హైదరాబాద్‌ చేరుకున్న డేవిడ్ వార్నర్‌.. ఐపీఎల్ మ్యాచ్ కోసం కాదు! | Australia Cricketer David Warner Arrives In Hyderabad Today For Nithiin Robinhood Promotions | Sakshi
Sakshi News home page

David Warner: హైదరాబాద్‌లో డేవిడ్ వార్నర్‌ సందడి.. ఐపీఎల్ మ్యాచ్‌ కోసమైతే కాదు!

Published Sun, Mar 23 2025 3:13 PM | Last Updated on Sun, Mar 23 2025 5:00 PM

Australia Cricketer David Warner Arrives Hyderabad Today

నితిన్‌, శ్రీలీల జంటగా నటించిన లేటేస్ట్‌ మూవీ రాబిన్‌హుడ్‌. ఈ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్‌తో అదరగొట్టేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు కాలేజీల్లో ఈవెంట్స్ నిర్వహించారు.

అయితే మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో రాబిన్‌హుడ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు మేకర్స్. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ కూడా హాజరు కానున్నారు. ఈ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా వార్నర్‌ పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న వార్నర్‌కు ఘనస్వాగతం లభించింది. డైరెక్టర్ వెంకీ కుడుముల స్వయంగా పూల బొకే అందించి డేవిడ్‌కు వెల్‌కమ్‌ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే గతంలోనే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్‌ నటిస్తున్నారని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ రివీల్ చేశారు. ఈ మూవీ ద్వారా డేవిడ్ వార్నర్ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. పుష్ప మేనరిజంతో అభిమానులను ‍అలరించిన క్రికెటర్‌.. ఇప్పుడు ఏకంగా సినిమాతోనే ఫ్యాన్స్‌ ముందుకు రానున్నారు. ఈ యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement