
మైఖేల్ జాక్సన్
‘కింగ్ ఆఫ్ పాప్’ అంటారు పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌ను. పాప్ ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ ఓ సంచలనం. డ్యాన్స్ చేయడంలో ఓ బెంచ్ మార్క్. జాక్సన్ జీవితంలో కేవలం సంగీతం, డ్యాన్స్ మాత్రమే కాదు ఎన్నో మిస్టరీలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ స్క్రీన్ మీదకు బయోపిక్‌గా తీసుకురావాలని చాలా మంది హాలీవుడ్ దర్శక–నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ మైఖేల్ జాక్సన్ ఫ్యామిలీకి చెందిన వాళ్లు లీగల్‌గా పెట్టే షరతులను దాటలేకపోయారు.
తాజాగా హాలీవుడ్ నిర్మాత గ్రహమ్ కింగ్.. మైఖేల్ జాక్సన్‌పై సినిమా తీసే హక్కులను దక్కించుకున్నారు. గత ఏడాది ‘బొహేమియన్ రాప్సోడి’ చిత్రాన్ని నిర్మించారు గ్రహమ్ కింగ్. అది సంగీత కళాకారుడు ఫ్రెడ్డీ మెర్కూరీ బయోపిక్ కావడం విశేషం. నాలుగు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది ఈ సినిమా. జాక్సన్ సినిమా విషయానికి వస్తే.. ‘గ్లాడియేటర్, హ్యూగో, ద ఏవియేటర్’ వంటి సినిమాలకు కథను అందించిన జాన్ లోగాన్ ఈ చిత్రానికి కథను సమకూరుస్తారు. ప్రస్తుతం మైఖేల్ జాక్సన్ పాత్రను పోషించే నటుడి ఎంపిక జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట.
Comments
Please login to add a commentAdd a comment