Ramyakrishna
-
రమ్యకృష్ణ తర్వాత ఆ ఛాన్స్ మంజు వారియర్‌కు ఇచ్చిన రజనీకాంత్
సీనియర్ హీరోలు కమలహాసన్, రజనీకాంత్, అజిత్ వంటి వారు తమ వయసుకు తగ్గ కథాపాత్రల్లో నటించడం మొదలెట్టి చాలా కాలమే అయ్యింది. నటుడు విజయ్ కూడా లియో చిత్రంతో ఆ తరహా పాత్రల్లో నటించడం మొదలెట్టారు. అలాగు ఈ హీరోలు తమ వయసుకు తగ్గ హీరోయిన్లతోనే నటిస్తున్నారు. అలా నటుడు రజనీకాంత్ సమీపకాలంలో సీనియర్ నటీమణులతోనే నటిస్తున్నారు. ఈయన పీక్ టైమ్‌లో నటించలేని నేటి సీనియర్ నటీమణులు సిమ్రాన్, త్రిష, ఈశ్వరీరావు, రమ్యకృష్ణ వంటి వారికి ఇప్పుడు అవకాశాలు వరిస్తున్నాయి. కాగా తాజాగా నటుడు రజనీకాంత్ వేట్టైయాన్ అనే చిత్రాన్ని పూర్తి చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైభీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇంతకు ముందు నటించని నటుడు ఫాహత్ఫాజిల్, రానా దగ్గుపాటి, నటి మంజువారియర్, రిత్వికా సింగ్, దుషారా విజయన్ తదితరులు నటిస్తున్నారు. ముఖ్యంగా నటుడు ఫాహత్ ఫాజిల్ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి చిత్రం అంతా ఉండే వినోదభరిత పాత్రలో నటించినట్లు సమాచారం. అలాగే నటి మంజువారియర్ ఇందులో రజనీకాంత్‌కు భార్యగా నటించనట్లు తనే ఒక కార్యక్రమంలో చెప్పారు. మలయాళంలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈమె ఇంతకు ముందు తమిళంలో నటుడు అజిత్ సరసన తుణివు, ధనుష్‌కు జంటగా అసురన్ వంటి చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. కాగా వేట్టైయాన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
మంత్రి రోజాకు మద్దతుగా మీనా.. బండారుపై కోర్టు చర్యలు తీసుకోవాలని..
సాక్షి, హైదరాబాద్: మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి మీనా కూడా మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. సత్యనారాయణ వెంటనే మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా నటి మీనా ఓ వీడియోలో మాట్లాడుతూ.. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు చేశారు. బండారు తక్షణమే మంత్రి రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలి. బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమయ్యేలా ఉన్నాయి. అతని అభద్రత భావం, అసూయకి నిదర్శనం. మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి నాకు తెలుసు. ఆమెతో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె గురించి నాకు పూర్తిగా తెలుసు. రోజా చాలా చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే దృఢమైన మహిళ. రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటిలోనూ సక్సెస్ అయిన వ్యక్తి. ఆమెపై ఇలా నీచంగా మాట్లాడితే రోజా భయపడుతుంది అనుకుంటున్నారా?. మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారు సత్యనారాయణకి ఎవరిచ్చారు. ఇలా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడి పోతారు అనుకుంటున్నవా?. మంత్రి రోజా చేసే పోరాటానికి నేను అండగా ఉంటాను అని మీనా.. మంత్రి రోజాకు తన మద్దతు ప్రకటించారు. -
ఆ మాటలనడానికి నోరెలా వచ్చింది
సాక్షి, అమరావతి: మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి, ఎంపీ నవనీత్ కౌర్, నటీమణులు రమ్యకృష్ణ, కవిత వంటి వారు రోజాకు మద్దతుగా నిలిచారు. రోజా గురించి ఆ మాటలనడానికి నోరెలా వచ్చిందని మండిపడ్డారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు తెలుగు సినిమాల్లో నటించిన నటి, ఎంపీ (మహారాష్ట్ర అమరావతి లోక్‌సభ నియోజకవర్గం) నవనీత్ కౌర్ బండారుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోజాకు మద్దతుగా ఆమె తెలుగులో మాట్లాడుతూ వీడియో విడుదల చేశారు. రోజాకు దేశంలోని మహిళా లోకమంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ‘మహిళా ప్రజా ప్రతినిధిపై ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గులేదా? నీకు