ఫైల్ పోటో
'మైఖేల్ జాక్సన్ 100 సార్లు అత్యాచారం చేశాడు'
Published Thu, Aug 7 2014 2:56 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ సుమారు నాలుగేళ్ల కాలంలో కనీసం 100 సార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని సహనటుడు జేమ్స్ సేఫ్ చుక్ అనే నటుడు చేసిన ఆరోపణలు హాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. సెక్స్ కోసం మైఖేల్ జాక్సన్ సీక్రెట్ కోడ్స్ వాడేవాడని జేమ్స్ ఆరోపించాడు. 1980లో మైఖేల్ జాక్సన్ తో కలిసి పెప్పీ అడ్వర్టైజ్ మెంట్ లో నటించిన జేమ్స్ కోర్టుకు దాఖలు చేసిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు ఉన్నాయని అతని తరపు న్యాయవాది వెల్లడించారు.
తన క్లైయింట్ జేమ్స్ ను జాక్సన్ పాలుమార్లు అనుభవించారని, సెక్స్ కోసం కోడ్ భాషను ఉపయోగించేవాడని అతని తరపు న్యాయవాదులు చెప్పినట్టు యూఎస్ లోని ఓ ప్రముఖ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించారు. అంతేకాకుండా జేమ్స్ ను రహస్యంగా వివాహం చేసుకునేందుకు ఉంగరాన్ని, మ్యారేజ్ సర్టిఫికెట్ ను కూడా సిద్ధం చేశారంటూ జేమ్స్ చేసిన ఆరోపణల్ని డాక్యుమెంట్ల రూపంలో కోర్టుకు అందించినట్టు సమాచారం.
20 ఏళ్ల తర్వాత జేమ్స్ చేస్తున్న ఆరోపణలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంకా.. మైఖేల్ జాక్సన్ మరణించిన ఐదేళ్ల తర్వాత ఈ ఆరోపణల్ని వెలుగులోకి తీసుకురావడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2009 జూన్ లో ఎక్కువ మోతాదులో డ్రగ్స్ వినియోగించడం కారణంగా మైఖేల్ జాక్సన్ మరణించిన సంగతి తెలిసిందే.
తనపై పలుమార్లు జరిపిన అత్యాచారానికి జాక్సన్ ఎస్టేట్ నుంచి పరిహారం ఇప్పించాలని కోర్టుకు విజ్క్షప్తి చేశారు. జేమ్స్ చేస్తున్న ఆరోపణల్ని కోర్టు తిరస్కరిస్తుందని జాక్సన్ ఎస్టేట్ న్యాయవాది వీట్జ్ మెన్ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు సెప్టెంబర్ 4 తేదిన విచారణకు రానుంది.
Advertisement
Advertisement