Soundarya
-
సౌందర్య మరణం.. ఆ రోజు ఏం జరిగింది?
అందం, అభినయం..ఈ రెండు కలిస్తే సౌందర్య. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటూ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో సౌందర్య ఒకరు. దశాబ్దానికి పైగా హీరోలతో సమానంగా క్రేజీ సొంతం చేసుకున్న ఈ విలక్షణ నటి.. చిన్న వయసులోనే అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. 2004లో ఆమె ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై పేలి పోయింది. ఈ ప్రమాదంలో సౌందర్య(32)తో పాటు ఆమె సోదరుడు కూడా మృతి చెందారు. ఈ ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు సౌందర్య మరణంపై పుకార్లు వచ్చాయి. ఆమె మరణం వెనుక సీనియర్ హీరో మోహన్ బాబు ఉన్నారంటూ ఓ వ్యక్తి లేఖ రాయడంతో మరోసారి సౌందర్య పేరు నెట్టింట వైరల్‌గా మారింది. అసలు సౌందర్య ఎలా చనిపోయింది? ఆ రోజు ఏం జరిగింది?→ 2004 ఏప్రిల్ 17 మధ్యాహ్నం గం.1:14 నిమిషాలకు బెంగళూరులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. ఆమెతో పాటు అన్నయ్య అమర్ కూడా నేలరాలి పోయారు. అప్పటికామెకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ రఘుతో పెళ్లయ్యి ఏడాది కూడా కాలేదు. → కరీంనగర్ జిల్లాలో బీజేపీకి సపోర్ట్‌గా ఎన్నికల సభలో పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లలేకపోయింది. పైలట్ జాయ్ ఫిలిప్ హెలికాఫ్టర్‌ను కొద్దిగా ఎడమ వైపు తిప్పాడు. అంతే..ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆ వెంటనే హెలికాఫ్టర్‌లో మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇదంతా జరిగింది. → ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే.. ప్రమాదం జరిగిన సమయానికి సౌందర్య గర్భంతో ఉంది. మంటలు భారీగా చెలరేగడంతో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, రమేష్, జాయ్ ఫిలిప్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ఎవరి శరీర భాగాలు ఎవరివో కనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందట. → సౌందర్య మరణించి 20 ఏళ్లు దాటినా అభిమానులు ఇప్పటికీ ఆమెను మర్చిపోవడం లేదు. కాగా, ఆమె మరణంపై వస్తున్న పుకార్లపై భర్త రఘు స్పందించారు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి గొడవల్లేవని, ఆస్తు వివాదాలు అంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. (చదవండి: మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవల్లేవు: సౌందర్య భర్త) -
మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవల్లేవు: సౌందర్య భర్త
దివంగత నటి సౌందర్య(Soundarya ), మోహన్ బాబు(Mohan Babu) మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయని, సౌందర్య ప్రమాదంలో చనిపోలేదని, ప్లాన్ చేసి చంపేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బహిరంగ లేఖ రాసి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సౌందర్య భర్త రఘు స్పందించాడు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవని స్పష్టం చేశాడు. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశాడు.‘గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని సౌందర్య ఆస్తికి సంబందించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. సౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మోహన్ బాబుతో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు.మంచు ఫ్యామిలీతో మాకు 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది .మోహన్ బాబును నేను గౌరవిస్తాను, మేమంతా ఒకే కుటుంబంగా ఉంటాం.మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవలు, లావాదేవీలు లేవు. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి’ అని లేఖలో పేర్కొన్నాడు. -
'అసలేం గుర్తుకురాదు..' పాటలో సౌందర్యను అలా చూపించింది ఆయన కాదట!
అంత:పురం.. 1998లో వచ్చిన సినిమా. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సౌందర్య హీరోయిన్. ఇళయరాజా సంగీతం అందించిన 'అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా..' ఎవర్ గ్రీన్ సాంగ్. సింగర్ చిత్ర ఆలపించిన ఈ పాటలో సౌందర్య చీర రంగులు మారుతూ ఉంటుంది. రెడ్, పర్పుల్, పింక్, ఎల్లో, గ్రీన్.. ఇలా వెంటవెంటనే చీర అనేక రంగుల్లో కనిపిస్తుంది.'ఈ చీర రంగులు మార్చే కాన్సెప్ట్ భలే ఉంది. చాలా కొత్తగానూ ఉంది. అప్పట్లో ఈ ఐడియా ఎలా వచ్చింది సార్?' అని ఓ నెటిజన్.. కృష్ణవంశీని అడిగాడు. ఇందుకు దర్శకుడు స్పందిస్తూ.. అది తమ క్రియేటివిటీ కాదని చెప్పాడు. మూవీ రిలీజ్ తర్వాత జెమిని టీవీ ఎడిటర్ దాన్ని ఇలా మలిచాడని క్లారిటీ ఇచ్చాడు.ఈ సంగతి తెలుసుకున్న జనాలు సర్ప్రైజ్ అవుతున్నారు. ఇన్నాళ్లూ సినిమాలోనే ఎడిట్ చేశారనుకున్నాం.. ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావేంటయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సౌందర్యను ఇంధ్రదనస్సులా అన్ని రంగు చీరల్లో చూపించాలన్న అతడి ఐడియాను మెచ్చుకోవాల్సిందేనంటున్నారు. ఈ క్రమంలో అసలేం గుర్తుకు రాదు సినిమా ఒరిజినల్ సాంగ్‌తో పాటు చీర రంగులు మార్చే వీడియో నెట్టింట వైరలవుతోంది. Adi not on film sir .. Gemini tv lo editor chesedu release తర్వాత .. ,🙏❤️ THQ https://t.co/gLLNeZNE6n— Krishna Vamsi (@director_kv) July 20, 2024 Pedda Mosame Idi 😂😂😂pic.twitter.com/I2060ZEvIg https://t.co/TBsi9z2DxJ— Movies4u Official (@Movies4u_Officl) July 20, 2024 చదవండి: ‘మురారి’ ఫ్లాప్ మూవీ.. కృష్ణవంశీ అదిరిపోయే కౌంటర్ -
టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోని ఏకైక హీరోయిన్.. సౌందర్య జయంతి (ఫొటోలు)
-
ఆవిడ బయోపిక్‌లో నటించాలని..!
మాతృభాష కన్నడంలో నటిగా రంగప్రవేశం చేసినా, ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ అగ్రనటిగా రాణిస్తున్నారు రషి్మక మందన్నా. తెలుగులో రష్మిక మందన్న కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం గీతాగోవిందం కాగా పాన్ ఇండియా నటిని చేసిన చిత్రం పుష్ప. ఇక హిందీలో యానిమల్ చిత్రంతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తమిళంలోనే రెండు చిత్రాల్లో నటించినా, సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక మందన్న దివంగత నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలనే కోరికను వ్యక్తం చేశారు. నటి సౌందర్య కూడా కన్నడ భామ అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె తెలుగు, తమిళం భాషల్లోనే ఎక్కువ చిత్రాల్లో నటించి స్టార్‌డమ్‌ను అందుకున్నారు. 1992లో బానన్నా ప్రీతీసు అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నటి సౌందర్య. ఆ తరువాత తెలుగు, తమిళం, మలమాళం, హిందీ భాషల్లో నటించి అగ్రనటిగా రాణించారు. నటిగా ఈమె వయసు పుష్కరమే. అయినా భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి సౌందర్య బయోపిక్‌లో నటించాన్న కోరికను నటి రష్మిక మందన్నా ఇటీవల ఒక భేటీలో వ్యక్తం చేశారు. అందులో ఆమె పేర్కొంటూ ప్రత్యేక పాత్రల్లో నటించాలన్న కోరిక అందరు నటీమణులకు ఉంటుందన్నారు. అదేవిధంగా తనకూ దివంగత నటి సౌందర్య జీవిత చరిత్రను ఎవరైన తెరపై ఆవిష్కరించే ఆమె పాత్రలో నటించాలని కోరుకుంటున్నానన్నారు. అది తన కల కూడా అని అన్నారు. తాను సినీరంగ ప్రవేశానికి ముందే నటి సౌందర్యకు వీరాభిమానినని చెప్పారు. ఆమె నటించిన చిత్రాలు ఒక్కటి కూడా వదలకుండా చూసేదాన్నని చెప్పారు. సౌందర్య నటించిన చిత్రాలు చూసి ఎదిగిన తాను ప్రముఖ కథానాయకి అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. ఇకపోతే తనలో నటి సౌందర్య పోలికలు ఉన్నాయని పలువురు అంటుంటారన్నారు. అందుకే ఆమె బయోపిక్‌లో నటించాలని కోరుకుంటున్నాననీ, అలాంటి అవకాశం వస్తే తాను నటించడానికి సిద్ధం అని రషి్మక ప్రకటించారు. -
సినీ నిర్మాత ఆత్మహత్య
కర్ణాటక: కన్నడ సినీ నిర్మాత సౌందర్యజగదీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మహాలక్ష్మీలేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో తన నివాసంలో ఆయన ఉరివేసుకోగా కుటుంబ సభ్యులు గమనించి రాజాజీనగర సుగుణ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. సౌందర్య జగదీష్ పలు వివాదాలతో గతంలో వార్తల్లోకి ఎక్కారు. ఇరుగుపొరుగువారితో పాటు కుటుంబసభ్యులతో గొడవపెట్టుకుని వివాదంలో చిక్కుకున్నారు. ఈయనకు చెందిన జెట్లాగ్ పబ్‌లో కొద్దినెలల క్రితం కాటీర చిత్ర బృందం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పార్టీ చేసుకున్నట్లు ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో 25 రోజుల పాటు రెస్టోబార్ లైసెన్సు రద్దుచేశారు. సౌందర్యజగదీష్ రియల్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తమ్ముడి కుమారుడు స్నేహిత్‌ను సినిమారంగానికి పరిచయం చేశారు. ఇటీవల ప్రియాంకా ఉపేంద్ర ఏర్పాటుచేసిన హోలీ కార్యక్రమంలో సౌందర్యజగదీశ్ పాల్గొన్నారు. -
గంగూలీ బయోపిక్‌లో?
రజనీకాంత్‌తో బాలీవుడ్ దర్శక–నిర్మాత సాజిద్ నడియాడ్వాలా చేయనున్న సినిమా గురించి ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా చేయడం లేదని టాక్. ఓ కీలక పాత్ర కోసమే రజనీని సంప్రదించారట సాజిద్. అది కూడా గంగూలీ బయోపిక్ కోసమని భోగట్టా. భారత మాజీ ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ వెండితెరపైకి రానుందనే వార్త కొంతకాలంగా ప్రచారంలో ఉంది. గంగూలీగా నటించే హీరోల జాబితాలో రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్, ఆయుష్మాన్ ఖురానా వంటివారి పేర్లు వినిపించాయి. అయితే ఇంకా ఎవర్నీ ఫిక్స్ చేయలేదు. కాగా ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తారన్నది తాజా ఖబర్. ఈ బయోపిక్‌ను సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తారని, ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసమే రజనీకాంత్‌ను కలిశారని సమాచారం. మరి.. గంగూలీ బయోపిక్కు సౌందర్య దర్శకత్వం వహిస్తారా? ఇందులో రజనీ గెస్ట్ రోల్ చేస్తారా? అనే విషయాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. -
స్టార్స్‌గా ఎదిగారు.. చిన్న వయసులోనే కెరీర్‌ను ముగించారు!
సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇకపోతే సినిమాల్లో హీరోయిన్ల పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలా చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన తారలు చాలామందే ఉన్నారు. కానీ కాల కలిసిరాక కొందరు కాలగర్భంలో కలిసిపోయారు. తాజాగా ఇవాళ చిన్న వయసులోనే నటి, మోడల్ పూనమ్ పాండే క్యాన్సర్‌తో కన్నుమూసింది. 32 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాదంతో బాలీవుడ్, సినీ ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొద్ది రోజుల్లోనే స్టార్స్‌గా ఎదిగిన తారలు చాలామందే ఉన్నారు. కానీ కొందరు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరేమో వ్యక్తిగత జీవితంలో కారణాలతో చిన్న వయసులోనే తనువు చాలించి వెండితెరకు దూరమయ్యారు. అలా చిన్న వయసులో కన్నుమూసిన నటీమణుల్లో తెలుగు హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్.. టాలీవుడ్ అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న హీరోయిన్ ఆర్తి అగర్వాల్. అమెరికాలో జన్మించిన బ్యూటీ 31 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో పరిచయమైన ఆర్తి జూన్ 6, 2015లో కన్నుమూసింది. బరువు తగ్గడం కోసం ఆపరేషన్ చేయించుకోగా.. అది వికటించడంతో తుదిశ్వాస విడిచింది. యువనటి భార్గవి కన్నుమూత.. అనుమానాస్పద రీతిలో కన్నుమూసిన మరో నటి 'భార్గవి'. అష్టాచెమ్మా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఊహించని విధంగా హత్యకు గురైంది. డిసెంబర్ 16న, 2008లో 23 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. గుంటూరు జిల్లా గోరంట్లలో జన్మించిన భార్గవి వైవీఎస్ చౌదరి చిత్రం దేవదాసుతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతకుముందు టీవీ సీరియల్స్‌లో పనిచేసింది ప్రత్యూష మృతి.. తెలుగులో రాయుడు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటి ప్రత్యూష. భువనగిరికి చెందిన ప్రత్యూష తెలుగుతో పాటు తమిళంలోనూ నటించింది. చిన్న వయసులోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకొచ్చిన ప్రత్యూష చిన్న వయసులోనే 23 ఫిబ్రవరి 2002న 20 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. స్టార్ హీరోయిన్ సౌందర్య తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ సౌందర్య. కన్నడకు చెందిన ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే 2004 ఎన్నికల్లో భాజపా తరఫున ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. ఆమె మృతితో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సిల్క్ స్మిత సూసైడ్ అప్పట్లోనే వెండితెరను ఓ ఊపు ఊపేసిన నటి సిల్క్ స్మిత. ప్రత్యేక గీతాలతో తెలుగు సినిమాల్లో మెప్పించింది. అయితే వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యలతో చిన్న వయసులోనే సూసైడ్‌కు పాల్పడింది. ఏపీకి చెందిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి 23 సెప్టెంబర్ 1996లో 35 ఏళ్లకే కన్నుమూసింది. 19 ఏళ్లకే దివ్య భారతి ముంబైలో జన్మించిన దివ్య భారతి తెలుగు, హిందీ చిత్రాల్లో మెరిసింది. బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత అత్యధిక పారితోషికం పొందిన హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. తన కెరీర్లో ఫిల్మ్ ఫేర్‌తో పాటు నంది అవార్డులను గెలుచుకుంది. కానీ ఊహించని విధంగా 19 ఏళ్ల వయసులోనే 5 ఏప్రిల్ 1993 కన్నుమూసింది. ఆమె మృతితో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఫటాఫట్ జయలక్ష్మి.. ఏపీకి చెందిన జయలక్ష్మి తెలుగు, తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో ఆమెకు ముద్దుగా ఫటాఫట్ జయలక్ష్మిగా అభిమానులు పిలిచేవారు. మలయాళ సినిమాల్లో ఆమెను సుప్రియ అని పిలిచేవారు. ఆమె తన కెరీర్ సాగిన పదేళ్లలోనే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 66 సినిమాల్లో నటించింది. అంతులేని కథ సినిమాలో ఫటాఫట్ అంటూ సంచలనం సృష్టించింది. కానీ అప్పట్లో ఓ బడా హీరో కుమారుడితో వివాదం కారణంగా కేవలం 22 ఏళ్లకే ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించింది. బాలీవుడ్ నటి జియా ఖాన్.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నిశ్శబ్ద్ సినిమాతో బాలీవుడ్లో పాపులర్ అయిన హీరోయిన్ జియా ఖాన్. ఆ తర్వాత డిప్రెషన్ కారణంగా తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 1988లో అమెరికాలో జన్మించిన బ్యూటీ 25 ఏళ్ల వయసులోనే జూన్ 3,2013లో కన్నుమూసింది. తమ టాలెంట్‌లో కలల ప్రపంచంలోకి అడుగుపెట్టిన సినీ తారలు అర్ధాంతరంగా కెరీర్‌ను ముగించారు. అలా ఇచ్చి.. ఇలా వెళ్లిపోయి అభిమానులకు షాకిచ్చారు. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ కాలం కలిసిరాకపోవడంతో వెండితెరతో పాటు ఏకంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చిన్న వయసులోనే స్టార్స్‌గా ఎదిగినా.. చివరికీ విషాదంతో తమ జీవితాలను ముగించారు. -
సౌందర్యతో ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రిన్స్.. ఏ సినిమానో తెలుసా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో అలరించనుంది. అయితే రాజ కుమారుడు చిత్రంతో ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన మహేశ్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తాజాగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. (ఇది చదవండి: హౌస్ ఫుల్ ఎమోషన్.. బిగ్ బాస్‌లో సీమంతం వేడుకలు!) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య తెలుగువారికి పరిచయం అక్తర్లేని పేరు. అప్పటి స్టార్ హీరోలందరితో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించారు. అయితే సౌందర్యతో నటించే ఛాన్స్ మహేశ్ బాబు మిస్ అయినట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన మూవీలో మరో హీరోయిన్ నటించింది. రాజకుమారుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. ఆ తర్వాత యువరాజు చిత్రంలో నటించారు. ఇందులో ప్రిన్స్ సరసన సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్లుగా కనిపించారు. అయితే ఈ చిత్రంలో ముందుగా సిమ్రాన్ స్థానంలో డైరెక్టర్ సౌందర్యనే ఎంపిక చేశారు. అయితే సౌందర్య- మహేష్ బాబు కంటే వయసులో పెద్ద కావడంతో వీరిద్దరి కెమిస్ట్రీ అంతగా వర్కవుట్ కాలేదట. ఎలా చూసిన మహేశ్‌కు అక్కలా కనిపిస్తున్నానని.. ఈ విషయాన్ని స్వయంగా సౌందర్యనే డైరెక్టర్ వైవీఎస్ చౌదరికి చెప్పిందట. (ఇది చదవండి: రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ అశ్వధామ’.. ఫస్ట్ లుక్ రిలీజ్) ఈ పాత్రకు తనకంటే సిమ్రాన్ ఫర్ఫెక్ట్గా సెట్ అవుతుందని సౌందర్య సూచించిదట. దీంతో డైరెక్టర్ సౌందర్యకు బదులుగా సిమ్రాన్‌ను ఎంపిక చేశారు. అలా సౌందర్య- మహేశ్ బాబు జోడిని వెండితెరపై చూసే ఛాన్స్ టాలీవుడ్ ఫ్యాన్స్ కోల్పోయారు. లేదంటే మహేష్ బాబు - సౌందర్య జోడీని తెలుగువారు చూసే అవకాశం దక్కేది. కాగా.. సౌందర్య 2004లో బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా.. యువరాజు సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలోని గుంతలక్కడి గుమ్మ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. -
సౌందర్య మళ్లీ పుట్టిందా !
-
స్టార్ హీరోయిన్ సౌందర్య మళ్లీ పుట్టిందా?.. అచ్చం ఆమెలానే అలరిస్తోంది!
తెలుగులో స్టార్ హీరోయిన్లలో సౌందర్య ఒకరు. అప్పట్లో మీనా, రమ్యకృష్ణ తర్వాత తనదైన అలరించిన హీరోయిన్ ఆమెనే. కన్నడకు చెందిన భామ.. మనవరాలి పెళ్లి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆమె వెండితెరకు దూరమైంది. రాజకీయాల్లో ఓ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన సౌందర్య.. 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించింది. దీంతో ఆమె మృతిని తెలుగు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. భౌతికంగా సౌందర్య దూరమైన ఆమె సినిమాలు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. మహానటి సావిత్రి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఎవరంటే సౌందర్య పేరే వినిపిస్తుంది. అంతలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. సౌందర్య తెలుగుతో పాటు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించింది. 12 ఏళ్ల పాటు వెండితెరపై అభిమానులను అలరించింది. అయితే అచ్చం సౌందర్యలాగే అమ్మాయి సోషల్ మీడియాలో అలరిస్తోంది. మలేషియాకు చెందిన చిత్ర టిక్ టాక్ ఉన్న సమయంలోనే సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. చూడడానికి సేమ్ టు సేమ్ మన సౌందర్యలాగే ఉండడం ఆమెకు కలిసొచ్చింది. చిత్ర తన ఇన్స్టాగ్రామ్ ద్వారా మనదేశంలోని అభిమానులకు సైతం దగ్గరైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన చిత్ర తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. చిత్ర మాట్లాడుతూ..' మా అమ్మది తమిళనాడు. నేను పుట్టి పెరిగింది మాత్రం మలేషియాలోనే. నేను కన్నడ, తెలుగు భాషలు అర్థం చేసుకోగలను. ఆమెలాగే ఉండడం నా అదృష్టం. మలేషియా నుంచే నేను రీల్స్ చేస్తున్నా. సినిమాల్లో నటించమని తెలుగువాళ్లు కొంతమంది నాకు కాల్స్ చేశారు. నాకు యాక్టింగ్ రాదు. సౌందర్య నటించిన అమ్మోరు, అంతఃపురం సినిమాలంటే ఇష్టం. సౌందర్య కుటుంబ సభ్యులు ఎవరు నాకు ఫోన్ చేయలేదు.' అంటూ చెప్పుకొచ్చింది. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్లు చిత్ర తెలిపింది. View this post on Instagram A post shared by Chitra❤ (@chitra_jii2) View this post on Instagram A post shared by Chitra❤ (@chitra_jii2) -
నటి సౌందర్య గురించి చియాన్ విక్రమ్..!
-
ఆ సీన్ చేయడం నాకు ఇష్టం లేదు.. కానీ: రమ్యకృష్ణ
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్ర నరసింహ( తమిళంలో పడయప్ప). ఈ చిత్రంలో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. అయితే పేద అమ్మాయి పాత్రలో సౌందర్య కనిపించగా.. ధనిక అమ్మాయి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈ చిత్రం తమిళంలో పడయప్పా పేరుతో తెరకెక్కించగా. . తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేశారు. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. ఈ చిత్రంలో శివాజీ గణేశన్, లక్ష్మి, సితార, నాజర్, రాధా రవి, సత్యప్రియ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగులో నరసింహ పేరుతో ఓకేసారి విడుదలైంది. (ఇది చదవండి: రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్) అయితే ఈ చిత్రంలో ఓ ఆసక్తికర సన్నివేశం అభిమానులకు ఇప్పటికీ గుర్తు ఉంటుంది. సౌందర్యను ఇష్టపడుతున్న రజినీకాంత్‌ను రమ్యకృష్ణ ప్రేమిస్తుంది. కానీ పెద్దల అంగీకారంతో సౌందర్యను పెళ్లి చేసుకునేందుకు రజినీకాంత్ ఒప్పుకుంటాడు. దీంతో సౌందర్యతో రమ్యకృష్ణ మధ్య శత్రుత్వం పెరుగుతుంది. అదే సమయంలో ఇద్దరి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంటుంది. ఆ సీన్లో సౌందర్య చెంపపై రమ్యకృష్ణ తన పాదం ఉంచి ఆమెను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. అయితే ఆ సందర్భంలో అలా నటించేందుకు చాలా కష్టంగా అనిపించిందని అన్నారామె. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సన్నివేశం గురించి రమ్యకృష్ణ మాట్లాడారు. ఆ సీన్లో చేయలేకపోయా రమ్యకృష్ణ మాట్లాడుతూ..' ఆ చిత్రంలో నా రోల్ సౌందర్యపై పగ తీర్చుకోవడం. అందుకే అలాంటి అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ మొదట ఆ సీన్ చేయలేకపోయా. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. చివరికి ఆ షాట్ నాకు ఇష్టం లేదు. సినిమా తప్పకుండా చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చేసేటప్పుడు దేవుళ్లందరినీ మనసులో స్మరించుకున్నా. ఆ తర్వాతే సౌందర్యపై చెంపపై కాలు పెట్టా. ఆ సీన్లో నటించిన కొన్ని రోజుల తర్వాత అదే మూడ్‌లో ఉన్నా.' అని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!) అయితే ఆ సినిమా షూటింగ్లో సౌందర్య, రమ్యకృష్ణల మధ్య గొడవ జరిగిందని కూడా వార్తలు కూడా వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇద్దరు హీరోయిన్స్ ఆ వార్తలను ఖండించారు. అయితే సౌందర్య, రమ్యకృష్ణలు ఎంత పెద్ద హీరోయిన్స్ అయినా వారి మధ్య మంచి స్నేహం ఉండేదని అంటున్నారు. సౌందర్య చనిపోయినప్పుడు రమ్యకృష్ణ చాలా బాధపడ్డారని తెలిసింది. ఇక రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే గతేడాది 'రంగ మార్తాండ' చిత్రంలో కనిపించింది. ఇటీవల రిలీజైన రజినీకాంత్ జైలర్ చిత్రంలోనూ కీలకరపాత్రలో నటించింది. మరోవైపు మహేష్ బాబు చిత్రం ‘గుంటూరు కారం’లో రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
Actress Soundarya Unseen Photos: తెలుగు తెరకు సిసలైన సౌందర్యం (ఫొటోలు)
-
'సౌందర్య చనిపోలేదు.. ఆ రూపంలో ఇంకా బతికే ఉంది'
సినిమాల్లో గొప్ప పేరు సంపాదించుకున్న నటీనటులు చాలా తక్కువ మందే ఉంటారు. కొందరికి ఫేమ్ వచ్చినా దాన్ని ఎక్కువకాలం కొనసాగించాలంటే అంతా ఈజీ కాదు. అప్పట్లోనే మంచి గుర్తింపు సాధించుకున్న నటీమణులు కొందరు ఊహించని పరిణామాలతో మనకు దూరమయ్యారు. అందంతో తెరపై ఆకట్టుకున్న కొందరు హీరోయిన్లు చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దురదృష్టవశాత్తు సినీ ఇండస్ట్రీ కోల్పోయిన ఆ స్టార్ హీరోయిన్ గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: చనిపోయే రోజు సౌందర్య ఏం కోరిందో తెలుసా?) సౌందర్య పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి తనదైన నటనతో మెప్పించింది. ప్రధానంగా వెంకటేశ్ జోడీగా సూపర్ హిట్ చిత్రాల్లో చేసింది. రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్రబంధం, ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు లాంటి విజయవంతమైన జోడీగా నిలిచారు. అంతే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటించారు. కాగా.. 1971 జూలై 18న కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగల్ గ్రామంలో జన్మించిన సౌందర్య విమాన ప్రమాదంలో మరణించారు. 2004లో ఏప్రిల్ 17న ఎన్నికల ప్రచారానికి వెళ్తండగా ఆమె ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనతో సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. జూలై 18న మంగళవారం ఆమె 19వ జయంతి సందర్భంగా సౌందర్యను ఓసారి స్మరించుకుందాం. పెళ్లై ఏడాది కాకముందే.. సౌందర్యం తన మేనమామ, బాల్య స్నేహితుడైన జీఎస్ రఘును 2003 ఏప్రిల్ 27న పెళ్లి చేసుకున్నారు. సామాజిక సేవలో ముందుండే సౌందర్య ప్రజల కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేపట్టింది. తన స్వగ్రామమైన ముళబాగల్ తాలూకాలోని గంగికుంటను అభివృద్ధి పరచారు. అయితే సౌందర్య, తన తమ్ముడు అమర్నాథ్ ప్రమాదంలో చనిపోయాక వారి కుటుంబ సభ్యులు నేరవేర్చారు. అమర సాత్విక సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' పేరుతో అమర సౌందర్య ఫౌండేషన్ స్కూల్‌ను బెంగళూరులో స్థాపించారు. ఈ పాఠశాల ద్వారా మానసికంగా ఎదుగుదల లేని(ఆటిజం) పిల్లలకు విద్యనందిస్తున్నారు. ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు అందుకున్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఎంతో మంది విద్యార్థుల గుండెల్లో ఇంకా బతికే ఉంది. చివరి కోరిక తీరకుండానే! ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందు తన వదినను కాటన్ చీర, కుంకుమ తీసుకురమ్మని అడిగిందట.! అప్పుడు తన దగ్గర కాటన్ చీర లేకపోవడంతో ఒకటి కొని తీసుకురమ్మని కోరిందట. అప్పటికే ఆమె బీజేపీలో చేరడంతో ఆ చీర కట్టుకుని ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకుంది సౌందర్య. తనకు కుంకుమ ధరించడం అలవాటు, కాబట్టి దాన్ని కూడా తెమ్మని చెప్పింది. కానీ ఇంతలోనే సమయం కావస్తోందని విమానం ఎక్కేయడం, అది కూలిపోవడంతో సౌందర్య అక్కడికక్కడే మరణించడం తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది సౌందర్య వదిన. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు ) -
చనిపోయే రోజు సౌందర్య ఏం కోరిందో తెలుసా?
హీరోయిన్ సౌందర్య.. అప్పటికీ, ఇప్పటికీ ఆమెను అభిమానించేవారి సంఖ్య దండిగానే ఉంది. తనే కనక ఈ రోజు ఉండి ఉంటే ఎన్నో పాత్రలు ప్రాణం పోసుకునేవి, మరెన్నో రికార్డులు తన పేరిట నెలకొల్పేది అని ఫ్యాన్స్ ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే జీవించేసే సౌందర్య నటనకు, ఆమె అందానికి దాసోహం కానివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి హీరోయిన్స్‌లా మితిమీరిన గ్లామర్ షో చేయకుండా హద్దుల్లోనే అందాలు ఆరబోస్తూ సాంప్రదాయ దుస్తుల్లోనే ఎక్కువగా కనిపిస్తూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. ఎంతో కెరీర్ ఉన్న ఆమె 31 ఏళ్ల వయసులో జరిగిన అనుకోని ప్రమాదంలో శాశ్వతంగా కన్నుమూసింది. ఆమె మరణించిన 19 ఏళ్ల తర్వాత తాజాగా ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. సౌందర్య చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఓ కోరిక కోరిందట. ఎయిర్‌పోర్టుకు వెళ్లేముందు తన వదినను కాటన్ చీర, కుంకుమ తీసుకురమ్మని అడిగిందట.! అప్పుడు తన దగ్గర కాటన్ చీర లేకపోవడంతో ఒకటి కొని తీసుకురమ్మని కోరిందట. అప్పటికే ఆమె బీజేపీలో చేరడంతో ఆ చీర కట్టుకుని ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకుంది సౌందర్య. తనకు కుంకుమ ధరించడం అలవాటు, కాబట్టి దాన్ని కూడా తెమ్మని చెప్పింది. కానీ ఇంతలోనే సమయం కావస్తోందని విమానం ఎక్కేయడం, అది కూలిపోవడంతో సౌందర్య అక్కడికక్కడే మరణించడం తెలిసిందే! తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది సౌందర్య వదిన. ఇకపోతే 2004 ఏప్రిల్ 17న సౌందర్య తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మేమ్ ఫేమస్ సినిమా కెమెరాల ముందు 30 సెకన్ల పాటు లిప్‌లాక్.. బుర్ర పని చేస్తుందా? -
సౌందర్య చనిపోతుందని ఆమె తండ్రికి ముందే తెలుసా?
హీరోయిన్ సౌందర్య.. తెలుగు సినీ పరిశ్రమలో ఈమె పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సౌందర్య కూడా ఒకరు. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సౌందర్య తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తిండిపోతుంది. చక్కటి చీరకట్టులో, నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిలా నటించి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. గ్లామర్ షో చేయకుండానే చీరకట్టులోనే కనిపించి అగ్రకథానాయిగా చక్రం తిప్పిన సౌందర్య అనుకోని ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.ఆమె మరణించి 19 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఆమె రూపం అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగానే ఉంది. నిజానికి సౌందర్యను డాక్టార్ను చేయాలని ఆమె తండ్రి కలలు కన్నాడట. కానీ కూతురి జాతకంలో సినీ నటి అవుతుందని ఉందట. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో డాక్టర్ కావాల్సిన సౌందర్య నటిగా అరంగేట్రం చేసింది. ఇక సౌందర్య తండ్రి సజాత్యనారాయణకు జాతకలపై మంచి పట్టు ఉండేదట. తఓ సందర్భంలో ఓ డైరెక్టర్ చిట్టిబాబుతో మాట్లాడుతున్న ఆయన.. సౌందర్య గురించి మాట్లాడుతూ.. నా కూతురి జాతకం ప్రకారం.. ఆమె దక్షణాదిలో టాప్ హీరోలందరితో పనిచేసిన అగ్రనటిగా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంటుంది. కానీ 2004లో ఆమె సినీ కెరీర్ ముగుస్తుంది అని చెప్పాడట. అయితే ఆ మాటలు విని బహుశా పెళ్లి చేసుకొని కాస్త గ్యాప్ తీసుకుంటుందేమో అనుకున్నాం..కానీ ఇలా జీవితమే ముగుస్తుందని ఊహించలేదు అంటూ చిట్టిబాబు అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. -
ఎంతో అందంగా ఉండే సౌందర్యను అలా చూడలేకపోయా : ప్రేమ
హీరోయిన్ ప్రేమ పేరు వినగానే మొదటగా దేవి సినిమానే గుర్తుకొస్తుంది. నిజానికి ఆమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా స్టార్డమ్ సంపాదించుకుంది. కన్నడ, తెలుగు, మలయాళ సినిమాలతో తనకంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ప్రేమ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. 2017లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఒకటి, రెండు సినిమాల్లో కనిపించిన ఆమె మళ్లీ స్క్రీన్కు దూరమయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్న ప్రేమ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి, విడాకులు, కెరీర్.. ఇలా పలు విషయాలపై ఓపెన్ అయ్యింది. ఈ క్రమంలో దివంగత నటి సౌందర్య మరణాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. ''సౌందర్య చనిపోయిన రోజు.. ఇంతేనా జీవితం అనిపించింది. చివరి చూపు కోసం వాళ్ల ఇంటికి వెళ్లాను. సౌందర్య, ఆమె సోదరుడు డెడ్‌బాడీలను బాక్స్‌లో పెట్టి ఉంచారు. చూడటానికి ఫేస్ కూడా లేదు. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది. మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ, గౌరవం మాత్రమే. సౌందర్య చేతికి పెట్టుకున్న గడియారాన్ని బట్టి అది సౌందర్య డెడ్‌బాడీ అని గుర్తించారు. అందంగా కనిపించడానికి సౌందర్య ఎంతో ఇష్టపడేవారు.షూటింగ్లో షాట్ గ్యాప్‌లో కూడా ఎప్పటికప్పుడు టచప్ చేసుకుంటూ అన్నీ పర్ఫెక్ట్ లా ఉండాలని అనుకునేవారు. అలాంటిది చివరి రోజుల్లో ఆమె ముఖం కూడా లేదు. అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది'' అంటూ ప్రేమ పేర్కొంది. -
సౌందర్య బదులు నేను చనిపోయినా బాగుండేదనుకున్నా: ఆమని
సీనియర్ నటి ఆమని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం పరిచయం అక్కర్లేని పేరు. 'జంబలకిడిపంబ’ ,‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’ వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఆమని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో తల్లి, అత్త పాత్రల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక దివంగత హీరోయిన్ సౌందర్యకు ఆమని బెస్ట్‌ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె సౌందర్యపై తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టింది. 'సౌందర్య చనిపోయింది అని విన్నప్పుడు నా గుండె ముక్కలైపోయింది. దేవుడ్ని చాలా తిట్టుకున్నా. ఆమె స్థానంలో నేను చనిపోయినా బాగుండేది అని అనుకున్నాను. ఎందుకంటే, అప్పటికి నాకు పిల్లలు లేరు.. జీవితం చూసేశాను. సౌందర్యకు అప్పుడే పెళ్లయి ఏడాదే అయ్యింది. అప్పుడప్పుడే లైఫ్ స్టార్ట్ చేసింది. అందుకే ఆమె స్థానంలో నేను పోయినా బాగుండు అనుకున్నాను. ఇక యాక్సిడెంట్ సమయానికి సౌందర్యప్రెగ్నెంట్ అని వార్తలు రాశారు. కానీ అందులో నిజం లేదని స్వయంగా సౌందర్య అమ్మ చెప్పింది. ఒకనొక సమయంలో సౌందర్య అన్నయ్య అమర్‌ను పెళ్లి చేసుకోవాలనే ప్రపోజల్ వచ్చింది. కానీ అప్పటికీ నా ఫోకస్ అంతా కేవలం సినిమాలపైనే ఉండేది. ఒకవేళ అమర్‌ని పెళ్లి చేసుకుంటే, ఎలాగూ సౌందర్య కూడా వెళ్తోందిగా నేను వస్తాను అని ఫ్లైట్ ఎక్కేదాన్ని లేదా అతని జ్ఞాపకాలతో మిగిలిపోయేదాన్నేమో. అంతా విధి. ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది' అంటూ చెప్పుకొచ్చారు. -
ఒకే ఒక్క సినిమా.. విలనిజంతో భయపెట్టిన హీరోయిన్లు
హీరోయిన్గా కెరీర్‌ని ప్లాన్ చేసుకోవడం ఎంత కష్టమో… కంటిన్యూ చేయడం కూడా అంతే కష్టం. అందులోనూ అసలు హీరోయిన్ లైఫ్ స్పాన్ ఐదారేళ్లు. అంతకు మించి కష్టం. ఇలా అన్ని వైపుల నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన కెరీర్ అది. అలాంటిది…ఇంకా హీరో యిన్‌గా కంటిన్యూ అవుతూనే విలనిజం వైపు ఒక లుక్ వేయడం అంటే చిన్న విషయం కాదు. సాహసమనే చెప్పాలి. ఇలాంటి సాహసాలు చేసి శభాష్ అనిపించుకునే తారమణులూ ఉన్నారు. అటు గ్లామర్ పాత్రల్లోనూ, ఇటు ఫెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లోనూ సత్తా చాటిన నటి రమ్య కృష్ణ. చంద్రలేఖలో కోమాలో ఉన్నపేషెంట్ పాత్ర నుంచి, బాహుబలిలో శివగామి దాకా అద్భుతంగా చేసిన క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. కానీ… నరసింహాలో నీలాంబరి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. ఫుల్ నెగిటివ్ రోల్ క్యారెక్టర్ అది. పైగా రజినీకాంత్‌తో ఢీ అంటే ఢీ అనే పాత్ర. ఆ క్యారెక్టర్లో రమ్యకృష్ణ జీవించింది. నరసింహ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. ఆ సక్సెస్‌లో రజినీకాంత్‌తో సమాన వాటా రమ్యకృష్ణది కూడా. నీలాంబరి అన్న పేరుకే ఒక సీరియస్ అటెన్షన్ ఇచ్చేసింది తన నటనతో. చాలా కాలం పాటు ఆ పేరు బ్రాండ్‌గా నిలిచింది. టాలీవుడ్లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని ఎంజాయ్ చేసిన అతి తక్కువ హీరోయిన్స్‌లో సౌందర్య ఒకరు. తెలుగులో టాప్ హీరోలందరితోనూ సౌందర్య నటించింది. అటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది సౌందర్య. హీరోయిన్గా కెరీర్ కొనసాగు తున్న సమయంలోనే… నెగిటివ్ రోల్ ప్లే చేసింది సౌందర్య. నా మనసిస్తా రా చిత్రంలో శ్రీకాంత్ , రిచా హీరో, హీరోయిన్లుగా నటిస్తే…విలన్‌గా సౌందర్య యాక్ట్ చేసింది. నెగిటివ్ రోల్ లోనూ మంచి మార్కులను కొట్టేసింది. మహేశ్ బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో విలన్‌గా గోపిచంద్ నటించారు. దేవుడు పాత్రలో గోపిచంద్ ప్రదర్శించిన విలనీజం అప్పట్లో పెద్ద సంచలనమైంది. గోపిచంద్‌తో పాటుగా ఉంటూ అతను చేసే ప్రతి పనికి సహకరిస్తూ ఉంటుంది రాశి. హీరోయిన్ పాత్రల నుంచి లేడీ విలన్ క్యారెక్టర్లోకి రాశి జంప్ చేయడంపై కాస్త డిస్కషన్ కూడా సాగింది. మల్లి పాత్రలో గ్లామర్‌కు క్రూరత్వం మిక్స్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది రాశి. -
Tollywood Actresses: వెండితెరపై నారీమణుల విశ్వరూపం
సినిమాని తీసే తీరులో మార్పొచ్చింది. చూసే విధానంలోనూ ఛేంజ్ కనిపిస్తోంది. బడ్జెట్ పెరిగింది. క్రియేటివిటీ పెరిగింది. టెక్నాలజీ పెరిగింది. కానీ హీరోయిన్ని గ్లామర్ డాల్‌గా చూసే పద్ధతిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఎప్పుడో ఒకసారి నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ దొరుకుతుంది. అప్పుడు వాళ్లు తమ విశ్వరూపం చూపిస్తే దశాబ్దాల పాటు ఆ నటనని ప్రేక్షకులు గుర్తు చేసుకుని మరీ ఆనందిస్తారు. అభినందిస్తారు. ఫెర్ఫా మెన్స్ స్కో ప్ ఉన్న క్యారెక్టర్ దొరికితే అదరహో అనేలా ఆ పాత్రకి జీవం పోసిన హీరోయిన్స్‌ని ఒకసారి చూసేద్దామా? అందం అభినయం. ఇవి రెండు కలిస్తే శ్రీదేవే. గ్లామర్ యాంగిల్లో శ్రీదేవికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో యాక్టింగ్ పరంగా అంతకు మించిన పేరుంది. అయినానిజానికి నటనపరంగా తన సామర్థ్యాన్ని చూపించే అవకాశం చాలా సినిమాల్లో శ్రీదేవికి లభించింది. అయితే... వసంత కోకిల చిత్రంలో పోషించిన విజయ పాత్ర శ్రీదేవి నటజీవితంలోనే మైలు రాయి. ఆరు ఏళ్ల వయ స్సు పిల్ల మైండ్‌లో ఉన్న ఇరవై ఏళ్ల యువతిగా అద్భుతంగా నటించింది శ్రీదేవి. హోమ్లీ క్యారెక్టర్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే నటి సౌందర్య. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటూ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అతి తక్కువ కథానాయికల్లో సౌందర్య ఒకరు. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న చాలా పాత్రల్లో సౌందర్య నటించారు. కానీ అంతఃపురంలో భానుమతి క్యారెక్టర్ మాత్రం నిజంగానే ఛాలెంజింగ్ క్యారెక్టర్. కానీ అక్కడ ఉన్నది సౌందర్య. ఇక చెప్పేదేముంది వెండితెర మీద విశ్వరూపమే చూపించింది. అటు గ్లామర్ పాత్రల్లోనూ, ఇటు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లోనూ సత్తా చాటిన నటి రమ్య కృష్ణ. చంద్రలేఖలో కోమాలో ఉన్న పేషెంట్ పాత్ర నుంచి, బాహుబలిలో శివగామి దాకా అద్భు తంగా చేసిన క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. కానీనరసింహాలో నీలాంబరి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. గర్వం, పొగరు ఉన్న జమీందారు కూతురు పాత్రలో జీవించేసింది రమ్యకృష్ణ. తనదైన నటనతో నీలాంబరి అన్న పేరుకే ఒక సీరియస్ అటెన్షన్ ఇచ్చేసింది. ఛాలెంజింగ్ పాత్రల గురించి చెప్పుకునేటప్పుడు మంచు లక్ష్మీ పేరుని మిస్ అవడానికి వీల్లేదు కదా. గుండెల్లో గోదారి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాల్లో మంచు లక్ష్మీ పెర్ఫామెన్స్ అందరి ప్రశంసలు అందుకుంది. గుండెల్లో గోదారి చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. గోదావరి యాసలో డైలాగ్‌ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రంలో ముసలమ్మగా డీగ్లామరైజ్ రోల్ బాగా యాక్ట్ చేసింది. చదవండి: నవరాత్రులు - సినిమాల్లో నారీమణులు: హీరోయినే.. హీరో -
సౌందర్యతో అలాంటి రిలేషన్ ఉండేది, అసలు విషయం చెప్పిన జగ్గూభాయ్
లెజెండరి నటుడు జగపతి బాబుకు పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ హీరోలకు విలన్‌గా నటిస్తూ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ‘మావిడాకులు, శుభలగ్నం, సర్దుకుపోదాం రండి, ఫ్యామిలీ సర్కస్’ కుటుంబ కథా చిత్రాలతో జగపతి బాబు ఎంతో గుర్తింపు పొందారు. అయితే అప్పట్లో జగపతి బాబు, దివంగత నటి సౌందర్యలది హిట్ పెయిర్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్ని మంచి విజయం సాధించాయి. చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్‌ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ దాదాపు తెరపై భార్యభర్తలుగా నటించిన వీరిద్దరిపై అప్పట్లో రూమర్స్ కూడా బాగానే వచ్చేవి. అయితే సౌందర్య పెళ్లి అనంతరం వాటికి చెక్ పడింది. కానీ పెళ్లికి ముందు మాత్రం వీరిద్దరి పెయిర్, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చూసి సౌందర్య, జగపతి బాబు మధ్య ఏదో స్పెషల్ బాండింగ్ ఉందంటూ అప్పట్లో అందరూ చెవులు కొరుక్కునేవారు. అంతేకాదు తరచూ సౌందర్య ఇంటికి జగపతి బాబు, ఆయన తన ఇంటికి వెళ్లడం చూసి వారిద్దరి రిలేషన్ గురించి పుకార్లు షికారు చేస్తుండేవనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న జగపతి బాబుకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ఆయన స్పందిస్తూ.. తనకు, సౌందర్యకు మధ్య రిలేషన్ ఉన్నమాట నిజమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదవండి: తారక్ వల్లే నా పెళ్లి జరిగింది: ప్రముఖ నిర్మాత కూతురు ‘కానీ అది మీరు అనుకున్నది కాదు. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆమె అన్యయ్య కూడా నాకు మంచి ఫ్రెండ్. సౌందర్య వ్యక్తిగతంగా చాలా మంచి అమ్మాయి. మేము మాత్రమే కాదు మా ఫ్యామిలీలు కూడా చాలా క్లోజ్. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా కుటుంబ సమేతంగా హాజరయ్యేవాళ్లం. ఈ క్రమంలో సౌందర్య తరచూ మా ఇంటికి వస్తుండేవారు. నేను వాళ్ల ఇంటికి వెళ్తుండేవాడిని. అది చూసి జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. సౌందర్య అలాంటిది కాదు. మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని వచ్చిన వార్తలు నేను కూడా విన్నా. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదు’ అంటూ ఆయన వివరించారు. కాగా ప్రస్తుతం జగపతి బాబు ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆ హీరోయిన్ బయోపిక్‌లో నటించాలని నా కోరిక: రష్మిక
ప్రతీ ఒక్కరికీ ఓ కల ఉంటుంది అలానే తనకంటూ ఓ కల ఉందని అంటోంది శాండిల్‌వుడ్ బ్యూటీ రష్మిక మందన. తెలుగుతెరపై అగ్రనటిగా ఎదిగిన దివంగత నటి సౌందర్య బయోపిక్‌లో నటించడం తన కోరికని తెలిపింది రష్మిక. కర్ణాటకలో జన్మించిన సౌందర్య తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలంపాటు తన హవా కొనసాగించిన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందింది. ఇటీవల బాలీవుడ్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సౌందర్య తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ నటి అని రష్మిక పేర్కొంది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్‌లు తాజా ట్రెండ్ అని ఈ తరుణంలో తనకి అవకాశం వస్తే సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉందని, అది తన కోరిక కూడా అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తనకు స్ఫూర్తి అని రష్మిక పేర్కొన్నారు. రష్మిక 'మిషన్ మజ్ను' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. ప్రస్తుతం ఈ నటి తెలుగు, హిందీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. వరుసగా హీందిలో ఆఫర్ల రావడంతో ఈ ముద్దు గుమ్మ తన మకాంను ముంబైకి మార్చేసింది. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో తెరకెక్కుతోన్న ‘పుష్ఫ’లో కథానాయికగా నటిస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సౌందర్య బయోపిక్ గురించి చర్చ నడుస్తూనే ఉంది. సౌందర్యకు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఎందుకో ఈమె బయోపిక్‌కి అడుగులు ముందు పడడం లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు కూడా సౌందర్య సొంతం చేసుకుంది. చదవండి: Bigg Boss 5 Telugu: దీప్తి సునయన స్థానంపై కన్నేసిన హమీదా, షణ్నూకు ఆఫర్ -
సౌందర్య ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బంగ్లా ఇప్పుడెలా ఉందంటే!
సౌందర్య... తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. ఆమె పేరు తలుచుకోగానే చక్కటి చీరకట్టులో ఓ అందమైన రూపం కళ్లముందు కదులుతుంది. ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లు వచ్చినా సౌందర్య చాలా ప్రత్యేకం. చనిపోయే వరకు ఎక్స్పోజింగ్, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ఆమె ఈ లోకాన్ని విడిచి 17 ఏళ్లవుతున్నాఇప్పటికీ ఆమెను మరిచిపోలేని అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతలా తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఆమె. ఏ పాత్రలో అయినా ఓదిగిపోయే సౌందర్య తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. చనిపోయేనాటికి సౌందర్య వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. వివాహం జరిగి ఏడాది కూడా కాకుండానే సౌందర్య మరణం ఆమె అభిమానులను ఎంతగానో కలిచివేసింది. కాగా కెరీర్ చివర్లో సంచలన సినిమాలు చేసిన సౌందర్య జీవితంలో ఎన్నో చెప్పుకొదగ్గ ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆమె బతికున్న రోజుల్లో తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలో మెడికల్ కాలేజీతో పాటు స్కూల్స్ ను స్థాపించి ఉచిత విద్యను అందించి గొప్ప మనసు చాటుకున్నారు. 2004లో జరిగిన ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడూ మరణించడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. వారు లేకపోయిన ఇప్పటికీ ఆ స్కూల్స్‌కు సౌందర్య కుటుంబం ఆర్థిక సాయం చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి లెక్కల ప్రకారం సౌందర్యకు 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గతంలో ఆమె కుటుంబ సభ్యులే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల నటి ఆమని కూడా ఓ ఇంటర్వ్యూలో సౌందర్య ఆస్తుల గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో సౌందర్య తనకు మంచి సన్నిహితురాలని, తామిద్దరం ప్రాణ స్నేహితులుగా ఉండేవారమని ఆమె చెప్పారు. సౌందర్య చనిపోయిన విషయం తాను నమ్మలేకపోయానని.. అయితే సౌందర్య మరణించిన కొన్నాళ్ళకు బెంగళూరులోని ఆమె బంగ్లాకు వెళ్లినట్లు ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. ‘సౌందర్య ఉన్నపుడే ఆ బంగ్లాను ఎంతో ఇష్టపడి కొనుక్కుంది. తను బతికున్నపుడు బంగ్లా దేదీప్యమానంగా వెలిగిపోయేది. కానీ ఇప్పుడు అది ఓ బూత్ బంగ్లా మారిపోయింది’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సౌందర్య మరణించిన అనంతరం కొన్నాళ్లకు ఆ బంగ్లాకు తాను వెళ్లానని, అక్కడ ఎవరూ లేరని ఆమని పేర్కొన్నారు. కొద్ది రోజుల కిందటి వరకు సౌందర్య తల్లి అక్కడ ఉండేవారని, తనని కలుద్దామని అక్కడి వెళ్లేసరి ఇప్పుడు అక్కడ ఎవరూ లేరని, ఆ బంగ్లా పూర్తిగా పాతబడిపోయి చూడటానికి బూత్ బంగ్లాలా కనిపించినట్లు ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా సౌందర్య పేరుతో బయోపిక్ వస్తుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ కోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెతో పాటు నిత్యా మీనన్ పేరు కూడా వినిపిస్తోంది. -
కోరిక తీరిస్తే ఎంత డబ్బైనా ఇస్తానంటూ నటికి లెక్చరర్ వేధింపులు
సోషల్ మీడియాలో హీరోయిన్లకు వేధింపులు తప్పడం లేదు. ఎన్ని సార్లు బ్లాక్ చేసినా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ తమ సైకోయిజాన్ని ప్రదర్శిస్తుంటారు. బాడీ షేమింగ్ చేస్తూ అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్లు దూషిస్తారు. ఇలాంటి వాటిని కనీసం పట్టించుకోకుండా లైట్ తీసుకునేవాళ్లు కొందరైతే, మరికొందరు మాత్రం వాళ్లకు బుద్ది వచ్చేలా గట్టి సమాధానమే ఇస్తారు. తాజాగా కోలీవుడ్ నటి సౌందర్య నందకుమార్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తనను తాను లెక్చరర్‌గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి ఆమెకు అసభ్యంగా మెసేజ్‌లు పెట్టాడు. తనతో ఓ రాత్రి గడపాలని ఇందుకోసం ఎంత డబ్బు అడిగినా ఇస్తానంటూ తన నీచత్వాన్ని బయటపెట్టాడు. ఇది చూసిన సౌందర్య అతడికి స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చింది. సదరు ఇన్స్టాగ్రామ్ ఖాతాను నెట్టింట రివీల్ చేసింది. అతడిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి కటకటాల పాటు చేస్తానని గట్టి కౌంటర్ ఇచ్చింది. ఎలా అయినా అతడికి బుద్ది చెబుతానని పేర్కొంది. ఈ సందర్భంగా కాలేజీలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి నీచమైన వ్యక్తులు కూడా లెక్చరర్ రూపంలో ఉంటారని హెచ్చరించింది. ఇక సింగర్‌గా కెరీర్ మొదలు పెట్టిన సౌందర్య ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్, టీవీ సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లోనూ తన అదృష్టాన్ని ప్రదర్శించుకుంది. తాజాగా విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోనూ ప్రముఖ పాత్ర పోషించింది. చదవండి : అనుమానాస్పద స్థితిలో ప్రముఖ నటుడి భార్య మృతి.. బాల్యం నుంచి వేధింపులు, మీ స్ఫూర్తితో ధైర్యం చేశా: నెటిజన్ -
ఆ కారణంతో సినిమాలు మానేద్దామనుకున్న సౌందర్య
సౌందర్య... తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. ఆమె పేరు తలుచుకోగానే చక్కటి చీరకట్టులో ఓ అందమైన రూపం కళ్లముందు కదులుతుంది. ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లు వచ్చినా సౌందర్య చాలా ప్రత్యేకం. చనిపోయే వరకు ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ చనిపోయే వరకు నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగింది. సౌందర్య మరణించి 17 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఆమెను మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. నేడు సౌందర్య వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ.. ఏ పాత్రలో అయినా ఓదిగిపోయే సౌందర్య తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. బెంగుళూరులో జన్మించిన సౌందర్య అసలు పేరు సౌమ్య. అయితే సినిమాలోకి వచ్చేముందు సౌందర్యగా పేరు మార్చుకుంది. సౌందర్య తండ్రి సత్యనారాయణ పలు కన్నడ చిత్రాలకు నిర్మాతగా, రచయితగా పనిచేశారు. 1992లో 'గంధర్వ' అనే కన్నడ చిత్రంతో సౌందర్య సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో రైతు భారతం సినిమా చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు మంచి గుర్తింపును ఇచ్చాయి. సౌందర్య, వెంకటేష్ పెయిర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. వీరిద్దరు జంటగా నటించిన ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం, రాజా, జయం మనదేరా వంటి సినిమాలో బాక్సాఫీస్ వద్ద బంపర్‌హిట్‌గా నిలిచాయి. పవిత్ర బంధంలో సౌందర్య నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్లో సౌందర్య నటించిన తొలి చిత్రం సూర్యవంశ్. మొదటి సినిమాతోనే అమితాబ్ బచ్చన్ సరసన నటించి మెప్పించింది. దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించిన ఘనత సౌందర్యది. ఒకవైపు.. రమ్యకృష్ణ, మీనా లాంటి స్టార్ హీరోయిన్లు తమ అందాలను బయటపెడుతూ గట్టి పోటీ ఇచ్చినా.. సౌందర్య మాత్రం కేవలం చీరకట్టులో తెరపై కనిపించి మెప్పించింది. సౌందర్య నిర్మించిన తొలి చిత్రం ద్వీపకు జాతీయ పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు దక్కాయి. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన సౌందర్యకు దర్శకత్వం వహించాలని చాలా కోరిక ఉండేది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ ఇంటరర్వ్యూలో చెప్పారు. కానీ ఆ కల తీరకుండానే హెలీకాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె చనిపోయే నటికి ఆమె వయసు 31 సంవత్సరాలే అంతేకాకుండా ఆ సమయంలో రెండు నెలల గర్భవతి కావడంతో ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుందట. అంతలోనే దారుణం జరిగి సౌందర్య మనల్ని విడిచి వెళ్లిపోయింది. ఇక ఆమె సౌందర్య నటించిన చివరి చిత్రం నర్తన శాల. ఈ సినిమాకు బాలయ్య దర్శకత్వం వహించారు. చదవండి : అందుకే సౌందర్య ఎక్స్పోజింగ్ చేయలేదు : ఆమని -
అందుకే సౌందర్య ఎక్స్పోజింగ్ చేయలేదు : ఆమని
సౌందర్య.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు ఇది. ఈ పేరు వినబడగానే చీరకట్టులో ఓ అందమైన యువతి రూపం కళ్లముందు కదులుతుంది. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న ఈ మహానటి.. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ చనిపోయే వరకు నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగింది. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది. మరణించి 17 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఆమెను మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. దానికి కారణం ఆమె ఆందం కాదు కేవలం నటన మాత్రమే. ఎలాంటి గ్లామర్ ఎక్స్పోజింగ్ ఇవ్వకుండా.. కేవలం యాక్టింగ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకుంది సౌందర్య. ఒకవైపు.. రమ్యకృష్ణ, మీనా లాంటి స్టార్ హీరోయిన్లు తమ అందాలను బయటపెడుతూ గట్టి పోటీ ఇచ్చినా.. సౌందర్య మాత్రం కేవలం చీరకట్టులో తెరపై కనిపించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందల చిత్రాల్లో నటించిన సౌందర్య ఎక్స్‌పోజింగ్‌కు ఎందుకు దూరంగా ఉందో ఆమె స్నేహితురాలు, సీనియర్ నటి ఆమని ఇటీవల వెల్లడించింది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా..’. ఈ మూవీలో ఆమని కీలక పాత్రలో నటించింది. మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్యూ ఇచ్చిన ఆమని.. సౌందర్యతో తనకు ఉన్న అనుబంధం, ఆమె ఎక్స్పోజింగ్ ఎందుకు చేయలేదనే విషయాన్ని తెలిపింది. ‘ఒకసారి ఇద్దరమే షూటింగ్లో ఉన్నపుడు.. ఎక్స్పోజింగ్ గురించి అడిగాను. వెంటనే.. ఎందుకే ఎక్స్పోజ్ చేయాలి? రేపు పెళ్లై భర్త పక్కనే ఉన్నపుడు మన సినిమాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మన ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది? డబ్బుల కోసం ఇలా చేస్తే రేపు ఎలా? అని తిరిగి తననే ప్రశ్నించేదని ఆమని చెప్పుకొచ్చింది. ఒక నియమం పెట్టుకొని ఎక్స్‌పోజింగ్‌కు సౌందర్య దూరంగా ఉందని, అందులో తప్పులేదని ఆమెని తెలిపింది. చదవండి: వరుణ్ పెళ్లిపై నాగబాబు కామెంట్.. ఆ అమ్మాయి అయినా ఓకేనట జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు -
తెరపైకి సౌందర్య జీవితం
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సౌందర్య. 1992 నుంచి 2004 వరకు బిజీ హీరోయిన్గా ఉన్న ఆమె తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 2004 ఏప్రిల్ 17న హెలీకాప్టర్ ప్రమాదంలో సౌందర్య మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె బయోపిక్ తెరకెక్కనుందని టాక్. మలయాళ సినిమా ఇండస్ట్రీలోని ఒక బడా నిర్మాణ సంస్థ సౌందర్య బయోపిక్‌ని సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సౌందర్య బయోపిక్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆమె పాత్రకు సాయిపల్లవిని సంప్రదించినట్లు టాక్. ఎందరో ప్రేక్షకులు ముఖ్యంగా మహిళల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సౌందర్య లాంటి మంచి నటి పాత్ర చేసే అవకాశం వస్తే సాయి పల్లవి చేయకుండా ఉంటారా? చేస్తారనే ఊహించవచ్చు. -
‘అనసూయ’గా వంటలక్క అత్తమ్మ!
‘కేరాఫ్ అనసూయ’తో మరో పవర్ఫుల్ పాత్ర ద్వారా ‘స్టార్ మా’ ప్రేక్షకుల ముంగిటకొస్తున్నారు అర్చన అనంత్. కార్తీకదీపం సీరియల్లో వంటలక్క దీపకు అత్తమ్మ సౌందర్యగా తెలుగు లోగిళ్లలో సుపరిచితమైన వ్యక్తి అర్చన అనంత్. ఐపీఎల్‌ను మించిన క్రేజ్ కార్తీకదీపం సీరియల్‌కు తెలుగునాట ఉన్నా సీరియల్లో అత్తమ్మగా తప్ప వ్యక్తిగతంగా అర్చన గురించి తెలిసింది అతి కొద్దిమందికి మాత్రమే! ఫ్యాషన్ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడిన అర్చన ఇప్పుడు నటిగా మాత్రం విశ్వరూపం చూపుతున్నారు. కార్తీకదీపంలో తనదైన నటనతో ప్రతి హృదయాన్నీ తట్టిలేపిన ఆమె ఇప్పుడు కేరాఫ్ అనసూయ అంటూ ‘స్టార్ మా ’ ఛానెల్లో అక్టోబర్ 12వ తేదీ నుంచి మధ్యాహ్నం 2గంటలకు తెలుగు లోగిళ్లను పలుకరించబోతున్నారు. నటనా రంగం వైపు మళ్లడం దగ్గర నుంచి అనసూయగా తాను చేయబోయే పాత్ర వరకూ అనేక అంశాలను ‘సాక్షి’ తో ముచ్చటించారు. అలా మొదలైంది.. డాక్టర్ కాబోయి యాక్టర్ అని చాలామంది అంటుంటారు కానీ, దానికి భిన్నం అర్చన కెరీర్ ప్రయాణం. అసలు తానెన్నడూ నటి కావాలని అనుకోలేదనే అంటుంటారామె. నటిగా మారడానికి గల కారణాలను ఆమె చెబుతూ ‘‘ఫ్యాషన్ డిజైనర్‌గా చేస్తున్నవేళ, తన సహచరులు ఓ కన్నడ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వమని కోరడం జరిగింది. సరే, అడిగారు కదా అని వెళ్లి ఆడిషన్లో పాల్గొన్నాను. ఆ తరువాత నటించే అవకాశం వచ్చింది. చెబితే మీరు నవ్వుతారు కానీ, నా తొలి పాత్ర ఓ శవంలా పడుకోవడం. నో డైలాగ్స్... నో ఎక్స్ప్రెషన్స్. అదీ ఓ షార్ట్‌ఫిలిం కోసం! ఆ చిత్ర కెమెరామెన్ మా నాన్నకు స్నేహితులు కావడంతో నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను. ఆయన అయితే ఏం లేదు.. మీరు శవంలా పడుకుంటే చాలన్నారు. అలాగే పడుకున్నాను.. అదిగో అలా నా నటనా ప్రయాణం ప్రారంభమైంది’’ అని చెప్పుకొచ్చారు. సినీ కుటుంబమే కానీ.. అర్చన కుటుంబ నేపథ్యం సినిమానే. నాన్న కన్నడ సినిమాలో పేరున్న నటులు అనంత వేలు. తమ ఇంట్లో సినిమా వాతావరణమే ఉండేది కానీ తనకు దానిమీద ఆసక్తి మాత్రం పెద్దగా ఉండేది కాదు. నాన్న చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. తన పరపతి ఉపయోగించి తనన్ను ఎక్కడా రికమెండ్ చేయలేదాయన అని వెల్లడించిన అర్చన... అన్నట్లు తమ నాన్నే తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. కల నెరవేర్చుకోవడానికి పదేళ్లు పట్టింది.. నటిగా మారిన తరువాత తెలుగు వినోద పరిశ్రమలోకి రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు అర్చన. నిజానికి తన తొలి ప్రాజెక్ట్ కన్నడ అని చెప్పిన ఆమె కన్నడ, తమిళ, మలయాళ భాషలలో బిజీగా మారిన తరువాతనే తెలుగుకు రావడం జరిగిందన్నారు. తాను ఓ తెలుగు ప్రాజెక్ట్ కోసం వచ్చి తమిళ ప్రాజెక్ట్‌కు ఎంపికయ్యానని, అలాగే మలయాళంలో కూడా చేశానన్న ఆమె నటిగా మారిన పదేళ్లకు కానీ తెలుగులో తనకు అవకాశం లభించలేదన్నారు. కార్తీకదీపంలో సౌందర్య క్యారెక్టర్ కోసమే తనకు ఇన్నేళ్లూ అవకాశం లభించలేదేమోనని అప్పుడప్పుడూ అనిపిస్తుందంటూ కార్తీకదీపంలో ఆ పాత్ర లభించడం తన అదృష్టమన్నారు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్‌కు అభిమానులున్నారిప్పుడు. తనను సౌందర్యగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తిస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ క్యారెక్టర్లో ఇమిడిపోవడానికి తన నిజ జీవిత సంఘటనలు కూడా కారణమంటూ తన అమ్మ తమతో ప్రవర్తించే రీతిలోనే.. దీపతో సౌందర్య ఆ సీరియల్లో ప్రవర్తిస్తుందన్నారు. ఇకపై అనసూయ అనే అంటారు..? ‘కేరాఫ్ అనసూయ’ తెలుగులో తాను చేస్తోన్న తాజా సీరియల్ అని చెప్పారు అర్చన. సౌందర్య క్యారెక్టర్లాగానే అనసూయ క్యారెక్టర్ తనకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనసూయ క్యారెక్టరైజేషన్ గురించి ఆమె వెల్లడిస్తూ మనందరికీ డబ్బు పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడపాలనే కోరికా ఉంటుంది. దానికోసం ఒకొక్కరూ ఒక్కోలా శ్రమిస్తారు. పేదింటి పిల్ల అయిన అనసూయ కూడా అంతే ! డబ్బున్న వ్యక్తిని పెళ్లాడితే తాను కోరుకున్న జీవితం వస్తుందని అలాగే చేస్తుంది. అంతేకాదు, తాను అనుభవిస్తున్నట్లుగానే విలాసవంతమైన జీవితం తన కుమార్తెలు కూడా అనుభవించాలనుకుని ఆ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో జరిగే సంఘటనలే ‘కేరాఫ్ అనసూయ’. ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే క్యారెక్టర్ ఇది. ‘స్టార్‌మా’ లోనే తాజా సీరియల్ వస్తుండటం, అదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రతి గృహిణినీ కదలించబోతుండటం పట్ల ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇకపై మీ మీ అత్తమ్మ... అనసూయగా మారుతుండటాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారనే నమ్ముతున్నాను. కార్తీకదీపం లాగానే స్ట్రాంగ్ క్యారెక్టర్‌తో సినీ రంగానికి... కన్నడంలో ఇప్పటికే మూడు చిత్రాలు చేశాను. కానీ తెలుగులో ఓ బలీయమైన క్యారెక్టర్‌తో రావాలని కోరుకుంటున్నాను. అదీ ఓ పవర్ఫుల్ పోలీసాఫీర్‌గా కనిపించాలనుకుంటున్నాను. అలాగే ‘దాసీ’ క్యారెక్టర్లో కూడా నటించాలనుకుంటున్నాను. టీవీ, సినిమా రెండూ వైవిధ్యమైన మాధ్యమాలు. రెండూ గొప్పవే అని అన్నారు. సహజసిద్ధంగా నటన ఉండాలనేది తన భావన అన్న అర్చన, కళ్లతోనే నటించడమే తన దృష్టిలో అసలైన నటనగా వెల్లడించారు. చక్కటి అవకాశం వస్తే ఓటీటీలలో కూడా చేయడానికి అభ్యంతరం లేదన్నారామె. -
భవిష్యత్తులో పెదరాయుడు సీక్వెల్
‘‘ఓసారి ర జనీకాంత్ ఫోన్ చేస్తే ఇంటికెళ్లాను. ‘తమిళంలో ‘నాట్టామై’ సినిమా హిట్ అయింది. రీమేక్ హక్కులు మాకు కావాలని చెబుతాను.. నువ్వు సినిమా చూసి నిర్ణయం చెప్పు’ అన్నాడు. సినిమా చూశా.. చాలా బాగుంది, హక్కులు కావాలని రజనీకి చెప్పాను. ‘నిర్మాత ఆర్బీ చౌదరిగారితో మాట్లాడాను నువ్వు వెళ్లి మాట్లాడు’ అన్నాడు. నేను కలవగానే, ‘రజనీగారు చెప్పాక కాదనేది ఏముంది.. ఇస్తాను’ అన్నారు ఆర్బీ చౌదరిగారు’’ అని మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు, రజనీకాంత్, భానుప్రియ, సౌందర్య ప్రధాన పాత్రల్లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదరాయుడు’. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటికి 25ఏళ్లు(1995 జూన్ 15) అవుతోంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు సాక్షితో పంచుకున్న విశేషాలు... ► ‘నాట్టామై’ రీమేక్ హక్కులు తీసుకున్నాక రజనీతో ‘రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహిస్తారు.. అన్ని పాత్రలు కుదిరాయి. పాపారాయుడు పాత్ర కుదరలేదురా’ అన్నాను. ‘నువ్వు ఆలోచించేది ఏంట్రా.. ఆ పాత్ర నేను చేస్తున్నాను’ అన్నాడు. ‘నువ్వేంట్రా! అది అతిథి పాత్ర.. పైగా నువ్వు నాకు తండ్రి వేషం వేయడమేంటి?’ అనగానే.. ‘అవును రా.. ఆ పాత్ర అద్భుతంగా ఉంటుంది, నేను చేయాలనుకునే నీకు చెప్పాను.. చేస్తాను’ అన్నాడు. ఈ విషయం రవిరాజాకి చెప్పగానే ఆశ్చర్యపోయాడు. ► ‘పెదరాయుడు’ చిత్రానికి అన్న ఎన్టీఆర్‌గారు క్లాప్ ఇచ్చారు. తొలి షాట్లో రజనీకాంత్‌కి నేను పూలమాల వేయాలి.. ఎందుకంటే తండ్రి కాబట్టి. నేను పూలమాల సగం వేయగానే వాడు దాన్ని అందుకుని నాకు వేసి కాళ్లకు దండం పెట్టాడు.. ‘నేను దండం పెట్టింది నీ మంచి మనసుకు.. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది’ అన్నాడు రజనీ. ► ‘పెదరాయుడు’కి ముందు నాకు రెండు మూడు పరాజయాలు ఎదురయ్యాయి. అది రజనీకాంత్ ఎలా తెలుసుకున్నాడో. వాడు రాజమండ్రికి వచ్చినప్పుడు మిత్రుడు కదా అని నేను వెళ్లాను.. ఇద్దరం కలిసి కారులో హోటల్‌కి వెళ్లాం.. ‘ఇది తీసుకోరా’ అన్నాడు.. చూస్తే 45లక్షలు ఉంది. ‘ఎందుకురా?’ అని అడిగా. ‘నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని నాకు తెలుసు, ‘పెదరాయుడు’ మంచి విజయం సాధిస్తుంది.. విడుదల తర్వాత నాకు ఇవ్వరా’ అన్నాడు.. నిజంగా వాడు గొప్ప మనిషి. ► ‘పెదరాయుడు’ సినిమాలో మంచి విషయం ఉంది. నటీనటులందరూ బాగా సహకరించారు. సినిమా విడుదలై అప్పుడే 25 ఏళ్లయిందా అనిపిస్తోంది. నేను, రజనీకాంత్, భానుప్రియ, బ్రహ్మానందం, బాబూమోహన్, డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి, సంగీత దర్శకుడు కోటి కలిసి ఘనంగా ఓ వేడుక చేద్దామనిపించింది. దురదృష్టం ఏంటంటే తొలి క్లాప్ కొట్టిన అన్నయ్య (ఎన్టీఆర్) లేరు. సౌందర్య, కెమెరామేన్ కేఎస్ ప్రకాశ్‌రావు లేరు. కరోనా నేపథ్యంలో గెట్ టు గెదర్ లాంటివి ఉండొద్దు కాబట్టి వేడుక చేయడం లేదు.. లేకుంటే చేసేవాణ్ణి. ► కొన్నేళ్ల తర్వాత ఏముందిలే.. ఇంకా ఏం చూస్తాం అని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, నా విషయంలో అది జరగలేదు. నేను ఇంకా ఏదైనా మంచి పాత్ర చేస్తే చూడాలని ఆశిస్తున్నారు. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజుకీ కొన్ని పాత్రలకు అడుగుతుంటే నేనే వద్దనుకుంటున్నాను.. కొన్ని పాత్రలు నచ్చడం లేదు. నేను కానీ చేస్తే ఏడాదిలో 365 రోజులూ బిజీగానే ఉంటాను. నా జీవితంలో జరిగిందంతా భగవంతుని ఆశీస్సులు, ప్రకృతి వల్లే. ‘మనం విర్రవీగకూడదు.. అహంకారం తలకెక్కకూడదు.. మనిషి మనిషిగా బతకాలి’అనేవి మరచిపోకూడదు. ► ఓ అందమైన కుటుంబ కథ తయారు చేశాం. ‘పెదరాయుడు’ సినిమాలా మంచి నటీనటులుంటారు. ఆ సినిమా వివరాలు త్వరలో చెబుతా. సినిమాల్లో అయినా, రాజకీయమైనా భగవంతుని ఆశీస్సుల వల్లే రాణించగలం. రాజకీయాల్లో రాణించాలంటే బ్రహ్మాండంగా పనిచేయాలి. సినిమాల్లో నటించాలంటే బ్రహ్మాండంగా నటన తెలిసి ఉండాలి. అక్కడా ఇక్కడా విజయం అన్నది ఒక్కటే అయినా.. సినిమాలు మాత్రం కొంచెం అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలోనూ హిట్ కావాలనే రూల్ లేదు.. ఇదంతా కాకతాళీయమే.. భగవంతుని ఆశీస్సులే. ► ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనాని ఎవరు పంపించారు? ఇదేమైనా ప్రపంచయుద్ధమా? 82లక్షల జీవరాసుల తర్వాత మనుషులం పుట్టామని అంటారు. మనిషి జన్మ అనేది గొప్పది. ఈ జన్మని మనం మరచిపోయి అహంకారంతో విర్రవీగుతున్నాం. అందుకే కన్నూమిన్నూ కానరాకుండా ప్రవర్తిస్తున్నారురా మనుషుల్లారా అని దేవుడు కరోనా రూపంలో ఓ దెబ్బ కొట్టాడు. ఇది ఎప్పటికి ఏమవుతుందో తెలియదు. తలనొప్పి, కలరా, మలేరియా, టైఫాయిడ్.. వీటికి మందులు వచ్చాయి. కానీ, కరోనాకి ఇప్పటికి విరుగుడు మందు అయితే లేదు. ‘పెదరాయుడు’ని రీమేక్ చేయాలనుకుంటే మీరు, విష్ణు, మనోజ్.. చేసే అవకాశం ఉంటుందా? ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం అసాధ్యం అనుకుంటున్నా. భవిష్యత్తులో విష్ణు, మనోజ్‌కి సీక్వెల్ చేసే అవకాశం ఉండొచ్చేమో. అయితే ఆ రోజుకీ, ఈ రోజుకీ ‘పెదరాయుడు’ అనేది చరిత్ర మరచిపోలేని సినిమా. ఆ సినిమా ఒక చరిత్ర. -
సౌందర్య జ్ఞాపకార్థం పాఠశాల
బెంగళూరు,యశవంతపుర: బహుబాషా నటి సౌందర్య విమాన ప్రమాదంలో శాశ్వతంగా దూరమై 15 ఏళ్లు. ఆమె నటనా ప్రతిభా పటిమ సజీవంగా ఉంది.ఆమె జన్మించిన ఊరు కోలారు జిల్లా బంగారుపేట తాలూ కా గంజిగుంట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆమె జ్ణాపకార్థం తరగతి గదులను నిర్మించింది. సత్యనారాయణ, మంజుళ దంపతులకు జన్మించిన ఆమె అసలు పేరు సౌమ్య. ఒకటవ తరగతి నుండి గంజిగుంట గ్రామంలోనే చదివారు. బెంగళూరుకు వచ్చి 16 ఏళ్ల పాటు సినిమా రంగంలో ఉంటూ కన్నడ, తమిళ, తెలుగు బాషల్లో 107 సినిమాలలో నటించారు. చిన్న వయస్సు నుండి సంగీతం, నాట్యం, నాటకాలపై అసక్తిని పెంచుకోని సినిమా రంగంలోకి వచ్చి తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. తమిళ నటుడు రజనీకాంత్, తెలుగు నటుడు చిరంజీవి, కన్నడ నటుడు రవీచంద్రన్ సరసన నటించారు. 2004 ఏప్రిల్ 17న తన సోదరుడు అమరనాథ్‌తో కలిసి ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రత్యేక విమానంలో జక్కూరు విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొన్ని క్షణాలకే విమానం కూలి మరణించారు. -
నరసింహ పంచ్‌లు రజనీ రాసిన వేళ
‘నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు’... ‘నరసింహ’ సినిమాలో రజనీకాంత్ చెప్పిన ఈ పంచ్ డైలాగులు ఇప్పటికీ పాపులరే. ఆ డైలాగులను ఇంకా వాడుతూనే ఉన్నాం. విశేషమేంటంటే ఈ డైలాగులను రాసింది రజనీకాంతే. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పడయప్పా’. (తెలుగులో నరసింహ). శివాజీ గణేశన్, సౌందర్య, రమ్యకృష్ణ, అబ్బాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 10వ తేదీతో ఈ సినిమా రిలీజ్ అయి 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు కేయస్ రవికుమార్ ఓ ఇంగ్లీష్ పత్రికతో సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నారు. ► సినిమాలో ఫీమేల్ విలన్ (నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ) ఉండాలన్నది స్వయంగా రజనీకాంత్ ఆలోచనే. రజనీకాంత్ పొలిటికల్ స్టాండ్ ప్రకారం ఆ ఫీమేల్ విలన్ పాత్ర అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి రూపొందించినది. ఒకర్ని ఉద్దేశించి రూపొందించిన పాత్ర అయినప్పటికీ అన్ని రాష్ట్రాల వాళ్లు ఎంజాయ్ చేసేంత బలమైన కథ అయ్యుండాలని చెప్పారు రజనీ. ► నీలాంబరి పాత్ర కోసం మొదట మీనా, నగ్మా పేర్లను అనుకున్నాం. కానీ ఎందుకో వాళ్లు సూట్ కారనిపించింది. ఆ తర్వాత డిస్కషన్స్‌లో రమ్యకృష్ణ పేరు వచ్చింది. ఆమె అయితే కరెక్ట్ అనుకుని, స్క్రీన్ టెస్ట్ కూడా చేయకుండానే ఫిక్స్ చేశాం. తన పాత్రకు నీలాంబరి అనే పేరుని కూడా రజనీయే సూచించారు. ► మొదట నీలాంబరి పాత్ర కోసం అనుకున్న మీనా వసుంధర పాత్రకు అయితే బావుంటుందనుకున్నాం. ఆ సమయంలో ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో రజనీకాంత్‌తో అప్పటికే ‘అరుణాచలం’లో నటించిన సౌందర్యనే హీరోయిన్గా తీసుకున్నాం. ► ‘నా దారి రహదారి, పోరా.. ఆ దేవుడే నా వైపు ఉన్నాడు, అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు’.. ఈ మూడు ఫేమస్ పంచ్ డైలాగులను రజనీకాంతే స్వయంగా రాసుకున్నారు. మేం స్క్రిప్ట్ తయారు చేసే ఆలోచనల్లో ఉంటే రజనీకాంత్ డైలాగ్స్ గురించి ఆలోచించేవారు. ► సినిమాలో రమ్యకృష్ణ వాడిన రెక్కలు విచ్చుకునే కారు నాదే. స్క్రిప్ట్ డిస్కషన్స్ అప్పుడు నా కార్లో రజనీ, నేను తిరిగేవాళ్లం. ఈ కారు అయితే నీలాంబరి క్యారెక్టర్‌కు బాగా సూట్ అవుతుందని రజనీ తన అభిప్రాయం చెప్పారు. అదే సినిమాలో ఉపయోగించాం. ► సినిమా పూర్తయ్యేసరికి కంటెంట్ 19 రీళ్లు వచ్చింది. రెండు ఇంటర్వెల్స్ ఇచ్చేలా సినిమా రిలీజ్ ప్లాన్ చేద్దాం అన్నది రజనీకాంత్ ఆలోచన. అప్పట్లో కమల్‌హాసన్ ‘భారతీయుడు’ సినిమాకు ఇదే ప్రాబ్లమ్. కమల్‌ను సలహా అడిగితే బావుంటుందని ఆయన్ను సంప్రదించాం. 14 రీళ్లకు సినిమాను కుదించండి అని ఆయన కూడా అనడంతో చాలా పోర్షన్ ఎడిట్ చేసేశాం. ఇప్పుడంటే డిజిటల్ అయిపోయింది. అప్పుడు ఫిల్మ్ కాబట్టి మిగిలిన భాగమంతా వృథా అయిపోయింది. . ► నీలాంబరి, నరసింహను 18 ఏళ్ల తర్వాత కలిసే సందర్భం అది. నరసింహను నిలబెట్టి తాను కుర్చీలో కూర్చుని అవమానించాలని నీలాంబరి భావిస్తుంది. నరసింహ తన స్టైల్లో అక్కడున్న కుర్చీ లాక్కొని కూర్చుంటాడు. ఇదీ సన్నివేశం. లొకేషన్‌కు వెళ్లి చూస్తే కుర్చీ లాగేంత చోటు లేదక్కడ. లక్కీగా ఊయల ఉండటంతో ఆ ఊయలను పైనుంచి కిందకు లాగి కూర్చునే సన్నివేశంగా మార్చాం. ► ‘నరసింహ’æ షూటింగ్ సమయంలో రజనీకాంత్ తరచూ వ్యాయామం చేస్తుండేవారు. కాస్ట్యూమ్స్ చేంజ్ సమయంలో రజనీకాంత్ ఫిట్ బాడీని గమనించాను నేను. రజనీ బాడీ చూపించే సన్నివేశం ఉంటే బావుంటుంది అనుకున్నాను. ఈ విషయం రజనీకు చెప్పడంతో రజనీ ఇంకా శ్రమించి ఎక్సర్సైజ్ చేశారు. ఆ సీన్లో ‘వాట్ ఏ మ్యాన్’ అనే డైలాగ్ అబ్బాస్‌తో చెప్పించాను. ‘నరసింహ’ గురించి రవికుమార్ చెప్పిన విషయాలు బాగున్నాయి కదూ. ఈ సినిమా తర్వాత రజనీతో ‘లింగా’ సినిమా డైరెక్ట్ చేశారు కేయస్ రవికుమార్. రజనీని మరోసారి డైరెక్ట్ చేయనున్నారట. ప్రస్తుతం రజనీ చేస్తున్న ‘దర్బార్’ తర్వాత రవికుమార్ కాంబినేషన్లో ఆయన సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని చెన్నై టాక్. -
ఇక్కడికొస్తూనే.. నేలరాలిన సౌందర్యం
ఎన్నికలనగానే గుర్తుకొచ్చేది ఆర్భాటపు ప్రచారం.. సినీ గ్లామర్. అలాంటి సినీ సౌందర్యం హెలికాప్టర్ ప్రమాదంలో సజీవంగా కాలిపోయిన ఘటన సినీ ప్రపంచాన్ని కలిచివేసింది. తెలుగు సినీ ప్రపంచంలో టాప్ హీరోయిన్గా వెలుగొందిన సౌందర్య పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వస్తూ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. 15 ఏళ్ల క్రితం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడీ సంగతెందుకంటే.. ఆమె అప్పట్లో కరీంనగర్ లోక్‌సభ స్థానంలో జరిగే ప్రచారానికి వస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది. కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల ప్రచారానికి సౌందర్య రావాల్సి ఉంది. 2004 ఏప్రిల్ 17న బెంగళూరు నుంచి సౌందర్య హెలికాప్టర్లో బయల్దేరారు. కొద్దిసేపటికే బెంగళూరు శివారులోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సౌందర్య దుర్మరణం చెందారు. వాస్తవానికి ఆమె ఆ రోజు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రోడ్‌షోలో పాల్గొనాల్సి ఉంది. అనంతరం 4.30 గంటలకు ఎల్లారెడ్డిపేటలో రోడ్‌షోలో పాల్గొనాలి. సాయంత్రం 5.30 గంటలకు సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం చేయాలి. అదే రోజు రాత్రి 7 గంటలకు కరీంనగర్ సర్కార్ గ్రౌండ్లో జరిగే బహిరంగసభలో సౌందర్య ప్రసంగించాల్సి ఉంది. కానీ, ఆమె అందుకోసం బయల్దేరుతూనే ప్రాణాలొదిలారు. దీంతో అప్పటి ఎన్నికల ప్రచార సభలు కాస్తా కరీంనగర్ జిల్లాలో సంతాపసభలుగా మారిపోయాయి. నాటి సంగతులను ఇప్పటికీ ఇక్కడ ప్రజలు గుర్తుచేసుకుంటుంటారు. ఇక, ఆ లోక్‌సభ ఎన్నికల్లో చెన్నమనేని విద్యాసాగర్‌రావు టీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. – వూరడి మల్లికార్జున్, సాక్షి– సిరిసిల్ల -
స్క్రీన్ టెస్ట్
1. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మరోచరిత్ర’ సినిమాలో కమల్‌హాసన్ సరసన నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) సరిత బి) జయప్రద సి) సుమలత డి) రేవతి 2. ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హీరో సిద్ధార్థ్‌కు తల్లిగా నటించిన ప్రముఖ నటి ఎవరు? ఎ) జయసుధ బి) శారద సి) గీత డి) కవిత 3. ఈ ఏడాది ఆగస్ట్ 27వ తేదీతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిరంజీవి సినిమా ఏంటో తెలుసా? ఎ) కొదమ సింహం బి) కొండవీటి దొంగ సి) మాస్టర్డి) చూడాలని వుంది 4. ‘అల్లరి మొగుడు’ చిత్రంలో హీరో మోహన్‌బాబు సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. ఒకరు మీనా. రెండో హీరోయిన్ ఎవరు? ఎ) వాణీ విశ్వనాథ్ బి) శోభన సి) దివ్యభారతి డి) రమ్యకృష్ణ 5. నటుడు చంద్రమోహన్ హీరోగా చేసిన మొదటి చిత్రం ‘రంగుల రాట్నం’. ఆ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించింది ఒక్కరే. ఎవరా దర్శక–నిర్మాత? ఎ) బి.ఎన్. రెడ్డి బి) కె.వి. రెడ్డి సి) హెచ్.యం. రెడ్డి డి) ఆదుర్తి సుబ్బారావు 6. ‘జిల్’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు రాధాకృష్ణ. ఆయన తదుపరి చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ఎ) ప్రభాస్ బి) నాగార్జున సి) నాని డి) వెంకటేశ్ 7. ‘ఏ మాయ చేశావే’ చిత్రంలో చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేసిన నటుడు ఎవరు? ఎ) సుధీర్ బాబు బి) సందీప్ కిషన్ సి) వరుణ్ సందేశ్ డి) నిఖిల్ 8. ఇప్పటివరకు తెలుగులో 5 పాటలు పాడారు ఈ హీరో. ఆయన పాడిన అన్ని పాటలూ ప్రజాదరణ పొందాయి. ఆ టాప్ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) రామ్‌చరణ్ బి) రానా సి) నాగచైతన్య డి) యన్టీఆర్ 9. ‘శుభలగ్నం’ చిత్రంలో భర్తను కోటి రూపాయలకు అమ్మేసే క్యారెక్టర్లో నటించన నటి ఎవరు? ఎ) రోజా బి) ఆమని సి) భూమిక డి) సౌందర్య 10. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నర్తించిన నటి ఎవరో తెలుసా? ఎ) తమన్నా బి) జెనీలియాసి) సమీరా రెడ్డి డి) హన్సిక 11. ‘యమహా నగరి కలకత్తా పురీ.. నమహో హుబ్లీ హౌరా వారధీ...’ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) భువనచంద్ర బి) వేటూరి సి) సుద్దాల అశోక్ తేజ డి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి 1.2 శ్రీదేవి సోదరి మహేశ్వరి నటించిన హిట్ చిత్రం ‘పెళ్లి’. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కోడి రామకృష్ణ బి) పి. వాసు సి) బి. గోపాల్ డి) ముత్యాల సుబ్బయ్య 13. వెంకటేశ్, వరుణ్‌తేజ్ ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) అనిల్ రావిపూడి బి) బాబీ సి) సంకల్ప్ రెడ్డి డి) సందీప్ రెడ్డి 14. ‘రేసుగుర్రం’ చిత్రంలోని ‘సినిమా సూపిత్త మామా... నీకు సినిమా సూపిత్త మామా.. సీను సీనుకి నీతో సీటీ కొట్టిస్త మామా...’ పాటను పాడిందెవరు? ఎ) అనుదీప్ బి) రేవంత్ సి) సింహా డి) హేమచంద్ర 15. ‘నర్తనశాల’ చిత్రంలో ద్రౌపదిగా నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) సావిత్రి బి) వాణిశ్రీ సి) జయలలిత డి) అంజలీదేవి 16. రామ్‌చరణ్ నటించిన ‘ధృవ’ చిత్రానికి సంగీత దర్శకుడు? ఎ) యస్.యస్. తమన్ బి) హిప్ హాప్ తమిళ సి) యువన్ శంకర్‌రాజా డి) దేవిశ్రీ ప్రసాద్ 17. దర్శకుడు సురేందర్ రెడ్డి తన కెరీర్లో ఇద్దరు హీరోలతో రెండు చిత్రాలకు పని చేశారు. కానీ ఓ హీరోయిన్‌కు మాత్రం రెండు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. ఎవరా హీరోయిన్? ఎ) అమృతా రావు బి) ఇలియానా సి) శ్రుతీహాసన్ డి) రకుల్ ప్రీత్ సింగ్ 18. ‘బిగ్ బాస్2’ తెలుగు రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా నాని చేస్తున్నారు. మరి తమిళ ‘బిగ్ బాస్’ కి హోస్ట్‌గా ఏ హీరో చేస్తున్నారు? ఎ) విజయ్ బి) ధనుష్ సి) కమల్‌హాసన్ డి) శింబు 19. కృష్ణంరాజు, శ్రీదేవి నటించిన ఈ స్టిల్ ఏ సినిమా లోనిది? ఎ) త్రిశూలం బి) బాబులు గాడి దెబ్బ సి) బొబ్బిలి బ్రహ్మన్న డి) కటకటాల రుద్రయ్య 20. ఈ క్రింది ఫొటోలోని బాల నటుడు ఇప్పుడొక పెద్ద నటుడు చెప్పగలరా? ఎ) కమల్‌హాసన్ బి) హరీశ్ సి) రమేశ్‌బాబు డి) హరికృష్ణ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) ఎ 3) డి 4) డి 5) ఎ 6) ఎ 7) ఎ 8) డి 9) బి 10) సి 11) బి 12) ఎ 13) ఎ 14) సి 15) ఎ 16) బి 17) డి 18) సి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
స్క్రీన్ టెస్ట్
1. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో లవ్లీగా కనిపించిన ఈ బ్యూటీ తెలుగులో అరంగేట్రం చేసి, ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించారు. ఎవరామె? ఎ) తమన్నా బి) క్యాథరిన్ సి) ఇలియానా డి) లావణ్య త్రిపాఠి 2. భారతీయ చలనచిత్ర రంగం గర్వించదగ్గ దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయన దర్శకుడవ్వక ముందు ఏ శాఖలో పనిచేశారో తెలుసా? ఎ) ఆడియోగ్రఫీ బి) ఎడిటింగ్ సి) కెమెరా డిపార్ట్మెంట్ డి) ఆర్ట్ డిపార్ట్మెంట్ 3. ‘షేక్ మోజెస్ మూర్తి’ పేరు భలే తమాషాగా ఉంది కదూ. 1972లో విడుదలైన ‘మల్లె పందిరి’ సినిమాలో ఈ పేరుతో ఉన్న క్యారెక్టర్‌ను పోషించిన గాయకుడెవరో తెలుసా? ఎ) ఎస్పీ బాలు బి) రామకృష్ణ సి) ఘంటసాల డి) ఇళయరాజా 4. కథానాయిక సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో ఏ నటుని సరసన నటిస్తున్నారు? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నాని డి) సందీప్ కిషన్ 5. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఓ సినిమాలో హీరో ‘అల్లరి నరేశ్’ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నరేశ్ ఏ హీరోతో కలిసి నటిస్తున్నారో తెలుసా? ఎ) రామ్ చరణ్ బి) అల్లు అర్జున్ సి) మహేశ్ బాబు డి) వెంకటేశ్ 6. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అరంగేట్రం చేసిన ‘అల్లుడు శీను’ చిత్రదర్శకుడెవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) వీవీ వినాయక్ బి) శ్రీను వైట్ల సి) బోయపాటి శ్రీను డి) శ్రీవాసు 7. 1998లో మోహన్‌బాబు నటించిన ‘రాయుడు’ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన నటì ఎవరో తెలుసా? 2001లోనే ఆమె చనిపోయారు? ఎ) దివ్యభారతి బి) ప్రత్యూష సి) సౌందర్య డి) భార్గవి 8. ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున సరసన నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) శ్రియ శరన్ బి) త్రిష సి) సోనాలి బింద్రే డి) రవీనా టాండన్ 9. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే’... అనే పాటతో Ðð లుగులోకి వచ్చిన హాట్ గర్ల్ ఎవరో తెలుసా? ఎ) హంసా నందిని బి) ర మ్యశ్రీ సి) అభినయశ్రీ డి) ముమైత్ ఖాన్ 10. ‘గులాబి’ చిత్రదర్శకుడు కృష్ణవంశీ. ఆ చిత్రనిర్మాత ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) కృష్ణవంశీ బి) జేడీ చక్రవర్తి సి) రామ్‌గోపాల్ వర్మ డి) సురేశ్ బాబు 11. శ్రీదేవి చెల్లెలిగా హీరోయిన్ మహేశ్వరి అందరికీ పరిచయమే. ఆమెను సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) భారతీరాజా బి) కోడి రామకృష్ణ సి) బాలచందర్ డి) కె. రాఘవేంద్రరావు 12. రజనీకాంత్ నటించిన ‘కొచ్చాడియాన్’ చిత్రంలో ఆయన సరసన నటించిన బాలీవుడ్ భామ ఎవరో కనుక్కోండి? ఎ) ఐశ్వర్యారాయ్ బి) సోనాక్షి సిన్హా సి) దీపికా పదుకోన్ డి) అమీ జాక్సన్ 13. ‘‘క్యారెక్టర్ వదిలేయటం అంటే ప్రాణాలు వదిలేయటమే, చావు రాక ముందు చచ్చిపోవటమే’’... అనే డైలాగ్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలోనిది. రచయితెవరో తెలుసా? ఎ) వంశీ పైడిపల్లి బి) వక్కంతం వంశీ సి) అబ్బూరి రవి డి) కోన వెంకట్ 14 ‘దారి చూడు దుమ్ము చూడు మామా.. దున్నపోతుల భేరే చూడు’ అనే పాటను పాడిందెవరో తెలుసా? ఎ) అనుదీప్ బి) హేమచంద్ర సి) హిప్ హాప్ తమిళ డి) పెంచల్ దాస్ 15. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, అక్కినేని మనవరాలు సుప్రియ ఇద్దరికీ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఆ చిత్ర దర్శకుడెవరు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) ఈదర వీర వెంకట సత్యనారాయణ సి) ఎ. కోదండ రామిరెడ్డి డి) యస్.జె. సూర్య 16. ‘100 పర్సెంట్ లవ్’ సినిమాలో ‘ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్’ అనే పాటను హమ్ చేసింది సింగర్ కాదు. ఆమె ఓ నటి. ఎవరామె? ఎ) కలర్స్ స్వాతి బి) రాశీ ఖన్నా సి) తమన్నా భాటియా డి) అనుపమా పరమేశ్వరన్ 17. తెలుగు అగ్ర హీరోల్లో ఓ హీరో ఇప్పుడు సౌదీలో షూటింగ్ జరుపుకుంటున్నారు. నెలకుపైగా అక్కడే షూటింగ్లో ఉన్న ఆ హీరో ఎవరు? ఎ) ప్రభాస్ బి) ఎన్టీఆర్ సి) రామ్ డి) వరుణ్‌తేజ్ 18. ‘జంబలకడి పంబ’ అనే సినిమా 1993లో విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పటి సినిమాలో హీరో నరేశ్, ఇప్పుడు అదే పేరుతో తయారైన ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) ‘వెన్నెల’ కిశోర్ బి) ‘షకలక’ శంకర్ సి) ధన్‌రాజ్ డి) శ్రీనివాసరెడ్డి 19. ఈ కింది ఫొటోలోని బాలీవుడ్ హీరో ఎవరో చెప్పండి? ఎ) సల్మాన్‌ఖాన్ బి) షారుక్ ఖాన్ సి) ఆమిర్ ఖాన్ డి) సైఫ్అలీ ఖాన్ 20. ఈ ఫొటోలో మేకప్ చేసుకుంటున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) విజయశాంతి బి) భానుప్రియ సి) సుహాసిని డి) జయప్రద మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (ఎ) 4) (బి) 5) (సి) 6) (ఎ) 7) (బి) 8) (సి) 9) (డి) 10) (సి) 11) (ఎ) 12) (సి) 13) (బి) 14) (డి) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (డి) 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
జాతీయ శిబిరంలో రజని, సౌందర్య
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మహిళల ప్రపంచ కప్‌నకు ముందు హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రత్యేక జాతీయ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ నెల 28 నుంచి జూన్ 9 వరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించే ఈ శిబిరం కోసం హాకీ ఇండియా 48 మంది సీనియర్ క్రీడాకారిణుల పేర్లను శనివారం ఎంపిక చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ ఎతిమరపు రజని, తెలంగాణ ఫార్వర్డ్ ప్లేయర్ యెండల సౌందర్య కూడా ఉన్నారు. ఇటీవల ముగిసిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత మహిళల హాకీ జట్టు తిరిగి సోమవారం నుంచి శిబిరంలో పాల్గొననుంది. చీఫ్ కోచ్ జోయర్డ్ మరీనే నేతృత్వంలో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ‘ఫిట్నెస్ ప్రమాణాలు పెంచుకునేందుకు ఈ క్యాంప్‌ను వినియోగించుకుంటాం. దీంతో పాటు మానసికంగా ఇంకా ధృడంగా మారేందుకు కృషిచేస్తాం’ అని కోచ్ తెలిపారు. -
మరో బయోపిక్కు సన్నాహాలు?
తమిళసినిమా: చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల కాలం నడుస్తోందనిపిస్తోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్ర చిత్రంగా తెరకెక్కి విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. సావిత్రి పాత్రలో నటించిన కీర్తీసురేశ్ ప్రశంసల జడివానలో తడిసి ముద్దవుతోంది. అదేవిధంగా సిల్క్‌స్మిత జీవిత చరిత్ర బాలీవుడ్లో ది దర్టీ పిక్చర్ పేరుతో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఆందులో సిల్క్ పాత్రలో నటించిన విద్యాబాలన్ జాతీయ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం సావిత్రి పాత్రలో నటించిన కీర్తీసురేశ్‌కు పలు అవార్డులు వరించడం ఖాయం అంటున్నారు సినీ పండితులు. ఇదిలాఉండగా తమిళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎంజీఆర్ బయోగ్రఫీ ఇప్పుడు నిర్మాణంలో ఉంది. అదేవిధంగా జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా నటి సౌందర్య జీవితం వెండితెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. తెలుగు, తమిళం, కన్నడంభాషల్లో కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్న నటి సౌందర్య. ముఖ్యంగా కోలీవుడ్‌లో కమలహాసన్, రజనీకాంత్ వంటి స్టార్స్‌తో నటించారు. టాలీవుడ్లో అందరు ప్రముఖ కథానాయకులతోనూ నటించారు. మంచి ఫామ్‌లో ఉండగానే సౌందర్య హెలి కాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆమె జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు నిర్మాత రాజ్ కందుకూరి సన్నాహాలు చేస్తున్నట్లు సామాజిక మాద్యమాల్లో ప్రచారం జరుగుతోంది. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ చిత్రంలో సౌందర్యగా మారే లక్కీఛాన్స్ ఏ నటికి దక్కుతుందో..! -
వారసురాలు వస్తోంది
వ్యాపారం, వాణిజ్యం, రాజకీయం, సినీరంగం... ప్రస్తుతం అన్నిచోట్లా వారసత్వం ఆనవాయితీగా మారింది. అదే కోవలో ప్రముఖ నటులు రజనీకాంత్ సైతం కొత్తగా పెట్టబోయే రాజకీయపార్టీలో ఆయన చిన్న కుమార్తె సౌందర్యను వారసురాలిగా రంగంలోకి దించబోతున్నట్లు సమాచారం. అలాగే రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్ సైతం మామకు తోడుగా నిలుస్తారని తెలుస్తోంది. దీన్ని ధృవీకరిస్తూ మధురైలో ధనుష్ అభిమానుల పేరుతో ‘అరసియల్ వారిసే’ (రాజకీయ వారసుడా) గురువారం పోస్టర్లు కూడా వెలిశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆకస్మిక మరణం రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ శూన్యతకు దారి తీసింది. ఈ శూన్యాన్ని భర్తీ చేసేందుకు నటుడు కమల్‌హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీని స్థాపించేశారు. అన్నాడీఎంకే బహిష్కృత నే టీటీవీ దినకరన్ సైతం ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే పార్టీని గురువారం ప్రకటించారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని జనవరి ఆరంభంలో రజనీకాంత్ ప్రకటించారు. రెండు కోట్ల సభ్యత్వం లక్ష్యంగా పనులు ప్రారంభించారు. రజనీకాంత్ ప్రజా సంఘాలకు ఇన్‌చార్జ్‌ల నియామకం దాదాపు పూర్తయింది. పార్టీ పేరును ప్రకటించడం మినహా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న దశలో రజనీ హిమాలయాలకు ఆధ్యాత్మిక పర్యటనకు పయనమయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ వెండితెర వారసురాలిగా చిన్న కుమార్తె సౌందర్య స్వీయ దర్శకత్వంలో కొచ్చడయన్ అనే యానిమేషన్ సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఘోరపరాజయం పొంది రజనీ కుటుంబాన్ని అప్పులపాలు చేసిన తరువాత కూడా సినిమారంగంలోనే కొనసాగడంలో వెనకడుగు వేయలేదు. వెండితెర వెనుక తండ్రికి అండగా నిలిచిన ఆమె రాజకీయాల్లో సైతం తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా తన భర్త, నటుడు ధనుష్‌ను తండ్రికి తోడుగా రాజకీయాల్లోకి సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కొందరు ధనుష్ అభిమానులు మధురైలో పోస్టర్లు కూడా వేసేశారు. ధనుష్‌ను రజనీకాంత్ ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న ఫొటోలతో ‘అరసియల్ వారిసే’ (రాజకీయ వారసుడా) అని పోస్టర్లలో నినాదాన్ని రాశారు. కోలీవుడ్‌లో ధనుష్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. పెద్ద ఎత్తున యువత అభిమానాన్ని ఆయన చూరగొన్నాడు. రజనీకాంత్ రాజకీయాలకు ధనుష్ తోడైతే రాజకీయ పార్టీకి మరింత ఊపు ఖాయమని అంచనా వేస్తున్నారు. హిమాలయాల్లోనూ సాధ్యం కాదు సాధారణ వ్యక్తిలా తిరిగేందుకు హిమాలయాలకు వచ్చే నేను ఇకపై ఇక్కడ కూడా అలా తిరగడం సాధ్యం కాదని తెలుసుకున్నట్లు నటులు రజనీకాంత్ చెప్పారు. రిషికేష్‌లోని ధ్యానానంద సరస్వతి ఆశ్రమంలో బుధవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం అక్కడి ఇంగ్లీషు చానల్ ప్రతినిధితో రజనీకాంత్ మాట్లాడారు. ఒక మనిషి తనను తాను తెలుసుకోవడంలోనే జన్మసార్ధకత చేకూరుతుందన్నారు. అందుకే హిమాలయాలకు వచ్చానని, «ధ్యానం చేయడం, ఆధ్యాత్మికపరమైన పుస్తకాలు చదవడం, ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ప్రజలతో కలిసి సంచరించడం కోసమే ఇలాంటి ప్రయాణాలు చేస్తుంటానన్నారు. రాజకీయ పార్టీల నేతలు, సినిమా రంగంలోని వారు నాకు ఇక్కడ అవసరం లేదని, ఇక్కడి ప్రజలు, ప్రకృతి మాత్రమే నాకు చాలునన్నారు. తమిళనాడులో ఇలా సంచరించడం సాధ్యం కాదని, ప్రజల్లో సా«ధారణ వ్యక్తిలా తిరిగే అవకాశాలను ఏనాడో కోల్పోయానని తెలిపారు. ఆ లోటును భర్తీ చేసుకునేందుకే 1995 నుంచీ హిమాలయాలకు వస్తూ స్వేచ్ఛగా తిరిగేవాడినని పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లోకి రావడంతో ఇక్కడ కూడా తిరిగే అవకాశాలు లేవన్నారు. రాజకీయాల్లోకి వచ్చినవారు త్యాగాలకు సిద్ధం కావాలని, తాను సైతం అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆ దేవుడు నటుడిగా ఇచ్చిన పాత్రను సరిగా పోషించానని, ఇక రాజకీయ నాయకుడిగా కొత్తపాత్రకు నూరుశాతం న్యాయం చేయగలనని నమ్ముతున్నట్టు తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, త్యాగాలు చేయడం ద్వారా వాటిని నెరవేర్చేందుకు సిద్ధమన్నారు. -
రజనీ పార్టీలోకి ధనుష్, సౌందర్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నటుడు రజనీకాంత్ తమిళనాట కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీలో ఆయన కుటుంబసభ్యులు చేరనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్యతోపాటు పెద్ద కుమార్తె ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్‌లు పార్టీలో చేరతారని సమాచారం. రజనీకాంత్ ప్రస్తుతం హిమాలయాల్లో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. కాగా, రాజకీయాల్లోకి వచ్చిన వారు త్యాగాలకు సిద్ధం కావాలని, తాను సైతం అందుకు సిద్ధంగా ఉన్నానని రజనీకాంత్ అన్నారు. రిషీకేశ్‌లో ఓ ఇంగ్లిష్ చానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ‘రాజకీయ నాయకుడిగా కొత్త పాత్రను దేవుడిచ్చాడు. ఈ పాత్రకూ 100 శాతం న్యాయం చేయగలను’ అని చెప్పారు. -
మంచి ప్రేమకథ
మనోజ్ నందం, సౌందర్య జంటగా నటించిన చిత్రం ‘ఎక్కడ నా ప్రేమ’. ఏఎండీ హుస్సేన్ దర్శకత్వంలో గాయత్రీ సినీ క్రియేషన్స్ సమర్పణలో ఎస్. రామకృష్ణ, వడ్డే గోపాల్ నిర్మించారు. ఘనశ్యామ్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎస్. రామకృష్ణ, వడ్డే గోపాల్ మాట్లాడుతూ– ‘‘రెండు తరాల వ్యక్తిత్వాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం. ప్రేమే జీవితంగా బతికే యువత నిర్ణయాలు, పిల్లల బాగు కోసం తపించే తల్లిదండ్రుల ఆరాటాలు కథలో ప్రధాన అంశాలు. స్వేచ్ఛ కోరుకునే యువతరం, అనుభవాన్ని చూసిన పెద్దలను ప్రతిబింబించేలా పాత్రలుంటాయి. ఆంక్షలు పెట్టిన కుటుంబ సభ్యులను వదిలి వెళ్లిన ఓ అమ్మాయిని కాపాడేందుకు యువకుడు చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. మంచి ప్రేమకథతో సినిమా ఉంటుంది. ప్రేమికుల్లోని ఆకర్షణ, మనస్పర్థలను దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఫిబ్రవరి 22న మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. -
రెండు మూరల పూలు...
ఆ జడలో ఆ పూలు కనిపించి నవ్వుతున్నట్టుగా అనిపించాయి. తెల్లటి పూలు... మధ్యలో పచ్చటి మరువాన్ని పొదవుకొని... వికసించి... జడలో నుంచి రెండు పాయలుగా జారుతూ... సువాసనలీనుతూ... ఆవిడ ఫ్లాట్ డోర్ తీసుకొని లోపలికి వెళ్లిపోయింది. ఆవిడకు స్కూటీ నడపడం తెలుసు. పనులకు స్కూటీ మీదే బజారుకు వెళుతూ ఉంటుంది. వచ్చేటప్పుడు ఎక్కడ పూలు కనిపించినా కొనుక్కొని వస్తూ ఉంటుంది. ఇలా జడలో పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ.. కళకళలాడుతూ... ముచ్చట కలిగిస్తూ... తనక్కూడా పూలంటే ఇష్టం. చాలా ఇష్టం. చాలా పెద్ద ఇష్టం. జడ వైపు చూసుకుంది. ఖాళీగా ఉంది. పెద్ద జడ. పొడవు జడ. నల్లగా మూడు పాయలతో అల్లుకున్న జడ. కాని వెలితి. పూలు లేని వెలితి. చిన్నప్పుడు, కాలేజీ రోజుల్లో పూలు లేకుండా ఏరోజూ లేదు.చిన్నప్పుడు పెరడులో అమ్మ రోజా పూల తోట వేసింది. ముళ్లుంటాయ్ గుచ్చుకుంటాయ్ అని అటువైపు వెళ్లనిచ్చేది కాదు. కాని ప్రతి ఉదయం బడికి వెళుతున్నప్పుడు తప్పనిసరిగా ఒక పువ్వు కోసి జడలో పెట్టేది. క్లాస్‌లో బల్ల మీద కూర్చున్నప్పుడు పక్కన కూర్చునే ఆదిలక్ష్మి మీదకు వాలి మరీ వాసన చూసి ‘చాలా బాగుందే’ అనేది. ఆ పూల సువాసన కోసం తన పక్కన కూర్చోవడానికి పోటీ పడేవారు. టీచర్‌కు తనంటే ఇష్టం. ఎందుకంటే ప్రతి రెండుమూడు రోజులకోసారి అప్పుడే పూసిన ఒక రోజాపువ్వు తెచ్చి ఆమెకు ఇచ్చేది కదా. ఇక కాలేజీ వచ్చే వేళకు వాకిలిలో వేసిన సన్నజాజుల తీవ బాగా ఎదిగి గబురు వేసి ఇంటిని మబ్బులాగా కమ్మేస్తూ ఎన్ని పూలు పూసేదని. ఆ పూలు ఉంటే తీగ మీదైనా ఉండేవి. లేదంటే తన సిగలో ఉండేవి. రెండు జడలు వేసుకుని అర్ధచంద్రాకారంలో సన్నజాజుల మాల గుచ్చుకుని పవిటా పావడతో ఎదకు పుస్తకాలు హత్తుకుని కాలేజీ కారిడార్‌లో నడుస్తూ ఉంటే అబ్బాయిలు పోతే పోయాయి ప్రాణాలు అన్నట్టుగా లెక్చరర్లకు భయపడకుండా వెంట నడిచేవారు. తేరిపార చూసేవారు. మాట కలపడానికి ప్రయత్నించేవారు. పెళ్లి మాత్రం? తన మనసెరిగినట్టు వేసవిలోనే జరగలేదూ. మంటపం నిండా మల్లెలే. మొదటిరాత్రి కూడా మల్లెలే. అతడు గదిలోకి వస్తుండగా మంచానికి జార్చిన ఒక మల్లెమాలను పట్టుకుని ఎంత వయ్యారంగా నిలుచుందని. ఆ మల్లెలే ఆఖరు. ఆ తర్వాత అన్ని మల్లెలు ఎప్పుడూ చూడలేదు. సిటీకి వచ్చేసింది. ఫ్లాట్లలో ఉంటుంది. హౌస్‌వైఫ్. ఎప్పుడైనా బజారుకు అతడే తీసుకువెళతాడు. అతడే తీసుకు వస్తాడు. సినిమాలు ఉన్నాయి. షికార్లు ఉన్నాయి. మనిషి మంచివాడే. కాని మనసు ఎరగడే. ఎప్పుడైనా కాసిన్ని పూలు తీసుకురావచ్చు కదా. అప్పటికి ఒకటి రెండుసార్లు చెప్పి చూసింది– పూలు తెండి అని. తెస్తాలే అన్నాడు. కాని ఒక్కసారీ తేలేదు. అదేమని అడిగితే ‘అలా బజార్లో నిలబడి వేరే ఆడవాళ్లు చూస్తూ ఉండగా పూలు కొనాలంటే నాకు సిగ్గు’ అంటాడు. తను వెళ్లి కొనుక్కోవచ్చు. కాని కొంచెం దూరం వెళ్లాలి. ఇక్కడ దొరకవు. అలా వెళ్లి తన జడ కోసం తానే కొనుక్కోవడం ఏమీ నచ్చదు. అదే అతను తెచ్చిస్తే... పెట్టుకో అని అంటే ఎంత బాగుంటుంది. పూల మీద మనసు లాగింది. బాల్కనీలోకి వెళ్లింది. అక్కడ పూల కోసమే అని రెండు మూడు చేమంతి మొక్కలు, ఒక రోజా మొక్క, ఒక మందారం మొక్క పెట్టింది. కాని చిత్రం– నర్సరీ నుంచి కొనేటప్పుడే వాటికి పూలుంటాయి. తెచ్చి తొట్లలో వేశాక మొక్కలైతే బతుకుతాయి కానీ ఎందుకనో పూలే పూయవు. ఇప్పుడు కూడా పూలు లేవు. జడ బోసిగా ఉంది. ఖాళీగా ఉంది. శూన్యంగా ఉంది– తన మనసులాగే. అతనికి ఫోన్ చేసింది. ‘ఏంటి.. తొందరగా చెప్పు’‘సాయంత్రం వస్తూ వస్తూ..’ ‘వస్తూ వస్తూ’.. ‘పూలు...’ ‘నేను అర్జెంటు మీటింగ్‌లో ఉంటే నీకు పూలు కావాల్సి వచ్చాయా... పెట్టు ఫోను’ పెట్టేసింది. అదిరిపడినట్టుగా కూర్చుంది. గుండె దడ్దడ్ కొట్టుకుంది. ఏడుపు వచ్చింది. ‘ఏమడిగానని. పూలే కదా’ గడ్డకట్టినట్టుగా అయిపోయింది. యాంత్రికంగా వంట వండింది. యాంత్రికంగా తిన్నట్టు నటించింది. నిశ్శబ్దంగా వెళ్లి పడుకుంది. రాత్రి తొమ్మిదయ్యింది. వచ్చాడు. ఇంటి నిశ్శబ్దాన్ని పసిగట్టాడు. ‘అన్నం తిన్నావా?’ అడిగాడు. ‘తన్నులు తింటావా?’ అన్నట్టు వినిపించింది. ఏది ఎంత ముద్దుగా అడగాలో కూడా తెలియదు. ‘ఇప్పుడేమైందని.. లే... రా... టీవీ చూద్దాం’ వెళ్లలేదు. అతడే వెళ్లి ప్లేట్లో పదార్థాలు పెట్టుకొని టీవీ చూస్తూ భోజనం చేశాడు. పళ్లెం పెట్టేశాడు. టీవీ ఆఫ్ చేశాడు. అన్నీ వినపడుతూనే ఉన్నాయి. లోపలికి వచ్చాడు. పక్కన పడుకుని పిలిచాడు. ‘నిద్ర పోయావా?’ ‘ఊహూ’ ‘కోపం వచ్చిందా?’ మౌనంగా ఉంది. పూలు కావాలంటే వెళ్లి తెచ్చుకోవచ్చుగా. నన్నడగాలా పనిగట్టుకొని’ మౌనంగా ఉంది. నాకలా సినిమాల్లో భర్తల్లా పూలు తేవడం అంటే సిగ్గని చెప్పానా లేదా’ ఏమీ మాట్లాడలేదు. కోపం వచ్చింది. ‘ఏయ్... చెప్తుంటే నీక్కాదూ... బుద్ధుందా లేదా?’ అరిచాడు. అదిరిపడింది. ఏడుపు తన్నుకొచ్చింది. అరెరె... ఏడవకు.. ఏడవకు’... నవ్వుతూ దగ్గరకు తీసుకున్నాడు. ఏడుస్తూనే ఉంది. ఏడవకు అన్నానా’ మరింత దగ్గరకు తీసుకున్నాడు. బుగ్గ మీద మెల్లగా తట్టి జుబ్బాలో దాచిన పొట్లాన్ని మెల్లగా తీశాడు. అరిటాకులో చుట్టిన మల్లెపూలు. రెండు మూరల మల్లెపూలు. నేనే పెడతాను ఉండు’ అని వచ్చీ రానట్టుగా అవస్థ పడుతుంటే చేయి వెనుక పెట్టి సాయం పట్టింది. ఎందుకనో కిలకిలా నవ్వు వచ్చింది. నగా నట్రాకు కూడా ఇంత సంతోషపడవు కదా’ పోరా పూలబ్బాయ్’... ముద్దుగా గసిరింది. అవును పూలబ్బాయ్నే. ఇక మీదట రోజూ నీకు పూలబ్బాయ్నే’.. ఆ రాత్రి పూలుపూలుగా ఆ జంటపై రాలుతూనే ఉంది. ప్రియురాలికి మల్లెపూలు... సంసారంలో మల్లెపూల కోసం అలుకలు ఒకలా ఉంటే... సినిమాల్లో మల్లెపూల తంటాలు మరోలా ఉంటాయి. శ్రీరామ్ (వెంకటేశ్), సీత (సౌందర్య)దంపతులకు సంతానం ఉండదు. వంశాభివృద్ధికి వారసులు కావాలని, రెండో వివాహం చేసుకోమని శ్రీరామ్ తండ్రి ఒత్తిడి తెస్తుంటాడు. సీతకు అన్యాయం చేయనని శ్రీరామ్ తెగేసి చెప్తాడు శ్రీరామ్. అయితే ఒకసారి ఆఫీసు పని మీద నేపాల్ వెళ్లిన శ్రీరామ్ అనుకోని పరిస్థితుల వల్ల మనీష (వినిత) అనే యువతిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత శ్రీరామ్– మనీషాలకు సంతానం కలుగుతుంది. ఆ బిడ్డను సీతకు దత్తత ఇచ్చేలా ప్లాన్ చేస్తాడు శ్రీరామ్. మనీష తన బిడ్డను చూసుకోవడానికి భర్త ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. ఇదీ క్లుప్తంగా ‘ఇంట్లో ఇల్లాలు– వంటింట్లో ప్రియురాలు’ సినిమా. శ్రీరామ్ ఓ సారి ప్రియురాలు మనీషకు మల్లెపూలు తీసుకొస్తాడు. సీత చూడకుండా దొంగచాటుగా వంటింట్లో ఉన్న మనీష తల్లో పెట్టాలని చూస్తాడు. కానీ అప్పుడే అక్కడికి సీత వస్తుంది. ‘మల్లెపూలు ఎవరికి తెచ్చారు’ అని శ్రీరామ్‌ని అడుగుతుంది. ‘ఇంకెవరికి నీకేగా’ అంటాడు. ‘పెళ్లై ఇన్నేళ్లైనా ఎప్పుడూ తేలేదు ఇప్పుడేంటి కొత్తగా’ అని కొంటెగా అడుగుతుంది సీత. గవర్నమెంట్ మారిందిగా అందుకే తెచ్చా అని కవర్ చేస్తాడు శ్రీరామ్. ‘అయితే మీరే పెట్టండి’ అంటుంది సీత మురిపెంగా. సీత తల్లో పూలు పెడుతూనే ప్రియురాలి కోసం సగం మల్లెపూలను దాచేస్తాడు శ్రీరామ్. సీత వెళ్లిపోయిన తర్వాత... మనీష దగ్గరకొచ్చి మొత్తం తనకే తెచ్చానని అనుకోకుండా సీతకు సగం ఇవ్వాల్సి వచ్చిందని చెబుతూ తల్లో పూలు పెడతాడు శ్రీరామ్. అప్పుడే అటుగా వచ్చిన శ్రీరామ్ కొడుకు ఆ సన్నివేశాన్ని చూస్తాడు. మల్లెపూలు తెచ్చి నానాతంటాలు పడతాడు శ్రీరామ్. సినిమాలో సంసారం ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి. ఈ మెయిల్: samsaaram2017@gmail.com – కె. సువర్చల -
బావగారూ... బీ కేర్‌ఫుల్!
