![Michael Jackson dances to Panchayat song in viral](/styles/webp/s3/article_images/2024/06/30/Michel-Jackson.jpg.webp?itok=rhTkRlOZ)
వైరల్
హిందీ ఫోక్ సాంగ్‌కు మైకేల్ జాక్సన్ ఆయన స్టైల్లోనే డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది కాదు... అసలు ఎలా వీలవుతుంది?! అంటారా. సాంకేతిక మాయాబజార్‌లో ఏదైనా సాధ్యమే. కామెడి డ్రామా స్ట్రీమింగ్ టీవీ సిరీస్ ‘పంచాయత్’కు సంబంధించి మీమ్స్, వైరల్ వీడియోలు వస్తూనే ఉన్నాయి.
అందులో ఒకటి మైకేల్ జాక్సన్ డ్యాన్స్ వీడియో. ఈ ఫ్యాన్–మేడ్ వీడియో 8 మిలియన్‌ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోలో ‘ఏ రాజాజీ రాజాజీ’ అనే పాటకు మైకేల్ జాక్సన్ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. అయితే ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. చాలా సహజంగా ఉండడమే ఈ వీడియో వైరల్ కావడానికి కారణం అయింది.
Comments
Please login to add a commentAdd a comment