Back
-
ఢాం... ఢాం... ఒకసారి వెనక్కి వెళదాం
పండగకు ముందే ‘ఢాం... ఢాం’లు మొదలయ్యాయి. ఎప్పుడూ శబ్దాలు వినడమేనా, ఈసారి వాటి చరిత్ర కొంచెం తెలుసుకుందాం. లాంగ్ లాంగ్ ఎగో.... అనగా క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో చైనాలో టపాసులు లేవు. అయిననూ ‘ఢాం... ఢాం’లు మాత్రం ఉండేవి. వెదురు గొట్టాలను మంటల్లోకి విసిరేవారు. వెదురు లోపల కణువుల మధ్య ఉన్న ఎయిర్ పాకెట్లు వేడెక్కి పేలి పోవడంతో పెద్ద శబ్దాలు వచ్చేవి.పదవ శతాబ్దానికి చెందిన ఒక చైనీస్ ఆల్కెమిస్ట్ ద్వారా కొత్త పటాసులు రంగంలోకి వచ్చాయి. పొటాసియం నైట్రేట్, సల్ఫర్, బొగ్గును కలిసి వెదురు గొట్టాల్లో పోసి ‘ఢాం’ అనిపించేవారు. ఆయన తయారు చేసిన మిశ్రమం ఆ తరువాత కాలంలో ‘గన్ పౌడర్’గా ప్రసిద్ధి చెందింది. ఇది మానవ నిర్మిత మొదటి బాణసంచా అంటారు. ఈ ప్రమాదకరమైన, ప్రకాశవంతమైన ఆవిష్కరణలు సిల్క్ రూట్ గుండా ఐరోపా వరకు వెళ్లాయి. ఆ తరువాత కాలంలో వాటి తయారీకి సంబంధించిన సాంకేతికత పెరగడంతో విందులు, వినోదాలు, పండగలలో బాణసంచా పేల్చడం మామూలైపోయింది. -
యోగా : ఈ ఆసనంతో వెన్నుకు దన్ను
వంగి పనిచేయడం, నిటారుగా ఉండటంలో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తుంటే వెన్నెముక కండరాలకు శక్తి అవసరం అని గుర్తించాలి. వెన్ను కండరాలను బలపరిచి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భుజంగాసనం బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా, పొట్ట, హిప్ కండరాలను గట్టిపరుస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. తాచుపాము పడగ విప్పితే ఎలా ఉంటుందో ఈ భంగిమ అలా ఉంటుంది. అందుకే ఈ ఆసనాన్ని కోబ్రా పోజ్ అని, తెలుగులో భుజంగాసనం అంటారు.యోగా మ్యాట్ పైన బోర్లా పడుకొని, చేతులను నడుము, హిప్ భాగానికి ఇరువైపులా ఉంచాలి. అర చేతులను నేలకు ఆనించి, భుజాలు, తల నెమ్మదిగా పైకి లేపాలి.అరచేతులను నేలకు నొక్కి పట్టి ఉంచి, నెమ్మదిగా ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. దిగువ వీపుపై ఒత్తిడి పడకుండా వెనుక కండరాలను కొద్దిగా స్ట్రెచ్ చేయాలి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ 15 నుంచి 20 సెకన్లపాటు ఈ భంగిమలో ఉండాలి. శ్వాస వదులుతూ తిరిగి యధాస్థితికి రావాలి. ∙ఇదేవిధంగా ఐదారుసార్లు ఈ ఆసనాన్ని సాధన చేయవచ్చు. గర్భిణులు ఆ ఆసనం వేయకూడదు. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నవారు, వయసు పైబడినవారు ఆ ఆసనాన్ని నిపుణుల సూచనల మేరకే సాధన చేయాలి.– జి.అనూష, యోగా గురు -
హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి.. హోటళ్లు కిటకిట
సిమ్లా: ప్రస్తుతం దేశంలో దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా నేపధ్యంలో సెలవులను ఎంజాయ్ చేసేందుకు టూరిస్టులు హిమాచల్ ప్రదేశ్‌కు తరలివస్తున్నారు. రాష్ట్రంలోని పర్యాటక వ్యాపారం ఇప్పుడు మరింతగా ఊపందుకుంది.పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల నుండి పర్యాటకులు హిమాచల్ చేరుకుంటారు. దీంతో ఇక్కడి హోటళ్లలోని గదులు 80 శాతం వరకూ నిండిపోయాయని తెలుస్తోంది. ట్రావెల్ ఏజెంట్ నరేన్ సహాయ్ మీడియాతో మాట్లాడుతూ పండుగగ సీజన్ ప్రారంభమైందని,అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో లాంగ్ వీకెండ్ రాబోతోందని, ఈ సందర్భంగా పర్యాటకులు హిమాచల్‌కు అధిక సంఖ్యలో తరలివస్తారని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం, బెంగాలీ పర్యాటకులు వస్తున్నారని, దీపావళి సమయంలో గుజరాతీ పర్యాటకులు సిమ్లాను సందర్శిస్తారన్నారు.నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని హోటల్ వ్యాపారి ప్రిన్స్ కుక్రేజా మీడియాకు తెలిపారు. వారాంతాల్లో గదుల బుకింగ్స్ కూడా జరుగుతున్నాయన్నారు. గత వారాంతంతో పోలిస్తే, ఈ వారాంతంలో ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు సిమ్లా, హిమాచల్ ప్రదేశ్‌లను సందర్శించేందుకు రానున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర , పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్ నుండి పర్యాటకులు హిమాచల్‌కు తరలివస్తున్నారన్నారు.ఇది కూడా చదవండి: ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
17 మంది బంగ్లాదేశీయులను వెనక్కి పంపిన పోలీసులు
గౌహతి: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన దగ్గరి నుంచి భారత్‌లోకి బంగ్లాదేశీయుల చొరబాటు యత్నాలు పెరిగిపోయాయి. మనదేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్న బంగ్లాదేశీయులను సరిహద్దుల్లోని సైనికులు, పోలీసులు తిరిగి వారి దేశానికి పంపిస్తున్నారు.తాజాగా ఎనిమిది మంది చిన్నారులు సహా 17 మంది బంగ్లాదేశీయులను అస్సాం రాష్ట్ర పోలీసులు సరిహద్దుల నుంచి వెనక్కి పంపించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఒక ట్వీట్లో తెలిపారు. భారతదేశంలోకి బంగ్లాదేశీయుల చొరబాటు యత్నాలు గణనీయంగా పెరిగాయన్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కొంత భాగాన్ని మాత్రమే అస్సాం కాపాడుతోందని అన్నారు. పోలీసులు బంగ్లాదేశీయులను వెనక్కి పంపడాన్ని సీఎం మెచ్చుకున్నారు. కరీంగంజ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు నుండి చొరబడుతున్న బంగ్లాదేశీయుల ప్రయత్నాన్ని రాష్ట్ర పోలీసులు భగ్నం చేశారని శర్మ పేర్కొన్నారు.ఈ నెలలో ఇప్పటివరకు దాదాపు 25 మంది చొరబాటుదారులను అస్సాం నుండి బంగ్లాదేశ్‌కు తిరిగి పంపించినట్లు శర్మ తెలిపారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున చొరబాట్లు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. బంగ్లాదేశ్ పౌరులు టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేసేందుకు దక్షిణాది నగరాలకు చేరుకోవడానికి అస్సాంను రవాణా మార్గంగా ఉపయోగిస్తున్నారన్నారు. కాగా ఈశాన్య ప్రాంతంలోని 1,885 కి.మీ పొడవైన భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ నిఘా మరింతగా పెంచింది. Taking firm stance against infiltration, @assampolice pushed back 9 Bangladeshis and 8 children across the border in the wee hours today-Harul Lamin-Umai Khunsum-Md. Ismail-Sansida Begum-Rufiya Begum -Fatima Khatun-Mojur Rahman-Habi Ullah-Sobika BegumGood job 👍 pic.twitter.com/Q3DeQBr6kj— Himanta Biswa Sarma (@himantabiswa) September 28, 2024ఇది కూడా చదవండి: Monkeypox Virus: గుజరాత్ బాలునికి మంకీపాక్స్? -
చొరబాటు రాకెట్‌ను ఛేదించిన అస్సాం పోలీసులు
బంగ్లాదేశ్‌లో హింసాయుత వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో పలువురు బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే భారత సైన్యం, పోలీసులు ఇలాంటివారిని పట్టుకుని, తిరిగి వారి దేశానికి పంపిస్తున్నారు. తాజాగా అస్సాంలోకి చొరబడిన ముగ్గురు బంగ్లాదేశీయులను పోలీసులు తిరిగి ఆ దేశానికి పంపించారు. వీరు భారత్‌లోకి ప్రవేశించేందుకు సహాయం చేస్తున్న ఏజెంట్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.అలీ హుస్సేన్ అనే వ్యక్తి, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాడని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మహిళను భారత అధికారులు తిరిగి ఆ దేశానికి అప్పగించిన దరిమిలా అలీని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఆ మహిళ తాను మరో 15 మందితో కలసి ఆగస్టు 17న బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి, ఇద్దరు ఏజెంట్ల సహాయంతో భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇందుకోసం అలీకి 2,500 బంగ్లాదేశ్ టాకాలు చెల్లించానని పేర్కొంది.కాగా అస్సాం పోలీసులు ముగ్గురు బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్ వేదికగా తెలిపారు. వీరు త్రిపుర నుంచి భారత్‌లోకి ప్రవేశించారని, వారిని బంగ్లాదేశ్‌లోని రాజ్షాహి జిల్లాకు చెందిన మహ్మద్ అబూ, అసదుల్ ఇస్లాం, మహ్మద్ సర్వర్‌గా గుర్తించామన్నారు. వీరిలో ఒకరి దగ్గర ఆధార్ కార్డు లభ్యమయ్యిదని ముఖ్యమంత్రి తెలిపారు. వీరు కూలి పనుల కోసం చెన్నైకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాగా ఈ ముగ్గురు బంగ్లాదేశీయులు త్రిపుర అంతర్ రాష్ట్ర సరిహద్దు గుండా అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. -
ఆ యాంగిల్లో తీయొద్దని చెప్పా: జాన్వీ కపూర్
బాలీవుడ్ బ్యూటీ, దేవర భామ జాన్వీకపూర్ ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మాహీతో అలరించిన ముద్దుగుమ్మ మరో డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో యువ దౌత్యవేత్తగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీకి సుధాన్షు సరియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ తాను చెప్పిన విషయాన్ని గుర్తు ఉంచుకుని పాటిస్తున్నారని జాన్వీ వివరించింది.గతంలో మహీ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ఫోటోలను వెనకవైపు తీయవద్దని వారిని కోరినట్లు జాన్వీ కపూర్ తెలిపింది. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి ఫోటోలు తీసి.. ఈ నటి ఎవరో ఊహించండి? అంటూ క్యాప్షన్లు పెడతారని చెప్పింది. అందుకే ఆ యాంగిల్లో ఫోటోలు తీయవద్దని వారికి చెప్పినట్లు పేర్కొంది. అలా నన్ను చూపించడం తనకు నచ్చదని.. అంతే కాకుండా నన్ను అలా చూడడం ఇబ్బందిగానే అనిపిస్తుందని వెల్లడించింది. అప్పటి నుంచి వారు అలా చేయడం మానేశారని వెల్లడించింది. ఇప్పుడు వాళ్లే ముందుకు తిరగండి మేడం అంటూ అడిగి మరీ ఫోటోలు తీసుకుంటున్నారని వివరించింది.కాగా.. జాన్వీ చివరిసారిగా స్పోర్ట్స్ డ్రామా మిస్టర్ అండ్ మిసెస్ మహిలో కనిపించింది. ప్రస్తుతం ఉలజ్‌తో అభిమానులను అలరించనుంది. ఈ చిత్రంలో ఆదిల్ హుస్సేన్, మీయాంగ్ చాంగ్, గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదల కానుంది. -
‘పద్మశ్రీ’పై హేమచంద్ ఎందుకు మనసు మార్చుకున్నారు?
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు హేమచంద్ మాంఝీ ‘పద్మశ్రీ’ని తిరిగి ఇవ్వడంపై మనసు మార్చుకున్నారు. మొదట్లో పద్మశ్రీని వాపసు చేస్తానని ప్రకటించిన ఆయన ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.మావోయిస్టుల బెదిరింపుల నేపధ్యంలో హేమచంద్ మాంఝీ మే 27న తన పద్మశ్రీ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై పరిపాలన అధికారులు వెంటనే స్పందించారు. కంకేర్ ఎస్పీ ఆయనతో మాట్లాడి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలోనే ప్రభుత్వం హేమచంద్ మాంఝీకి వై కేటగిరీ భద్రతను కూడా కల్పించింది. ఈ విధమైన భద్రత లభించిన నేపధ్యంలో హేమ్‌చంద్ మాంఝీ తాను పద్మశ్రీని తిరిగి ఇవ్వబోనని ప్రకటించారు.హేమ్‌చంద్ మాంఝీ నారాయణపూర్ జిల్లాలోని ఛోటాదొంగర్‌లో నివసిస్తున్నారు. మే 26 అర్థరాత్రి వేళ మావోయిస్టులు ఆయనను చంపేస్తామని బెదిరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మావోయిస్టులు హేమచంద్ మాంఝీని హతమార్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో హేమచంద్ కనిపించకపోవడంతో మావోయిస్టులు అతని మేనల్లుడిని హతమార్చారు. హేమచంద్ మాంఝీని మావోయిస్టులు అవినీతిపరుడని ఆరోపిస్తుంటారు. ఆయనను ఈ ప్రాంతంనుంచి తరిమి కొట్టాలని పలుమార్లు ప్రజలకు పిలుపునిచ్చారు.హేమచంద్ మాంఝీ అందిస్తున్న వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం గత నెలలో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంలో మాంఝీ మాట్లాడుతూ ‘15 ఏళ్లుగా తాను నారాయణ్‌పూర్‌లో ప్రజలకు చికిత్స అందిస్తున్నానని, నాటి రోజల్లో ఛత్తీస్‌గఢ్‌లో ఆసుపత్రి అంటూ ఏమీ లేదన్నారు. అప్పటి నుంచి తాను వన మూలికలు, ఔషధ మొక్కల సాయంతో ప్రజలకు చికిత్స అందిస్తున్ననని’ తెలిపారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌లలో అమ్మకాలు..
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లలో గత నెల (ఏప్రిల్) ఇన్వెస్టర్లు నికరంగా రూ. 396 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే, గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) మార్చి నెలాఖరున ఉన్న రూ. 31,224 కోట్ల నుంచి 5 శాతం పెరిగి రూ. 32,789 కోట్లకు చేరింది. రూపాయి మారకంలో చూస్తే పసిడి గత ఏడాది వ్యవధిలో మెరుగైన పనితీరే కనపర్చినప్పటికీ ఈక్విటీలతో పోలిస్తే తక్కువేనని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అనలిస్ట్ మెలి్వన్ శాంటారీటా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈటీఎఫ్‌లలో మదుపరులు కొంత లాభాలు స్వీకరించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. దీంతో ధర పెరిగినా ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులు నికరంగా తరలిపోయి ఉంటాయని వివరించారు. 2023 మార్చి తర్వాత గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం ఇదే ప్రథమం. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) డేటా ప్రకారం గతేడాది మార్చిలో నికరంగా రూ. 266 కోట్లు తరలిపోయాయి. తాజాగా మార్చిలో రూ. 373 కోట్లు వచ్చాయి. ఇక, గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోల సంఖ్య మార్చిలో 50.61 లక్షలుగా ఉండగా.. ఏప్రిల్‌లో సుమారు 1 లక్ష పెరిగి రూ. 51.94 లక్షలకు చేరింది. 2022లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ. 459 కోట్లు రాగా, 2023లో దానికి అనేక రెట్లు అధికంగా రూ. 2,920 కోట్లు వచ్చాయి. గతేడాది నెలకొన్న పరిస్థితుల కారణంగా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా, ద్రవ్యోల్బణానికి తగిన హెడ్జింగ్ సాధనంగా పసిడికి ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారడం తదితర అంశాల వల్ల ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపారు. -
చిత్రకారునికి కొత్త చేతులు.. ఢిల్లీ వైద్యుల అద్భుతం!
ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయిన ఒక చిత్రకారుడు ఇప్పుడు తన కొత్త చేతులతో బ్రష్ పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీకి చెందిన వైద్యుల బృందం చేసిన ఈ సర్జికల్ ఎక్సలెన్స్ ను అందరూ కొనియాడుతున్నారు. అవయవ దానంతో తన శరీరం నలుగురికి ఉపయోగపడాలని తపనపడిన ఒక మహిళ కలను ఆ వైద్యుల బృందం సాకారం చేసింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ వైద్యులు 45 ఏళ్ల వ్యక్తికి ద్వైపాక్షిక చేతి మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.. బాధితుడు 2020లో రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో అతను ఏ పనీ చేయలేక నిరాశగా కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే బ్రెయిడ్ డెడ్‌కు గురైన ఒక మహిళ అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. బ్రెయిన్ డెడ్‌కు చేరిన దక్షిణ ఢిల్లీలోని ఒక పాఠశాల మాజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మీనా మెహతా తన మరణానంతరం అవయవ దానానికి గతంలోనే సమ్మతి తెలిపారు. దీంతో ఆమె శరీరంలోని కిడ్నీ, కాలేయం, కార్నియా ముగ్గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. ప్రమాదంలో చేతులు పోగొట్టుకుని నిస్సహాయంగా బతుకీడుస్తున్న ఒక చిత్రకారుని కుంచె ఇప్పుడు తరిగి అద్భుతాలను చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన వైద్యుల బృందానికి విశేష ప్రశంసలు అందుతున్నాయి. ఈ శస్త్రచికిత్స చేయడానికి వైద్యులకు 12 గంటలకుపైగా సమయం పట్టింది. ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించింది. ఆ వైద్యుల బృందం చిత్రకారునితో ఒక ఫోటోను క్లిక్ చేసింది. పెయింటర్ విజయోత్సాహంతో తన రెండు చేతులను పైకి ఎత్తడాన్ని ఆ ఫొటోలో మనం చూడవచ్చు. -
గుల్వీర్ సింగ్ స్వర్ణం వెనక్కి...
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పురుషుల 3000 మీటర్ల విభాగంలో తాను గెల్చుకున్న స్వర్ణ పతకాన్ని భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ కోల్పోయాడు. టెహ్రాన్‌లో జరిగిన ఈ ఈవెంట్లో గుల్వీర్ రేసు సందర్భంగా తాను పరిగెడుతున్న వరుస నుంచి పక్క వరుసలోకి వెళ్లినట్లు తేలడంతో అనర్హత వేటు వేశారు. నిర్వాహకుల నిర్ణయాన్ని భారత బృందం అప్పీల్ చేయగా.. గుల్వీర్ నిబంధన లకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలడంతో అప్పీల్‌ను కొట్టివేశారు. -
మాస్క్ మళ్లొచ్చింది.. సింగపూర్‌లో షురూ!
కోవిడ్-19 వైరస్‌కు చెందిన కొత్త వేరియంట్ల కారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆగ్నేయాసియాలోని పలు ప్రభుత్వాలు వైరస్ నియంత్రణకు తిరిగి పాత నిబంధనలు అమలుకోకి తీసుకురావాలని నిర్ణయించాయి. విమానాశ్రయాల్లో ప్రయాణికులు మళ్లీ మాస్క్‌లు ధరించాలని అధికారులు కోరుతున్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల జ్వరాన్ని తనిఖీ చేయడానికి థర్మల్ స్కానర్లను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఫ్లూ, న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే కోవిడ్ వేరియంట్ల తరహాలోని పలు సూక్ష్మక్రిముల వ్యాప్తిని అరికట్టాలని వివిధ ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైరస్ నియంత్రణకు ముమ్మర చర్యలు చేపడుతోంది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం, సంవత్సరాంతపు, పండుగ సీజన్లలో ప్రయాణాలు మొదలైనవి వైరస్ వ్యాప్తిని మరింతగా పెంచుతాయని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న దేశాలకు, లేదా ప్రాంతాలకు ప్రయాణికులను వెళ్లవద్దని ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇండోనేషియన్లను అభ్యర్థించింది. కాగా గత వారం రోజుల్లో మలేషియాలో కోవిడ్ కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి. దీంతో ఇండోనేషియా అధికారులు కొన్ని సరిహద్దు పోస్టుల వద్ద థర్మల్ స్కానర్లను తిరిగి ఏర్పాటు చేశారు. ఫెర్రీ టెర్మినల్, జకార్తాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దక్షిణాసియాలోని పలు దేశాల్లో తిరిగి కోవిడ్ నియంత్రణ చర్యలు అమలవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహమ్మారి విజృంభణ సమయంలో ఆసియాలో కఠినమైన నిబంధనలు అమలయ్యాయి. ఇటీవల సింగపూర్ ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ తన ఫేస్బుక్ ఖాతాలో కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పునరుద్ధరించాలని చూస్తోందని ప్రకటించడంతో సింగపూర్‌వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇది కూడా చదవండి: శ్రీరామ భక్తులకు యోగి సర్కార్ మరో కానుక! -
అధికారుల నిర్లక్ష్యం.. బెయిల్ వచ్చినా మూడేళ్లు జైళ్లోనే..
అహ్మదాబాద్: గుజరాత్లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. జైలు అధికారుల నిర్లక్ష్యం ఓ దోషి పాలిట శాపంగా మారింది. బెయిల్ వచ్చినప్పటికీ మూడేళ్లపాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. లక్ష రూపాయల జరిమానా విధించింది. చందన్ జీ ఠాకూర్(27)కు ఓ కేసులో జీవితఖైదు శిక్ష పడింది. సెప్టెంబర్ 29, 2020న హైకోర్టు అతని శిక్షను నిలిపివేసింది. అందుకు సంబంధించిన ఆర్డర్ పత్రాలను హైకోర్టు రిజిస్ట్రీ మెయిల్ ద్వారా పంపించింది. ఆ మెయిల్ అటాచ్‌మెంట్‌ను జైలు అధికారులు ఓపెన్ చేయలేదు. దీంతో చందన్ ఠాకూర్ ఇప్పటివరకు జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ కోసం మళ్లీ కోర్టును సంప్రదించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. జైలు అధికారులు కోర్టు పంపిన ఆర్డర్ కాపీలను మెయిల్లో ఓపెన్ చేయలేదనే విషయం ఈ వ్యవహారంలో బయటపడింది. దీనికారణంగా చందన్ ఠాకూర్‌కు శిక్ష నుంచి విముక్తి కలిగినా.. ప్రయోజనం లభించలేదు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. జైలు అధికారుల నిర్లక్ష్యానికి రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక -
‘నా జీవితం ఇంకొకరికి అంకితం’.. నర్సు ఉద్యోగం రాగానే భర్తను గెంటేసి..
‘మీనాక్షికి చదువంటే ఎంతో ఇష్టం. నేను లక్ష రూపాయలు ఖర్చుచేసి ఆమెకు జీఎన్ఎం ట్రైనింగ్ ఇప్పించాను. ఇందుకోసం బీమా పాలసీ కూడా వదులుకున్నాను. ఇప్పుడు మీనాక్షి నన్ను గుర్తించేందుకు కూడా ఇష్టపడటం లేదు. నన్ను తన భర్తగా అంగీకరించడం లేదు. తన జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడని, నన్ను ఇంకొకరిని చూసుకోమని చెబుతోంది’ ‘ఆమె చదువు కోసం లక్షలు ఖర్చు చేశా’ యూపీలోని అనూప్పూర్ జిల్లాలోని పకరియా గ్రామానికి చెందిన జోహన్ భారియా తన గోడును అనూప్పూర్ కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు వచ్చాడు. తన భార్య మీనాక్షి తన దగ్గరకు రావడం లేదని జోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లాయ్యాక ఆమె చదువుకోసం ఎంతో ఖర్చు చేశాను. ఇప్పుడు కనీసం నావైపు చూడటం లేదు. కుమార్తెను కూడా తనతోపాటు తీసుకువెళ్లిపోయింది. తన భార్య తన దగ్గరకు వచ్చేలా చేయండి అని వేడుకున్నాడు. ‘అప్పటికే మీనాక్షికి పెళ్లయ్యింది’ తమకు పెళ్లయ్యే నాటికే మీనాక్షికి వివాహం అయ్యిందని, ఆమె తన అత్తవారింటికి వెళ్లకుండా పుట్టింటిలోనే ఉండేదని, ఆ సమయంలోనే ఆమెతో తనకు పరిచయం అయ్యిందని జోహన్ తెలిపాడు. ఆమె ఇంటిలోనివారు అభ్యంతరం చెప్పినా, తాను వారిని ఎదిరించి మీనాక్షిని వివాహం చేసుకున్నానని తెలిపాడు. తరువాత తమకు కుమార్తె పుట్టిందన్నాడు. మీనాక్షి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండేదని, నర్సు ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించేదని, ఆమె నర్సింగ్ శిక్షణకు తాను లక్షా 15 వేలు ఖర్చు చేశానని జోహన్ పేర్కొన్నాడు. బీమా పాలసీ వదులుకుని మరీ ఆమె చదువుకు వెచ్చించానని తెలిపాడు. ప్రభుత్వ నర్సుగా ఎంపికైన ఆమెకు ఖండ్వా జిల్లా ఆసుపత్రిలో పోస్టింగ్ రావడంతో అక్కడికి వెళ్లిపోయిందన్నారు. ‘కుమార్తెనూ లాక్కుపోయారు’ నర్సు అయ్యాక మీనాక్షి ధోరణి పూర్తిగా మారిపోయిందని, తన దగ్గరకు రావడం మానేసిందని, పుట్టింటిలోనే ఉంటున్నదని, తాను ఆమె దగ్గరకు వెళ్లి బతిమాలినా తనను భర్త కాదు పొమ్మంటున్నదని జోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలోకి మరొకరు వచ్చారని, తనను మరో వివాహం చేసుకొమ్మంటున్నదని జోహర్ తెలిపాడు. తమ కుమార్తెను మీనాక్షి అన్నదమ్ములు బలవంతంగా వారితో పాటు తీసుకుపోయారని జోహన్ తెలిపాడు. మీనాక్షి వలన తాను అప్పుల పాలయ్యానని, ఆమె తిరిగి తన దగ్గరకు వచ్చేలా చూడాలని జోహన్ కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు. ఇది కూడా చదవండి: లాటరీలో రూ. 18 కోట్ల జాక్‌పాట్.. ఒక్క ఈమెయిల్‌తో జీవితాలు తారుమారు -
ఏడాది క్రితం సరిగ్గా అదే రోజు ఇది RR కాదు CSK
-
మార్కెట్లోకి టాటా నానో ఈవీ..?
-
దేశంలో రిటైల్ జోరు: కోవిడ్ ముందుకంటే మెరుగ్గా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారాలు కోవిడ్ ముందస్తు స్థాయిల కంటే ఆరోగ్యకరమైన వృద్ధిని కొనసాగించాయి. 2019తో పోలిస్తే ఈ ఏడాది జూలై అమ్మకాలు 18 శాతం పెరిగాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బుధవారం తెలి పింది. ‘రిటైల్ వ్యాపారం తూర్పు భారత్‌లో అత్యధికంగా 25% వృద్ధి సాధించింది. దక్షిణాదిలో 21, ఉత్తరాది 16, పశ్చిమ భారత్‌లో 10% అధికమైంది. అత్యధికంగా 32 శాతం వృద్ధితో క్రీడా సామాగ్రి అమ్ముడైంది. పాదరక్షలు, ఫర్నీ చర్, గృహాలంకరణ వస్తువుల విభాగాలు ఒక్కొక్కటి 23 శాతం, దుస్తులు, వస్త్రాలు 22, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, గృహాపకరణాలు, ఎలక్ట్రానిక్స్ 17% దూసుకెళ్లాయి. ఆభరణాలు 15 శాతం, ఆహారం, సరుకులు 11, సౌందర్య సాధనాలు, వెల్నెస్, వ్యక్తిగత సంరక్షణ 3% పెరిగాయి. పండుగల సీజన్లో మెరుగైన విక్ర యాలు ఉంటాయని రిటైలర్లు ఆభాభావం వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ వ్యాపారాలు 2019తో పోలిస్తే జూన్‌లో 13 శాతం ఎగశాయి. -
ఆ గోల్డెన్ బైక్స్ మళ్లీ వస్తున్నాయ్!
సాక్షి, ముంబై: భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లోకి మరో గోల్డెన్ బైక్స్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు సంకేతాలు సందడి చేస్తున్నాయి. 2020 ఆటో ఎక్స్పో నాటికి ఈ బైక్స్ పరిచేయాలని కంపెనీ యోచిస్తోందట. ఈ కంపెనీ పేరే యెజ్డీ మోటార్ సైకిల్స్. మహీంద్ర అండ్ మహీంద్ర సొంతమైన ఈ క్లాసిక్ కంపెనీ తన ఐకానిక్ యెజ్డీ బైక్‌లను తిరిగి లాంచ్ చేస్తోంది. ప్రధానంగా ఇటీవల భారత మార్కెట్లో రీఎంట్రీ ఇచ్చిన జావా బైక్‌లు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో కంపెనీ తాజా నిర్ణయం తీసుకుంది. లాంచింగ్‌పై కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ, భారత బైక్ మార్కెట్‌ను ఏలిన యెజ్డీ మోటార్ సైకిల్స్ బైక్స్ అధికారిక పేజీ ప్రస్తుతం యాక్టివ్‌గా ఉంది. ఈ పేజీలో కొన్ని వివరాలను కూడా పొందుపర్చింది. అలాగే ఆఫీషియల్ ట్విటర్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు యెజ్డీ బైక్‌ల లాంచింగ్‌పై స్పష్టమైన సంకేతాలని నిస్తున్నాయి. -
మమతకు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి శుక్రవారం సుప్రీం కోర్టు షాకిచ్చింది. రాష్ట్రంలోని డార్జిలింగ్, కలిమ్‌పోంగ్ జిల్లాల్లో మోహరించిన 15 కంపెనీల కేంద్ర సాయుధ పారామిలటరీ దళాల్లో(సీఏపీఎఫ్) 7 కంపెనీలను వెనక్కు తీసుకోవడానికి కేంద్రానికి అనుమతిచ్చింది. ఈ మేరకు బలగాలను కేంద్రం ఉపసంహరించకుండా కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రక్షణ ఏర్పాట్లకు బలగాలు అవసరమని కేంద్రం చేసిన విజ్ఞప్తిపై సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. కేంద్రం విజ్ఞప్తిపై తమ స్పందనను వారం రోజుల్లోగా తెలియజేయాలనిబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
తోక ముడిచిన సర్కార్
పట్టిసీమ చర్చను వ్యూహాత్మకంగా అడ్డుకున్న ప్రభుత్వం అనుమతి నిరాకరణ పేరుతో చర్చకు చెక్ పోలీసుల అదుపులో ఉండవల్లి, గోరంట్ల విజయవాడలో హైడ్రామా వాస్తవమేంటో తేలుతుందని భావించిన జిల్లా ప్రజలకు నిరాశ సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘ఆశ దోశ అప్పడం...పట్టిసీమపై చర్చ జరిగిపోద్దనే!....చర్చిస్తే అవినీతి బయటపడి పోదూ. తమ పరువేం కావాలి....గంగలో కలిసిపోదూ!. అంత ఈజీగా ఒప్పుకుంటామా ఏంటీ? సవాల్ విసిరినంత మాత్రాన చర్చ జరిగిపోవాలా? ఎవరి ఉచ్చులో మనమెందుకు చిక్కుకోవాలి? అని అనుకుందో ఏమో గాని పట్టిసీమపై జరగాల్సిన చర్చ విషయంలో సర్కార్ తోక ముడిచింది. అనుమతి లేదంటూ సవాళ్లు...ప్రతిసవాళ్లు విసిరిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అదుపులోకి తీసుకుని వ్యూహాత్మకంగా చర్చకు చెక్ పెట్టింది. ఏదో ఒకటి తేలిపోతుందని విజయవాడ వైపు చూసిన జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. పట్టిసీమ ప్రాజెక్టు వేదికగా అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. సీఎం చంద్రబాబు దగ్గరి నుంచి కింది స్థాయి నేతల వరకు అవినీతిలో భాగముందని రాష్ట్రమంతా కోడై కూస్తోంది. ముడుపుల కోసమే ప్రాజెక్టు చేపట్టారని ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల తరఫున ఉండవల్లి అరుణ్‌కుమార్, ప్రభుత్వం తరపున గోరంట్ల బుచ్చయ్య చౌదరి వకాల్తా పుచ్చుకుని...సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుని చర్చకు సై అన్నారు. విజయవాడను వేదికగా చేసుకున్నారు. ఇద్దరూ సమాయత్తమయ్యారు. దీంతో అందరి దృష్టి విజయవాడపై మళ్లింది. రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ వస్తుందని ఆశపడ్డారు. కానీ సర్కారు వ్యూహాత్మకంగా పావులు కదిపి ముగింపు పలికింది. . విజయవాడలో హైడ్రామా... అనుకున్నట్టే ప్రభుత్వం తోకముడిచింది. పట్టిసీమపై అంత ఈజీగా చర్చకు అనుమతిస్తుందా? అన్న అనుమానాలను నిజం చేసింది. చర్చ జరిగితే ఎక్కడ అవినీతి బయటపడిపోతుందనో..ఎవరికెంత ముడుపులందాయో తెలిసిపోతుందనో... ఎందుకొచ్చిన రాద్ధాంతమనో తెలియదు గాని చర్చ జరిగిన రోజున అనుమతి లేదంటూ వ్యూహాత్మకంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంది. అనుమతి నిరాకరణ పేరుతో సవాళ్లు స్వీకరించిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అడ్డుకుని అదుపులోకి తీసుకుంది. చెప్పినట్టుగానే ప్రకాశం బ్యారేజీ వద్దకు ఉండవల్లి అరుణ్‌కుమార్ ముందుగా చేరుకున్నారు. నిర్ధేశించిన ఉదయం 11 గంటలకు మాత్రం బుచ్చయ్య చౌదరి చేరుకోలేదు. ఆ తర్వాత బుచ్చయ్య చౌదరి భారీగా వాహనాలతో తరలివచ్చారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. కాకపోతే ఇక్కడ బుచ్చయ్య చౌదరి ప్రజలకు అనుమానం రాకుండా తమదైన సీన్ రక్తి కట్టించారు. పోలీసులతో వాగ్వాదం చేసి...బహిరంగ చర్చకు వెనక్కి తగ్గేది లేదని పేర్కొంటూ హడావుడి సృష్టించారు. ఇది చూసిన వారు ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రశాంత వాతావరణంలో చర్చకు అనుమతిస్తే ఎవరి లెక్కేంటో? ఎవరి వాదనలో పస ఉందో తేలిపోయేదని....చర్చను అడ్డుకోవడమంటే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టే అన్న వాదనలు వినిపించాయి. అవినీతి లోగుట్టు బయటపడకూడదనే ఈ ఎత్తుగడ చంద్రబాబు వేశారని పరిశీలకులు భావిస్తున్నారు. -
‘మంజునాథ కమిషన్ గో బ్యాక్’
కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : అర్హత లేని కులాలను బీసీ జాబితాలో ఎలా చేరుస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. అధ్యయనం చేసేందుకు బుధవారం కాకినాడ వస్తున్న మంజునాథ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బర్ల సీతారత్నం ఆధ్వర్యంలో ‘మంజునాథ కమిషన్ గో బ్యాక్’ అంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కంబాల చెరువు నుంచి దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని బైఠాయించారు. వెంకట మహేష్ మాట్లాడుతూ రిజర్వేషన్ల శాతాన్ని పెంచకుండా బీసీ జాబితాలో చేర్చడాన్ని తమ సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అర్హత లేని కులాలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర జనాభాలో 55 శాతం కంటే పైగా ఉన్న బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేస్తున్నారని, దానిని 50 శాతానికి పెంచాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకే ఎసరు పెడుతున్నారన్నారు. ఒక కమిషన్ ఏర్పాటు చేసి బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తమాషా చేస్తోందన్నారు. రాష్ట్ర బీసీ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు లద్దిక మల్లేష్, బీసీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దాస్యం ప్రసాద్, నాయకులు రాయుడు రాకేష్, బండారు రాజేశ్వరరావు, గెడ్డం నాగరాజు, విత్తనాల శివ వెంకటేష్, విష్ణు, సాయిరాంసింగ్, ప్రశాంత్, కోటి తదితరులు పాల్గొన్నారు. -
వెలిగొండకు వెన్నుపోటు
► ప్రాజెక్టు పూర్తికి కావల్సింది రూ.2,800 కోట్లు ► తాజా బడ్జెట్లో రూ.200 కోట్ల మొక్కుబడి నిధులు విదిల్చిన సర్కారు మొదటి ఫేజ్ కే రూ.వెయ్యి కోట్లు అవసరం ► ఈ లెక్కన ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దశాబ్ద కాలం పట్టే పరిస్థితి ► 2018కే నీళ్లంటూ బాబు మాటల గారడీ వెలిగొండ ప్రాజెక్టుతోనే ప్రకాశం ప్రగతి ► నిధులివ్వకపోయినా పట్టించుకోని అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో వరుస కరువులకు.. మితిమీరిన ఫ్లోరైడ్‌తో కిడ్నీ వ్యాధి మరణాలకు.. వెలిగొండ ప్రాజెక్టుతో పెద్ద లింకే ఉంది. ఇక్కడి కరువు నుంచి జనం గట్టెక్కాలన్నా... కిడ్నీ వ్యాధి మరణాలు తగ్గాలన్నా... పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా... వెలిగొండ ప్రాజెక్టే ఏకైక దిక్కు. వ్యవసాయరంగానికి కావాలి్సన సాగునీరు, జనం దప్పిక తీర్చే తాగునీరు ఈ ప్రాజెక్టు వల్లే సాధ్యం. మోడువారిన పశ్చిమ ప్రకాశం కళకళలాడాలన్నా వెలిగొండతోనే సాధ్యం. మొత్తంగా ప్రకాశం జిల్లా మనుగడ వెలిగొండపైనే ఆధారపడి ఉంది. ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పాలకులు చేస్తున్న హామీలు ఆచరణలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మిగిలి ఉన్న పనులను నిధులిచ్చి పూర్తి చేసిన పాపానపోలేదు. దీంతో వెలిగొండ నీరు జిల్లా వాసులకు అందనంత దూరంలోనే ఉండిపోతోంది. ప్రకటనల ప్రగల్బాలే.. వెలిగొండ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు వెచ్చించి తన హయాంలోని నీటిని పారిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది అవిగో నీళ్లు.. ఇదిగో ప్రాజెక్టు అంటూ మాటలతో సరిపెట్టడం తప్ప నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేటాయించలేదు. తాజాగా వెలిగొండను పూర్తి చేసి 2018 జూ¯ŒS నాటికి నీటిని విడుదల చేస్తామంటూ మరోమారు బాబు గొప్పలు చెప్పారు. వెలిగొండ మన హయాంలో పూర్తి చేస్తామని ఈ విషయాన్ని జిల్లావ్యాప్తంగా ప్రచారం చేసుకోండంటూ విజయవాడలో జరిగిన టీడీపీ జిల్లా సమీక్షా సమావేశంలోనూ ఆ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చెప్పారు. ఇది జరిగి పట్టుమని 10 రోజులు కాకుండానే తాజా బడ్జెట్లో వెలిగొండకు కేవలం రూ.200 కోట్లు కేటాయించి మరోమారు ఈ ప్రాజెక్టుపై బాబు వివక్ష చూపారు. ప్రాజెక్టు పూర్తి కావటానికి తాజా అంచనాల ప్రకారం మరో రూ.2,800 కోట్లు అవసరం. చంద్రబాబు చెప్పినట్లు ఫేజ్–1 పనులను పూర్తి చేసి నీటిని విడుదల చేయటానికి కూడా వెయ్యి కోట్ల రూపాయల వరకు అవసరం. కానీ బడ్జెట్లో బాబు సర్కారు కేటాయించింది మాత్రం రూ.200 కోట్లే. ఈ లెక్కన మరో 15 ఏళ్లకు కూడా ప్రాజెక్టు పూర్తి కాదని బాబు చెప్పకనే చెప్పారు. వెలిగొండకు సర్కారు నిధులు కేటాయించకపోయినా... జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం గమనార్హం. జిల్లా అభివృద్ధికి వెలిగొండే ఆధారం జిల్లాలోని వ్యవసాయ రంగమే కాదు.. పారిశ్రామిక రంగం సైతం వెలిగొండ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంది. నీళ్లు లేకుండా పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని సాక్షాత్తు పారిశ్రామికవేత్తలే చెబుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే దొనకొండ పారిశ్రామికవాడ, కనిగిరి నిమ్జ్ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. వెలిగొండ నీరు లేకపోతే ఏ ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. అంటే జిల్లాకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేనట్లే! చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మొక్కుబడి నిధులను మాత్రమే కేటాయించారు. ఇప్పటి వరకు రూ.700 కోట్లు ఇచ్చినట్లు సర్కారు లెక్కలు చెబుతున్నా కనీసం రూ.400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నిర్మాణ పనులకు రూ.25 కోట్లకుపైనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సకాలంలో నిధులివ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు సైతం ఆపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల పనులు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. టన్నెల్–1, 2 పనులను ఇరువైపుల చేపడుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులను ప్రారంభిస్తున్నామన్నారు. తీరా బడ్జెట్లో చూస్తే సర్కారు రూ.200 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు వెలిగొండ పనులను వేగవంతం చేసే పరిస్థితి కనిపించటం లేదు. ఫ్లోరైడ్ పీడకు వెలిగొండే విరుగుడు.. జిల్లాలో ఫ్లోరైడ్ శాతం తీవ్ర స్థాయికి చేరింది. 15 శాతం ఫ్లోరైడ్ ఉన్న గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. 2,200 హాబిటేషన్లు ఉండగా 1200 హాబిటేషన్లలో ఫ్లోరైడ్ అధికంగా ఉంది. దీంతో ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్ర స్థాయికి చేరింది. తద్వారా కిడ్నీ వ్యా«ధితో జనం మృత్యువాత పడుతున్నారు. గత రెండేళ్లలోనే 427 మంది మరణించారు. వందలాది మంది మరణానికి దగ్గరగా ఉన్నారు. వేలాది మంది వ్యాధికి గురయ్యారు. రక్షిత మంచినీరు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. వెలిగొండ పూర్తయి కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తే ఫ్లోరైడ్ తగ్గుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ తీవ్రత, కిడ్నీ వ్యాధి మరణాలు వివరాలను ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఫ్లోరైడ్ బారి నుంచి జిల్లా వాసులను రక్షించాలని ఆయన కోరుతున్నారు. వ్యాధి తీవ్రతకు కారణాలు అన్వేషించి నివారణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి నడ్డాకు వివరించారు. అయినా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందరీ ఆశలు వెలిగొండపైనే ఉన్నాయి. కానీ నిధుల కేటాయింపులు చూస్తే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించటం లేదు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయకపోతే ఇప్పటికే ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు స్పందించి, వెలిగొండ ప్రాజెక్టుకు అధికంగా నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి్సన అవసరం ఉంది. 2018 నాటికైనా ప్రాజెక్టును పూర్తి చేయించి నీటిని విడుదల చేయించేందుకు కృషి చేసి, కరువు జిల్లాను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలి. -
బై బ్యాక్ కు టీసీఎస్ బోర్డు ఓకే
ముంబై: ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)వాటాదారులకు ఉత్సాహకరమైన వార్త అందించింది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న షేర్ల బై బ్యాక్ పై టీసీఎస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 5.6 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.16 వేల కోట్ల విలువకు మించకుండా తిరిగి కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన టీసీఎస్ బోర్డ్ సమావేశంలో బై బ్యాక్ ప్రతిపాదనను పరిశీలించింది. 14.6 శాతం ప్రీమియంతో తన సొంత షేర్ల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మార్కెట్ రేటు పై ఈ ప్రీమియాన్ని అందించనుంది. రూ.2,850 ధర వద్ద షేరును కొనుగోలు చేయనున్నట్టు స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ లో టీసీఎస్ తెలిపింది. టెండర్ ఆఫర్ ద్వారా బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు వెల్లడించింది. కంపెనీలో ప్రమోటర్ల వాటా 73.33 శాతంగా ఉంది. ఈ వార్తలతో మార్కెట్ ముగింపులో టీసీఎస్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. అటు టీసీఎస్ నిర్ణయంపై మార్కెట్ వర్గాలు హర్షం ప్రకటించాయి. -
వెనక్కి తిరిగి చూడాల్సిందే!
న్యూలుక్ బ్లౌజ్ డిజైన్స్ రూపు రేఖలు మారిపోయాయి. ఎక్కువ హంగామా లేకుండా చిన్న చిన్న డిజైన్స్‌తో చూపులను వీపుకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. వాటిలో సింపుల్ అండ్ సూపర్బ్ అనిపించే ఈ డిజైన్స్ మాఘమాసానికి ప్రత్యేకం. -
సహారా చీఫ్ కి సుప్రీం షాక్
న్యూఢిల్లీ సహారా గ్రూపు అధినేత సుబ్రతా రాయ్ కి సుప్రీంకోర్టు షాకి ఇచ్చింది. ఆయన పెరోల్ ను రద్దు చేసింది. ఇటీవల పెరోల్ మీద బయటకు వచ్చిన సుబ్రతా తాత్కాలిక బెయిల్ ను పొడిగించడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వెంటనే ఆయన్ను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. అక్టోబర్ మూడు వరకు జ్యడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సహారా న్యాయవాది, సుప్రీం న్యాయవాది మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి సుబ్రతాను జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. సహారా చీఫ్ సుబ్రతా రాయ్ తో పాటు మరో ఇద్దరి పెరోల్ కూడా రద్దు చేసిన సుప్రీం వారిని తిరిగి జైలుకి పంపాలని స్పష్టం చేసింది. కాగా నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమైన కేసులో 2014 లో సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. అయితే తల్లి మరణంతో మానవీయ కోణంలో ఈ ఏడాది మే 6 న నాలుగు వారాల పెరోల్ మంజూరు చేసింది. అనంతరం ఆయన చెల్లించాల్సినమొత్తంలో రూ.10,000 కోట్లలో, సెబీకి రూ .300 కోట్లు డిపాజిట్ చేయాలనే షరతు తో ఆగస్టు 3 న రాయ్ పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు, ఆ తర్వాత నేటివరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
నునుపైన వీపు కోసం...
బ్యూటిప్స్ అందం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకునే వాళ్లు కూడా వీపును నిర్లక్ష్యం చేస్తారు. వీపు గురించి శ్రద్ధ తగ్గితే క్రమంగా ఆ భాగంలో చర్మం ఛాయతగ్గి నిర్జీవంగా తయారవుతుంది. చలి కాలంలో ఈ చర్మం పొడిబారి తెల్లగా పొట్టు రాలుతుంది. ఇలాంటప్పుడు మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్ రాసి సరిపెట్టుకుంటారు. వీపు కూడా అందంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పని సరి. స్క్రబ్బర్‌తో: చర్మం మీద మృతకణాలను తొలగించడానికి స్క్రబ్బర్ బాగా పని చేస్తుంది. మార్కెట్లో దొరికే రెడీమేడ్ స్క్రబ్ వాడవచ్చు. లేదా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.కొంచెం గరుకుగా ఉండే బియ్యప్పిండి, సున్నిపిండితో రుద్దితే మృత కణాలు పోయి చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది. రెడీమేడ్ స్క్రబ్బర్లు బ్రాండెడ్వే వాడాలి. కొంతమందికి వీపు మీద మొటిమలు, కురుపులు వస్తుంటాయి. ఇలాంటప్పుడు స్క్రబ్బర్ బదులుగా బాడీ బ్రష్ వాడాలి. బ్లీచ్‌తో: సూర్యరశ్మికి ముఖంతోపాటు ఎక్కువగా ఎక్స్ పోజ్ అయ్యేది వీపుభాగమే. డీప్ నెక్, స్ట్రిప్స్ ఉన్న బ్లౌజ్‌లు, చుడీదార్లు వేసుకుంటే ఎండకు వీపు నల్లబడుతుంది. వారానికి ఒకసారి బ్లీచ్ చేయిం చుకుంటే నలుపు పోతుంది. వీపు మీద కమిలిన ప్రదేశమంతా పచ్చిపాలతో రోజూ మసాజ్ చేసుకున్నా కూడా నలుపు వదులుతుంది. -
21 ఏళ్ల నాటి ఒప్పందం ద్వారా మాల్యాకు చెక్?
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ కసరత్తు చేస్తోంది. 21 ఏళ్లనాటి ఒప్పందాన్ని వినియోగించుకొని మాల్యాకు చెక్ చెప్పాలని చూస్తోంది. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఒప్పందం (ఎంఎల్ఏటీ) కింద మాల్యాను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ మేరకు ఈడీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసింది. 1995 ఒప్పందం ప్రకారం విచారణలో తోడ్పడే చర్యల్లో భాగంగా నిర్బంధంలో ఉన్న వ్యక్తులను సహా బదిలీకి, లేదా కీలక సాక్ష్యం ఇవ్వడం కోసం ఆయా వ్యక్తుల తరలింపును దేశాలు కోరవచ్చు. ఈ ఒప్పందాన్ని ఆధారంగా చేసుకుని మాల్యాను వెనక్కి రప్పించేందుకు ఈడీ ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల సీబీఐ మాల్యాపై చీటింగ్ నమోదు చేసిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ఉద్దేశపూర్తకంగా వేలకోట్ల రుణాలను ఎగవేసి బ్రిటన్ కు పారిపోయిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించే చర్యల్లో భాగంగా గతంలో ఈడీ ..రెడ్ కార్నర్ నోటీసు జారీ జారీచేసి అతణ్ని భారత్ కు రప్పించాలని, విచారణకు తోడ్పడాలని ఇంటర్‌పోల్‌ను కోరింది. అయితే 1971 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి పాస్‌పోర్ట్ న్యాయపరంగా చలామణిలో ఉన్నంతకాలం సంబంధిత వ్యక్తిని దేశం నుంచి వెళ్లిపోవాలని తాము ఆదేశించలేమని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు మాల్యాను నేరస్తుడుగా గుర్తిస్తే తప్ప తరలించడం సాధ్యంకాదు. మరోవైపు భారతదేశ చర్యలు మాల్యా బ్రిటన్ కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. ఈ అంశాలను పరిశీలించిన ఈడీ తాజా చర్యకు పూనుకుంది. -
హరితహారంలో సారంగా‘పూర్’
సారంగాపూర్ : హరితహారంలో సారంగాపూర్ వెనుకబడి ఉందని ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం మండలపరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్వామా ఏపీడీ కుందారపు లక్ష్మీనారాయణ నిర్దేశించిన లక్ష్యాన్ని పదిరోజుల్లో ఎలా పూర్తిచేయాలన్న విషయంపై చర్చించారు. ఎంపీపీ శారద, ప్రత్యేకాధికారి అంబయ్య, ఎంపీడీవో పుల్లయ్య, ఈజీఎస్ ఏపీవో అంకూస్ అహ్మద్ పాల్గొన్నారు. విఫలం అయింది ఇలా.. ప్రారంభంలో మండల అధికారికి ఒక గ్రామాన్ని అప్పగించారు. హడావుడిగా మెుక్కలు నాటడం మెుదలు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీæ సెంటర్లు, పాఠశాలలు, రైతుల పంట పొలాల గట్లు, రోడ్ల వెంట మొక్కలు నాటారు. గడువు ముగిసే సమయానికి సగం లక్ష్యం చేరలేదని గుర్తించారు. మండలంలో మొత్తం 22 గ్రామాల్లో ఉపాధి పథకం కింద మూడు లక్షల నుంచి మూడు లక్షలయాభైవేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం లక్షాయాభై వేల మొక్కలు మాత్రమే నాటారు. జిల్లాలో అన్ని మండలాలకంటే సారంగాపూర్ వెనుకబడడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అటవీశాఖ పరిధిలోని ఖాళీ భూములను మంగేళ, బట్టపల్లి, బీర్పూర్, పోతారం, రంగసాగర్, సారంగాపూర్, రంగపేట గ్రామాల్లో ఉపాధి కూలీల ద్వారా నాటించడానికి ఆ శాఖ అనుమతినిచ్చింది. బీడుగా ఉన్న రెవెన్యూ భూముల వివరాలు ఇవ్వాలని ఏపీడీ ఆదేశాలు జారీ చేశారు. 22 గ్రామాల్లో 11 గ్రామాలను ఎంపీడీవో పుల్లయ్య, 11 గ్రామాలను తహసీల్దార్ వెంకటరమణ పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతీరోజు 20 వేల గుంతలు తీయాలని, మొత్తం 1.50 నుంచి 2 లక్షల మొక్కలు పది రోజుల్లో నాటాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రామాల్లో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఉపాధి కూలీలు వచ్చే పరిస్థితి లేదు. లక్ష్యం చేరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
హోమ్‌వర్క్ చేయలేదని..
* విద్యార్థిని చితకబాదిన టీచర్ * గాజులపల్లె స్కూల్లో ఘటన గాజులపల్లె ఆర్ఎస్(మహానంది): హోమ్‌వర్క్ చేశాడు...పుస్తకాన్ని తేవడం మరిచిపోవడమే ఆ చిన్నారి చేసిన తప్పు. ఇందుకు ఆగ్రహించిన ఉపాధ్యాయుడు కర్రతో వీపుపై వాతలు పడేలా చితకబాదినఘటన మహానంది మండలం గాజులపల్లెలో చోటు చేసుకుంది. గాజులపల్లె ఆర్ఎస్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన మూడోతరగతి విద్యార్థి వేణు ఎప్పటిలాగే మంగళవారం పాఠశాలకు వెళ్లాడు. ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి హోమ్‌వర్క్ గురించి ప్రశ్నించగా పుస్తకం తేలేదని చెప్పడంతో బెత్తంతో వాతలు పడేలా మోదాడు. వీపుపై వాతలు చూసి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడుని నిలదీయగా ఆయన క్షమించాలని కోరడంతో వివాదం సద్దుమణిగింది. -
ఆ చిహ్నానికి వేల ఏళ్ళు!