అసలే బావగారు... పైగా, హిట్ సిన్మాల హీరో. రీసెంట్గా తమిళ సిన్మా ‘పవర్ పాండి’తో డైరెక్టర్‌గానూ దుమ్ము దులిపేశారు. ఇటు చూస్తే మరదలిగారికి డైరెక్టర్‌గా అనుభవం లేదు. తండ్రి రజనీకాంత్ ‘కొచ్చాడియాన్’ని తెరకెక్కించిన అనుభవం మాత్రమే ఉంది. పైగా అది యానిమేషన్ మూవీ. అందుకే బావగారిదే డామినేషన్ అని చాలామంది అనుకుంటారు. పైగా కథ–స్క్రీన్‌ప్లే–డైలాగ్స్ రాసి మరదలి చేతిలో పెట్టి సినిమా తీయమన్నారు. ఇటువంటి సిచ్యుయేషన్స్లో అప్పర్ హ్యాండ్ హీరోగారిదే అనుకోవడం సహజమే కదా. కానీ, ‘విఐపి–2’ సెట్స్‌లో సీన్ కంప్లీట్ రివర్స్‌లో ఉంటుందట! బావగారు ధనుష్ హీరోగా రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘విఐపి 2’. రఘువరన్ ఈజ్ బ్యాక్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు కథ–స్క్రీన్‌ప్లే–డైలాగ్స్ ధనుష్వే అయినా... సెట్లో శివగామి మాత్రం సౌందర్యేనట. సీన్ వివరించిన తర్వాత యాక్టర్స్ అందరికీ ఎలా నటించాలో, కెమెరా ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో సౌందర్య క్లియర్ కట్‌గా చెబుతారట! సో, బావగారు ఎప్పుడూ కేర్‌ఫుల్‌గా ఉండాల్సిందే. ఈ సినిమా షూటింగ్ చివరికొచ్చేసింది. అన్నట్టు... హిందీ హీరోయిన్ కాజోల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్న ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తారట. -
‘పాలిటిక్స్‌లో నాన్న రజనీ టైమింగ్ సూపర్’!
‘నాన్న ఎప్పుడు ఏది సరైందో దానిని తగిన సమయంలో చేశారు. ఇక ముందు కూడా చేస్తారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యులుగా మేం ఆయన వెన్నంటి ఉంటాం. ఆయనకు మద్దతిచ్చి తోడుగా ఉంటాం’ అని ప్రముఖ దక్షిణాది నటుడు రజనీకాంత్ కూతురు సౌందర్య అన్నారు. ఆదివారం ఆమె ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఈ మాటలు చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చే విషయంపై తాను ఇంకా చర్చల్లో ఉన్నానని రజనీకాంత్ చెప్పిన నేపథ్యంలో ఆమె ఈ విధంగా చెప్పారు. గత నెలలో అభిమానులతో ప్రత్యేక భేటీలు అయిన రజనీకాంత్ ఆసందర్బంలో రాజకీయాల్లో చేరే విషయంపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. దైవం కోరితే తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని, ప్రస్తుతం ఆయా రాజకీయ నాయకులతో చర్చల్లో ఉన్నానని చెప్పారు. ‘వారితో సమావేశాలు అవుతున్న విషయాన్ని నేను కాదనలేను. మేమంతా చర్చల్లో ఉన్నాం’ అంటూ ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముంబయిలో ఓ చానెల్‌తో మాట్లాడిన ఆయన కూతురు సౌందర్య నాన్న సరైన సమయంలో సరైన పనిచేస్తారని, ఇప్పటి వరకు అలాగే చేశారని, ఇక ముందు కూడా అలాగే చేస్తారని చెప్పారు. -
అసలు ఆ ఆలోచనే రాలేదు: రజనీ కూతురు
ముంబై: ధనుష్ నటించిన వీఐపీ(రఘువరణ్ బీటెక్) చిత్రం ఎంత విజయం సాధించిందో తెలుసుకదా. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన వీఐపీ-2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం సాయంత్రం వీఐపీ-2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకురాలు సౌందర్యను పాత్రికేయులు.. ఈ చిత్రంలో రజనీ ఉన్నారా అని ప్రశ్నించారు. దీనిపై ఆమె బదులిస్తూ.. స్క్రిప్ట్ ఏదైతే డిమాండ్ చేస్తుందో దర్శకుడు అంతవరకే చెయ్యాలి. వీఐపీ-2 స్క్రిప్ట్ అలాంటిదేమీ డిమాండ్ చేయలేదు. ఈ చిత్రంలో స్పెషల్ అప్పీయరెన్స్‌గా రజనీ ఉండాలనే ఆలోచనే మాకు రాలేదని స్పష్టం చేశారు. వీఐపీ-2లో ధనుష్ సరసన అమలాపాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. సౌందర్య దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం ఇది కాగా.. మొదటిది కొచ్చాడయన్. -
విడాకులు: కోర్టుకు హాజరైన హీరో కూతురు!
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య తన భర్తతో విడిపోవడానికి సిద్ధమైంది. భర్త అశ్విన్ రాంకుమార్ నుంచి ఆమె విడాకులు తీసుకుబోతున్నది. ఇందులో భాగంగా శుక్రవారం ఆమె చెన్నైలోని కుటుంబ న్యాయస్థానానికి హాజరైంది. సౌందర్య 2010లో అశ్విన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు వేద్ అనే కొడుకు ఉన్నాడు. విభేదాల కారణంగా గత ఏడాది విడిపోవాలని దంపతులిద్దరూ నిర్ణయించుకున్నారు. వీరి విడాకుల కేసు విచారణను కుటుంబ న్యాయస్థానం శుక్రవారం విచారించింది. ఈ విచారణ సజావుగా జరిగిందని, దంపతులిద్దరూ ఉమ్మడి సమ్మతితో విడిపోతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. వచ్చే విచారణలోపు దంపతులిద్దరూ విడిపోవడానికి గల కారణాలు సవివరంగా తెలుపుతూ, ఉమ్మడి అంగీకారంతో కూడిన జాయింట్ మెమోను దాఖలుచేయాలని కోర్టు సూచించింది. దంపతులిద్దరితో సంప్రదింపుల అనంతరం వారి మెమోతో సంతృప్తి చెందితే చట్టబద్ధంగా విడిపోయేందుకు కోర్టు విడాకులు మంజూరు చేయనుంది. ఈ ఉమ్మడి అంగీకార పత్రంలో భరణం వివరాలు, పిల్లాడి సంరక్షణ బాధ్యతలు తదితర అంశాలు ఉంటాయి. -
అప్పా... పొన్ను... మాపిళ్లయ్!
పుత్రుడు జన్మించినప్పుడు కాదు... ప్రజలు అతణ్ణి మెచ్చుకున్నప్పుడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం కలుగుతుందని సుమతీ శతకంలో చెప్పారు. రజనీకాంత్‌కి పుత్రులు లేరు. ఐశ్వర్య, సౌందర్య... ఇద్దరూ అమ్మాయిలే. వాళ్లను పుత్రులకు ఏమాత్రం తక్కువ కాదనే రీతిలో పెంచి పెద్ద చేశారు. అక్కాచెళ్లెళ్లు ఇద్దరూ మెగాఫోన్ పట్టారు. రజనీ పెరియ మాపిళ్లయ్ (పెద్ద అల్లుడు) ధనుష్ హీరోగా చిన్న పొన్ను (అమ్మాయి) సౌందర్య దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘వీఐపీ–2’ రూపొందుతోంది. పిల్లలు ప్రయోజకులు అయితే కళ్లారా చూడాలని ఏ తండ్రికి ఉండదు! అమ్మాయి ఎలా దర్శకత్వం వహిస్తుందో చూడాలని అప్పా (తండ్రి) రజనీ మనసు కోరుకుంది. ‘వీఐపీ–2’ షూటింగ్ గురించి వాకబు చేస్తే... శనివారమే చిత్రీకరణ చివరిరోజని ఆయనకు తెలిసింది. వెంటనే సెట్‌కి వెళ్లారు. ఆయన్ను చూసి యూనిట్ అంతా సర్ప్రైజ్ అయ్యారు. స్టార్ట్... కెమేరా... యాక్షన్... అని సౌందర్య చెబుతుంటే రజనీ దగ్గరుండి గమనించారు. అంతే కాదండోయ్... సౌందర్య తీసిన ప్రతి ఫ్రేమ్నూ విశ్లేషించి, ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని నిర్మాత తెలిపారు. అన్నట్టు... ఈ చిత్రానికి నిర్మాత ఎవరో కాదు... రజనీతో ‘కబాలి’ తీసిన కలైపులి ఎస్. థాను. -
సూపర్ స్టార్ కుమార్తె కారుకు ప్రమాదం
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు సౌందర్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం చెన్నైలోని అల్వార్పేట్ ప్రాంతంలో ఆమె కారు ఓ ఆటో రిక్షాను ఢీకొట్టింది. ఈ ఘటనలో సౌందర్యకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. ఆటో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం కాగా సౌందర్య భావ, హీరో ధనుష్ జోక్యంతో విరమించుకున్నట్టు సమాచారం. ప్రమాద వార్త తెలియగానే ధనుష్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. వైద్యానికయ్యే ఖర్చులు భరిస్తామని, పరిహారం ఇస్తామని, కేసు లేకుండా రాజీ చేసుకుందామని చెప్పి ధనుష్.. ఆటో డ్రైవర్‌ను ఒప్పించాడు. సౌందర్యపై కేసు నమోదు కాకుండా కాపాడాడు. ప్రమాదం జరిగిన సమయంలో సౌందర్య కారును స్వయంగా నడిపారా లేక డ్రైవర్ ఉన్నాడా అన్న విషయం తెలియరాలేదు. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రజనీ రెండో కుమార్తె సౌందర్య ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాలో ధనుష్, కాజోల్, అమలాపాల్ తదితరులు నటిస్తున్నారు. -
సూపర్ స్టార్ చిన్న కుమార్తె కోర్టుకు
ముంబై:సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్నకుమార్తె సౌందర్య చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. భర్త అశ్విన్ రామ్‌కుమార్‌తో విడిపోయేందుకు చట్టబద్ధంగా అనుమతి ఇప్పించాలని కోరుతూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా విభేదాల కారణంగా విడిగా ఉంటున్న సౌందర్య, అశ్విన్ దంపతులు చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పరస్పర అంగీకారంతో ఇరువురు ఈ రోజు పిటిషన్ దాఖలు చేసారు. కాగా మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోతున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. దీనిపై కొన్నిరోజులకు స్పందిచిన సౌందర్య విడాకులు వార్తలను ధృవీకరించారు. తాము విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నామని, ఏడాదిగా దూరంగా ఉంటున్నామని ఆమె సెప్టెంబర్‌లో వెల్లడించారు. రజనీకాంత్ నటించిన 'కొచ్చడయాన్'కు డైరెక్టర్‌గా వ్యవహరించిన సౌందర్యకు..గ్రాఫిక్ డిజైనింగ్‌లోనూ మంచి ప్రావీణ్యం ఉన్న సంగతి తెలిసిందే. -
రజనీ ఆ విషయాన్ని ఎప్పుడూ మరచిపోరు
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోకి రాకముందు బెంగళూరులో బస్ కండెక్టర్‌గా పనిచేశాడన్న విషయం అందరికీ తెలిసిందే. వెండితెరపై స్టయిల్‌గా కనిపించే రజనీ నిజజీవితంలో సింపుల్‌గా ఉంటాడు. సోమవారం రజనీ 66వ ఏట అడుగుపెట్టాడు. అభిమానులు, సినీ ప్రముఖులు, ప్రధాని నరేంద్ర మోదీ.. రజనీకాంత్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. రజనీ బర్త్ డే సందర్భంగా ఆయన కుమార్తె సౌందర్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. తన తండ్రి, కుటుంబం గురించి పలు విషయాలు చెప్పింది. సౌందర్య ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.. నాన్న చాలా సింపుల్: నాన్న చాలా సింపుల్‌గా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారన్న విషయాన్ని ఆయన ఎప్పుడూ మరిచిపోరు. నేను, నా సోదరి ఐశ్వర్య ఈ విషయాన్ని నాన్న నుంచి నేర్చుకున్నాం. మేం మూలాలను మరిచిపోం. అభిమానులు, నిర్మాతలు ఎవరినైనా నాన్న ఒకేలా చూస్తారు. నాన్నకు ఆయనంటే ఇష్టం: కబాలి సినిమాలో మలేసియాలో డాన్ పాత్రలో నటించారు. ఆయన వయసుకు దగ్గరగా ఉండే పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఓ సందేశం కూడా ఉంది. కబాలి దర్శకుడు రంజిత్ పా అంటే నాన్నకు ఇష్టం. కబాలికి ముందు నాన్న నటించిన రెండు సినిమాలు సరిగా ఆడలేదు. పరాజయాల ప్రభావం ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. అయితే నాన్న అలాంటి రకం కాదు. సినిమా పూర్తయిన తర్వాత అది హిట్ అయినా ఫ్లాప్ అయినా నాన్న పెద్దగా పట్టించుకోరు. తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు. నాన్న ఆరోగ్యంపై ఆ మధ్య వచ్చిన వార్తలన్నీ అబద్ధం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. కబాలి తర్వాత విరామం లేకుండా రోబో 2 సినిమాలో నటిస్తున్నారు. -
కెరీర్‌పై దృష్టి పెట్టిన సూపర్ స్టార్ కూతురు
ఇటీవల విడాకుల వార్తలతో మీడియాలో కనిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతోంది. ఇప్పటికే కొచ్చాడయాన్ లాంటి భారీ గ్రాఫిక్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన సౌందర్య, గోవా అనే కామెడీ చిత్రాన్ని నిర్మించింది. మరోసారి అంతా కొత్త వారితో తెరకెక్కనున్న చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది. రజనీకాంత్ హీరోగా కబాలి లాంటి భారీ బ్లాక్ బస్టర్‌ను అందించిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు, నటీనటుల ఎంపిక కూడా జరుగుతున్నట్టుగా తెలిపారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతో దర్శకురాలిగా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో ఉంది సౌందర్య రజనీకాంత్. -
భర్తతో మనస్పర్థలా?
