మాతృభాష కన్నడంలో నటిగా రంగప్రవేశం చేసినా, ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ అగ్రనటిగా రాణిస్తున్నారు రషి్మక మందన్నా. తెలుగులో రష్మిక మందన్న కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం గీతాగోవిందం కాగా పాన్ ఇండియా నటిని చేసిన చిత్రం పుష్ప. ఇక హిందీలో యానిమల్ చిత్రంతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తమిళంలోనే రెండు చిత్రాల్లో నటించినా, సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక మందన్న దివంగత నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలనే కోరికను వ్యక్తం చేశారు. నటి సౌందర్య కూడా కన్నడ భామ అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె తెలుగు, తమిళం భాషల్లోనే ఎక్కువ చిత్రాల్లో నటించి స్టార్‌డమ్‌ను అందుకున్నారు. 1992లో బానన్నా ప్రీతీసు అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నటి సౌందర్య. ఆ తరువాత తెలుగు, తమిళం, మలమాళం, హిందీ భాషల్లో నటించి అగ్రనటిగా రాణించారు.
నటిగా ఈమె వయసు పుష్కరమే. అయినా భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి సౌందర్య బయోపిక్‌లో నటించాన్న కోరికను నటి రష్మిక మందన్నా ఇటీవల ఒక భేటీలో వ్యక్తం చేశారు. అందులో ఆమె పేర్కొంటూ ప్రత్యేక పాత్రల్లో నటించాలన్న కోరిక అందరు నటీమణులకు ఉంటుందన్నారు. అదేవిధంగా తనకూ దివంగత నటి సౌందర్య జీవిత చరిత్రను ఎవరైన తెరపై ఆవిష్కరించే ఆమె పాత్రలో నటించాలని కోరుకుంటున్నానన్నారు.
అది తన కల కూడా అని అన్నారు. తాను సినీరంగ ప్రవేశానికి ముందే నటి సౌందర్యకు వీరాభిమానినని చెప్పారు. ఆమె నటించిన చిత్రాలు ఒక్కటి కూడా వదలకుండా చూసేదాన్నని చెప్పారు. సౌందర్య నటించిన చిత్రాలు చూసి ఎదిగిన తాను ప్రముఖ కథానాయకి అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. ఇకపోతే తనలో నటి సౌందర్య పోలికలు ఉన్నాయని పలువురు అంటుంటారన్నారు. అందుకే ఆమె బయోపిక్‌లో నటించాలని కోరుకుంటున్నాననీ, అలాంటి అవకాశం వస్తే తాను నటించడానికి సిద్ధం అని రషి్మక ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment