Favorite
-
ఓటీటీ స్నాక్స్ ట్రెండింగ్..!
థియేటర్లో నచ్చిన స్నాక్స్ తింటూ ఫేవరెట్ మూవీని ఎంజాయ్ చేయడం కామన్! ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా దొరుకుతుండటంతో వినోదం ఇంట్లోనే మూడు సినిమాలు ఆరు వెబ్ సిరీస్‌లుగా వెలిగిపోతోంది. యువతరానికి ముఖ్యంగా జెన్ జెడ్‌కు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు బాగా కనెక్ట్ కావడంతో ఫుడ్, స్నాక్స్ బ్రాండ్లు దీన్ని ఒక సరికొత్త వ్యాపారావకాశంగా మార్చుకుంటున్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ–హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 తదితర ఓటీటీ దిగ్గజాలతో జట్టుకట్టి సరికొత్త కో–బ్రాండెడ్ ప్యాక్‌లతో పాప్‌కార్న్ నుంచి ఐస్‌క్రీమ్ వరకూ అన్నింటినీ ప్రత్యేకంగా చేతికందిస్తున్నాయి.ఓటీటీ స్ట్రీమింగ్ దుమ్మురేపుతుండటంతో స్నాక్స్, పుడ్ బ్రాండ్స్ దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా ప్రీమియం పాప్‌కార్న్ బ్రాండ్ 4700బీసీ ప్రత్యేకంగా ఓటీటీ యూజర్ల కోసం కో–బ్రాండెడ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టేందుకు నెట్‌ఫ్లిక్స్‌తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని ఈ–కామర్స్, క్విక్ కామర్స్‌తో పాటు రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులోకి తెస్తోంది. ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మునిగితేలే జెన్ జెడ్ కుర్రకారును టార్గెట్ చేసేందుకు ఇది సరైన మార్గం’ అని 4700బీసీ ఫౌండర్, సీఈవో చిరాగ్ గుప్తా చెబుతున్నారు. ఇదొక్కటేకాదు కిట్‌క్యాట్, కారి్నటోస్, ప్రింగిల్స్, కోకాకోలా, ఓరియో, థమ్సప్‌తో పాటు సఫోలా మసాలా ఓట్స్ తదితర స్నాక్స్ బ్రాండ్స్ సైతం సేల్స్ పెంచుకోవడం కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో జట్టుకట్టిన వాటిలో ఉన్నాయి.అల్టీమేట్ ‘బ్రేక్’.. వినోదంతో పాటు రుచికరమైన మంచింగ్ కూడా ఉంటే ‘ఆహా’ అదిరిపోతుంది కదూ! అందుకే నెస్లే తన కిట్ క్యాట్ చాక్లెట్లను ఓటీటీ యూజర్ల చెంతకు చేర్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ‘సబ్స్క్రిప్షన్’ తీసుకుంది. ‘అల్టీ మేట్ బ్రేక్’ పేరుతో కో–బ్రాండెడ్ ప్రచారానికి తెరతీసింది. తద్వారా ప్రత్యేక ఓటీటీ కిట్‌క్యాట్ ప్యాక్‌లను విడుదల చేయడంతో పాటు నెట్‌ఫ్లిక్స్ షోలు.. స్క్విడ్ గేమ్, కోటా ఫ్యాక్టరీతో జతకట్టింది. గిఫ్టింగ్ సంస్థ అల్యూరింగ్ బాస్కెట్ అయితే ప్రింగిల్స్, కిట్‌క్యాట్, కోకాకోలాతో కూడిన బండిల్డ్ ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ’నెట్‌ఫ్లిక్స్ – చిల్’, ‘జస్ట్ వన్ మోర్ ఎపిసోడ్’ పేరుతో ఓటీటీ లవర్స్ కోసం వీటిని విక్రయిస్తోంది.ఓటీటీ వినోదంతో పాటు స్నాక్స్‌ను ప్రమోట్ చేసే విధంగా బీన్ ట్రీ ఫుడ్స్ కూడా ప్రత్యేక ప్యాక్‌లను అందిస్తోంది. ఇక మాండెలెజ్ కుకీ బ్రాండ్ ఓరియో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’తో జట్టుకట్టడం ద్వారా ఓరియో రెడ్ వెల్వెట్‌ను ప్రవేశపెట్టేలా ఒప్పందం కుదుర్చుకుంది. కోకాకోలా థమ్సప్.. డిస్నీ–హాట్‌స్టార్‌తో కలిసి ‘థమ్సప్ ఫ్యాన్ పల్స్’ ప్రచారం నిర్వహిస్తుండగా.. మారికో తన సఫోలా మసాలా ఓట్స్ కో–బ్రాండెడ్ ప్యాక్స్ విక్రయానికి జీ5తో డీల్ కుదుర్చుకుంది.’స్నాక్స్ బ్రాండ్ల అమ్మకాల ఆధారంగా లాభాల పంపకం లేదా సంస్థలు ఒకరికొకరు తమ యాడ్లలో ప్రచారం కల్పించుకోవడం, లేదా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో నేరుగా లింక్‌లను ఇవ్వడం ద్వారా స్నాక్స్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను విక్రయించడం వంటి మార్గాల్లో డీల్స్ కుదురుతున్నాయి’ అని ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ‘కంటెంట్‌ను చూస్తూ, నచి్చన స్నాక్స్ తినే అలవాటు ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. ప్రత్యేకంగా ఓటీటీ యూజర్లను దృష్టిలో పెట్టుకుని 4700బీసీ ఇతర బ్రాండ్లతో జట్టుకట్టాం’ అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా మార్కెటింగ్ పార్ట్నర్షిప్స్ హెడ్ పూరి్ణమ శర్మ చెప్పారు. ఓటీటీ జోరు.. ఫుడ్ ఆర్డర్ల తోడు! దేశంలో కరోనా కాలంలో బంపర్ హిట్ కొట్టిన ఓటీటీ స్ట్రీమింగ్.. ముఖ్యంగా యువత, మహిళలకు బాగా చేరువైంది. కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ’బాక్సాఫీస్’ కళకళలాడిపోతోంది. గతేడాది 70.7 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా కంటెంట్‌ను చూసినట్లు ఇంటర్నెట్ ఇన్ ఇండియా–2023 నివేదిక అంచనా వేసింది. మరోపక్క, ఈ వీడియో ఆన్ డిమాండ్ సబ్‌్రస్కిప్షన్ మార్కెట్ 2027 నాటికి 2.77 బిలియన్ డాలర్లకు ఎగబాకనున్నట్లు లెక్కగట్టింది.ఇదిలా ఉంటే, రెడీ–టు–ఈట్ లేదా రెడీ–టు–కుక్ ఆహారోత్పత్తుల వృద్ధికి తోడు డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్‌తో స్నాక్స్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ విస్తరణ జోరుతో చిన్న పట్టణాల్లోనూ స్నాక్న్ బ్రాండ్స్ రెండంకెల అమ్మకాల వృద్ధిని సాధిస్తున్నాయి. 2023లో దాదాపు రూ.43,000 కోట్లుగా ఉన్న భారతీయ స్నాక్స్ మార్కెట్ 2032 నాటికి రూ.95,000 కోట్లకు పైగా ఎగబాకుతుందనేది మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐమార్క్ గ్రూప్ అంచనా. – సాక్షి, బిజినెస్ డెస్క్ఫుల్ చిల్!70.7 కోట్లు: గతేడాది ఓటీటీ స్ట్రీమింగ్‌ను ఉపయోగించుకున్న ఇంటర్నెట్ యూజర్లు2.77 బిలియన్ డాలర్లు: 2027 నాటికి వీడియో ఆన్ డిమాండ్ సబ్ర్స్కిప్షన్ మార్కెట్ వృద్ధి అంచనా.రూ. 95,520 కోట్లు: 2032 నాటికి భారతీయ స్నాక్స్ మార్కెట్ పెరుగుదల అంచనా. -
ఒదిగితేనే ఎదుగుదల
ఉరుకులు పరుగులతో ఉరవడిగా వచ్చి తనని చేరిన నదిని సముద్రుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ‘‘నీ ప్రవాహ వేగానికి మహావృక్షాలు విరిగి పడిపోతూ ఉంటాయి. ప్రబ్బలి మొక్కలు అలాగే ఉంటాయి. వాటిని నువ్వు ఏమీ చేయవా?’’ అని. నది ఈవిధంగా సమాధానం చెపుతుంది. ‘‘ప్రబ్బలి మొక్కలు వేగంగా ప్రవాహం వస్తుంటే ఎదురు నిలవక తలవంచి ఉంటాయి. ప్రవాహ వేగం తగ్గగానే యథాప్రకారం తలెత్తుతాయి. మహావృక్షాలు తలవంచవు’’ అని!నది చెప్పినది వృక్షాలకి సంబంధించినదే అయినా మనకి కూడా వర్తిస్తుంది. ఎగిరెగిరి పడినా, ఎదిరించి నిలిచినా, ఎదురొడ్డి నిలిచినా విరిగి పడటం జరుగుతుంది. పొగరు బోతు గొర్రె పొటేలు కొండని గెలవగలనని కుమ్మి తల చిట్లి నశించినట్టు అవుతుంది. తమకి శక్తి లేక పోయినా అహంకారంతో ఎదుటివారి శక్తి సామర్థ్యాలని తక్కువగా అంచనా వేసి దెబ్బతింటూ ఉంటారు మహావృక్షాల వంటి వారు. పైగా తమ నీడలో మరి ఏ మొక్కకి కూడా పెరిగే అవకాశం ఇవ్వరు. దానితో ఆపదలో ఆదుకునే వారు, తోడ్పడేవారు ఉండక కూలిపోక తప్పదు. తల ఎగరేసి, తల పొగరుతో ఉండక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు తలవంచటం, పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడు తలెత్తటం చేస్తారు తెలివిగలవారు గడ్డిపోచల లాగా. పెరుగుతున్న మొక్కకి ఏదైనా అడ్డు వస్తే, కొన్ని పక్కకి వంగి వెలుగు వచ్చే దారి చూసుకుని ఎదుగుతాయి. నిటారుగా మాత్రమే ఎదుగుతాము, వంగము అనుకున్న మొక్కలు గిడసబారతాయి. సముద్రంలో స్నానం చేయటానికి గాని, ఈత కొట్టటానికి గాని వెళ్ళేవారు అలకి అనుకూలంగా వెడతారు. అలతో పాటు లేచి పడతారు. అలకి వ్యతిరేక దిశగా ఈత కొడితే జరిగే అనర్థాలు అందరికీ తెలుసు. నదుల్లోనూ, కాలవల్లోనూ ఈతకి వెళ్ళేవారు ప్రవాహం ఎటువైపు ఉంటే అటే వెడతారు. వ్యతిరేక దిశలో వెడితే అది ఎదురీత. పడవలు కూడా ప్రవాహం వెళ్ళే దిశలో వేగంగా వెడతాయి. వ్యతిరేక దిశలో ప్రయాణం శ్రమతో కూడుకొని ఉంటుంది. పరిస్థితులని గమనించకుండా ఉండే ఈ ప్రవర్తనకి మనిషిలో ఉండే అహంకారమే కారణం. నా అంతటి వారు లేరు అనే గుణం. నన్ను ఎదిరించగల వారు లేరు అనే పొగరు. ఎదుటివారి సామర్థ్యాన్ని గుర్తించలేని గుడ్డితనం. ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అదిరిపాటుకి అంతూ దరీ ఉండవు. దీనినే ‘మదం’ అని కూడా అంటారు. విరగబాటుతనం ఉంటే ప్రవాహానికి ఎదురొడ్డిన మహావృక్షాల లాగా విరిగి పడటం తప్పదు. అంటే ఎప్పుడూ పరిస్థితులకి, అవతలి వారి ఇష్టానిష్టాలకి తల ఒగ్గి, వ్యక్తిత్వం అన్నది లేకుండా బతక వలసిందేనా? అన్న సందేహం రావటం సహజం. పరిస్థితులని మార్చగల శక్తిసామర్థ్యాలు ఉంటే మంచిదే. ఎప్పుడూ అట్లా ఉండటం అసంభవం. ప్రతికూలంగా ఉన్న సందర్భాలలో ఎట్లా ఉండాలి అన్నది కూడా తెలియాలి కదా! రోగాన్ని తగ్గించే అవకాశం లేకపోతే ఉపశమనం కలిగించాలి. అనుకూల వాతావరణం వచ్చేదాకా ఊరుకోవటం ఉత్తమం. ‘‘కొంచెముండు టెల్ల కొలది కాదు’’ అన్న వేమనని అనుసరించటం శ్రేయస్కరం. ఎదురీత నదిలోనే కాదు ఎక్కడైనా శ్రమతో కూడుకున్నదే. జీవితమనే ప్రవాహంలో కదిలే మనిషి అనుకూలమైన దిశలో సాగితే ప్రయాణం సుకరంగా ఉంటుంది. వ్యతిరేక దిశలో వెళ్ళటానికి ఎంతో శక్తిని వెచ్చించ వలసి ఉంటుంది. జీవితం సంఘర్షణ అవుతుంది. కొన్ని సందర్భాలలో ప్రవాహం ముందుకి తోస్తుంటే, తాను వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే అంగుళం కూడా కదలక ఉన్న చోటనే నిలిచి పోవలసి రావచ్చు, నిలదొక్కుకోలేక కూలబడవచ్చు. అప్పుడు ప్రవాహంలో కొట్టుకు పోయే ప్రమాదం ఉంది. వీలు, వాలు చూసుకోవాలని పెద్దలు చెప్పేది అందుకే! -