భారతీయులు పవిత్ర, ఆధ్యాత్మిక చిహ్నంగా విశ్వసించే స్వస్తిక్ గుర్తు ఎంతో ప్రాచీనమైనదని తాజా పరిశోధనలు వెల్లడించాయి. శాంతికి గుర్తుగా భావించే స్వస్తిక్ ఆర్యులకాలానికి ముందే ఉన్నట్లు తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. స్వస్తిక్ గుర్తుపై చేపట్టిన పరిశోధనలు ఎన్నో ఆశ్చర్యకర వివరాలను వెలుగులోకి తెచ్చాయి. స్వస్తిక్ చిహ్నం సుమారు 11, 12 వేల ఏళ్ళ క్రితమే ఉనికిలో ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. అయితే భారతీయ చిహ్నమైన స్వస్తిక్ ను అనంతరం హిట్లర్ తనకు అనుకూలంగా వాడుకున్నట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు పేర్కొన్నారు. ఐఐటీ అహ్మదాబాద్, జాదవ్ పూర్, విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులు తమ అధ్యయనాల వివరాలను తాజాగా వెల్లడించారు. -
వెన్ను మార్గంలోకి మెదడు!
మెడిక్షనరీ మెదడుకు ఉన్న స్థలం సరిపోక కొందరిలో అది వెన్ను మార్గంలోకి జారుతుంది. ఈ కండిషన్‌నే కెయరీ మాల్ఫార్మేషన్ అనీ లేదా ఆర్నాల్డ్ కెయరీ మాల్ఫార్మేషన్ అని అంటారు. ఇది చాలా అరుదైన కండిషన్. ఇలా జరిగినప్పుడు మెదడులోంచి వెన్నుపాములోకి వెళ్లే ఫొరామెన్ మాగ్నమ్ అనే చిన్న దారిలోంచి మెదడులోని సెరెబెల్లమ్ వెన్ను మార్గంలోకి ప్రవేశిస్తుంది. ఆ కండిషన్ ఏర్పడినప్పుడు రోగుల్లో తలనొప్పి, అలసట, కొన్ని కండరాలు బలహీనం కావడం, మింగడంలో ఇబ్బంది, గొంతులో ఏదో అడ్డుపడ్డట్లుగా ఉండటం, మగత, వికారం, చెవిలో గుయ్ అనే శబ్దం, మెడనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎమ్మారై పరీక్ష ద్వారా కెయరీ మాల్ఫార్మేషన్ను నిర్ధారణ చేస్తారు. దీనికి సర్జరీ / డీకంప్రెసివ్ సర్జరీతో పాటు ఆయా లక్షణాలను తగ్గించే మేనేజ్మెంట్ వంటివి చేసి చికిత్స అందిస్తారు. -
డ్రీమ్‌లైనర్ విమానం.. మళ్లీ తుస్!
డ్రీమ్ లైనర్ విమానంలో మళ్లీ సమస్య తలెత్తింది. జపాన్ డ్రీమ్‌లైనర్ విమానం ఇంజన్ వేడెక్కడంతో కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన విమానం.. గంటలోపే వెనక్కి తిరిగి వచ్చేసింది. ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అనేక ఇబ్బందులను చవిచూస్తున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ తాజా ఘటనలతో మరో సమస్యలో పడినట్లు జపనీస్ ఎయిర్ లైన్స్ చెబుతోంది. కుడి ఇంజన్లో సమస్య వచ్చే సమయానికి విమానంలో 203 మంది ప్రయాణికులతో పాటు, 11 మంది సిబ్బంది ఉన్నారు. ఉదయం 8 గంటలకు కౌలాలంపూర్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం ఇంజన్ తీవ్రంగా వేడెక్కడంతో అప్రమత్తమైన సిబ్బంది.. 9.30 గంటల ప్రాంతంలో కౌలాలంపూర్‌లో మళ్లీ ల్యాండ్ చేశారని అధికారులు తెలియజేశారు. ప్రమాదాన్ని గుర్తించి అత్యవసరంగా దింపేయడంతో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, పెద్ద ముప్పు తప్పిందని తెలిపారు. మధ్యాహ్నం 3.15 గంటలకు విమానం నరితా ఎయిర్ పోర్టుకు చేరాల్సి ఉండగా.. ఉన్నట్లుండి విమానంలోని కుడి ఇంజన్లో ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో గుర్తించిన సిబ్బంది విమానాన్ని వెనక్కి తిప్పాల్సివచ్చిందని ఎయిర్ వేస్ ప్రతినిధి షోచిరో హోరీ తెలిపారు. అయితే అత్యధిక వేడి సమస్య ఎందుకు తలెత్తిందన్న విషయంపై విచారిస్తున్నట్లు తెలిపారు. ఇంధన వాడకాన్ని తగ్గించడంలో భాగంగా తేలికైన మిశ్రమ పదార్థాలతో డ్రీమ్ లైనర్ విమానాలను తయారు చేశారు. అభివృద్ధి దశలో వచ్చిన అనేక సమస్యలను దాటి ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ (ఏఎన్ఏ) 2011లో తొలి వాణిజ్య విమానాన్ని పరిచయం చేసింది. అనంతరం 2013లో డ్రీమ్‌లైనర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక విద్యుత్ సమస్య తలెత్తింది. సంవత్సరం మొదట్లో బ్యాటరీ సమస్యతో అనేక విమానాల్లో సమస్యలు తెలత్తగా, ఒక విమానం బ్యాటరీ వేడెక్కడంతో అగ్నిప్రమాదం కూడా సంభవించింది. దీంతో లోపాలను సరిదిద్దేందుకు ఓ పక్క ప్రయత్నాలు జరుగుతుండగా తాజాగా కౌలాలంపూర్ విమానం ఘటన వెలుగుచూసింది. -
ఏం చేస్తారు ?
-
వెన్ను పూలు
అమ్మాయిల వెన్ను(బ్యాక్) డిజైనర్లకు ఓ క్యాన్వాస్గా మారినట్టు ఉంది. అందుకే బ్యాక్ డిజైన్స్ డ్రెస్సుల ట్రెండ్ ఇప్పుడు వరసకట్టింది. ఎన్నెన్నో పువ్వులు, లతలు.. వెన్నుపైన ఎంతో అందంగా, మరెంతో హుందాగా మెరిసిపోతున్నాయి. మొన్న మొన్నటి వరకు డిజైనర్లు చుడీదార్ నెక్ డిజైన్స్‌కి ఫ్రంట్ మీదే దృష్టి పెట్టేవారు. ఇప్పుడు కాస్త గాలి వెనక్కి మళ్లి.. వెన్ను మీద మరింత అందంగా రూపుకడుతున్నారు. బ్యాక్ డిజైన్స్ ఒక బ్లౌజ్లకేనా! అలా అని సరిపెట్టేసుకునే రోజలు కావివి. సాదాసీదా బ్యాక్ నెక్ డిజైన్ డ్రెస్సులు కంఫర్ట్ కోసం అయితే పర్వాలేదు. కానీ, పార్టీలో ఎదుటివారి చూపులు ఎనకే వెంబడించాలంటే మాత్రం బ్యాక్ డిజైన్ డ్రెస్సులు తప్పనిసరి. లేసులు.. ప్రింట్లు.. ఇవి ఓ మోస్తారు సాదాసీదా ఎంపికయే. అయినా వెన్ను మొత్తం ఆవరించేలా డిజైన్ ఉంటే మీరే అట్రాక్టివ్. అలాంటి డిజైన్ ఉన్నవాటిని ఎంపికచేసుకోవడమే కాదు, మీరే స్వయంగా డిజైన్ చేసుకోవచ్చు కూడా! ఫ్రంట్ కన్నా మిన్నగా కాలర్, రౌండ్, హాల్టర్.. నెక్ మోడల్స్ ఎన్ని వచ్చినా అవి డిజైన్‌తో తళుక్కుమనాల్సిందే! ఛాతిభాగం మొత్తం డిజైన్‌తో ఆకట్టుకున్నా అదేమంత స్టైల్ కాదు. అందరూ కాస్త ఎక్కువో, మరికాస్త తక్కువో ఫ్రంట్ డిజైన్ చుడీదార్ వేసుకునేవారే. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలంటే మాత్రం బ్యాక్ డిజైన్ సృజనాత్మకంగా ఉండాలి. హారాలన్నీ వెన్నుకే మెడలో నగలు ముందున్నవారికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగని నగలు వెనకేసుకోలేరు. అందుకే డిజైనర్లు ఎంబ్రాయిడరీ హారాలను డ్రెస్ వెనకాల అందంగా అల్లేస్తున్నారు. మణిమరకతాల్లాంటి స్టోన్స్‌తో వాటిని రూపుకట్టేస్తున్నారు. ఈ హారాలను చూస్తే బంగారు హారాలు చిన్నబోయేలా ఉన్నాయి. వేడుకలకే వెన్ను క్యాజువల్ డ్రెస్సులకు వెన్నుపైన సాదాసీదా ప్రింట్లు ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. అదే పార్టీలకైతే స్వరోస్కి, జర్దోసి, కుందన్స్, చెమ్కీ.. ఇలా అన్నింటి మేలవింపు డిజైన్స్ ఇంపుగా ఉంటాయి. వయసు, ఎత్తు, లావు.. వీటిని దృష్టిలో పెట్టుకొని తమ శరీరాకృతికి తగిన బ్యాక్ డిజైన్లను ఎంచుకోవడంలో ఎవరి ఎంపిక వారిదే! నాలుగురాళ్లే కాదు నాలుగు డిఫరెంట్ బ్యాక్ డిజైన్స్ ఉన్న డ్రెస్సులను కూడా మీ వార్డ్‌రోబ్‌లో చేర్చండి. పార్టీ వేర్కి పర్ఫెక్ట్గా సూటయ్యే ‘బ్యాక్’తో మీ వెనకే చూపులను కట్టిపడేయండి. - ఎన్.