housewives
-
సెల్ఫ్–లవ్
వెనకటికి ఒక ఈగ ఇల్లలుకుతూ ఇంటి పనుల్లో పడి పేరు మరచిపోయిందట. చాలామంది మహిళలు ఇంటిపనుల్లో తలమునకలైపోయి తమ ఇష్టాలను మరచిపోతుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ ఫల్గుణి గృహిణుల కోసం ఒక వీడియో చేసింది. ‘మహిళలు తమ భర్త, పిల్లల కోసం ఇష్టమైన వంటకాలను తయారుచేసే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాను. మరి మీ కోసం ఎప్పుడు తయారు చేస్తారు? మీ కుటుంబ సభ్యులకు నచ్చిన వంటకాల గురించి మాత్రమే కాదు మీకు నచ్చిన వాటి గురించి కూడా దృష్టి పెట్టండి’ అంటూ తనకు బాగా నచ్చిన వంటకాన్ని తయారుచేస్తున్న వీడియోను ఫల్గుణి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వైరల్ క్లిప్ 1.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ చూసి ఒక మహిళ ఇలా స్పందించింది... ‘నీకు ఇష్టమైనది చేసి పెడతాను. ఏంచేయమంటావు అని అడిగింది అమ్మ. వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. పెళ్లయిన తరువాత ఇంటిపనుల్లో పడి నాకు ఇష్టమైన వంటకం ఏమిటో కూడా మరిచిపోయాను. ఈ వీడియో చూసిన తరువాత సెల్ఫ్–లవ్ ్ర΄ాముఖ్యత గురించి రియలైజ్ అయ్యాను’ -
గృహిణుల సేవలకు వెలకట్టలేం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇంట్లో గృహిణులు రోజంతా చేసే పనులకు వెలకట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. గృహిణి బాధ్యతలు ఎంతో గౌరవప్రదమైనవని, డబ్బుతో వాటిని పోల్చలేమని తెలిపింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచుతూ తీర్పు వెలువరించింది. 2006లో ఓ మహిళ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆమె నడిపే వాహనానికి బీమా చేయించలేదు. మృతురాలి భర్త, మైనర్ కుమారుడికి కలిపి రూ.2.5 లక్షలు చెల్లించాలని మోటారు వాహన క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని ఆదేశించింది. దీనిపై మృతురాలి కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. మృతురాలు ఉద్యోగిని కాదు, కేవలం గృహణి మాత్రమే. పరిహారాన్ని ఆమె జీవిత కాలాన్ని, నామమాత్రపు ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తారు’అని పేర్కొంటూ పరిహారం మొత్తాన్ని పెంచేందుకు నిరాకరిస్తూ 2017లో తీర్పు చెప్పింది. దీనిపై బాధితులు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. విచారించిన ధర్మాసనం ‘ఒక గృహిణి సేవలను రోజువారీ కూలీ కంటే తక్కువగా ఎలా నిర్ణయిస్తారు? ఈ విధానాన్ని మేం అంగీకరించడం. గృహిణి విలువను ఎన్నడూ తక్కువగా అంచనా వేయరాదు’అని పేర్కొంటూ రూ.6 లక్షల పరిహారాన్ని మృతురాలి కుటుంబానికి చెల్లించాలని వాహన యజమానిని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పెరుగుతున్న గృహ వేధింపులు!
సామాజికంగా ఎన్ని మార్పులు చేసుకుంటున్నా.. గృహ హింసలో మాత్రం తగ్గుదలఉండడం లేదు. అదనపు కట్నం కోసం వేధింపులు, తాగుబోతు భర్తలు, అత్తింటి వారి వేధింపులకు గురయ్యే మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఏటా పెరుగుతున్న గృహ హింస సంబంధిత ఫిర్యాదుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. అయితే గతంలో మాదిరిగా ఇంటి పరువు, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయోనన్న భయాన్ని గృహిణులు వీడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ గత ఐదేళ్లలో నమోదైన గృహ హింస ఫిర్యాదులను పరిశీలిస్తే.. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 43 ఫిర్యాదుల నమోదైతే..ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 162 మంది మహిళలు గృహ హింసకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల్లో కొందరు నేరుగా మహిళా భద్రత విభాగానికి, పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా, మరికొందరు మహిళా భద్రత విభాగం వాట్సాప్ నంబర్‌కు, ఈ–మెయిల్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖలో ప్రత్యేకించి మహిళా భద్రత కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు, షీటీమ్స్, ఇతర చర్యలతో మహిళల్లో పోలీసులపై భరోసా పెరగడం వల్ల కూడా వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు ఇస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గృహ హింస ఫిర్యాదులు పెరగడానికి, మహిళల్లో పెరిగిన అవగాహన, భరోసాయే కారణమని పేర్కొన్నారు. మహిళా భద్రత విభాగానికి వచ్చే గృహ హింస ఫిర్యాదులపై సఖి, భరోసా సెంటర్ల ద్వారా, అవి అందుబాటులోని లేని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లలో ప్రైవేటు కౌన్సిలర్ల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదుల్లో కొన్నిటిని కుటుంబీకుల మధ్య సయోధ్య కుదుర్చడం ద్వారా పరిష్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
