సిమ్లా: ప్రస్తుతం దేశంలో దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా నేపధ్యంలో సెలవులను ఎంజాయ్ చేసేందుకు టూరిస్టులు హిమాచల్ ప్రదేశ్‌కు తరలివస్తున్నారు. రాష్ట్రంలోని పర్యాటక వ్యాపారం ఇప్పుడు మరింతగా ఊపందుకుంది.
పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల నుండి పర్యాటకులు హిమాచల్ చేరుకుంటారు. దీంతో ఇక్కడి హోటళ్లలోని గదులు 80 శాతం వరకూ నిండిపోయాయని తెలుస్తోంది. ట్రావెల్ ఏజెంట్ నరేన్ సహాయ్ మీడియాతో మాట్లాడుతూ పండుగగ సీజన్ ప్రారంభమైందని,అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో లాంగ్ వీకెండ్ రాబోతోందని, ఈ సందర్భంగా పర్యాటకులు హిమాచల్‌కు అధిక సంఖ్యలో తరలివస్తారని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం, బెంగాలీ పర్యాటకులు వస్తున్నారని, దీపావళి సమయంలో గుజరాతీ పర్యాటకులు సిమ్లాను సందర్శిస్తారన్నారు.
నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని హోటల్ వ్యాపారి ప్రిన్స్ కుక్రేజా మీడియాకు తెలిపారు. వారాంతాల్లో గదుల బుకింగ్స్ కూడా జరుగుతున్నాయన్నారు. గత వారాంతంతో పోలిస్తే, ఈ వారాంతంలో ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు సిమ్లా, హిమాచల్ ప్రదేశ్‌లను సందర్శించేందుకు రానున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర , పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్ నుండి పర్యాటకులు హిమాచల్‌కు తరలివస్తున్నారన్నారు.
ఇది కూడా చదవండి: ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Comments
Please login to add a commentAdd a comment