చిత్ర పరిశ్రమలో విడాకుల సంస్కృతి నానాటికీ అధికం అవుతోందని చెప్పక తప్పదు. వాస్తవం ఎంతో గానీ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ తన భర్తకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. అశ్విన్,సౌందర్యల మధ్య మనస్పర్ధలే ఇందుకు కారణం అని ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్,లతా రజనీకాంత్‌ల రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్. గ్రాఫిక్స్ టెక్నాలజిలో నిపుణురాలైన ఆమె గోవా చిత్రం ద్వారా నిర్మాతగానూ, తన తండ్రి హీరోగా నటించిన యానిమేషన్ చిత్రం కోచ్చడైయాన్ చిత్రంతో దర్శకురాలు గానూ పరిచయం అయ్యారు. తాజాగా తన సోదరి ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్ హీరోగా ఒక చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సౌందర్య రజనీకాంత్‌కు 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో వివాహం జరిగింది. వారికి ఇటీవలే ఇక బిడ్డ కూడా కలిగాడు. నాలుగు నెలలుగా అశ్విన్, సౌందర్యరజనీకాంత్‌లు దూరంగా ఉంటున్నారనీ కోడంబాక్కం వర్గాలు వదంతులకు తెరలేపారు. ప్రస్తుతం సౌందర్య రాజనీకాంత్ స్థానిక చేట్‌పేట్‌లోని ఇంటిలో ఒంటరిగా నివశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు వీరి దాంపత్యజీవితం విడాకులకు దారి తీసినట్లు, అయితే వారి సన్నిహితులు,స్నేహితులు అంత దాకా వెళ్లకుండా సర్దిచెప్పి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
వెండితెరకు రజనీ జీవితం
శివాజీరావు గైక్వాడ్... ఓ ఆర్డినరీ బస్ కండక్టర్. యాక్టింగ్ అంటే ఆసక్తి. కానీ, ఆరడుగుల ఎత్తు లేడు.. ఆజానుబాహుడు కాదు.. ఆకర్షించే రూపం లేదు. రంగు.. ఎండలోకెళితే ట్యాన్ అయిపోతానేమోనని కంగారు పడాల్సిన అవసరమే లేదు. నలుపు రంగు. అయినా కళకు తక్కువ లేదు. స్టైల్ సూపర్. అందుకే సూపర్‌స్టార్ రజనీకాంత్ అయ్యాడు. ఆరు పదుల వయసులోనూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. హీరోగా హిమాలయాలంత ఎత్తుకు ఎదిగినా నిజ జీవితంలో హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటారు రజనీ. తనను తాను సామాన్యుడిగా భావిస్తారు. ఓ కమర్షియల్ సినిమాకి అవసరమైన మలుపులు, హంగులన్నీ రజనీకాంత్ జీవితంలో ఉన్నాయి. అందుకే ఆయన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రజనీ రెండో కుమార్తె సౌందర్య ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘ప్రస్తుతం ఐశ్వర్య (రజనీ పెద్ద కూతురు) నాన్న జీవితం మీద పుస్తకం రాస్తోంది. తర్వాతి అడుగు సినిమా తీయడమే. నాన్న జీవితంలో ఎవ్వరికీ తెలియని చాలా విషయాలు ఈ సినిమాలో చూపించబోతున్నాం. స్ఫూర్తిమంతంగా ఉంటుందీ సినిమా. కూతురిగా, వీరాభిమానిగా మా నాన్న జీవితాన్ని వెండితెరపై చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని సౌందర్యా రజనీకాంత్ పేర్కొన్నారు. -
హార్వర్డ్ యూనివర్సిటీ సదస్సుకు సౌందర్య
హన్మకొండ : అమెరికా బోస్టన్లోని ప్రపంచ ప్ర ఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న అకమిడక్ సదస్సులో హన్మకొండ వడ్డెపల్లిలోని పింగిళి ప్ర భుత్వ మహిళా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌం దర్య జోసఫ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘జెండర్ డిస్కోర్స్ ఇన్ ది నావెల్స్ ఆఫ్ మార్గరెట్ లారెన్స్ అండ్ అలైక్ మన్రో’ అంశంపై పరిశోధన పత్రం సమర్పిస్తారు. సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే ఆమె అమెరికా వెళ్లారు. -
అస్తమించని సౌందర్యం
నేడు సౌందర్య వర్థంతి వెన్నెల... ఆకాశంలోనే ఉంటుంది! ఆ పరిమళం మాత్రం పుడమినంటుకునే సాగుతుంది! సౌందర్య కూడా అంతే! స్వల్పకాలంలో ఆకాశమంత ఎత్తుకెదిగిపోయింది. మన దురదృష్టం. ఆకాశంలోనే ఉండిపోయింది. కానీ ఆమె జ్ఞాపకాలు మాత్రం ఇంకా మనల్ని తరుముతూనే ఉన్నాయ్ వాటిలో ఇవి కొన్ని... * ఫేమస్ రైటర్ త్రిపురనేని మహారథి కొడుకు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి) ‘రైతు భారతం’ సినిమా డెరైక్ట్ చేస్తున్నారు. కృష్ణంరాజు (ఈ పాత్రలో తర్వాత కృష్ణ నటించారు), భానుచందర్ హీరోలు. కృష్ణంరాజు పక్కన వినయ ప్రసాద్ అనే ఆర్టిస్టుని బుక్ చేయడానికి బెంగళూరు వెళ్లారు చిట్టి. కనిష్క హోటల్లో రచయిత, దర్శక, నిర్మాత సత్యనారాయణ తారసపడి, వాళ్లమ్మాయి సౌమ్య స్టిల్స్ చూపించారు. చిట్టికి నచ్చి, భానుచందర్ పక్కన హీరో యిన్‌గా వెంటనే తీసేసుకున్నాడు. అప్పటికే సౌమ్య కన్నడంలో ‘గంధర్వ’ అనే సినిమా చేస్తోంది. ఆ సౌమ్యే మన సౌందర్య. * ‘రైతు భారతం’ ఒక షెడ్యూలు జరుగుతుంటే పి.ఎన్.రామచంద్రరావు తను తీస్తున్న ‘మనవరాలి పెళ్లి’లో హీరోయిన్గా సౌందర్యను తీసుకున్నారు. ముందు ఈ సినిమానే రిలీజైంది. ఆ తర్వాత ‘అమ్మోరు’ లాంటి సినిమాలు కమిట్ అయ్యిందామె. 11 ఏళ్లల్లో వందకు పైగా సినిమాలు చేసింది. * రాజీవ్ మీనన్ డెరైక్ట్ చేసిన ‘కండు కొండేన్ కండు కొండేన్’ (తెలుగులో ‘ప్రియురాలు పిలిచింది’)లో ఐశ్వర్యారాయ్ పాత్రకు మొదట సౌందర్యనే అడిగారు. * సౌందర్యకు ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’లో మీనాకుమారి, ‘ఫిజా’లో కరిష్మా కపూర్ చేసిన పాత్రల్లాంటివి చేయాలని ఉండేది. చెవిటి, మూగపిల్లగా నటించాలని కోరిక. అవకాశమొస్తే విలనీ కూడా చేద్దామను కున్నారు. గోవింద్ నిహలానీ, శ్యామ్ బెనగళ్ సినిమాల్లో చేయాలని ఎంతగా ఆశపడ్డారో! * కెరీర్ తొలినాళ్ల నుంచీ బంజారాహిల్స్‌లోని ‘ప్రశాంత్ కుటీర్’ అనే గెస్ట్‌హౌస్‌లోనే బస చేసేవారు. రూమ్ నం.10 ఆమెకు పర్మినెంట్. ఫైవ్‌స్టార్ ఫెసిలిటీ ఇస్తామని ప్రొడ్యూసర్లు చెప్పినా, ఆమె ప్రశాంత్ కుటీర్‌ను వదల్లేదు. * గిరీశ్ కాసరవల్లి డెరైక్షన్‌లో ‘ద్వీప’ సినిమాను నిర్మించారు. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. * ‘తిలదానం’తో నేషనల్ అవార్డు సాధించిన కేఎన్టీ శాస్త్రి దర్శకత్వంలో ‘కమ్లీ’ సినిమా చేయాలని ఆమె ఎంతగానో ముచ్చటపడ్డారు. శాస్త్రిని రెండు, మూడుసార్లు బెంగళూరుకు పిలిపించుకుని స్టోరీ, బడ్జెట్ గురించి డిస్కస్ చేశారు. సినిమా స్టార్ట్ చేయడమే తరువాయి అనుకుంటున్న సమయంలో కన్నడంలో ‘ఆప్తమిత్ర’ సినిమా ఆఫర్ రావడంతో ‘కమ్లీ’ని రెండు నెలలు వాయిదా వేశారు. * సౌందర్య తొలి పారితోషికం ఎంతో తెలుసా? పాతిక వేల రూపాయలు. ‘రైతు భారతం’ సినిమాకి ఆమె తీసుకున్నది ఇంతే. ఆ తర్వాత ఆమె 50 లక్షల రేంజ్‌కు చేరుకున్నారు. * ఎప్పటికైనా డెరైక్షన్ చేయాలనుకున్నారామె. ‘శ్వేతనాగు’ ప్రొడ్యూస్ చేసిన సీవీ రెడ్డి, ఇందుకు సిద్ధమయ్యారు కూడా. * సౌందర్యకు వాటర్ ఫోబియా ఉంది. నీళ్లంటే భయం. సుడిగుండాలంటే మహా భయం. నీళ్ల బకెట్లో పడిపోతానేమోనని కూడా భయపడిపోయే వారట. చివరకు షవర్ బాత్ చేయడానికి కూడా టెన్షన్ పడిపోయేవారట. * ‘లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్’ అనే పుస్తకం ఆమెను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తండ్రి మరణం నుంచి కోలుకోవడానికి సౌందర్యకు ఈ పుస్తకమే సహకరించిందట. * సౌందర్య ఫాదర్ సత్యనారాయణకు జాతకాలు బాగా తెలుసు. తన కూతురు పదేళ్లకు పైగా ఇండస్ట్రీని ఏలుతుందని, అందరు హీరోలతోనూ నటిస్తుందని, 2004లో ఆమె కెరీర్ సమాప్తమవుతుందని ఆయన ముందే జోస్యం చెప్పారు. కానీ ఆమె కెరీర్ కాదు, లైఫే ఎండ్ అయిపోయింది. * 2004 ఏప్రిల్ 17 మధ్యాహ్నం గం.1:14 నిమిషాలకు బెంగళూరులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. ఆమెతో పాటు అన్నయ్య అమర్ కూడా నేలరాలి పోయారు. అప్పటికామెకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ రఘుతో పెళ్లయ్యి ఏడాది కూడా కాలేదు. కరీంనగర్ జిల్లాలో బీజేపీకి సపోర్ట్‌గా ఎన్నికల సభలో పాల్గొనడానికి వెళ్తూ ఇలా తన ప్రయాణాన్ని అర్ధంతరంగా ముగించారు. * చనిపోవడానికి కొద్దిరోజుల ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చావు గురించి సౌందర్య ఇలా అన్నారు - ‘‘చావంటే నాకు చాలా భయం. చిన్నప్పుడు చావు గురించి రక రకాలుగా ఆలోచించేదాన్ని. చచ్చిపోయాక స్వర్గానికి వెళ్తామని, స్వర్గం ఆకాశంలో ఉంటుందని.. ఇలా ఏవేవో పిచ్చి ఆలోచనలు చేసేదాన్ని. విమానాల్లో ప్రయాణించేటప్పుడు కిటికీ ల్లోంచి కనిపించే మేఘాలను చూస్తే మాత్రం చచ్చిపోయాక ఇక్కడకు వస్తామన్నమాట అని అనిపిస్తూ ఉంటుంది.’’ -
పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: మహేష్ భట్ (దర్శక, నిర్మాత) సౌందర్య (నిర్మాత - రజనీకాంత్ కుమార్తె) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది రవి సంఖ్య కావడం వల్ల కొత్త ఉత్సాహం, దేనినైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం కలుగుతాయి. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త టెక్నాలజీ తెలుసుకుంటారు. మీ టెక్నాలజీని మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉపయోగించి, లాభపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పెద్దలతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటమే కాదు, వాటిని మీ ఉన్నతికి ఉపయోగించుకోగలుగుతారు. అవివాహితులకు వివాహం అవుతుంది. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పుట్టిన తేదీ 20. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు కళ్లజూస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలవుతారు. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సూర్య, చంద్రుల ప్రభావం వల్ల నేత్రవ్యాధులు, మానసిక ఆందోళన తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,5,7; లక్కీ కలర్స్: తెలుపు, ఎరుపు, క్రీమ్, బ్రౌన్; లక్కీ కలర్స్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు. సూచనలు: అనాథలకు బెల్లం పాయసం తినిపించటం, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం లేదా వినడం, వీలైనంత సేపు వెన్నెలలో విహరించడం, తల్లిని లేదా తత్సమానురాలిని ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
సౌందర్యకు కొడుకు పుట్టాడు..
చెన్నై: ప్రముఖ నటుడు రజనీకాంత్ మరోసారి తాత ప్రమోషన్ కొట్టేశారు. ఆయన చిన్న కుమార్తె సౌందర్య బుధవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే తాత హోదాలో ఉన్న ఆయన ఈసారి బుజ్జి మనవడు పుట్టడంతో సంతోషంతో ఉన్నారు. ప్రస్తుతం పాపతో పాటు సౌందర్య కూడా క్షేమంగా ఉన్నట్లు రజనీకాంత్ సన్నిహితుడొకరు తెలిపారు. 2010లో ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో సౌందర్య వివాహం జరిగింది. వీరిద్దరికి ఇదే తొలి సంతానం. కాగా రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య...ప్రముఖ తమిళ హీరో ధనుష్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే. వారిద్దరికీ ఇద్దరు కుమారులు. ఇక రజనీ కాంత్ నటించిన 3డి యానిమేషన్ చిత్రం కోచ్చడయాన్ చిత్రం ద్వారా సౌందర్య దర్శకురాలిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ 'తన కూతుళ్లు కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు. తాను సంపాదించింది వృథా చేయకుండా ఉంటే చాలు వారు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా'నని అన్నారు. అదే వేదికపై తన నాన్న మాటను పాటిస్తానని సౌందర్య తెలిపింది. పెళ్లి అయిన నాలుగేళ్లకు పైగా సంతానానికి దూరంగా ఉన్న సౌందర్య.. తండ్రి మాటను తూచా తప్పకుండా పాటించి బుజ్జిబాబుకు జన్మనిచ్చింది. -
సౌందర్య ‘సెంచరీ’
ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత్ తరఫున 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన సౌందర్య గత కొన్నేళ్లుగా భారత ఫార్వర్డ్ శ్రేణిలో కీలక సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. ఈ ఘనతతో సౌందర్య ప్రస్తుత జట్టులో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రీతూ రాణి, పూనమ్ రాణి, వందన కటారియా, దీపికల సరసన నిలిచింది. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించడమంటేనే గొప్ప గౌరవం. అలాంటిది 100 మ్యాచ్‌లు అడానంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. వరల్డ్ లీగ్‌లో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించడంతోపాటు రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవడమే మా లక్ష్యం’ అని సౌందర్య వ్యాఖ్యానించింది. -
సౌందర్య రజనీకాంత్‌కు సీమంతం
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య సీమంతం సోమవారం స్థానిక రాయపేటలోని పోయస్‌గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటి లో నిరాడంబరంగా నిర్వహించారు. సౌందర్య కు వ్యాపారవేత్త అశ్విన్‌కు 2010లో వివాహం జరిగింది. రజనీ కాంత్ నటించిన 3డి యానిమేషన్ చిత్రం కోచ్చడయాన్ చిత్రం ద్వారా సౌందర్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ తన కూతుళ్లు కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు. తాను సంపాదించింది వృథా చేయకుండా ఉంటే చాలు వారు పిల్లా పాపలతో సంతోషంగా ఉం డాలని కోరుకుంటున్నానన్నారు. అదే వేదికపై తన తొలి చిత్రం విడుదలానంతరం నాన్న మాటను పాటిస్తానని సౌందర్య అన్నారు. పెళ్లి అయిన నాలుగేళ్లకు పైగా సంతానానికి దూరం గా ఉన్న సౌందర్య ఇటీవల గర్భం దాల్చారు. ఆమె సీమంతాన్ని సోమవారం రజనీ కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా నిర్వహించారు. -
తండ్రి ఆశ నెరవేరింది!
‘‘సినిమా పరిశ్రమలో కొనసాగాలంటే నాకేం అభ్యంతరం లేదు. ప్రతిభ నిరూపించుకునే అవకాశం వస్తే, సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ, దానికన్నా ముందు తల్లి కావడం ముఖ్యం. ఆ పిల్లలను పెంచుకుంటూ వృత్తిని కొనసాగించవచ్చు’’.... ‘కోచడయాన్’ చిత్రం ఆడియో వేడుకలో తన చిన్న కుమార్తె సౌందర్యను ఉద్దేశించి రజనీకాంత్ అన్న మాటలివి. త్వరలో ఆయన ఆశను సౌందర్య నెరవేర్చనున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. 2010లో అశ్విన్‌తో సౌందర్య వివాహం జరిగింది. ఆ తర్వాత సౌందర్య స్వీయ దర్శకత్వంలో ‘కోచడయాన్’ చిత్రం ఆరంభించడం, రెండు, మూడేళ్లు ఈ చిత్రానికే పరిమితం కావడం జరిగాయి. ఈ చిత్రం విడుదల తర్వాత సౌందర్య వేరే చిత్రాలేవీ మొదలుపెట్టలేదు. ఈలోపు ఈ తీపి కబురు చెప్పారు. ఇదిలా ఉంటే.. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యకు ఇద్దరు కొడుకులున్నారు. ఇప్పుడు మరో సారి రజనీ తాత కానున్నారన్న మాట! -
‘ఇటలీ’ సిరీస్‌కు సౌందర్య
నిజామాబాద్ స్పోర్ట్స్ : జిల్లాకేంద్రానికి చెందిన హాకీ జాతీయ జట్టు క్రీడాకారిణి యెండల సౌందర్య మరో అంతర్జాతీయ టోర్నీకి ఎంపికకావడంపై జిల్లాకు చెందిన క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె ఇటలీలో జరగనున్న హాకీ టెస్ట్ సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈనెల 29న ఇటలీ బయలు దేరి వెళతారు. డిసెంబర్ 4 నుంచి 11వరకు జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో పాల్గొంటారు. గాయాల కారణంగా ఇటీవల జరిగిన ఆసియా క్రీడలకు దూరమైన సౌందర్య.. త్వరగా కోలుకొని తిరిగి జట్టులోకి రావడంపై జిల్లా హాకీ సంఘం ప్రతినిధులు సుబ్బారావు, ముకీబ్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. -
తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు
నిజామాబాద్ స్పోర్ట్స్: నేను పదమూడు సంవత్సరాలుగా హాకీ ఆడుతూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాను. గత ప్రభుత్వాలు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే క్రీడలకు, క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందుతుంది్ఱూఎఖఖీా అని అంతర్జాతీయ క్రీడా కారిణి యెండల సౌందర్య అన్నారు. బుధవారం నిజామాబాద్‌లోని కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ.25లక్షల నగదు, 250 గజాల ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి రూ.15లక్షలు ప్రకటించడంపై ఆమె సంతోషాన్ని ప్రకటించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ తనను కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లినట్లు సౌందర్య తెలిపారు. మాకు సీఎం 15 నిముషాల సమయం కేటాయించారు. నేను సాధించిన పతకాలు, మెడల్స్, చూపించగానే చాలా సంతోషంగా సీఎం ఫీలయ్యారు. ఇంతగా సాధించినావు గదా గత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించలేదా అని బాధపడ్డారు. వెంటనే నాకు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కేలా చేశారు. ముఖ్యమంత్రికి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌కు, మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్‌లకు, తనకు గుర్తింపు ఇచ్చిన ప్రింట్, ఎల క్ట్రానిక్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సౌందర్య పేర్కొన్నారు. తనలాంటి క్రీడాకారులకు, ప్రతిభ ఉన్న వారు చాలా మంది ఉన్నప్పటికీ ప్రోత్సాహం కరువైందన్నారు. క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీయడానికి కోచ్‌లు అత్యవసరం అని అన్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రం పేరును ప్రపంచ దేశాల్లో క్రీడల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి వీలుంటుందన్నారు. తనకు సమైక్య రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు రాలేదని, కేవలం తెలంగాణ వచ్చిన తర్వాతే ప్రభుత్వం ప్రత్యేక గౌరవం అందించిందని సౌందర్య పునరుద్ఘాటించారు. క్రీడాకారులు కూడా ఎదైనా ఆటలో ప్రావీణ్యం సాధించడానికి కఠోర శిక్షణ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తాను భారత హాకీజట్టుకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాని సౌందర్య తెలిపారు. -
ప్లేబోయ్ని ఎగతాళి చేసిన సౌందర్య
-
శింబుపై సరదాగానే కామెంట్ చేశా
శింబుపై సరదాగానే కామెంట్ చేశానని దర్శకురాలు, సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ఉంటుందని నటుడు శింబు పేర్కొనడంతో వీరి మధ్య జరుగుతున్న గొడవ సమసిపోయింది. ఇంతకీ వీరి మధ్య గొడవేమిటన్నదేగా మీ ప్రశ్న. శింబు, సౌందర్య రజనీకాంత్ బాల్య స్నేహితులు. వీరిద్దరూ ఇటీవల ఒకరిపై ఒకరు ఇంటర్నెట్లో కామెంట్స్ గుప్పించుకున్నారు. ముఖ్యంగా కోచ్చడయాన్ చిత్రం చూసిన శింబు ఇంటర్నెట్లో పేర్కొంటూ చిత్రం బాగుంది దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌కు అభినందనలు అని అన్నారు. చిత్రంలోని గ్రాఫిక్స్ సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలకు దీటుగా లేకపోయినా ఆమె ప్రయత్నం భేష్ అని పేర్కొన్నారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపిన సౌందర్య రజనీకాంత్ ఇంటర్నెట్లో పేర్కొంటూ, తాను ఒక పత్రికా విలేకరినయితే శింబు ఇకపై పాడటాన్ని నిలిపి వేయాలని చెబుతానన్నారు. దీనికి శింబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌పై తిట్లపురాణంతో దండెత్తారు. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న శింబు పరిస్థితి చెయ్యిదాటుతోందని భావించి రంగంలోకి దిగారు. విమర్శించే హక్కు, భావ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆమె తన స్నేహితురాలేనని విజ్ఞప్తి చేశారు. ఇటు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ కూడా శింబు తనకు చిన్ననాటి స్నేహితుడని అందుకే సరదాగా కామెంట్ చేశానని, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. దీంతో వీరి మధ్య గొడవకు తెరపడింది. -
నాడు సౌందర్య.. నేడు శోభ
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనే నాడు సినీనటి సౌందర్య, నేడు వైఎస్ఆర్సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మరణించారు. 2004 ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సౌందర్య (31).. ఆ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన బెంగళూరు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో అక్కడికక్కడే మరణించారు. అత్యధికంగా తెలుగు సినిమాల్లో నటించిన సౌందర్య, కొన్ని కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించడంతో మూడు రాష్ట్రాల్లోనూ ఆమెకు పెద్దసంఖ్యలో అభిమానులుండేవారు. ఆ అభిమానాన్ని ఓట్లరూపంలోకి మార్చుకోవాలని బీజేపీ కోరగా.. ఆమె ప్రచారం చేసేందుకు అంగీకరించి తన ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు శోభా నాగిరెడ్డి కూడా ఎన్నికల ప్రచార సంరంభం ముమ్మరంగా ఉన్న సమయంలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. చాలామంది నాయకురాళ్లలా తండ్రి చాటునో, భర్త చాటునో ఉండిపోకుండా తనకంటూ సొంతంగా నాయకత్వ లక్షణాలు సాధించి, రాయలసీమలోని మహిళా నేతల్లోనే ప్రత్యేక గుర్తింపు పొందిన శోభా నాగిరెడ్డి.. బుధవారం సాయంత్రం వైఎస్ షర్మిలతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆమె తిరుగులేని ఆధిక్యంతో గెలుస్తారని, మంచి ప్రాధాన్యం ఉన్న శాఖకు మంత్రిగా కూడా చేస్తారని కర్నూలు జిల్లావాసులు భావించారు. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం.. కేర్ ఆస్పత్రిలో కన్నుమూయడంతో అభిమానులు తల్లడిల్లిపోయారు. -
నాన్నను ఎప్పుడూ అలా చూడకూడదనుకున్నా..