రాహుల్ గాంధీ ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్స్ ఇవే..!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించారు. ఆయన గతేడాది చేపట్టిన జోడో యాత్ర మంచి ఫలితాన్నిచి ఈ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మెజార్టీ సీట్లను గెలుచుకునేలా చేసింది. ఈ నేపథ్యంలో మంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేసే రాహుల్ ఇష్టపడే ఆహార పదార్థాలేంటో చూద్దామా..!రాహుల్ గాంధీ ఒక జర్నలిస్ట్‌తో కలిసి రాజధాని ఢిల్లీలోని ఒక ఐకానిక్ రెస్టారెంట్లో ఫుడ్‌ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఆ జర్నలిస్ట్‌తో జరిపిన సంభాషణలో తనకు ఇష్టమైన ఆహార పదార్థాల గురించి పంచుకున్నాడు. తనకు బటర్ చికెన్, సీక్ కబాబ్ రోట్ అంటే మహా ఇష్టమని చెప్పారు. ఆలూ టిక్కకి తన ఇష్టమైన స్నాక్ ఐటెం అని చెప్పారు. తాను బోర్డింగ్స్కూల్లో ఉన్నప్పడు తన స్నేహితులతో కలిసి సమీపంలో ఉన్న ట్రక్ షాప్ నుంచి ఈ ఆలూ టిక్కిని ఇష్టంగా కొనుక్కుని తినేవాడనని అన్నారు. అంతేగాదు ఆ సంభాషణలో తాను తన చిన్నతనంలో తన తండ్రితో కలిసి చైనీస్ రెస్టారెంట్ ఫుజియాకు వెళ్లి ఇష్టంగా తిన్న నాటి మధురానుభూతలను కూడా షేర్ చేసుకున్నారు. ఇక తాను ఇలా ఢిల్లీలో స్నాక్ ఐటెమ్స్ తిని రెండేళ్లు అవుతుందని అన్నారు. తనకు కుల్ఫీ అంటే కూడా మహా ఇష్టమని అన్నారు. అలాగే ప్రాంతీయ వంటకాల వద్దకు వచ్చేటప్పటికీ దక్షిణ భారతీయ వంటకాలను ఇష్టంగా తింటనని, ముఖ్యంగా పంజాబీ వంటకాల్లో చోలే భటుర్, పరాఠాలు అంటే నాకు మహా ఇష్టమని అన్నారు. ఇష్టమైన కర్రీ దగ్గరకు వచ్చేటప్పటికీ బటర్ చికెన్, తందూరి చికెన్ అంటే ఇష్టమని తెలిపారు. రోజుని మంచి ఘుమఘమలాడే కాఫీతో ప్రారంభిస్తానని, సాయంత్రం మంచి టీ తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Khaane Mein Kya Hai? (@khaanemein_kyahai) (చదవండి: పోలాండ్లోని రహదారులకు, స్కూళ్లకు భారతీయ రాజు పేరు ఎందుకు పెట్టారో తెలుసా..!) -
‘కోళ్లనే కాపాడలేనివాడు మమ్మల్నేం కాపాడతాడు?’
ఎన్నికల గుర్తు కారణంగా పార్టీ లేదా అభ్యర్థి ఓడిపోయారంటూ వచ్చే వార్తలను మనం ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం. ఎన్నికల గుర్తులు పార్టీలకు ప్రాణం లాంటివి. ఎన్నికల గుర్తును చూసి ఓటువేసేవారి సంఖ్య అధికంగానే ఉంటుందనే మాట వినిపిస్తుంటుంది. ఓటు వేసే సమయంలో గుర్తులు కనిపించకుంటే ఓటు వేయకుండానే వెనుదిరిగేవారు కూడా ఉన్నారట. అవి 1957 సాధారణ ఎన్నికలు.. పంజాబ్‌లో ఒక అభ్యర్థి తన ఎన్నికల చిహ్నంగా కోడిని ఎంచుకున్నాడు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన తన ఎన్నికల గుర్తు గురించి అందరికీ తెలియజేయాలనుకున్నాడు. ఇందుకోసం ఆయన ఆ ప్రాంతంలో వందల కోళ్లను వదిలాడు. అయితే ఎక్కడినుంచో వచ్చిన ఒక నక్కల గుంపు ఆ కోళ్లను వేటాడింది. కొన్ని కోళ్లు ఎలాగోలా నక్కల బారి నుంచి తప్పించుకున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కడి ఓటర్లు.. నక్కల బారి నుంచి ఎన్నికల గుర్తునే కాపాడుకోలేని అభ్యర్థి మమ్మల్ని ఎలా కాపాడతాడని ఎదురుతిరిగారట. 1957 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఇటువంటి విచిత్ర ఉదంతం చోటుచేసుకుందట. యూపీలోని ఓ పోలింగ్ బూత్‌కి వచ్చిన కొందరు పడవ నడిపేవారు ఓటు వేయకుండానే వెనుదిరిగారట. వారిని కారణం అడిగితే లోపల బ్యాలట్ పేపర్‌పై బోటు గుర్తు లేదని, అందుకే ఎవరికీ ఓటు వేయకుండా వెళ్లిపోతున్నామని చెప్పారట. -
సెల్ఫ్–లవ్
వెనకటికి ఒక ఈగ ఇల్లలుకుతూ ఇంటి పనుల్లో పడి పేరు మరచిపోయిందట. చాలామంది మహిళలు ఇంటిపనుల్లో తలమునకలైపోయి తమ ఇష్టాలను మరచిపోతుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ ఫల్గుణి గృహిణుల కోసం ఒక వీడియో చేసింది. ‘మహిళలు తమ భర్త, పిల్లల కోసం ఇష్టమైన వంటకాలను తయారుచేసే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాను. మరి మీ కోసం ఎప్పుడు తయారు చేస్తారు? మీ కుటుంబ సభ్యులకు నచ్చిన వంటకాల గురించి మాత్రమే కాదు మీకు నచ్చిన వాటి గురించి కూడా దృష్టి పెట్టండి’ అంటూ తనకు బాగా నచ్చిన వంటకాన్ని తయారుచేస్తున్న వీడియోను ఫల్గుణి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వైరల్ క్లిప్ 1.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ చూసి ఒక మహిళ ఇలా స్పందించింది... ‘నీకు ఇష్టమైనది చేసి పెడతాను. ఏంచేయమంటావు అని అడిగింది అమ్మ. వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. పెళ్లయిన తరువాత ఇంటిపనుల్లో పడి నాకు ఇష్టమైన వంటకం ఏమిటో కూడా మరిచిపోయాను. ఈ వీడియో చూసిన తరువాత సెల్ఫ్–లవ్ ్ర΄ాముఖ్యత గురించి రియలైజ్ అయ్యాను’ -
జమల్ జమలు కుదు... యానిమలు!
‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్ ‘జమల్ జమలు కుదు’ సూపర్‌హిట్ అయింది. ఈ పాటలో ఒక్క ముక్క అర్థం కాకపోయినా యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాట యూత్ ఫ్రేవరెట్ రింగ్ టోన్గా మారింది. ‘జమల్ జమలు కుదు’ అనేది 1950 నాటి ఇరానీ పాట. ఇరానీ కవి బిజన్ స్మందర్ ఈ పాట రాశారు. ఖటరెహ్ మ్యూజిక్ గ్రూప్ ట్యూన్ కంపోజ్ చేసింది. తొలిసారిగా 1950లో టెహ్రాన్‌లోని ఖరజెమీ హైస్కూల్లో పాడారు. ‘జమల్ జమలు కుదు’ అంటే ఆంగ్లంలో ‘వో మై లవ్, మై స్వీట్ లవ్’ అని అర్థం. ఈ పాటలో కనిపించిన తనాజ్ దావూది సోషల్ మీడియాలో వైరల్ గర్ల్‌గా మారింది. టెహ్రాన్‌లో పుట్టి పెరిగిన తనాజ్ డ్యాన్సర్, మోడల్. ‘యానిమల్’ షూటింగ్ సమయంలో తనాజ్ ముంబైలో ఉంది. ఈ పాటకు సంబంధించిన ఓల్డ్ వెర్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘యానిమాల్ సినిమాలోని పాట కంటే ఓల్డ్ వెర్షన్ బాగా ఎంజాయ్ చేసే విధంగా ఉంది’ అంటూ స్పందిస్తున్నారు నెట్లోకవాసులు. -
వీడియోలు చూడటానికి ఇదే ఫేవరెట్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్లో వీడియోల వీక్షణకు ఎక్కువ మంది యూట్యూబ్‌ను ఎంచుకుంటున్నారు. ప్రతి అయిదుగురిలో నలుగురు తమ ప్లాట్‌ఫామ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు యూట్యూబ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూట్యూబ్‌ను ఇంటర్నెట్ ఆధారిత టీవీల్లో చూసే వారి సంఖ్య గణనీయంగా ఉంటోందని తెలిపింది. అలాగే యూట్యూబ్ షార్ట్స్ (తక్కువ నిడివి ఉండే వీడియోలు) సగటు రోజువారీ వీక్షణలు 120 శాతం మేర పెరిగినట్లు సంస్థ తెలిపింది. షార్ట్స్ వీక్షకుల్లో 96 శాతం మంది .. 18–44 ఏళ్ల వయస్సు మధ్య వారు ఉంటున్నారని పేర్కొంది. కంటెంట్ అప్లోడ్స్ 40 శాతం పెరిగినట్లు యూట్యూబ్ వివరించింది. -
థ్యాంక్యూ టీచర్
‘మా టీచర్ ఇలా చెప్పలేదు’ ‘మా టీచర్ ఇలాగే చెప్పింది’ ‘మా టీచర్ కోప్పడుతుంది’ ‘మా టీచర్ మెచ్చుకుంటుంది’ పిల్లలకు ప్రతి సంవత్సరం ఒక ఫేవరెట్ టీచర్ దొరకాలి. ఇంట్లో తల్లి తర్వాత పిల్లలు తమ ఫేవరెట్ టీచర్ మీదే ఆధారపడతారు. వారి సాయంతో చదువు బరువును సులువుగా మోసేస్తారు. వారు ట్రాన్స్ఫర్ అయి వెళితే వెక్కివెక్కి ఏడుస్తారు. ‘టీచర్స్ డే’ సందర్భంగా పిల్లలు అభిమానించే టీచర్ల స్వభావాలూ... లక్షణాలు... అవి కలిగి ఉన్నందుకు వారికి ప్రకటించాల్సిన కృతజ్ఞతలు. పిల్లలు స్కూల్‌కు రాగానే తమ ఫేవరెట్ టీచర్ వచ్చిందా రాలేదా చూసుకుంటారు. ఒకవైపు ప్రేయర్ జరుగుతుంటే మరోవైపు ఒక కంటితో ఫేవరెట్ టీచర్‌ను వెతుక్కుంటారు. క్లాసులు జరుగుతుంటాయి. వింటుంటారు. కాని ఆ రోజు టైమ్‌టేబుల్‌లో ఫేవరెట్ టీచర్ క్లాస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తారు. స్కూల్లో ఎందరో టీచర్లు. కాని ఒక్కో స్టూడెంట్‌కు ఒక్కో ఫేవరెట్ టీచర్. ఆ టీచర్ మాటను వేదవాక్కుగా భావించేవారు గతంలో ఉన్నారు.. రేపూ ఉంటారు. ‘పాప... నువ్వు డాక్టర్ కావాలి’ అనంటే డాక్టరైన వారున్నారు. ‘బాబూ.. నీకు సైన్స్ బాగా వస్తోంది సైంటిస్ట్ కావాలి’ అనంటే ఆ మాటలు మరువక సైంటిస్ట్ అయినవారున్నారు. ఫేవరెట్ టీచర్లు పిల్లలను గొప్పగా ఇన్‌స్పయిర్ చేస్తారు. బలం ఇస్తారు. ప్రేమను పంచుతారు. వారే లేకపోతే చదువులు భారంగా మారి ఎందరో విద్యార్థులు కుదేలయి ఉండేవారు. ► సబ్జెక్ట్ బాగా వచ్చినవారు ఫేవరెట్ టీచర్లు ఎవరు అవుతారు? సబ్జెక్ట్ ఎవరికి బాగా వస్తుందో వారు చాలామందికి ఫేవరెట్ టీచర్ అవుతారు. సబ్జెక్ట్ బాగా వచ్చినవారు అది ఎలా చెప్తే పిల్లలకు బాగా అర్థమవుతుందో తెలుసుకుని చెప్తారు. పిల్లలకు అర్థం కావాల్సింది పాఠం సులభంగా అర్థం కావడం. అర్థమైతే పాఠం పట్ల భయం పోతుంది. భయం పోతే ఆ సబ్జెక్ట్ మరింతగా చదవాలనిపిస్తుంది. అందుకు కారణమైన టీచర్‌ను అభిమానించబుద్ధవుతుంది. సబ్జెక్ట్‌ను అందరికీ అర్థమయ్యేలా చెప్తూ, క్లాసయ్యాక కూడా వచ్చి అడిగితే విసుక్కోకుండా సమాధానం చెప్తారనే నమ్మకం కలిగిస్తూ, చెప్తూ, పాఠం అర్థం కాని స్టూడెంట్ను చిన్నబుచ్చకుండా గట్టున ఎలా పడేయాలో ఆలోచించే టీచర్ ఎవరికైనా