National Nutrition Week: నీరసమూ నిద్ర వదలగొట్టండి
సోఫా కనిపిస్తే నడుము వాల్చాలనిపిస్తోందా? ఏ పనీ చేయలేని నీరసం ముంచుకు వస్తోందా? ఇదేమైనా పోస్ట్ కోవిడ్ లక్షణమా? మరేదైనా సమస్యా? ఇటీవల గృహిణులు నీరసాన్ని ఫిర్యాదు చేస్తున్నారు. పని మాని నిద్ర పోవడానికి ఇష్టపడుతున్నారు. దీనికి పోషకాహార లోపం ఒక కారణం. ఇతర కారణాలు కూడా ఉంటాయి. గృహిణి నీరసంగా ఉంటే ఇల్లు నడవదు. లేవండి. చలాకీగా మారండి. ‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్’ అన్నాడు మహాకవి గురజాడ. ఆయన బాధపడింది తగినంత పౌష్టికాహారం లేని తన కాలపు మనుషులను చూసే. సరైన ఆహారమే శక్తి. సరికాని ఆహారం నీరసం. ఫుల్లుగా తిన్నా అసలు తినకపోయినా విలోమ ప్రతిఫలం వస్తుంది. అతి నిద్ర, నీరసం ఇంటి సభ్యులకు ముఖ్యంగా గృహిణులకు ఉంటే పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. కోవిడ్ తర్వాత చాలా ఇళ్లల్లో స్త్రీలు నీరసం అని అంటూ ఉన్నారు. కోవిడ్ బారిన పడ్డ పిల్లలు కూడా అప్పుడప్పుడు నీరసం అని అనువుగాని సమయాలలో నిద్ర అని అంటూ ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ తగిన పౌష్టికాహారంతో ఎదుర్కొనవచ్చు. ఇప్పుడు దేశంలో పౌష్టికాహార చైతన్యం కోసం కోసం సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ‘పౌష్టికాహార వారోత్సవం’ జరుగుతుంది. సరిౖయెన ఆహారంతో నీరసాన్ని ఎదుర్కోవడం ముఖ్యం. సమతుల ఆహారం: మధుమేహం, గుండె, బి.పి, స్థూలకాయం... వీటిని అదుపు చేసే ఆహారం తినడం గురించి కొందరు శ్రద్ధ పెడతారు. కాని సమగ్రంగా శరీరాన్ని చురుగ్గా ఉంచే ఆహారాన్ని పట్టించుకోరు. అసమతుల ఆహారం శరీరానికి నీరసం తెస్తుంది. కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం అతిగా తింటే మందకొడితనం వస్తుంది. అది కూడా ఒక రకమైన అలసట కలిగిస్తుంది. కేల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్, విటమిన్లు ఇవన్నీ తగినంతగా తీసుకుంటే సరైన నిద్ర పడుతుంది. తిన్నది ఒంటికి పట్టి ఉదయానికి హుషారు వస్తుంది. లేకుంటే నిద్ర సరిగ్గా పట్టదు. మరుసటి రోజు మత్తు, అలసట, నీరసం ఉంటాయి. జొన్నలు, కొర్రలు, గ్రీన్ టీ: నిదానంగా జీర్ణమయ్యే జొన్నలు, కొర్రలు మంచివి. చికెన్, చేపలు మేలు చేస్తాయి. పాలు, పెరుగు, గుడ్డు, సోయా, పెసలు, అలసందలు ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరెంజ్, జామ, బొప్పాయి, స్ట్రాబెర్రీలు నీరసాన్ని, కీర మలబద్ధకాన్నీ తొలగిస్తాయి. అరటిపండు నీరసానికి బద్ధ విరోధి. బ్రొకోలి, క్యాప్సికమ్, క్యారెట్, కాలిఫ్లవర్, టొమాటోలు ఇవి ఉన్న కూరలు ముఖ్యం. ఆకుకూరలు పెంచాలి. మజ్జిగ బాగా తీసుకోవాలి. జొన్న రొట్టె, జొన్న రవ్వ ఒక పూట అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ పోషకాలనిస్తాయి. గ్రీన్ టీ మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఏకాగ్రతను పెంచడంతో పాటు అలసటను తొలగిస్తుంది. మందులు: కొన్ని రకాల మందులు కూడా నిద్ర లేమికి, నీరసానికి కారణం అవుతాయి. బి.పి, యాంగ్జయిటీ, యాంటీ డిప్రెసెంట్లు వంటివి నిద్రకు విఘాతం కలిగిస్తాయి. అందువల్ల అప్పుడప్పుడు డాక్టర్‌ను కలిసి వాడుతున్న మందులు చెక్ చేయించి వాటి మోతాదును సరి చేసుకోవాలి. నిద్ర సమస్యలు ఉంటే మందులు మార్చే వీలుంటే మార్చుకోవాలి. ఆహారం, అలవాట్లు ఇవే మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. గృహిణి ఆరోగ్య బాధ్యత గృహిణిది మాత్రమే కాదు. కుటుంబానిది. అందరూ కలిసి ఇంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. తగినంత నీరు, నిద్ర: జీవక్రియలకు నీరు అవసరం. జీవక్రియలు జరిగే కొద్దీ శరీరంలో నీటి శాతం తగ్గుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు నీరు తీసుకోవాలి. లేదంటే శరీరంలో రసం పోయి నీరసం వస్తుంది. అలాగే సరిౖయెన నిద్ర కోసం పూర్తిగా ప్రయత్నించాలి. అలజడి, ఒత్తిడి, అనవసర ఆలోచనలు నిద్రకు దూరం చేస్తాయి. నిద్ర లేకపోతే ఆరోగ్యం ఉండదు. కనుక రోజంతా ఎంత పని, చికాకులు ఉన్నా నిద్రా సమయంలో మంచి సంగీతం వింటూ, కుటుంబ సభ్యులతో మంచి మాటలు చెబుతూ, శుభ్రమైన పక్క మీద నిద్ర పోవాలి. అదే నీరసానికి సరైన విరుగుడు. నిద్ర పోయే ముందు ఒక గ్లాసు మంచినీరు తాగితే మంచిది. -
లక్షలు గెలిచిన ఐడియా
కలలు అందరూ కంటారు. వాటిని నిజం చేసుకోవడానికి కొందరే ప్రయత్నిస్తారు. కొన్ని కలలు సగంలో ఆగిపోతాయి. కొన్ని కలలు ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తాయి. గృహిణులుగా ఇల్లు నడిపే స్త్రీలు ఆర్థిక స్వావలంబన కోసం ఎన్నో ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తారు. వాటికి వేదిక దొరికినప్పుడు గొప్పగా తమ ప్రతిభను చాటుతారు. దేశంలో వ్యాపార ఆలోచనలు చేయగల గృహిణులను ప్రోత్సహించడానికి, వారి ఆలోచనలు పది మందికి ఉపాధి ఇచ్చేటట్టయితే ఆర్థిక మొత్తం అందించడానికి బ్రిటానియా సంస్థ 2018 నుంచి ‘బ్రిటానియా మేరీగోల్డ్ మై స్టార్టప్’ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. 2018లో సీజన్1 కాంటెస్ట్ జరగగా 2020 ఫిబ్రవరిలో సీజన్ 2 కాంటెస్ట్∙మొదలయ్యి తాజాగా విజేతల ప్రకటన జరిగింది. ‘మీ దగ్గర మంచి వ్యాపారాలోచన ఉంటే అదే మీరు పాల్గొనడానికి యోగ్యత’ పేరుతో మొదలైన ఈ కాంటెస్ట్‌లో ఏ గృహిణి అయినా పాల్గొనవచ్చు. సీజన్2లో దేశంలో 32 రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 15 లక్షల ఎంట్రీలు వచ్చాయి. ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా గృహిణులు తమకున్న ఆలోచనలు పంచుకున్నారు. నిర్వాహకులు చెప్పడం కేవలం వాట్సప్ ద్వారా 25 శాతం ఎంట్రీలు వచ్చాయి. అనుభవజ్ఞులైన అంట్రప్రెన్యూర్లు, మీడియా నిపుణులతో కూడిన సెలెక్షన్ కమిటీ ఈ ఎంట్రీలన్నీ పరిశీలించింది. కరోనా కాలం కనుక ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. అనేక వడపోతల తర్వాత 50 మందితో షార్ట్‌లిస్ట్ తయారైంది. మళ్లీ వీరిని పరిశీలించి 10 మంది విజేతలను ప్రకటించారు. వీరిలో ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక బహుమతి అందించారు. అంతే కాదు... వీరిలో మంచి ఆలోచనలు చెప్పిన 10 వేల మందిని ఎంపిక చేసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎస్.డి.సి) సహాయం ప్రత్యేకమైన ఆన్లైన్ స్కిల్ ప్రోగ్రామ్ ద్వారా అంట్రప్రెన్యూర్‌గా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను అందిస్తారు. ‘బ్రిటానియా మేరీగోల్డ్ మై స్టార్టప్ కాంపెయిన్ 2020’ విజేతలుగా 1. జరీనా (తెలంగాణ), 2. షహనాజ్ తబస్సుమ్ (బిహార్), 3.నర్మత వసంతన్ (తమిళనాడు), 4.రాగిణి కుమారి (జెంషెడ్పూర్), 5.షిఖా డే (పశ్చిమ బెంగాల్), 6. అర్చన.పి (తమిళనాడు), 7.ఎలాక్షి ఫుకన్ (అస్సామ్), 8. దీప్తి బన్సాల్ (హర్యానా), 9.సరీనా.సి (కేరళ), 10. సుమతి.ఆర్ (కాంచీపురం) నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన జరీనా ‘లెనిన్ బేబీ క్లోతింగ్’ తయారీ కేంద్రం ప్రారంభించాలనుకుంటున్నానని, దిగువ శ్రేణి వర్గాల మహిళలకు అందులో ఉపాధి కల్పించనున్నానని తన ఐడియా చెప్పి బహుమతి గెలుచుకున్నారు. ‘మూడేళ్ల లోపు పిల్లల బట్టలను అనే సంస్థలు ఉత్పత్తి చేస్తున్నా లెనిన్ వస్త్రంతో సౌకర్యంగా, ఫ్యాషన్‌గా ఎవరూ తయారు చేయడం లేదు. కనుక ఆ ఏరియాలో ఆశాజనకమైన ఆర్థిక ఫలితాలు ఉంటాయని భావిస్తున్నాను’ అని జరీనా చెప్పారు. హర్యానాకు చెందిన దీప్తి బన్సాల్ ‘వెజిటెబుల్ అండ్ ఫ్రూట్ శానిటైజర్’ తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. అస్సామ్కు ఎలాక్షి సుగర్ ఫ్రీ అస్సామీ సంప్రదాయ స్వీట్లు తయారీ ఐడియాకు బహుమతి పొందారు. కేరళకు సరీనా ‘కేజ్ ఫిష్ ఫామ్’ తన వ్యాపార కలగా చెప్పుకున్నారు. తమిళనాడుకు చెందిన అర్చన పిల్లల కోసం ఒక సైన్స్ మ్యూజియం తెరుస్తానని చెప్పి బహుమతి పొందడం గమనార్హం. కంప్యూటర్ ట్రయింగ్ సెంటర్, హెల్త్ మసాజ్ సెంటర్ల ఐడియాలకు కూడా బహుమతులు దక్కాయి. వీరే కాదు ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్న వేలాది మంది స్త్రీలు ఎన్నో వినూత్న ఆలోచనలు పంచుకున్నారు. స్త్రీలకు అవకాశం ఇవ్వగలిగితే వ్యాపార, ఉపాధి రంగాలలో గొప్ప ప్రతిభను చాటగలరని ఈ కాంటెస్ట్ మరోసారి నిరూపించింది. ఈసారి ఈ కాంపెయిన్‌ని మిస్ అయినవారు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో తప్పక పాల్గొనండి. -
భారత బిగ్గెస్ట్ సీఈవోలు వారే : ఐశ్వర్య రాయ్
న్యూఢిల్లీ : 'హౌజ్ వైఫ్' అనే పదం వినడానికి ఎంత తేలికగా ఉన్నా... ఆ బాధ్యతలు నిర్వర్తించడం ఎంత కష్టమో ప్రతి ఒక్క అమ్మాయికి తెలిసే ఉంటుంది. ఇంటి బాధ్యతల్ని ఎప్పడికప్పుడూ నెరవేరుస్తూ.. పిల్లలకు, భర్తకు, అత్తామామలకు ఎలాంటి లోటు రాకుండా రేయింబవళ్లు కష్టపడాల్సి ఉంటుంది. చాలా మంది మగాళ్లు హౌజ్ వైఫేగా అంటూ తేల్చి పడేస్తూ ఉంటారు. కానీ వారే కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరించే కంటే ఎక్కువ బాధ్యతలు వ్యవహరిస్తారట. తాజాగా ఈ విషయాన్ని ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఒప్పుకున్నారు. భారత్‌లో అతిపెద్ద సీఈవోలు హౌజ్ వైఫ్‌లేనని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. తన తాజా సినిమా ఫన్నీ ఖాన్ ప్రమోట్ చేసుకోవడానికి ఓ డ్యాన్స్ షోలో పాల్గొన ఆమె ఈ ప్రకటన చేశారు. ‘హౌజ్ వైఫ్‌లే భారత్‌లో అతిపెద్ద సీఈవోలు. వారికి మనం అత్యంత ఉన్నతమైన గౌరవం, ప్రశంస ఇవ్వాలి. మన దేశంలో, ప్రపంచంలో ఉన్న హౌజ్ వైఫ్‌లందరికీ ఎంతో గౌరవంతో, ప్రశంసతో చేతులెత్తి నమస్కరిస్తున్నా’ అని తెలిపారు. ఐశ్వర్య రాయ్ చేసిన ఈ ప్రకటనకు, సింగర్ విశాల్ డాడ్లని కూడా మద్దతిచ్చారు. ఆ డ్యాన్స్ షోలో ఆయన కూడా జడ్జి. ఐశ్వర్య రాయ్ కూడా మిగతా హౌజ్‌వైఫ్‌ల మాదిరి ప్రపంచంలో అత్యంత సుందరమైన మహిళల్లో ఒకరు అని విశాల్ కొనియాడారు. ‘నా మ్యూజిక్ టూర్ల సమయంలో ఒకసారి అమితాబ్ జీ మమ్మల్ని డిన్నర్ పార్టీకి ఆహ్వానించారు. ప్రపంచంలో అత్యంత సుందరి అయిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆమె స్వహస్థాలతో మాకు డిన్నర్ వడ్డించింది. ఆ పార్టీకి సిబ్బంది అంతా వెళ్లాం. ప్రతి ఒక్కరికీ ఆమెనే సర్వ్ చేసింది. మేము అందరం తిన్న తర్వాతనే, ఐశ్వర్య భోజనం చేసింది’ అని విశాల్ గుర్తు చేసుకున్నారు. ఐశ్వర్య తన వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల తన ఆరేళ్ల కూతురు ఆరాధ్యతో కలిసి పారిస్ ట్రిపులో పాల్గొనడమే. ఐశ్వర్య వర్క్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, తన కూతురు కోసం కూడా కాస్త సమయాన్ని వెచ్చిస్తూ.. ఆరాధ్యతో కలిసి ఈఫిల్ టవర్, డిస్నీల్యాండ్ సందర్శించారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి కూడా. 2007లో ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ 20న ఈ కపుల్ తమ 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. తన లేటెస్ట్ మూవీ ఫన్నీ ఖాన్ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. నెక్ట్స్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలసి ఐశ్వర్యా రాయ్ నటించబోతున్నారు. -
కొంప కొలాప్స్
ఇళ్లు.. లాడ్జీలు.. పొలాలు.. ఖాళీ స్థలాలు.. కావేవీ పేకాటకనర్హం అన్నట్లుంది. ఒకప్పుడు ఎక్కడో మారుమూల గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించే పేకాట కేంద్రాలు ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా నడుస్తున్నాయి. వీటికి రాజకీయ నేతల అండదండలు మెండుగా ఉండడం విశేషం. నగరంలో జోరుగా పేకాట - నిర్వాహకులకు రాజకీయ అండ - మిన్నకుండిపోతున్న పోలీసులు - ఇల్లు గుల్ల చేసుకుంటున్న జూదరులు - గగ్గోలు పెడుతున్న గృహిణులు విజయవాడ సిటీ : గతంలో పేకాట కోసం పొరుగు జిల్లాలు, చెన్నై వంటి నగరాలకు జూదరులు వెళ్లేవారు. ఇప్పుడు అందుబాటులోనే ‘కోత ముక్క’లాట నడుస్తుండటంతో లక్షలు పట్టుకుని ఇక్కడికి చేరుకుంటున్నారు. పేకాట వ్యసనంతో అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతుంటే.. ఆర్గనైజర్లు మాత్రం ‘బంకినీ’ (నిర్వాహకుల కమీషన్) రూపంలో లక్షలు ఆర్జిస్తున్నారు. కొందరు పెద్దల కోరిక మేరకు దాడులు వద్దంటూ పోలీసు బాస్‌లు మౌఖికంగా ఆదేశించడంతో కిందిస్థాయి అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు లక్షలాది రూపాయలను నెలవారీ మామూళ్ల రూపంలో గుంజుతున్నారని సమాచారం. నగరంలో నిర్వహిస్తున్న పేకాటపై గృహిణులు మండిపడుతున్నా పోలీసుల్లో మాత్రం చలనం లేదు. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అనధికారిక పేకాట క్లబ్‌లలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఊరికి సమీపంలోని పొలాల్లో షామియానాలు, పాకలు వేసి పేకాటలు నిర్వహిస్తున్నారు. ఏలూరు, గుంటూరు నగరాల నుంచి ఖరీదైన కార్లలో పేకాటరాయుళ్లు వచ్చి జూదంలో బలవుతున్నారు. రామవరప్పాడు వంతెన సమీపంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి డ్రైవర్ ఏర్పాటు చేసిన పేకాట శిబిరానికి రోజూ 100 నుంచి 150 మంది జూదరులు వస్తుంటారు. ఒక్కొక్కరు లక్ష రూపాయలకు తక్కువ తీసుకురారంటే అక్కడ జరిగే పేకాట ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పటమట, పెనమలూరు, పోరంకి, తాడిగడప వంటి ప్రాంతాల్లో రోజువారీ పద్ధతిలో అతిథి గృహాలను అద్దెకు తీసుకుని మరీ పేకాట క్లబ్‌లను నిర్వహిస్తున్నారు. ఇక హోటల్స్, లాడ్జీల్లో పేకాట సర్వసాధారణంగా మారింది. సకల సౌకర్యాలు పేకాటరాయుళ్లకు నిర్వాహకులు అన్ని వసతులు సమకూరుస్తున్నారు. మద్యం, ఖరీదైన భోజనంతోపాటు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏసీ గదులు కూడా ఏర్పాటుచేస్తారు. ఆడేవారితో పాటు చూసేందుకు వచ్చే వారికి కూడా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆటలో తెచ్చిన నగదు పోగొట్టుకుంటే ఫైనాన్స్ సౌకర్యం కూడా ఏర్పాటుచేస్తారు. ఉదయం రూ.10 వేలు తీసుకుంటే సాయంత్రానికి రూ.12 వేలు జమచేయాలి. లేదంటే ఇంటి కాగితాలు, విలువైన భూములు తనఖా పెట్టాల్సి ఉంటుంది. పోలీసులకు తెలిసే.. నగరంలో విస్తరించిన పేకాట మాఫియా పోలీసులకు తెలియనిదేమీ కాదు. పై అధికారులు ఆదేశాలున్నాయంటూ దాడులకు దూరంగా ఉంటున్నారు. కొందరు పోలీసులు మాత్రం నిర్వాహకులను బెదిరించి డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులకు కూడా భారీగానే మామూళ్లు ముడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల రామవరప్పాడు సమీపంలో పోలీసులు దాడి చేసి పేకాటరాయుళ్ల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి రాక ముందే తెలియడంతో నిర్వాహకుల సూచన మేరకు పేకాటరాయుళ్లు పరారయ్యారు. ఈ దాడికి పోలీసుల్లో నెలకొన్న అభిప్రాయభేదాలే కారణమని కమిషనరేట్ వర్గాల సమాచారం. -
పెట్ ఉంటే పదేళ్లు యంగ్..!
గృహిణులు, ిసీనియర్ సిటిజన్ల జీవితాల్లో పెంపుడు జంతువులు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయంటున్నారు అధ్యయనకర్తలు. ఒక పెట్‌ను పెంచుకోవడం నిస్తేజాన్ని పోగొడుతుందని అంటున్నారు. బ్రిటన్‌కు చెందిన ఒక యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం శునకాన్ని లేదా పిల్లిని పెంచుకొనేవారు ఇతరుల కన్నా 12 శాతం ఉత్సాహంగా ఉంటారని తేలిందట. దాని పోషణపైన, లాలించడం మీద దృష్టిపెట్టడం, దానితో మానసికంగా బంధాన్ని ఏర్పరుచుకోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు. పెట్‌ను పెంచుకొనే వారిలో తమకన్నా పదేళ్లు తక్కువ వయసువారిలో ఉండే ఉత్సాహం ఉంటుందని వర్సిటీ అధ్యయనకర్తలు అభ్రిపాయపడ్డారు. ఇళ్లకు పరిమితమై జీవితాలు యాంత్రికంగా మారాయనే వారు తక్షణం ఒక పెట్ పోషణపై దృష్టి పెట్టాలని వారు సూచించారు. -
‘అమ్మ’కు బలహీనత
సాక్షి, ఒంగోలు: గ్రామీణ పేదమహిళలు, బాలికలతో పాటు పట్టణాల్లోని వారు రక్తహీనతతో బాధపడుతున్నారు. గృహిణులు, ఉద్యోగులు, పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికల్లో ఈసమస్య అధికంగా ఉంది. ఒంగోలులోని ‘రిమ్స్’ ఆస్పత్రికి వివిధ రోగాలతో వచ్చి చికిత్స చేయించుకునే మహిళల్లో 70 నుంచి 85 శాతం మందిలో రక్తహీనత ఉందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ ఇవే నివేదికలున్నాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల సిబ్బంది తరచూ తమ ఆస్పత్రి పరిధిలోని ప్రాంతాల్లో పర్యటిస్తూ రక్తపరీక్షలు చేస్తున్నప్పటికీ, మహిళల్లో పెరుగుతోన్న రక్తహీనత సమస్యపై నివేదికలను జిల్లాకేంద్రానికి పంపడం లేదనే ఫిర్యాదులున్నాయి. అంటే, గ్రామీణ మహిళలంతా ఆరోగ్యకరంగా ఉన్నారని.. ఎక్కడా ఎనీమియా బాధితుల్లేరని అధికారికంగా చెప్పడానికి ప్రభుత్వ అధికారులు వెనుకంజవేయడం గమనార్హం. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం ఎక్కించాలన్నా జిల్లాలో రక్తం నిల్వలు నిండుకున్నాయి. ఒక్క జిల్లా కేంద్రంలోనే రోజుకు 50 యూనిట్లు రక్తం అవసరం కాగా, ప్రస్తుతం 20 యూనిట్లు రక్తం అందించడం కనాకష్టమౌతోంది. రక్తహీనత దుష్ఫలితాలివీ.. జిల్లాలో మాతాశిశు మరణాలను నియంత్రించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది కృషిచేస్తూనే ఉన్నా ఏటా మాతాశిశు మరణాల రేటు మాత్రం తగ్గకపోవడానికి కారణాల్ని అన్వేషించే నాథుడు కరువయ్యాడు. గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత ఉంటే కాళ్లుచేతులకు నీరు పట్టడం, మొఖం ఉబ్బడం, శరీరం పాలిపోయినట్లు కనిపించడం వంటి లక్షణాల్ని గమనించవచ్చు. ఇలాంటి బాధితులు బిడ్డల్ని ప్రసవించలేక..పురిటినొప్పులు భరించేంత బలం, శక్తి లేకపోవడంతో అధికశాతం తల్లులు మృత్యువు పాలవతున్నారు. సాధారణ మహిళల్లో నెలవారీ రుతుక్రమంతో పాటు గర్భిణుల్లో ప్రసవ సమయాల్లో జరిగే రక్తస్రావం ప్రాణాల మీదికి తెచ్చే ప్రమాదముంది. అధిక రక్తస్రావం సమస్యతో మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీలు, ఒంగోలు రిమ్స్‌ను వచ్చే రోగులు ఎక్కువగా ఉన్నారని గైనిక్ వైద్యులు చెబుతున్నారు. సిజేరియన్ ఆపరేషన్లే అధికం.. అధికశాతం మంది గర్భిణులు నొప్పులు తట్టుకోలేక.. ప్రసవం కష్టం కావడంతో సిజేరియన్లకు సిద్ధపడుతున్నారు. జిల్లాలో ఏడాది కాలంలో మొత్తం 10,263 ప్రసవాలు జరగ్గా.. వాటిల్లో 3,800 సిజేరియన్ ప్రసవాలు ప్రయివేటు ఆస్పత్రుల్లో జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 656 సిజేరియన్ ప్రసవాలు జరగ్గా.. 82 మంది మాత్రం ఇంట్లోనే పురుడు పోసుకున్నారు. మిగతావన్నీ సాధారణ ప్రసవాలున్నాయి. ఏదిఏమైనా గర్భిణులు, బాలింతలకు ఆపరేషన్ల అవసరం ఏర్పడినా.. వారితో పాటు శిశువులు మృత్యువాత పడటాన్ని రక్తహీనతతో ముడిపెట్టి చూడాల్సిందేనంటున్నారు ప్రముఖ శస్త్రవైద్య నిపుణులు. గతంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు వైద్య, ఆరోగ్య సిబ్బందితోపాటు జవహర్ బాల సంరక్షణ సిబ్బంది వెళ్లి రక్తపరీక్షలు చేసేవారు. అలాంటిది, వారు తూతూమంత్రం నివేదికలతో కాలం వెళ్లబుచ్చుతున్నారనే విమర్శలున్నాయి. జిల్లాలో గర్భిణులు, బాలింతలు, శిశువులకు పోషకాహారం పంపిణీ చేయాల్సిన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు, సామాజిక, స్వచ్ఛంద సంఘాలు మేల్కొని జిల్లాలో రక్తం నిల్వలు అందుబాటులో ఉంచేందుకు సహకరించాలి. పోషకాహార లోపంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. -
శ్రావణం వ్రత సమయం.. శుభతరుణం
సందర్భం - శ్రావణం శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు నోములు, వ్రతాల సందడితో కళకళలాడుతూ లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉంటుంది. తన ప్రాణనాథుడు శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్రం పేరుమీదుగా వచ్చిన మాసం కాబట్టి లక్ష్మీదేవికి ఈ మాసమంటే ఎంతో ఇష్టం. లక్ష్మీవిష్ణువులకు ప్రీతిపాత్రమైన ఈ మాసం శుభకార్యాలు నిర్వహించేందుకు అత్యంత అనువైంది. ఈ నెల 27 నుంచి శ్రావణమాసం ఆరంభమవుతున్న సందర్భంగా ఈ వ్యాస కుసుమం. గృహిణులు ఈ నెలరోజులూ ఇంటిముంగిట శుభ్రంగా ఊడ్చి, కళ్లాపు చల్లి, అందమైన రంగవల్లులు తీర్చిదిద్ది, గుమ్మానికి మంగళతోరణాలు కట్టి, కళకళలాడుతూ ఉంటే కనుక లక్ష్మీదేవి ఆ ఇంటిముంగిలికి వచ్చి, ముగ్గులో కాలుపెట్టి, తాను కొద్దికాలం పాటైనా వసించడానికి ఆ ఇల్లు యోగ్యమైనదా కాదా అని ఆలోచిస్తుందట. చంచల స్వభావురాలైన లక్ష్మీదేవిని కొద్దికాలం పాటైనా మన ఇంటిలో కొలువుండేలా చేయాలంటే ఒకటే మార్గం... ఏ రూపంలోనైనా మన ఇంటికి రాగల అవకాశం ఉన్న శ్రావణమాసంలో ఇంటికి వచ్చిన ముత్తయిదువులను మనసారా ఆహ్వానించి, కాళ్లకు పసుపు పూసి, నొసట బొట్టుపెట్టి, పండ్లు, పూలు, రవికెల గుడ్డ వంటి మంగళకరమైన వస్తువులనిచ్చి మర్యాద చేయడమే. శ్రావణమాసంలో నోములు- వ్రతాలు సోమవార వ్రతం: శ్రావణమాసంలో ఆచరించాల్సిన వ్రతాలలో సోమవారం వ్రతం ఎంతో విశిష్టమైనది. ఈ రోజున శివుని ప్రీత్యర్థం ఉపవాసం లేదా నక్తవ్రతాన్ని ఆచరించడం వల్ల సత్ఫలితాలను సాధించవచ్చు. సోమవార వ్రతంలో పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివుని శక్తికొలది అభిషేకించి ఆర్చించాలి. రోజంతా ఉపవసించడం ఈ వ్రతవిధి. ఉండలేనివారు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం పూజానంతరం భుజించవచ్చు. మంగళగౌరీ వ్రతం: శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా వివాహమైన స్త్రీలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నారదుడు సావిత్రీదేవికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశించినట్లుగా చెప్పబడింది. ఈ వ్రతంలో పగలు విధివిధానంగా మంగళగౌరీ దేవిని పూజించాలి. పూజలో ఉత్తరేణి దళాలు, గరికతో గౌరీదేవిని అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైవులను పిలిచి నానబెట్టిన శనగలను వాయనంగా ఇవ్వాలి. ఈ వ్రతంలో తోర పూజ ప్రత్యేకంగా చెప్పబడింది. ఈ వ్రతాన్ని పెళ్లయినప్పటి నుండి అయిదు సంవత్సరాలు ఆచరించాలి. ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొనసాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి. వరలక్ష్మీవ్రతం: శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాచరణ వల్ల లక్ష్మీదేవి కృప కలిగి కోరిన కోరికలు తీరతాయి. సకల శుభాలూ చేకూరతాయని వ్రత మహాత్మ్యం చెబుతోంది. సూపౌదన వ్రతం: శ్రావణ శుద్ధ షష్ఠి రోజున ఆచరించే ఈ వ్రతం శివ సంబంధమైనది. సూపౌదనం అంటే పప్పు -అన్నం (సూప: పప్పు, ఓదనం: అన్నం). ఈ రోజున ప్రదోషంలో శివుని షోడశోపచారాలతో పూజించి, బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పసుపు, మిరియాలు, ఉప్పు మొదలైన వాటితో వండిన పులగాన్ని నివేదించాలి. ఈ వ్రతాచరణ వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని పురాణోక్తి. అవ్యంగసప్తమీ వ్రతం: శ్రావణశుద్ధ సప్తమి రోజున అవ్యంగ సప్తమీ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతంలో సూర్యుణ్ని షోడశోపచారాలతో పూజించాలి. పూజానంతరం సూర్యుని ప్రీతికొరకు నూలు వస్త్రాన్ని దానంచేయాలి. ఈ వ్రతాచరణవల్ల ఆరోగ్యం చేకూరుతుంది. పుష్పాష్టమీ వ్రతం శ్రావణ శుద్ధ అష్టమి నుండి పుష్పాష్టమీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున పలురకాల పుష్పాలతో శివుణ్ని పూజించాలి. ఆ తరువాత సంవత్సరం పొడవునా ప్రతి నెలలోనూ శుద్ధ అష్టమి రోజు ఆయా నెలలో లభించే పుష్పాలతో శివుని అర్చించాలి. అనంగ వ్రతం: శ్రావణశుద్ధ త్రయోదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్ర తంలో కుంకుమ కలిపిన అక్షతలతోనూ, ఎర్రని పూలతోనూ రతీమన్మధులను పూజించాలి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్థలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు ఈ శ్రావణమాసంలో పర్వదినాలు జులై 30, బుధవారం: నాగచతుర్థి, కొన్ని ప్రాంతాలలో ఈవేళ నాగుల చవితిగా జరుపుకుంటారు. ఆగస్టు 1, శుక్రవారం: నాగపంచమి. సకల శుభకార్యాలకు ఈరోజు మంచిది. ఆగస్టు 6, బుధవారం: శ్రావణ శుద్ధ దశమి. మనిషికి ఉండే ఆశలన్నీ ఈరోజున ఆచరించే వ్రతం వల్ల తీరతాయట. అందుకే దీనికి ఆశాదశమి అని పేరు. ఆగస్టు 7, గురువారం: పుత్రదా ఏకాదశి. ఈరోజున ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహాజిత్తు అనే రాజు సంతానాన్ని పొందాడు కనుక దీనికే పుత్రదా ఏకాదశి అని పేరు. ఆగస్టు 8, శుక్రవారం: దామోదర ద్వాదశి. నేడు శ్రీమహావిష్ణువును దామోదరుని రూపంలో పూజించవలసిన రోజు. ఆగస్టు 10, ఆదివారం: శ్రావణ పూర్ణిమ. యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరూ నేడు జీర్ణయజ్ఞోపవీతాన్ని విసర్జించి, నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం ఆచారం. అలాగే సోదరులకు, సోదరవాత్సల్యం కలవారికీ నేడు అక్కచెల్లెండ్లు రక్షాబంధనం కట్టడం పురాణకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఆగస్టు 14, గురువారం: గురురాఘవేంద్రుల జయంతి. గురు రాఘవేంద్రులవారు మంత్రాలయంలో మహాసమాధి పొందిన పుణ్యతిథి ఇది. ఆగస్టు 16, శనివారం: శ్రావణ బహుళ షష్ఠి. దీనికి సూర్యషష్ఠి అని పేరు. ఈరోజున ఆదిత్యహృదయం పారాయణం, సూర్యనమస్కారాలు చేయడం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తొలగి ఆయురారోగ్య ఐశ్యర్యాలు కలుగుతాయని పురాణోక్తి. ఆగస్టు 17, ఆదివారం: శ్రీ కృష్ణాష్టమి. శ్రీమహావిష్ణువు లోకకళ్యాణం కొరకు కృష్ణావతారంలో భూమిమీద అవతరించిన పర్వదినమిది. ఇలా ఒకటేమిటి- అనేకానేక పర్వదినాల మయమైన ఈ మాసంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం, సోమవారాలు ఈశ్వరునికి అభిషేకం చేయించడం, శనివారం నాడు వేంకటేశ్వర స్వామివారికి పిండి దీపారాధన చేయడం శుభఫలితాలనిస్తుంది. లక్ష్మి అంటే కేవలం సంపద మాత్రమే కాదు, సంపద అంటే డబ్బు మాత్రమే కాదు. ఆయుష్షు, ఆరోగ్యం, సౌభాగ్యం, ధనం, ధాన్యం, వస్తువులు, వాహనాలు, పశువులు, పంటలు, బంగారం, వెండి, శాంతి, స్థిరత్వం కూడా! కాబట్టి అష్టైశ్వర్యాలను పొందాలనుకునేవారు అమ్మవారి అనుగ్రహం పొందగలగడానికి అనువైన ఈ మాసం రోజులూ అత్యంత నిష్ఠాగరిష్ఠులై, సంప్రదాయబద్ధులై వ్యవహరించాలని శాస్త్రం చెబుతోంది. - డి. కృష్ణకార్తిక -