ఇవాళ దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం - తమిళ ‘కోచ్చడయాన్‘ (తెలుగులో ‘విక్రమ సింహ’). రజనీకాంత్ నటించిన ఈ అత్యాధునిక సినిమాకు ఆయన చిన్న కుమార్తె సౌందర్య డెరైక్టర్. తండ్రి నటిస్తుంటే, కుమార్తె దర్శకత్వం వహించడం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి. మోషన్ క్యాప్చర్ ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీతో తయారైన మన తొలి సినిమా కూడా ఇదే. సూపర్ స్టార్ తండ్రి... సూపర్ కూతురు... సూపర్ టెక్నాలజీ సినిమా... ఇంకేం.. 29 ఏళ్ల సౌందర్యా రజనీకాంత్‌ను కదిలిస్తే, కబుర్లకు కొదవా. నేను చెన్నైలో పుట్టి పెరిగా. మా అమ్మ నడుపుతున్న ‘ది ఆశ్రమ్’ స్కూలులో చదువుకున్నాను. అసలు చిన్నప్పటి నుంచి నాకు వాక్యాలు చదవడం కన్నా, బొమ్మలు చూడడం బాగా ఇష్టం. నేనెప్పుడూ పదాల్లో ఆలోచించను, నా ఆలోచనలెప్పుడూ బొమ్మల్లోనే! పెర్త్‌కు వెళ్ళి, గ్రాఫిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసి, వచ్చా. ఆఫర్లొచ్చినా, నటన వైపు మొగ్గలేదు. సినీ ప్రముఖుడి సంతానానికి ఎవరికైనా, సినిమా పట్ల ఆకర్షణ కలగడం సహజమే. కానీ, దాని వల్ల కొన్ని సానుకూలతలున్నాయి. ప్రతికూలతలూ ఉన్నాయి. పిల్లలైన మేము ఏం కావాలని అనుకుంటున్నదీ నాన్న గారు మాతో ఓపెన్‌గా మాట్లాడారు. మేము కెమేరా ముందుకు రావడాన్ని ఆయన పెద్దగా ఇష్టపడలేదు. నాకు కూడా యానిమేషన్ అంటే ఆసక్తి. యానిమేషన్, విజువల్ గ్రాఫిక్స్ నా ఊహలకు రెక్కలు తొడిగాయి. అలా ‘శివాజీ’, ‘రోబో’లకు పని చేశా. యువతరం కథ ‘గోవా’ నచ్చి, నిర్మాతనయ్యా. ‘కోచ్చడయాన్’తో దర్శకత్వం వైపు వచ్చా. పరిస్థితులెటు తీసుకెళితే అటెళుతున్నా. అమ్మంటే ఇష్టం నేను అమ్మ కూచిని. మా అమ్మ లాగా దేనినైనా సానుకూల దృక్పథంతో చూసే, దృఢమైన వ్యక్తిత్వమున్న మహిళ చాలా అరుదు. నాకు అన్నీ మా అమ్మే. మా ఇంటి మొత్తాన్నీ ఆమే నడుపుతుంది. బయట ఇంత పేరున్న మా నాన్న గారు కూడా నూటికి 200 పాళ్ళు అన్నిటికీ ఆమె మీద ఆధారపడుతుంటారు. ఆమె ఏకకాలంలో అనేక పాత్రలు పోషిస్తుంటారు. ఆమెకున్న సహనం అంతా ఇంతా కాదు. సూపర్‌స్టార్ కుమార్తెగా... ప్రముఖుల పిల్లలమైనప్పుడు అందరి దృష్టీ మన మీద ఉంటుంది. తల్లితండ్రుల గొప్పతనంతో, వారు సాధించిన విజయాలతో అనుక్షణం పోలుస్తూ ఉంటారు కాబట్టి, ఒత్తిడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మా గురించి రాస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ తప్పవు. అయినా, అక్కచెల్లెళ్ళమైన మా ఇద్దరి బాల్యం అద్భుతంగా గడిచింది. అప్పట్లో మా నాన్న గారు రోజూ మూడు షిఫ్టులతో తీరిక లేకుండా పనిచేస్తుండేవారు. ఆయన దగ్గర లేని లోటు లేకుండా అమ్మ చూసేది. అమ్మమ్మ వాళ్ళు మధ్యతరగతి పిల్లల్లా పెంచారు. ‘కోచ్చడయాన్’ మొదలైందిలా... ముందు అసలు నేను ‘సుల్తాన్’ అనే 3డి యానిమేషన్ చిత్రం తీయాలనుకున్నా. అనేక కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇక, ఆ సినిమా తీసే ఆలోచన లేదు. ‘సుల్తాన్’ ఆగాక,‘రాణా’ సినిమా నాన్న గారితో ప్రారంభించాం. తీరా నాన్న గారికి ఒంట్లో బాగాలేక ఆ సినిమా కూడా ఆగిపోయింది. నాన్న గారితో గతంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.ఎస్. రవికుమార్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించాల్సింది. నాన్న గారి ఆరోగ్యం బాగవడంతో, ‘రాణా’ కన్నా ముందు దానికి ముందు భాగం ఒకటి తీయాలనుకున్నాం. రాణాకు తండ్రే ఈ కోచ్చడయాన్. ‘కో’ అంటే రాజు గారనీ, ‘చడయాన్’ అంటే అంటే పొడవాటి జుట్టున్న వ్యక్తి అనీ అర్థం. శివుణ్ణి పూజించే ఓ రాజ వంశీకుల కాల్పనిక కథ ఇది. పెర్ఫార్మెన్స్ క్యాప్చరింగ్ అంటే... మన దేశంలో సాధారణంగా విజువల్ ఎఫెక్ట్లు, గ్రాఫిక్స్ లాంటివి యాక్షన్ సన్నివేశాలు, పాటల లాంటి ఏదైనా ఓ ప్రత్యేక సందర్భంలానే వాడతారు. టెక్నాలజీని మేళవించుకొని నడిచే ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘అవతార్’ లాంటి సినిమాలు ఇక్కడ తీయం. నిజానికి, మన దేశంలో అవి రూపొందించగల ప్రతిభావంతులైన టెక్నీషియన్లు చాలా మంది ఉన్నారు. అందుకే భారతదేశంలోనే తొలిసారిగా పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ పద్ధతిలో ‘కోచ్చడయాన్’ తీశా. నటీనటులు సెన్సర్లు తగిలించిన తోలుదుస్తులతో వచ్చి కెమేరా ముందు అభినయిస్తారు. వారి కదలికల్నీ, అభినయాన్నీ క్యాప్చర్ చేసి, 3డి వెర్షన్లో ప్రవేశపెట్టి, పాత్రల రూపురేఖల్ని యానిమేషన్లో తీర్చిదిద్దుతాం. మనకు ఇప్పటి దాకా తెలియని ఇలాంటి సరికొత్త పద్ధతిలో సినిమా తీయడమంటే, ఆర్థికంగా అభద్రత తలెత్తుతుంది. అయినా సరే, ఈ కొత్త దోవ తొక్కాం. కష్టపడి ‘కోచ్చడయాన్’ తీశాం. బాక్సాఫీస్ వద్ద విజయమంటారా... కష్టపడి పనిచేసి, ఫలితం దేవుడికి వదిలేయాలి. అయితే, రజనీకాంత్ అభిమానులకు నచ్చేవన్నీ సినిమాలో ఉన్నాయని చెప్పగలను. నాన్నకు దర్శకురాలిగా... అన్ని భాషల సినిమాలూ చూస్తుంటాను. తొలి సినిమాకే అంత గొప్ప నటునికి దర్శకత్వం వహించడం నా అదృష్టం. కొన్నిసార్లు నేను ‘యాక్షన్’ అని చెప్పి, షాట్ అయిపోయినా సరే ‘కట్’ చెప్పడం మర్చిపోయి, నాన్న గారి అభినయాన్ని చూస్తూ ఉండిపోయేదాన్ని. ఇక, కొన్ని సందర్భాల్లో ఆయన హీరోగా, నేను దర్శకురాలిగా కాకుండా తండ్రీ కూతుళ్ళలా ప్రవర్తించేవాళ్ళం. ఒకసారి మా అమ్మ ఏ సన్నివేశాలు తీస్తున్నారని అడిగింది. అప్పుడు మేము ‘అప్పా’ (తమిళంలో నాన్న అని అర్థం)కీ, దీపికా పదుకొనేకీ మధ్య ప్రేమ సన్నివేశాలు తీస్తున్నాం. ఆ మాటే చెప్పా. ఆ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి కానీ, వాటిని చిత్రీకరించడం దర్శకురాలిగా నాకూ, నటుడిగా నాన్నకూ కొద్దిగా ఇబ్బంది అనిపించింది. చిత్రీకరణ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. అప్పుడు నాలోని కుమార్తె తొంగి చూసేది. కెమేరా ముందు ఆయన నటన చూస్తున్నప్పుడు నాలోని అభిమాని బయటకొచ్చేది. ఏ రోజుకా రోజు ఆనాటి షెడ్యూల్ పూర్తయ్యేలా చూడాల్సి వచ్చినప్పుడు నాలోని దర్శకురాలు బహిర్గతమయ్యేది. ఆయనకు శ్రమ అనిపించకుండా, అదే సమయంలో నా లాంటి అభిమానులంతా ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపించేలా చూపాను. చుట్టూతా ఏమీ లేకపోయినా, అవి ఉన్నట్లు ఊహించుకొంటూ, నటించాలి కాబట్టి, ప్రతి సన్నివేశాన్నీ లోతుగా వివరించేదాన్ని. ఆయన అంత పెద్ద సూపర్‌స్టార్ అయినా కొత్త దర్శకురాలినైన నా మాట శ్రద్ధగా వినేవారు. చెప్పినట్లు చేసేవారు. ఆయన అంతెత్తుకు ఎలా ఎదిగారన్నది అప్పుడు అర్థమైంది. ఈ సినిమా తరువాతా నాన్నగారు నటిస్తూనే ఉంటారు. మేము ముందనుకున్న కె.ఎస్. రవికుమార్ స్క్రిప్టు ‘రాణా’ సిద్ధంగానే ఉంది. ఏదో ఒక రోజున ఆ కలా నిజం కావచ్చు. అక్కను మెప్పించడమా... అమ్మో... అక్కయ్య ఐశ్వర్య నాకు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. నేను బహిర్ముఖురాలినైతే, ఆమె అంతర్ముఖురాలు. ఆమె వీణ నేర్చుకోవడానికి వెళితే, నేను గోల్ఫ్‌కు వెళ్ళేదాన్ని. కట్టూబొట్టుల్లో ఆమె భారతీయతననుసరిస్తుంది. నాది అందుకు భిన్నమైన పంథా. మాది ప్రత్యేకమైన అనుబంధం. పొద్దస్తమానం మాట్లాడుకోము కానీ, ముఖ్య విషయాలు చర్చించుకుంటాం. ఆమె కూడా దర్శకురాలే. నిర్మొహమాటంగా విమర్శించుకుంటూ ఉంటాం. అక్కను మెప్పించడం అంత సులభం కాదు. ఆమె ‘ఫరవా లే’దందంటే, బ్రహ్మాండంగా ఉన్నట్లు లెక్క. ‘కోచ్చడయాన్’ చూసి, ‘మంచి సినిమా’ అంది. ఎంతో ఒత్తిడికి లోనయ్యా... ఆ మధ్య మా నాన్న గారికి ఒంట్లో బాగా లేనప్పుడు ఎంతో ఒత్తిడికి లోనయ్యా. అంతకు ముందు మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదు. అది మానసికంగా కుంగదీసింది. అక్కచెల్లెళ్ళమిద్దరం అన్నీ వదిలేసి, అనుక్షణం నాన్న గారి వెంటే ఉన్నాం. ఆ రోజులు తలుచుకుంటే కూడా ఇప్పటికీ నాకు భయమేస్తుంది. నాన్న గారిని ఎప్పుడూ అలా చూడకూడదనుకున్నా. అలాంటి పరిస్థితి రాకూడదని వేయి దేవుళ్ళకు మొక్కుకున్నా. ఇక, నేను చేపట్టిన ప్రాజెక్టులేవీ ముందుకు సాగక, స్తంభించిపోయినప్పుడు నిరాశకు లోనయ్యా. అయితే, మా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. వ్యాపారవేత్త అయిన నా భర్త అశ్విన్, నా అత్తమామలు నా పనిని అర్థం చేసుకొని నైతికంగా మద్దతునిచ్చారు. తరతరాలకూ తెరపై రజనీ... ఈ భారీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు పెద్ద బరువు దింపుకున్నట్లుంది. కొద్ది రోజుల్లో ‘కోచ్చడయాన్’ రిలీజవుతుండడంతో ప్రేక్షకులెలా ఆదరిస్తారా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు టెక్నాలజీ సాయంతో రజనీకాంత్‌కు సంబంధించిన వర్చ్యువల్ ఇమేజరీలు లెక్కలేనన్ని సృష్టించాం. రాబోయే రోజుల్లో ఎవరైనా భౌతికంగా ఆయన బాడీ లాంగ్వేజ్‌ను అనుసరిస్తే చాలు, ఆ ఇమేజరీల సాయంతో, సరైన ఎఫెక్ట్‌ల ద్వారా ఎన్నేళ్ళ తరువాతైనా సరే రజనీకాంత్‌ను వెండితెరపై పునఃసృష్టించవచ్చు. తరతరాలు అభిమానులకది కన్నుల పండుగ. ఆయనలోని గొప్పదనం అదే... నాన్న గారిలో గొప్పదనం ఏమిటంటే, డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తితో ఎలా మాట్లాడతారో, అవేమీ లేని డ్రైవర్‌తోనూ అదే పద్ధతిలో మాట్లాడడం. అందుకే, తెర బయటా ఆయనే నా హీరో. ఆయన లాగే నేనూ పట్టిన పట్టు విడవను. వల్ల కాదు లెమ్మని దేనినీ అంత తొందరగా వదిలేయను. మొదట్లో ఆయన బస్ కండక్టర్. తమిళం ఒక్క ముక్క రాదు. అలాంటి వ్యక్తి పట్టుదలతో ఇవాళ ఏ స్థాయికి చేరారో చూడండి. ఆయన రక్తం పంచుకు పుట్టినందుకు గర్విస్తున్నా. -
బావతో సినిమా చేస్తానంటున్న సౌందర్య
తండ్రి హీరోగా కొచ్చాడయాన్ సినిమా తీసిన రజనీకాంత్ కుమార్తె సౌందర్య.. ఇప్పుడు తన బావ ధనుష్‌తో ఓ సినిమా తీయాలనుకుంటోంది. బాలీవుడ్లో ధనుష్ హీరోగా వచ్చిన 'రాంఝణా' చిత్రం చూసిన సౌందర్య.. అందులో అతడి యాక్షన్ చూసి థ్రిల్లయిపోయింది. సమీప భవిష్యత్తులోనే ధనుష్ సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకుంటోంది. ''కుందన్ పాత్రలో బావగారు ఎంత బాగా ఒదిగిపోయారో.. నాకు ఆ సినిమా భలే నచ్చేసింది. ఇక ఆ పాటలు ఊకడా చాలా బాగున్నాయి'' అని ఆమె తెలిపింది. ధనుష్ సినిమాకు దర్శకత్వం వహించాలని తనకు ఉన్నా.. సీనియర్ నటుడు కాబట్టి ఆయన డేట్లు ఇస్తే తప్పకుండా చేస్తానని అంటోంది. '3' సినిమాకు దర్శకత్వం వహించిన రజనీ కుమార్తె ఐశ్వర్యను ధనుష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తమ కుటుంబంలో ఒక్క తన భర్త తప్ప.. అందరూ సినిమా పరిశ్రమకు చెందినవాళ్లేనని సౌందర్య చెప్పింది. -
నంబర్‌గేమ్స్ మీద నమ్మకం లేదు! : అనుష్క
తారాస్వరం నేను అన్నిటినీ పాజిటివ్‌గా తీసుకునే వ్యక్తిని. కష్టపడి పని చేస్తాను. ఓర్పుగా ఉంటాను. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను నేను నమ్ముతాను! నా లైఫ్‌లో ముఖ్యమైన మలుపులు చాలా ఉన్నాయి. సినిమాల్లోకి రావడం పెద్ద మలుపే. అయితే అసలు యోగా టీచర్ కావడమన్నది అంతకంటే పెద్ద మలుపు. ఇంటినిండా డాక్టర్లు, ఇంజినీర్లే ఉంటే... నేను యోగా టీచరవుతానంటే ఎలా ఉంటుంది! అయినా ఒప్పించాను. అది ఇప్పటికీ ఓ మెమరబుల్ మూమెంట్! ఒక సినిమా హిట్ అవ్వగానే ఆ హీరోహీరోయిన్లది హిట్ కాంబినేషన్ అనేస్తారు. పొరపాటున ఫెయిలయ్యిందో... వాళ్ల కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదని పెదవి విరుస్తారు. హిట్ సినిమాలో తప్పులున్నా ఎవరూ పట్టించుకోరు గానీ, ఫ్లాప్ సినిమాలో ప్రతి చిన్నదానిలోనూ తప్పులే కనబడుతుంటాయి అందరికీ! ‘రుద్రమదేవి’లో చేయడానికి ఒప్పుకున్న తరువాత ఇంటర్నెట్లో కాకతీయుల చరిత్ర చదువుదామని ప్రయత్నించాను. కానీ ఒక్కో వెబ్సైట్లో ఒక్కోలా రాసి ఉంది. దాంతో కన్ఫ్యూజై వదిలేశాను. గుణశేఖర్ ఎలా చెబితే అలా ఫాలో అవుతున్నాను. నా లైఫ్‌లో ఇదో బెస్ట్ పాత్ర అవుతుందని నా నమ్మకం! కలలో కూడా ఊహించని పాత్ర ‘బాహుబలి’ ద్వారా వెతుక్కుంటూ వచ్చింది. ప్రభాస్‌తో మూడోసారి చేస్తున్నాను. రాజమౌళిగారితో రెండోసారి పని చేస్తున్నాను. ‘ఆయన హీరోయిన్స్‌ని రిపీట్ చేయరు’ అంటుంటారు. బహుశా ఆ అదృష్టం నాకే దక్కినట్టుంది! నచ్చే పని చేసేటప్పుడు ఎంత కష్టమైనా భరించే శక్తి వస్తుంది. అందుకే కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలు చేయడం వంటి వాటిని చేయగలిగాను. వర్ణకోసం జోర్డాన్‌లో తొంభై రోజులు షూటింగ్ చేశాం. కనీస సౌకర్యాలు కూడా లేవు. బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు. వేణ్నీళ్లు ఉండేవి కాదు. అయినా అవన్నీ తట్టుకుని షూటింగ్ చేశాం. నాకు నంబర్ గేమ్స్ మీద నమ్మకం లేదు. అందరూ అనడమే తప్ప నేనెప్పుడూ నంబర్‌వన్ పొజిషన్ గురించి ఆలోచించలేదు. మంచి పాత్రలు ఎంచుకుంటాను. డెరైక్టర్ చెప్పింది చేసుకుంటూ పోతాను. అంతకుమించి మరేమీ ఆలోచించను. డబ్బుల విషయంలో కూడా అంతే. రెమ్యునరేషన్ కోసం ఎప్పుడూ ఏ నిర్మాతనీ ఇబ్బంది పెట్టలేదు. నిర్మాతలు కూడా నన్ను చూసి డబ్బు పెట్టడం లేదు. అందరం కథకు లోబడి పని చేయాల్సిందే! హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు బాగానే వస్తున్నాయిప్పుడు. దీనికి శ్యామ్ప్రసాద్రెడ్డిగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన హీరోయిన్ల మీద భారీగా ఖర్చుపెట్టి సినిమాలు తీసి, హిట్ చేసి చూపించారు. అందుకే మిగతా నిర్మాతలు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు. గుణశేఖర్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు! జీవితంలో గెలుపోటములు రెండూ ఉంటాయి, ఉండాలి కూడా. ఓడిపోయినప్పుడు కాస్త బాధ అనిపిస్తుంది. కానీ ఎక్కడ తప్పు చేశామా అని పరిశోధించి, వాటిని సరి చేసుకోవడం వల్ల పర్ఫెక్షన్ వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... గెలిచినప్పుడు సంతోషపడటమే కాదు, ఓడిపోయినప్పుడు మనలోని లోపాన్ని కూడా ఒప్పుకోవాలి! అందం కోసం పనిగట్టుకుని వర్కవుట్లు చేయడం ఇష్టం ఉండదు నాకు. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తాను. క్రమం తప్పకుండా యోగా చేస్తాను కాబట్టి వేరే ఏదీ చేయాల్సిన అవసరం లేదు! పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారంతా. ఇప్పుడప్పుడే కాదు గానీ త్వరలోనే చేసుకుంటాను. పెళ్లి అనేది ప్లాన్ చేసి చేసుకునేది కాదు అని నా అభిప్రాయం. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. అయినా... రుద్రమదేవి, బాహుబలి లాంటి రెండు పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించేంత సమయం ఎక్కడ దొరుకుతుంది! కత్తియుద్ధాలు, భారీ పాత్రలు చేసి చేసీ కాస్త బోరు కొట్టింది. కాకపోతే అలాంటి కథలు అరుదుగా వస్తాయి కాబట్టి చేస్తున్నాను. కానీ వరుసగా అలాంటివే చేయడం కాస్త ఇబ్బందే. అందుకే కొన్నాళ్ల వరకూ మళ్లీ అలాంటి పాత్రలు చేయకూడదని అనుకుంటున్నాను. లైట్‌గా, సింపుల్‌గా ఉండే రెగ్యులర్ పాత్రలే చేస్తానిక! పుట్టినరోజు: నవంబర్ 7 జన్మస్థలం: మంగుళూరు మాతృభాష: తుళు చదువు: బీసీఏ నచ్చే రంగులు: నలుపు, తెలుపు నచ్చే దుస్తులు: చీరలు నచ్చే ప్రదేశం: లండన్ నచ్చే కారు: స్విఫ్ట్ నచ్చిన పుస్తకాలు: ద అల్కెమిస్ట్, ట్యూజ్‌డేస్ విత్ మోరీ నచ్చే హీరోలు: హృతిక్ రోషన్, మహేశ్‌బాబు నచ్చే హీరోయిన్లు: కాజోల్, సౌందర్య -
ఎప్పటికీ రజనీకాంత్ అభిమానినే : సౌందర్య
‘‘రజనీకాంత్‌లాంటి మంచి వ్యక్తికి బిడ్డలం అయ్యుండి, మేం కనుక అణకువగా ఉండకపోతే మేం ఇడియట్స్ కింద లెక్క. మా నాన్న అందరితోనూ ఒకేలా ఉంటారు. అందర్నీ గౌరవిస్తారు. అందుకే ‘నీ హీరో ఎవరు’ అనడిగితే, మా నాన్న పేరే చెబుతా’’ అంటున్నారు సౌందర్య. సూపర్‌స్టార్ రజనీ రెండో కుమార్తె ఆమె. తండ్రి హీరోగా ఓ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం దాదాపు ఏ కూతురికీ రాదు. అలాంటి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నందుకు ఆనందంతో పాటు పెద్ద బాధ్యతగా భావించానని సౌందర్య పేర్కొన్నారు. తన తండ్రి హీరోగా తన దర్శకత్వంలో రూపొందిన ‘కోచడయాన్’ గురించి సౌందర్య మాట్లాడుతూ -‘‘త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. నేను అన్ని రకాల భాషల సినిమాలు చూస్తాను. కానీ ఎప్పటికీ రజనీకాంత్ అభిమానినే. ఆయనను దర్శకత్వం వహించే అవకాశం రావడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. షూటింగ్ లొకేషన్లో ‘యాక్షన్’ చెప్పగానే, నాన్న పాత్రలో ఒదిగిపోయేవారు. ఆయన అద్భుతమైన నటనకు ‘కట్’ చెప్పడం మర్చిపోయి, తన్మయత్వంతో చూస్తుండిపోయేదాన్ని. సీన్ పూర్తయిన తర్వాత మానిటర్లో చూసుకుని, ఆనందంతో చప్పట్లు కొడుతూ నా గదిలోకి వెళ్లిపోయేదాన్ని. నా తీరు చూసి నాన్న నివ్వెరపోయేవారు. ఓసారైతే మా అమ్మగారు ఫోన్ చేసి, ‘ఏ సీన్ తీస్తున్నావు?’ అనడిగారు. ఆరోజు హీరో, హీరోయిన్‌పై రొమాంటిక్ సీన్ తీస్తున్నాం. దాంతో ‘నాన్నతో రొమాంటిక్ సీన్ చిత్రీకరిస్తున్నా’ అని అమ్మకి చెప్పాను. అప్పుడు మాత్రం అదోలా అనిపించింది. ఓ కూతురిలా ఈ షూటింగ్ లొకేషన్లో నాన్నకి అన్ని సౌకర్యాలు సమకూరేలా చూసుకున్నాను. మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చి, షూటింగ్ చేసేదాన్ని. అలాగే ఓ దర్శకురాలిగా టైమ్‌కి షూటింగ్ పూర్తయ్యేలా చూసుకునేదాన్ని. ఓ అభిమానిగా ఆయన నటనను ఎంజాయ్ చేసేదాన్ని. నేనూ నాన్న అభిమానినే కాబట్టి, అభిమానులు ఆయన్ను ఎలా చూడాలనుకుంటారో ఆ విధంగా ఆవిష్కరించాను. నాన్నతో సినిమా చేయడం జీవితంలో ఓ మర్చిపోలేని అనుభూతి’’ అన్నారు. -
ఆసియా కప్ హాకీ టోర్నీకి సౌందర్య, రజని
న్యూఢిల్లీ: గాయం నుంచి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య జాతీయ జట్టులో పునరాగమనం చేసింది. ఈనెల 21 నుంచి 27 వరకు కౌలాలంపూర్‌లో జరిగే ఆసియా కప్ మహిళల టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులోకి ఆమె ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఎతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా జట్టులో కొనసాగనుంది. మొత్తం 18 మంది సభ్యులుగల భారత జట్టుకు రీతూ రాణి నాయకత్వం వహిస్తుంది. చన్చన్ దేవి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఆసియా టోర్నీలో గ్రూప్ ‘ఎ’లో భారత్‌తో పాటు చైనా, మలేసియా, హాంకాంగ్ ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, చైనీస్ తైపీ జట్లు ఉన్నాయి. ఈనెల 21న హాంకాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ టోర్నీని ప్రారంభిస్తుంది. వచ్చే ఏడాది జరిగే మహిళల ప్రపంచకప్‌కు దీనిని అర్హత టోర్నీగా పరిగణిస్తున్నారు.