సరే ఫేవరెట్ టీచర్. ► మనలాంటి వారు పిల్లలు తమలాంటి టీచర్లను, తమను తెలుసుకున్న టీచర్లను ఇష్టపడతారు. క్లాస్‌లో రకరకాల పిల్లలు ఉంటారు. రకరకాల నేపథ్యాల పిల్లలు ఉంటారు. వారి మాతృభాషను, ప్రాంతాన్ని, నేపథ్యాన్ని గుర్తెరిగి వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడే టీచర్లను పిల్లలు ఇష్టపడతారు. ‘మీది గుంటూరా? ఓ అక్కడ భలే ఎండలు. భలే కారం మిరపకాయలు దొరుకుతాయిరోయ్’ అని ఒక స్టూడెంట్‌తో ఒక టీచర్ అంటే ఆ స్టూడెంట్ కనెక్ట్ కాకుండా ఎలా ఉంటాడు. ‘రేపు మీరు ఫలానా పండగ జరుపుకుంటున్నారా? వెరీగుడ్. ఆ పండగ గురించి నాకు తెలిసింది చెప్తానుండు’ అని ఏ టీచరైనా అంటే పిల్లలు వారిని తమవారనుకుంటారు. భాషాపరంగా, సంస్కృతి పరంగా పిల్లలు కలిగి ఉన్నదంతా తమది కూడా అని భావించిన ప్రతి టీచర్ ప్రతి విద్యార్థికీ ఫేవరెట్ టీచరే. ► అందరూ సమానమే ఒక టీచర్‌ను పిల్లలు ఎప్పుడు అభిమానిస్తారంటే వారు అందరినీ సమానంగా చూస్తారనే భావన కలిగినప్పుడు. టీచర్లు ఫేవరిటిజమ్ చూపిస్తే ఆ పిల్లల్ని మాత్రమే వారు ఇష్టపడతారని, తమను ఇష్టపడరని మిగతా పిల్లలు అనుకుంటారు. మంచి టీచర్లు అందరు పిల్లల్నీ ఇష్టపడతారు. ‘టీచర్ నిన్నే కాదు నన్ను కూడా మెచ్చుకుంటుంది’ అని పిల్లలు అనుకునేలా టీచర్ ఉండాలి. కొంతమంది స్టూడెంట్లు మంచి మార్కులు తెచ్చుకుంటే వారిని ఎక్కువ పొగిడి కొంతమంది స్టూడెంట్లు ఎంత బాగా చదువుతున్నా మెచ్చుకోకుండా ఉండే టీచర్లు పిల్లలను భావోద్వేగాలకు గురిచేస్తారు. టీచర్ మెచ్చుకోలు, టీచర్‌తో సంభాషణ పిల్లల హక్కు. అది పిల్లలకు ఇవ్వగలిగిన టీచర్ ఫేవరెట్ టీచర్. ► క్రమశిక్షణ పిల్లలు తమ ఫేవరెట్ టీచర్లో క్రమశిక్షణ ఆశిస్తారు. టైమ్‌కు సిలబస్ పూర్తి చేయడం, టైమ్‌కి స్కూల్‌కు రావడం, క్లాసులు ఎగ్గొట్టకపోవడం, సరిగ్గా నోట్స్ చెప్పడం, సరిగ్గా పరీక్షలకు ప్రోత్సహించడం, ఎంత సరదాగా ఉన్నా క్లాస్ జరుగుతున్నప్పుడు సీరియస్‌గా ఉండటం... ఇవీ పిల్లలు ఆశిస్తారు. తాము గౌరవించదగ్గ లక్షణాలు లేని టీచర్లను పిల్లలు ఫేవరెట్ టీచర్లు అనుకోరు. టీచర్ వృత్తి ఎంతో గొప్ప వృత్తి. టీచర్లు కూడా మనుషులే. వారిలోనూ కోపతాపాలు ఉంటాయి. కాని ఎంతోమంది టీచర్లు పిల్లల కోసం తమ జీవితాలను అంకితం చేసి వారి జీవితాలను తీర్చిదిద్దుతారు. ‘మీరు పెద్దవాళ్లయి పెద్ద పొజిషన్‌కు వెళితే అంతే చాలు’ అంటూ ఉంటారు. మంచి టీచర్లు, గొప్ప టీచర్లు పిల్లల శ్రేయస్సును ఆకాంక్షించి తద్వారా వారి గుండెల్లో మిగిలిపోతారు. పిల్లల హృదయాల్లో ప్రేమ, గౌరవం పొందిన టీచర్లందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు. ► మంచి ఫ్రెండ్ కొందరు టీచర్లు క్లాస్‌లో ఫ్రెండ్‌లా ఉంటారు. 45 నిమిషాల క్లాస్‌లో 40 నిమిషాలు పాఠం చెప్పి ఒక ఐదు నిమిషాలు వేరే కబుర్లు, విశేషాలు మాట్లాడతారు. పిల్లల కష్టసుఖాలు వింటారు. వారి తగాదాలు తీరుస్తారు. ఎవరైనా చిన్నబుచ్చుకుని ఉంటే కారణం తెలుసుకుంటారు. ముఖ్యంగా దిగువ ఆర్థిక పరిస్థితి ఉన్న పిల్లలు ఇలాంటి టీచర్లను చాలా తీవ్రంగా అభిమానిస్తారు. తమ కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నట్టుగా భావిస్తారు. అదే మంచి ఆర్థికస్థితి ఉన్న పిల్లలైతే తమకు ఎమోషనల్ సపోర్ట్ కోసం చూస్తారు. పాఠాల అలజడుల నుంచి ధైర్యం చెప్పే టీచర్‌ను అభిమానిస్తారు. -
జాన్వీ కపూర్ సమర్పించు... గోచుజాంగ్
జాన్వీ కపూర్ ఫేవరెట్ ఫుడ్... గోచుజాంగ్. ఈ కొరియన్ ఫుడ్ గురించి ఒక యూట్యూబ్ వీడియోలో చవులూరించేలా మాట్లాడింది. లాక్డౌన్ టైమ్‌లో బోలెడు కుకింగ్ వీడియోలు, ట్రావెల్ వీడియోలు చూసింది జాన్వీ, క్విక్ నూడుల్స్ ‘గోచుజాంగ్’ తనను బాగా ఆకట్టుకుంది. అట్టే శ్రమ పడకుండా క్విక్‌గా ఈ నూడుల్స్‌ను తయారు చేయవచ్చు. రకరకాల ప్రోటీన్లు జత చేసి గోచుజాంగ్కు తనదైన హెల్తీ ట్విస్ట్ ఇచ్చింది జాన్వీ. ఈ వంటకం పుట్టుపుర్వోత్తరాలతో పాటు, ఎలా చేయాలి? ఏం వాడాలి... మొదలైన వివరాలు తెలుసుకోవడానికి జాన్వీ అభిమానులతో పాటు భోజన అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. -
మేకపాటి గౌతమ్ రెడ్డికి బాగా ఇష్టమైన ఫుడ్ ఇదే..
-
ప్రియాంక వాటిని చాలా మిస్సవుతుందట..
లాస్ ఏంజెల్స్: బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్‌ను ఏలుతూ గ్లోబల్ నటిగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా.. తన ప్రియుడు నిక్ జోనాస్‌కు ఇష్టమైన భారతీయ వంటకంపై, అలాగే తాను లాస్ ఏంజెల్స్‌లో ఉంటూ మిస్ అవుతున్న భారతీయ వంటకాలపై క్లారిటీనిచ్చింది. తాజాగా ఇచ్చిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఆమె, ఆమె భర్త జీహ్వకు సంబంధించిన విశేషాలను వెల్లడించింది. ఇంతకీ ఈ ముద్దు గుమ్మ మిస్సవుతున్న వంటకాలేంటో తెలుస్తే షాకవుతారు. ఆమె మిస్సవుతుంది భారతీయ సాంప్రదాయ వంటకాలైన దాల్, రోటీలనట. ఆమె ప్రతిరోజు వీటిని చాలా మిస్సవుతున్నట్లు వెల్లడించింది. ఇక తన భర్త నిక్కు ఇష్టమైన భారతీయ వంటకంపై ఆమె స్పందిస్తూ.. ఆయన ఫేవరెట్ ఇండియన్ ఫుడ్ కచ్చితంగా ఏదో ఒక పనీర్ ఐటం అయ్యింటుందన్నారు. ప్రియాంకకు ఇష్టమైన వంటకాల జాబితాలో బిర్యానీ, కబాబ్, చాట్ తదితర ఐటమ్స్ ఉన్నట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ మూవీ 'టెక్స్స్ట ఫర్ యూ' షూటింగ్ నిమిత్తం లండన్‌లో బిజీగా గడుపుతున్నారు. అలాగే ఓటీటీ వేదికగా త్వరలో విడుదలకానున్న తన తాజా చిత్రం 'వైట్ టైగర్' చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. -
నా పాటలు ఎందుకు కొనాలి?
బాలీవుడ్ బాత్ పాటలు చేసే ప్రతిసారీ ఈ ప్రశ్నను వేసుకుంటాను. నన్ను నేను నా అభిమానిగా ఊహించుకుని నా నుంచి ఆ అభిమాని ఏం ఆశిస్తాడో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. తొలి రోజుల్లో సంగీతం అంటే టెక్నిక్ అని అనుకునేవాణ్ణి. కాదు. సంగీతం అంటే నిజంగా నీ లోపలి నుంచి ఏది వస్తుందో అది. దానిని రాబట్ట గలిగితే అది కచ్చితంగా ఎదుటివారి మనసును తాకగలుగుతుంది. ప్రస్తుతం నేను గౌతమ్ వాసుదేవ మీనన్ సినిమాకు పాట కడుతున్నా. ఇప్పుడు మీ ఫేవరెట్ సాంగ్ ఏది అంటే ఆ పాటే చెప్తా. రేపటికి ఇది మారిపోతుంది. నాకేదైనా వెలితి ఉందంటే అది మైకేల్ జాక్సన్‌తో పని చేయకపోవడమే. మేమిద్దరం మాట్లాడుకున్న కొద్ది రోజుల్లోనే ఆయన చనిపోవడం బాధాకరం. అయితే అంతకు సమానమైన ప్రతిభావంతులతో పని చేస్తున్నానన్న తృప్తి మాత్రం ఉంది.... అన్నాడు రహెమాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో. -
ట్విట్టర్ లో ఇక 'లవ్'
కొత్త యూజర్స్‌ను ఆకర్షించే పనిలో భాగంగా ట్విట్టర్ తన అఫ్లికేషన్‌లో కొత్త మార్పులు చేపట్టింది. దీనిలో భాగంగానే ఫేవరెట్ ఆప్షన్ బదులుగా లైక్‌ను తీసుకొచ్చింది. ఇంతకు ముందున్న స్టార్ సింబల్ స్థానంలో హార్ట్(లవ్) సింబల్‌ను ప్రవేశ పెట్టారు. ఇంతకు ముందు ఫేవరేట్ ఆప్షన్ స్టార్ సింబల్‌తో ఉండేది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన లైక్ ఆప్షన్..హార్ట్ సింబల్‌తో ఉంది. ఎదైనా ట్విట్ నచ్చితే లైక్ కొట్టగానే ఎరుపు రంగుతో దీపావళి టపాసుల్లా పేలినట్టుగా వచ్చి చాలా ఆకర్షనీయంగా ఉంది. ఫేవరేట్ ఆఫ్షన్ తొలుత 2006లో ఉపయోగంలోకి వచ్చింది. అందరికి సుపరిచితమైన ఫేస్ బుక్ లైక్ ఆప్షన్ 2009లో ప్రారంభంలోకి వచ్చింది. మరోవైపు ట్విట్టర్ అనుబంధంగా ఉన్న లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఆప్ పెరిస్కోప్‌లో ఇప్పటికే హార్ట్ సింబల్‌ను యూజర్స్ విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో యూజర్స్‌కు సులువుగా ఉపయోగపడేలా, ట్విట్ లని లైక్ చేయడానికి హార్ట్ సింబల్ అనువుగా ఉంటుందని ట్విట్టర్ ఎంచుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. 'చాలా వాటిని ఇష్టపడోచ్చు కానీ అన్ని ఫేవరేట్ అయ్యే అవకాశం లేదు కదా' అని ఫేవరేట్ స్థానంలో లైక్ ఆప్షన్ ప్రవేశపెట్టడానికి కారణాన్ని ట్విట్టర్ ప్రోడక్ట్ మేనేజర్ ఆకర్షణ్ కుమార్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. హార్ట్ సింబల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందినది కావడంతో స్టార్ స్థానంలో దాన్ని ఉంచామన్నారు. అయితే దాన్ని తప్పనిసరిగా వాడాల్సిన అవసరం లేదని, కావాలంటే క్రోమ్ బ్రౌజర్ నుంచి వెబ్ స్టోర్ లోకి వెళ్లి స్టార్ ఆకారాన్ని తిరిగి ఇన్స్టాల్ చేసుకోవచ్చని ట్విట్టర్ తెలిపింది. -
ఇంజనీరింగ్ విద్యకు..ఉత్తమ స్వదేశీ గమ్యాలు
దేశంలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్‌లు.. వాటికి నెలవైన మరెన్నో నగరాలు ఉన్నాయి. కానీ ఔత్సాహిక విద్యార్థుల్లో అత్యధిక శాతం మందికి గమ్యస్థానాలుగా నిలుస్తున్న నగరాలు మాత్రం కొన్నే. ఆయా నగరాల్లో ఏర్పాటైన ఈ విద్యా సంస్థలు బోధనపరంగా పాటిస్తున్న ప్రమాణాలు..ఆర్ అండ్ డీ అవకాశాలు.. పరిశ్రమలతో అనుసంధానం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి కారణాలతో విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయి. అంతేకాకుండా రవాణా, నివాస సదుపాయాలు లభించడంతోపాటు జీవన వ్యయం కూడా తక్కువగా ఉండటం వల్ల ఆయా నగరాలపై విద్యార్థులు మక్కువ చూపుతున్నారు.దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. బీటెక్ ఔత్సాహిక విద్యార్థులకు ఫేవరెట్లుగా నిలుస్తున్న సిటీలపై విశ్లేషణ.. ముంబైకే మొదటి ప్రాధాన్యం దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ ఔత్సాహికుల హాట్ ఫేవరెట్ నగరం ముంబై. ఇక్కడ ప్రతిష్టాత్మక ఐఐటీ ఉండటమే ఇందుకు ముఖ్య కారణం. ఐఐటీ-ముంబై జాతీయ సంస్థలతోనే కాకుండా అంతర్జాతీయ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంటోంది. స్పాన్సర్డ్ రీసెర్చ్, కన్సల్టెన్సీ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లు కూడా నిర్వహిస్తోంది. ఫలితంగా ఐఐటీ ఔత్సాహిక విద్యార్థుల్లో మొదటి ప్రాధాన్యంగా దీన్నే ఎంచుకుంటున్నారు. గత మూడేళ్లుగా జేఈఈ అడ్వాన్సడ్ టాప్-100 ర్యాంకర్లలో మెజారిటీ విద్యార్థులు ముంబైను ఎంపిక చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందడంతోపాటు అనేక పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా ఇక్కడి ఇన్స్టిట్యూట్లు స్థానిక పరిశ్రమలు /కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనివల్ల విద్యార్థులకు అపార అవకాశాలు దక్కుతున్నాయి. అటు పరిశ్రమ వర్గాల్లోనూ ముంబై కళాశాలల్లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులంటే ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా 90 నుంచి 95 శాతం మధ్యలో సుస్థిరంగా ఉంటున్నాయి. వీటితోపాటు అన్ని ప్రాంతాలకు చక్కటి రవాణా సదుపాయాలు, నెలకు రూ.15 వేలకు మించని నివాస ఖర్చులు కూడా విద్యార్థులను ముంబైని ఎంచుకునేలా చేస్తున్నాయి. దేశానికే తలమానికం.. ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని (నేషనల్ క్యాపిటల్ రీజియన్ - ఎన్సీఆర్).. ఇంజనీరింగ్ కళాశాలలు.. ఎవర్‌గ్రీన్‌గా పేరొందుతున్నాయి. ఐఐటీ-ఢిల్లీతోపాటు.. ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ (జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ), ఐటీఎం యూనివర్సిటీ, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ, నేతాజీ సుభాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు ఇక్కడ నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణం. అన్నిటికంటే ముఖ్యంగా ఐఐటీ-ఢిల్లీలోని రీసెర్చ్ కార్యకలాపాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రభుత్వ పరిశోధన సంస్థలతో కలిసి చేపడుతున్న జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ వంటివి విద్యార్థులు నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి దోహదపడుతున్నాయి. భవిష్యత్తు ప్లేస్‌మెంట్స్‌కు బలమైన పునాది వేస్తున్నాయి. దక్షిణాన.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు దక్షిణ భారతదేశంలోని (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ).. పలు ప్రముఖ నగరాలు ఔత్సాహిక ఇంజనీరింగ్ విద్యార్థులకు చక్కటి గమ్యస్థానాలుగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో.. చెన్నైలోని ఐఐటీ-మద్రాస్ ముందంజలో ఉంది. దీంతోపాటు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు, సైబరాబాద్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన హైదరాబాద్.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌ల్లో వివిధ జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇవి సుశిక్షితులైన మానవ వనరులను తీర్చిదిద్దే క్రమంలో పలు కళాశాలలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనివల్ల విద్యార్థులకు ఉద్యోగ భరోసా లభిస్తోంది. తెలంగాణలో ఐఐటీ, ఐఐఐటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ - హైదరాబాద్, నిట్ - వరంగల్; ఆంధ్రప్రదేశ్‌లో జేఎన్టీయూ-కాకినాడ, అనంతపురం క్యాంపస్ కళాశాలలు, ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వంటివి విద్యార్థులకు ముఖ్య గమ్యాలుగా నిలుస్తున్నాయి. తమిళనాడులో అన్నా యూనివర్సిటీ - చెన్నై, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - కాంచీపురం కూడా ముఖ్యమైనవే. వెలుగులీనుతున్నవి ఇవే దశాబ్దాల చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూట్లు ఉన్న నగరాలతోపాటు ఇటీవల కాలంలో దేశంలో టైర్-2, టైర్-3 పట్టణాలు కూడా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో నాగ్‌పూర్, అహ్మదాబాద్, చండీగఢ్, నోయిడా, గుర్గావ్, పుణె వంటివి ముందంజలో నిలుస్తున్నాయి. ప్రతి పది కళాశాలల్లో 2.25 శాతం కళాశాలలు టైర్ - 2 నగరాల్లో ఏర్పాటవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఆర్ అండ్ డీ ఓరియెంటెడ్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌తోపాటు ఐటీ, ఐటీఈఎస్/ బీపీఓ సర్వీస్ ప్రొవైడింగ్ సంస్థల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఈ సంస్థలు తమ సమీప ప్రాంతాల్లోని కళాశాలలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా విద్యార్థులకు క్షేత్ర నైపుణ్యాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అందిస్తున్నాయి. సంస్థల కోణంలో ఇలా సంస్థలు కూడా తమ అవసరాలను తీర్చే మానవ వనరులు లభించే విషయంలో కొన్ని నగరాలను ప్రధాన కేంద్రాలుగా గుర్తించాయి. ఈ క్రమంలో బెంగళూరు, పుణె, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాద్, త్రివేండ్రంలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. ప్రధానంగా తాజా ప్రతిభావంతుల విషయంలో ఈ నగరాల్లోని విద్యార్థులు బాగా రాణిస్తున్నారనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ ప్రాంతాల్లో ఐటీ, ఐటీఈఎస్ సంస్థల భాగస్వామ్యం అధికంగా కనిపిస్తోంది. తూర్పులో ప్రముఖ విద్యా సంస్థలు ఇవే తూర్పు భారత్‌లో.. ఐఐటీ-ఖరగ్‌పూర్, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, ఎన్ఐటీ-రూర్కెలా, ఐఎస్ఎం-ధన్‌బాద్, ఎన్ఐటీ - దుర్గాపూర్.. ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఇష్టమైన గమ్యాలుగా నిలుస్తున్నాయి. ఇందుకు కారణం.. పరిశోధనలు, ప్లేస్‌మెంట్స్, మౌలిక సదుపాయాలు, మెరుగైన రవాణా సౌకర్యాలే. ఈ సిటీల్లో జీవన వ్యయం కూడా తక్కువగా ఉండటం విద్యార్థులకు కలిసొచ్చే అంశం. ఎన్ఐటీల్లోనూ.. కొన్నిటికే ప్రాధాన్యం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల విషయంలోనూ విద్యార్థులు కొన్ని ఎన్ఐటీలపైనే అధిక ఆసక్తి చూపుతున్నారు. మొత్తం 30 ఎన్ఐటీల్లో సూరత్కల్, తిరుచిరాపల్లి, కాలికట్, సూరత్, రాయ్‌పూర్, భోపాల్, అగర్తలా, అలహాబాద్, జైపూర్, కురుక్షేత్ర, నాగ్‌పూర్‌లు ముందంజలో నిలుస్తున్నాయి. ప్రాధాన్యతలు మారుతున్నాయి నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. తమ నివాస ప్రాంతాలకు సమీపంలోని కళాశాలల్లోనే చేరాలనే ఆలోచన నుంచి బయటికొస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలపై దృష్టి సారించి వాటిలో నాణ్యమైన కళాశాలల్లో ప్రవేశించడానికే మొగ్గు చూపుతున్నారు. ఒక విధంగా ఈ దృక్పథం ఆహ్వానించదగినదే. ఇన్స్టిట్యూట్ల కోణంలోనూ పోటీతత్వం పెంపొంది.. అవి.. నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి పెడతాయి. ఫలితంగా విద్యార్థులకు చక్కటి అవకాశాలు లభిస్తాయి. - బి. చెన్నకేశవరావు ప్రిన్సిపాల్, సీబీఐటీ, హైదరాబాద్ అన్నింటిలో కొన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రతిఏటా కొత్తగా వందల సంఖ్యలో మరిన్ని కళాశాలలు వస్తున్నాయి. అందుకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ‘బెస్ట్ ఫ్రం మోస్ట్’ను కనుగొనాలి. అవి కొంత దూరమైనా చేరేందుకు వెనుకంజ వేయకూడదు. సొంత ఊరు కాకపోతే దేశంలో ఏ ప్రాంతమైనా ఒకటే అని గుర్తించాలి. ప్రభుత్వ రంగంలోని ఐఐటీలు, ఎన్ఐటీలతోపాటు.. ప్రైవేటు రంగంలోనూ దశాబ్దాల చరిత్ర కలిగి దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆదరణ పొందుతున్న ఇన్స్టిట్యూట్లు ఎన్నో ఉన్నాయి. వీటిలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స కూడా ఒకటి. అయితే విద్యార్థులు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లోని కళాశాలల్లో ప్రవేశించేటప్పుడు.. అక్కడి మౌలిక సదుపాయాలు, సంస్కృతి-సంప్రదాయాలపై అవగాహన పొందాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాణించగలరు. - ప్రొఫెసర్ వి.ఎస్.రావు డెరైక్టర్, బిట్స్ పిలానీ-హైదరాబాద్ క్యాంపస్ పరిజ్ఞానానికి ప్రాధాన్యం విద్యార్థుల ముందు ఇప్పుడు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఫ్యాకల్టీ, ఆర్ అండ్ డీ ఒప్పందాలు, ప్లేస్‌మెంట్స్ చరిత్ర కలిగిన ఎన్నో ఇన్స్టిట్యూట్లు బీటెక్ కోర్సులు అందిస్తున్నాయి. విద్యార్థులు ఎక్కడ చేరినా.. పరిజ్ఞానం సొంతం చేసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. తాము చేరిన కళాశాలలోని సదుపాయాలన్నింటినీ సమర్థంగా సద్వినియోగం చేసుకుంటేనే సరైన నైపుణ్యాలు లభిస్తాయి. - ప్రొఫెసర్॥వి.ఎస్.ఎస్. కుమార్ ప్రిన్సిపాల్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రైవేటు కళాశాలల్లో ప్రముఖమైనవి బీటెక్ ఔత్సాహిక విద్యార్థులు ఇన్స్టిట్యూట్ల ఎంపికలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పేరొందిన ప్రైవేటు విద్యా సంస్థలపైనా దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆదరణ పొందుతున్న ప్రముఖ ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు.. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స మూడు క్యాంపస్‌లు (పిలానీ, గోవా, హైదరాబాద్) ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపాల్ అమిటీ యూనివర్సిటీ వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - మెస్రా ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - బెంగళూరు ఐఐటీల్లోనూ గతంలో ఐఐటీల్లో ప్రవేశం అంటే.. ‘క్యాంపస్ ఏది’ అనే ప్రస్తావన పెద్దగా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఐఐటీ క్యాంపస్‌ల విషయంలో విద్యార్థులు ప్రాధాన్య జాబితా రూపొందించుకుంటున్నారు. ఆయా ఐఐటీల్లో చేపడుతున్న ఆర్ అండ్ డీ కార్యకలాపాలు, పీహెచ్డీ ఫ్యాకల్టీ సంఖ్య, ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పరంగానూ విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్నారు. ఐఐటీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ గ్యారంటీ. కానీ ఎలాంటి కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొంటున్నాయి అనే అంశం కూడా ప్రముఖంగా నిలుస్తోంది. ఐఐటీ- ముంబై, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, గువహటి, రూర్కీలు ఎక్కువమంది విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయి. ఇవే కాకుండా 2008 నుంచి కొత్తగా ఏర్పాటైన ఐఐటీ క్యాంపస్‌లలో హైదరాబాద్, భువనేశ్వర్, గాంధీనగర్ క్యాంపస్‌ల పట్ల విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్యాంపస్‌లలో సగటున 95 శాతం క్యాంపస్ ప్లేస్మెంట్ రికార్డ్ నమోదు కాగా.. ఆర్ అండ్ డీ విషయంలోనూ ప్రతి ఏటా సగటున 13 నుంచి 17 మధ్యలో వృద్ధి నమోదు అవుతోంది. ఫలితంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే క్షేత్ర నైపుణ్యాలు లభించడంతోపాటు, ఇండస్ట్రీ ఇంటరాక్షన్‌కు అత్యధిక ఆస్కారం లభిస్తోంది.