వైఎస్సార్సీపీ మేనిఫెస్టోప్రగతే లక్ష్యం
అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం 8 లైన్లుగా జాతీయరహదారి నిర్మాణం గ్యాస్ వినియోగదారులకు ఊరట స్థిరీకరణ నిధితో రైతుకు మేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రగతి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కనిపించింది. అభివృద్ధిలో జిల్లాకు సముచితమైన చోటు దక్కింది. జిల్లా అభివృద్ధికి వరాలు ప్రకటించడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసిన మేనిఫెస్టోలో జిల్లాకు చోటు లభించింది. ఇతర పార్టీల మాదిరిగా ఆచరణకు సాధ్యంకాని హామీలను గుప్పించకుండా ప్రజాసమస్యల పరిష్కారం, నూతన రాజధాని నిర్మాణంతో పాటు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఆచరణాత్మకమైన హామీలను మేనిఫెస్టోలో చేర్చింది. అన్నదాతలు మొదలుకొని విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇలా అన్ని వర్గాలకు మేలు చేసేలా తయారుచేసిన మేనిఫెస్టోని ఆదివారం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. ముఖ్యంగా జిల్లాకు వరాలు ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా ‘గన్నవరం’... ప్రధానంగా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రసుత్తం విమానాశ్రయం 500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిని విస్తరించాలని మరో 400 ఎకరాల భూసేకరణకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తొలి ప్రాధాన్య అంశంగా దీనిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనున్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో తొలుత ఒక వృద్ధాశ్రమం, అనాథాశ్రమం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, మండలంలో 102 సేవలు ప్రారంభం ఇలా అనేక ఆచరణాత్మక హామీలను పార్టీ ప్రకటించింది. మేనిఫెస్టో ప్రకటనపై జిల్లాలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని అంశాలపై, అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించారని, జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజల కష్టాలు కచ్చితంగా తొలగుతాయని మేనిఫెస్టో ద్వారా రుజువైందనే అభిప్రాయం జిల్లాలోని అన్నివర్గాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. అన్నదాతకు మేలు... జిల్లాలో 7.35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు ఉన్నాయి. ప్రధానంగా 6.35 లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 45 వేల ఎకరాల్లో చెరుకుతో పాటు ఉద్యానవన పంటలు సుమారు 25 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. ముఖ్యంగా వరి రైతుకు పంట సాగుకు క్వింటాలుకు సగటున రూ.1766 వరకు ఖర్చు అవుతుంటే ప్రభుత్వం రూ.1,355 మద్దతు ధర ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా వారు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది రైతులకు పూర్తిగా మేలు చేస్తుంది. అమ్మ ఒడి పథకం ద్వారా వేలాది మంది విద్యార్థులు పూర్తిస్థాయిలో చదువుకునే అవకాశం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2.50 లక్షల ఎకరాలకు విద్యుత్ మోటార్ల ద్వారానే నీటి సరఫరా జరగాల్సి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల పాటు నిరంతరంగా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేస్తారు. గ్యాస్ భారం నుంచి ఊరట... ముఖ్యంగా భారంగా మారిన గ్యాస్ ధరల నుంచి ప్రజలకు కొంత ఊరట కలగనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెరిగిన గ్యాస్ ధరలో రూ.100ను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. తద్వారా జిల్లాలో 11.61 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. పింఛనుదార్లకు నెలకు రూ.500 అదనంగా అందనున్నాయి.