ఆర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చాక బ్యాక్ కోసం ఎన్నో కొత్త డిజైన్లు పుట్టుకువచ్చాయి. వాటిలో ట్రాన్స్పరెంట్ డిజైన్ ఆకట్టుకుంటోంది సన్నగా ఉన్నవారికి లాంగ్ బ్యాక్ డిజైన్స్ బాగా నప్పుతాయి బొద్దుగా ఉన్నవారు డ్రెస్ బ్యాక్ ట్రాన్స్పరెంట్ డిజైన్స్ కి వెళ్లకపోవడమే మంచిది. అలాగే ఎంబ్రాయిడరీ సింపుల్ అనిపించే డిజైన్స్‌ను ఎంచుకోవాలి ‘ఎ’ షేప్ శరీరాకృతి గలవారు వెన్ను పై భాగాన డిజైన్ ఎక్కువ ఉండేవి, ‘స్పూన్’ షేప్ శరీరాకృతి గలవారు వెన్ను కింది భాగాన డిజైన్ ఎక్కువ ఉండేవి ఎంచుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు. -
'మంచి' దొంగ పోలీసులకు చిక్కాడు
ప్రయాణాల్లోనూ, టూర్లలోనూ లగేజీ పోగొట్టుకుంటుంటాం. అలాగే వాల్యుబుల్స్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కోసారి ఎక్కడో పెట్టి మర్చిపోవడమో, ఎవరైనా దోచేయడమో జరుగుతుంటుంది. అయితే అటువంటప్పుడు కనీసం బ్యాగ్ దొరికిన వారు అందులోని డబ్బు, బంగారం వంటివి ఇవ్వకపోయినా... పాస్‌పోర్ట్ సర్టిఫికెట్లు, ఫోన్ డేటా వంటి అత్యవసరమైనవైనా తిరిగి ఇచ్చేస్తే బాగుండునని ఎంతగానో అనుకుంటాం. అయితే దొంగల్లోనూ కొందరు సిన్సియర్లు ఉంటారని, వారు అలాకూడా చేస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా? తాజాగా ముంబైలో అటువంటి ఓ మా మంచి దొంగ పోలీసులకు చిక్కాడు. తనకు కావలసినదేదో తీసుకొని విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను నిజాయితీగా యజమానికి అప్పగించే అలవాటున్న ఆ 61 ఏళ్ళ మంచిదొంగను.. ఓ చోరీకి పాల్పడుతుండగా పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ...ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) ఓ 61 ఏళ్ళ వయసున్న వింత దొంగను అరెస్ట్ చేశారు. ఎన్నారైలను మాత్రమే టార్గెట్ చేసి వారివద్ద ఉన్న విలువైన వస్తువులను తస్కరించడంలో మంచి హస్త లాఘవం ఉన్న కిషోర్ సుబ్రహ్మణ్యన్ మద్దాలి అనే దొంగను చాకచక్యంగా పట్టుకొన్నారు. అతనివద్ద నుంచీ ఐదుగురు విదేశీయులకు సంబంధించి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కిషోర్ సుబ్రహ్మణ్యం టార్గెట్ కేవలం ఫారెనర్లే. వారిని తన మాటలతో మస్కాకొట్టించి, నమ్మకం కలిగించి మెల్లగా వారి బ్యాగ్‌లను కొట్టేయడం కొన్నేళ్ళుగా అతని అలవాటుగా మారింది. అయితే ఆ బ్యాగుల్లో వారికి సంబంధించిన పాస్‌పోర్టులు వంటివి ఉంటే మాత్రం వారికి ఎలాగైనా తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించడం ఈ దొంగగారి ప్రత్యేక లక్షణం. అయితే ఎన్నో ఏళ్ళుగా ఈ వ్యవహారం జరుగుతున్నా బయటపడలేదు గానీ, తాజాగా సౌదీ అరేబియాకు చెందిన దేవదాసన్ శివరామ్ సోనారికి చెందిన పాస్‌పోర్ట్ ను తిరిగి ఇవ్వడం ఈ మంచిదొంగ పీకకు చుట్టుకుంది. దేవదాసన్ సోనారీ మంగుళూరు ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుండగా బ్యాగ్ ను కొట్టేసిన మద్దాలి... తర్వాత అతని అడ్రస్ ట్రేస్ చేసి మరీ పాస్‌పోర్టును అందేలా చేశాడు. ''మేం మొత్తం ఐదుగురికి చెందిన విలువైన వస్తువులను మద్దాలి నుంచీ స్వాధీనం చేసుకున్నాం. అతని మరిన్ని దొంగతనాలకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నాం. నిందితుడికి తెలుగు, మలయాళం, తమిళ్, ఇంగ్లీష్, హిందీ భాషలతోపాటు మరాఠీ కూడా బాగా తెలుసు. అంతేకాదు అతడు బీఎస్సీ గ్రాడ్యుయేట్ కూడా.'' అని జీఆర్పీ పోలీస్ ఇనస్పెక్టర్ మానిక్ సాథీ తెలిపారు. గతంలో 24 ఏళ్ళ నైజీరియాకు చెందిన రుకో మిగా పాస్‌పోర్టును కూడ మద్దాలి తిరిగి ఇచ్చేశాడు. అతడు చెన్నై మెయిల్ ఎక్కుతుండగా అతగి బ్యాగ్‌ను ఓ ల్యాప్‌టాప్, ఏభై వేల రూపాయల క్యాష్తో పాటు తస్కరించాడు. అయితే ఆ తర్వాత అతడి నెంబర్ యూనివర్శిటీ ద్వారా వివరాలు తెలుసుకొని అతడికి పాస్‌పోర్ట్ చేరేలా చేశాడు. అయితే తరచుగా వస్తున్న ఫిర్యాదులపై దృష్టి సారించిన పోలీసులు మద్దాలిని పట్టుకునేందుకు వల పన్నారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో సన్ గ్లాస్లు, క్యాప్ పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గమనించారు. అయితే సీసీ కెమెరాలో క్యాప్, కళ్ళజోడు లేకపోవడంతో అతడు మద్దాలి అవునా కాదా అని కాస్త సంశయించారు. కాపు కాసి సివిల్ డ్రస్‌లో ఉన్న పోలీసులు ...ఓరోజు పధ్నాలుగో నెంబర్ ప్లాట్ ఫాం పైకి మంగుళూరు ఎక్స్ ప్రెస్ వచ్చిన వెంటనే ఒకరి నుంచి బ్యాగ్ ను కొట్టేందుకు ట్రై చేస్తున్న మద్దాలిని పట్టుకున్నారు. అయితే మద్దాలి బాధితులను బ్రెయిన్ వాష్ చేసిన తీరు మాత్రం పోలీసులకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. అతడు దొంగ అంటే నిజానికి బాధితులే నమ్మలేని పరిస్థితి కనిపించడంతో అతడి హస్త లాఘవ నైపుణ్యానికి విస్తుపోయిన పోలీసులు ఎట్టకేలకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవాడైన మద్దాలి ముంబైలోని టెక్స్టైల్ ఫ్యాక్టరీ లో పనిచేసేవాడు. 58 ఏళ్ళకు మద్దాలి రిటైర్ అయిన తర్వాత తాగుడుకు అలవాటు పడటంతో అతని భార్య కొడుకుతోపాటు అతడిని వదిలి వెళ్ళిపోయింది. చివరికి తాగేందుకు డబ్బులేక మద్దాలి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ముఖ్యంగా విదేశీయులను టార్గెట్ చేసే మద్దాలి... ముందుగా వారిని మాటల్లో పెట్టి, మంచి తనంతో నమ్మించి.. ఆ తర్వాత హెల్స్ చేస్తానంటూ వారు వాష్‌రూమ్ కు వెళ్ళిన సమయంలో లగేజీ జాగ్రత్తగా చూస్తానంటూ నమ్మించి ట్రైన్ నుంచి పరారయ్యే వాడు. ఇంగ్లీష్ భాషలో ఎంతో కమాండ్ ఉన్నమద్దాలి వారిని ఆ భాషతోనే చాకచక్యంగా బుట్టలో వేసుకొని వారి లగేజీనుంచీ ఓ బ్యాగ్ ను తీసుకొని పరుగు లంకించేవాడు. తాను కూడా ప్రయాణీకుడినంటూ మిగిలిన వారిని నమ్మించేందుకు.. మద్దాలి తన చేతిలో కూడా ఎప్పుడూ ఓ బ్యాగ్‌ను పట్టుకొని తిరిగేవాడు.