michael jackson
-
మైకేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ కన్నుమూత
వాషింగ్టన్: పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ ఇక లేరు. ప్రఖ్యాత జాక్సన్5 పాప్ గ్రూప్ సభ్యుడైన 70 ఏళ్ల టిటో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి కారణం తెలియరాలేదు. మైకేల్‌తో పాటు ఇతర సోదరులు జాకీ, జర్మైన్, మార్లోన్లతో కలిసి జాక్సన్5 పేరిట టిటో పలు పాప్ ప్రదర్శనలిచ్చారు. జాక్సన్5 ఖాతాలో ఏబీసీ, ద లవ్ యూ సేవ్, ఐ వాంట్ యూ బ్యాక్ వంటి పలు హిట్లున్నాయి. 1964లో ఏర్పాటైన ఈ గ్రూపు ప్రేక్షకులను ఉర్రూతలూపింది. 1980లో ప్రతిష్టాత్మక హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అందుకుంది. 1997లో రాక్ అండ్ రోల్ హాలాఫ్ ఫేమ్‌లో చోటుచేసుకుంది. గ్రూప్‌లో టిటో వయోలిన్ వాయించేవారు. ఆయన చివరిదాకా ప్రదర్శనలిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 10న జర్మనీలో తుది ప్రదర్శన ఇచ్చారు. టిటో ముగ్గురు కుమారులు కూడా 3టీ గ్రూప్ పేరిట పాప్ సంగీతంలో ప్రసిద్ధులే. -
మైకేల్ జాక్సన్ తీన్మార్
హిందీ ఫోక్ సాంగ్‌కు మైకేల్ జాక్సన్ ఆయన స్టైల్లోనే డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది కాదు... అసలు ఎలా వీలవుతుంది?! అంటారా. సాంకేతిక మాయాబజార్లో ఏదైనా సాధ్యమే. కామెడి డ్రామా స్ట్రీమింగ్ టీవీ సిరీస్ ‘పంచాయత్’కు సంబంధించి మీమ్స్, వైరల్ వీడియోలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒకటి మైకేల్ జాక్సన్ డ్యాన్స్ వీడియో. ఈ ఫ్యాన్–మేడ్ వీడియో 8 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోలో ‘ఏ రాజాజీ రాజాజీ’ అనే పాటకు మైకేల్ జాక్సన్ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. అయితే ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. చాలా సహజంగా ఉండడమే ఈ వీడియో వైరల్ కావడానికి కారణం అయింది. -
దిగ్గజ పాప్ సింగర్ బయోపిక్.. రూ.1000 కోట్ల బడ్జెట్?
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ‘మైఖేల్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ సోదరుడు జెర్మైన్ జాక్సన్ తనయుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్నారు. ‘‘జాఫర్ అచ్చం మైఖేల్ జాక్సన్‌లానే ఉన్నాడు. జాఫర్ నడక.. డ్యాన్స్... ఇలా అన్నీ మైఖేల్లానే ఉంటాయి. అందుకే మైఖేల్పాత్రకు జాఫర్ తప్ప వేరే ఎవరూ నప్పరు’’ అని ఈ చిత్రదర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా, నిర్మాత గ్రాహం కింగ్ అన్నారు. ఇప్పటికే విడుదలైన జాఫర్ లుక్ చూసి, ‘మైఖేల్ తిరిగి వచ్చాడా అన్నట్లు ఉంది’ అని అభిమానులు సైతం పేర్కొన్నారు. కాగా, మైఖేల్ జీవితంలో ఉన్న వివాదాల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకుపాల్పడ్డారన్నది ఒకటి. అయితే మైఖేల్ అమాయకుడని, చిన్నారులను వేధించలేదనే కోణంలో ‘మైఖేల్’ చిత్రాన్ని ఆంటోయిన్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకూ హాలీవుడ్లో రూపొందిన బయోపిక్స్‌లో ‘మైఖేల్’ అత్యంత భారీ బడ్జెట్ బయోపిక్ అంటోంది హాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్. రూ. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ అని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ‘మైఖేల్’ చిత్రం పెట్టిన పెట్టుబడికి రెండింతలు... అంటే రూ. రెండువేల కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. ఇక 2009 జూన్ 25న మైఖేల్ కన్ను మూసిన విషయం తెలిసిందే. -
మాటలు పలుచన
జె.డి.శాలింజర్ తన నవల ‘క్యాచర్ ఇన్ ద రై’తో ప్రఖ్యాతం. అమెరికాలో లక్షల మంది అభిమానులను సంపాదించుకుని ఒక్కసారి కలిస్తే చాలు, చెప్పేది వింటే బాగుండు అని తహతహలాడించాడు. కాని ఎప్పుడూ జనం మధ్యలోకి రాలేదు. శాలింజర్‌ని ఇంటర్వ్యూ చేయడానికి మహామహులు ప్రయత్నిస్తే ఆశాభంగమే ఎదురైంది. అమెరికాలో తన నవల ‘హౌ టు కిల్ ఎ మాకింగ్‌బర్డ్’తో సంచలనం సృష్టించిన రచయిత్రి హార్పర్ లీ ఎవరినీ తన ఇంటిలోకి అడుగు పెట్టనీయలేదు. ఆమెని చూడాలని, ఇంటర్వ్యూ చేయాలని ఎందరో ప్రయత్నించి ఆమె ఇంటి గేట్ బయట నుంచే వెనుతిరిగే వారు. ప్రఖ్యాత కవి సాహిర్ లూధియాన్వీ తాను పాల్గొనే ముషాయిరాల్లో కవితా జ్ఞానం లేని శ్రోతలను గమనించాడంటే నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టేవాడు. సంఘంలో గొప్పలు చెప్పుకోవడానికి కొంతమంది శ్రీమంతులు అతడు పాల్గొనే ప్రయివేటు ముషాయిరాలకు వచ్చినా వారికీ అదే గతి పట్టేది. అతణ్ణి ఇంటర్వ్యూ చేయడం దుర్లభం. చేయాలనుకున్న వ్యక్తికి ఉర్దూ సాహిత్యం, కవిత్వం కూలంకషంగా తెలిసి ఉండాలి. ‘నా గురించి నీకేం తెలుసో చెప్పు. అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తాను’ అనేవాడు. మాటలకు చాలా విలువ ఉంటుంది. మాట్లాడే మనిషిని బట్టి, మాటలను వెలికి తీసే మనిషిని బట్టి ఆ సంభాషణ, ముఖాముఖికి విలువ వస్తుంది. ఓప్రా విన్ ఫ్రే తన ఇంటర్వ్యూలతో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఆమె తన నైపుణ్యంతో ఎదుటివారి మాటల్లో ఉండే జ్ఞాపకాల గాఢతను వెలికి తెస్తుంది. ఆమె మైకేల్ జాక్సన్‌ని ఇంటర్వ్యూ చేస్తే ఆ రోజుల్లో కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయి చూశారు. ఇప్పటికీ అమెరికన్ టెలివిజన్ చరిత్రలో అదే ఎక్కువ వ్యూయర్షిప్ పొందిన ఇంటర్వ్యూ. అడిగేవారి అంతస్తు చెప్పే వారి అంతస్తు తాలుమేలుగా కలిసినప్పుడు వచ్చే విలువ, గౌరవం అది. మన దేశంలో కూడా మంచి సంభాషణతో వ్యక్తిత్వాలను వెలికి తీసే పని స్త్రీలే మొదలెట్టారు. దూరదర్శన్‌లో నాటి బాలనటి తబస్సుమ్ చేసే టాక్ షోలకు విశేషంగా ఆదరణ ఉండేది. ఆమె తమను ఇంటర్వ్యూ చేయడం చాలామంది గౌరవంగా భావించేవారు. ఆ తర్వాత నటి సిమీ గెరేవాల్ చాలా విపులమైన ఇంటర్వ్యూలు చేసి అది చాలా శ్రద్ధతో పని చేయవలసిన రంగమని చాటింది. జయలలిత వంటి మొండిఘటం చేత తన ఇంటర్వ్యూలో పాట పాడించింది సిమీ. రతన్ టాటా, రాజీవ్ గాంధీ, రాజ్ కపూర్... వీరందరూ ఆమెతో మాట కలిపినవారిలో ఉన్నారు. రజత్ శర్మ ‘ఆప్ కీ అదాలత్’ ఒక భిన్నమైన ఫార్మాట్‌తో నింద–సంజాయిషీల ద్వారా చాలా మంది వ్యక్తిత్వాలను ప్రదర్శనకు పెట్టింది. ఆ తర్వాత చాలా కాలానికి ఆమిర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ షోతో ముఖాముఖి కార్యక్రమాలు తన వంటి సూపర్ స్టార్ నిర్వహించడం వల్ల వచ్చే సీరియస్‌నెస్‌ను, సామాజిక ప్రయోజనాన్ని లోకానికి తెలియచేశాడు. అయితే రాను రాను ఈ మాటల సేకరణ ఒక జీవనోపాధిగా మారింది. ప్రముఖులతో సంభాషణలు వినోదానికి, హాస్యానికి, కాలక్షేపానికి వనరుగా మారాయి. కరణ్‌జోహార్ వంటి హోస్ట్‌లు మునిగాళ్ల లోతుకే ఎదుటివారిని ఉంచుతూ సగటు ప్రేక్షకులను ఉత్సుకత పరిచే కబుర్లను వినిపించడం మొదలెట్టారు. శేఖర్ సుమన్ ‘మూవర్స్ అండ్ షేకర్స్’ ఇదే కోవలోకి వస్తుంది. కపిల్ శర్మ వంటి వారు బయలుదేరి హాస్యం కోసం ఎదుట ఉన్నది ఎవరైనాసరే వారితో నేలబారు మాటలు మాట్లాడించవచ్చని నిరూపించారు. ప్రచారం కోసం, ఏదో ఒక విధాన గుర్తుండటం కోసం ఒకనాడు తమ తమ రంగాలలో ఎంతో కృషి చేసినవారు కూడా ఇలాంటి షోలకు హాజరయ్యి ‘మీ ఇంట్లో సబ్బు అరిగిపోతే ఏం చేస్తారు?’ వంటి ప్రశ్నలకు జవాబులు ఇస్తూ వారి అభిమానులను చానల్ మార్చేలా చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాటల సేకరణ పతాక స్థాయికి చేరింది. యూ ట్యూబ్ పుణ్యాన ప్రతి ఒక్కరూ కాసిన్ని వీడియోల కోసం, వాటి మీద వచ్చే జరుగుబాటు కోసం మైక్ పట్టుకుని సాంస్కృతిక, కళారంగాల్లో ఉన్న రకరకాల స్థాయి పెద్దల వెంటబడుతున్నారు. వీరికి తాము ఇంటర్వ్యూ చేస్తున్న కళాకారుల/సృజనకారుల గురించి ఏమీ తెలియదు. అధ్యయనం చేయరు. గతంలో ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతున్నదో తెలుసుకోరు. ‘చెప్పండి సార్... చెప్పండి మేడమ్’ అంటూ ‘చెప్పండి’ అనే ఒక్కమాట మీద ఇంటర్వ్యూలు ‘లాగిస్తున్నారు’. విషాదం ఏమంటే గొప్ప గొప్ప గాయనీ గాయకులు, నటీనటులు, సంగీతకారులు, రచయితలు, రాజకీయవేత్తలు, దర్శకులు, నిర్మాతలు... వీరి ‘బారిన’ పడుతున్నారు. తమను అడుగుతున్నవారు ‘పిల్లకాకులు’ అని తెలిసినా క్షమించి జవాబులు చెబుతున్నారు. ‘హోమ్ టూర్’ అని వస్తే తమ ఇళ్లు బార్లా తెరిచి చూపిస్తున్నారు. పిచ్చి ప్రశ్నలకు హతాశులవుతూనే ఏదో ఒకటి బదులు ఇస్తున్నారు. వారికి ఉన్న అభిమానులు వారి పట్ల ఉండే గౌరవాన్ని పోగొట్టుకునేలా ఈ ఇంటర్వ్యూలు ఉంటున్నాయి. అన్నింటినీ మించి వీరి ఇంటర్వ్యూలలోని శకలాలను వక్రీకరించే థంబ్‌నైల్స్‌తో పోస్ట్‌లు వస్తుండటం దారుణం. దినపత్రికలు పలుచబడి, అచ్చులో వచ్చే ఇంటర్వ్యూల స్థలం కుదింపునకు లోనయ్యాక సంభా షణలు, ముఖాముఖీలు ఇప్పుడు ఎలక్ట్రానిక్/డిజిటల్ మీడియాలోనే సాగుతున్నాయి. కొత్తగా మొదలైన ఓటిటి ప్లాట్‌ఫామ్స్ తమ సబ్స్క్రిప్షన్ లు పెంచుకోవడానికి పాపులర్ సినిమా స్టార్లను రంగంలోకి దింపి ఆ స్టార్ల ములాజాతో ఇతర స్టార్లను పిలిపించి టాక్‌షోలు నిర్వహిస్తున్నాయంటే ఊహించుకోవచ్చు. ఈ షోలన్నీ ఉంటే ఉండొచ్చు. కాని మాటను పలుచన చేయరాదు.పెద్దలారా! మాటకు విలువివ్వండి! మీ పెద్దరికానికి మాటతో మాట రానీకండి!! -
తెరపైకి జాక్సన్ జీవితం
పాప్ సంగీత సామ్రాజ్యానికి రాజుగా వెలిగిన మైఖేల్ జాక్సన్ జీవితంతో ‘మైఖేల్’ పేరుతో బయోపిక్ రూపొందనుంది. ఈ చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకుడు. మైఖేల్‌గా ఆయన సోదరుడు జెర్మైన్ కుమారుడు జాఫర్ జాక్సన్ నటించనున్నారు. వెండితెరపై యాక్టర్‌గా జాఫర్‌కు ఇదే తొలి చిత్రం. ‘‘మా అంకుల్ కథలో నటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు జాఫర్. ‘‘మైఖేల్ జాక్సన్ లక్షణాలు జాఫర్లో చాలా ఉన్నాయి. మైఖేల్‌గా నటించగల ఒకే ఒక్క వ్యక్తి జాఫర్ అని నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన గ్రాహం. ఇక 1958 ఆగస్టు 29న పుట్టిన మైఖేల్ జాక్సన్ 2009 జూన్ 25న మరణించిన విషయం తెలిసిందే. -
వెండితెరపై మైఖేల్ జాక్సన్ బయోపిక్!
పాప్ ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ ఓ సంచలనం.ఆయన ఈ లోకాన్ని విడిచి ఎన్నో ఏళ్లు గడిచిపోయింది. అయినా కూడా క్రేజ్ తగ్గలేదు సరికదా, ఏ తరానికి చెందినవారికైనా మైఖెల్ వదిలి వెళ్లిన స్టెప్పులు, స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి. స్టేజ్ పై అతను కనిపించే తీరు, వీడియోస్ అతని స్టైల్, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని అభిమానుల్ని సంపాదించి పెట్టింది. తన కెరీర్ లోనే ఎన్నో కళ్లు చెదిరే స్టెప్పులు వేశాడు. వాటిల్లో మూన్ వాక్ అతనికి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే మైఖేల్ వ్యక్తిగత జీవితంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఇటు స్టార్ డమ్, అటు కాంట్రవర్సీస్ వీటన్నిటినీ ఇప్పుడు తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హాలీవుడ్ కు చెందిన లయన్స్ గేట్ ఎంటర్ టైన్ మెంట్ కార్పోరేషన్ ఇప్పుడు మైఖెల్ జాక్సన్ జీవితం పై బయోపిక్ తెరకెక్కించబోతోంది. మైఖెల్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని అమెరికన్ ఫిల్మ్ మేకర్ ఆంటోనీ తెరకెక్కించనున్నాడు. 1998 నుంచి ఇతను సినిమాలు తీస్తూ వస్తున్నాడు. 2001లో వచ్చిన ట్రైనింగ్ డే సినిమా ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు పాప్ కింగ్ లైఫ్ ను వెండితెరకెక్కించాలనుకుంటున్నాడు. మైఖెల్ జాక్సన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. -
అబ్బా! ఏం చేశాడ్రా... మూన్ వాకింగ్ స్టైల్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు
అందరికి వివిధ రకాల టాలెంట్లు ఉంటాయి. ఐతే ఆ టాలెంట్‌కి పదును పెట్టి విభిన్నంగా చేసి ఔరా! అనిపించుకునేవారు కొంతమందే. ఆ కోవకు చెందిన వ్యక్తే జయదీప్ గోహిల్. మూన్‌వాక్ గురించి అందరికీ తెలిసిందే. కానీ, జయదీప్ చేసిన మూన్‌వాక్ మరింత స్పెషల్. ఎందుకంటే అతను చేసింది నీటిలో తలకిందులుగా! వివరాల్లోకెళ్తే.. మూన్ వాక్‌తో జనాలను ఆకర్శిస్తున్న జయదీప్ గోహిల్.. ఈసారి విభిన్నంగా ట్రై చేశాడు. నీటి అడుగు భాగంలో మూక్వాక్తో ఆకట్టుకున్న ఈ యువకుడు.. తలకిందులుగా ఆ స్టెప్ వేసి అందర్నీ ఆశ్చర్య చకితులను చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. అతను ఆ వీడియోలో తొలుత స్విమ్మింగ్ పూల్‌లోని అడుగున ఉన్న టేబుల్ పై మేఖేల్ జాక్సన్‌కి సంబంధించిన ప్రసిద్ధ పాట స్మూత్ క్రిమినల్లో ఆయన ఎలా వాకింగ్ స్టైల్ డ్యాన్స్ తరహాలో నడిచాడో అలా నడుస్తాడు. ఆ తర్వాత సడన్‌గా తలకిందులుగా నడుస్తాడు. చూస్తే ఏం చేశాడ్రా అని అనకుండా ఉండలేరు. ఈ వీడియోకి తొమ్మిది మిలియన్లకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు కూడా అతని టాలెంట్ చూసి తెగ ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hydroman (@hydroman_333) (చదవండి: కింగ్ చార్లెస్ కారుని ఢీ కొట్టబోయాడు: వీడియో వైరల్) -
Bappi Lahiri: మైఖేల్‌కు అన్నీ ఉన్నాయి.. కానీ నా దగ్గర ఉన్నది ఈ బంగారం మాత్రమే!
Bappi Lahiri- Michael Jackson: 1996లో కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ ముంబై వచ్చారు. ఆ సందర్భంలోనే బప్పీ లహిరిని చూశారాయన. ముఖ్యంగా బప్పీ మెడలో ఉన్న వినాయకుడి లాకెట్‌ని చూసి, ‘‘ఓ మై గాడ్.. అద్భుతం. మీ పేరేంటి’’ అని అడిగారు మైఖేల్. బప్పీ తన పేరు చెప్పారు. ‘‘మీరు కంపోజరా?’’ అడిగారు మైఖేల్. ‘‘అవును.. ‘డిస్కో డ్యాన్సర్’ చేశాను’’ అన్నారు బప్పీ. వెంటనే ఆ సినిమాలోని పాట ‘జిమ్మీ’ని ప్రస్తావించి, ‘‘నాకు మీ ‘జిమ్మీ జిమ్మీ..’ పాట చాలా ఇష్టం’’ అన్నారు మైఖేల్. మామూలుగా కొన్ని సందర్భాల్లో బప్పీ బంగారు గొలుసులను కొందరికి బహుమతిగా ఇస్తుంటారు. అయితే ఆ రోజు మైఖేల్‌కి వినాయకుడి లాకెట్ నచ్చినప్పటికీ ఆయనకు ఇవ్వలేదు. దానికి కారణాన్ని ఓ షోలో స్వయంగా చెప్పారు బప్పీ. ‘‘ఆ లాకెట్ మా ఆవిడ కొనిచ్చింది. నా లక్కీ లాకెట్. ఆయన (మైఖేల్)కు అన్నీ ఉన్నాయి. కానీ నా దగ్గర ఉన్నది ఈ బంగారం మాత్రమే. అది నా అదృష్టం. నేను కోల్‌కతాలో పుట్టాను. కానీ నన్ను మహారాష్ట్ర మట్టి ఆశీర్వదించింది. ఒకవేళ మైఖేల్‌కు నేను గణేశుడి లాకెట్ ఇచ్చి ఉంటే.. ఆ ఆశీర్వాదాలు నన్ను వదిలి వెళ్లిపోయి ఉండేవేమో’’ అని ఆ షోలో బప్పీ అన్నారు. అయితే 2009లో మైఖేల్ చనిపోయినప్పుడు ఆయన మీద ఉన్న ఇష్టంతో ప్రత్యేకంగా ఓ పాట కంపోజ్ చేశారు బప్పీ. – కె చదవండి: Rashmika Mandanna: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే ప్రేమ పెళ్లి చేసుకుంటా: రష్మిక -
ఇలా స్టెప్పులు వేయాలంటే గట్స్ ఉండాలి.. వీడియో వైరల్!
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. వారు తమ కళను ఒక్కోరకంగా వ్యక్తపరుస్తారు. తాజాగా, ఒక స్ట్రీట్ డ్యాన్సర్ నడి వీధిలో తన స్టెప్పులతో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక స్ట్రీట్ డ్యాన్సర్.. మైకేల్ జాక్సన్‌లా అలవోకగా స్టెప్పులేసి అక్కడున్న వారిని మెప్పించాడు. డ్యాన్స్ అనే కాకుండా రకరకాల భంగిమలతో వెరైటీ స్టెప్పులు వేశాడు. ఒకసారి తాను బౌలింగ్ వేసినట్లు.. ఆ వెంటనే బౌండరీ కొట్టినట్టు భంగిమను మార్చేశాడు. నేలకు కొట్టిన బంతిలా పడుతూ.. లేస్తూ స్టన్నింగ్ స్టంట్లు చేశాడు. అంతలోనే గాలిలో పతంగిని లాగినట్లు కూడా స్టెప్పులు వేసి చూపరులను ఆశ్చర్యపరిచాడు. అంతలోనే జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తున్నట్లుగా.. రకారకాల యాంగిల్స్‌లో స్టెప్పులు వేశాడు. తన స్టన్నింగ్ స్టెప్పులతో అక్కడి జనాలను షాకింగ్‌కు గురిచేశాడు. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు తెలియవు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. కాగా, అతని స్టన్నింగ్ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి స్టెప్పులు వేయాలంటే గట్స్ ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వైరల్: చీర కట్టులో చూడముచ్చటైన కేరళ యువతుల డ్యాన్స్ .. -
మైకేల్ జాక్సన్ స్టెప్పులతో స్ట్రీట్ డ్యాన్సర్ హల్చల్
-
‘మైఖేల్ జాక్సన్ దెయ్యంలా మారి నన్ను పెళ్లి చేసుకున్నాడు’
లండన్: ఆత్మ, పునర్జన్మ, దెయ్యాలు వంటి అంశాలకు ముగింపు దొరకడం కష్టం. ఇక సెలబ్రిటీలు చనిపోయినప్పుడు పలువురు.. వారి ఆత్మలు తమతో మాట్లాడుతున్నాయని.. వారు తమకు కనిపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. దెయ్యంగా మారిన మైఖేల్ జాక్సన్ తనను పెళ్లి చేసుకున్నాడని.. తన శరీరంలో ప్రవేశించి డ్యాన్స్ చేయడం, తినడం, పాటలు పాడటం వంటి పనులు చేస్తున్నాడని తెలిపింది. మైఖేల్ జాక్సన్ ఆత్మ తన శరీరంతో శృంగారం తప్ప అని పనులు చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఆ వివరాలు.. యూకేకు చెందిన కాథ్లీన్ రాబర్ట్స్ అనే మహిళ తాను మార్లీన్ మన్రో పునర్జన్మ అని.. అంతే కాక దెయ్యంగా మారిన మైఖేల్ జాక్సన్ తనను పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ఈ విషయాలన్నింటిని కాథ్లీన్ గతేడాది ఓ న్యూస్ పేపర్లో ప్రచురించడంతో ఇవి వెలుగులోకి వచ్చాయి. దానిలో ఆమె ‘‘అతీతశక్తులకు సంబంధించి నా అనుభవాలను మీతో పంచుకోవలనుకుంటున్నాను. నేను దెయ్యంతో నివసిస్తున్నాను. ఆ దెయ్యం గురించి భూమ్మీద అందరికి తెలుసు. అది మైఖేల్ జాక్సన్’’ అని తెలిపింది. మైఖేల్ అనుక్షణంతో నాతోనే ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడకు వస్తాడు.. ఆఖరికి రెస్ట్రూమ్కు కూడా నాతో పాటు వస్తాడు. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధ క్షణాలను అతడు టాయిలెట్రైస్ అని పిలుస్తాడు. మైఖేల్ నాతో చాలా విషయాలు మాట్లాడతాడు. టీవీల్లో మనం చూసే మైఖేల్ జాక్సన్ చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. కానీ నాలో ఉన్న మైఖేల్ జాక్సన్ అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు’’ అని తెలిపారు. ‘‘మైఖేల్ జాక్సన్ నాలో ఉండి విశ్రాంతి తీసుకుంటాడు.. నా శరీరంలో ఉండి ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ భర్తలా నాతో మాట్లాడతాడు. తనకు కుకీస్ అంటే చాలా ఇష్టం. నాలో ఉండి వాటిని తింటాడు. తను నా శరీరంతో అన్ని పనులు చేస్తాడు. శృంగారం మాత్రం చేయడు. నేను ప్రయత్నిస్తే.. సాలీడు నీడ, శవాల ఆకారాలతో నన్ను భయపెడతాడు. నేను చేసే తప్పులను ఎత్తి చూపుతాడు’’ అని తెలిపింది. ఇక మైఖేల్ జాక్సన్ 2009లో జూన్ 25న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. -
Michael Jackson: ఊహించినట్లే మరణించిన జాక్సన్!
పాప్ రారాజు మైకేల్ జాక్సన్ చనిపోయి ఇవాళ్టికి సరిగ్గా పన్నెండేళ్లు పూర్తైంది. ఆయన చావుకు కారణం.. డ్రగ్స్, వాటి వల్ల వచ్చిన గుండెపోటు. యాభై ఏళ్ల వయసులో మోతాదుకు మించి తీసుకోవడం వల్లే జాక్సన్ గుండెపోటుకి గురై చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు కూడా. అయితే జాక్సన్ తన చావు భయాన్ని చాలా ఏళ్ల క్రితమే.. అది కూడా తన భార్య సమక్షంలో ప్రస్తావించడం విశేషం. లీసా మరీ(54) జాక్సన్‌కు మొదటి భార్య. 1994లో ఆమె జాక్సన్‌ను పెళ్లి చేసుకుని.. 1996లో వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు ఇచ్చింది. లీసా మరీ ఎవరో కాదు.. అమెరికన్ పాప్ సింగర్, ‘కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్’ ఎల్విస్ ప్రెస్లేకి ఏకైక కూతురు. లీసాకి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు ఎల్విస్ గుండెపోటుతో కన్నుమూశాడు. ఆ టైంలో ఎల్విస్ ప్రొపొఫోల్, బెన్జోడయాజెపైన్ లాంటి డ్రగ్స్ వాడాడు. విశేషం ఏంటంటే.. ఎల్విస్ చనిపోయిన ముప్ఫై ఏళ్ల తర్వాత జాక్సన్ కూడా ఇవే డ్రగ్స్ వాడి కన్నుమూశాడు. ఇక గతంలో లీసాతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాక్సన్.. తన భయాన్ని పబ్లిక్‌గా వెల్లడించాడు కూడా. ఆ టైంలో జాక్సన్ ‘నా ఆరోగ్యం దృష్ట్యా కొన్ని మందులు వాడుతున్నా. కానీ, వికటిస్తే వీళ్ల నాన్నలా నేనూ గుండెపోటుతో చనిపోతానేమో అని భయంగా ఉంది’ అని కాకతాళీయంగా ఓ మాట అనేశాడు. ఆ ఊహకు తగ్గట్లే లాస్ ఏంజెల్స్‌లో 2009లో జూన్ 25న గుండెపోటుతో, విచిత్రంగా అవే డ్రగ్స్ వాడి కన్నుమూశాడు మైకేల్ జోసెఫ్ జాక్సన్. ఇక లీసా, జాక్సన్ విడిపోయాక కూడా నాలుగేళ్లపాటు రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు వాళ్లు. ఆ తర్వాత 1996లో డెర్మటాలజిస్ట్ డెబోరాను పెళ్లి చేసుకుని.. 1999లో విడాకులు ఇచ్చాడు. చదవండి: జాక్సన్ బాడీ గార్డులు తోసేశారు: ఇండియన్ నటుడు -
ఆ విషయం మైకేల్ జాక్సన్ ముందే చెప్పారు
లాస్ ఏంజిల్స్ : కరోనా వైరస్‌లాంటి మహమ్మారి ప్రపంచాన్ని నాశనం చేయబోతోందని కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ ముందే ఊహించారా? తను బ్రతికున్నంత కాలం వైరస్ల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్త పడ్డారా?... అవునని అంటున్నాడు ఆయన దగ్గర దశాబ్దకాలం పనిచేసిన బాడీగార్డ్ మ్యాట్ ఫిడ్డెస్. కరోనా కారణంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై స్పందించిన మ్యాట్ ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో.. ‘ కరోనాలాంటి మహమ్మారి ప్రమాదం ఉందని మైకేల్ జాక్సన్ ముందుగానే భావించారు. ఏదో ఒకరోజు ప్రమాదకర సూక్ష్మ జీవుల బారిన పడి ప్రపంచం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పేవారు. అందుకే ఎల్లప్పుడు ఫేస్‌మాస్క్, గ్లౌజులు ధరించేవారు. ‘మ్యాట్ నేను అనారోగ్యానికి గురికాను. నా అభిమానులను నిరాశపర్చను. ( కోవిడ్: నిమిషాల్లోనే నిర్ధారణ! ) నాకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఓ కారణంమీదే నేను ఈ భూమిపై జన్మించాను. నేను నా గొంతును పాడుచేసుకోదల్చుకోలేదు. ప్రతినిత్యం ఎలాంటి వారు ఎదురుపడతారో.. ఎలాంటివాటిని నేను దాటుకెళుతానో తెలియద’ని చెప్పేవారు. ఆయన బ్రతికుంటే ఏం చెప్పేవారో అదే నేను చెబుతున్నాను. ఇలాంటి మాటలు చెప్పినపుడు ఆయన చుట్టూ ఉండేవారు పెద్ద సీరియస్‌గా తీసుకునేవారు కాదు.. ఎగతాళి చేసేవార’ని చెప్పారు. ( అమల్లో ఉంది లాక్‌డౌనా, కర్ఫ్యూనా? ) -
జాక్సన్ జీవిత కథ
‘కింగ్ ఆఫ్ పాప్’ అంటారు పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌ను. పాప్ ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ ఓ సంచలనం. డ్యాన్స్ చేయడంలో ఓ బెంచ్ మార్క్. జాక్సన్ జీవితంలో కేవలం సంగీతం, డ్యాన్స్ మాత్రమే కాదు ఎన్నో మిస్టరీలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ స్క్రీన్ మీదకు బయోపిక్‌గా తీసుకురావాలని చాలా మంది హాలీవుడ్ దర్శక–నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ మైఖేల్ జాక్సన్ ఫ్యామిలీకి చెందిన వాళ్లు లీగల్‌గా పెట్టే షరతులను దాటలేకపోయారు. తాజాగా హాలీవుడ్ నిర్మాత గ్రహమ్ కింగ్.. మైఖేల్ జాక్సన్‌పై సినిమా తీసే హక్కులను దక్కించుకున్నారు. గత ఏడాది ‘బొహేమియన్ రాప్సోడి’ చిత్రాన్ని నిర్మించారు గ్రహమ్ కింగ్. అది సంగీత కళాకారుడు ఫ్రెడ్డీ మెర్కూరీ బయోపిక్ కావడం విశేషం. నాలుగు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది ఈ సినిమా. జాక్సన్ సినిమా విషయానికి వస్తే.. ‘గ్లాడియేటర్, హ్యూగో, ద ఏవియేటర్’ వంటి సినిమాలకు కథను అందించిన జాన్ లోగాన్ ఈ చిత్రానికి కథను సమకూరుస్తారు. ప్రస్తుతం మైఖేల్ జాక్సన్ పాత్రను పోషించే నటుడి ఎంపిక జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. -
మైఖేల్ జాక్సన్ నా దేవుడు: ఆదిత్య ఠాక్రే
సాక్షి, ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో నవశకం మొదలైంది. ఠాక్రే వంశం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఆదిత్యా ఠాక్రే వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా వర్లి నియోజకవర్గ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. అయితే విజయం మరింత బాధ్యతను పెంచుతుందన్నారు. ఇక ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం శివసేన భవన్‌కు చేరుకొని తల్లిదండ్రులతో కలిసి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను కేవలం సైనికుడిని మాత్రమేనని తెలిపారు. శివసేన అధినేత, తన తండ్రి ఉద్దవ్ ఠాక్రే ఆదేశాల మేరకు పనిచేస్తానని, మహారాష్ట్ర అభివృద్దిలో భాగంగా అయన ఏ బాధ్యతలు అప్పగించినా శిరసా వహిస్తానని ఆదిత్యా ఠాక్రే స్పష్టం చేశారు. పాప్ రారాజు మైకేల్ జాక్సన్ తనకు దేవుడితో సమానమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్నతనం నుంచే జాక్సన్ అంటే అమితమైన ఇష్టమని, చిన్నప్పుడు ఓ సారి అయనను కలిశానని గుర్తుచేశారు. ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. ఇక తన తల్లిదండ్రుల ప్రేమ, ఆశీర్వాదాలతోనే ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనబోతున్నట్లు తన తల్లికి చెప్పగానే ఆప్యాయంగా కౌగిలించుకొని కష్టపడి పని చేయమని చెప్పిందన్నారు. ఇక ఆదిత్య ఠాక్రే నామినేషన్ వేసినప్పట్నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు అందరి దృష్టి ఆయనపైనే ఉన్న విషయం తెలిసిందే. ఇక కూటమిలో భాగంగా సీఎం పదవి శివసేనకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ శివసేనకే సీఎం పీఠం అప్పగిస్తే.. సీఎం అభ్యర్థిగా ఆదిత్య ఠాక్రే పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే మహారాష్ట్ర సీఎం పీఠంపై ఎవరు కూర్చుంటారనేది రెండు మూడ్రోజుల్లో తేలనుంది. -
11 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు!
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా..? అయ్యో అదేం ప్రశ్న ఆ మాత్రం తెలియదా.. మైఖేల్ జాక్సన్ కదా.. ఆయనో కింగ్ ఆఫ్ పాప్.. అంటూ స్టార్ట్ చేయకండి. ఆయన మైఖేల్ జాక్సన్ అనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అది మైఖేల్ జాక్సన్ ఫొటో కాదు. అతడి పేరు లియో బ్లాంకో. వయసు 22 ఏళ్లు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్కు చెందిన వ్యక్తి. మరేంటి అచ్చు మైఖేల్ జాక్సన్ లాగే ఉన్నాడు అనుకుంటున్నారా..? అవును అలాగే ఉన్నాడు. కానీ అలా కనిపించేందుకు ఏడేళ్లుగా బీభత్సమైన ప్లాస్లిక్ సర్జరీలు చేయించుకున్నాడట మనోడు. అందుకోసం దాదాపు రూ.22 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడట. 11 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడట. అయితే ఇంకా పర్ఫెక్ట్గా జాక్సన్లాగా కనిపించాలని ఇంకా కొన్ని సర్జరీలు చేయించుకుంటానని చెబుతున్నాడు. బ్లాంకో తల్లి మాట్లాడుతూ.. ఒక్కోసారి తానే గుర్తుపట్టలేక ఆశ్చర్చపోతానని, తన కొడుకు చివరికి ఏమైపోతాడోనని చాలా ఆందోళనగా ఉంటుందని చెప్పారు. -
స్త్రీలోక సంచారం
మైఖేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్ మీద మనసు పారేసుకుని నిరంతరం ఆమెను వెంబడిస్తూ, ఓసారైతే.. ఆమె దర్శనం కోసం ఆమె రికార్డింగ్ స్టూడియో బయట పదిహేను గంటలపాటు వేచివున్న నికోలాస్ లీవైజ్ స్టీవెన్స్ అనే ఆగంతకుడిని మళ్లీ వచ్చే వాయిదా వరకు ఆమెకు కనీసం 91.44 మీటర్ల దూరంలో ఉండాలని కోర్టు ఆదేశించింది. పారిస్ జాక్సన్‌ను వెంబడించడమే కాక, ఆమె ఫొటోను ట్విట్టర్లో పెట్టి, ‘ఈమె నా ఆత్మసఖి’ అని నికోలాస్ కామెంట్ పెట్టడంతో భయపడిన పారిస్, అతడి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు ::: కోల్‌కతా నుంచి వస్తున్న ప్రముఖ గాయని సొమెరిటా మల్లిక్ ఈ నెల 14 సాయంత్రం 5 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెం.1 లోని ‘జీవీకే వన్’ మాల్కి ఎదురుగా ఉన్న ‘లామకాన్’లో తన సంగీత విభావరితో అలరించనున్నారు. రవీంద్రనాథ్ టాగోర్, ఖాజీ నజ్రూల్ ఇస్లాంల శ్రావ్యగీతాలకు తన గాత్రంలోని మాధుర్యాన్ని రంగరించి శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చెయ్యడానికి సంసిద్ధురాలైన మీదటే ఆమె హైదారాబాద్ వస్తున్నారు. అమెరికన్ రియాలిటీ టెలివిజన్ పర్సనాలిటీ, మోడల్, ఆంట్రప్రెన్యూర్, సోషలైట్.. కైలీ జెన్నర్ అత్యంత ప్రమాదకరమైన ‘లిప్ చాలెంజ్’ని సోషల్ మీడియా మీదకు విసిరారు. చిన్న మూతి గల గాజు గ్లాసులలో, సీసాలలో పెదవులను చొప్పించి, వాటిని ఉబ్బించడమనే ఈ సాహసం విఫలమైతే పెదవులలోని రక్తనాళాలు ఉబ్బి, పెదవులు చిట్టి, రక్తం కారడమే కాకుండా, ఆ గాయం మానడానికి చాలా సమయం పడుతుంది కాబట్టే అదొక ప్రాణాంతకమైన సవాలుగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇరవై ఏళ్లకే తల్లి అయిన కైలీ జెన్నర్.. ఇంకా నడకైనా రాని తన ఐదు నెలల కూతురి కోసం 22 వేల డాలర్ల (15 లక్షల 17 వేల రూపాయలు) ఖరీదైన చెప్పుల్ని కొనడం కూడా మరొక విశేషం. ::: రాంచీలో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ నేతృత్వంలోని ‘నిర్మల్ హృదయ్’ హోమ్‌లో ఉంటున్న నన్.. సిస్టర్ కన్సీలియాను, అనిమా ఇంద్వార్ అనే ఒక సహాయకురాలిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. హోమ్‌లోని ‘అవివాహిత తల్లుల వార్డు’కు పర్యవేక్షకురాలిగా ఉన్న సిస్టర్ కన్సీలియా.. హోమ్‌లో పుట్టిన ఒక శిశువును విక్రయించారన్న ఆరోపణలపై ఆమెతో పాటు, ఆమె సహాయకురాలిపై కేసు నమోదు అయింది ::: అమెరికాలో పుట్టిన స్విస్ సూపర్‌స్టార్ గాయని, గేయ రచయిత్రి, డాన్సర్, నటి, కథకురాలు 78 ఏళ్ల టీనా టర్నర్.. పుత్ర శోకంలో మునిగిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా లాజ్ ఏంజెల్స్‌లో ప్రసిద్ధుడైన టీనా 59 ఏళ్ల కుమారుడు క్రెయిగ్ రేమండ్ దేహంలో బులెట్ దిగిన గాయం ఉండడంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. లాస్ వెగాస్‌లో ‘సూపర్ ఈటర్’గా ప్రఖ్యాతురాలైన మికీ సుడో అనే యువతి వరుసగా ఐదో ఏడాది కూడా ఆహార పోటీలలో విజేతగా నిలిచారు. ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల గొలుసు సంస్థ ‘నథాన్స్ ఫేమస్’ అమెరికా స్వాతంత్య్ర దినం అయిన జూలై 4న ఏటా నిర్వహించే ఈ ఈటింగ్ పోటీలలో ఈ ఏడాది.. పది నిముషాలలో 37 హాట్‌డాగ్స్, బన్స్ తిని టాప్ ప్రైజ్ గెలుచుకున్న మికీ సుడో గత ఏడాది 41 హాట్ డాగ్స్ లాగించారు ::: ప్రసిద్ధ వినియోగ వస్తూత్పత్తుల బహుళజాతి సంస్థ ‘యూనీలివర్’ చీఫ్ హెచ్.ఆర్. ఆఫీసర్ లీనా నాయర్ (49) నేతృత్వంలో ఆ కంపెనీ.. సామాజిక ప్రయోజనం కోసం ‘డిఫరబిలిటీ’ అనే డిజేబిలీటి కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతోంది. లీనా యూనీలివర్‌కు తొలి మహిళా చీఫ్ హెచ్.ఆర్. మాత్రమే కాదు, అతి చిన్న వయసులో ఈ స్థాయికి చేరుకున్న మహిళ కూడా ::: ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ పాలసీలో భాగంగా అక్రమ వలసల నిఘా అధికారులు తల్లిదండ్రుల నుంచి వేరు చేసి నిర్బంధ శిబిరాలలో ఉంచిన బాలల సంఖ్య సుమారు మూడు వేల వరకు ఉందని తాజాగా ప్రకటించిన యు.ఎస్. హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్.. తొమ్మిది రోజుల క్రితం విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్య రెండు వేలు మాత్రమే ఉండడాన్ని బట్టి చూస్తే తల్లుల్నుంచి, పిల్లల్ని వేరు చేసే కార్యక్రమం మరింత ముమ్మరం అయిందని తెలుస్తోంది. (నిర్బంధ శిబిరం నుంచి 61 రోజుల తర్వాత విడుదలైన బిడ్డ, తన తల్లిని కలుసుకున్న దృశ్యాన్ని ‘తల్లీబిడ్డ’ అనే ఫొటోలో చూడవచ్చు). -
మైఖెల్ జాక్సన్‌లా డాన్స్.. జర జాగ్రత్త..
చండీగఢ్ : డాన్స్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు పాప్ సంగీత రారాజు ‘మైఖెల్ జాక్సన్’. ఆయన చేసిన మూమెంట్స్‌లో ప్రముఖమైనవి ‘మూన్‌వాక్’, ‘ గ్రావిటీ డిఫైయింగ్’. నేటి తరం ఆయనలా డాన్స్ చేయాలని ముఖ్యంగా ఈ రెండిటిని చేసి అందరి మెప్పుపొందాలని చూస్తుంటారు. అయితే మైఖెల్లా డాన్స్ చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు న్యూరోసర్జన్లు. ఆయన చేసిన డాన్స్ మూమెంట్లను అనుకరించటం ద్వారా వెన్నెముకకు గాయాలయ్యే అవకాశం ఎక్కువంటున్నారు. చండీగఢ్‌కు చెందిన ‘పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ న్యూరోసర్జన్ల బృందం ఈ విషయాన్ని ధృవీకరించింది. ‘స్మూత్ క్రిమినల్’ ఆల్బమ్‌లో మైఖెల్ జాక్సన్ చేసిన 45 డిగ్రీ బెండ్ మూమెంట్ వల్ల వెన్నెముక దెబ్బ తినే అవకాశం ఉందంటున్నారు. ఎముకలను వేగవంతంగా కదిలించడం, ఒత్తిడికి గురిచేయటం ద్వారా నష్టం వాటిల్లుతుందంటున్నారు. శరీరాన్ని ఒక స్థాయికి మించి వంచడం వల్ల వెన్నెముకకు గాయాలవుతాయని తెలిపారు. వెన్నెముకకు గాయాలైన వారిలో కొంతమందికి ఫిజియోథెరపితో నయం అయితే మరికొంత మందికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందంటున్నారు. ప్రమాదకరమైన భంగిమలతో కూడిన డాన్స్‌లతో శరీర అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు న్యూరోసర్జన్లు. మెప్పు పొందాలని చూస్తే ముప్పు తప్పదంటున్నారు. -
చరిత్రలో నిలిచిపోయిన సెలబ్రిటీలు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ సూపర్ స్టార్ శ్రీదేవీ దుబాయ్‌లో అకాల మరణం చెందడం దశాబ్ద కాలంలోనే పెద్ద చర్చనీయాంశం అయింది. భారతీయులతోపాటు పాకిస్థాన్ ప్రజల నివాళులను అందుకుంటున్న ఏకైక తార శ్రీదేవీయే కాచ్చు! జాతి, మత, కుల వైషమ్యాలు లేకుండా ప్రపంచ ప్రజల నీరాజనాలు అందుకుని చరిత్రలో నిలిచిపోయే వారు అతి కొద్ది మందే ఉంటారు. మైఖేల్ జాక్సన్ (1958–2009) పాప్ సింగర్‌గా ‘కింగ్ ఆఫ్ పాప్’ విశ్వవిఖ్యాతి చెందిన మైఖేల్ జాక్సన్ 2009లో అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో, తన ఇంట్లో అకాల మరణం పొందారు. ఆయన తన పాటలకు సంబంధించి 26 లక్షల డిజిటల్ ట్రాక్‌లను విక్రయించడం ద్వారా పది లక్షల డిజిటల్ ట్రాక్లకన్నా ఎక్కువగా విక్రయించిన ఏకైన సింగర్‌గా కూడా రికార్డు సృష్టించారు. ఎల్విస్ ప్రెస్లీ (1935–1977) ప్రముఖ అమెరికా గాయకుడు, కంపోజర్, నటుడు ఎల్విస్ ప్రెస్లీ తన గానామతంతో ‘కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్’గా గుర్తింపు పొందారు. 20వ శతాబ్దంలో ఆయన పాట వినని ఇల్లంటూ అమెరికా, యూరప్ దేశాల్లో లేదంటే అతిశయోక్తి కాదు. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకన్న ఆయన తన 42వ ఏట బాత్రూమ్లోనే కన్నుమూశారు. ఆయన అప్పటికే చిన్న ప్రేగు సమస్యతో బాధ పడుతున్నారు. ప్రిన్సెస్ డయానా (1961–1997) బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్సెస్ డయానా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిన ఎంటర్డేన్మెంట్ సెలబ్రిటిగా గుర్తింపు పొందారు. 1997లో జరిగిన ఓ కారు ప్రమాదంలో మరణించారు. ఆమెతోపాటు అ ప్రమాదంలో మరో ఇద్దరు మరణించారు. మార్లిన్ మాన్రో (1926 –1962) హాలీవుడ్ శృంగార తారగా 1950వ దశకంలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మార్లిన్ మాన్రో పిన్న వయస్సులో, అంటే 36వ ఏట అకాల మరణం చెందారు. నాడీ మండలం చికిత్సకు వాడే ‘బార్బిటు రేట్’ ఒవర్ డోస్ వల్ల మరణించారు. విట్నీ హూస్టన్ (1963–2012) తన పాటలతో ప్రపంచ ప్రేక్షకులను అలరిస్తూ ‘బిల్బోర్డ్ ఆల్బమ్ అవార్డు’ను దక్కించుకొని అనేక అవార్డులు పొందిన మహిళా సింగర్ ‘గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎక్కిన విట్నీ హూస్టన్ కూడా వాటర్ టబ్‌లోనే మరణించారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్టన్‌లో గెస్ట్ రూమ్‌లో 2012, ఫిబ్రవరి 11వ తేదీన ఆమె కన్నుమూశారు. ఆ తర్వాత మూడేళ్లకు అంటే, 2015లో ఆమె కూతురు బొబ్బి కష్ణా బ్రౌన్ కూడా నీటి తొట్టిలోనే కోమాలోకి వెళ్లి ఆర్నెళ్లలోగా మరణించారు. ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ (1958 నుంచి 2016) పాటకు తగ్గ నత్యంతో యువతను ఉర్రూతలూగించిన ప్రముఖ అమెరికా సింగర్ ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ తన 57వ ఏట ‘ఫెంటానిల్’ ఒవర్ డోస్ కారణంగా అకాల మరణం చెందారు. అభిమానులు ‘ప్రిన్సి’గా పిలుచుకునే రోగర్స్ పలు వాయిద్యాల్లో ఆరితేరిన విద్వాంసుడు. బెస్ట్ సెల్లింగ్ పాప్ సింగర్‌గా పాపులర్. -
మైకేల్ జాక్సనా... మానధన సుయోధనా!
రవీంద్రభారతి రసజ్ఞులైన ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. ప్రఖ్యాత అవధాని డప్పుల అప్పలాచార్య ఆరోజు ‘నిర్దిష్టకథాక్షరి’ చేస్తున్నారు. ‘నిర్దిష్టకథాక్షరి’ అంటే పృచ్ఛకుడు రెండో, మూడో పదాలు నోటికొచ్చినవి చెబుతాడు. అవధాని అప్పటికప్పుడు ఆ పదాలతో కథ అల్లేయాలి.ఆరోజు పృచ్ఛకుడు అవధానికి ఇచ్చిన సమస్య...‘మైకేల్ జాక్సన్’ ‘మానధనసుయోధనుడు’ ‘ఐశ్వర్యరాయ్’ ఇది విని ప్రేక్షకులు ఘెల్లుమని నవ్వారు. ఎందుకుంటే మైకేల్ జాక్సన్, దుర్యోధనుడు, ఐశ్వర్యరాయ్... ఒకదానికొకటి సంబంధం లేని పేర్లు. ‘ఈ దెబ్బతో అవధానిగారి ఆటకట్టు!’ అనుకున్నారు ప్రేక్షకుల్లో సగం మంది. కానీ మన అవధాని డప్పుల అప్పలాచార్యగారు ఆ పేర్లు విన్న వింటనే ఇలా ఆశువుగా కథ చెప్పడం మొదలు పెట్టారు. ‘‘రాజసూయయాగం తలపెట్టాం. నువ్వు తప్పక రావాలి బ్రదర్’’ అని ధర్మరాజు దుర్యోధనుడిని ఆహ్వానించాడు. ‘‘వెళ్లాలా వద్దా?’’ అని తెగ ఆలోచిస్తున్న దుర్యోధనుడి దగ్గరికి అంకుల్ శకుని వచ్చి...‘‘నువ్వు వెళితేనే మంచిది అల్లుడూ’’ అని సలహా ఇచ్చాడు. అలా దుర్యోధన సార్వభౌముడు ధర్మరాజు ఆహ్వానం మేరకు ఇంద్రప్రస్థానికి వెళ్లాడు. దుర్యోధునుడి చూసి ధర్మరాజు తెగ సంతోషించాడు.‘‘బ్రదరా భీమసేనా... కురుసార్వభౌముడికి మయసభలో విడిది ఏర్పాటు చేయండి’’ అని భీముడిని ఆదేశించాడు ధర్మరాజు. ‘‘అలాగే అన్నా’’ అంటూ దుర్యోధనుడిని సగౌరవంగా మయసభకు తీసుకెళ్లి తిరిగి ధర్మరాజు దగ్గరికి వచ్చాడు భీముడు.‘‘భీమా... ఒక విషయం చెప్పడం మరిచాను. ‘భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానం’తో మయసభను మయుడు తీర్చిదిద్దాడని దుర్యోధనుడికి చెప్పి ఉంటే బాగుండేది. లేకపోతే మయసభలోకి అడుగు పెట్టిన దుర్యోధనుడు పరేషాన్ కాగలడు’’ అన్నాడు ధర్మరాజు.‘‘దాని గురించి దుర్యోధునుడికి చాలా వివరంగా చెప్పాను అన్నా... ఎలాంటి సమస్యా లేదు...’’ అని అబద్ధం ఆడాడు భీముడు. నిజానికి భీముడు ‘మయసభ’ గురించి ఒక ముక్క కూడా దుర్యోధనుడికి చెప్పలేదు. ఇక అక్కడ దుర్యోధనుడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం... కురుసార్వభౌముడు దుర్యోధనుడు మయసభలోకి అడుగు పెట్టాడు. కొద్ది దూరం వెళ్లగానే ఆయన నోటి నుంచి వచ్చిన డైలాగ్... ‘‘ఆహా! ఏమి ఈ సుందరి సౌందర్యరహస్యం. సకల కళా ప్రపూర్ణుడై వివిధ కళా వినోదిౖయెన రారాజు ప్రశంసలుఅందుకున్న అందాల సుందరీమణి.... నీ పేరేమి?.... ఏమా మౌనము? పేరు చెబితే నోటి నుంచి డైమండ్స్ రాలిపడునని నీ డౌటా? ఈ కురుసార్యభౌముడికేల నీ డైమండ్లు!!’’ అని పెద్దగా నవ్వి...‘‘సుందరీ ఇప్పుడైనా నీ పేరేమిటో చెబుదువా?’’ మృదువుగా ఆమె భుజం మీద చేయి వేసి అడిగాడు దుర్యోధనుడు. వెంటనే ఆకాశవాణి గర్జించింది...‘‘ఓరీ మూర్ఖ దుర్యోధన.... నీవు మాటలాడునది అందమైన అమ్మాయితో కాదు...భవిష్యత్ తార ఐశ్వర్యరాయ్ లైఫ్ సైజ్ వాక్స్ స్టాచ్యూతో.... అనగా ఐశ్వర్యరాయ్ నిలువెత్తు మైనపు బొమ్మతో’’ ‘‘పరువు పోయిందే’’ అని నాలుక కర్చుకొని చుట్టూ చూశాడు దుర్యోధనుడు. ‘‘హమ్మయ్య... ఎవరూ చూడలేదు’’ అని తృప్తి పడ్డాడు. కొంత దూరం నడిచాక.....‘‘అడవిలో తిరగాల్సిన పులికి ఇక్కడేం పని? అది నా వైపే వచ్చుచున్నది. భీకరంగా గాండ్రించుచున్నది. దీనికి తగిన శాస్తి చేసేదా’’ అని తన చేతిలోని గదతో ఒక్కటిచ్చుకున్నాడు. పెద్దగా సౌండ్ వినిపించింది.‘‘ఎంత పని చేశావు దుర్యోధన! అది పులి కాదు... హోమ్థియేటర్లోని చిత్రం’’ అని పలికింది ఆకాశవాణి.‘‘హోమ్‌థియేటర్ అనగా ఏమి?’’ అని అడుగుదామనుకున్నాడుగాని అహం అడ్డు వచ్చింది. నాలుగు అడుగులు వేశాక...‘నీ కళ్లూ పేలి పోను చూడవే... మేరే హాయ్’ అని వినిపించింది. దుర్యోధనుడికి పట్టలేనంత కోపం వచ్చింది. ‘‘ఏమా అహంకారం! నా కళ్లు పేలిపోవాలా? ఓరీ అహంకారి ఎక్కడో దాక్కుని అరవడం కాదు...దమ్ముంటే నా ముందు వచ్చి నిల్చో’’ అని దుర్యోధనుడు అన్నాడో లేదో ఆకాశవాణి గర్జించింది. ‘‘ఓయి మతిచెడిన దుర్యోధన... అది అరుపు కాదు. ఎఫ్‌ఎంరేడియో. నువ్వు విన్నది ఇడియట్ అను చలనచిత్రంలోని పాటలోని చరణం’’మళ్లీ నాలుక కర్చుకున్నాడు దుర్యోధనుడు.‘బాగా దాహంగా యున్నది. నీళ్లు ఎచట యున్నవి?’’ అని చుట్టూ చూశాడు. కిటికీ దగ్గర టేబుల్ మీద బాటిల్ కనిపించింది. ‘హమ్మయ్య! అనుకొని ఆ బాటిల్ మూత తీసి గటగటా తాగాడు. ఆకాశవాణి ఆందోళనగా పలికింది...‘‘ఫూల్ దుర్యోధనా! నువ్వు తాగింది నీళ్లు కాదు...నీళ్లలాగే కనిపించే వోడ్కా అను సురపానీయం. ఇప్పుడు నీకు జింతాక జితా జితా’’దుర్యోధనుడిని మత్తు కమ్ముకుంది. అడుగులు భారంగా పడుతున్నాయి. అక్కడ ఒ పక్కన సోనీ టీవి కనిపించింది. అందులో మైకేల్‌జాక్సన్ ‘ఆర్ యూ ఓకే అని... ఆర్ యూ ఓకే’ అంటూ మూన్‌వాక్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ డ్యాన్స్ దుర్యోధనుడికి విపరీతంగా నచ్చింది.‘‘ఈ నృత్యం నేను కూడా చేస్తాను’’ అనుకుంటూ టీవీ చూస్తూ నాలుగు స్టెప్పులు వేశాడో లేదో కుప్ప కూలిపోయాడు దుర్యోధనుడు. సరిగ్గా అప్పుడే ‘హాహాహా’ అని పెద్దగా నవ్వు వినిపించింది. అవమానభారంతో అటువైపు చూశాడు దుర్యోధనుడు... అంతే... ఎక్కడలేని కోపం వచ్చింది.‘పాంచాలీ పంచభర్తృకా! నీవా నన్ను పరిహసించునది... సకల మహీపాల మకుట మాణిక్య శోభా విరాజితుడైన రారాజును నేడు ఒక అబల అపహసించుటయా! అభిమానధనుడైన సుయోధునుడు అది విని సహించుటయా? బొమ్మను చూసి అమ్మాయి అని ఏల భ్రమపడవలె! పడితినిపో... మంచినీళ్లనుకొని మందేలా తాగవలె..తాగితి పో... మామాకీ కిరికిరి మైకేలు జాక్సన్‌ను ఎందుకు చూడవలే... చూసితిపో ఏల నృత్యం చేయవలే... చేసితిపో బొక్కబోర్ల ఏల పడవలే’’.... ఆపకుండా డైలాగ్‌లు కొడుతూనే ఉన్నాడు దుర్యోధనుడు. కథ పూర్తయింది. చప్పట్లతో హాలు దద్దరిల్లింది. – యాకుబ్ పాషా -
ఢిల్లీకి వస్తున్న జాక్సన్, మన్రో !
న్యూఢిల్లీ: మైకేల్ జాక్సన్, మార్లిన్ మాన్రో.. ఈ పేర్ల తెలియనివారు ఉండరు. ఒకరు తన డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగిస్తే, మరొకరు తన అందచందాలతో యువతను కట్టిపడేశారు. అయితే ఇదంతా వారు బతికున్నప్పటి సంగతి. మరి చనిపోయినవారు ఢిల్లీకి ఎలా వస్తున్నారు? అనే కదా.. మైనపు విగ్రహాల రూపంలో..! ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్ వ్యాక్స్ మ్యూజియం ఇటీవల ఢిల్లీలో ఓ బ్రాంచిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు క్రీడా రంగానికి చెందిన ప్రముఖులతో ఈ మైనపు మ్యూజియం నిండిపోయింది. త్వరలోనే ఈ మ్యూజియంలోకి మైకేల్ జాక్సన్, మార్లిన్ మన్రో, జస్టిన్ బీబర్, లేడీ గగా, బేవాన్స్ నోలెస్, ఆంజెలినీ జోలీ, స్కార్లెట్ జాన్సన్, నికోల్ కిడ్మన్, జెన్నిఫర్ లోపేజ్, కేట్ విన్సెస్లెట్, కిమ్ కర్దాషియన్, డేవిడ్ బెక్‌హామ్, లయోనెల్ మెస్సీ తదితర మైనపు విగ్రహాలు కొలువుదీరనున్నాయట. ‘హాలీవుడ్ ప్రముఖులకు కూడా భారత్‌లో విశేష సంఖ్యలో అభిమానులున్నారు. వారందరినీ అలరించేందుకు ఢిల్లీలోని మ్యూజియాన్ని హాలీవుడ్ అందాలతో నింపేస్తామ’ని మ్యూజియం జనరల్ మేనేజర్, డైరెక్టర్ అన్షుల్ జైన్ తెలిపారు. -
ఎప్పటికీ కొత్త పాట
కాలం గడిస్తే ఏ పాటైనా పాతబడుతుంది. మైఖేల్ జాక్సన్ పాట మాత్రం కొత్తబడుతుంది! శాంపిల్‌గా నెట్లోకి వెళ్లి, వేళ్లకు అందిన మూడు పాటల్ని కదిలించండి. థ్రిల్లర్, స్మూత్ క్రిమినల్, బ్లాక్ అండ్ వైట్.. ఏ మూడైనా! అప్పుడే రిలీజ్ అయినట్లుగా ఉంటాయి. కొత్త భావంతో, కొత్త స్వరంతో, కొత్త దృశ్యంతో. మానవాళికి ఈ భూగోళంపై ప్రేమను కలిగించే అత్యద్భుతాలపై జాక్సన్ పాట ఒకటి. ఇవాళ జాక్సన్ జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు, విశేషాలు. ఒరే పెద్ద ముక్కోడా! జాక్సన్ వాళ్ల ఫ్యామిలీది ఇండియానా. (యు.ఎస్.). జాక్సన్ తండ్రి బాక్సర్. స్టీల్ వర్కర్. గిటారిస్ట్. అయితే ఇవన్నీ డబ్బులొచ్చే పనులు కాదు. కుటుంబం కోసం ఆయన క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. జాక్సన్ తల్లి కేథరీన్ ఎస్తేర్ ఓ పచారీ సరకుల దుకాణంలో సహాయకురాలిగా పని చేసేవారు. జాక్సన్‌కి ముగ్గురు చెల్లెళ్లు. ఐదుగురు అన్నదమ్ములు. జాక్సన్ తండ్రి కఠినంగా ఉండేవాడు. పిల్లల్ని కొట్టేవాడు. జాక్సన్‌ని ‘ఒరే పెద్ద ముక్కోడా’ అని పిలిచేవాడు. కానీ తండ్రి క్రమశిక్షణే తన విజయానికి కారణం అని జాక్సన్ చాలాసార్లు చెప్పాడు. జాక్సన్ అండ్ బ్రదర్స్ జాక్సన్ మ్యూజిక్ బ్యాండ్ పేరు ‘జాక్సన్ బ్రదర్స్’. 1965లో జాక్సన్ తండ్రే పిల్లల కోసం ఆ బ్యాండ్‌ని ప్రారంభించాడు. ఆ మరుసటి ఏడాదే జాక్సన్ అండ్ బ్రదర్స్.. బ్యాండ్ పేరుని ‘జాక్సన్–5’ అని మార్చుకున్నారు. ఫస్ట్ సాంగ్ ‘ఐ గాట్ యు’ తో వారికి గుర్తింపు వచ్చింది. తర్వాత ఈ అన్నదమ్ముల మ్యూజిక్ టూర్లు మొదలయ్యాయి. యు.ఎస్.లోని రాష్ట్రాలు తిరుగుతూ క్లబ్బుల్లో, కాక్టైల్ లాంజ్లలో కచేరీలు ఇచ్చారు. థ్రిల్లర్ ఆరున్న కోట్ల కాపీలు! 1970ల నాటికి జాక్సన్–5 బ్యాండ్.. బిగ్ బాయ్, ది లవ్ యు సేవ్, ఐ విల్ బి దేర్, గాట్ టు బి దేర్, ఐ వాంట్ యు బ్యాగ్.. వంటి హిట్స్ ఇచ్చింది. 1983 జాక్సన్‌కి టర్నింగ్ పాయింట్. ‘థ్రిల్లర్’తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆ ఆల్బమ్ 6 కోట్ల 50 లక్షల కాపీలు అమ్ముడయింది! తర్వాత బిల్లీ జీన్, ది మూన్ వాక్.. జాక్సన్‌ని ఫేమస్ చేశాయి. పెప్సీ–కోలాతో జాక్సన్‌కు 50 లక్షల డాలర్ల డీల్ కుదిరి, వారి కోసం ఓ కమర్షియల్ వీడియో తీస్తున్నప్పుడు జాక్సన్ ముఖానికి, మాడుకు గాయాలయ్యాయి. దాంతో అతడు తొలిసారి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. ఖరీదైన ఆల్బమ్.. స్క్రీమ్ జాక్సన్ తన జీవితకాలంలో చేసిన అత్యంత ఖరీదైన ఆల్బమ్ ‘స్క్రీమ్’. దానికి అయిన వ్యయం 70 లక్షల డాలర్లు. ఇప్పటి కరెన్సీ విలువ ప్రకారం సుమారు 45 కోట్ల రూపాయలు. ఎంత ఖర్చు పెట్టాడని కాదు కానీ, మైఖేల్ చేసిన చిన్నపాటైనా ప్రపంచాన్ని షేక్ చేసేది. ఫలితమే జాక్సన్‌కు వచ్చిన అరుదైన గుర్తింపు జాక్సన్ తన కెరీర్లో మొత్తం 23 గిన్నెస్ వరల్డ్ రికార్డులు, 40 బిల్బోర్డ్ అవార్డులు, 13 గ్రామీ అవార్డులు, 26 అమెరికన్ మ్యూజిక్ అవార్డులు గెలుచుకున్నాడు. ప్రపంచ పాప్ చక్రవర్తి మైకేల్ జాక్సన్ పాట ఆగి ఎనిమిదేళ్లు! కానీ జాక్సన్ ఆల్బమ్స్ అతడిని ఏనాటికైనా మరణించడానికి అనుమతిస్తాయా?! మనమూ అతడిపై ప్రేమను ఏ జన్మకైనా వదులుకుంటామా! జాక్సన్ గాయకుడు మాత్రమేనా! గేయ రచయిత, నటుడు, డాన్సర్, బిజినెస్‌మేన్, పరోపకారి, ఇంకా... కింగ్ ఆఫ్ పాప్. నేనెప్పటికీ పాడుతూనే ఉంటానన్నాడు... ‘ఫర్ యు అండ్ ఫర్ మీ... అండ్ ఎంటైర్ ది హ్యూమన్ రేస్’ అని పాడాడు. పాట నన్ను నిలబెట్టింది జాక్సన్ పాట ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. జాక్సన్నీ నిలబెట్టింది. ఆయన ఓ సందర్భంలో రాసుకున్న వాక్యాలు ఇవి. ‘‘నేను ఇష్టపడే నా ప్రత్యర్థులు, నేను ఆరాధించిన స్త్రీలు నా కోసం నిలబడ్డారు. మనసు గాయపడినప్పుడు నా రికార్డింగ్ స్టూడియో నాకు లేపనం అద్దింది. మ్యూజిక్ కట్టు కట్టింది. నిర్జీవన క్షణాల్లో నా కుటుంబం నాకు పునరుజ్జీవనం ప్రసాదించింది. నా పిల్లలు నన్ను ముద్దాడారు. బ్రూక్ షీల్డ్, డయానా రాస్, ఎలిజబెత్ టేలర్... నా తల నిమిరారు. అందుకే ఐ జస్ట్ కాంట్ స్టాప్ లవింగ్ ద వరల్డ్. -
బాలీవుడ్లో మైకేల్ జాక్సాన్ కూతురు
ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హాలీవుడ్ నటులు కనిపించారు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్లో బాలీవుడ్ సినిమాలో నటించనుంది. ఇప్పటికే పారిస్‌ను సంప్రదించిన మూవీ టీం ఆమె అంగీకారం పొందారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలీవుడ్ బ్యూటి రిచా ఛడ్డా, పాకిస్తానీ నటుడు అలీ ఫజల్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమాలో పారిస్ జాక్సన్ కీలక పాత్రలో నటించనుంది. ప్రధానంగా ఇంగ్లీష్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారతీయ సినిమాగానే తెరకెక్కిస్తున్నారు. పారిస్ జాక్సన్‌కు జంటగా ఓ హాలీవుడ్ నటుణ్ని సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
‘మా నాన్నది హత్యే.. నన్ను కూడా చంపేస్తారు’
న్యూయార్క్: తన తండ్రి ప్రముఖ, అమెరికన్ పాప్ సింగర్, గ్రేట్ డ్యాన్సర్ మైఖెల్ జాక్సన్‌ను చంపేశారని ఆయన కూతురు ప్యారిస్ జాక్సన్ ఆరోపించారు. 2009లో తన తండ్రి చనిపోయిన సమయంలో జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక సెటప్ అని, ఆ రోజు ఓ కట్టుకథ చెప్పి తన నోరు మూయించారని అన్నారు. ఆమె తొలిసారి ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా భావోద్వేగానికి లోనవుతూ ఈ విషయం చెప్పారు. శక్తిమంతమైన అనాస్తెటిక్ ప్రొపొఫోల్ ఓవర్ డోస్‌గా తీసుకోవడంవల్లే మైఖెల్ జాక్సన్ చనిపోయాడని ఇప్పటివరకు అందరికీ తెలిసిన విషయం. అయితే, ఉద్దేశ పూర్వకంగానే జాక్సన్ వైద్యుడు అతి డోస్ ఉండే మాత్రలు ఇచ్చి ఆయన చావుకు కారణమయ్యారని కేసులు నమోదు చేశారు. కానీ, జాక్సన్ కూతురు ప్యారిస్ జాక్సన్ మాత్రం జనాలను తప్పుదోవ పట్టించేందుకు అలా ఓవర్ డోస్ అంటూ చెప్పారని, వాస్తవానికి తన తండ్రిని చంపేశారని, తనను కూడా ఏదో ఒకరోజు హత్య చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మాత్రం అనుమానం లేకుండా తన తండ్రి హత్యకు గురయ్యాడని, ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర అని.. జాక్సన్ కుటుంబ సభ్యులకు ఆయన అభిమానులకు ఈ విషయాలు తెలుసని, ఆరోజు జరిగిందంతా కూడా ఓ సెటప్ అని స్పష్టం చేశారు. -
మరణించినా... సంపాదనలో టాప్!
లాస్ ఏంజెలెస్: మైకేల్ జాక్సన్... బతికుండగా ఎంతోమందిని ఉర్రూతలూగించిన ఆటగాడు, పాటగాడు. మళ్లీ ఆయన ఇప్పుడెందుకు గుర్తొచ్చాడంటే... చనిపోయినా అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల్లో మన మైకేల్ అగ్రస్థానంలో నిలిచాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ‘టాప్ ఎర్నింగ్ డెడ్ సెలబ్రిటీ’ పేరుతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వరుసగా నాలుగో ఏడాది కూడా జాక్సనే టాపర్‌గా నిలిచినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. 825 మిలియన్ డాలర్ల ఆదాయంతో మైకేల్ మొదటిస్థానంలో నిలవగా ఈ ఏడాది మరణించిన సంగీత విద్వాంసుడు డేవిడ్ బోవీ తర్వాతి స్థానంలో నిలిచాడు. జాక్సన్ ఎస్టేట్‌ను విక్రయించడం ద్వారా 750 మిలియన్ డాలర్ల ఆదాయం రాగా, మిగతా సొమ్ము ఆయన మ్యూజిక్ ఆల్బమ్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ, ఏటీవీ సంస్థల ద్వారా వచ్చాయని ఫోర్బ్స్ తెలిపింది. ఆదాయపన్ను, ఇతర న్యాయ ఖర్చుల చెల్లింపునకు ముందే జాక్సన్ ఆదాయాన్ని లెక్కగట్టామని, వీటన్నింటిని మినహాయిస్తే దివంగత పాప్ సింగర్ ఆదాయం కొంతమేర తగ్గవచ్చని, అయినప్పటికీ మిగతా వారితో పోలిస్తే జాక్సన్ చాలా ముందున్నారని ఫోర్బ్స్ తెలిపింది. -
చనిపోయినా.. సంపాదిస్తున్నారు!
వీడు చచ్చినా సాధిస్తున్నాడురా..! అని కొందరిని తిట్టుకుంటుంటాం.. కానీ, వీడు చచ్చినా సంపాదిస్తున్నాడురా! అనే మాట ఎప్పుడైనా విన్నారా? అదెలా సాధ్యం? చనిపోయిన తరువాత ఎవరైనా ఎలా సంపాదిస్తారు? అది కూడా.. కోట్ల రూపాయలా..? అస్సలు బతికి ఉన్నవాళ్లే డబ్బు సంపాదించేందుకు నానా కష్టాలు పడుతుంటే మరణించినవారికెలా సాధ్యమనుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు కావాలంటే ఈ కథనం చదవాల్సిందే! మైకెల్ జాక్సన్ పాప్ సంగీతానికి రారాజుగా వెలుగొందిన మైకెల్ జాక్సన్ 50 ఏళ్ల వయసులో 2009లో మరణించారు. మైకెల్ మరణాంనంతరం కూడా సంపాదిస్తున్నారు. ఈయన అల్బమ్స్ అమ్మినందుకుగాను ఆయా కంపెనీలు ప్రతి ఏటా 115 మిలియన్ డాలర్ల మొత్తాన్ని జాక్సన్‌కు ఇంకా చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం మైకెల్ ఆల్బమ్స్‌ను సోనీ కంపెనీ పబ్లిష్ చేస్తోంది. పాప్ కింగ్ గా పేరు మోసిన జాక్సన్ సంగీత, నృత్యాల్లో, మ్యూజిక్ వీడియోల్లో విప్లవం తెచ్చారు. 1958 ఆగస్టు 29వ తేదీన ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే పాప్ సింగర్ గా పేరు పొందాడు. తన నలుగురు సోదరులతో కలిసి ఐదుగురితో పాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. 1969లో ఈ గ్రూప్ మోటవున్ రికార్డ్సతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. అప్పటి నుంచి మైకెల్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. జాక్సన్ ఆల్బం ‘థ్రిల్లర్’ ఆల్ టైమ్ బెస్ట్ సెల్లరుగా రికార్డు సృష్టించింది. జాక్సన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఎల్విస్ ఆరోన్ ప్రీస్లీ ఎల్విస్ ప్రీస్లీ కూడా మరణాంనంతరం ఏటా 55 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. తను రూపొందించిన ఆల్బమ్స్‌ను పబ్లిష్ చేస్తున్న కంపెనీ ఈ మొత్తాన్ని అందజేస్తుంది. ఎల్విస్ ఆరోన్ ప్రీస్లీ ఒక అమెరికన్ గాయకుడు, నటుడు. 20 వ శతాబ్దంలో అమెరికాలో పేరుగాంచిన ప్రముఖ నటుడు ప్రీస్లీ. 13 ఏళ్ల వయసు నుంచే పాడటం మొదలుపెట్టాడు. రాక్ అండ్ రోల్, హార్డ్ బ్రేక్ హోటల్ ప్రీస్లీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఈయన ఆల్బమ్స్ రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ డాలర్ల విక్రయాలు జరిపాయి. అతిగా డ్రగ్స తీసుకోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయి 42 ఏళ్ల వయసులోనే ప్రీస్లీ మరణించాడు. చార్లెస్ షుల్జ్ ప్రముఖ అమెరికన్ కార్టూనిస్టు చార్లెస్ షుల్జ్. చార్లెస్ మరణాంనతరం కూడా దాదాపు సంవత్సరానికి 40 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ఈయన గీసిన కార్టూన్లను ప్రచురించే సంస్థ ఈ మొత్తాన్ని చార్లెస్ కుటుంబ సభ్యులకు అందజేస్తోంది. అనేక స్పూర్తినిచ్చే కార్టూన్లను చార్లెస్ గీశాడు. ఈయన రూపొందించిన పీనట్స్ కార్టూన్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలలో 21 భాషల్లో ప్రచురిస్తోంది. అమెరికాలో 3డి-యానిమేటెడ్ సినిమాగా కూడా పీనట్స్ వచ్చింది. 77 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో చార్లస్కు పెద్దపేగు క్యాన్సర్‌తో మరణించాడు. ఎలిజిబెత్ టేలర్ ప్రముఖ హాలీవుడ్ నటి ఎలిజిబెత్ టేలర్. ఈమె నటించిన సినిమాలు ఇప్పటికీ అమ్ముడుపోతున్నాయి. ఇందుకుగాను ఈమెకు ప్రతి ఏటా 20 మిలియన్ డాలర్ల మొత్తాన్ని అందజేస్తున్నారు. హాలివుడ్ యొక్క స్వర్ణయుగంలో గొప్ప నటీమణుల్లో టేలర్ ఒకరు. అమెరికన్ ఫిలిం ఇనిస్టిట్యూట్ చారిత్రక నటిమణుల్లో టేలర్‌కు ఏడవ స్థానం కల్పించారు. 1943లో విడుదలైన మెక్డోవల్ చిత్రం టేలర్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. గుండె సంబంధిత వ్యాధిలో 79 ఏళ్ల వయసులో 2011 సంవత్సరంలో టేలర్ మరణించారు. బాబ్ మెర్లీ బాబ్ మెర్లీ మరణాంనంతరం కూడా ప్రతి ఏటా దాదాపు 21 మిలియన్ డాలర్లను సంపాదిస్తున్నాడు. మెర్లీ బెవరేజ్ కంపెనీ, హౌజ్ ఆఫ్ మెర్లీ, ఆల్బమ్స్ ద్వారా ఆయన ఈ మొత్తాన్ని పొందుతున్నాడు. మెర్లీ గాయకుడే కాకుండా పాటల రచయిత, గిటారిస్టు, సంగీత దర్శకుడు కూడా. తన ప్రతిభతో అంతర్జాతీయంగా సినీదిగ్గజాల ప్రశంసలు మెర్లీ పొందాడు .ఈయన రూపొందించిన ‘ది వైలర్స్’తో మంచి పేరు సంపాదించుకున్నాడు. వన్ లవ్, కాయా, వెయిటింగ్ ఇన్ వెన్, జామింగ్ ఆల్బమ్స్ ప్రఖ్యాతిగాంచాయి. క్యాన్సర్ బారిన పడి 36 ఏళ్ల వయసులోనే 1981లో మెర్లీ మరణించాడు. -
కింగ్ జాక్సన్
-
మైఖేల్ జాక్సన్ కూతురిని ఏం అడిగాడంటే..
