
హోమ్‌వర్క్ చేయలేదని..
* విద్యార్థిని చితకబాదిన టీచర్
* గాజులపల్లె స్కూల్లో ఘటన
గాజులపల్లె ఆర్‌ఎస్(మహానంది): హోమ్‌వర్క్ చేశాడు...పుస్తకాన్ని తేవడం మరిచిపోవడమే ఆ చిన్నారి చేసిన తప్పు. ఇందుకు ఆగ్రహించిన ఉపాధ్యాయుడు కర్రతో వీపుపై వాతలు పడేలా చితకబాదినఘటన మహానంది మండలం గాజులపల్లెలో చోటు చేసుకుంది. గాజులపల్లె ఆర్‌ఎస్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన మూడోతరగతి విద్యార్థి వేణు ఎప్పటిలాగే మంగళవారం పాఠశాలకు వెళ్లాడు. ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి హోమ్‌వర్క్ గురించి ప్రశ్నించగా పుస్తకం తేలేదని చెప్పడంతో బెత్తంతో వాతలు పడేలా మోదాడు. వీపుపై వాతలు చూసి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడుని నిలదీయగా ఆయన క్షమించాలని కోరడంతో వివాదం సద్దుమణిగింది.