Shimla
-
హిమాచల్‌లో భారీ మంచు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటల్లో భారీగా మంచు కురియడంతో నలుగురు మృతి చెందారు. మూడు జాతీయరహదారు లు, మరో 220 దారులను మూసివేశారు. సిమ్లా, కులు, మండి, చంబా, సిర్మౌర్ జిల్లాలతో పాటు కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో భారీగా మంచు కురిసింది. పలు వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సిమ్లాలో 145, కులులో 25, మండీ జిల్లాల్లో 20 రహదారులను మూసివేశారు. 356 ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యూర్ కావడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం సిమ్లా, మనాలీలకు పర్యాటకులు పోటెత్తారు. స్థానిక నివేదికల ప్రకారం, అట్టారి నుంచి లేహ్, కులు జిల్లా లోని సంజ్ నుంచి ఔత్, కిన్నౌర్ జిల్లాలోని ఖాబ్ సంగం, లాహౌల్, స్పితి జిల్లాలోని గ్రామ్ ఫూ వరకు జాతీయ రహదారులు ట్రాఫిక్ కారణంగా మూసివేశారు. రోడ్లను క్లియర్ చేయడానికి హిమాచల్ ప్రభుత్వం రెండు స్నో బ్లోయర్లతో సహా 268 యంత్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని, స్థానికులు చెప్పేది వినాలని, మంచులో డ్రైవింగ్ చేయవద్దని పర్యాటకులు సూచించింది.తెల్లని వండర్‌ల్యాండ్‌గా హిమాచల్.. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనా లీ వంటి పర్యాటక కేంద్రాలు తెల్లని వండర్‌ల్యాండ్‌గా మారాయి. అలాగే జమ్మూకాశీ్మర్లోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా మంచుకురిసింది. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే అనేక డిగ్రీలు పడిపోయా యి. ఇది క్రిస్మస్ సెలవుల కోసం ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మరోవైపు వాహనాల రాకపోకలకు కష్టమవుతోంది. సోమవా రం అర్థరాత్రి మనాలీ, డల్హౌసీ శివారు ప్రాంతాల్లో తేలికపాటి హిమపాతం నమోదైంది. ఖద్రాలాలో అత్యధికంగా 24 సెంటీమీటర్లు, సంగ్లాలో 16.5 , షిల్లారోలో 15.3, చోపాల్, జుబ్బల్‌లో 15 సెంటీమీటర్ల చొప్పున, కల్పాలో 14, నిచార్‌లో 10, సిమ్లాలో 7, పూహ్‌లో 6, జోత్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున మంచు కురిసింది. ప్రతికూల వాతావరణం, హిల్ స్టేషన్‌కు వెళ్లే మార్గంలో రహదారిపై ప్రాణాంతక పరిస్థితులు ఉన్నా పర్యాటకులు పోటెత్తారు. సిమ్లాలోని హోటల్ గదుల ఆక్యుపెన్సీ 70 శాతం నమోదైంది. గత ఏడాది డిసెంబర్ కంటే ఇది 30 శాతం ఎక్కువ. మంచు దుప్పటితో అందంగా కప్పబడిన సిమ్లా, మనాలీ చిత్రాలతో సోషల్ మీడియా నిండిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యా హ్నం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా సిమ్లాలో భారీ వర్షా లు, మంచు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
రోడ్లపై మంచు గుట్టలు..చిక్కుకుపోయిన టూరిస్టులు
షిమ్లా:హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. భారీ మంచు ప్రభావంతో రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపై మంచు గుట్టలుగుట్టలుగా పేరుకుపోవడంతో రోహ్తక్, సోలాంగ్, అటల్ టన్నెల్ మార్గంలో వెయ్యి వరకు వాహనాలు సోమవారం రాత్రి కొన్ని గంటల పాటు చిక్కుకుపోయాయి.స్థానిక అధికారులు,పోలీసుల సాయంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. మొత్తం 700 మంది టూరిస్టులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్రిస్మస్, న్యూఇయర్ కావడంతో టూరిస్టుల తాకిడి ఎక్కువవడం ఇదే సమయంలో మంచు భారీగా కురుస్తుండడంతో సమస్యలు ఎదురవుతున్నాయని పోలీసులు చెప్పారు. ఈ సీజన్లో ఇక్కడుండే మంచు పర్వతాలను చూడడానికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుండడం గమనార్హం. #WATCH | Himachal Pradesh: Heavy snowfall causes a long traffic jam as nearly 1000 vehicles get stuck between Solang and Atal Tunnel, Rohtang. The police team is busy clearing the traffic jam amid snowfall. 700 tourists have been rescued safely. (23.12)Source: Himachal Pradesh… pic.twitter.com/wb9ZfKh6H6— ANI (@ANI) December 23, 2024 -
హిమాచల్‌లో రెండు డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లాహౌల్ స్పితి జిల్లా కుకుమ్సేరిలో కనిష్ట ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్. గరిష్ట- కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఏర్పడిన వ్యత్యాసం పలువురికి అనారోగ్యాలను తెచ్చిపెడుతోంది. పగటిపూట ఎండవేడిమి, సాయంత్రం వీచే చల్లని గాలి వ్యాధులకు కారణంగా నిలుస్తోంది.సిమ్లా వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 17 వరకు వాతావరణం నిర్మలంగా ఉండనుంది. అంటే వర్షం, ఉరుములు, మెరుపులు, వడగళ్ల వాన మొదలైనవి ఉండవు. మరోవైపు కిన్నౌర్ జిల్లా కల్పాలో తేలికపాటి వర్షం నమోదైంది. ధర్మశాలలోని ధౌలాధర్ పర్వతాలపై కూడా తేలికపాటి హిమపాతం కనిపించింది.దీనిని ఈ సీజన్లో మొదటి హిమపాతంగా చెబుతున్నారు. ఎత్తయిన ప్రాంతాల్లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలోని కుకుమ్సేరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 2.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉనాలో అత్యధికంగా 35.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సిమ్లాలో 23.8 డిగ్రీలు, కల్పాలో 21.8 డిగ్రీలు, ధర్మశాలలో 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది కూడా చదవండి: ఎయిరిండియా విమానంలో బాంబు? -
హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి.. హోటళ్లు కిటకిట
సిమ్లా: ప్రస్తుతం దేశంలో దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా నేపధ్యంలో సెలవులను ఎంజాయ్ చేసేందుకు టూరిస్టులు హిమాచల్ ప్రదేశ్‌కు తరలివస్తున్నారు. రాష్ట్రంలోని పర్యాటక వ్యాపారం ఇప్పుడు మరింతగా ఊపందుకుంది.పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల నుండి పర్యాటకులు హిమాచల్ చేరుకుంటారు. దీంతో ఇక్కడి హోటళ్లలోని గదులు 80 శాతం వరకూ నిండిపోయాయని తెలుస్తోంది. ట్రావెల్ ఏజెంట్ నరేన్ సహాయ్ మీడియాతో మాట్లాడుతూ పండుగగ సీజన్ ప్రారంభమైందని,అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో లాంగ్ వీకెండ్ రాబోతోందని, ఈ సందర్భంగా పర్యాటకులు హిమాచల్‌కు అధిక సంఖ్యలో తరలివస్తారని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం, బెంగాలీ పర్యాటకులు వస్తున్నారని, దీపావళి సమయంలో గుజరాతీ పర్యాటకులు సిమ్లాను సందర్శిస్తారన్నారు.నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని హోటల్ వ్యాపారి ప్రిన్స్ కుక్రేజా మీడియాకు తెలిపారు. వారాంతాల్లో గదుల బుకింగ్స్ కూడా జరుగుతున్నాయన్నారు. గత వారాంతంతో పోలిస్తే, ఈ వారాంతంలో ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు సిమ్లా, హిమాచల్ ప్రదేశ్‌లను సందర్శించేందుకు రానున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర , పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్ నుండి పర్యాటకులు హిమాచల్‌కు తరలివస్తున్నారన్నారు.ఇది కూడా చదవండి: ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. పెన్షన్ రద్దు
సిమ్లా: పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీకి చేరకుండా ఉండేందుకు బుధవారం అసెంబ్లీలో ఓ కొత్త బిల్లును తీసుకువచ్చింది. పార్టీ మారితే ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు చేసేలా ఆ బిల్లును రూపొందించింది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో.. సభ్యుల భత్యాలు ,పెన్షన్ (సవరణ బిల్లు)- 2024 పేరుతో నూతన బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఇక ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు కొత్త బిల్లు ప్రకారం పెన్షన్ రద్దు వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏ సమయంలోనైనా ఎమ్మెల్యేలుగా అనర్హతకు గురైతే.. కొత్త బిల్లు ప్రకారం పెన్షన్‌కు అర్హులు కాదు’అని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఈ బిల్లు ప్రస్తావించింది.ఇక..ఫిబ్రవరి 27న హిమచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అనంతరం వారంతా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన బిల్లును ఆమోదించింది. -
హిమాచల్: వరద బాధితులకు తక్షణ సాయం రూ. 50 వేలు
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ఎనిమిదిమంది మృతిచెందారు. 50 మంది గల్లంతయ్యారు. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.సిమ్లా జిల్లాలోని సమేజ్, రాంపూర్, కులులోని బాఘిపుల్, మండిలోని పద్దర్లలో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా తెలిపారు. భారీ వర్షాలకు 53 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఆరు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్లు సిమ్లా, కులు జిల్లాల్లో పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బాధితులకు తక్షణ సాయంగా రూ.50వేలు ఇస్తామని ప్రకటించారు. అలాగే వచ్చే మూడు నెలల పాటు నెలకు రూ.5వేలు చొప్పున ఇస్తామని, వంటగ్యాస్, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను కూడా అందజేస్తామని తెలిపారు. #WATCH | Shimla: On Himachal Pradesh disaster, Special Secretary, Disaster Management DC Rana says, "A cloudburst in the Samej area of Shimla district, Rampur region, Baghipul area of Kullu, and Paddar area of Mandi has led to widespread destruction. 53 people are missing and six… pic.twitter.com/s0CAl1Me4e— ANI (@ANI) August 3, 2024 -
నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
బాలీవుడ్ దర్శకురాలు కిరణ్‌రావు (బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ మాజీ భార్య) దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ ఓటీటీలో మంచి ఆదరణ సంపాదించుకుంది. కుటుంబం, వైవాహిక వ్యవస్థలో మహిళల స్థితిగతులు, అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగే బాల్య వివాహాలు, అమ్మాయిల తెగవును పట్టి ఇచ్చిన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రతిభా రాంటా తన అధ్బుతమైన నటనతో ఆకట్టుకుంది. సిమ్లా టూ బాలీవుడ్ ప్రతిభ రాంటా ఇంట్రస్టింగ్ జర్నీ ఒక సారి చూద్దాం.ఖుర్బాన్ హువా టీవీ సీరియల్‌తో వెలుగులోకి వచ్చింది ప్రతిభా రాంటా. ఆ తరువాత వెబ్ సిరీస్ చేస్తుండగా కిరణ్ రావు దృష్టిలో పడింది. అలాలాపతా లేడీస్‌లో అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తానేమిటో నిరూపించుకుంది. బాలీవుడ్‌కి పరిచయం అయిన కొత్త ముఖాల్లో ప్రతిభ రాంటా. నిజంగా తన యాక్టింగ్ ప్రతిభ, ఒకదాని తర్వాత ఒకటి తన ఆన్-స్క్రీన్ పెర్ఫార్మెన్స్తో, ముఖ్యంగా లాపతా లేడీస్ 'జయ' పాత్రలో సత్తా చాటింది. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్లో 'వహీదా' (సంజీదా షేక్) కుమార్తె 'షామా' పాత్రను పోషించింది. 24 ఏళ్ల వయసులో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ ప్రయాం అంత సాఫీగా సాగలేదు.ఎవరీ ప్రతిభా రాంటాసందేశనా రాంటా,, రాజేశ్ రాంటా దంపతుల కుమార్తె ప్రతిభా రాంటా. సిమ్లాలో పెరిగింది. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఇష్టం. డాన్స్‌లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. అలా నటించాలనే ఆసక్తి పెరిగింది. ఆ మాటే ఇంట్లో చెబితే యాక్టింగ్ అంటే ఏంటి? అని అడిగారట. ఎందుకంటే కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయులు, అందుకే వారికి నటన గురించి ఏమీ తెలియదట. ఇంజనీర్, డాక్టర్ లేదా మరేదైనా ఇతర ప్రొఫెషనల్‌గా ప్రతిభను చూడాలని ఆశించారు. దీంతో యాక్టింగ్‌లో చేరడం చాలా కష్టమేమో , తనను చూసి నవ్వుతారేమో అనిపించిందని ఒక ఇంటర్య్వూలో వెల్లడించింది.పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ప్రతిభ ఎలాగోలా తన తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువుకోసం ముంబైకి చేరింది. ఆడిషన్లు ఇవ్వడం మొదలు పెట్టింది. అందాల పోటీలో పాల్గొంది. 2018లో మిస్ ముంబై టైటిల్‌ను గెలుచుకుంది. నిస్సందే 2018 మిస్ ముంబై అందాల పోటీల్లో మిస్ ముంబై కిరీటం గెలుచుకుంది. దీంతో కేవలం ఆరు నెలలకే ‘ఖుర్బాన్ హువా’ టీవీ సీరియల్ 'చాహత్' పాత్రలో తొలి ఆఫర్ వచ్చింది. తరువాత,ఆధా ఇష్క్ అనే వెబ్ షోలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Pratibha Rantta (@pratibha_ranta)ఇక లాపతా లేడీస్ ఆఫర్ గురించి మాట్లాడుతూ మొదట్లో కాస్త భయమేసిందని, అయితే సినిమాలో ‘జయ’ కథ ఒక విధంగా నిజ జీవితానికి సరిగ్గా సరిపోతుందని, అందుకే ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తన జర్నీ అంతా ఒక మ్యాజిక్‌లా సాగిపోయిందని వెల్లడించింది మెరిసే కళ్లతో. -
నేటితో ‘హిమాచల్’కు 76 ఏళ్లు!
హిమాచల్ ప్రదేశ్ ఈరోజు 76వ ఏట అడుగుపెట్టింది. ఈ రాష్ట్రం 1948 ఏప్రిల్ 15న ఆవిర్భవించింది. నేడు హిమాచల్ దినోత్సవాన్ని సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. అనేక మైలురాళ్లను దాటిన హిమాచల్ ప్రదేశ్ నేడు అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో ఉంది. 1948లో హిమాచల్ ప్రదేశ్‌లో అక్షరాస్యత రేటు ఏడు శాతంగా ఉంది. ఇది 76 సంవత్సరాల తర్వాత అంటే నేటికి 82.80 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. 1948లో వీటి సంఖ్య సున్నా. ఆరోగ్య రంగంలో కూడా రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. హిమాచల్‌లో ప్రస్తుతం ఒక ఎయిమ్స్, ఐదు వైద్య కళాశాలలు, ఐదు డెంటల్ కళాశాలలు, పలు నర్సింగ్, ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యనభ్యసించేందుకు విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. 1948వ సంవత్సరంలో హిమాచల్ ప్రజల తలసరి ఆదాయం రూ.240 కాగా, ప్రస్తుతం రూ.2,35,199కి చేరుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త యశ్వంత్ సింగ్ పర్మార్ హిమాచల్ తొలి ముఖ్యమంత్రి. ఈయన 1952 నుండి 1977 వరకు అధికారంలో ఉన్నారు. ఠాకూర్ రామ్ లాల్ 1977, 1980లలో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. శాంత కుమార్ 1977, 1990లో రెండుసార్లు అధికారంలో కొనసాగారు. వీరభద్ర సింగ్ 1985, 1993, 2003, 2012,2017లో ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ 1998, 2007లో అధికారాన్ని చేపట్టారు. 2017లో జైరాం ఠాకూర్ ముఖ్యమంత్రి అయ్యారు. సుఖ్విందర్ సింగ్ సుఖు 2023 నుండి అధికారంలో కొనసాగుతున్నారు. -
కులు, మనాలీ, సిమ్లా.. ఒకేసారి చూసేందుకు ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ!
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు, సిమ్లా, మనాలి పర్యాటక ప్రాంతాలు ఏడాది పొడవునా టూరిస్టులతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా మార్చి ప్రారంభం నుండి కులు, సిమ్లా, మనాలిలకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇప్పుడు ఈ మూడు అద్భుత ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఐఆర్సీటీసీ ఒక ట్వీట్లో ఈ టూర్ ప్యాకేజీ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. ఐఆర్సీటీసీ అందించే ఈ టూర్ ప్యాకేజీ 2024, మార్చి 27 నుండి ప్రారంభంకానుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం తిరువనంతపురం నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎయిర్ టూర్ ప్యాకేజీ. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లతో కూడిన ఈ టూర్ ప్యాకేజీలో హిమాచల్‌లోని ఈ మూడు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణించాలనుకుంటే.. ఒకరైతే రూ.67,500, ఇద్దరికైతే రూ.53,470, ముగ్గురికి రూ.51,120 చెల్లించాల్సివుంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ రిజర్వేషన్‌కు రూ.46,420, బెడ్ లేకుండా అయితే రూ.43,800 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెండు నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లలకు, ఛార్జీగా రూ. 33,820లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. It's time for a vacation amidst the hills. Visit #shimla-#Kullu-#Manali with IRCTC (SEA23) on 27.03.2024 from #Thiruvananthapuram Book now on https://t.co/9ulobfRHWU . . .#dekhoapnadesh #Travel #Booking #Tours #traveller #vacations #ExploreIndia #HimachalPradesh @hp_tourism… pic.twitter.com/dgf3PbNLhp — IRCTC (@IRCTCofficial) February 21, 2024 -
Video: అకస్మాత్తుగా కూలిన అయిదు అంతస్తుల భవనం
అది అయిదు అంతస్తుల భవనం.. చుట్టు కొండల మధ్య ఒక్కటే బిల్డింగ్. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే పేకమేడల్లా నెలకొరిగింది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. అసలు ఏం జరిగిందంటే.. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాకు 26 కిలోమీటర్ల దూరంలో ధామి పట్టణంలోని మరహ్వాగ్ అనే గ్రామం ఉంది. అక్కడ రాజ్ కుమార్ అనే వ్యక్తికి అయిదు అంతస్తుల భవనం ఉంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతని ఇంటి చుట్టుపక్కల ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ రాళ్లు ఈ బిల్డింగ్ గోడలను ఢీకొట్టాయి. ఈ క్రమంలో దానికి మరమ్మత్తులు చేశారు. అయినా కొన్ని రోజులుగా బిల్డింగ్‌లో కదలికలు రావడంతో అప్రమత్తమైన యజమాని.. బిల్డింగ్‌లోని నివాసితులను ఖాళీ చేయించి, మళ్లీ రిపేర్ చేయాలని భావించాడు. అధికారులను స్పందించగా బిల్డింగ్ ఎప్పుడైనా కూలిపోతుందని.. మరమ్మతులు చేయించిన ఫలితం ఉండదని చెప్పడంతో ఆ బిల్డింగ్‌ను అలాగే ఉంచేశాడు.. దీంతో కొన్ని రోజులకు బిల్డింగ్ బేస్మెంట్కు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిల్డింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. అందులోని నివాసితులను అధికారులు ముందుగానే ఖాళీ చేయించారు. విద్యుత్ సరాఫరా కూడా నిలిపివేశారు. దీంతో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ధామి ప్రభుత్వ డిగ్రీ పాఠశాలకు వెళ్లే రహదారి దెబ్బతింది. ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది. 15 సెకన్ల నిడివిగల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (రూరల్) నిశాంత్.. ఇంటి పైన ఉన్న కొండ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టడం వల్లే భవనం కూలిపోయిందని తెలిపారు. చదవండి: భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం Breaking: Major landslide in Shimla, where a 5-story building collapsed, and cracks appeared in the adjoining area and buildings. No casualties reported till now. #Shimla #Himachal pic.twitter.com/hRVXPY45Km — Gagandeep Singh (@Gagan4344) January 20, 2024 -
రైల్వే ట్రాక్ ఎలా వేలాడుతుందో చూడండి..
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు షిమ్లా సమ్మర్ హిల్‌లో ఒక చోట రైల్వే ట్రాక్ కింద ఉన్న భూభాగం తుడిచిపెట్టుకు పోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతూ ఉంది. కాకపోతే ఇది సాధారణ రైల్వే ట్రాక్ కాదు. యునెస్కో వారు పర్యాటకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనిపై టాయ్ ట్రైన్ ప్రయాణిస్తుంటుంది. షిమ్లా సమ్మర్ హిల్ హిమాచల్ ప్రదేశ్ పర్యాటకంలో ఒక భాగం. ఈ ట్రాక్ పైన వెళ్లే టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా మందికి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసే యునెస్కో వారి ప్రత్యేక ఆకర్షణ. ఈ ట్రాక్ కక్ల నుండి షిమ్లా వైపుగా 96 కి.మీ. ప్రయాణిస్తుంటుంది. ఐదు గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన హిమాలయాల సొగసులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ట్రాక్ కింద భూభాగం కొట్టుకుపోవడంతో ఈ ట్రాక్ గాలిలో వేలాడుతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే టాయ్ ట్రైన్ రాకపోకలు ప్రస్తుతానికైతే నిలిచిపోయాయి. దీని మరమ్మత్తులకు కనీసం రూ.15 కోట్లు వ్యయం అవుతుందని దాని కోసం సుమారు నెలరోజుల సమయం పడుతుందని రైల్వే అధికారలు చెబుతున్నారు. ఇదే షిమ్లా సమ్మర్ హిల్ సమీపంలో మరొక దేవాలయం కూడా భారీ వర్షాలకు నేలకొరిగింది. భారీ సంఖ్యలో భక్తులు సావాన్ ప్రార్ధనలు నిర్వహిస్తుండగా ఈ దేవాలయం కుప్పకూలింది. విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపడుతుండగా శిథిలాల్లో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోయి రహదారులు నదులను తలపిస్తుంటే నదులు మాత్రం నీటిప్రవాహానికి పోటెత్తుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా కొండ ప్రాంతాల్లో మాత్రం ఘాట్ రోడ్డు పొడవునా కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నష్టం వాటిల్లిందని 60 మంది ప్రాణాలు కోల్పోగా ప్రభావిత ప్రాంతాలను పునరుద్ధరించేందుకు కనీసం రూ.10,000 కోట్లు ఖర్చవుతుందని దానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని అన్నారు. "Guys this is very scary" Heavy damage to Kalka-Shimla railway track due to heavy rain and landslides. The earth below the track and been washed away at one place.#Himachal #HimachalPradeshRains #HimachalFloods #himachalrains #HimachalPradesh #TRAIN @AshwiniVaishnaw pic.twitter.com/E4V8jIS2uZ — कालनेमि (Parody) (@kalnemibasu) August 14, 2023 ఇది కూడా చదవండి: చంద్రయాన్-3లో కీలక ఘట్టం..మాడ్యూలర్ నుంచి విడిపోయిన ల్యాండర్ -
హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం (ఫోటోలు)
-
విరుగుతున్న కొండచరియలు.. కుప్పకూలుతున్న ఇళ్లు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా సిమ్లాలోని కృష్ణ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా.. వాటిపై ఉన్న ఏడు ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ భయానక దృశ్యాలు భీతికొల్పేవిగా ఉన్నాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య ఇంకా ఓ అంచనాకు రాలేమని సీపీ సంజీవ్ కుమార్ తెలిపారు. #WATCH | Several houses collapsed in Krishna Nagar area in Himachal Pradesh's Shimla after a landslide took place. Rescue operation underway. (Video Source: Local; confirmed by Police and administration) pic.twitter.com/qdYvR4C4fx — ANI (@ANI) August 15, 2023 కాగా.. గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాల కారణంగా 54 మంది మరణించారు. వర్షపు నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం వివిధ చోట్ల జరిగిన కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 12 మంది మృతి చెందారు. రహదారులు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలో నేడు స్వాతంత్య్ర వేడుకలు కూడా జరపలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారు. #WATCH | Hill collapsed in Krishna Nagar area in HP's Shimla. Around five to seven houses collapsed. Further details awaited. pic.twitter.com/esWoGcjxlB — ANI (@ANI) August 15, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఆ రాష్ట్రం.. ఎందుకంటే. -
దారుణం: కుంగిన రహదారి.. లోయలో బస్సు బోల్తా.. ఏడుగురి మృతి..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సిమ్లాకు వెళ్లే దారిలో మండి జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రహదారి దెబ్బతిన్న కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జాతీయ రహదారి 5పై ఉన్న సిమ్లా-కల్కా రోడ్డును గత కొద్దిరోజులుగా మూసి ఉంచారు. గురువారమే ఆ దారిలో తేలిపాటి వాహనాలకు అనుమతులు ఇచ్చారు. ఆ రహదారిలో బస్సు రావడంతో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో ప్రమాదం జరిగింది. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వర్షాలతో రాష్ట్రంలో దాదాపు 200 రోడ్డు మార్గాలను మూసివేశారు. సుమారు 200 మార్గాల్లో ఎలక్ట్రిసిటీని కూడా నిలిపివేశారు. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో తేలికపాటి వాహనాలను అనుమతించారు. దీంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదీ చదవండి: నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు.. -
సిమ్లా కాదు బెంగళూరు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా చేతులు కలిపిన ప్రతిపక్ష పార్టీలు రెండో విడతగా బెంగళూరులో సమావేశం కానున్నాయి. తొలుత సిమ్లాలో భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ వేదికను బెంగళూరుకి మార్చారు. జులై 13, 14 తేదీలలో విపక్షాల భేటీ ఉంటుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వెల్లడించారు. పట్నాలో జరిగిన తొలి సమావేశంలో 17 పార్టీలు కలసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సారి సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరుబాట, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి ఎజెండా, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై చర్చించనున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన శరద్ పవార్ పట్నా సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో అసహనం పెరిగిపోయిందని ఆరోపించారు. ఉమ్మడి పౌరస్మృతి మన దేశానికి అవసరమని ప్రధాని వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సమయంలో యూసీసీపై తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. వివిధ వర్గాలు, మత సంస్థలతో చర్చించాక తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు. యూసీసీ కంటే ముందు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని పవార్ డిమాండ్ చేశారు. -
Himachal Pradesh: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ
షిమ్లా: గుజరాత్ ఫలితంతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ.. హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం ఘన విజయంతో శ్రేణులు కాస్త ఊరట చెందాయి. ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చూస్తోంది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ(శుక్రవారం) కీలక సమావేశం నిర్వహించనుంది. అంతకు ముందు.. ఫలితాల ఊగిసలాట సమయంలో ఆపరేషన్ లోటస్‌కి భయపడి కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలను ఛండీగఢ్‌కు ఆహ్వానించాలని భావించింది. అయితే.. స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆ ఆలోచనను విరమించుకుంది. కొత్త లెజిస్లేచర్ పార్టీ నేతను ఎనుకున్నేందుకు శుక్రవారం సిమ్లాలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా భేటీ కాన్నుట్లు కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జి రాజీవ్ శుక్లా మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని చూసుకునేందుకు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్, సీనియర్ నేత భూపిందర్ హుడాలను పర్యవేక్షకులుగా అక్కడికి పంపనుంది. ఇదిలా ఉంటే.. ఒక్కో దఫా ఒక్కో పార్టీకి అధికారం కట్టబెట్టే హిమాచల్ ప్రజలు.. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగించారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో.. 40 స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది కాంగ్రెస్. మరోవైపు హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య కావడం ఈమెకు కలిసొచ్చే అంశం. అయితే ఇంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సుఖ్వీందర్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రిలు కూడా సీఎం రేసులో ఉండడంతో ఇవాళ్టి భేటీపై ఆసక్తి నెలకొంది. బీజేపీకి రెబల్స్ దెబ్బ పడిందని విశ్లేషకులు అభిప్రాయపడినప్పటికీ.. అలాంటిదేం లేదని తేల్చారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా. మొత్తం 68 స్థానాల్లో 21 చోట్ల రెబల్స్ పోటీ చేయగా.. కేవలం ఇద్దరు మాత్రమే గెలుపొందడం గమనార్హమని ఆయన గుర్తు చేస్తున్నారు. -
ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480
ముంబై: రెండున్నరేళ్ల విరామం తర్వాత రాజధాని నగరం ఢిల్లీ నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ అధికారికంగా వెల్లడించింది. ఢిల్లీ-సిమ్లా మధ్య సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్టు మంగళవారం ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచి ప్రతిరోజు ఈ సర్వీసు ఉంటుందని వెల్లడించింది. కేవలం రూ. 2,480 పరిచయ ధరను ఆఫర్ చేస్తోంది. ఈ విమానం ఉదయం 6.25 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 7.35 గంటలకు సిమ్లా జుబ్బర్హట్టి విమానాశ్రయానికి చేరుకుని తిరిగి 8 గంటలకు ఢిల్లీకి చేరుకుని 9.10 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని సంస్థ తెలిపింది. న్యూఇండియాను అనుసంధానించే క్రమంలో టైర్-2/టైర్-3 పట్టణాల మధ్య ఆయా సిటీ హబ్‌లతో మెరుగైన ఎయిర్ కనెక్టివిటీని అందించే ప్రయత్నంలో ఢిల్లీ-సిమ్లా విమానాలను ప్రారంభించామని అలయన్స్ ఎయిర్ తెలిపింది. ఇది ఉత్తర భారతదేశంలో కనెక్టివిటీని విస్తరింప జేస్తుందని అలయన్స్ ఎయిర్ డిప్యూటీ ఇంజనీర్ యష్ వర్ధన్ సింగ్ అన్నారు. సెప్టెంబర్ 6నుంచి ప్రతీ రోజూ విమానాలు నడుస్తాయన్నారు. కాగా ఈ మార్గంలో అలయన్స్ ఎయిర్ తొలిసారిగా 2017 జూలైలో విమానాన్ని నడిపింది. ఆ తర్వాత పలు కారణాలతో ఈ సర్వీసును నిలిపివేసింది. -
నాడు స్కాములు, నేడు స్కీములు
షిమ్లా: 2014కు ముందు దేశంలో అవినీతి ప్రభుత్వంలో విడదీయలేని భాగంగా ఉండేదంటూ నాటి కాంగ్రెస్ పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. ‘‘బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో అవినీతిపై ఉక్కుపాదం మోపింది. దాంతో ఈ విషయంలో చెప్పలేనంత మార్పు వచ్చింది. ప్రజలూ దీన్ని గమనిస్తున్నారు’’ అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ పాలనకు ఎనిమిదేళ్లు నిండిన సందర్భంగా షిమ్లాలో మంగళవారం గరీబ్ సమ్మాన్ నమ్మేళన్ పేరిట జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. అప్పట్లో నిత్యం స్కాముల (కుంభకోణాల) గురించి వార్తలు కాగా ఇప్పుడెక్కడ చూసినా స్కీముల (పథకాల) గురించి వార్తలే ఉంటున్నాయన్నారు. దేశ సరిహద్దులు కూడా 2014తో పోలిస్తే ఇప్పుడు చాలా సురక్షితంగా ఉన్నాయన్నారు. పలు పథకాల లబ్ధిదారుల జాబితాలోంచి ఏకంగా 9 కోట్ల నకిలీ పేర్లను తాము ఏరివేసినట్టు చెప్పారు. ఏకంగా రూ.22 లక్షల కోట్లను పలు పథకాల లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేశామని వివరించారు. కరోనా కల్లోలాన్ని తమ ప్రభుత్వం ఎంత సమర్థంగా ఎదుర్కొన్నదీ ప్రపంచమంతా చూసిందన్నారు. ప్రజలకు 200 కోట్లకు పై చిలుకు వ్యాక్సీన్లు ఉచితంగా వేశామని గుర్తు చేశారు. అంతేగాక వాటిని ఎన్నో దేశాలకు వాటిని ఎగుమతి చేశామన్నారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు గుర్తు చేశారు. ప్రధాన సేవకున్ని మాత్రమే.. ‘‘నన్ను నేను ప్రధానిగా భావించను. ప్రజలకు ప్రధాన సేవకున్ని మాత్రమే అని అనుకుంటాను’’ అని మోదీ పేర్కొన్నారు. ‘‘130 కోట్ల పై చిలుకు భారతీయులతో కూడిన అతి పెద్ద కుటుంబంలో నేను సభ్యున్ని. నా జీవితం వాళ్లకే అంకితం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కేంద్ర పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. కర్నాటకలోని కలబుర్గికి చెందిన సంతోషి తన అభిప్రాయాలను సూటిగా వ్యక్తం చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఆమె బీజేపీ కార్యకర్త అయి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరేవాడినని చెప్పారు. ప్రధాని ముద్రా యోజన కింద రూ.7.2 లక్షల రుణం తీసుకుని 12 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పిన గుజరాత్‌కు చెందిన అర్వింద్ పేటల్ను అభినందించారు. అందరిలా ఉద్యోగం చేయాలనుకోకుండా ఎందరికో ఉపాధి కల్పిస్తుండటం గొప్ప విషయమన్నారు. 10 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత కింద రూ.21 వేల కోట్లను ఈ సందర్భంగా ప్రధాని విడుదల చేశారు. నోట్ల రద్దు ఎప్పటికీ బాధిస్తుంది: రాహుల్ న్యూఢిల్లీ: ప్రధాని మోదీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశాన్ని ఎప్పటికీ బాధిస్తూనే ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ పాలనకు ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ‘2016లో పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజల్ని రోడ్లపై నిలబెట్టారు. 2016లో 18 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉంటే, ఇప్పుడది 31 లక్షల కోట్లకు పెరిగింది. మీ డిజిటల్, కేష్‌లెస్ ఇండియా ఏమైనట్టు?’ అన్నారు. బీజేపీ ఓడితేనే విద్వేష వ్యాప్తికి చెక్: మమత పురూలియా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వెలిబుచ్చారు. బీజేపీ ఓటమితో దేశంలో విద్వేష వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీకి ఢిల్లీలో అధికార పీఠాన్ని చేరే అవకాశమే ఉండదన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు ఎనిమిదేళ్లయిన నేపథ్యంలో మమత మంగళవారం పురూలియాలో ఒక సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. -
PM KISAN: రైతుల ఖాతాలోకి నగదు జమ చేసిన ప్రధాని మోదీ
షిమ్లా: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకంలో భాగంగా.. 11వ విడత నిధుల్ని నేడు విడుదల చేశారు. మంగళవారం గరిబ్ కళ్యాణ్ సమ్మేళనం కోసం ప్రధాని మోదీ షిమ్లాకు వెళ్లారు. ఈ వేదికగానే ఆయన రైతుల ఖాతాలో నగదు జమ చేశారు. షిమ్లాలోని రిడ్గే మైదానంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తొమ్మిది మంత్రిత్వ శాఖల ద్వారా అమలు అవుతున్న 16 పథకాల పని తీరు గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని స్వయంగా కొందరు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇక పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా.. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000(2 వేలు చొప్పున మూడు దఫాలుగా) అందిస్తోంది. ఏడాదికి మూడు విడతచొప్పున ఇప్పటి వరకు 10 ఇన్స్టాల్మెంట్లలో డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరగా, ఇవాళ 11వ విడత డబ్బులు జమ చేసింది. దాదాపు పది కోట్ల కంటే ఎక్కువ మంది రైతుల ఖాతాలో పీఎం సమ్మాన్ నిధి నుంచి రూ.21 వేల కోట్ల రూపాయలను విడుదల చేశారాయన. అయితే ప్రభుత్వం నుండి పిఎం కిసాన్ పథకం ద్వారా.. దేశంలోని రైతులందరికీ గ్రాంట్లు అందవు. PM కిసాన్ పథకానికి అర్హత ప్రమాణాలు ఉన్నాయి. ముందుగానే రిజిస్టర్ అయ్యి ఉండాలి. అలాగే చిన్న మరియు సన్నకారు రైతులు ప్రయోజనాలను పొందుతారు. కొన్ని షరతులు వర్తిస్తాయి కూడా. ఎలా తెలుసుకోవాలంటే.. https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx లింక్‌ను క్లిక్ చేయాలి. కుడి వైపు ఆప్షన్స్‌లో బెనిఫీషియరీ(లబ్దిదారుడు) స్టేటస్ ఉంటుంది. అక్కడ ఆధార్, అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేయాలి పీఎం కిసాన్‌కు రిజిస్టర్ చేసుకుని.. ఈ-కేవైసీ పూర్తి అయ్యి ఉంటే ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది. -
వేసవి ప్రయాణానికి రెడీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పర్యాటకులు చల్లటి ప్రదేశాలకు ప్రయాణం కడుతున్నారు. వరుసగా రెండు వేసవి సీజన్లలో కరోనా కారణంగా ప్రయాణం చేయలేని పరిస్థితులు.. ఈ విడత లేకపోవడం కూడా పర్యాటక రంగంలో సందడిని పెంచింది. గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి సేదతీరేందుకు పట్టణ వాసులు మొగ్గు చూపిస్తున్నారు. పర్వత, కొండ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు ఈ విడత డిమాండ్ అనూహ్యంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. హోటళ్లు, ఫ్లయిట్ బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఈ వేసవిలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది విహార యాత్రలకే మొగ్గు చూపిస్తున్నట్టు ఓయో సర్వేలో తెలిసింది. 64 శాతం మంది వేసవిలో సెలవులు పెట్టేసి నచ్చిన ప్రదేశానికి వెళ్లొద్దామని అనుకుంటుంటే.. 94 శాతం మంది దేశీయంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఉత్తరాదిలో వీటికి డిమాండ్.. ఆన్లైన్లో వివిధ పోర్టళ్లపై బుకింగ్ తీరును పరిశీలిస్తే.. ఉత్తరాదిలో రిషికేష్, హరిద్వార్, సిమ్లా, ముస్సోరీ, డెహ్రాడూన్ ప్రాంతాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లోని హోటల్స్, రిసార్ట్‌ల్లో దాదాపు గదులన్నీ బుకింగ్ అయిపోయాయి. రూమ్ టారిఫ్‌లు కరోనాకు ముందుతో పోలిస్తే 10–15 శాతం అధికంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా రిషికేష్, హరిద్వార్‌లోని అన్ని ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హోటళ్లలో మే నుంచి జూన్ చివరికి నాటికి బుకింగ్‌లు పూర్తిగా అయిపోయాయి. ఈ ఏడాది పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లకు డిమాండ్ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు, సగటు రూమ్ చార్జీలు 10 శాతం పెరిగినట్టు ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూపు సీఈవో అఖిల్ అరోరా తెలిపారు. ఎస్సైర్ గ్రూపునకు బిమ్టల్, జిమ్‌కార్బెట్ ప్రాంతాల్లో హోటళ్లు ఉన్నాయి. కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నా ప్రయాణాలకు డిమాండ్ తగ్గలేదని అరోరా చెప్పారు. పుంజుకున్న బుకింగ్‌లు.. వేసవి కోసం కశ్మీర్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, అరుణాచల్, మణిపూర్, త్రిపుర ప్రాంతాలు ఆకర్షణీయంగా (అధిక డిమాండ్) మారిపోయాయి. దేశం బయట దుబాయి, మాల్దీవులు, థాయిలాండ్, యూఎస్‌కు డిమాండ్ నెలకొంది. ‘‘మే, జూన్ నెలలకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు పెద్ద ఎత్తున పెరిగాయి. ప్రజలు ఎక్కువ రోజుల పాటు విడిది కోసం వెళ్లాలని చూస్తున్నారు’’అని ఈజ్‌మైట్రిప్ ప్రెసిడెంట్ హిమంక్ త్రిపాఠి తెలిపారు. ఫ్లయిట్ బుకింగ్‌లు కరోనా ముందు నాటికి చేరినట్టు మేక్మైట్రిప్ సీఈవో రాజేష్ మాగోవ్ వెల్లడించారు. సులభ వాయిదాల్లో రుణాలు లభించడం డిమాండ్‌కు తోడ్పడుతున్నట్టు ఆయన చెప్పారు. రికవరీ బలంగా.. 2022 ఏప్రిల్ నెలలో సగటు రోజువారీ ఫ్లయిట్ డిపార్చర్లు 2,726గా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో రోజువారీ 2,000తో పోలిస్తే మంచి వృద్ధి కనిపిస్తోంది. మార్చి నెలలో రోజువారీ డిపార్చర్లు 2,588తో పోల్చి చూసినా ఏప్రిల్‌లో 5 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విమానాల్లో ప్రయాణికుల భర్తీ కూడా గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2022 ఏప్రిల్‌లో 36 శాతం అధికంగా ఉంది. గత నెలలో ఒక ఫ్లయిట్లో సగటు ప్రయాణికుల సంఖ్య 128గా ఉంది. కరోనాకు ముందు సగటు ప్రయాణికులు 135 కంటే కొంచెం తక్కువగా ఉంది. దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏప్రిల్‌లో వార్షికంగా చూస్తే 83 శాతం పెరిగి 10.5 మిలియన్లుగా ఉంది. కరోనాకు ముందున్న 11 మిలియన్ల కంటే ఇది స్వల్పంగానే తక్కువ. పెంటప్ డిమాండ్ ఈ ఏడాది పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రా స్థలాలకు డిమాండ్ గణనీయంగా ఉండడానికి.. గత రెండు వేసవి సీజన్లలో ప్రయాణం చేయలేని వారు ఈ ఏడాది ప్రాధాన్యం ఇస్తుండడం వల్లేనని అనుకోవాలి. గుడ్ ఫ్రైడే, విసు వీక్ సందర్భంగా 8 లక్షల బుకింగ్‌లు నమోదయ్యాయని.. 2022లో ఇదే అత్యధికమని ఓయో చీఫ్ సర్వీస్ ఆఫీసర్ షీరంగ్ గాడ్బోల్ తెలిపారు. రానున్న కొన్ని నెలల్లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు. -
స్ఫూర్తి..:వెటకారం చేసిన నోళ్లే... వేనోళ్ల పొగిడాయి!
‘క్వీన్ ఆఫ్ హిల్‌స్టేషన్స్’ అని పిలుచుకునే సిమ్లా(హిమాచల్‌ప్రదేశ్)లో డ్రైవింగ్ అనేది అంత సులభమేమీ కాదు. అలాంటి చోట ‘సూపర్ డ్రైవర్’గా ప్రశంసలు అందుకుంటోంది మీనాక్షి నేగి. కిన్నార్ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మీనాక్షికి ‘డ్రైవింగ్’ను వృత్తిగా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. తండ్రిలా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంది కానీ కుదరలేదు. తమ ఇద్దరు పిల్లలను బైక్ మీద స్కూలుకు తీసుకెళుతుండేది మీనాక్షి. అప్పుడప్పుడూ ఇరుగింటి, పొరుగింటి వారు కూడా తమ పిల్లల్ని బైక్‌పై బడికి తీసుకెళ్లడానికి మీనాక్షి సహాయం తీసుకునేవారు. ఆమె డ్రైవింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకునేవారు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే, డ్రైవింగ్‌నే వృత్తిగా ఎందుకు ఎంచుకోకూడదు? అనుకుంది మీనాక్షి. తన ఆలోచనకు ఎవరూ‘యస్’ చెప్పలేదు. ఇక వెటకారాలు సరేసరి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ట్యాక్సీ (కార్) కొనుగోలు చేసింది. వెటకారాలు మరింత ఎక్కువయ్యాయి. భర్త, అత్తామామలను ఒప్పించడం చాలా కష్టం అయింది. ‘ఏనుగును మేపడం ఎంతో ఇది అంతే’ అన్నారు. సరిగ్గా అదే సమయంలో కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. బండి తెల్లముఖం వేసింది. వాయిదాలు కట్టడం మీనాక్షికి కష్టమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమెలో ధైర్యం సడలలేదు. ‘అన్నిరోజులు ఒకేలా ఉండవు కదా!’ అనుకుంది. అదే నిజమైంది. లాక్డౌన్ ఎత్తేశారు. మెల్లగా బండి వేగం పుంజుకుంది. ‘డ్రైవింగ్ వృత్తిలో మగవాళ్లు మాత్రమే ఉంటారు... అని చాలామంది నమ్మే సమాజంలో ఉన్నాం. మహిళలు నడిపే వాహనాల్లో ప్రయాణించడానికి తటపటాయిస్తుంటారు. అలాంటి వారికి నా డ్రైవింగ్‌తోనే సమాధానం చెప్పాను. వారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది, భర్త,అత్తమామలు కూడా మెచ్చుకోవడం మరో ఆనందం’ అని చెబుతుంది నలభై రెండు సంవత్సరాల మీనాక్షి. హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా ట్యాక్సీ నడుపుతుంది మీనాక్షి. అయితే, ప్రయాణికుల ఎంపికలో తగిన జాగ్రత్తలు పాటిస్తోంది. ఫ్యామిలీలకు ప్రాధాన్యత ఇస్తుంది. మీనాక్షి ఇప్పుడు పేదమహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పిస్తుంది. ‘ఉపాధి అనేది తరువాత విషయం. డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా తమ మీద తమకు నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్ విజయాలకు ఇది పునాది’ అంటుంది మీనాక్షి. మీనాక్షి నేగి భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? సిమ్లాలో ఫస్ట్ ఉమెన్ ట్యాక్సీడ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు చేయాలనేది ఆమె కల. యూనియన్ సరే, అంతమంది మహిళా ట్యాక్సీ డ్రైవర్లు ఎక్కడి నుంచి వస్తారు? అనే సందేహం ఉంటే, మీనాక్షి నేగి నుంచి స్ఫూర్తి పొందిన మహిళలను పలకరించండి చాలు. నేగి కల సాకారం కావడానికి ఎంతోకాలం పట్టదని తెలుసుకోవడానికి! -
ఉమ్మడి కృషితో దేశం ఉన్నత శిఖరాలకు
న్యూఢిల్లీ/సిమ్లా: పార్లమెంట్ సభ్యుల నుంచి సామాన్య ప్రజల వరకు ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని, దేశ అభివృద్ధి పరుగులు పెట్టడానికి ఇదే తారక మంత్రమని ప్రధాని మోదీ ఉద్బోధించారు. పార్లమెంట్‌తోపాటు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్ల (అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్లు) సదస్సు బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ప్రారంభమయ్యింది. రెండు రోజులపాటు జరగనుంది. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రాల భాగస్వామ్యంతోపాటు ప్రజలందరి ఉమ్మడి కృషితోనే దేశాన్ని అభివృద్ధి పథంలో ఉన్నత శిఖరాలకు చేర్చవచ్చని అన్నారు. కోవిడ్–19 మహమ్మారిపై మనం సాగించిన పోరాటం సబ్ కా ప్రయాస్కు (అందరి కృషి) ఒక చరిత్రాత్మక ఉదాహరణ అని గుర్తుచేశారు. పలు భిన్నమైన అంశాలపై రగడ కారణంగా పార్లమెంట్ సమావేశాలకు తరచుగా అంతరాయం కలుగుతుండడం పట్ల మోదీ విచారం వ్యక్తం చేశారు. చట్టసభ సభ్యుల ప్రవర్తన భారతీయ విలువల దారిలోనే ఉండాలని సూచించారు. చట్టసభల్లో ఆమోదించే చట్టాలు, తీసుకొనే విధాన నిర్ణయాలు ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’ అనే సెంటిమెంట్‌ను బలోపేతం చేసేవిగా ఉండాలన్నారు. చట్టసభల్లో పాటించే సంప్రదాయాలు, పద్ధతులు భారతీయ ఆత్మను ప్రతిబింబించాలని ఉద్ఘాటించారు. పార్లమెంట్, అసెంబ్లీ, మండలిలో చర్చలు అర్థవంతంగా, హూందాగా, గౌరవప్రదంగా జరగాలని ఆకాంక్షించారు. సభ్యుల మధ్య రాజకీయ ఆరోపణలు, విమర్శలకు తావులేకుండా నాణ్యమైన, ఆరోగ్యకరమైన సంవాదాలు, చర్చల కోసం చట్టసభల్లో ప్రత్యేక సమయం కేటాయిస్తే బాగుంటుందని సూచించారు. ఒకే దేశం.. ఒకే చట్టసభ వేదిక ప్రజాస్వామ్యం అనేది భారత్‌కు కేవలం ఒక వ్యవస్థ కాదని, అది దేశ సహజ స్వభావమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాబోయే 25 సంవత్సరాలు మనకు అత్యంత కీలకమని చెప్పారు. వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాల దిశగా భారత్ ముందుకు పయనిస్తోందని తెలిపారు. ఇలాంటి తరుణంలో చట్టసభల సభ్యులు వారి విధులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. వారి ప్రవర్తన, చేసే పనులు దేశ ప్రజలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. డ్యూటీ, డ్యూటీ, డ్యూటీ అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతపై అసమ్మతి స్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చట్టసభల సభ్యులకు సూచించారు. మన దేశ భిన్నత్వాన్ని కాపాడుకోవాలన్నారు. ‘ఒకే దేశం.. ఒకే చట్టసభ వేదిక’ అనే ఆలోచనను మోదీ తెరపైకి తీసుకొచ్చారు. ఈ పోర్టల్‌తో మన పార్లమెంటరీ వ్యవస్థకు సాంకేతిక తోడ్పాటు లభించడమే గాక దేశంలోని అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను అనుసంధానించవచ్చని వివరించారు. చట్టసభల గౌరవాన్ని పెంచే చర్యలు: బిర్లా దేశంలో చట్టసభలు పని చేసే సమయం నానాటికీ తగ్గిపోతుండడం పట్ల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాల రూపకల్పన, ఆమోదంపై సరైన చర్చ జరగకపోవడం మంచి పరిణామం కాదన్నారు. స్పీకర్ల సదస్సులో మాట్లాడారు. చట్టసభల గౌరవాన్ని, ప్రతిష్టను పెంచేందుకు అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి, నిర్ణయాత్మక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. -
షాపింగ్‌మాల్ వద్ద మాటువేసి.. లక్కీ డ్రా అంటూ..
సిమ్లా: సార్ మీరు కారు గెలుచుకున్నారు, లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్ గెలుచుకున్నారు అంటూ.... రకరకాల ఫ్రాడ్ కాల్స్ గురించి మనం నిత్యం వింటూనే ఉన్నాం. ఇదే తరహా కొంతమంది కేటుగాళ్లు హాలీడే ప్యాకేజీలు.. కళ్లు చెదిరిపోయి గిఫ్ట్‌లు గెలుచుకోవచ్చు అంటూ మాయమాటలు చెప్పి సిమ్లాలోని ఒక జంటను దారుణంగా మోసం చేశారు. వివరాల్లోకెళ్లితే... ఓ జంట ఆగస్టు 27న సిమ్లాలో షాపింగ్ చేసి వస్తుంటే అక్కడే మాటువేసిన కొంతమంది తమ ట్రావెలింగ్ సంస్థలో అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయని.. లక్కీ డ్రా కూడా ఉందని నమ్మించారు. మీరు లక్కీ డ్రాలో ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలు, గిఫ్ట్‌లు గెలుచుకొవచ్చు అని చెప్పి కొన్ని కూపన్లను కొనుగొలు చేయమన్నారు. ఈ క్రమంలో ఆ జంట కూపన్ తీసుకుని స్క్రాచ్ చేసి చూస్తే 10 సంవత్సరాల టూర్ ప్యాకేజ్ గెలుపొందినట్లు నమ్మించారు. (చదవండి: తాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవంలో మేము పాల్గొనం।): ప్యాకేజీ ప్రకారం ప్రతి ఏడాది భారతదేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో పర్యటించే భారీ ప్యాకేజ్ గెలుచుకున్నారంటూ చెప్పడంతో తాము ఆనందంగా సభ్యత్వ రుసుము కింద వారికి రూ.1.40 లక్షలు చెల్లించినట్లు ఆ బాధిత జంట పేర్కొంది. ఆ తర్వాత ఆ సంస్థ గురించి విచారిస్తే తాము మోసపోయినట్లు గుర్తించామని చెప్పారు. దీంతో వారు సిమ్లాలోని స్థానిక సదర్ పోలీస్టేసన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు ఆ గ్యాంగ్‌లో ఒక మహిళతో సహా ఐదుగురు సభ్యులు ఉన్నారని, వారిని చీటింగ్ కేసు కింద అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.(చదవండి: పరువు హత్య: చెల్లిని తుపాకీతో కాల్చి చంపేశాడు!) -
సిమ్లాలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం
సిమ్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హిమాచల్‌ప్రదేశ్ డీజీపీ సంజయ్ కుందూ, సిమ్లా ఎస్పీ మోనిక ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు సంప్రదాయ కులూ టోపీ, శాలువా, దశావతార జ్ఞాపికను డీజీపీ సంజయ్‌కుందూ అందజేశారు. -
సిమ్లా పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్
విమానాశ్రయం (గన్నవరం): సీఎం వైఎస్ జగన్ గురువారం సిమ్లా పర్యటనకు వెళ్లారు. తొలుత తాడేపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆయన ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబసభ్యులతో కలిసి చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి వెళ్లారు.విమానాశ్రయంలో సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, డీసీపీ హర్షవర్థన్‌రాజు, పలువు రు అధికారులు సీఎంకు వీడ్కోలు పలికారు. చదవండి: Jagananna Vidya Kanuka:..రూ.789 కోట్లతో 48 లక్షలమంది పిల్లలకు ‘కానుక’