పాప్ ప్రపంచపు రారాజు మైఖేల్ జాక్సన్ మరణించి ఇప్పటికి ఏడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఆయనకు సంబంధించిన ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది. తెల్లగా కనపడటం కోసం జాక్సన్ తరచు తన కూతురు పారిస్‌ను ముఖానికి బ్లీచింగ్ క్రీమ్ రాయమని అడిగేవాడట. ఈ విషయాన్ని అప్పట్లో జాక్సన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేసిన కానార్డ్ ముర్రే రాసిన ‘దిస్ ఈజ్ ఇట్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో అన్నీ జాక్సన్ గురించిన విశేషాలే రాశారు. బ్లీచింగ్ క్రీమ్ రాయమని 18 ఏళ్ల కూతురు పారిస్‌నే ఎందుకు అడిగేవాడంటే, ఆమె తన కొడుకులు ప్రిన్స్ (19), బ్లాంకెట్ (14)ల కంటే తెల్లగా ఉంటుందని, అందువల్ల బ్లీచింగ్ క్రీమ్ ప్రభావం ఆమె శరీరం మీద అంతగా ఉండదని జాక్సన్ భావించేవాడట. చాలాసార్లు తానే ఆ క్రీమ్ రాసేవాడినని, అయితే అలా రాసేటపుడు తప్పనిసరిగా గ్లోవ్స్ ధరించేవాడినని ముర్రే రాశారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే తన చర్మం పాడవుతుందని.. కొన్నిసార్లు పారిస్‌తో క్రీమ్ రాయించుకోవడంతో ఆమె విషయంలో ఆందోళన చెందేవాడినని చెప్పారు. తెల్లగా ఉందని ఆమెతో క్రీమ్ రాయించడం మంచిది కాదని, దానివల్ల ఆమె చర్మం కూడా ప్రభావితం అవుతుందని తాను చెప్పేవాడినని అన్నారు. మందులు అతిగా వాడటం వల్ల మైఖేల్ జాక్సన్ 2009లో మరణించిన విషయం తెలిసిందే. -
కాల్ గర్ల్స్ తనను గుర్తుపట్టకుండా..
చనిపోయి ఏడేళ్లు కావస్తున్నా పాప్ కింగ్ మైఖెల్ జాక్సన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాల వేడి ఇంకా చల్లారడంలేదు. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హాలీవుడ్ హీరోయిన్ ఎమా వాట్సన్ ను, ఓ స్నేహితుడి కూతురు హెరియట్ లిస్టర్ లను జాక్సన్ పెళ్లాడాలనుకున్నాడట. అతనికి ఆ ఆలోచన కలిగినప్పుడు ఎమా, లిస్టర్ ల వయసు ఐదేళ్లు! బాలనటిగా ’హ్యారీ పొట్టర్’ సినిమాలో ఎమా నటన జాక్సన్ ను ముగ్ధుణ్ని చేసిందట. ఆ సినిమా చూసిన తర్వాత ఆ అమ్మాయిని(చిన్నారిని) పెళ్లిచేసుకోవాలని జాక్సన్ భావించాడట. బ్రిటన్ కు చెందిన స్నేహితుడి కూతురైన లిస్టర్ ను మాత్రం ఆమె యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాతే పెళ్లాడాలనుకున్నాడట! ఈ వివాదాస్సద విషయాలను జాక్సన్ వ్యక్తిగత ఫిజిషియన్ గా పనిచేసిన డాక్టర్ కన్రాడ్ ముర్రే వెల్లడించారు. జాక్సన్ హత్యలో దోషిగా నాలుగేళ్లు జైలు జీవితం పూర్తిచేసుకున్న డాక్టర్ ముర్రే తాజాగా "This is it: laying bare grim" అనే పుస్తకాన్ని రాశారు. అందులో జాక్సన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను వెల్లడించారు. అంతేకాదు స్వయంగా జాక్సనే ’ఎప్పటికైనా ఈ విషయాలను ప్రపంచానికి చెప్పు’ అని తనతో అన్నట్లు ముర్రే పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరగడం, నైట్ క్లబ్ లకు వెళ్లడం, చిన్న చిన్న హోటళ్లలో బసచేయడం లాంటి పనులు మైఖెల్ జాక్సన్ కు ఎంతో ఇష్టమని, అయితే తాను కనబడితే కాల్ గర్ల్స్, అభిమానులు మీదపడిపోతారేమోననే భయంతో జాక్సన్ మారువేషాల్లో ఆయా ప్రదేశాలకు వెళ్లేవాడని డాక్టర్ ముర్రే తన పుస్తకంలో రాశాడు. జాక్సన్ చాలాసార్లు తాను సౌదీ అరేబియా నుంచి వచ్చినవాడినని అరేబియా యాసలో మాట్లాడుతూ జనాన్ని బోల్తా కొట్టించేవాడని, కొన్నిసార్లు పైజామా(సౌదీ సంప్రదాయ దుస్తులు) ధరించేవాడని డాక్టర్ ముర్రే తెలిపారు. ఇంకా విడుదలకాని ముర్రే పుస్తకంలో ఎన్ని విషయాలు బయటికొస్తాయో వేచిచూడాలిమరి. ఎమా వాట్సన్ అప్పుడు- ఇప్పుడు జాక్సన్ పర్సనల్ ఫిజీషియన్ డాక్టర్ కన్రాడ్ ముర్రే -
నెటిజన్లపై మైఖెల్ జాక్సన్ కూతురు కన్నెర్ర
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ రాక్ స్టార్, పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్(18) నెటిజన్లపై మండిపడింది. ఫాదర్స్ డే రోజు ఆమె కనీసం ఒక్క పోస్ట్‌కూడా పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లపై గుడ్లెర్రజేసింది. అది మీకు అంతముఖ్యమైన విషయమా.. అసలు మీకేంటి సంబంధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డే జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆరోజు ఎంతోమంది తమ ఫాదర్స్‌కు శుభాకాంక్షలు చెబుతూ సామాజిక అనుసంధాన వేదికల్లో పోస్ట్ చేయగా ప్రఖ్యాతిగాంచిన మైఖెల్ జాక్సన్ ను ఉద్దేశించి ఆయన కూతురు ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. దీంతో పలువురు ఆమెను విమర్శించారు. ఆ విమర్శ చూసి ఆగ్రహంతో ఊగిపోయిన పారిస్ 'ఒక సెలవు దినం (ఫాదర్స్ డే) సందర్భంగా ఆన్లైన్ లో పోస్ట్ చేస్తూ ఒకరిని వేధించాలని మీరు అనుకుంటే.. ముందు అసలు అది మీరు చేయాల్సిన పనేనా కాదా అని మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. దురదృష్టం కొద్ది నెగిటివ్ థింగ్సే ఎక్కువగా ప్రచారం అవుతాయి' అని చెప్పింది. మైఖెల్ చనిపోయినప్పుడు పారిస్ వయసు పదకొండేళ్లు. -
మైఖెల్ జాక్సన్ బెస్ట్ ఫ్రెండ్ కన్నుమూత
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, సర్కస్ ప్రదర్శన కళాకారుడు మిచ్చు మెస్జారోస్(76) కన్నుమూశారు. ఒకప్పుడు ఎలియన్ వంటి పాత్రలో సైతం మైమరిపించిన ఆయన గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చనిపోయారు. కాలిఫోర్నియాలోని టోరేన్స్ లోగల మేరీ మెడికల్ సెంటర్ లో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన సహాయకుడు తెలిపారు. కుక్కలాంటి కాస్ట్యూమ్స్ ధరించి చేసిన పలు పాత్రలకు ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. బుడాపెస్ట్‌లో జన్మించిన మిచు తన పద్నాలుగేళ్ల వయసులో సర్కస్ చేయడం ప్రారంభించారు. అనంతరం బైలీ సర్కస్ లో 1973లో చేరాడు.మైఖెల్ జాక్సన్ కూడా ఇతడి ప్రదర్శనను చూసి అబ్బురపడిపోయి బెస్ట్ ఫ్రెండ్ గా మార్చుకున్నాడు. పలుసార్లు వారిద్దరు కూర్చొని సాఫ్ట్ డ్రింక్ కూడా తాగరంట. -
పాప్ కింగ్‌కు పట్టం
వేల్స్లో మైఖెల్ జాక్సన్ విగ్రహం ప్రతిష్ట ఆవిష్కరించిన నటుడు ప్రభుదేవా విద్యార్థులతో సందడి మహదానందంగా ఉందని వ్యాఖ్య చెన్నై: పాప్ సంగీత ప్రపంచంలో రాజుగా వెలిగిన మైఖెల్ జాక్సన్‌కు వేల్స్ వర్సిటీ పట్టం కట్టింది. సంగీత ప్రియుల్ని ఓలలాడించిన పాప్‌కింగ్ నిలువెత్తు విగ్రహాన్ని తమ వర్సిటీలో ప్రతిష్టించింది. గురువారం జరిగిన వేడుకలో ఈ విగ్రహాన్ని ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా ఆవిష్కరించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ‘మైఖెల్ జాక్సన్’ అన్న ఆ పేరులోనే ఉంది ఓ వైబ్రేషన్. పాప్ సంగీత సామ్రాజ్యంలో గాయకుడిగా, నృత్యకారుడిగా ప్రపంచ స్థాయిలో పాప్ కింగ్‌గా అవతరించి అమరుడైన మైఖెల్ జాక్సన్‌ను స్మరిస్తూ వేల్స్ వర్సిటీ విగ్రహ ప్రతిష్టకు చర్యలు చేపట్టింది. ఇందుకు చెన్నైకు చెందిన ఆర్సీ గోల్డన్ గ్రానైట్స్ మేనేజింగ్ డెరైక్టర్ చంద్రశేఖరన్ ముందుకు వచ్చారు. 3.5 టన్నుల గ్రానైట్ రాతితో ఏక శిలా విగ్రహం తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. శిల్పకళాకారుడు రమేష్ 40 రోజులు శ్రమించి మైఖెల్ జాక్సన్ నిలువెత్తు ఏకశిలా గ్రానైట్ విగ్రహానికి బెంగళూరులో రూపకల్పన చేశారు. రూ.12 లక్షల ఖర్చుతో పది అడగులు ఎత్తు, 5.5 అడుగుల వెడల్పుతో పాప్‌కింగ్ స్టెప్పులు వేస్తున్నట్టుగా విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ విగ్రహం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకి సైతం ఎక్కడం విశేషం. అలాంటి ఈ విగ్రహాన్ని పల్లావరం సమీపంలోని వేల్స్ వర్సిటీలో ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన వేడుకలో ఇండియన్ మైఖెల్ జాక్సన్, ప్రముఖ నటుడు, దర్శకుడు,నిర్మాత ప్రభుదేవా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహదానందం: ఈ విగ్రహావిష్కరణ అనంతరం మీడియాతో ప్రభుదేవా మాట్లాడుతూ చెన్నై వేల్స్ వర్సిటీలో విగ్రహం ఏర్పాటు చేశారన్న సమాచారంతో షాక్‌కు గురయ్యానని వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం తనకు ఈ సమాచారం తెలియగానే, ఎప్పుడెప్పుడు మైఖెల్ జాక్సన్ విగ్రహాన్ని చూస్తానో అన్న ఉత్సాహంతో ఎదురు చూశానని పేర్కొన్నారు. అందుకే ఆ విగ్రహం తరహాలో నిలబడి తానూ ఫొటోకు ఫోజు ఇచ్చానని, ఆ ఫొటోను తన ఇంట్లో భద్ర పరచుకుంటానన్నారు. ఆ విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం మహదానందంగా ఉందన్నారు. ఇక, సినిమా విషయాలకు వస్తూ, తన సొంత బ్యానర్లో మూడు చిత్రాలు చేస్తున్నట్టు వివరించారు. వేల్స్ వర్సిటీ చాన్సలర్ డాక్టర్ ఐషరి కె గణేష్ మాట్లాడుతూ నెల రోజుల క్రితం ఇక్కడకు విగ్రహాన్ని తీసుకొచ్చామని, దీనిని ఇండియన్ మైఖెల్ జాక్సన్ చేతుల మీదుగా ఆవిష్కరించాలన్న సంకల్పంతో ముందుకు సాగామన్నారు. ప్రభు దేవా చెన్నైకు వచ్చిన సమాచారంతో ఆయన్న సంప్రదించగా తక్షణం అంగీకరించడం అభినందనీయంగా పేర్కొన్నారు. తమ వర్సిటీలో వేల్స్ నక్షత్ర పేరిట వేడుకలు జరిగాయని గుర్తు చేస్తూ, ఆ సమయంలో ఇక్కడ డ్యాన్స్, మ్యూజిక్ డిప్లొమో, డిగ్రీ కోర్సుల ఏర్పాటుకు నిర్ణయించామని పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్టుగా ప్రముఖ లక్ష్మణ్ శ్రుతి సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని ప్రకటించారు. శిల్పకళాకారుడు రమేష్ మాట్లాడుతూ మైఖెల్ జాక్సన్ విగ్రహాన్ని సిద్ధం చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అనంతరం వీ చెన్నై వారియర్స్ పేరిట జరిగిన కార్యక్రమానికి హాజరైన వలంటీర్లకు ఈసందర్భంగా ప్రభుదేవా చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. తదుపరి ఆ వర్సిటీలోని విద్యార్థులతో ముచ్చటించే విధంగా కాసేపు అక్కడే ఆనందంగా ప్రభు దేవా గడిపారు. ప్రభుదేవా రాకతో ఆయన్ను చూడడానికి ఆ వర్సిటీలోని విద్యార్థులందరూ తరలి రావడం, సెల్ఫీల కోసం ఎగబడడంతో , వారిని కట్టడి చేయడం కష్టతరంగా మారిందని చెప్పవచ్చు. -
నా పాటలు ఎందుకు కొనాలి?
బాలీవుడ్ బాత్ పాటలు చేసే ప్రతిసారీ ఈ ప్రశ్నను వేసుకుంటాను. నన్ను నేను నా అభిమానిగా ఊహించుకుని నా నుంచి ఆ అభిమాని ఏం ఆశిస్తాడో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. తొలి రోజుల్లో సంగీతం అంటే టెక్నిక్ అని అనుకునేవాణ్ణి. కాదు. సంగీతం అంటే నిజంగా నీ లోపలి నుంచి ఏది వస్తుందో అది. దానిని రాబట్ట గలిగితే అది కచ్చితంగా ఎదుటివారి మనసును తాకగలుగుతుంది. ప్రస్తుతం నేను గౌతమ్ వాసుదేవ మీనన్ సినిమాకు పాట కడుతున్నా. ఇప్పుడు మీ ఫేవరెట్ సాంగ్ ఏది అంటే ఆ పాటే చెప్తా. రేపటికి ఇది మారిపోతుంది. నాకేదైనా వెలితి ఉందంటే అది మైకేల్ జాక్సన్‌తో పని చేయకపోవడమే. మేమిద్దరం మాట్లాడుకున్న కొద్ది రోజుల్లోనే ఆయన చనిపోవడం బాధాకరం. అయితే అంతకు సమానమైన ప్రతిభావంతులతో పని చేస్తున్నానన్న తృప్తి మాత్రం ఉంది.... అన్నాడు రహెమాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో. -
పాప్ ప్రపంచాన్ని ఉర్రూతలెత్తించిన మైకేల్ పాట
-
మైఖేల్జాక్సన్ రికార్డును బ్రేక్ చేసిన తెలంగాణ విద్యార్థి
-
వేలానికి మైకేల్ జాక్సన్ గ్లోవ్
లాస్ఏంజెలెస్: ప్రపంచ ప్రఖ్యాత, దివంగత పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ ఉపయోగించిన తెల్లటి గ్లోవ్ ను వేలంలో పెట్టారు. జాక్సన్ జ్క్షాపకార్థ సూచికగా నేట్ శాండర్స్ ఆధ్వర్యంలో దీన్ని వేలం వేయనున్నారు. దీనికి కనీసం రూ. 13 లక్షల వరకు రేటు పలుకుతుందని అంచనా. దాంతోపాటు జాక్సన్ 'బ్యాడ్' అల్బమ్ కవర్‌పేజీపై బ్లాక్ లెదర్ జాకెట్‌తో ధరించి ఉన్న నమూనా కూడా ఈ వేలంలో ఉంచినట్టు ది గార్డియన్ నివేదికలో వెల్లడించింది. ఇటీవల వేలంలో అమ్మిన జాక్సన్ గ్లోవ్స్ కంటే ఇప్పుడు వేలంలో ఉంచిన తెల్లటి గ్లోవ్ ధర చాలా తక్కువని పేర్కొంది. 2009లో జాక్సన్ మరణాంతరం 'మూన్‌వాక్' గ్లోవ్స్ ను దాదాపు రూ. 22 లక్షలకు వేలం వేశారు. ఆయన మరణించిన 6 నెలల తరువాత జూన్ 2010లో మరో జత గ్లోవ్స్ కు కోటి రూపాయలకు పైగా ధర పలికింది. కానీ, జాక్సన్ తన కుడిచేతి గ్లోవ్ ను స్నేహితుడు, చిత్రకారుడు పాల్ బెడ్రాడ్కు ఇచ్చినట్టు పేర్కొంది. -
ఈ పిడుగులకి మీ పిల్లలకి తేడా ఏంటి?
చిన్నప్పుడు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ ప్రోత్సహించేది. తను నాతో ఎప్పుడూ ఒకటే చెప్పేది. ‘నువ్వు ఏదైనా చెయ్యి, కానీ అందులో గొప్పవాడివి మాత్రం కావాలి. బాత్రూములు కడిగేవాడివి అయినా సరే, అందులో నువ్వే నంబర్‌వన్ కావాలి’ అని! - కమల్ హాసన్ చాలామంది తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న టాలెంట్స్‌ని గుర్తించడంలో విఫలమవుతుంటారు. ప్రతి ఒక్కరికీ దేవుడు పుట్టుకతోనే ఒక టాలెంట్ ఇస్తాడు. దాన్నిబట్టే పిల్లలకు ఆయా అంశాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి. - విశ్వనాథన్ ఆనంద్ చిన్నప్పుడే పిల్లలు వారిలోని ప్రతిభను, ఆసక్తిని కనబరుస్తారు. కొందరు తల్లిదండ్రులు వాటిని గుర్తిస్తారు. మరి కొందరు తల్లిదండ్రులైతే వాటిని ప్రోత్సహిస్తారు. మన పిల్లల్లో ఓ టెండూల్కర్ ఉన్నాడో, ఓ సానియా ఉందో, ఓ మైఖేల్ జాక్సన్ ఉన్నాడో, ఓ బిల్ గేట్స్ ఉన్నాడో మనకు తెలీదు. అది తెలియాలంటే ప్రతిభను గుర్తించే విధానం కావాలి. ఆ ప్రతిభకు పదునుపెట్టే ఓ అవకాశం కావాలి. సాక్షి, భాష్యం గ్రూప్‌తో కలిసి ‘క్రియేటివ్ కిడ్స్’ క్యాంప్‌ను మీ పట్టణాల్లో నిర్వహించనుంది. యోగా, చెస్, పెయింటింగ్, వెస్ట్రన్ డ్యాన్స్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కుకరీ, పియానో, గిటార్ తదితర అంశాలలో ఉత్తమమైన శిక్షణ! మే 7 నుంచి 30 వరకూ సమ్మర్ క్యాంప్! రిజిస్ట్రేషన్‌కు ఆఖరి తేదీ: 06-05-2015. వివరాలకు 04023256138కు ఫోన్ చేయండి. -
‘గూగుల్’ డ్యాన్స్..!
