ఆ పేరెలా వచ్చింది?
సెల్ఫ్ చెక్
ఊరుంటే దానికి పేరుండాలి కదా! ఆ పేర్లు కొన్ని తమాషాగా ఉంటాయి. కొన్ని పేర్లు వింటే ఇవి ఎలా వచ్చాయో అనిపిస్తుంటుంది. వాటి మూలం ఆసక్తిగా కూడా ఉంటుంది. పేరెలా వచ్చిందో తెలుసుకుంటే ఆ ఊరి ప్రాథమిక వివరాలు తెలిసినట్లే.
1. గుర్‌గావ్ అంటే ధర్మరాజు ద్రోణాచార్యునికి ఇచ్చిన గ్రామం. ‘గురువుకిచ్చిన గ్రామం’ అని అర్థం.
ఎ. అవును బి. కాదు
2. మునార్... అంటే మూడు నదుల మధ్య ప్రదేశం అని అర్థం.
ఎ. అవును బి. కాదు
3. చండీఘర్ అంటే చండీమాత ఆవాసం అని అర్థం.
ఎ. అవును బి. కాదు
4. సిమ్లాకు ఆ పేరు శ్యామలాదేవి అనే దేవత పేరుతో వచ్చింది. శ్యామల క్రమంగా వాడుకలో సిమ్లా అయింది.
ఎ. అవును బి. కాదు
5. మేఘాలయ అంటే మేఘాల నిలయం అనే అర్థంలో ఆ పేరు వచ్చింది.
ఎ. అవును బి. కాదు
6. మహిషూరు క్రమంగా మైసూరుగా మారింది. మహిష నివసించిన ఊరని పురాణోక్తి.
ఎ. అవును బి. కాదు
7. స్థానికపదం వడోదర బ్రిటిష్ పాలకుల ఉచ్చారణలో బరోడాగా మారిపోయింది.
ఎ. అవును బి. కాదు
8. హుబ్బలి అంటే పూలతీగ అని అర్థం. ఇది క్రమంగా హుబ్లి అయింది.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరుకంటే ఎక్కువగా వస్తే పదాలు, పేర్లు... గురించిన ఆసక్తి ఎక్కువ అనుకోవాలి. ‘బి’లు ఎక్కువైతే మీరు అవసరమైన వివరాల గురించి తప్ప మిగిలిన వాటి మీద పెద్దగా ఆసక్తి చూపరు అనుకోవాలి.