
కళా తపస్వి కె.విశ్వనాథ్(K Viswanath).. తెలుగు సీనీ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని పేరు ఇది. శంకరాభరణం, సిరిసిరి మువ్వ, సిరివెన్నెల, స్వాతి ముత్యం, శుభసంకల్పం.. ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలాంటి చిత్రాలనిచ్చిన దర్శక దిగ్గజం ఆయన. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన సినిమాలు ఎప్పుడూ మనల్ని అలరిస్తూనే ఉంటాయి. ఇలాంటి గొప్ప దర్శకుడి జీవిత చరిత్రను వెబ్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. జనార్దన మహర్షి దర్శకత్వం వహించిన ఈ డాక్యూమెంటరీకి ‘విశ్వదర్శనం’( Viswadharshanam )అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
తాజాగా ‘విశ్వదర్శనం’ ప్రోమోని విడుదల చేశారు. అందులో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా కె.విశ్వనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని వివరించనున్నారు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా ఇది రిలీజ్ కానున్నట్లు నిర్మాణసంస్థ వెల్లడించింది. ‘వెండి’తెర చెప్పిన ‘బంగారు’ దర్శకుడి కథ.. అంటూ దీన్ని ప్రకటించింది.
కాగా,తెలుగు ప్రేక్షకులకు గొప్ప సందేశాత్మక చిత్రాలను అందించిన విశ్వనాథ్(92).. అనారోగ్యంతో గతేడాది ఫిబ్రవరిలో మరణించారు. 1930 ఫిబ్రవరి 19న జని్మంచిన విశ్వనాథ్..51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మ గౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment