
వైరల్
వెనకటికి ఒక ఈగ ఇల్లలుకుతూ ఇంటి పనుల్లో పడి పేరు మరచిపోయిందట. చాలామంది మహిళలు ఇంటిపనుల్లో తలమునకలైపోయి తమ ఇష్టాలను మరచిపోతుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ ఫల్గుణి గృహిణుల కోసం ఒక వీడియో చేసింది.
‘మహిళలు తమ భర్త, పిల్లల కోసం ఇష్టమైన వంటకాలను తయారుచేసే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాను. మరి మీ కోసం ఎప్పుడు తయారు చేస్తారు? మీ కుటుంబ సభ్యులకు నచ్చిన వంటకాల గురించి మాత్రమే కాదు మీకు నచ్చిన వాటి గురించి కూడా దృష్టి పెట్టండి’ అంటూ తనకు బాగా నచ్చిన వంటకాన్ని తయారుచేస్తున్న వీడియోను ఫల్గుణి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఈ వైరల్ క్లిప్ 1.4 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ చూసి ఒక మహిళ ఇలా స్పందించింది... ‘నీకు ఇష్టమైనది చేసి పెడతాను. ఏంచేయమంటావు అని అడిగింది అమ్మ. వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. పెళ్లయిన తరువాత ఇంటిపనుల్లో పడి నాకు ఇష్టమైన వంటకం ఏమిటో కూడా మరిచిపోయాను. ఈ వీడియో చూసిన తరువాత సెల్ఫ్–లవ్ ్ర΄ాముఖ్యత గురించి రియలైజ్ అయ్యాను’
Comments
Please login to add a commentAdd a comment