ఇంటిలో భార్య, కూతురు, సోదరి వంటి వాళ్లు ఎవ్వరూ లేరా? ఇంత నీచంగా మాట్లాడటానికి నోరెలా వచ్చింది? తెలుగు అమ్మాయిలాగా తెలుగులో మాట్లాడుతుంది, తెలుగు సినిమాల్లో పని చేసింది అంటూ ఏపీ, తెలంగాణ ఎంపీలు నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు. ఎంతో మంది అగ్ర హీరోలతో పని చేసి ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన రోజాపై ఇంత దిగజారి మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం కావాలి’ అంటూ బండారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు రాజకీయాలు ముఖ్యమా లేక తెలుగు మహిళల గౌరవం ముఖ్యమా అన్నది తేల్చుకోవాలని అన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ఖండించాలి: కవిత తెలుగుదేశం పార్టీ నేతలు మహిళలపై దిగజారి మాట్లాడుతున్నారని సినీ నటి, తెలుగుదేశం పార్టీ మాజీ మహిళా నేత కవిత ధ్వజమెత్తారు. మహిళా మంత్రి రోజాపై బండారు సత్యానారాయణ అత్యంత హేయంగా మాట్లాడారని అన్నారు. ఆయన వ్యాఖ్యలను భువనేశ్వరి, బ్రాహ్మణి వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. దరిద్రపు మాటలు ఎలా మాట్లాడారో తెలియడంలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు రాజకీయాలను ఇంతలా దిగజారుస్తారనుకోలేదన్నారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత నీచంగా మాట్లాడతారా?: రమ్యకృష్ణ భారత మాతాకి జై అని గర్వంగా చెప్పుకొనే మన దేశంలోఒక మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ సినీ నటి రమ్యకృష్ణ బండారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్ తో సంబంధం లేకుండా బండారు వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు. ఓ మహిళగా, నటిగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానని చెప్పారు. నీచమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యానారాయణను క్షమించకూడదన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలి అల్లూరి జిల్లాలో మహిళల నిరసన.. కొవ్వొత్తుల ర్యాలీ సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): పర్యాటకశాఖ మంత్రి రోజాను అసభ్యకరంగా దూషించిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. బండారు సత్యనారాయణ వైఖరిని ఖండిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యాన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడి జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. బండారు ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మంత్రి రోజాతోపాటు మహిళా సమాజానికి బండారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్న బండారు సత్యనారాయణకు టీడీపీ నేతలు మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. బండారుపై కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీకే చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గతంలో మహిళా మున్సిపల్ కమిషనర్‌ను అసభ్య పదజాలంతో దూషించడం, చింతమనేని ప్రభాకర్ ఏకంగా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేయడం వంటి దారుణమైన ఘటనలు రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఎస్.రాంబాబు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, పాడేరు మార్కెట్ కమిటీ చైర్మన్ కూతంగి సూరిబాబు, పలువురు నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, మంత్రి రోజాను బండారు సత్యనారాయణ అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ పాడేరులో కొవ్వొత్తులతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పలువురు నేతలు ర్యాలీ నిర్వహించారు. -
ఆ సీన్ చేయడం నాకు ఇష్టం లేదు.. కానీ: రమ్యకృష్ణ
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్ర నరసింహ( తమిళంలో పడయప్ప). ఈ చిత్రంలో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. అయితే పేద అమ్మాయి పాత్రలో సౌందర్య కనిపించగా.. ధనిక అమ్మాయి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈ చిత్రం తమిళంలో పడయప్పా పేరుతో తెరకెక్కించగా. . తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేశారు. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. ఈ చిత్రంలో శివాజీ గణేశన్, లక్ష్మి, సితార, నాజర్, రాధా రవి, సత్యప్రియ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగులో నరసింహ పేరుతో ఓకేసారి విడుదలైంది. (ఇది చదవండి: రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్) అయితే ఈ చిత్రంలో ఓ ఆసక్తికర సన్నివేశం అభిమానులకు ఇప్పటికీ గుర్తు ఉంటుంది. సౌందర్యను ఇష్టపడుతున్న రజినీకాంత్‌ను రమ్యకృష్ణ ప్రేమిస్తుంది. కానీ పెద్దల అంగీకారంతో సౌందర్యను పెళ్లి చేసుకునేందుకు రజినీకాంత్ ఒప్పుకుంటాడు. దీంతో సౌందర్యతో రమ్యకృష్ణ మధ్య శత్రుత్వం పెరుగుతుంది. అదే సమయంలో ఇద్దరి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంటుంది. ఆ సీన్లో సౌందర్య చెంపపై రమ్యకృష్ణ తన పాదం ఉంచి ఆమెను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. అయితే ఆ సందర్భంలో అలా నటించేందుకు చాలా కష్టంగా అనిపించిందని అన్నారామె. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సన్నివేశం గురించి రమ్యకృష్ణ మాట్లాడారు. ఆ సీన్లో చేయలేకపోయా రమ్యకృష్ణ మాట్లాడుతూ..' ఆ చిత్రంలో నా రోల్ సౌందర్యపై పగ తీర్చుకోవడం. అందుకే అలాంటి అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ మొదట ఆ సీన్ చేయలేకపోయా. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. చివరికి ఆ షాట్ నాకు ఇష్టం లేదు. సినిమా తప్పకుండా చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చేసేటప్పుడు దేవుళ్లందరినీ మనసులో స్మరించుకున్నా. ఆ తర్వాతే సౌందర్యపై చెంపపై కాలు పెట్టా. ఆ సీన్లో నటించిన కొన్ని రోజుల తర్వాత అదే మూడ్‌లో ఉన్నా.' అని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!) అయితే ఆ సినిమా షూటింగ్లో సౌందర్య, రమ్యకృష్ణల మధ్య గొడవ జరిగిందని కూడా వార్తలు కూడా వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇద్దరు హీరోయిన్స్ ఆ వార్తలను ఖండించారు. అయితే సౌందర్య, రమ్యకృష్ణలు ఎంత పెద్ద హీరోయిన్స్ అయినా వారి మధ్య మంచి స్నేహం ఉండేదని అంటున్నారు. సౌందర్య చనిపోయినప్పుడు రమ్యకృష్ణ చాలా బాధపడ్డారని తెలిసింది. ఇక రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే గతేడాది 'రంగ మార్తాండ' చిత్రంలో కనిపించింది. ఇటీవల రిలీజైన రజినీకాంత్ జైలర్ చిత్రంలోనూ కీలకరపాత్రలో నటించింది. మరోవైపు మహేష్ బాబు చిత్రం ‘గుంటూరు కారం’లో రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, సునీల్, బాలీవుడ్ నటులు సంజయ్ దత్, జాకీష్రాప్, శాండల్‌వుడ్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, మోహన్ లాల్, యోగిబాబు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?) ట్రైలర్ చూస్తే జైలర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ప్రారంభంలోనే కాల్పులు, బాంబు మోతలతో దద్దరిల్లింది. 'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే' అనే రజినీకాంత్ డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. కాగా.. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా జైలర్ చిత్రాన్ని ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా.. ఇకపోతే సాధారణంగా చిత్రాల్లో హీరోలకు ఇంట్రో సాంగ్ ఉంటుంది. అయితే జైలర్ చిత్రంలో నటి తమన్న ఇంట్రో సాంగ్‌లో మెరవబోతుండటం విశేషం. తమన్నా సాంగ్ కచ్చితంగా జైలర్ చిత్రానికి ప్రత్యేక తీసుకొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. (ఇది చదవండి: 'జైలర్'పై నో బజ్.. వ్యాపారం కూడా అలానే!) -
ఓటీటీలో రంగమార్తాండ.. అప్పుడే రిలీజ్!
ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల థియేటర్లలో అలరిస్తోంది. మరాఠీ సూపర్ హిట్ ‘నట సామ్రాట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రంగమార్తాండ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేగాక.. సినిమాకు పెట్టిన బడ్జెట్లో దాదాపు 70 శాతానికి పైగా రికవరీ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. -
అప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను: కృష్ణ వంశీ
‘‘రంగమార్తాండ’ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఒక చిన్నారి నా వద్దకు వచ్చి, ‘నేను మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటాను’ అని చెప్పడం విశేషం. ప్రతిఒక్కరూ తమ తల్లితండ్రులతో కలిసి ఈ సినిమాను చూడాలి’’ అని డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ–‘‘రంగమార్తాండ’ సినిమాకి ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణల అద్భుతమైన నటన, ఇళయరాజాగారి సంగీతం, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం.. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. రమ్యకృష్ణ కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దీంతో ఎలాంటి పెద్ద డైలాగులు లేకుండా కళ్లతోనే నటించాలని చెప్పినప్పుడు తను సరేనంది. ఈ మూవీ క్లైమాక్స్‌లో రమ్యకృష్ణపై సన్నివేశాలు తీసేటప్పుడు చాలా బాధపడ్డాను. దాదాపు 36 గంటల పాటు ఈ సీన్స్ తీశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది.. చిత్రీకరిస్తుంటే కంట్లో నుంచి నాకు నీళ్లు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ వంటి మంచి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు సింగర్, నటుడు రాహుల్ సిప్లిగంజ్. -
రంగమార్తాండ వచ్చేస్తున్నాడు
థియేటర్స్‌కు రావడానికి రెడీ అయ్యాడు రంగ మార్తాండ. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ‘‘ఈ మార్చి 22న రంగమార్తాండుడి జీవన నాటకం..’ అని పేర్కొన్నారు దర్శకుడు కృష్ణవంశీ. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు ΄ోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ రూ΄÷ందింది. -
నన్ను క్షమించగలవా?
ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ మార్తాండ’. నటుడు బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. బ్రహ్మానందం పుట్టినరోజు (ఫిబ్రవరి 1) సందర్భంగా ‘రంగ మార్తాండ’ నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘‘ధగ ధగ్గాయ రాజమకుట సువర్ణ మణిగణ రాజరాజేశ్వరా, సుయోధన సౌర్వభౌమ.. శరాఘతాలతో ఛిద్రమై.. ఊపిరి ఆవిరై దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ.. అఖండ భారత సామ్రాజ్యాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కానుకగా ఇస్తానని శుష్క వాగ్దానాలు వల్లెవేసిన ఈ దౌర్భాగ్యుడికి కడసారి దర్శనం కల్పిస్తున్నావా? నా దైవ స్వరూపమా.. నన్ను క్షమించగలవా?’’ అంటూ భావోద్వేగంతో బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్‌తో గ్లింప్స్ సాగుతుంది. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా. -
జైలర్‌తో పోరాటం!