పార్టీ జోరుగా సాగుతోంది. డ్యాన్స్ ఫ్లోర్‌పై అందరూ హుషారుగా చిందేస్తున్నారు. మీకూ ఉత్సాహంగా ఉంది. కానీ.. అడుగులు తడబడ్డాయి. దీంతో నలుగురిలో సిగ్గుతో కూడిన బెరుకు వల్ల వచ్చిన వణుకు కారణంగా.. చప్పట్లు, కేరింతలకే పరిమితమైపోయారు. అయితే, కళ్లజోడు కంప్యూటర్ ‘గూగుల్ గ్లాస్’ను పెట్టుకుంటే ఇక మీరు ధైర్యంగా చిందేయవచ్చు. పాట ఏదైనా.. మైకేల్ జాక్సన్‌లా స్టెప్పులు అదరగొట్టొచ్చు. వినిపిస్తున్న పాటకు అనుగుణంగా డ్యాన్స్ స్టెప్పులను నేర్పేలా గూగుల్ గ్లాస్‌ను ఆ కంపెనీ తీర్చిదిద్దుతోంది మరి! డ్యాన్స్ అంటే బిడియపడేవారికి గూగుల్ గ్లాస్ అప్పటికప్పుడు నృత్యం నేర్పనుంది. వినిపిస్తున్న పాటను బట్టి.. తన డేటాబేస్‌లోని స్టెప్పుల్లో తగిన వాటిని మీకు చూపిస్తుంది. ఇంకేం.. కళ్లజోడు తెరపై కనిపించే స్టెప్పులను ఫాలో అయితే సరి.. మీరు కూడా బాగా డ్యాన్స్ చేయగలరు. వినూత్నమైన ఈ టెక్నాలజీకి గూగుల్ కంపెనీ తాజాగా పేటెంట్ పొందింది. పాటకు ఇతరులు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు? మీరు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అన్నది బొమ్మల రూపంలో కూడా గూగుల్ గ్లాస్ చూపించనుంది. అయితే, ఇప్పుడు, అప్పుడు అంటూ మార్కెట్లోకి రావడానికి వాయిదాల మీద వాయిదాలు పడుతున్న నేపథ్యంలో గూగుల్ గ్లాస్‌ను ఆ కంపెనీ రద్దు చేసుకుందన్న ప్రచారమూ సాగుతోంది. కానీ ఇదంతా అబద్ధమని, ప్రాజెక్టు కొంత ఆలస్యం మాత్రమే అయిందని గూగుల్ చైర్మన్ ఎరిక్ స్కిమిట్ ప్రకటించారు. ఇంతకుముందు ప్రకటించిన టెక్నాలజీలతో పాటు ఈ డ్యాన్స్ టెక్నాలజీని కూడా జోడించి తమ కంప్యూటర్ కళ్లజోడును తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. ఇక గూగుల్ గ్లాస్ వాడకంలోకి వస్తే.. ఎక్కడ చూసినా ‘గూగుల్ డ్యాన్స్’లే కనిపిస్తాయేమో! -
మళ్లీ తెలుగులో...
ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరొందిన ఏకైక కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. బాలీవుడ్లో దర్శకునిగా తనదైన ముద్ర వేస్తున్న ప్రభుదేవా దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెర మీద మెరవనున్నారు. ‘గ్రీన్ సిగ్నల్’ ఫేం విజయ్ మద్దాల చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారని సమాచారం. రోడ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ప్రధానంగా అమెరికాలో జరగనున్నట్లు భోగట్టా. -
వారసుడొస్తున్నాడు..!
పాప్ రారాజు మైకేల్ జాక్సన్ వారసుడొస్తున్నాడు. పదిహేడేళ్ల మైకేల్ తనయుడు ప్రిన్స్... అతడి స్నేహితుడు, సింగర్ జస్టిన్ బైబర్తో కలసి ఓ సరికొత్త మ్యూజిక్ కాన్సెప్ట్ కోసం శ్రమిస్తున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్ ఫ్లాయిడ్ మెవెదర్ జూనియర్ ఈ మెగా ప్రాజెక్ట్‌కు సహకారం అందిస్తున్నాడు. ప్రిన్స్, ఇరవై ఏళ్ల బైబర్లు ఈ ఆల్బమ్ కోసం రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారని... ప్రస్తుతానికి ఇంతకంటే వివరాలు బయటకు రాలేదని న్యూయార్క్ పోస్ట్ కథనం. ఈ ఇద్దరూ కాలిఫోర్నియాలోని ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నారట. -
‘మూన్‌వాక్’లో రికార్డు బ్రేక్ చేస్తా..
ఇప్పటివరకూ మైకేల్‌జాక్సన్ పేరిట గిన్నిస్ బుక్ రికార్డు రికార్డను తిరగరాస్తానంటున్న తాండూరు కుర్రోడు స్వచ్ఛంద సంస్థ సాయం కోసం ఎదురుచూపులు తాండూరు టౌన్: ‘మూన్‌వాక్ డ్యాన్స్’(సంగీతానికి లయబద్ధంగా కాళ్లు ఆడిస్తూ వెనక్కి వెళే ్లడ్యాన్స్)లో మైకేల్‌జాక్సన్ సృష్టించిన గిన్నిస్‌బుక్ వరల్డ్ రికార్డను బ్రేక్ చేస్తానంటున్నాడు తాండూరుకు చెందిన 20 ఏళ్ల కుర్రాడు విశ్వజ ్ఞవంశీకృష్ణ. తాండూరులోని వాల్మీకినగర్‌కు చెందిన విశ్వజ వంశీకృష్ణ పాలిటెక్నిక్ ఫైనల్ఇయర్ చదువుతూ పేదరికంతో మధ్యలోనే ఆపేశాడు. తండ్రి విజయభాస్కరాచారి వడ్రంగి పనిచేస్తుంటాడు. వంశీకృష్ణకు చిన్ననాటి నుంచిై మెకేల్జాక్సన్ డ్యాన్స్ అంటే ప్రాణం. జాక్సన్ డ్యాన్స్ చూ స్తూ తనకు తానుగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. 2002 అక్టోబర్ 22న మ్యూజిక్ వింటూ మైకేల్‌జాక్సన్ అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో డెన్వర్స్ట్రీట్లో గంటలో 2.4కిలోమీటర్లు (1.5మైళ్లు) ఆగకుండా మూన్‌వాక్ చేసి గిన్నిస్రికార్డ సాధించాడు. వంశీకృష్ణ కూడా ఇంటర్నెట్లో సెర్చ్‌చేసి రెండు నెలలపాటు మూన్‌వాక్ ప్రాక్టీస్ చేశాడు. తాను కేవలం 48 నిమిషాల్లోనే 3.7 కిలోమీటర్ల దూరం మూన్‌వాక్ చేస్తానని గిన్నిస్‌బుక్ వారికి మెయిల్ పంపాడు. అయితే మొదట ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఎదుట రికార్డను ప్రదర్శించాలని, సదరు స్వచ్ఛంద సంస ్థవారు రికార్డును ధ్రువీకరిస్తూ తమకు సిఫార్సు లేఖ పంపితే వచ్చి రికార్డును పరిశీలిస్తామని గిన్నిస్‌బుక్ వారు తిరిగి మెయిల్ పంపించారు. ఈ రికార్డు బ్రేక్ కోసం ఏదైనా స్వచ్ఛందసంస్థ తనకు సహకరిస్తే వారి ఎదుట ప్రదర్శన ఇస్తానని వంశీకృష్ణ పేర్కొంటున్నాడు. తన గిన్నిస్రికార్డుకు సహకరించాలని వేడుకుంటున్నాడు. -
మరో మైఖేల్ వస్తారా?
గొర్రెను పోలిన గొర్రెను కృత్రిమంగా సృష్టించిన ‘క్లోనింగ్’ విధానం గురించి తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ అప్పట్లో ఈ క్లోనింగ్ విషయంలో ఆసక్తి కనబర్చారట. తనను పోలిన రూపం ఉండాలని ఆయన కోరుకున్నారట. ఈ సంగీత సంచలనం కనుమరుగై దాదాపు ఐదేళ్లవుతోంది. అయితే, తనలాంటి రూపాన్ని సృష్టించాలని మైఖేల్ అనుకున్న విషయం ఇప్పుడు బయటికొచ్చింది. 2009లో మైఖేల్ తుదిశ్వాస విడిచారు. అంతకుముందు తన వీర్యకణాలను ఆయన ఓ పరిశోధక కేంద్రంలో భద్రపరిచారని సమాచారం. ఒక యూరోపియన్ శాస్త్రవేత్తను తన సమరూప జీవిని సృష్టించాల్సిందిగా ఆయన కోరారట. ఈ క్లోనింగ్ విధానం కోసం మైఖేల్ మిలియన్ డాలర్లు ఇచ్చారన్న వార్త ఇప్పుడు హాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ఆయన తన వీర్యకణాలను మూడు పరిశోధక కేంద్రాల్లో భద్రపరిచారని, మూడు వేర్వేరు కారణాలకు వాటిని ఉపయోగించాల్సిందిగా కూడా కోరారని బోగట్టా. క్లోనింగ్ గొర్రె డాలీ గురించి తెలుసుకుని మైఖేల్ తనలాంటి రూపం ఉంటే బాగుంటుందని భావించారని న్యూయార్క్‌కు చెందిన ‘ఎక్స్‌ట్రాటెర్రెస్ట్రియల్ రిసెర్చ్’ డెరైక్టర్ మైఖేల్ సి. లక్మేన్ పేర్కొన్నారు. మైఖేల్కూ, ఆయన సోదరి జానెట్ జాక్సన్‌కూ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన స్వర్గీయ ఆండ్రూ వాన్ పీర్ బతికున్న రోజుల్లో తనతో ఈ విషయం చెప్పారని లుక్మేన్ తెలిపారు. ఇదిలా ఉంటే మైఖేల్ జాక్సన్ క్లోనింగ్ విషయంలో ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యుల అభిప్రాయం ఏంటనేది ఇంకా బయటికి రాలేదు. మైఖేల్ సి. లుక్మేన్ మాత్రం కనుమరుగైన ఈ పాప్‌స్టార్ కోరిక నెరవేర్చాలనుకుంటున్నారట. అయితే త్వరలోనే మరో.. మైఖేల్ జాక్సన్ మన ముందుకొస్తారా? ఏమో! కాలమే సమాధానం చెప్పాలి మరి. -
ఆ వీడియో వివాదం ముగిసింది!
న్యూయార్క్ : ప్రపంచంలో తిరుగు లేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన మైఖేల్ జాక్సన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినా ఎప్పటికీ ఆయన చిరంజీవే. ఎంతో మంది వీరాభిమానులను సంపాదించుకున్న మైఖేల్ జాక్సన్ నటించిన 'థ్రిల్లర్' వీడియోను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. గతంలో థ్రిల్లర్ వీడియోకు సంబంధించి చోటు చేసుకున్న వివాదం ముగిసిపోవడంతో తిరిగి తెరపై తీసుకురావడానికి సన్నాహాలు ఆరంభించారు. అయితే ఈ వీడియోను త్రీడీ రూపంలో అభిమానుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర దర్శకుడు జాన్ లాండిస్ తెలిపాడు. ' నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ 14 నిమిషాల అల్బమ్ కు జాక్సన్ న్యాయం చేశాడు. ఈ ఆల్బమ్ లో సాంగ్స్ సూపర్ హిట్ కావడమే మరోసారి త్రీడిలో తీసుకురావడానికి కారణం. దీనిపై గతంలో చోటు చేసుకున్న దావా వివాదం సమసి పోయింది. ఆ వీడియోపై న్యాయ పరమైన సమస్యలు తలెత్తడంతో ఆ వివాదం చాలా సంవత్సరాల పాటు నడిచింది. ప్రస్తుతం ఆ వివాదాన్ని సెటిల్ చేసుకున్నాం. 2015 లో ఈ వీడియో ప్రేక్షకుల ముందుకు రానుంది' అని లాండిస్ తెలిపాడు. ఈ వీడియోను జాక్సన్ అభిమానులు తిరిగి అత్యంత అధునాతనంగా బిగ్ స్ర్కీన్లపై తిలకించే అవకాశం దక్కుతున్నందుకు తనకు ఆనందంగా ఉందన్నాడు. -
మైఖేల్జాక్సన్ , శ్రీదేవి లాంటి వారు కూడా...
అప్పియరెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ .. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా! అందుకే మైఖేల్జాక్సన్ లాంటి పాప్‌స్టార్ మొదలు శ్రీదేవి లాంటి సినిమాస్టార్స్ దాకా అందరూ తమ రూపాలను చెక్కుకున్నవారే.. మేకప్‌తో కాదు ప్లాస్టిక్ సర్జరీతో అంటారు మరి! ఆ సర్జరీలకు డిమాండ్ ఏ రేంజ్లో పెరిగిందంటే.. స్టార్స్‌నుంచి సామాన్యులకు అందేంత! అలా పుట్టుకతో వచ్చిన రూపాన్ని నచ్చినట్టు మార్చుకోవడానికి ఇప్పుడు నో సర్జికల్ ట్రీట్మెంట్స్.. ఓన్లీ ఈస్థటిక్ ట్రీట్మెంట్సే! సిటీలో ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ జోరందుకుంది. చప్పిడి ముక్కును కోటేరు ముక్కులా మార్చడానికి మొన్నటిదాకా రైనోపాస్టీ అందుబాటులో ఉండేది. అదిప్పుడు నోజ్జాబ్, నోస్ కరెక్షన్గా మారింది. ముక్కుమీద చిన్నపాటి కత్తిగాటు లేకుండా కేవలం ఒకేఒక ఇంజక్షన్‌తో ముక్కును కోటేరులా చేస్తారు. దీన్ని ఫిల్లర్ట్రీట్మెంట్ అని పిలుస్తున్నారు. ఒక్క ముక్కేకాదు కనుబొమ్మల షేప్ నుంచి అధరాల ఆకారం దాకా దేన్నయినా చిటికెలో మార్చేస్తారు. నుదిటి మీది ముడతల నుంచి కంటి చివర రేఖల వరకు బిగుతుచేసి వడలిన వర్చస్సుకు మునుపటి మెరుపును తెస్తారు. సత్వర సౌందర్యాన్నిచ్చే ఆ చికిత్సల వివరాలివీ... కాంప్లెక్షన్ కోషర్ మేనిఛాయలోని హెచ్చుతగ్గులను సరిచేసే చికిత్స ఇది. చర్మంలో ఒక్కోచోట మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా చేరడంతో అక్కడ రంగు కాసింత నల్లగా మారుతుంది. మిగిలిన భాగంలో సాధారణ ఛాయ ఉంటుంది. ఇలాంటి వ్యత్యాసాలనే కాదు, మొటిమలు మిగిల్చిన మచ్చలు సహా ట్యాన్నూ ఈ చికిత్సతో మటుమాయం చేసేసుకోవచ్చు. అంతేకాదు ఈ ట్రీట్మెంట్తో రెండు మూడు వారాల్లోనే మేని ఛాయను దాదాపు నాలుగు రెట్లు మెరుగుపరచుకోవచ్చు. ఒక్కో సెషన్‌కు అరగంట సమయం వెచ్చిస్తే చాలు కోరుకున్న మేలిమిఛాయను సొంతంచేసుకోవచ్చు. దీనికోసం ఒక్కో సెషన్‌కి పదినుంచి పన్నెండువేల రూపాయలు ఖర్చు మీది కాదనుకోవాలి. యాంటీ-ఏజ్ మంత్ర 35 ఏళ్లు దాటాక వచ్చే ముఖంపై ముడుతలు, కళ్ల కింద క్యారీబ్యాగ్‌లను చిటికెలో తరిమికొట్టే చికిత్స ఇది. పట్టుమని పదిహేను నిమిషాల్లోనే ముఖంపై ముడుతలు మటుమాయమవుతాయి. పెళ్లిళ్ల సీజన్లో ఈ ట్రీట్మెంట్కి గిరాకీ ఎక్కువ. వధూవరుల తల్లిదండ్రులు సైతం ఇప్పుడీ చికిత్సలతో తమ ఏజ్‌ను లెస్చేసుకుంటున్నారు. ఇలా యంగ్‌లుక్స్‌తో బంధుమిత్రులకు షాక్ ఇవ్వాలంటే సెషన్‌కి 15 నుంచి 20వేల రూపాయలు మనవి కావనుకోవాలి. ఐ-బ్లింక్ మిరాకిల్ జారిపోయిన బుగ్గల్లో బిగి తేవచ్చు. నాసికను సంపెంగకు దీటుగా తీర్చిదిద్దుకోవచ్చు. పెదవులను ముఖాకృతికి అనుగుణంగా రూపొందించుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే... మీ ముఖంలోని లోపాలన్నింటినీ ఈ చికిత్సతో తొలగించుకుని, నిండు చందమామలా వెలిగిపోవచ్చు. ఈ కాంతికోసం ఎలాంటి మందులు, పథ్యాలు అవసరంలేదు. 20 నుంచి 70 ఏళ్ల వయసువాళ్లందరూ ఈ ట్రీట్మెంట్కి అర్హులు. 14 నుంచి 16 నెలల వరకు ఫలితం ఉంటుంది. ‘ఈ అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్, అల్ట్రా లిపో నాన్‌సర్జికల్ స్లిమ్మింగ్ ట్రీట్మెంట్స్, లేజర్ ట్రీట్మెంట్స్, లేజర్ హెయిర్ రిమూవల్, హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్, స్కిన్ రిజువనేషన్, కెమికల్ పీల్స్, మైక్రోడెర్మాబ్రేషన్, బోటాక్స్, ఫిల్లర్స్ వంటి చికిత్సలకు ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. పైగా షార్ట్‌టైమ్‌లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్స్ పట్ల ఆడవాళ్లే కాదు మగవాళ్లూ ఆసక్తిచూపిస్తున్నారు. వండర్ ఏంటంటే మొన్న ఎన్నికలసీజన్లో పొలిటికల్ లీడర్స్ ఈ ట్రీట్మెంట్కోసం రావడం. పెళ్లిళ్ల సీజన్లో అయితే యూత్ ఎక్కువ మక్కువ చూపిస్తోంది. ఎలాంటి విశ్రాంతి అవసరం లేకుండానే ట్రీట్మెంట్ చేయించుకునే వీలుండటంతో ఈ నాన్ సర్జికల్ట్రీట్మెంట్స్ వైపు ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల ‘యమలీల-2’ హీరోయిన్ డయా నికోలస్ మా క్లినిక్‌లో ట్రీట్మెంట్ తీసుకుంది. ఆమెలా బిజీ షెడ్యూల్ ఉన్నవాళ్లకు ఇలాంటి ట్రీట్మెంట్స్ చాలా యూజ్ఫులే కాదు కాన్ఫిడెన్స్నూ ఇస్తాయ’ని చెప్తున్నారు బ్లూ స్కిన్ అండ్ కాస్మొటాలజీ క్లినిక్ అధినేత డాక్టర్ నిలయిని. నో సైడ్ ఎఫెక్ట్స్ సర్జికల్ ట్రీట్మెంట్ కంటే ఇదే బెటర్. ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ట్రీట్మెంట్ తర్వాత రెస్ట్ తీసుకునే పని కూడా లేదు. పైగా ఈ పద్ధతితో మోర్ రిజల్ట్ పొందే అవకాశం కూడా ఉంది. - ప్రీతీరాణా, నటి -
వేలానికి మైకేల్ జాక్సన్ వస్తువులు!
లాస్ ఏంజెలిస్: పాప్ సంగీత రారాజు మైకేల్ జాక్సన్, ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తిగత వస్తువులు ఆన్లైన్లో వేలానికి ఉంచారు. వీటిలో అనేక స్మారక వస్తువులతో పాటు జాక్సన్‌కు చెందిన సాక్స్, అండర్వియర్ వంటి వస్తువులూ ఉన్నాయి. జాక్సన్ కుటుంబానికి చెందిన ఫొటో ఆల్బమ్‌లు, ఆయన పెంపుడు చింపాంజీ బబుల్స్ ధరించిన జాకెట్, రికార్డింగులు ఉన్న 56 టేపులు కూడా వేలం వేయనున్నారు. ఇవన్నీ అందరి ఇళ్లలోనూ ఉండే సాధారణ వస్తువులే కానీ.. జాక్సన్‌కు చెందినవి కాబట్టి ఇవి చరిత్రాత్మకమయ్యాయని ‘గాట్టా హ్యావ్ ఇట్ కలెక్టిబుల్స్’ వేలం సంస్థ పేర్కొంది. జాక్సన్ వస్తువులను ఈ నెల 19 వరకూ వేలానికి ఉంచుతామని, ప్రస్తుతం అన్ని వస్తువులకూ కనిష్టంగా 100 డాలర్ల నుంచి బిడ్లు దాఖలు కాగా, మాస్టర్ టేపులకు మాత్రం కనిష్టంగా వెయ్యి డాలర్ల నుంచి బిడ్లు వేశారని తెలిపింది. -
ఎ పెయింటింగ్ బై శ్రీదేవి
ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో అభిమానులను సంపాదించుకునే వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఆ అరుదైన జాబితాలో పాప్ స్టార్ మైకేల్ జాక్సన్‌కి అగ్ర స్థానమే ఉంటుంది. ఈ పాప్ స్టార్ అంటే శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీకి బోల్డంత అభిమానం. మైకేల్ జాక్సన్ పాటల్ని వినడం మాత్రమే కాదు.. ఆయన ఫొటోలు దాచుకునేంత వీరాభిమాని అన్నమాట. కూతురి మనసెరిగిన తల్లి కాబట్టి, జాన్వీ కోసం శ్రీదేవి ఇటీవల మైకేల్ జాక్సన్ బొమ్మ గీశారు. శ్రీదేవి మంచి పెయింటర్. వీలు కుదిరినప్పుడల్లా కుంచె చేతపడతారు. తన మనసుకి నచ్చినప్పుడల్లా బొమ్మలను గీయడం ఆమె హాబీ. ఈసారి కూతురి కోసం స్వయంగా పెయింట్ చేశారామె. తల్లి ఇచ్చిన ఈ అపురూపమైన బహుమతిని చూసి జాన్వీ చాలా సంబరపడిపోయిందట. -
మైకేల్ జాక్సన్ కోసం...
‘‘సంగీత ప్రపంచంలో నాకు మైకేల్ జాక్సన్, ఇళయరాజా ఆదర్శం. పాప్ మ్యూజిక్ అంటే చాలా ఆసక్తి. అందుకే పాప్ స్టార్ మైకేల్ జాక్సన్‌కి నివాళిగా ‘జల్సా యమ్జే..’ అనే పాటను ఈరోజు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేయనున్నాను. ఎందుకంటే రేపు మైకేల్ జాక్సన్ పుట్టినరోజు . ఈ సందర్భంగా ఈ పాటను యూ ట్యూబ్‌లో విడుదల చేయనున్నాను’’ అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. ఇటీవల యూఎస్‌లోని పలు నగరాల్లో ఏడు రోజులపాటు మ్యూజికల్ షోస్ చేశారు దేవి. అక్కడి ప్రజల స్పందన చూసి, ఆనందం కలిగిందని, తనలో ఉత్సాహం రెట్టింపు అయ్యిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి పాటలు స్వరపరుస్తున్నారు కదా మరి, ‘లెజెండ్’ విజయోత్సవంలో ఆయన గురించి ఘాటుగా స్పందించారు కదా? అన్న ప్రశ్నకు -‘‘బోయపాటిగారు మంచి వ్యక్తి. ఆయనతో కలిసి మూడు హిట్ సినిమాలు చేశాను. మా మధ్య మంచి అనుబంధం ఉంది. సినిమా అన్నాక ఏదో మాటా మాటా వస్తుంది. అంతమాత్రాన అనుబంధాలు చెడిపోవు’’ అని చెప్పారు. పెళ్లి గురించి అడిగితే... ఇంట్లో ఆ ప్రయత్నాలు చేస్తున్నారని, కుదిరిన తర్వాత అందరికీ చెబుతానని దేవి స్పష్టం చేశారు. -
'మైఖేల్ జాక్సన్ 100 సార్లు అత్యాచారం చేశాడు'
దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ సుమారు నాలుగేళ్ల కాలంలో కనీసం 100 సార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని సహనటుడు జేమ్స్ సేఫ్ చుక్ అనే నటుడు చేసిన ఆరోపణలు హాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. సెక్స్ కోసం మైఖేల్ జాక్సన్ సీక్రెట్ కోడ్స్ వాడేవాడని జేమ్స్ ఆరోపించాడు. 1980లో మైఖేల్ జాక్సన్ తో కలిసి పెప్పీ అడ్వర్టైజ్ మెంట్ లో నటించిన జేమ్స్ కోర్టుకు దాఖలు చేసిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు ఉన్నాయని అతని తరపు న్యాయవాది వెల్లడించారు. తన క్లైయింట్ జేమ్స్ ను జాక్సన్ పాలుమార్లు అనుభవించారని, సెక్స్ కోసం కోడ్ భాషను ఉపయోగించేవాడని అతని తరపు న్యాయవాదులు చెప్పినట్టు యూఎస్ లోని ఓ ప్రముఖ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించారు. అంతేకాకుండా జేమ్స్ ను రహస్యంగా వివాహం చేసుకునేందుకు ఉంగరాన్ని, మ్యారేజ్ సర్టిఫికెట్ ను కూడా సిద్ధం చేశారంటూ జేమ్స్ చేసిన ఆరోపణల్ని డాక్యుమెంట్ల రూపంలో కోర్టుకు అందించినట్టు సమాచారం. 20 ఏళ్ల తర్వాత జేమ్స్ చేస్తున్న ఆరోపణలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంకా.. మైఖేల్ జాక్సన్ మరణించిన ఐదేళ్ల తర్వాత ఈ ఆరోపణల్ని వెలుగులోకి తీసుకురావడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2009 జూన్ లో ఎక్కువ మోతాదులో డ్రగ్స్ వినియోగించడం కారణంగా మైఖేల్ జాక్సన్ మరణించిన సంగతి తెలిసిందే. తనపై పలుమార్లు జరిపిన అత్యాచారానికి జాక్సన్ ఎస్టేట్ నుంచి పరిహారం ఇప్పించాలని కోర్టుకు విజ్క్షప్తి చేశారు. జేమ్స్ చేస్తున్న ఆరోపణల్ని కోర్టు తిరస్కరిస్తుందని జాక్సన్ ఎస్టేట్ న్యాయవాది వీట్జ్ మెన్ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు సెప్టెంబర్ 4 తేదిన విచారణకు రానుంది. -
మత్తు మాయాజాలంలో సెలబ్రిటీలు!
మత్తు(డ్రగ్స్) మాయలో పడితే ఎంతటివారైనా అంతే. పరువు బజారునపడితే, కుటుంబాలు, జీవితాలు నాశనమవుతాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో యువతీయువకులు డ్రగ్స్‌కు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు స్వార్ధపరులు ఈ డ్రగ్స్ వ్యాపారం ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నారు. వారికి డబ్బే ముఖ్యంగానీ జీవితాలు తృణపాయం. ఈ మత్తులో మాములు వారే కాదు సెలబ్రిటీలు కూడా పడ్డారు.పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న పలువురు సెలబ్రిటీలు చివరికి చీకట్లో కలసిపోయారు. మత్తు ఎంతలా జీవితాలను నాశనం చేస్తుందో చెప్పడానికి వారు సాక్ష్యాలుగా మిగులుతున్నారు. హాలీవుడ్ చరిత్రను ఒక్కసారి గమనిస్తే ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలు గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. యావత్ ప్రపంచాన్ని తమ అందచందాలు, నటన, ఆటపాటలతో అలరించిన ఎందరో డ్రగ్స్‌కు బానిసలయ్యారు. చివరికి వాటివల్లే ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. మార్లిన్ మన్రో: హాలీవుడ్ చరిత్రలో అత్యంత అందగత్తె మార్లిన్ మన్రో. వరల్డ్ లీడింగ్ సెక్స్ సింబల్. ఇప్పటికీ మన్రో డ్రెస్, స్టైల్, గెటప్‌ను ఫాలో అవుతున్నామంటే ఆమె క్రియేట్ చేసిన ట్రెండ్ ఎలాంటిదో అర్థమవుతుంది. కానీ మన్రో స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్ వల్ల చనిపోయిందంటే ఆశ్చర్యపోక తప్పదు. లాస్ ఏంజిల్స్‌లోని బ్రెంట్వుడ్ హోమ్‌లో ఆగస్టు 4, 1962న స్పృహలేకుండా కనిపించింది. డ్రగ్ ఓవర్ డోస్ వల్లే మన్రో కోమాలోకి వెళ్లి చనిపోయినట్లు నిర్థారించారు. మైకేల్ జాక్సన్: కింగ్ ఆఫ్ పాప్. ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించుకున్న మ్యూజిక్ లెజెండ్. 50 నైట్ కమ్ బ్యాక్ టూర్ రిహార్సల్స్ చేస్తూ చాలా అలసటకు గురవుతుండేవారు. ఆ సమయంలో ఆయన రిలాక్సేషన్ కోసం మెడిసిన్ తీసుకోవాలనుకున్నారు. మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడంతో జూన్ 25, 2009లో ఆయన అర్థాంతరంగా కన్నుమూశారు. ఆయనకు డ్రగ్స్ ఓవర్ డోస్ ఇచ్చిన ఆయన డాక్టర్ ముర్రే ప్రస్తుతం జైల్లో ఉన్నారు. విట్నీ హౌస్టన్: గొప్ప గాయనిగా పేరుప్రఖ్యాతులు సాధించింది. ఆమె ఫ్యాన్స్ లేని దేశం లేదంటే అతిశయోక్తికాదు. తన పాట ద్వారా అంతటి స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. కానీ మత్తుకు బానిసై చివరికి బాత్‌టబ్‌లో శవమై తేలింది. అమీ విన్‌హౌజ్: హాలీవుడ్లో అత్యంత ప్రతిభాశాలులైన గాయణీమనుల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. రిహాబ్ పేరిట ఆమె పాడిన పాటల్లో తనను డ్రగ్స్ నుంచి బైటపడేసేందుకు జనం చేస్తున్న ప్రయత్నాలను వివరించింది. కానీ ఆమె ట్రీట్మెంట్కు ఒప్పుకోలేదు. ఫలితంగా 27 ఏళ్ల ప్రాయంలోనే ఆమె మృత్యు ఒడిలోకి చేరింది. హీత్ లెడ్జర్: ది డార్క్ నైట్ సినిమాలో జోకర్‌గా యాక్ట్ చేసి, అది రిలీజ్ కాకముందే హీత్ లెడ్జర్ తుదిశ్వాస విడిచారు. నేలపై నగ్నంగా పడి ఉన్న ఆయనను చూసి అందరూ నివ్వెరపోయారు. ఇందుకు కారణాలు ఏమిటని ఆరా తీస్తే, తీవ్ర నిద్రలేమితో బాధపడిన లెడ్జర్ డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు తెలిసింది. చివరికి అదే ఆయన ఉసురు తీసింది. ప్రమాదకరమైన మాదకద్రవ్యాలకు, వివిధ రకాల మత్తు పదార్ధాలకు అలవాటుపడేవారు వారి జీవితాలను హెచ్చరికగా తీసుకోవాలి. వీరి జీవితాలు గుణపాఠంగా తీసుకొని అటువంటి వారు డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ జీవితాలను సుఖమయం చేసుకుంటారని ఆశిద్దాం. - శిసూర్య -
పాప్ కింగ్
-
మా కలయికలో పాట చేయలేదనే అసంతృప్తి నాకెప్పటికీ ఉంటుంది
ఏ.ఆర్. రెహమాన్ దాదాపు 22 ఏళ్లుగా పాటలు స్వరపరుస్తున్నాను. ఎప్పుడూ నాకు ఒకే వాద్యం ఇష్టం ఉండదు. కాలాన్ని బట్టి నా ఇష్టం మారుతుంది. కొత్త కొత్త వాద్య పరికరాలు ఎన్ని వచ్చినా ఆ భగవంతుడు ఇచ్చిన ‘స్వరం’కి సాటి రావు. అలాగే, ఒక వాద్యం ఉందనుకోండి. దాన్ని ఉపయోగించి మెరుగైన సంగీతం సమకూర్చినప్పుడే దాని విలువ పెరుగుతుంది. లేకపోతే ఆ వాద్యం సాదాసీదాగా మిగిలిపోతుంది. సంగీతానికి భాషతో సంబంధం లేదు. వినోదానికి కూడా అంతే. నా మనసు బాగున్నప్పుడూ పాట.. బాగాలేనప్పుడూ పాటతోనే నా ప్రయాణం. అయితే, ఎప్పుడైనా నా శక్తి తగ్గుతున్నట్లుగానో, మానసిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నప్పుడో కామెడీ సినిమాలు చూస్తా. తమిళంలో స్టార్ కమెడియన్లుగా వెలిగిన సురుళీ రాజన్, తేంగాయ్ శ్రీనివాసన్, నాగేశ్, ఎస్వీ శేఖర్లు చేసిన కామెడీ చూస్తూ పెరిగినవాణ్ణి. ఈ జాబితాలో చార్లీ చాప్లిన్ని మిస్ చేస్తే, తప్పు చేసినవాణ్ణవుతా. జనాలను నవ్వించి, ఆనందపరిచిన వీళ్లంతా ఎంతో గొప్పవాళ్లు. మాటల్లో వ్యక్తీకరించలేని భావాలను పాట ద్వారా చెబుతుంటాం. అందుకే పాట లేని సినిమా నాకు అసంపూర్ణం అనిపిస్తుంది. మన భారతీయ చిత్రాల్లో ఉండే అందమైన విషయాల్లో పాట ఒకటి. విదేశాల్లో పాటలకు అంతగా ప్రాధాన్యం ఉండదు. కానీ, నేను పని చేసే విదేశీ చిత్రాల్లో కేవలం నేపథ్య సంగీతానికి మాత్రమే కాకుండా పాటలకు ఆస్కారం ఉండటం నాకు ఆనందంగా ఉంటుంది. నాకు ఇళయరాజా గారి పాటల్లో ఎప్పటికీ నచ్చేది ‘కాట్రిల్ వరుమ్ గీతమ్...’. తమిళ చిత్రం ‘జానీ’ (1980) కోసం ఆయన స్వరపరచిన ఈ పాట ఎవర్ గ్రీన్ అనొచ్చు. నేను ఎక్కువసార్లు పాడుకునే పాటల్లో ఇదొకటి.నన్ను నమ్మే దర్శకుల సినిమాలకు పని చేయడం నాకిష్టం. నాకూ, మణిరత్నానికీ మధ్య మంచి అవగాహన ఉంది. బాలీవుడ్లో రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రాతో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏ విషయాన్నయినా సరే ఆయన ముక్కుసూటిగా చెప్పేస్తారు. ఇక, ఇంతియాజ్ అలీ అయితే ఇప్పటివరకూ మనం చూడని కోణానికి తీసుకెళ్లిపోతారు. సుభా్‌ష్ ఘయ్ గురించి ఏం చెప్పాలి? సూపర్బ్. ఆశుతోష్ గోవారీకర్ అయితే మరుగున పడిపోయిన మన భారతీయ సంగీతాన్ని మళ్లీ తీసుకువచ్చేలా చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది దర్శకులు ఉన్నారు. నా జీవితంలో ఎప్పటికీ నేను పశ్చాత్తాపానికి గురయ్యే విషయం ఒకటుంది. ప్రపంచం గర్వించదగ్గ పాప్ స్టార్ మైకేల్ జాక్సన్‌తో పని చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎప్పటికైనా ఆయనను కలవాలనుకునేవాణ్ణి. మైకేల్ జాక్సన్ ఏజెంట్ స్నేహితుడు నా ఏజెంట్‌కి ఫ్రెండ్. అతని ద్వారానే మైకేల్‌ను కలిశాను. ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత మొదటిసారి కలిశాను. మొదటిసారి కలిసినప్పుడు నా గురించి నేను పరిచయం చేసుకోవడానికే సరిపోయింది. అప్పుడు నాకు చాలా బెరుకుగా కూడా అనిపించింది. నేను స్వరపరచిన ‘జయహో..’ గురించి ఆయన మాట్లాడినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఇండియా అంటే తనకు చాలా ఇష్టమని కూడా మైకేల్ చెప్పారు. రెండోసారి కలిసినప్పుడు ‘ఏఆర్.. మనిద్దరం కలిసి ‘వియ్ ఆర్ ది వరల్డ్..’ లాంటి పాట చేద్దాం అన్నారు. నేను రెండోసారి కలిసిన నెలకు ఆయన చనిపోయారు. మా కలయికలో పాట చేయలేదనే అసంతృప్తి నాకెప్పటికీ ఉంటుంది. నేనెక్కువగా క్లాసికల్ సాంగ్స్ వింటాను. క్లాసికల్ మ్యూజిక్ వినడం ద్వారా నూతనోత్సాహం వస్తుంది. పాప్ మ్యూజిక్ విన్నప్పుడు ఆ ఫీలింగ్ కలగదు. ఎప్పుడైనా పాప్ సాంగ్స్ వినాలనిపిస్తే, కారులో ప్రయాణిస్తున్నప్పుడు వింటాను. ఇంట్లో ఉన్నప్పుడు రేడియోలో వింటాను. అది కూడా చాలా తక్కువగా.. -
లేకేం, మైకేల్!
