సిమ్లా: లాక్డౌన్ టైంలో జనాల అత్యవసరాల సేవల కోసం పోలీసులు ఈ-పాస్‌లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హిమాచల్ ప్రదేశ్ పోలీసుల నిర్వాకంపై జనాలు నవ్వుకుంటున్నారు ఇప్పుడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌లకు లాక్డౌన్ ఈ-పాస్‌లు జారీ చేశారు అక్కడి పోలీసులు. ఈ వ్యవహారం మీడియాలో హైలైట్ కాగా, ఈ వ్యవహారం వెనుక ఉన్న జర్నలిస్ట్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో వ్యవహారం కోర్టుకి చేరింది.
లాక్డౌన్ టైంలోనూ ప్రైవేట్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో యథేచ్చగా తిరుగుతుండడంతో అమన్ కుమార్ భరద్వాజ్ అనే జర్నలిస్ట్ ‘ఈ-పాస్ వ్యవహారం’పై అనుమానపడ్డాడు. తన ఆధార్ వివరాల్ని ఇచ్చి.. ట్రంప్, అమితాబ్ ఫొటోలతో పాస్‌ల కోసం పోలీస్ ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కనీసం ఆ ఫొటోల్ని కూడా పట్టించుకోకుండా, దరఖాస్తుల్ని కూడా వెరిఫై చేయకుండానే పాస్‌లు జారీ చేశారు పోలీసులు. ఈ వ్యహారంపై మే 5న అమన్ కుమార్ రిపోర్ట్ చేసిన స్టోరీ టీవీ ఛానెల్లో టెలికాస్ట్ అయ్యింది. దీంతో పోలీసులు అదే రోజు సాయంత్రం ఆ జర్నలిస్ట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద అరెస్ట్ కోసం ప్రయత్నించారు.
ఈలోపే అమన్ అప్రమత్తమై హైకోర్టును ఆశ్రయించాడు. ఈ-పాస్‌ల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం బయటపడిందని, పత్రికా స్వేచ్ఛను పోలీసులు అణిచివేయాలని చూస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే అతని విజ్ఞప్తిని మన్నించిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు.. ఈ వ్యవహారంలో పోలీసులపై అక్షింతలు వేసింది. అంతేకాదు ఈ కేసు విచారణలో తదుపరి వాదనల వరకు అమన్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది.
ఈ-పాసులపై ట్రంప్, అమితాబ్‌ల ఫొటోలు
Published Sat, Jun 5 2021 2:00 PM | Last Updated on Sat, Jun 5 2021 3:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment