నా పాటలు ఎందుకు కొనాలి?
బాలీవుడ్ బాత్
పాటలు చేసే ప్రతిసారీ ఈ ప్రశ్నను వేసుకుంటాను. నన్ను నేను నా అభిమానిగా ఊహించుకుని నా నుంచి ఆ అభిమాని ఏం ఆశిస్తాడో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. తొలి రోజుల్లో సంగీతం అంటే టెక్నిక్ అని అనుకునేవాణ్ణి. కాదు. సంగీతం అంటే నిజంగా నీ లోపలి నుంచి ఏది వస్తుందో అది. దానిని రాబట్ట గలిగితే అది కచ్చితంగా ఎదుటివారి మనసును తాకగలుగుతుంది. ప్రస్తుతం నేను గౌతమ్ వాసుదేవ మీనన్ సినిమాకు పాట కడుతున్నా.
ఇప్పుడు మీ ఫేవరెట్ సాంగ్ ఏది అంటే ఆ పాటే చెప్తా. రేపటికి ఇది మారిపోతుంది. నాకేదైనా వెలితి ఉందంటే అది మైకేల్ జాక్సన్‌తో పని చేయకపోవడమే. మేమిద్దరం మాట్లాడుకున్న కొద్ది రోజుల్లోనే ఆయన చనిపోవడం బాధాకరం. అయితే అంతకు సమానమైన ప్రతిభావంతులతో పని చేస్తున్నానన్న తృప్తి మాత్రం ఉంది.... అన్నాడు రహెమాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.