సంక్షిప్తంగా... మైకేల్ జాక్సన్ జూన్ 25. మైకేల్ జాక్సన్ మాట ఆగి, పాట ఆగి అప్పుడే ఐదేళ్లు! కానీ జాక్సన్ ఆల్బమ్స్ అతడిని ఏనాటికైనా మరణించడానికి అనుమతిస్తాయా?! మనమూ అతడిపై ప్రేమను ఏ జన్మకైనా వదులుకుంటామా! వియ్ ‘జస్ట్ కాంట్ స్టాప్ లవింగ్ హిమ్’. జాక్సన్ గాయకుడు, గేయ రచయిత, నటుడు, డాన్సర్, బిజినెస్‌మేన్, పరోపకారి, ఇంకా... కింగ్ ఆఫ్ పాప్. నేనెప్పటికీ పాడుతూనే ఉంటానన్నాడు... ‘ఫర్ యు అండ్ ఫర్ మీ... అండ్ ఎంటైర్ ది హ్యూమన్ రేస్’ అని పాడాడు. పాటే జాక్సన్ కాబట్టి... మరణం అన్న మాటే లేదు జాక్సన్‌కి. మైకేల్ జాక్సన్ బయోగ్రఫీ తెలియనిదెవ్వరికి? ఎప్పుడు పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? అంతా వట్టి చెత్త. కాలాలకు, ప్రాంతాలకు, స్థితిగతులకు అతీతంగా వెలుగుతూ వెలుగుతూ అలా వెలుగులా నిలిచిపోయాడు. ‘గాట్ టు బి దేర్’ నుంచి ‘ఇన్విన్సిబుల్’ వరకు ఆల్బమ్ ట్రాక్స్ అన్నీ అతడి రక్తనాళాలతో దారి ఏర్పరచుకున్నవే. ఆ దారులు ఓకే, కానీ జాక్సన్ చెడ్డ దారుల్లో నడిచాడే! ఏమిటా చెడ్డ దారి? స్కిన్ సర్జరీ చేయించుకున్నాడు. ఇంకా? పిల్లల్ని హింసించాడు. సర్జరీ అతడిష్టం. కానీ హింసించాడని అనకండి. ఏడ్చేస్తుంది జాక్సన్ ఆత్మ. తండ్రి ప్రేమకు నోచుకోనివాడు, బాల్యాన్ని బలవంతంగా నెట్టుకుని వచ్చినవాడు, ‘లాస్ట్ చిల్డ్రన్’ (ది ఇన్విన్సిబుల్) కోసం ‘వియ్ సింగ్ సాంగ్స్ ఫర్ ద విషింగ్... ఆఫ్ దోజ్ హూ ఆర్ కిసింగ్... బట్ నాట్ ఫర్ ది మిస్సింగ్’ అంటూ ఉద్యమగీతం ఆలపించినవాడు జాక్సన్. పిల్లల ముఖంలో తనకు దేవుడు కనిపిస్తాడన్నాడు. పిల్లల నవ్వుల్లో నాకు దైవదర్శనం అవుతుందంటూ మోక్షపడ్డాడు. ఇక అనండి ఎన్ని మాటలు అంటారో అన్నీ! జాక్సన్ గురించి చెప్పేవాళ్లు చెబుతూనే ఉంటారు. వినేవాళ్లు వింటూనే ఉంటారు. చివరికి మనసులో ఉండిపోయేది ఈ భూగోళంపై ఆయన చేసి వెళ్లిన మూన్ వాక్ మాత్రమే. ‘హార్పర్ కాలిన్స్’ ఇండియా ప్రచురణ సంస్థ నుంచి మైకేల్ జాక్సన్‌పై ఒక కొత్త పుస్తకం వస్తోంది. ‘రిమెంబర్ ద టైమ్: ప్రొటెక్టింగ్ మైకేల్ జాక్సన్ ఇన్ హిజ్ ఫైనల్ డేస్’ అనే ఆ పుస్తకాన్ని బిల్ విట్ఫీల్డ్, జావన్ బియర్డ్, టానర్ కాల్బీ అనేవారు రాశారు. మొదటి ఇద్దరూ.. బిల్, జావన్... జాక్సన్ అంతరంగిక భద్రతా బృందంలోని సభ్యులు. జాక్సన్ చివరి రోజుల్లో వీళ్లిద్దరూ అతడిని బాగా దగ్గరగా చూశారు. జాక్సన్ వీళ్లతో మాటిమాటికీ ‘‘మీరెంతో అదృష్టవంతులు’’అనేవారట. ఎందుకు అతడు అలా అనేవాడో తెలుసుకోవాలంటే, జాక్సన్ ఇంకా ఎంత లోతైనవాడో అర్థం చేసుకోవాలంటే బిల్, జావన్ ఏం రాశారో చదవాలి. కన్నీళ్లొస్తాయి. రానివ్వండి. పుస్తకంలోని ముఖ్యాంశాలలో అవి కూడా ఒక భాగమే. - మాధవ్ శింగరాజు -
మైకేల్ జాక్సన్ రేడియో చానల్
పాప్ సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాజు మైకేల్ జాక్సన్. ఆయన పాటలకు చెవి కోసుకోనివారు ఉండరంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మధురమైన కంఠస్వరం, స్ప్రింగ్‌లాంటి దేహంతో సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మైకేల్ పాట రూపంలో జీవించే ఉన్నారు. భౌతికంగా దూరమైనా ఆయన మాత్రం అభిమానులగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన దుస్తులు, వస్తువులు వేలానికి పెడుతుంటే కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. అలాగే, మైకేల్ అసంపూర్తిగా వదిలేసిన ఆల్బమ్స్ కూడా భారీ ఎత్తున అమ్ముడుపోవడం విశేషం. ఆయన అసంపూర్తిగా వదిలేసిన ఆల్బమ్స్‌లో ‘ఎస్కేప్’ ఒకటి. ఈ ఆల్బమ్‌ని పునర్నిర్మించి, విడుదల చేశారు. దీనికి నిర్మాతగా టింబాలాండ్ వ్యవహరించారు. ఎనిమిది పాటల సమాహారంతో ఉన్న ఈ ఆల్బమ్ 50 దేశాల్లో నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. మూడు రోజుల క్రితం ఈ ఆల్బమ్‌ను విడుదల చేశారు. అదే రోజున మైకేల్ జాక్సన్ పేరుతో ఓ రేడియో చానల్‌ను ఆరంభించారు. బహుశా ప్రపంచంలో ఏ ప్రముఖునికీ ఇలాంటి ఘనత దక్కి ఉండదు. ఈ ఎఫ్ఎమ్ చానల్లో 24 గంటలూ మైకేల్ హిట్ పాటలను ప్రసారం చేస్తారు. కేవలం రెండు వారాలు మాత్రమే ఈ చానల్ ఉంటుంది. మైకేల్ అభిమానులందరూ ఈ 15 రోజులూ రేడియోకు అతుక్కుపోవడం ఖాయం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
మైఖేల్ జాక్సన్ మ్యూజియమ్!
సంగీత ప్రపంచంలో తిరుగు లేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన మైఖేల్ జాక్సన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినా ఎప్పటికీ ఆయన చిరంజీవే. ఈ పాప్ కింగ్‌కి ఎంతోమంది వీరాభిమానులున్నారు. వారిలో ‘లేడీ గాగా’ ఒకరు. గాయనిగా, సంగీతదర్శకురాలిగా, బుల్లితెర, వెండితెర నటిగా ఎంతో పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్న లేడీ గాగా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. మైఖేల్ జాక్సన్ జ్ఞాపకార్థం ఓ మ్యూజియమ్‌ని ఏర్పాటు చేసే పని మీద ఉన్నారు గాగా. ఇందులో మైఖేల్‌కి సంబంధించిన విలువైన ఫొటోలు, వస్తువులను పొందుపరచనున్నారామె. గత కొంత కాలంగా ఈ సేకరణ పనిలోనే ఉన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఓ వేలం పాటలో మైఖేల్‌కి సంబంధించిన 55 విలువైన వస్తువులను భారీ మొత్తానికి కొనుగోలు చేశారామె. ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే విధంగా, మంచి అనుభూతి పొందే విధంగా ఈ మ్యూజియమ్ ఉండబోతోందని హాలీవుడ్ టాక్. -
వెటల్.. విజయానికొక ఫార్ములా ఉంది!
ఆ పదేళ్ల కుర్రాడికి ప్రపంచంలో ముగ్గురు మైఖేల్‌లు ఇష్టం. ఒకరు మైఖేల్ జాక్సన్, రెండు మైఖేల్ జోర్డన్, మూడు మైఖేల్ షూమకర్. ఒకరు పాటగాడు (జాక్సన్), మరొకరు ఆటగాడు (జోర్డన్), ఇంకొకరు ఫార్ములావన్ రేసర్(షూమాకర్). వాళ్ల సరికొత్త ఫీట్లను చూస్తూ, వారినే ఆరాధిస్తూ.. వారిలో ఎవరో ఒకరిలా ఎదగాలని అనుకొన్నాడు. వారి ముగ్గురి వ్యక్తిగత ప్రతిభను పరిశీలించి.. తన వ్యక్తిగత ప్రతిభ గురించి ఒక అంచనాకు వచ్చాడు. తను ఏ మైఖేల్‌తో సరిపోలుతానో లెక్కలేసుకొన్నాడు. ఒక అభిప్రాయానికి వచ్చాడు. ఒక మైఖేల్‌ను ఆదర్శంగా తీసుకున్నాడు. ఆ మైఖేల్ స్థాయికి ఎదిగాడు. నాటి ఆ పదేళ్ల కుర్రాడు నేడు సెబాస్టియన్ వెటల్గా మైఖేల్ షూమకార్ స్థాయికి ఇంకో మెట్టు దిగువన ఉన్నాడు. ఇటీవలే ఇండియన్ గ్రాండ్ఫ్రీ విజేతగా నిలిచిన అతడి కథ గురించి... జర్మనీ పునరేకీకరణకు ముందు పశ్చిమ జర్మనీగా ఉన్న ప్రాంతంలో పుట్టాడు సెబాస్టియన్ వెటల్. వెటల్ తండ్రి ఫిజియోథెరఫిస్ట్. వెటల్ అక్కలు, తమ్ముడు అందరూ చదవులో మెరిట్స్టూడెంట్స్. అయితే వెటల్‌కు మాత్రం చదువు అబ్బలేదు. నిత్యం ఆటలు, పాటలు ధ్యాసగా గడిపేవాడు. ఈ సమయంలోనే అతడు ‘మైఖేల్ట్రిప్లెట్స్’కు అభిమానిగా మారిపోయాడు. వాళ్ల స్టైల్, వాళ్ల మ్యానరిజమ్స్ అనుకరించడం మొదలు పెట్టాడు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తులైన ముగ్గురు పేర్లూ ఒకే విధంగా ఉండటం కూడా వెటల్‌కు ఆనందాన్ని ఇచ్చేది. తన పేరుకు కూడా ‘మైఖేల్’ అనే పదం ఉండి ఉంటే.. తను నాలుగో మైఖేల్ కాగలననేంత ఆత్మవిశ్వాసం ఉండింది. అయితే ఆ ఆత్మవిశ్వాసం ఊరికే పోలేదు. తన గురించి తాను జడ్జిమెంట్ ఇచ్చుకునే విషయంలో వెటల్ చాలా కచ్చితత్వాన్ని పాటించేవాడు. తన ఫేవరెట్స్ గురించి ఇలా బేరీజు వేసుకునేవాడు... జాక్సన్‌లా పాడలేను... మైఖేల్ జాక్సన్‌లా తాను ఎదగాలి అంటే.. అందుకు స్వరం కావాలి. వేలు, లక్షల మందిలో కదలిక తీసుకురాగలిగేలా పాడాలి. అది తనకు సాధ్యం కాదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ఒక మైఖేల్‌ను మైనస్ చేసుకొన్నాడు. జోర్డన్‌కు ప్రత్యామ్నాయం కాలేను.. అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు మైఖేల్జోర్డన్. బాస్కెట్ బాల్ కోసమే పుట్టినట్టుగా ఉంటాడు జోర్డన్. ఆ ఆరడుగుల ఆరంగుళాల ఆజానుబాహుడి స్థాయికి చేరడం అంత సులభం కాదు. అసలు తాను హైట్ లేడు. తను బాస్కెట్ బాల్‌కు అన్‌ఫిట్ అని అర్థం చేసుకొన్నాడు. షూమాకర్‌ను చూశాడు... షూమాకర్ అయ్యాడు! స్వదేశీ ఫార్ములావన్ రేస్ హీరో మైఖేల్ షూమాకర్. తనదేశంలో ఫార్ములావన్‌కు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాడు. తను ఫార్ములా వన్ రేసులు చూసినప్పుడల్లా వేదికలు మారేవి కానీ విజేత మాత్రం షూమకారే. మరి ఈ మైఖేల్లా ఎదగడానికి ...ఆకట్టుకునే స్వరం అవసరం లేదు, భారీకాయం, ఎత్తు అవసరం లేదు. ఓర్పు, నేర్పు, చాకచక్యం ఉంటే తను మరో షూమాకర్ కాగలననే నమ్మకానికి వచ్చాడు. ఆ దిశగా కృషి చేశాడు. కొన్ని సంవత్సరాల్లోనే షూమాకర్కు ప్రత్యామ్నాయం అయ్యాడు. ప్రపంచంలోని గ్రాండ్ ఫ్రీ రేసులన్నింటినీ గెలిచి ఏడుసార్లు షూమాకర్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. వెటల్ ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఫార్ములావన్‌లో ఛాంపియన్‌షిప్‌ను సాధించాడు. 2010, 2011, 2012, 2013 సంవత్సరాల్లో వేరే ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. వెటల్ ఫామ్‌ను చూస్తుంటే ... ఫార్ములావన్‌లో షూమాకర్కు ప్రత్యామ్నాయం కాగలడనే విశ్లేషకులు అంటున్నారు. ఈ ఫార్ములావన్ హీరో సాధిస్తున్న విజయాలను చూస్తుంటే.. సెల్ఫ్ జడ్జిమెంట్ విషయంలో తిరుగులేనివాడనిపిస్తుంది. రాణించగల కె రీర్‌ను ఎంచుకోవడం అనే విషయంలో ఆదర్శవంతమైన యువకుడనిపిస్తుంది. -జీవన్ -
బీబర్ ఒక బ్రాండ్!
అతడి శ్వాస సంగీతం... అతడి పెదవంచు స్వరం కోట్ల హృదయాల్లో రిథమ్...స్టైల్, ఇమేజ్, ఫ్యాన్స్... విషయాల్లో అతడొక సంచలనం. అతడే... జస్టిన్ బీబర్. తన హమ్మింగ్తో సంగీతానికున్న హద్దులను చెరిపేస్తున్న టీనేజర్ ఇతడు. కెనడాలో పుట్టిన బీబర్ 20 ఏళ్లు కూడా రాకముందే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బీబర్ సాంగ్, బీబర్ స్టైల్, బీబర్ సంపాదన... ప్రతి ఒక్క అంశమూ సంచలనమే. అలాంటి ఈ ‘94 బార్న్ యువ తరంగం గురించి... అభిమానుల సంఖ్య, సంపాదించిన డబ్బు, మీడియా కవరేజ్, సోషల్‌మీడియాలో ఫాలోయింగ్... ఏ పరంగా చూసినా బీబర్ ఒక వండర్ బాయ్. సింగర్- సాంగ్‌రైటర్, మ్యుజీషియన్, ప్రొడ్యూసర్, యాక్టర్, డాన్సర్, ఇన్వెస్టర్.. ఇవి బీబర్‌కు ఉన్న హోదాలు. ట్రంపెట్ , డ్రమ్స్ వాయించగలడు. గిటార్, పియానోలతో విన్యాసాలు చేయగలడు. పాశ్చాత్య దేశాలను తన సంగీత ఝరిలో ముంచెత్తుతున్న టీనేజ్ యువకుడే జస్టిన్ బీబర్. 1994 మార్చి ఒకటో తేదీన పుట్టిన బీబర్ తన 14వ యేట తొలిగుర్తింపు పొందాడు. 2008లో రేమాండ్ బ్రౌన్ మీడియా గ్రూప్ (ఆర్బీఎమ్జీ) తో చేరడంతో బీబర్‌కు గుర్తింపు లభించింది. అక్కడ నుంచి అంతర్జాతీయస్థాయి గుర్తింపు సంపాదించుకోవడానికి బీబర్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. 2009లో ‘మై వరల్డ్’తో పాప్వరల్డ్లోకి ప్రవేశించాడు బీబర్. ఏడు ట్రాక్స్‌తో విడుదలైన ఈ ఆల్బమ్ అమెరికాలో అద్వితీయమైన స్థాయిలో అమ్ముడయ్యింది. దీంతో ఒక్కసారిగా బీబర్ పేరు మార్మోగిపోయింది. పదిహేనేళ్ల వయసు యువకుడి గానామృతంలో పాప్ ప్రియులు ఓలలాడారు. బీబర్ మళ్లీ ఎప్పుడు పాడతాడా అని ఎదురుచూడసాగారు. 2010లో వచ్చిన స్టూడియో ఆల్బమ్, మై వరల్డ్ లైతే పిచ్చెక్కించేశాయంతే! అనేక దేశాల్లో అమ్మకాల చార్ట్‌లలో బీబర్ ఆల్బమ్‌లు తొలిస్థానంలో నిలిచాయి. బేబీ, మై వరల్డ్ టూర్ వంటి ఆల్బమ్‌లు వస్తూనే అమ్మకాల విషయంలో బీబర్ స్థాపించిన పాత రికార్డులను చెల్లాచెదురు చేశాయి. ప్రపంచపటంలో మూలగా ఉండే కెనడాలో బీబర్ గొంతు విప్పాడంటే... మరో మూలన ఉన్న ఆస్ట్రేలియా వరకూ ఆ పాట అలలా వచ్చి తాకుతుంది. ఆన్లైన్ సాయంతో ఈ పడమటి గాలి మన దేశాన్ని పలకరిస్తోంది. మన దగ్గరా బీబర్‌కు ఎన్నో లక్షలమంది ఫ్యాన్స్ ఉన్నారు. బీబర్ ట్విటర్ అకౌంట్లో ఉన్న నాలుగు కోట్ల మంది ఫాలోవర్లలో చాలామంది భారతీయులు ఉంటారు. బీబర్ ఫ్యాన్స్‘బిలీబర్స్’గా ప్రసిద్ధులు. తమను తాము బిలీబర్స్గా చెప్పుకోవడం కూడా యువతలో ఒక గొప్ప! తన సంపాదనతో బీబర్ ఇప్పటికే ఫోర్బ్స్ పత్రికలో స్థానం సంపాదించాడు. 2012లో బీబర్ సంపాదన 55 మిలియన్ డాలర్లు అని ఒక అంచనా. యువకుల ఫేవరెట్ స్టైల్... పొడవాటి జుట్టును కనుబొమలపై పడేలా దువ్వుకోవడం.. అంతవరకూ అమ్మ దువ్విపెడుతున్న జుట్టుకు కాస్తంత టీనేజ్ నిర్లక్ష్యం తోడవ్వడంతో వచ్చిన స్టైల్ అది. ఇప్పుడు ఎంతోమంది యువకుల ఫేవరెట్ హెయిర్ స్టైల్. బీబర్ ది బాస్... బీబర్ మైఖేల్ జాక్సన్‌కు పెద్ద ఫ్యాన్. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను నిలుపుకోవడంలో మైఖేల్ ఆదర్శమని బీబర్ అంటాడు. టీనేజ్లోనే వెలుగులోకి వచ్చిన జాక్సన్ పాప్ మ్యూజిక్‌పై, ఫ్యాన్ఫాలోయింగ్పై ఎలా పట్టును నిలుపుకున్నాడో తాను కూడా అదే విధంగా కొనసాగగలనని బీబర్ అంటాడు. ‘నేను దేవుడిని నమ్ముతాను. ఆయన దయవల్లే నాకు ఈ గుర్తింపు దక్కిందని భావిస్తాను. అందుకే నా ప్రతి షోతోనూ ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలని భావిస్తాను...’ అంటాడు ఈ టీనేజ్ సెన్సేషన్. బీబర్ జీవితం ఆధారంగా ‘బీబర్: నెవర్ సే నెవర్’ అనే బయోపిక్ కూడా వచ్చింది. - జీవన్