తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్ర నరసింహ( తమిళంలో పడయప్ప). ఈ చిత్రంలో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. అయితే పేద అమ్మాయి పాత్రలో సౌందర్య కనిపించగా.. ధనిక అమ్మాయి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈ చిత్రం తమిళంలో పడయప్పా పేరుతో తెరకెక్కించగా. . తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేశారు. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. ఈ చిత్రంలో శివాజీ గణేశన్, లక్ష్మి, సితార, నాజర్, రాధా రవి, సత్యప్రియ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగులో నరసింహ పేరుతో ఓకేసారి విడుదలైంది.
(ఇది చదవండి: రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్)
అయితే ఈ చిత్రంలో ఓ ఆసక్తికర సన్నివేశం అభిమానులకు ఇప్పటికీ గుర్తు ఉంటుంది. సౌందర్యను ఇష్టపడుతున్న రజినీకాంత్‌ను రమ్యకృష్ణ ప్రేమిస్తుంది. కానీ పెద్దల అంగీకారంతో సౌందర్యను పెళ్లి చేసుకునేందుకు రజినీకాంత్ ఒప్పుకుంటాడు. దీంతో సౌందర్యతో రమ్యకృష్ణ మధ్య శత్రుత్వం పెరుగుతుంది. అదే సమయంలో ఇద్దరి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంటుంది. ఆ సీన్‌లో సౌందర్య చెంపపై రమ్యకృష్ణ తన పాదం ఉంచి ఆమెను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. అయితే ఆ సందర్భంలో అలా నటించేందుకు చాలా కష్టంగా అనిపించిందని అన్నారామె. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సన్నివేశం గురించి రమ్యకృష్ణ మాట్లాడారు.
ఆ సీన్‌లో చేయలేకపోయా
రమ్యకృష్ణ మాట్లాడుతూ..' ఆ చిత్రంలో నా రోల్ సౌందర్యపై పగ తీర్చుకోవడం. అందుకే అలాంటి అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ మొదట ఆ సీన్ చేయలేకపోయా. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. చివరికి ఆ షాట్ నాకు ఇష్టం లేదు. సినిమా తప్పకుండా చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చేసేటప్పుడు దేవుళ్లందరినీ మనసులో స్మరించుకున్నా. ఆ తర్వాతే సౌందర్యపై చెంపపై కాలు పెట్టా. ఆ సీన్‌లో నటించిన కొన్ని రోజుల తర్వాత అదే మూడ్‌లో ఉన్నా.' అని చెప్పుకొచ్చింది.
(ఇది చదవండి: షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!)
అయితే ఆ సినిమా షూటింగ్‌లో సౌందర్య, రమ్యకృష్ణల మధ్య గొడవ జరిగిందని కూడా వార్తలు కూడా వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇద్దరు హీరోయిన్స్ ఆ వార్తలను ఖండించారు. అయితే సౌందర్య, రమ్యకృష్ణలు ఎంత పెద్ద హీరోయిన్స్ అయినా వారి మధ్య మంచి స్నేహం ఉండేదని అంటున్నారు. సౌందర్య చనిపోయినప్పుడు రమ్యకృష్ణ చాలా బాధపడ్డారని తెలిసింది. ఇక రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే గతేడాది 'రంగ మార్తాండ' చిత్రంలో కనిపించింది. ఇటీవల రిలీజైన రజినీకాంత్ జైలర్ చిత్రంలోనూ కీలకరపాత్రలో నటించింది. మరోవైపు మహేష్ బాబు చిత్రం ‘గుంటూరు కారం’లో రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment