Homework
-
సెల్ఫ్–లవ్
వెనకటికి ఒక ఈగ ఇల్లలుకుతూ ఇంటి పనుల్లో పడి పేరు మరచిపోయిందట. చాలామంది మహిళలు ఇంటిపనుల్లో తలమునకలైపోయి తమ ఇష్టాలను మరచిపోతుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ ఫల్గుణి గృహిణుల కోసం ఒక వీడియో చేసింది. ‘మహిళలు తమ భర్త, పిల్లల కోసం ఇష్టమైన వంటకాలను తయారుచేసే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాను. మరి మీ కోసం ఎప్పుడు తయారు చేస్తారు? మీ కుటుంబ సభ్యులకు నచ్చిన వంటకాల గురించి మాత్రమే కాదు మీకు నచ్చిన వాటి గురించి కూడా దృష్టి పెట్టండి’ అంటూ తనకు బాగా నచ్చిన వంటకాన్ని తయారుచేస్తున్న వీడియోను ఫల్గుణి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వైరల్ క్లిప్ 1.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ చూసి ఒక మహిళ ఇలా స్పందించింది... ‘నీకు ఇష్టమైనది చేసి పెడతాను. ఏంచేయమంటావు అని అడిగింది అమ్మ. వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. పెళ్లయిన తరువాత ఇంటిపనుల్లో పడి నాకు ఇష్టమైన వంటకం ఏమిటో కూడా మరిచిపోయాను. ఈ వీడియో చూసిన తరువాత సెల్ఫ్–లవ్ ్ర΄ాముఖ్యత గురించి రియలైజ్ అయ్యాను’ -
పిల్లలు హోంవర్క్ చేయకుండా మొండికేస్తున్నారా? ఇలా చేయండి
సాధారణంగా చాలామంది పిల్లలు ఆడుకోవడంలోనూ, ఫోన్లో వీడియోలు చూడటంలోనూ, వీడియో గేమ్‌లు లేదా ఆటలు ఆడుకోవడంలోనూ చూపినంత శ్రద్ధ చదువుకోవడంలో, హోంవర్క్ చేయడంలో చూపించరు. కొందరు సిసింద్రీలు మాత్రం హోం వర్క్ చేయడానికి మొండికేస్తుంటారు. అలాంటి గడుగ్గాయిలతో హోం వర్క్ చేయించడానికి తంటాలు పడలేక అదేదో మనమే చేసేస్తే పోలా... అనుకుని కొందరు పేరెంట్స్ పిల్లలకిచ్చిన హోమ్ వర్క్‌ను తామే చేసేస్తుంటారు. అయితే అది చాలా పొరపాటు. మీ చిన్నారి హోంవర్క్ చేయడానికి మొండికేస్తుంటే.. ఈ చిట్కాలు పాటించి చూడండి! పని వాతావరణాన్ని సృష్టించండి.. పిల్లల చదువులో హోంవర్క్ కీలకమైన అంశం. ఇది క్లాస్ రూమ్ అభ్యాసాన్ని బలోపేతం చేస్తుంది, అధ్యయన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది, బాధ్యతను అలవాటు చేస్తుంది. అందువల్ల మీ పిల్లల హోమ్‌వర్క్‌ను మీరు చేయొద్దు. దానిబదులు వాళ్లు హోంవర్క్ చేయడానికి తగిన వాతావరణాన్ని సృష్టించండి. వారికి అవసరమైన పెన్నులు, బుక్స్, పేపర్స్, రిఫరెన్స్ మెటీరియల్స్ వంటివాటిని అందుబాటులో ఉంచండి. అప్పుడు వారే హోమ్‌వర్క్ చేయడానికి ఇష్టపడతారు. దండించ వద్దు సాధారణంగా చాలామంది పేరెంట్స్ చేసే పని.. పిల్లలు హోంవర్క్ చేయనని మొండికేస్తే తిట్టడం లేదా కొట్టడం. ఇలా చేస్తే పిల్లలు దారికి రారు సరికదా, మరింత మొండిగా తయారవుతారు కాబట్టి వారిని తిట్టి లేదా నాలుగు దెబ్బలు వేసి బలవంతానా హోం వర్క్ చేయించడానికి బదులు ప్రేమగా మాట్లాడుతూనే ఇంటి పని పూర్తి చేసేలా చూడటం చాలా మేలు చేస్తుంది. అలవాటుగా మార్చేయండి! చాలామంది పిల్లలు హోం వర్క్ అనగానే ఆడుకున్న తరవాత చేస్తాం, తిన్న తర్వాత చేస్తాం, పొద్దున్నే లేచి పూర్తి చేస్తాం.. అంటూ రకరకాల సాకులు చెబుతుంటారు. హోమ్ వర్క్‌ను వాయిదా చేయకుండా.. రోజూ ఒకే పద్ధతి ఫాలో అయ్యేలా తయారు చేయడం మంచిది. కొందరు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయడానికి ఇష్టపడుతుంటారు, కొందరు ఆడుకున్న తర్వాత హోం వర్క్ చేయాలనుకుంటారు. మీ పిల్లలకు నచ్చిన సమయంలోనే వర్క్ చేసుకునేలా సెట్ చేయండి. రోజూ దీనినే అనుసరిస్తుంటే అదే అలవాటుగా మారిపోతుంది. తేలికవి ముందుగా... స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అవగానే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టి ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకోండి. ఆ మాటల్లోనే హోం వర్క్ ఏమిచ్చారో కనుక్కోండి. తేలిగ్గా లేదా తక్కువగా ఉన్న వర్క్‌ని ముందుగా చేసేయమని చెప్పండి. కాస్త ఎక్కువ టైమ్ తీసుకునే పనులను మెల్లగా చేయించండి. సాయం చేయండి కానీ... మీరు చేయద్దు! పిల్లలు హోం వర్క్ చేయకపోతే రేపు బడికెళ్లగానే టీచర్లు కొడతారని కొంతమంది తల్లులే చేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు హోం వర్క్ చేయడానికి ఆసక్తి చూపించరు. వాళ్లలో నేర్చుకునే శక్తి కూడా తగ్గుతుంది. వాళ్లకు సహాయం కావలిస్తే చేయాలి గానీ మీరు మాత్రం చేయవద్దు. ఏ రోజుది ఆ రోజే! హోమ్‌వర్క్ ఏమీ ఇవ్వకపోతే రీడింగ్ వర్క్ చేయించండి. ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుంటే కలిగే లాభాల గురించి తెలియజెప్పి ఎప్పటి పాఠం అప్పుడు చదువుకునేలా చేయండి. -
మదర్ పవర్ ఈజ్ డివైన్ పవర్!
పిల్లల చదువు, పెంపకంలో తల్లిపాత్ర కీలకమైనది. తల్లి దినచర్యలో పిల్లలతో హోంవర్క్ చేయించడం ఒక భాగం. అయితే అందరు తల్లులకు ఇది వీలవుతుందా? కాకపోయినా... తప్పదు కదా! అంటుంది ఈ తల్లి, రోడ్డు పక్కన బండిపై పండ్లు అమ్ముకునే ఒక మహిళ, బండి పక్కన నేలపై కూర్చొని పిల్లలతో ఓపిగ్గా హోం వర్క్ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఈ వీడియోకు కాప్షన్ ఇవ్వడానికి పదాలు రావడం లేదు’ అని రాస్తూ ఝార్ఖండ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఈ రోజు పడే కష్టమే రేపటి విజయం’ అని నెటిజనాలు ఆ తల్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘మదర్ పవర్ ఈజ్ డివైన్ పవర్’ అని ఒకరు రాశారు. -
అరే..! హై స్కూల్ స్టుడెంట్.. ప్రముఖ రచయిత్రిని అడగకూడందే అడిగారే..!
సోషల్ మీడియా వేదికగా సామాన్యులు కూడా బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఈ క్రమంలో ఎదురయ్యే సంభాషణలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ రచయిత్రి ప్రీతి షెనాయ్ని ఓ విద్యార్థి వింతైన సహాయం చేయమని కోరాడు. ఇది చూస్తే.. ఈ రోజుల్లో పిల్లలే ఇంత.. చాలా క్రేజీ.. అని అనుకోకుండా ఉండలేరు. పదో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రీతిని హోం వర్క్ చేసిపెట్టమని సహాయం కోరారు. కాంపిటీషన్లో భాగంగా స్కూల్లో పది లైన్ల పద్యం రాసుకురమ్మన్నారట టీచర్. ఏదీ గుర్తుకు రావడం లేదట. దీంతో ఏకంగా ప్రముఖ రచయిత్రి ప్రీతిని అడిగారు. రచయిత్రి కాదా..! బాగా రాస్తుందనుకున్నారో ఏమో మరి..! అయితే.. స్టుడెంట్ అడిగిన సహాయాన్ని ప్రీతి సున్నితంగా తిరస్కరించారు. స్టుడెంట్ అడిగిన సహాయాన్ని ప్రీతి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అది కాస్త.. నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ పోస్టుపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. అది హోం వర్క్ కాదు.. కాంపిటీషన్.. ఏకంగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామనే ప్లాన్ చేశారా స్టుడెంట్ అంటూ స్పందించారు. 10వ తరగతి విద్యార్థి అంటే ఇంకా చిన్నపిల్లలేం కాదు.. తిరస్కరించినందుకు ధన్యవాదాలు అంటూ మరికొందరు కామెంట్ చేశారు. చాట్ జీపీటీని అడుగొచ్చు కదా..! ఇలా అడగడం ఎందుకు? అని మరికొందరు ఫన్నీగా సలహాలు ఇచ్చారు. And look at this message I received just now ! A kid wants me to do their homework for them! 🤷🏻♀️🤷🏻♀️🤷🏻♀️ pic.twitter.com/T6yv6dE8N4 — Preeti Shenoy (@preetishenoy) June 29, 2023 ఇదీ చదవండి: బీచ్ రోడ్లో 'బిగ్ బీ' పాటకు వృద్ధ జంట స్టెప్స్.. ఆనంద్ మహేంద్ర ట్వీట్.. వీడియో వైరల్.. -
హోంవర్క్ చేయలేదని కుమారుడిని ఫ్యాన్ కు వేలాడదీసి, ఆపై
జైపూర్: స్కూల్లో ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయలేదని కన్న కొడుకుని సీలింగ్ ఫ్యాన్ కు తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురిచేశాడు ఓ కసాయి తండ్రి. ఘటన ఈనెల 17న రాజస్థాన్ రాష్ట్రం బుంది జిల్లాలోని డాబిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త అరాచకాన్ని రికార్డు చేసిన భార్య... జోగ్నియమతలో ఉన్న తన అన్న చంద్రబాన్ కు చూపించడంతో ఆయన చైల్డ్ లైన్‌కు ఫిర్యాదు చేశారు. కర్కశ తండ్రి.. హోం వర్క్ చేయలేదని కోపంతో ఊగిపోయిన కసాయి తండ్రి ప్రజాప్త్ (37) ఎనిమిదేళ్ల కొడుకును చితకబాదాడు. అనంతరం కాళ్లు, చేతులు కట్టేసి సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీశాడు. అక్కడితో ఆగకుండా కర్రతో మళ్లీ చితకబాదేందుకు యత్నించగా... భార్య అతన్ని అడ్డుకుంది. ప్రాధేయపడినా.. తండ్రి తనను ఫ్యాన్ కు వేలాడదీస్తుండగా విడిచిపెట్టాలని ఆ బాలుడు పదేపదే ప్రాధేయపడ్డాడు. అయినా ఆయన కనికరించలేదు. ఇక తన భర్త అరాచకాన్ని ఎలాగైనా బయటపెట్టాలకున్న ఆ ఇల్లాలు.. పిల్లాడిని ఫ్యాన్ కు వేలాడదీస్తుండగా సాయం చేస్తున్నట్లుగా నటించింది. ఆమె ఫోన్ ను కిటికి దగ్గరగా ఉంచి ఈ బాగోతాన్ని రికార్డ్ చేసింది. దీంతో ఈ ఘటన బయటకొచ్చింది. బాలుడితో పాటు ఐదేళ్ల కూతురిని సైతం తన బావ పదేపదే కొడుతుంటాడని చంద్రబాన్ పోలీసులకు తెలిపారు. అయితే తన భర్తపై కేసు పెడితే అతని ఆగడాలు మరింత ఎక్కువ అవుతాయని చంద్రబాన్ సోదరి భయపడుతోంది. దీంతో విషయం గ్రహించిన రాష్ట్ర చైల్డ్ లైఫ్ అధికారి బుంది జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ వివరాలను మూడు రోజుల్లో తెలపాలని సూచించారు. -
హోమ్‌వర్క్ చెయ్యండి .. మాస్టారు!
‘‘మేము ఉద్యోగం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, సక్రమంగా పన్నులు కట్టి రిటర్నులు వేస్తున్నాం, మాకు ఇంకా హోమ్‌వర్క్ ఏమిటండీ’’ అని తీసిపారేయకండి. నిజంగా నూటికి నూరు పాళ్లు స్వయంగా హోమ్‌వర్క్ చేసి మీ పన్నుభారాన్ని మీరే లెక్కించుకోండి. ఎవరితోనూ పోల్చుకోవద్దు. పోటీ పడొద్దు. మీ యజమాని లెక్కించిన పన్నుభారాన్ని కూడా నమ్మవద్దు. 2021 మార్చి 31తో పూర్తయ్యే సంవత్సరం ప్రతి అసెస్సీ రెండు విధానాలుగా, రకాలుగా పన్నుభారాన్ని లెక్కించుకోవచ్చు. పాత పద్ధతి ప్రకారం అ న్ని మినహాయింపులు పరిగణిస్తూ పాత శ్లాబుల ప్ర కారం, పాత రేట్ల ప్రకారం పన్నుభారం లెక్కించ డం ఒక విధానం. ఇక రెండోది, కొత్తది సెక్షన్ 115 BAC ప్రకారం ఎటువంటి మినహాయింపులు, తగ్గింపులు తీసుకోకుండా కొత్త శ్లాబుల ప్రకారం కొత్త రేట్ల ప్ర కారం పన్నుభారం లెక్కించాలి. 115 BAC ప్రకారం .. కొత్త పద్ధతిలో 60 సంవత్సరాలు లోపు ఉన్నా, 60–80 ఏళ్ల సీనియర్ అయినా, 80 దాటిన సూపర్ సీనియర్ అయినా ఇవే రేట్లు. ఈ నేపథ్యంలో ఒక కేసు చూద్దాం. 80 సంవత్సరాలు దాటి పెన్షన్ పొందుతున్న శర్మగారు యజమానికి ఏమీ చెప్పకపోవడం వల్ల పాత పద్ధతిలో పన్ను కోశారు. వారి పెన్షను రూ. 11,20,000 కాగా స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 తీసివేసి, పాత రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 1,25,840గా ఉంటుంది. కానీ కొత్త రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 1,02,960గా ఉంటుంది. శర్మగారికి వారి యజమాని రూ. 22,880 ఎక్కువగా కోశారు. ఫారం 16,ఫారం 26 అ లో ఉన్న సమాచారం కూ డా చెక్ చేసుకోండి. శర్మగారు కొత్త పద్ధతి ప్రకారం వేసుకుంటే రూ. 22,880 రిఫండు వస్తుంది. ఒక ప్రభుత్వ సంస్థ ఉద్యోగి ఫారం 26 అ లో రూ. 55 కోట్ల జీఎస్టీ టర్నోవరు పడింది. నిజానికి ఆ ఉద్యోగికి ఎటువంటి వ్యాపారం లేదు. కానీ ఆయన పాన్ నంబరును ఒక సంస్థ వారు తస్కరించి, వాడుకోవడం వల్ల ఇలా జరిగింది. మరో ఉద్యోగి రావుగారు రిటైర్ అయ్యారు. వయస్సు 70 ఏళ్లు. పెన్షన్ రూ. 3,00,000, ఇంటి మీద ఆదాయం (నికరంగా) రూ. 3,20,000, 80సి సేవింగ్స్ రూ. 1,50,000, 80డి కింద రూ. 30,000, వృత్తి పన్ను రూ. 2,400 కాగా వీరికి టీడీఎస్ రూ. 12,000 అనుకుందాం. పాత పద్ధతి ప్రకారం నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంది కావున పన్నుభారం లేదు. టీడీఎస్ మొత్తం రిఫండు వస్తుంది. కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే మొత్తం పన్నుభారం రూ. 25,480, టీడీఎస్ పోను అదనంగా కట్టాలి. అంటే వీరికి పాత పద్ధతే బెస్ట్. మీ కేసు, మీ కేసే! శర్మగారితో, రావుగారితో పక్కింటి పరంధామయ్యగారితో, వెనకింటి వెంకట్రావుగారితో పోలిక లేదు. నికర ఆదాయం రూ. 5,00,000 లోపల పాత పద్ధతి ప్రకారం పైసా కూడా పన్ను అవసరం లేదు. కొత్త పద్ధతి అనుసరిస్తే నికర ఆదాయం రూ. 2,50,000 వరకూ పన్ను లేదు. పాత పద్ధతిలో అన్ని మినహాయింపులు పొందవచ్చు. కొత్త పద్ధతిలో సర్వసంగపరిత్యాగిలాగా ఏ మినహాయింపు, తగ్గింపు, ప్రయోజనం పొందడానికి ఉండదు. అందుకే కాస్త ఓపికగా హోమ్‌వర్క్ చేసి పన్నుభారాన్ని లెక్కించండి. ఎంపిక చేసుకున్నప్పుడు ఏ తప్పులూ చేయకుండా అంకెలు వేసుకోండి. ఎంపిక చేసుకోండి. ఈ లోపలే స్టేట్మెంట్లు రెండు పద్ధతుల్లోనూ చేసుకుని రెడీగా ఉంచుకుని, కావాల్సినది ఎంచుకోండి. -
పిల్లాడి హోంవర్క్.. సామ్సంగ్ బంపరాఫర్
పాఠశాలల్లో టీచర్లు ఇచ్చే హోంవర్కులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఓ పాఠశాలలో విద్యార్థులకు టీచర్ ఇచ్చిన హోంవర్క్ ఓ పిల్లాడికి ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ హోంవర్క్ పూర్తి చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి. అయితే ఐదో తరగతి చదువుతున్న గులిహర్మే అనే పదేళ్ల పిల్లవాడి ఇంట్లో ఇంటర్నెట్ లేకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. హోంవర్క్ చేయకపోతే టీచర్ ఊరుకోదు.. అలా అని హోంవర్క్ చేయడానికి ఇంటర్నెట్ లేదు. దీంతో వెంటనే దగ్గర్లోని సామ్సంగ్ స్టోర్‌కు వెళ్లాడు. అతని అవసరాన్ని గుర్తించిన సామ్సంగ్ సిబ్బంది ఓ ట్యాబ్లొ ఇంటర్నెట్ ఆన్ చేసి ఇచ్చారు. దీంతో ఆ బాలుడు అక్కడే భుజానికి స్కూల్ బ్యాగుతోనే నోట్స్ రాసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 12 మిలియన్ల మందికి పైగా వీక్షించగా 4లక్షలకు పైగా లైకులు వచ్చిపడ్డాయి. అయితే ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ‘హోంవర్క్ చేయమని చెప్తే సరిపోతుందా? పిల్లల దగ్గర అందుకవసరమైన కంప్యూటర్లు లేనప్పుడు పాఠశాలలో ఉండే కంప్యూటర్లు వినియోగించుకునే వెసులుబాటు ఇవ్వాలి, అందుకోసం వారికి కాస్త సమయం కేటాయించాల’ని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరోవైపు పిల్లవాడి క్లాస్‌వర్క్ పూర్తి చేయడానికి సహకరించిన సామ్సంగ్ సిబ్బందికి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ పిల్లవాడి అవసరాన్ని గుర్తించిన సామ్సంగ్ నిర్వాహకులు అతనికి మూడు ట్యాబ్‌లు బహుమతిగా అందజేశారు. -
టీచర్‌కు బుడతడు రాసిన లేఖ వైరల్
కాలిఫోర్నియా : ఎందుకు హోం వర్క్ చేయలేదని టీచర్ దబాయిస్తే జ్వరమొచ్చిందనో లేక ఏదో ఒక సాకుతో కవర్ చేసే చిన్నారులను తరచూ చూస్తుంటాము. అయితే ఓ బుడతడు మాత్రం ఏమాత్రం బెరుకులేకుండా తన టీచర్‌కు ఎందుకు హోం వర్క్ చేయలేదో వివరిస్తూ రాసిన ఓ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లిదియా అనే ఓ యువతి తన కజిన్ కుమారుడు ఎడ్వర్డ్ ఇమ్మాన్యుయేల్ కార్టెజ్ తన టీచర్‌కు రాసిన లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తన కజిన్‌కి ఎడ్వర్డ్ టీచర్ ఈమెయిల్ ద్వారా లేఖను పంపారని పేర్కొంది. కనీసం వెయ్యిమంది కూడా ఫాలోవర్లులేని అమె ట్వీట్‌కు దాదాపు లక్ష రీట్వీట్లు, మూడు లక్షల యాభై వేల లైకులు వచ్చాయి. కాలిఫోర్నియాలో ఎడ్వర్డ్ ఇమ్మాన్యుయేల్ కార్టెజ్ వీకెండ్లో తన టీచర్ ఇచ్చిన హోం వర్క్‌ను చేయలేదు. మరుసటి రోజు స్కూలుకు వెళ్లిన అతనికి హోం వర్క్ ఎందుకు చేయలేదో చెప్పాలంటూ టీచర్ నుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది. మాట్లాడకుండా నిలుచున్న అతనికి ఓ తెల్లకాగితం ఇచ్చి ఎందుకు హోం వర్క్ చేయలేదో రాసివ్వాలంటూ ఆ టీచర్ ఆదేశించింది. దానికి ఆ విద్యార్థి .. నేను హోంవర్క్ ఎందుకు చేయలేదంటే, వీకెండ్లో స్కూల్ వర్క్‌ని ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు. వీకెండ్ ఉండేది స్ట్రెస్లేకుండా స్నేహితులతో ఆడుకుని ఎంజాయ్ చేయడానికి, టీవీ చూడడానికి, గేమ్స్ ఆడుకోవడానికి. నాకు ఏది సంతోషంగా అనిపిస్తే అదే చేస్తా అంటూ ఎలాంటి బెరుకు లేకుండా తనకు తోచింది రాశాడు. హోంవర్క్ అనేది ఉపయోగం లేదు కాబట్టి, స్టూడెంట్ వర్సెస్ హోంవర్క్ కేసులో ఎడ్వర్డ్ ఇమ్మాన్యుయేల్ కార్టెజ్ వాదనకు కోర్టు మద్దతుగా నిలిచింది. ఇక కేసు క్లోజ్ అయింది అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఆ బుడతడు ఇచ్చిన సమాధానం చూసి ఆ టీచర్ షాక్ అయితే, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతడి వాదన చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. So my cousin and his wife got an email from their sons teacher. He didn’t do his hw so she asked him to write a paper saying why he didn’t do his hw and this is what she got...😂🤦🏼♀️ pic.twitter.com/2eDh2IgB9X — Lydia (@_Lyddz) February 14, 2019 -
కేటీఆర్ ఫన్నీ ట్వీట్.. వైరల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. టెక్నాలజీని వాడుకుంటూ ప్రతీ అంశంపై ఎప్పటికప్పడు స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ చిన్నారి హోంవర్క్ సంబంధించిన ఓ పత్రాన్ని షేర్ చేస్తూ కేటీఆర్ ఓ ఫన్నీ ట్వీట్ చేశారు. ‘జీవితంలో షార్ట్‌కట్స్ లేవని ఎవరన్నారు?. ఈ చిన్నారి ఎంత స్మార్ట్... చిన్నారితో పాటు ఆ టీచర్ కూడా అంతే స్మార్ట్.’ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ నవ్వులు పూయిస్తోంది. ఓ చిన్నారికి తన హోంవర్క్ సంబంధించి ఆకలితో ఉన్న పిల్లి ఏ మార్గం గుండా వెళ్లి పాలు తాగుతుందో దారి చూపించండి అని ఓ ఫజిల్ అడిగారు. దానికి చిన్నారి ఫజిల్ లోపల ఎలా వెళ్లాలనేదాని గురించి ఆలోచించకుండా, పిల్లి నుంచి పాలకు షార్ట్‌కట్‌గా గీత గీసి ఫజిల్ పూర్తి చేసింది. విద్యార్థి జవాబుకి టీచర్ కూడా రైట్ మార్కు వేసి.. స్టార్ సింబల్ కూడా ఇచ్చారు. అందుకే ఈ చిన్నారి తెలివితేటలకు ఫిదా అయిన కేటీఆర్ ట్వీటర్ ద్వారా ఆ విషయాన్ని పంచుకున్నారు. ఇపుడా ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. Who said there are no shortcuts in life? Gotta love this smart kid 😀 and the teacher is equally smart it appears 😀 pic.twitter.com/tjNBt7gnDa — KTR (@KTRTRS) June 21, 2018 -
హోమ్ వర్క్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..
-
నడుస్తున్న కారుపై హోమ్‌వర్క్, వీడియో వైరల్
హెనాన్ ప్రావినెన్స్ : ముందు రోజు క్లాస్ టీచర్ ఇచ్చిన హోమ్‌వర్క్ చేయడం మర్చిపోతే ఏం చేస్తాం.. అమ్మ బ్రేక్‌ఫాస్ట్ తినిపించే సమయంలోనో.. లేదా ఏదైనా క్లాస్ ఖాళీగా ఉన్న సమయంలోనైనా చకాచక ముగించేస్తాం. కానీ చైనాలో ఓ అమ్మాయి అయితే తన హోమ్ వర్క్ ముగించడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. నడుస్తున్న ట్యాక్సీలో నుంచి బయటికి కూర్చుని, కారు టాప్‌ను డెస్క్‌గా మార్చుకుని తన హోమ్‌వర్క్ ముగించేయాలని చూసింది. డ్రైవర్ సీట్లో కూర్చుని ట్యాక్సీ నడుపుతున్న ఆ అమ్మాయి తండ్రి తన స్నేహితుడితో మాట్లాడుతూ ఆ విషయాన్ని గమనించలేదు. పక్కనే వెళ్తున్న వారు, దాన్ని వీడియోగా తీసి సీజీటీఎన్ షోల్లో యూట్యూబ్‌లో పెట్టారు. ఆ బిజీ రోడ్డులో హోమ్‌వర్క్ కోసం ఆ అమ్మాయి చేసిన వింత సాహసాన్ని వివరించారు. తన కూతురి కారులో నుంచి బయటికి కూర్చుని అలా హోమ్‌వర్క్ చేయడం గమనించిన ఆమె తండ్రి వెంటనే అలర్ట్ అయి, కిందకి రప్పించాడు. ఆమె వెనుకాల విండో సీటులో కూర్చుని ఉందని, తాను అది గమనించకపోవడం నిజంగా తన నిర్లక్ష్యమేనని డ్రైవర్, అమ్మాయి తండ్రి ఛెంగ్ చెప్పారు. మరోసారి అలా చేయొద్దని తన కూతురికి వార్నింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నాడు. అయితే నిర్లక్ష్యపూరిత వైఖరితో ఆ విషయం గమనించకపోవడంతో, అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయింది. మరోసారి అతన్ని ట్యాక్సీలు నడుపుకుండా చర్యలు తీసుకున్నట్టు చైనా పేపర్ రిపోర్టు చేసింది. ఈ సంఘటన గత వారం సెంట్రల్ చైనా హెనాన్ ప్రావినెన్స్‌లోని షాంగ్క్యు లో చోటు చేసుకుంది. -
హోంవర్క్ చేయలేదని..
నెక్కొండ: హోంవర్క్ చేయలేదని ఓ చిన్నారిని పాఠశాల కరస్పాండెంట్ చితకబాదిన సంఘటన వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది. నెక్కొండ మండల కేంద్రంలోని స్నేహ ప్రగతి స్కూల్లో యూకేజీ చదువుతున్న బానోతు సిద్ధును పాఠశాల కరస్పాండెంట్ కోడూరి అశోక్ కుమార్ తీవ్రంగా దండించాడు. శనివారం పాఠశాలకు వచ్చిన చిన్నారి హోంవర్క్ చేయకపోవడంతో.. ఆగ్రహించిన అశోక్ కుమార్ తీవ్రంగా కొట్టాడు. జరిగిన విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆగ్రహించిన వారు పాఠశాల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తరగతి గదిలో దారుణాతి దారుణంగా!
గోండా: హోమ్‌వర్క్ చేయలేదన్న చిన్నకారణంతో టీచర్ రాక్షసుడిగా మారిపోయాడు. ఒళ్లు తెలియని కోపంలో పదేళ్ల పిల్లాడిని దారుణాతి దారుణంగా చితకబాదాడు. నేలకేసి కొట్టి, తన్ని, ఎడాపెడా చెంపలు వాయించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ తరగతి గదిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. యూపీ గోండా జిల్లాలోని ఏఐఎంఎస్ ఇంటర్నేషనల్ సెంకడరీ స్కూల్లో జరిగిన ఈ ఘటన తాలుకు సీసీటీవీ వీడియో తాజాగా వెలుగుచూసింది. హోమ్‌వర్క్ చేయలేదన్న కారణంతో పదేళ్ల పిల్లాడిపై తరగతిలో విద్యార్థులందరి ముందు వీరంగం వేశాడు ఓ టీచర్. పిల్లాడిని కనికరం లేకుండా అతను బాదుతూ ఉంటే తరగతి గదిలో ఉన్న పిల్లలందరూ అది చూసి షాక్ తిన్నారు. రాక్షసుడిలా ప్రవర్తించిన అతడికి దూరం జరిగారు. ఇలా దారుణంగా ప్రవర్తించిన టీచర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
హోంవర్కు చేయలేదని.. బెల్టుతో కొట్టారు!
ఇచ్చిన హోం వర్కు చేయలేదని.. రెండో తరగతి చదివే చిన్నారిని బెల్టుతో వీపుమీద తోలు ఊడేలా కొట్టాడో టీచర్. ఈ దారుణం బెంగళూరు శివార్లలోని నేలమంగళ ప్రాంతంలో గల సెయింట్ జోసెఫ్ స్కూల్లో జరిగింది. ఏడేళ్ల ఆ చిన్నారి గత ఏడాది కాలం నుంచి ఆ టీచర్ వద్ద ట్యూషన్ చెప్పించుకుంటోంది. మంగళవారం నాడు ఆమె క్లాసుకు వెళ్లినప్పుడు.. ముందురోజు ఇచ్చిన హోం వర్కు చేయలేదని, తాను ధరించిన తోలుబెల్టు తీసుకుని ఆమెను విచక్షణా రహితంగా కొట్టాడు. ఆమె ఏడుస్తూ ఇంటికి వెళ్లే సరికి తల్లిదండ్రులు ఏం జరిగిందని అడిగారు. టీచర్ కొట్టారని చెప్పగా చూస్తే.. ఆమె వీపు నిండా వాతలు తేలి ఉన్నాయి. చర్మం లేచిపోయింది. దాంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 15 ఏళ్లుగా ట్యూషన్లు చెబుతున్న సదరు టీచర్‌ను పోలీసులు ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది. -
అన్నీ.. అమ్మే
పిల్లల చదువుల వెనక తల్లి శ్రమే ఎక్కువ ఆలనాపాలనలో అగ్రభాగం హోం వర్క్‌లో పూర్తి భాగస్వామ్యం సదాశివపేట రూరల్: పిల్లలు బడికి వెళ్లి ఇంటికి వచ్చే సరికి అలసిపోవడం, కొద్దిసేపు ఆడకుంటామని బయటికి వెళ్తుంటారు. సాయంత్రం అయ్యిందంటే చాలు తల్లులు తమ ఇంటి పనులు త్వరగా ముగించుకొని పిల్లలను ముందు కూర్చోబెట్టుకొని హోం వర్క్ చేయిస్తారు. ఈ రోజుల్లో కనీసం ఇంటర్మీడియెట్, డిగ్రీ వరకు చదువుకున్న వారు అమ్మలే ఉండడంతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న తమ పిల్లలను ట్యూషన్లకు పంపించకుండా ఇంటి దగ్గరే కూర్చుని హోం వర్క్ చేయిస్తున్నారు. చిన్న తనంలో తమ పిల్లలు హోం వర్క్ చేయడానికి కూడా సతాయిస్తున్నా సముదాయిస్తూ వారి చేయి పట్టుకొని హోం వర్క్ పూర్తయ్యేలా చూస్తారు. కొందరు పిల్లలు హోం వర్క్ పూర్తి చేసేందుకు అపసోపాలు పడి పూర్తవ్వగానే పుస్తకాలు, నోటు పుస్తకాలను చెల్లాచెదరుగా అలాగే వదిలేసి ఆడుకొనేందుకు బయటకు పరిగెత్తుతారు. వాటన్నింటినీ సరిచేసి బ్యాగుల్లో పెట్టడం కూడా తల్లుల వంతే. ఇక పిల్లలు ప్రాథమిక, ఉన్నత స్థాయిల్లో చదువుతుంటే వారిని ట్యూషన్లకు పంపించడం, అక్కడి నుంచి రాగానే ఏమేమి చెప్పారని అడగడం, హోం వర్క్ పూర్తి చేశావా...? అని ఆరా తీయడం, మార్కెట్లో లభించే వివిధ కంపెనీల శక్తినిచ్చే పౌడర్లను పాలల్లో కలిపి తాగించడం ఒక్కటేమిటి వారిని నిద్రపుచ్చే వరకూ ప్రతి చిన్న పనికి పిల్లలు తల్లుల పైనే ఆధారపడతారు. పిల్లల దుస్తులు శుభ్రం చేయడం దగ్గర నుంచి ఐరన్ చేసి మరీ పరిశుభ్రంగా కనిపించేలా చూడడం వరకు తల్లులు మరింత జాగ్రత్త తీసకుంటారు. అంతేకాదు పిల్లలకు ర్యాంకులు వస్తే ముందుగా మురిసిపోయేది తల్లులే. పిల్లల చదువుల్లో తల్లుల పాత్ర కూడా పెరగడంతో ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయిలో కూడా తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా తప్పకుండా దరఖాస్తు ఫారాల్లో రాయాల్సిందిగా నిబంధనలు పెట్టారు. కొన్ని పాఠశాలల్లో తల్లుల పేర్లు, ఫోన్ నంబర్లను కూడా తీసుకుంటున్నారు. జన్మనిచ్చే మాతృమూర్తే ప్రథమ గురువు అని చెప్పడమే కాదు, అక్షర సత్యం కూడా... చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలోనే తమ పిల్లలకు తమ చుట్టాలు, ఇరుగు పొరుగు వారిని ఏ వరుసలు పెట్టి పిలవాలో నేర్పించేది తల్లే. పిల్లలకు ముందుగా వచ్చీరాని మాటల దగ్గర నుంచి మొదలుకొని సంస్కారవంతమైన చక్కటి అలవాట్లను నేర్పించడంలో తల్లి పాత్ర కీలకమైంది. ఇక నేటి కంప్యూటర్ యుగంలో మూడేళ్ల వయసు వచ్చిందంటే చాలు పిల్లల్నీ ప్లే స్కూల్ అని, ఇతర ఆటలు ఆడించే పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అక్కడ్నుంచి ప్రారంభమవుతుంది పిల్లల చదువే కాదు... తల్లుల చదువు కూడా. సాధారణంగా చిన్నారులకు పాఠశాలలు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతాయి. అంటే వారిని కనీసం 8 గంటలకు తయారుచేసి సిద్ధంగా ఉంచాలి. అందుకు తల్లులు తెల్లవారు జామున మేల్కొనడంతో ప్రారంభమయ్యే ఇంటి పనులు త్వరగా పూర్తి చేసుకొని తమ పిల్లలకు నీళ్లు వేడి చేయడం దగ్గర నుంచి స్నానాలు చేయించడం, దుస్తులు వేయడం, టై, బెల్టు పెట్టడంతో పాటు పలక, బలపం, కొద్దిగా ప్రాథమిక స్థాయిలో అన్ని పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు బ్యాగులో ఉన్నాయా.. లేవా... పెన్సిల్, రబ్బర్లన్నింటినీ ఒక సారి సరిచూసి బ్యాగు సిద్ధం చేయడం వరకూ అన్నీ వారి వంతే. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచీ పిల్లలు బడికి వెళ్లే వరకూ కనీసం పది నిమిషాలు కూర్చోవడానికి కూడా సమయం లేకుండా పని చేయడం తల్లులకు తప్పని పరిస్థితి. సుఖసంతోషాలతో ఉండాలనే తపన మేం ఏం చేసినా మా పిల్లల గురించే. సమాజంలో ఆత్మగౌరవడంతో ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరిక. మా పిల్లల ముఖాల్లో కనబడే చిరునవ్వు ముందు బాధలు, కష్టాలన్నీ బలాదూరే. మా జీవితాల్లా కాకుండా మా కన్నా మంచి జీవితాలను గడపాలన్నదే మా తపన. వారి సంతోషమే మా సంతోషం. – మంజూదేవి, ఓ చిన్నారి తల్లి పిల్లల భవిష్యత్తే ముఖ్యం మా పిల్లలు మా లాగా కాకుండా వారి భవిష్యత్తు బాగుండాలి. భవిష్యత్తులో వారి ఉన్నత స్థానంలో చూడాలనే తపన, ప్రేరణ ఉంటుంది. వారు ఎంత ఇబ్బంది పెట్టినా... మారాం చేసినా కోపం రాదు. పిల్లల ఆనందమే మా ఆనందం. మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదనే తాపత్రయం. పిల్లలను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేం. – బి. శోభారాణి, ఓ చిన్నారి తల్లి -
హోమ్‌వర్క్ చేయలేదని..
* విద్యార్థిని చితకబాదిన టీచర్ * గాజులపల్లె స్కూల్లో ఘటన గాజులపల్లె ఆర్ఎస్(మహానంది): హోమ్‌వర్క్ చేశాడు...పుస్తకాన్ని తేవడం మరిచిపోవడమే ఆ చిన్నారి చేసిన తప్పు. ఇందుకు ఆగ్రహించిన ఉపాధ్యాయుడు కర్రతో వీపుపై వాతలు పడేలా చితకబాదినఘటన మహానంది మండలం గాజులపల్లెలో చోటు చేసుకుంది. గాజులపల్లె ఆర్ఎస్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన మూడోతరగతి విద్యార్థి వేణు ఎప్పటిలాగే మంగళవారం పాఠశాలకు వెళ్లాడు. ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి హోమ్‌వర్క్ గురించి ప్రశ్నించగా పుస్తకం తేలేదని చెప్పడంతో బెత్తంతో వాతలు పడేలా మోదాడు. వీపుపై వాతలు చూసి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడుని నిలదీయగా ఆయన క్షమించాలని కోరడంతో వివాదం సద్దుమణిగింది. -
హోం వర్క్ చేయలేదని బట్టలు విప్పించింది
ఓ విద్యార్థికి బట్టలు ఊడదీయించి పూర్తి నగ్నంగా నిలబెట్టారు. మరో అబ్బాయి లోదుస్తులు లేకుండా చొక్కాలు విప్పిన షర్ట్‌పై అతని పక్కనే కనిపించాడు. వీరిద్దరినీ స్కూల్లోకి రానివ్వకుండా డోర్ ముందు నిలబెట్టారు. ఎవరైనా అటుగా వెళితే ఈ అబ్బాయిలు ఇద్దరూ సిగ్గుతో మొహం కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకున్నారు. ఇంతకీ వీరు చేసిన నేరం ఏంటో తెలుసా? హోం వర్క్ చేయకపోవడమే. ఇంత చిన్న తప్పుకు స్కూల్ టీచర్ వారిపట్ల పైశాచికంగా ప్రవర్తించింది. ముంబై శివారు ప్రాంతం మలడ్‌లోని కోచింగ్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. ఎన్జీవోకు చెందని ఓ సభ్యుడు ఈ ఘటనను వీడియో తీయడంతో పెద్ద దుమారం రేగింది. విద్యార్థులకు శిక్ష వేసిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు వయసు 8, 9 ఏళ్లు. వీళ్లను నగ్నంగా నిలబెట్టిన టీచర్ సరోజా నాయర్, కోచింగ్ సెంటర్ యజమాని గణేశ్ నాయర్‌పై కేసు నమోదు చేశారు. వీరిద్దరూ బంధువులు అవుతారు. కాగా పోలీసులు వీరిని ఇంకా అరెస్ట్ చేయలేదు. పిల్లలను అరగంట పాటు స్కూల్ బయట నిలబెట్టారని, తాము వెళ్లే సరికి వారు ఏడుస్తూ ఉన్నారని ఎన్జీవో ప్రతినిధులు చెప్పారు. -
హోంవర్క్ చేయలేదని చితకబాదాడు...
మీర్‌పేట: హోంవర్క్ చేయాలేదని విద్యార్థిని ఉపాధ్యాయుడు వాతలు తేలేలా చితకబాదాడు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగార్జున మాంటిస్సోరి ఉన్నత పాఠశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాలు... నాగార్జున పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న సాత్విక్ తెలుగు సబ్జెక్టు హోంవర్క్ చేయకుండా పాఠశాలకు వెళ్లాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అతడిని వాతలు తేలేలా కొట్టాడు. 50 శాతం ఫీజు మాఫీ? సాత్విక్‌ను గొడ్డును బాదినట్టు బాదిన ఉపాధ్యాయుడితో పాటు పాఠశాలపైన ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు మీర్‌పేట ఠాణాకు వెళ్లారు. విషయం తెలిసి పాఠశాల యాజమాన్యం వెంటనే రంగ ప్రవేశం చేసింది. బాధిత విద్యార్థి పాఠశాలకు చెల్లించాల్సిన ఫీజులో 50 శాతం మాఫీ చేస్తామని, కేసు పెట్టవద్దని వేడుకుంది. అంతేకాకుండా ఈ మేరకు హామీ పత్రం కూడా రాసి ఇవ్వడంతో విద్యార్థి తల్లిదండ్రులు కేసు ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. కేసు నమోదు కాలేదు: సీఐ విద్యార్థిని ఉపాధ్యాయుడు దండించినట్టు తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకొచ్చారని, అయితే.. రాత పూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని మీర్‌పేట సీఐ వెంకట్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. టీచర్‌ను అరెస్ట్ చేయాలి సిటీబ్యూరో: నాగార్జున మాంటిస్సోరి స్కూల్లో విద్యార్థిని చితకబాదిన టీచర్‌ను అరెస్ట్ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. పాఠశాలల్లో రోజురోజుకూ చిన్నారులకు రక్షణ కరువవుతోందని ఆ సంఘం అధ్యక్షురాలు అనురాధారావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తించే స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
చిన్నవాడి పెద్ద మనసు
ఆదర్శం బడి అయిపోయిన తరువాత ఆరో క్లాసు పిల్లాడు ఏం చేస్తాడు? కాసేపు హోమ్‌వర్క్ చేస్తాడు. కాసేపు స్నేహితులతో ఆడుకుంటాడు. కాసేపు వీడియోగేమ్స్ ఆడుకుంటాడు. అంతేగా! కానీ లక్నోకు చెందిన పదకొండేళ్ల ఆనంద్ కృష్ణ మిశ్రా అలా కాదు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మురికి వాడల్లోకి వెళ్లి పిల్లలకు పాఠాలు బోధిస్తాడు. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా పిల్లలకు పాఠాలు చెప్పడంతోనే రోజంతా గడుపుతాడు. అందుకే ఆనంద్‌ని అందరూ ‘చోటా మాస్టర్జీ’ అని పిలుస్తారు. సుమారు 125 గ్రామాల్లో ఈ చోటా మాస్టర్జీ పాఠాలు బోధిస్తున్నాడు. స్కూల్లో తాను నేర్చుకున్న పాఠాలను మురికివాడల్లోని పిల్లలకు బోధిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. తన స్కూల్‌కు ‘బాల్ చౌపాల్’ (పిల్లల వరండా) అని పేరు కూడా పెట్టాడు. ‘‘లెక్కలు అంటే చాలా భయంగా ఉండేది. ఆనంద్ భయ్యా ఆ భయాన్ని పోగొట్టాడు. ఇప్పుడు నాకు మ్యాథ్స సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం’’ అని చెబుతున్నాడు లక్నోలోని ఒక మురికివాడకు చెందిన వికాస్ అనే నాలుగవ తరగతి విద్యార్థి. ‘‘స్కూల్లో టీచర్ పాఠం చెబుతున్నప్పుడు ఏదైనా డౌట్ వస్తే... టీచర్ ఎక్కడ తిడతాడో అని అడగడానికి భయం. భయ్యా దగ్గర అలా కాదు. డౌటు వచ్చిన వాళ్లను మెచ్చు కొని, డౌటు తీరే వరకు ఎంతసేపైనా ఓపిగ్గా చెబుతూనే ఉంటాడు’’ అంటుంది సునీత అనే విద్యార్థిని. ఇలాంటి కామెంట్లు ఓ అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడి విషయంలోనే వింటాం. అలాంటిది ఓ పదకొండేళ్ల పిల్లాడి విషయంలో వినడం ఆశ్చర్యంగా లేదూ! ఆనంద్ చేసే పని అలాంటిది మరి. స్కూలుకు వెళ్లని వాళ్లే కాదు... వెళ్లే వాళ్లు కూడా ఈ చోటా మాస్టారి దగ్గర పాఠాలు వినడానికి ఉత్సాహం చూపడానికి కారణం... గణితం, కంప్యూటర్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లను అరటి పండు ఒలిచి పెట్టినట్టు సులభంగా అర్థమయ్యేలా చెప్పడమే. చదువు చెప్పడమే కాదు... చదువు మానేసిన విద్యార్థులను ప్రోత్సహించి, తిరిగి బడిలో కూడా చేర్పిస్తున్నాడు ఆనంద్. అలా ఇప్పటి వరకు 700 మంది పిల్లలను బడిలో చేర్పించాడు. ‘‘తన చదువు మీద శ్రద్ధ పెట్టకుండా... మీవాడు ఇలా చేస్తున్నాడేమిటి!’’ అని కొంతమంది ఆనంద్ తల్లిదండ్రుల దగ్గర అంటుంటారు. అయితే ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేసే ఆనంద్ తల్లిదండ్రులు అనూప్, రీనా మిశ్రాలు మాత్రం ఆ మాటలకు ఎంత మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కొడుకును అభినందిస్తారు. మంచి పని చేస్తున్నావు అంటూ ప్రోత్సహిస్తారు. తనను తలచుకుని గర్వపడుతుంటారు. నిజానికి బయట ఎంత సమయం వెచ్చించినా తన చదువును మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు ఆనంద్. ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చు కుంటాడు. అయినా అసలు ఇంత చిన్న వయసులో తనకు ఇంత సేవ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చినట్టు! ఓసారి సెలవుల్లో ఆనంద్ కుటుంబం మహారాష్ట్రకు వెళ్లింది. ఓ రాత్రి పూట ఒక చోట డిమ్ లైట్ కింద ఒక పిల్లాడు శ్రద్ధగా చదువుకుంటున్నాడు. అతని దుస్తులు చిరిగి ఉన్నాయి. ఆ అబ్బాయిని చూస్తే బాధగా అనిపించింది ఆనంద్ తండ్రికి. దాంతో అతనికి కొత్త బట్టలు కొనిస్తాను అన్నాడు. దానికి ఆ అబ్బాయి ఒప్పుకోలేదు. ‘బట్టలు వద్దు, పుస్తకాలు లేవు, అవి ఇప్పించండి’ అన్నాడు. దాంతో ఆనందంగా ఆ పుస్తకాలు కొనిచ్చారు మిశ్రా. పుస్తకాలు చేతుల్లో ఉన్నప్పుడు ఆ పిల్లాడి కన్నుల్లో కనిపించిన వెలుగు ఇంతా అంతా కాదు. ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తరువాత కుటుంబమంతా కలిసి లక్నో చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు వెళ్లారు. ఆ గ్రామాల్లో ఎందరో విద్యార్థులు చదువుకు దూరమై బాల కార్మికులయ్యారు. వాళ్లకీ ఏదో చేతనైనంత సాయం చేశారు. ఈ రెండు సంఘటనలూ ఆనంద్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. తనకు చదువు మీద మునపటి కంటే శ్రద్ధ పెరగడమే కాక బీద పిల్లలకు చదువు చెప్పాలనే కోరిక ెకలిగింది. నాటి నుంచీ అదే పని చేస్తున్నాడు ఈ బుల్లి మాస్టారు. ఆనంద్ సేవ అప్పుడే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘సత్యపథ్ బాల్ రతన్’, ‘సేవా రతన్’ అవార్డ్‌లతో పాటు ఎన్నో అవార్డ్లు అతణ్ని వరించాయి. అయితే వాటిని పట్టించుకోడు ఆనంద్. తెలిసిన వాళ్లందరి దగ్గరా డబ్బులు సేకరించి మురికి వాడల్లో గ్రంథాలయాలను స్థాపించడానికి నడుం కట్టాడు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మొదలుపెట్టాడు. తల్లి దండ్రులతో కలిసి ‘చలో పడో అభియాన్’ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ప్రతి విద్యావంతుడు తన బాధ్యతగా కనీసం ఒక్కరినైనా చదివించాలని, అండగా నిలవాలనేది దీని లక్ష్యం. దీనికి మంచి స్పందన వస్తోంది. అది చూసి ఆనంద్ పెదాల మీద చిరునవ్వు మెరుస్తోంది. అది చిరునవ్వు మాత్రమే కాదు... అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం! -
ఆ నలుగురూ నాకెంతో ముఖ్యం!
‘‘జీవితంలో ఎన్ని ఉన్నా ఒక్క మంచి ఫ్రెండ్ లేకపోతే నా దృష్టిలో ఏమీ లేనట్లే. ఎంతటి కోటీశ్వరులకైనా మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక్క ఫ్రెండ్ అయినా ఉండాలి. లేకపోతే నిరుపేద కింద లెక్క. ఫ్రెండ్స్ విషయంలో నేను ఐశ్వర్యవంతురాల్ని’’ అని దీపికా పదుకొనె అంటున్నారు. చిన్నప్పట్నుంచీ తనతో పాటు ట్రావెల్ చేస్తున్న నలుగురు స్నేహితుల గురించి దీపికా చెబుతూ -‘‘శ్రీల, హితేషి, దివ్య, స్నేహ.. ఈ నలుగురూ నా చిన్నప్పటి ఫ్రెండ్స్. మేం నలుగురం ఒకే స్కూల్లో చదువుకోలేదు. పక్క పక్క ఇళ్లల్లో ఉండేవాళ్లం. స్కూల్ అయిపోయి ఇంటికి రాగానే కలిసి హోమ్‌వర్క్ చేసుకునేవాళ్లం. ఆ తర్వాత ఆడుకునేవాళ్లం. సెలవు రోజుల్లో మా అల్లరికి అంతు ఉండేది కాదు. ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్లే. వీలు కుదిరినప్పుడల్లా మా ఊరు బెంగళూరు వెళతాను. అప్పుడు తప్పనిసరిగా వాళ్లను కలుస్తాను. నలుగురిలో ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. ఇద్దరు బెంగళూరులో ఉన్నారు. నేను సినిమాలతో, వాళ్లు వాళ్ల పనులతో బిజీగా ఉంటారు. దాంతో రోజుల తరబడి ఫోన్ చేసుకునే తీరిక కూడా చిక్కదు. అయినప్పటికీ మా మధ్య ఉన్న స్నేహం చెక్కు చెదరలేదు. ఎప్పటికీ మేం ఇలానే మంచి స్నేహితుల్లా ఉంటాం’’ అని చెప్పారు. -
ఫేస్బుక్లో ఆ ఫోటో ప్రత్యేక ఆకర్షణ
కాళ్ళకు కనీసం చెప్పులు కూడ లేవు. రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై ఓ కార్డుబోర్డు బాక్సు పై కూర్చొని చాలా శ్రద్ధగా హోంవర్క్ చేసుకుంటోందా బాలిక. పక్కనే ఆమె సోదరి... ఇద్దరూ నలిగి.. మాసిపోయిన పైజమాలు ధరించి, మట్టి కొట్టుకు పోయిన ముఖాలతో కనిపించడం ఫిలిప్పీన్ కు చెందిన జేమ్స్ కో అనే ఫోటో గ్రాఫర్ ను ఆకట్టుకుంది. వెంటనే ఆ ఇద్దరు బాలికలను క్లిక్ మనిపించాడు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. ఆ ఫోటోను ఫేస్ బుక్ లో కూడ పోస్ట్ చేశాడు. ఇప్పుడా ఫోటో ఫేస్ బుక్ లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. పన్నెండు వేలకు పైగా లైక్ లు కూడ వచ్చాయి. సియెలో కంజేల్స్ తన సోదరి జెనలిన్... ఆ ఇద్దరు బాలికలూ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడ తీక్షణంగా తమ తమ నోట్ ప్యాడ్స్ లో హోం వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. వారికి దూరంగా లిండా గోంజేల్స్ అనే మహిళ వీధిలో కూర్చొని ఉంది. ఆమె బహుశా వారికి తల్లి అయి ఉండొచ్చు. సియెలో తన చేతిలోని నోట్ పుస్తకంలో అక్షరాలు దిద్దుతోంది. మరొక పుస్తకంలో లెక్కలు ప్రాక్టీస్ చేస్తూ కెమెరాలకు ఫోజిచ్చింది. అయితే ఆ ఫోటోలోని వివరాలను బట్టి వారి కుటుంబ పరిస్థితులను అంచనా వేయొచ్చు. ఫోటోను చూసిన ఓ ఫేస్ బుక్ యూజర్ మాత్రం ఈ విషయంలో స్పందించాడు. ''ఆ బాలికలు ఎవరో తెలియదు. కానీ వారికి చదువుపట్ల ఉన్న శ్రద్ధనుమాత్రం ప్రశంసించాలి. వారి చదువుకు కావలసిన సహాయం స్వచ్ఛంద సంస్థలుగాని, ప్రభుత్వం గాని అందించి ఆదుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను" అంటూ తన కామెంట్ ను పోస్ట్ చేశాడు. గతంలో కూడా ఇటువంటి ఒక దృశ్యం ఎందరినో ఆకర్శించింది. మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ కిటికీ సందుల్లోంచి వచ్చే వెలుగుల్లో చదువుకుంటున్న డానియెల్ కాబెరెరా అనే మూడోక్లాసు చదువుతున్న తొమ్మిదేళ్ళ చిన్నారి స్థితిని కూడ ఫిలిప్పీన్స్ కెమెరాలో బంధించారు. మెడికల్ స్టూడెంట్ జాయిస్ టొర్రెఫ్రాంకా తీసిన ఫొటోగ్రాఫ్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆ చిన్నారి పరిస్థితికే కాదు... అంత చిన్న వయసులో అతడు చదువుపై చూపిస్తున్న శ్రద్ధకు అంతా ముగ్ధులయ్యారు. లక్షలకొద్దీ ఆర్థిక సాయం అందించారు. ఓ చిన్న ఫోటో అతడి జీవితంలో ఎంతో మార్పును తెస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మరిప్పుడు ఈ బాలికలకు కూడ అటువంటి సహాయం అందాలని ఆశిద్దాం. -
అమ్మో! హైపర్ పిల్లలు!!
అల్లరి, దుడుకుతనం... ఇలాంటి గుణాలు పిల్లల్లో ఏదో ఒక సమయంలో కనిపిస్తాయి. తల్లిదండ్రుల సహనానికి పరీక్ష పెడతాయి. కొన్ని సార్లు అది మితిమీరుతుంది. హోమ్‌వర్క్ నుంచే కాదు అటు ఆటలనుంచి ఇటు టీవీ నుంచీ క్షణ క్షణానికీ దృష్టిమళ్లిపోతుంది. పిల్లల్లో చురుకుదనం చాలా సాధారణం. అవసరం కూడా. దాన్ని సహజమైన గుణంగానే పరిగణించాలి. అయితే ఒకస్థాయికి మించిపోయి పిల్లలకూ, వారితోపాటు పెద్దలకూ ఇబ్బంది కలిగించేంతగా ఉన్నప్పుడే పిల్లల చురుకుదనాన్ని, అతిచురుకుదనంగా (హైపర్ యాక్టివిటీ)గానూ, ఒక సమస్యను పరిగణించాలి. పిల్లల్లో మితిమీరిన చురుకుదనం కొన్నిసార్లు తీవ్రస్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), ప్రవర్తనాపరమైన లోపాలు (కాండక్ట్ డిజార్డర్స్), ఆటిజం, బైపోలార్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్స్ వంటి ఉన్నప్పుడు పిల్లల్లో అతి చురుకుదనాన్ని చూడవచ్చు. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. తల్లిదండ్రులు గమనించాల్సిన అంశాలు తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించాలని పిల్లలు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో వారు కోరుకునే అటెన్షన్గానీ / సమయంగానీ తల్లిదండ్రుల నుంచి లభించనప్పుడు వారు అల్లరి చేసి తమ తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటారు. తల్లిదండ్రులు చాలా బిజీగా ఉన్న ఈ ఆధునిక కాలంలో పిల్లలకు వారు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగానికి వెళ్తారు. అలసిపోయి వస్తారు. వారి అలసట, విసుగు పిల్లలపై చూపిస్తారు. పిల్లలు సహజంగానే చేసే కొద్దిపాటి అల్లరిని కూడా భరించగలిగేంత సహనం, ఓపిక వీళ్లకు ఉండదు. కానీ నిజానికి పిల్లల ఆరోగ్యం, సహజ వికాసం కోసం తల్లిదండ్రుల అటెన్షన్ చాలా ముఖ్యం. ఆ సమయాన్ని కేటాయించడం తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు తల్లిదండ్రులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పిల్లలను ఆగకుండా చదివించడం కొన్ని కుటుంబాల్లో ఒక తప్పనిసరి పరిస్థితిగా మారింది. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ బాల్యాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలి. అప్పుడు పిల్లల పరిస్థితి అర్థమవుతుంది. ఎలాంటి శారీరకమైన కదలికలు లేకుండా కూర్చుంటే పిల్లల్లో అసహనం (రెస్ట్లెస్నెస్) కలుగుతాయి. దాంతో పిల్లలు హైపర్యాక్టివిటీకి పాల్పడతారు. కాబట్టి పిల్లలకు శరీరం అలసిపోయేలా ఆటలాడేందుకు (ఫిజికల్ యాక్టివిటీకి) తగినంత సమయం ఉండాలి. ఇక ఈ ఆధునిక యుగంలో మరో సమస్య టీవీ, ఇంటర్నెట్, సెల్‌ఫోన్స్ ద్వారా వస్తోంది. దీన్ని ఒకరకమైన జాడ్యం (అడిక్షన్లాగా) పిల్లల్లో వ్యాపిస్తోంది. పిల్లలు ఈ టీవీ, ఇంటర్నెట్, సెల్‌ఫోన్‌లోని హింస ఎక్కువగా ఉండే గేమ్స్‌కు/హారర్ చిత్రాలకూ బానిసలైపోవడం వల్ల గంటల తరబడి వీటికి అతుక్కుపోతున్నారు. దాంతో శరీరానికి అవసరమైన కదలికలు లేకపోవడం వల్ల ఎదుగుదల కూడా దెబ్బతింటోంది. కండరాలు బలహీనంగా మారిపోతున్నాయి. పిల్లల్లో హైపర్యాక్టివిటీకి కారణాలు పిల్లల ఎదిగే వయసులో వారికి చదువుతో పాటు శారీరక కదలికలు (యాక్టివిటీ) చాలా ముఖ్యం. మానసికమైన వికాసానికి ఇది కూడా తోడ్పడుతుంది. మన మెదడులో 10 టు ద పవర్ ఆఫ్ 12 కణాలు ఉంటాయి. ఒక్కో కణం నుంచి మరో కణానికి 10 టు ద పవర్ ఆఫ్ 4 వైర్లు (నిజానికి అవి నర్వ్ ఫైబర్లు) కలుపుతూ ఉంటాయి. అంటే మన మెదడు 10 టు ద పవర్ ఆఫ్ 16 వైర్లు కలిగిన ఒక సూపర్ కంప్యూటర్ అన్నమాట. మెదడు నిర్మాణం, దానికి అవసరమైన మార్పులు చిన్న వయసులోనే జరుగుతాయి. ఈ మార్పులు జరుగుతున్న సమయంలో మెదడును ఒక మైనపుముద్దతో పోల్చవచ్చు. మనం దాన్ని ఎలా మలిస్తే అలా మారుతుంది. కాబట్టి మొదటి 16 ఏళ్ల సమయంలో పిల్లలకు ఎలాంటి వాతావరణాన్ని కల్పిస్తే అది జీవితాంతం వారిలో ప్రతిబింబిస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో అతిచురుకుదనానికి (హైపర్ యాక్టివిటీకి) కారణాలు పరిశీలిద్దాం... తగినంత నిద్ర లేనప్పుడు వారు అతిచురుగ్గా మారిపోతారు. చిరాకు కనబరుస్తారు. పోషకాహార లోపం వల్ల కూడా అతిచురుకుదనం కలిగే అవకాశం ఉంది. వాతావరణ కాలుష్యం కూడా ఎదిగే మెదడుపై తీవ్రప్రభావం కనబరుస్తుంది. ఇందులోని లెడ్ వంటి కాలుష్యాలు/వ్యర్థపదార్థాలు, వారు తీసుకునే ఆహారంలో ఉండే పెస్టిసైడ్స్ వంటివి పిల్లల ప్రవర్తనపైనా ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు పిల్లల రక్తంలో ఉండే లెడ్ వంటి విషాలు ఎంత కొద్దిమోతాదుల్లో ఉన్నా అది పిల్లల తెలివితేటలపై ప్రభావం చూపుతుంది. దీనిప్రభావం వల్ల పిల్లలను ప్రవర్తనాలోపాల (కాండక్ట్ డిజార్డర్స్) వైపునకు నెడుతుందనేది డబ్ల్యూహెచ్ఓ పరిశీలన. అతిచురుకుదనాన్ని సమస్యగా ఎప్పుడు పరిగణించాలి పిల్లలకు కనీసం నాలుగేళ్లు దాటితేగానీ వారి హైపర్యాక్టివిటీని ఒక సమస్యగా గుర్తించలేం. ఎందుకంటే అతిచురుగ్గా ఉండటం ఈ వయసులోపు వారికి ఒక సహజగుణం. దీన్ని వ్యాధి/సమస్యగా పరిగణించకూడదు. నాలుగేళ్ల నుంచి ఏడేళ్ల పిల్లల్లో కూడా కొంత దుందుడుకుదనం, చురుకుదనం సహజమే. చుట్టూ పరుగెత్తడం, ఒకే విషయాన్ని తరచి తరచి అడగడం వంటివి వీరు చేస్తారు. అయితే ఇది స్థాయికి మించినా, ఈ దుడుకుదనం వల్ల ఇతరులకు సమస్యగా పరిణమిస్తున్నా, పిల్లలు తినడానికి కూడా ఒక చోట కూర్చోకుండా... వారికి ఇష్టమైన కథలు చెబుతున్నా వినిపించుకోకుండా, నిలకడగా లేకుండా ఉంటున్నా దాన్ని సమస్యాత్మకమైన పరిస్థితిగా పరిగణించవచ్చు. ఏడు నుంచి పన్నెండేళ్ల పిల్లలు కనీసం ఆటలు ఆడేటప్పుడైనా కొంత నిలకడ చూపగలగాలి. ఆట పూర్తయ్యేవరకూ నికలడగా ఉండాలి. వీళ్లలో ఈ నిలకడ గుణం లోపించినప్పుడు, ఇతర పిల్లలను సైతం ఆటలాడకుండా విసిగిస్తున్నప్పుడు, తమ అవకాశం రాకుండానే తొందరపడుతున్నప్పుడు... దాన్ని సమస్యాత్మకమైన అతిచురుకుదనంగా పరిగణించవచ్చు. టీవీని కూడా వీరు నిలకడగా చూడలేరు. ఒక కథను ఫాలో అవుతూ అది పూర్తయ్యేవరకూ ఆ ఛానెల్నే చూస్తూ ఉండలేరు. చేసేపనుల్లో తప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. పని మొదలుపెట్టినా మధ్యలోనే వదిలేస్తారు. ఈ నేపథ్యంలో వారి చర్యలు ఇతరులకూ/తమకూ ఇబ్బందిగా పరిణమించినప్పుడు దాన్ని సమస్యగా గుర్తించాలి. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... పిల్లలకు తగినంత సమయం కేటాయించండి. స్కూల్లోనూ, ఇంటిదగ్గరా చదువుతో పాటు, ఆటపాటలకూ తగినంత సమయం ఇవ్వండి. వారు తగినంత విశ్రాంతి తీసుకోడానికీ అవకాశం ఇవ్వండి. పిల్లలు హైపర్యాక్టివిటీని ప్రదర్శిస్తున్నారని తల్లిదండ్రులు గుర్తించినప్పుడు వారిని కచ్చితంగా కొంత సమయంపాటు విశాలమైన మైదానాలలో ఆటలకు వదలాలని తల్లిదండ్రులు గుర్తుంచుకోండి. వారు తగినంతగా ఆటలాడి శారీరకంగా అలసట పొందితే ఈ హైపర్ యాక్టివిటీ సహజంగానే తగ్గుతుంది. పిల్లలు కుదురుగా కూర్చొని ఒక పనిని పూర్తిచేసినప్పుడు వారిని ప్రశంసించండి. ఇదెంతో కీలకం. పిల్లల్లో ఒక వ్యాపకం, కళను పెంపొందించేందుకు తల్లిదండ్రుల ప్రశంస ఎంతగానో తోడ్పడుతుంది. పిల్లలు సాధించగల గమ్యాలను నిర్దేశించండి. అవి సాధించగానే ప్రశంసించండి. పిల్లలకు కొన్ని చిన్నచిన్న ఆటల వంటి యాక్టివిటీస్‌ను కల్పించాలి. ఉదాహరణకు దారంలో పూసలు ఎక్కించడం, ఏ రంగు పూసలను, ఆ రంగు పూసలుగా విడదీయడం వంటివి. ప్రమాదకరమైన వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాలి. పిల్లలు అతిచురుకుదనాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు వారిని దూషించడం, తక్కువచేసి మాట్లాడటం అస్సలు చేయకూడదు. పిల్లలు టైమ్-టేబుల్ ఫాలో అయ్యేలా అలవాటు చేయాలి. ఇది క్రమంగా జరగాల్సిన పని. అంతేగానీ ఒకేసారి జరగాలని కోరుకోకండి. పిల్లలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకునేలా చూడండి. శారీరక, మానసిక వికాసానికి ఇదెంతో కీలకం. - డాక్టర్ శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం, ఎర్రగడ్డ, హైదరాబాద్ -
కంప్యూటర్లు, టీవీలకు అతుక్కుపోకండి
స్కూల్ లేదు.. హోంవర్క్ గోల అంతకంటే లేదు.. అసైన్మెంట్లు చేయాల్సిన అవసరం అసలే లేదు.. పుస్తకాలు ముందేసుకుని చదవాల్సిన పని లేదు.. ఎందుకంటే సమ్మర్లో సెలవులు ఇచ్చింది ఎంజాయ్ చేయడానికే కదా.. ఎంచక్కా సెలవుల్లో కంప్యూటర్లకు, టీవీలకు అతుక్కుని కూర్చుందామనుకునే పిల్లలపై పెద్దలు ఓ లుక్కేయాల్సిందే. లేకుంటే మీ పిల్లలను అందరూ ‘లడ్డూ’ అని పిలవాల్సి వస్తుంది. రోజుకు మూడు నాలుగు గంటలు టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోవడం, సరైన వ్యాయామం లేకపోవడంతో.. పిల్లలు బెలూన్లలా ఉబ్బిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రెండు గంటల కంటే ఎక్కువగా టీవీ చూస్తే కంటి జబ్బులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తించాలి. ఒంటికి వ్యాయామం అవసరం ఎలాగూ సెలవులే కదా అని అస్తమానం రిమోట్ పట్టుకుని వీడియో, ఇండోర్ గేమ్స్ ఆడటం.. విసుగనిపిస్తే నెట్‌బ్రౌజింగ్ చేయడం, సినిమా సీడీలతో కాలక్షేపం మితిమీరితే ఇబ్బందేమరి. ఇరవై నాలుగ్గంటలూ కుర్చీలు, సోఫాలకు అత్తుక్కుపోయి టీవీలు, కంప్యూటర్ల ఆటలకే పరిమితం కావొద్దు. ఒంటికి కాస్త వ్యాయామం కూడా ఇవ్వాలి. ఫ్రిజ్ నిండా వేసవి రుచులు నింపుకొని, టీవీలు, కంప్యూటర్లతో ఆటలాడుతూ మధ్యమధ్యలో ఎంచక్కా చిరుతిళ్లు లాగించేస్తే ఆరోగ్యం పాడవడంతో పాటు లావెక్కిపోతారు. దీంతో స్కూళ్లు మొదలవగానే తోటి విద్యార్థులు ఎగతాళి చేసే ప్రమాదం ఉంది. శరీరానికి శ్రమ ఇవ్వాలి. అప్పుడప్పుడు బయటకు వెళ్లి పరుగెత్తాలి, నడవాలి, పిల్లలతో కలిసి సరదాగా ఆడుకోవాలి. - సాక్షి, విజయవాడ -
నేర్పండి... నేర్చుకుంటారు!
ఒకప్పుడు స్కూళ్లు పది గంటలకు మొదలయ్యేవి. కానీ ఇప్పుడు ఏడున్నర, ఎనిమిది గంటలకే మొదలైపోతున్నాయి. ఆ సమయానికల్లా పిల్లల్ని తయారుచేసి పంపడం తల్లులకు కత్తిమీద సాముతో సమానం. అయితే మొదట్నుంచీ వాళ్లకి కొన్ని పద్ధతులు నేర్పిస్తే, ఈ సమస్య ఉండదు. స్కూల్లో వేయడానికి కొన్ని రోజుల ముందు నుంచే పిల్లలను పొద్దున్నే లేపేయండి. ఆ సమయానికల్లా వారికి అలవాటైపోతుంది. స్కూల్ బ్యాగుని రాత్రి హోమ్‌వర్క్ పూర్తవగానే సర్దిపెట్టుకోమనండి. పొద్దున్న లేచి చేయాల్సిన పనుల గురించి పేపర్ మీద రాయండి. బాత్రూమ్కి వెళ్లాలి, బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, టిఫిన్ తినాలి ఇలా. ఆ చీటీని పిల్లల మంచం దగ్గర అతికించి, దాని ఫాలో అవమనండి. కొన్నాళ్లకు అలవాటైపోతుంది. ప్రతిదానికీ ఇంత టైమ్ అని కేటాయించి, ఆ సమయంలో ఆ పనిని పూర్తి చేసి తీరాలని చెప్పండి. మొదట్లో మీరే రెడీ చేసినా, మెల్లగా వారినే అవ్వమనండి. యూనిఫామ్, షూ, టై, బెల్ట్ అన్నీ ఒకే చోట పెడితే వాళ్లు కన్ఫ్యూజ్ అవకుండా ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే... పొద్దున్న లేవగానే పిల్లలకు నచ్చిన ఏదైనా పనిని చేయించాలి. డ్యాన్స్ ప్రాక్టీస్, నచ్చిన కార్టూన్స్ చూడటం, గార్డెన్ వర్క్, సైకిల్ తొక్కడం... ఏదో ఒకటి. ఎందుకంటే లేవగానే నచ్చిన పని చేయడం వల్ల వాళ్లు రోజంతా యాక్టివ్‌గా ఉంటారని పరిశోధనలో తేలింది. -
ఈ కన్నీళ్లు నా పాపాన్ని తుడిచేయగలవా?
మా నాన్నగారు స్కూల్ హెడ్మాస్టర్. ఆయనంటే అందరికీ చాలా భయం. ఎప్పుడూ క్రమశిక్షణ గురించే మాట్లాడేవారు. నిజాయతీగా ఉండాలనేవారు. నిజమే చెప్పాలనేవారు. అయితే అవన్నీ మంచికే చెప్తున్నారని అర్థం చేసుకునే వయసు, పరిణతి నాకు లేకపోయాయి. దాంతో ఆయన కంటపడకుండా తప్పించుకునేదాన్ని. ఐదోతరగతి చదువుతున్నప్పుడు అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. అప్పట్నుంచీ నాన్నతో మాట్లాడటమే తగ్గించేశాను. నేను టెన్త్‌క్లాస్ చదువుతున్నప్పుడు మా దూరపు బంధువు ఒకరు భార్యాసమేతంగా వచ్చారు మా ఇంటికి. వాళ్లని చూస్తూనే అరుగు మీద కూర్చుని హోమ్‌వర్క్ చేస్తున్న నన్ను లోపలికి వెళ్లిపొమ్మన్నారు. దాంతో నాకేదో అనుమానం వచ్చింది. లోపల నిలబడి కిటికీలోంచి జరిగేది చూడసాగాను. ఆ వచ్చినావిడ అంటోంది... ‘నా కూతుర్ని నాకు ఇచ్చేయండి’ అని. నాన్న అంటున్నారు... ‘మొదటే చెప్పాం తననిక ఇవ్వడం కుదరదని, తనిప్పుడు నా కూతురు, మీరు వెళ్లిపోండి’ అని. నాకు ఎప్పటికో అర్థమైంది... వాళ్లు మాట్లాడుకుంటున్నది నా గురించే అని. నాకు కోపం, దుఃఖం కలిసొచ్చేశాయి. అంటే నేను ఆయన కన్న కూతురిని కాదు. అందుకే ఆయనకు నా మీద ప్రేమ లేదు. అలా అనుకోగానే ఇక ఉండలేకపోయాను. పరుగు పరుగున మా అమ్మ దగ్గరకు వెళ్లిపోయాను. నన్నూ తీసుకుపొమ్మని అడిగాను. తను సంతోషంగా నన్ను దగ్గరకు తీసుకుంది. అంతవరకూ వాళ్లతో వాదించిన నాన్న సెలైంట్ అయిపోయారు. వస్తానంటే తీసుకెళ్లండి అన్నారు. దాంతో నేను మా అమ్మానాన్నలతో వెళ్లిపోయాను. కానీ నేనెంత తప్పు చేశానో తర్వాత తెలిసింది. నేను వెళ్లిన నాలుగోరోజునే కబురొచ్చింది... నాన్న గుండెనొప్పితో చనిపోయారని. అమ్మానాన్నలు నన్ను తీసుకు వెళ్లారు. వాకిట్లో నాన్న శవం ఉంది. చనిపోయాక కూడా ఆ ముఖంలో కాఠిన్యమే కనిపించింది నాకు. అందుకే ఏడుపు రాలేదు. అంతలో పక్కింటాయన నాకో ఉత్తరం తెచ్చి ఇచ్చారు. చనిపోయేముందు నాన్న ఇచ్చారట, నాకు ఇవ్వమని. అది చదివిన నాకు నాన్నంటే ఏమిటో తెలిసి వచ్చింది. నేను పుట్టేటప్పటికి నా కన్నతల్లితండ్రులకు తినడానికి తిండి కూడా ఉండేది కాదట. దాంతో నన్ను ఎవరికో అమ్మేయబోతే నాన్న తాను పెంచుకుంటానని చెప్పి నన్ను ఇంటికి తీసుకొచ్చేశారట. కేవలం నాకోసమే పిల్లల్ని కనకూడదని నాన్న అనుకున్నారట. అమ్మకూడా అందుకు సరేనందట. ‘నిన్ను తొలిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇక జీవితమంతా నీకోసమే బతకాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను వదిలి వెళ్లిపోయావు, అందుకే వెళ్లిపోతున్నాను తల్లీ, జాగ్రత్త’ అన్న నాన్న మాటలు మనసును పిండేశాయి. నాన్న పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాను. కానీ ఏం లాభం? నా కన్నీళ్లు నా పాపాన్ని తుడిచేయగలవా? నా తండ్రిని నాకు తీసుకొచ్చి ఇవ్వగలవా? - ప్రశాంతి, మామిడికుదురు