
అందరికి వివిధ రకాల టాలెంట్‌లు ఉంటాయి. ఐతే ఆ టాలెంట్‌కి పదును పెట్టి విభిన్నంగా చేసి ఔరా! అనిపించుకునేవారు కొంతమందే. ఆ కోవకు చెందిన వ్యక్తే జయదీప్ గోహిల్. మూన్‌వాక్ గురించి అందరికీ తెలిసిందే. కానీ, జయదీప్ చేసిన మూన్‌వాక్ మరింత స్పెషల్. ఎందుకంటే అతను చేసింది నీటిలో తలకిందులుగా!
వివరాల్లోకెళ్తే.. మూన్ వాక్‌తో జనాలను ఆకర్శిస్తున్న జయదీప్ గోహిల్.. ఈసారి విభిన్నంగా ట్రై చేశాడు. నీటి అడుగు భాగంలో మూక్‌వాక్‌తో ఆకట్టుకున్న ఈ యువకుడు.. తలకిందులుగా ఆ స్టెప్ వేసి అందర్నీ ఆశ్చర్య చకితులను చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతుంది.
అతను ఆ వీడియోలో తొలుత స్విమ్మింగ్ పూల్‌లోని అడుగున ఉన్న టేబుల్ పై మేఖేల్ జాక్సన్‌కి సంబంధించిన ప్రసిద్ధ పాట స్మూత్ క్రిమినల్‌లో ఆయన ఎలా వాకింగ్ స్టైల్ డ్యాన్స్ తరహాలో నడిచాడో అలా నడుస్తాడు. ఆ తర్వాత సడన్‌గా తలకిందులుగా నడుస్తాడు. చూస్తే ఏం చేశాడ్రా అని అనకుండా ఉండలేరు. ఈ వీడియోకి తొమ్మిది మిలియన్లకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు కూడా అతని టాలెంట్ చూసి తెగ ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
(చదవండి: కింగ్ చార్లెస్ కారుని ఢీ కొట్టబోయాడు: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment