జనార్థన మహర్షి
యాభై ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం... ఎన్నో అద్భుతమైన చిత్రాలు. మరెన్నో అవార్డులు.. కళాతపస్వి కె. విశ్వనాథ్ గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు చలన చిత్రపరిశ్రమకు ఆయన అందించిన కృషి ప్రశంసనీయం, భావితరాలకు స్ఫూర్తిదాయం. అటువంటి గొప్ప దర్శకుని జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘విశ్వదర్శనం’. ‘వెండి’తెర చెప్పిన ‘బంగారు’ దర్శకుని కథ అన్నది ఉపశీర్షిక.
‘దేవస్థానం’ తర్వాత విశ్వనాథ్, జనార్థన మహర్షి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది. కె. విశ్వనాథ్ లీడ్ రోల్‌లో ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు జనార్థన మహర్షి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సెలక్ట్ అయ్యింది. 2019 సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ డాక్యుమెంటరీ విభాగంలో (పనోరమ విభాగం) ఈ చిత్రం ఎంపికైంది.
‘‘అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు మా సినిమా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఒక గొప్ప దర్శకుని జీవితం ఆధారంగా ఈ సినిమాను ఎంతో నిజాయతీగా తీశాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ను పది లక్షల మందికి పైగా చూడటం ఆనందంగా ఉంది. త్వరలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేయాలనుకుంటున్నాం. ‘విశ్వదర్శనం’ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రదర్శకుడు జనార్థన మహర్షి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment