటి వరకు అతికష్టమ్మీద 75వేల కార్డుదారులకు పంపిణీ చేయగా,మరో 1.19లక్షల కార్డుదారులకు పాత పద్ధతిలోనే సరఫరా చేశారు. ఇప్పటి వరకు జీవీఎంసీపరిధిలో 54 శాతం మంది కార్డు దారులకు సరకులు పంపిణీ చేశారు. రోజూ రేషన్‌దుకాణాలకు వందలాదిమంది కార్డుదారులు రావడం...గంటలతరబడి నిరీక్షించడం..చివరకు మిషన్లు పనిచేయక, సర్వర్లు డౌన్‌కావడం వంటిసమస్యలతో వెనుదిరిగడం పరిపాటిగా మారుతోంది. ముఖ్యంగారోజువారీ కూలీ పనులు చేసుకునే నిరుపేదల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. గత పదిహేను రోజుల్లో సుమారు పదిరోజుల పాటు రేషన్‌షాపుల చుట్టూనే తిరగడం వలన జీవనోపాధి కోల్పోయే కుటుంబం గడవని పరిస్థితి నెలకొంది. మారుమూల ప్రాంతాల్లో తెల్లవారుజామున నెట్వర్క్ పనిచేస్తోంది. దీంతో కార్డుదారులను ఉదయమే రమ్మని చెప్పి స్లిప్‌లు ఇస్తుండడంతో వేకువజాము నుంచే షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. తాను వారం రోజులుగా క్రమం తప్పకుండా ఎఫ్పీషాపు చుట్టూ తిరుగు తున్నానని, ఒక రోజు సర్వర్ డౌన్ అయిందని..మరో రోజు నెట్వర్క్ లేదని.. ఇంకో రోజు మిషన్ పనిచేయడం లేదని తిప్పుతున్నారని..చివరకు వేలిముద్రలు తీసుకున్నా ఒకే కాక తర్వాత రమ్మని చెప్పి పంపిస్తున్నారని విశాఖ సీతమ్మధారకు చెందిన సీహెచ్ అప్పలనాయుడు వాపోయారు. ఇతర మున్సిపాల్టీల్లోనూ ఇదే దుస్థితి. దీంతో పాత పద్ధతిలోనే సరకులిచ్చేందుకు అనుమతులివ్వాలని డీలర్లు ఒత్తిడి తెస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రభుత్వ ఈవిధానాన్ని పక్కన పెట్టేందుకు ససేమిరా అంటోంది. దీంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు గుర్తించినప్పటికీ జిల్లా అధికారులు కూడా మిన్నకుండిపోతున్నారు. చివరకు వేలిముద్రలు తీసుకుంటే చాలు..మిషన్ ఫెయిల్ అయినా కార్డుదారులను తిప్పించుకోకుండా ఈ నెల వరకు సరకులు ఇవ్వా ల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ జే.నివాస్ ఆదేశాలు జారీచేశారు. నాలుగు రోజుల నుంచి ఇదే ప్రక్రియలో సరకుల పంపిణీ వేగం పుంజుకుంది.ఈ పాస్ మిషన్లను పక్కన పెట్టయినా 25వ తేదీలోగా సరకుల పంపిణీ పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు. -
ఈ-పాస్ రోజూ ఫెయిలే
♦ పక్షం రోజులైనా గాడిలో పడని కొత్తవిధానం ♦ సరకులందక నరకం చూస్తున్న కార్డుదారులు ♦ అవగాహన లేమితో డీలర్ల అవస్థలు ♦ కొన్ని చోట్ల పాతపద్ధతిలోనే బట్వాడా సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఈ-పాస్ విధానం అభాసుపాలవుతుంది. కనీస శిక్షణ.. అవగాహన.. పరిశీలన లేకుండా అమలు చేసిన ఈ కొత్త విధానం వల్ల కార్డుదారులు సకాలంలో సర కులు అందక మండుటెండలో గంటల తరబడి నిరీక్షిస్తూ నిత్యం నరకం చూస్తున్నారు. కనీస అవగాహన లేని డీలర్లు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) విధానం అమలులోకి వచ్చి అప్పుడే పక్షం రోజులైంది. కానీ నేటికీ ఈ విధానం గాడిలో పడలేదు. ఆదా పేరుతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ విధానం వల్ల ప్రజలు నిత్యం అగచాట్లకు గురవుతున్నారు. జీవీఎంసీ పరిధిలోని 412 షాపులు, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల పరిధిలో 274 షాపుల్లో ఈనెల 1వ తేదీ నుంచి ఈ పాస్ విధానానికి శ్రీకారం చుట్టారు. రోజులు గడుస్తున్నాయే తప్ప..పరిస్థితులు మాత్రం చక్కబడే అవకాశాలు కన్పించడం లేదు. ప్రతీరోజూ సగానికి పైగా మిషన్లు మొరాయించడం లేదా సర్వర్లు డౌన్ కావడం.. నెట్ వర్క్‌లు పనిచేయకపోవడం నిత్యకృత్యమైపోయింది. తొలగని బాలారిష్టాలు ఈ పాస్ మిషన్‌లో రేషన్‌కార్డు వివరాలను ఫీడ్ చేసి ఆధార్ నెంబర్లను అనుసంధానం చేయాలి. రేషన్‌కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే హైదరాబాద్‌లోని సెంట్రల్ సివిల్ సప్లయిస్ సర్వర్‌తో, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే బెంగుళూరులోని ఆధార్ సర్వర్‌తో కనెక్ట్ అవుతుంది. వేలిముద్రలు తీసుకోగానే వాటిని సెంట్రల్ సర్వర్ నుంచి సరిపోల్చుకుంటుంది. అన్నీ సరిపోతే ఆ రేషన్‌కార్డులో ఎంతమంది సభ్యులు న్నారు? వారికి ఏ సరుకులు ఎంత మేరకు కేటాయించారు? వాటిధరఎంత? అనే వివరాలు మిషన్‌లో చూపిస్తాయి. ఇదంతా సెకన్లలో జరిగిపోవాలి. సక్రమంగా పనిచేస్తే ఒక్కో కార్డుకు వివరాలు అప్లోడ్ చేసి సరకులు ఇచ్చేందుకు అరగంటకు పైగా సమయం పడుతోంది. కానీ అన్ని వివరాలు ఫీడ్ చేసిన తర్వాత సర్వర్ డౌన్ అని రావడం లేదా సిగ్నల్ వ్యవస్థ పనిచేయక పోవడం వంటి సమస్యలతో అదేపనిగా వేలిముద్రలు తీసుకోవడం.. వివరాలు ఫీడ్ చేయడంతోనే సరిపోతుంది. ఒకే అని సమాధానం వచ్చేవరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ సమస్యల వల్ల డిపోలకు వచ్చిన కార్డుదారుల్లో కనీసం 10 శాతం మందికి కూడా సరుకులు పంపిణీ చేయలేకపోతున్నారు. ఈ విధానంలో ఒక్కో రేషన్‌షాపులో రోజుకు నలుగురైదుగురుకు మించి ఇవ్వలేకపోతున్నారు. దీంతో సరకులు కోసం కార్డుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సిన వస్తోంది. డిపోల వద్ద ఆందోళనలు కొన్ని డిపోల వద్ద కార్డుదారులకు డీలర్లకు మధ్య ఘర్షణవాతావరణం కూడా చోటు చేసుకుంటోంది. ఇటీవల కలెక్టరేట్‌ను ముట్టడించి కార్డుదారులు ఆందోళన చేశారు. అలాగే దొండపర్తి, గాజువాక, గోపాలపట్నం, వన్‌టౌన్ ఏరియాల్లో పెద్దఎత్తున నిరసన వ్యక్తంచేశారు. వన్‌టౌన్ పప్పులవీధిలోని రేషన్‌షాపులో ఈ పాస్ మిషన్ పనిచేయక పోవడంతో శనివారం డిపోకు వచ్చిన డీఎస్ఒ రవితేజనాయక్ను కార్డుదారులు నిలదీశారు. ఒక్క విశాఖలోనే కాదు మిగిలిన మున్సిపాల్టీల్లో కూడా ఇదే రీతిలో సరకులందక కార్డుదారులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సిగ్నల్ సమస్య వేధిస్తున్న మారుమూల ప్రాంతాల్లోని డిపోలను మూసివేసిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం జీవీఎంసీతో పాటు మిగిలిన మున్సిపాల్టీల్లో దాదాపు అన్ని రకాల సెల్‌టవర్లు ఉన్నాయి. అయినప్పటికీ సిగ్నెల్స్ లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మిషన్లలో లోపమా.. లేక నెట్వర్కింగ్లో లోపమో అంతుచిక్కని సమస్యగా తయారైంది. ఉన్న కొద్దిపాటి టెక్నీషియన్లు మిషన్ల మరమ్మతుల పేరుతో ఆ మూల నుంచి ఈ మూలకు.. ఈ మూల నుంచి ఆ మూలకు తిరిగలేక అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు 2జీ సిమ్ల స్థానంలో దాదాపు అన్ని డిపోలకు 3జీ సిమ్‌లు, యాంటినాలు సరఫరా చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. అక్కరకు రాని రైల్వే సర్వర్ మాలుమూల ప్రాంతాల్లో సైతం పనిచేసే అత్యాధునిక సర్వర్ వ్యవస్థ రైల్వేశాఖలోనే ఉంది. దీంతో ఈపాస్‌లో సర్వర్ సమస్యలను అధిగమించేందుకు రైల్వే శాఖాధికారులతో చర్చించి ఆ సర్వర్‌తో ఈ పాస్మిషన్లను అనుసంధానంచేయాలని రెవెన్యూ అధికారులు చేసిన కృషి ఫలించలేదు. గురువారం రాత్రికే ఈ సర్వర్ అందుబాటులోకి వస్తుందని, శుక్రవారం నుంచిసర్వర్ సమస్యలుండవని చెప్పినిప్పటికీ రైల్వేసర్వర్ జాడ లేదు. ఇక ఆరు జిల్లాలకు ప్రత్యేకంగా ఒక సర్వర్‌ను ప్రభుత్వం ఆదివారంలోగా అందుబాటులోకి తీసుకొస్తుందని ప్రకటించినా దాని జాడ కూడా కన్పించలేదు. ఇక ఈ పాట్లు పడలేక నర్సీపట్నంలోని ఎంపిక చేసిన 10 డిపోల్లో గతంలో మాదిరి గానే బియ్యం, ఇతరనిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఈ పాస్ ఇక్కట్లు తొలిగే వరకు ఈ నెలకు పాతపద్ధతిలోనే పంపిణీ చేయాలన్న భావనలో అధికారులున్నట్టు తెలిసింది. -
‘ఈ-పాస్’ ఇక్కట్లు
మహారాణిపేట(విశాఖపట్నం): ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేసే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) ఆదిలోనే ఇక్కట్ల పాల్జేస్తోంది. ప్రారంభానికి ముందే మిషన్లు మొరాయిస్తున్నాయి. సెల్నెట్వర్క్లు సరిగా పనిచేయడం లేదు. తరచూ సర్వర్లు డౌన్ అయిపోతున్నాయి. ఏప్రిల్1వ తేదీ నుంచి అమలు చేయనున్న ఈ విధానం అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతుంది. జిల్లాలో 2063 రేషన్ దుకాణాలుండగా తొలిదశలో జీవీఎంసీతో పాటు భీమిలి, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచలి మున్సిపాల్టీల పరిధిలో ఉన్న 686 షాపుల్లో అమలు చేయాలని సంకల్పించారు. కానీ తొలి విడతలో 430 మిషన్లు మాత్రమే కేటాయించడంతో వాటిలో జీవీఎంసీ పరిధిలో 290, ఇతర మున్సిపాల్టీల్లో 90 షాపులకు కేటాయించారు. మిగిలినవి రిజర్వుగా ఉంచారు. ఆ తర్వాత దశల వారీగా జిల్లాలోని గ్రామీణ, ఏజెన్సీప్రాంతాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. కేటాయించిన మిషన్ల ద్వారా ఆయా షాపుల పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి క్రమం తప్పకుండా రేషన్ తీసుకునేందుకు వచ్చే కుటుంబసభ్యుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్యమొదలవుతోంది. వేలిముద్రలుతీసుకునే సమయంలో ఈ మిషన్లు సరిగాపనిచేయకపోవడం...సర్వర్లు డౌన్వడం..నెట్‌వర్క్‌లు పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ‘ఈ పాస్’ పనిచేసే తీరు ఇలా..! రేషన్‌కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే హైదరాబాద్‌లోని సెంట్రల్ సివిల్ సప్లయిస్ సర్వర్‌తోనూ, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే బెంగుళూరులోని ఆధార్ సర్వర్తోను కనెక్ట్ అవుతుంది. వేలిముద్రలుతీసుకోగానే కార్డు తీసుకున్నప్పుడు సేకరించిన వేలి ముద్ర లతో సెంట్రల్ సర్వర్ నుంచి సరిపోల్చుకుంటుంది. అలా ఈ మూడు సర్వర్ల నుంచి క్షణాల్లో మిషన్‌కు సంకేతాలొస్తాయి. అన్నీ సరిపోతే ఆరేషన్కార్డులో ఎంతమంది సభ్యులున్నారు? వారికి ఏ సరుకులు ఎంత కేటాయించారు? దరఎంత? అనేవివరాలు మిషన్‌లో చూపిస్తాయి. కానీ ఇప్పుడు వేలిముద్రలు సేకరించే సమయంలోనే మిషన్లు మొరాయిస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. నెట్వర్కింగ్ అసలు సమస్య..! ఈ-పాస్ మిషన్లు పని చేయకపోవడానికి ప్రభుత్వం ఇచ్చిన సిమ్కార్డులే ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. 1జీబీ కెపాసిటీ గల సిమ్‌కార్డులు ఇవ్వడంతో వాటి ద్వారా సిగ్నల్స్ రాక నెట్వర్క్ (ఇంటర్నెట్)కనెక్ట్ కాకపోవడంతో రోజంతా సమయం వృధా అవుతోంది.విశాలంగా ఉన్న ప్రాంతాల్లో పని చేస్తున్నాయని, ఇరుకుగా, చిన్నచిన్న సందుగొందులుగా ఉన్న ప్రాంతాల్లో అసలు పనిచేయడంలేదని సిబ్బంది వాపోతున్నారు. మిషన్లలో నాణ్యత లేకపోవడమా లేక సిమ్కార్డులే పనిచేయడం లేదా అనేది అధికారులు చెప్పలేక పోతున్నారు. వేలిముద్రలకు నరకయాతనే: రేషన్ తీసుకోవాలంటే లబ్ధిదారులు రేషన్ దుకాణాల్లో ముందుగా ఈ పాస్ మిషన్లులో వేలిముద్రలు నమోదు చేయించుకోవాలి. అలా చేస్తేనే రేషన్ వస్తోంది. దీనికోసం లబ్ధిదారులు రేషన్‌దుకాణాల ఎదుట రోజంతా బారులు తీరి ఉంటున్నారు. మిషన్లు పని చేయకపోవడం, సిమ్‌లు పనిచేయకపోవడం వంటి కారణాలతో రోజంతా క్యూలో ఉన్న లబ్ధిదారులు ఉస్సూరంటూ ఇంటిబాట పడుతున్నారు. మరుసటి రోజు మళ్లీ క్యూ కడుతున్నారు. త్వరలో ఐరిష్‌తో సరుకులిస్తాంః జేసీ సిమ్‌లు చాలా ఏరియాల్లో పనిచేయయడం లేదని ఫిర్యాదులొస్తున్నాయి.ప్రత్యామ్నాయంగా బీఎస్ఎన్ఎల్ సిమ్‌లు ఇస్తున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందులుతలెత్తకుండా ఉండేందుకు ప్రతీరేషన్షాపునకు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంటికి వచ్చే సిబ్బందికి కుటుంబంలో ఎవరో ఒకరి వేలిముద్రల ఇస్తే సరిపోతుంది. అందరి వేలిముద్రలు ఒకేసారి ఇవ్వనసరం లేదు. ఒకటి రెండు నెలల్లోఐరిష్తో అనుసంధానం చేయనున్నాం. ఒకటో తేదీ నుంచి ఈ పాస్ మిషన్లను ఉపయోగించి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ల ద్వారానే సరుకులు ఇస్తాం. - నివాస్ జనార్ధనన్, జిల్లా జాయింట్ కలెక్టర్