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్’. ఇందులో రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా చెన్నైలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్. ఈ చిత్రంలో ఆయన ముఖ్య పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్, శివరాజ్‌కుమార్ కాంబినేషన్లో పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్ టాక్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. -
‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇందులో బాహుబలి, దేవసేన, కట్టప్ప, భళ్లాలదేవుడు, కాలకేయ, శివగామి పాత్రలు ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. అందులో ముఖ్యంగా రాజమాత శివగామి రోల్‌ను ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ పవర్ఫుల్ రోల్ చేసిన రమ్యకృష్ణకు విశేషమైన గుర్తింపు దక్కింది. చదవండి: చిరు ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘మెగా154’ నుంచి క్రేజీ అప్డేట్ ఈ పాత్ర ఆమె కోసమే క్రియేట్ చేశారా? అనేంతగ రాజమాతగా రమ్యకృష్ణ ఒదిగిపోయారు. ఇందులో శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరే నటి చేసిన అంతగా గుర్తింపు వచ్చి ఉండేది కాదని రాజమౌళితో సహా అందరు అభిప్రాయపడ్డారు. అయితే మొదట ఈ రోల్ కోసం రాజమౌళి మంచు లక్ష్మిని సంప్రదించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్‌కు అమ్మగా తాను చేయలేనని మంచు లక్ష్మి ఈ ఆఫర్‌ను వదులుకుంది. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో స్వయంగా మంచు లక్ష్మియే చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె బాహుబలిలో తాను శివగామి పాత్ర చేయనందుకు గర్వపడుతున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: 31 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ కాబోతోన్న ‘దళపతి’ కాంబినేషన్ ‘బాహుబలిలో శివగామి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అయితే ప్రభాస్‌కు తల్లిగా చేయాలనుకోలేదు. ఇండియాలో మనం ఒక పాత్ర పోషించిన తర్వాత దానిలోనే ఉండిపోతాం. కానీ నేను మాత్రం ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలనుకోలేదు. బాహుబలి సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక .. నిజానికి నేను చాలా గర్వపడ్డాను. హమ్మయ్యా.. నేను ఆ సినిమా చేయలేదు అనుకున్నాడు. అది ఓ ప్రత్యేకమైన సినిమా కావచ్చు. కానీ ఆ పాత్రకు నేను కరెక్ట్ అనిపించలేదు. నా జీవితం.. నా కెరీర్ దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నాను. అలాగే నేను నా కెరీర్లో నేను చేసిన ఐరేంద్రి(అనగనగా ఓ ధీరుడు చిత్రంలోని పాత్ర) లాంటి పాత్ర ఇంకోటి రాలేదు. ఇక మీదట రాదు కూడా’ అని ఆమె పేర్కొంది. -
చీరకట్టులో రమ్యకృష్ణ ఇబ్బందులు.. అయినా ఫొటోలకు పోజులు
Ramya Krishnan Gets Irritated With Saree Video Goes Viral: ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ అందం, నటన, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీలాంబరిగా.. శివగామిగా.. ఇలా ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్‌కే కొత్త అర్థం తీసుకొస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం ప్రాధాన్యత గల పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. బాహుబలిలో శివగామిగా అలరించిన రమ్య కృష్ణ 'బంగార్రాజు', 'రొమాంటిక్' సినిమాల్లో కీలక పాత్రల్లో సందడి చేసింది. తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగ్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' మూవీలో మరో పవర్ఫుల్ పాత్రతో ముందుకు రానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడీగా నటించిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగానే ముంబైలో పలు ఇంటర్వ్యూలూ నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ ప్రమోషన్స్‌లో రమ్యకృష్ణ పాల్గొంది. ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ కనువిందు చేసింది. స్టూడియో బయట ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తూ సందడి చేసింది. సన్నని గాలి తాకుతుంటే పలుచని చీరలో రమ్యకృష్ణ అందం మతిపోగెట్టాల ఉంది. గాలికి చీర సర్దుకుంటూ, జుట్టు సవరించికుంటూ కొంచెం ఘాటుగానే దర్శనమిచ్చింది శివగామి. అయితే అలా గాలికి చీర జరగడంతో రమ్యకృష్ణ కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. చదవండి: నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరని గూగుల్ చేసేవాడిని: నితిన్ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నీలాంబరికి ఇంకా వయసు అవ్వలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 'లైగర్'లో విజయ్ దేవరకొండకు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. మరీ ఈ పాత్రతో రమ్యకృష్ణ ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
హిట్టు కోసం అలా చేయడం నాకు చేతకాదు : కృష్ణవంశీ
ట్రెండ్ అనేది ఉందా? నో అంటారు కృష్ణవంశీ. ప్రేక్షకుల మైండ్‌సెట్ మారిందా? అస్సలు కానే కాదు అంటారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ముఖ్య తారలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ మార్తాండ’. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది. ఇక కృష్ణవంశీ ఇంటర్వ్యూలోకి వెళదాం... ► మీ కెరీర్లో ‘రంగ మార్తాండ’ రెండో రీమేక్ (నాగార్జునతో తీసిన ‘చంద్రలేఖ’ మలయాళ రీమేక్ ). మళ్లీ రీమేక్ సినిమా చేయాలని ఎందుకనుకున్నారు.. కథలు రాయలేకపోతున్నారా? కృష్ణవంశీ : (నవ్వుతూ)... కథలు రాయలేకపోవడం కాదు. ‘రంగ మార్తాండ’ నేను చేయాలనుకున్నది కాదు. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్’ రీమేక్‌లో నటించడంతో పాటు డైరెక్ట్ చేయాలనుకున్నాడు ప్రకాశ్‌రాజ్. ‘ఈ సినిమాని రీమేక్ చేయా లనుకుంటున్నాను. నాకు స్క్రీన్ ప్లేలో సహాయం చెయ్’ అని అడిగాడు. ఒకరోజు రాత్రి కూర్చుని చూడటం మొదలెట్టా.. ఒకచోట కాదు ఐదార్లు చోట్ల ఏడుపొచ్చేసింది. ‘ఇది ఎక్స్ట్రార్డినరీ సినిమా. రీమేక్ చెయ్, నీకు ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను’ అని ప్రకాశ్‌తో అన్నాను. ‘నేను డైరెక్ట్ చేసి యాక్ట్ చేయడం కంటే నువ్వెలాగూ ఎమోషన్స్‌ని అద్భుతంగా డీల్ చేస్తావు. నన్ను కూడా బాగా డీల్ చేస్తావు. నువ్వు డైరెక్ట్ చేస్తే బావుంటుంది. నాకోసం చెయ్’ అన్నాడు. సరే అన్నాను. అలా ‘రంగ మార్తాండ’ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ► ‘నట సామ్రాట్’లో మిమ్మల్ని అంతగా కదిలించినదేంటి? ఇది మన తల్లిదండ్రుల కథ. మన తల్లిదండ్రులకు కావాల్సినంత విలువ ఇస్తున్నామా? లేదా గౌరవించి తప్పుకుంటున్నామా? అనే పాయింట్ ఉంది. సామాజిక పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వల్ల మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మారుతోంది. సక్సెస్ సాధించాలని పరుగు తీయడంలోనో, అందరితో పొగిడించుకోవాలనే ప్రయత్నంలోనో, అందరికంటే అధికుణ్ణి అనిపించుకోవాలనే తపనలోనో మనల్ని మనం కోల్పోతున్నాం. అది ‘నట సామ్రాట్’లో నాకు కనిపించింది. ఇది ఒక స్టేజ్ యాక్టర్ కథ. అతను స్టేజ్ మీద విలువలతో బతికినవాడు.. బ్రహ్మాండమైన నటుడు. అందుకే ‘రంగ మార్తాండ’ అనే బిరుదు ఇస్తారు. ఆ బిరుదు వచ్చిన రోజునే అతను నటనకి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. అప్పటివరకూ నటుడిగా రంగుల ప్రపంచం, నిరంతరం చప్పట్ల మధ్య ఉండే అతను నిజ జీవితంలో తండ్రిగా, తాతగా, భర్తగా, స్నేహితుడిగా తన పాత్ర పోషించే సమయంలో లైఫ్‌లో ఎంతమంది నటులున్నారో తెలుస్తుంది. అతను నమ్మిన ఆదర్శాలకు, బయట నిజాలకు క్లాష్ అవుతుంది. తల్లిదండ్రులు స్వార్థపరులయిపోయారు. పిల్లలు స్వార్థపరులయిపోయారు అని నిందించకుండా ఎవరి పాయింట్లో వాళ్లే కరెక్ట్ అన్నట్టు చూపిస్తూ, వాళ్ల మధ్య క్లాష్ ఎలా వస్తుంది? అనేదే ఈ కథ. ► ‘రంగ మార్తాండ’ మళ్లీ మిమ్మల్ని హిట్ ట్రాక్‌లోకి తీసుకుని వస్తుందనుకుంటున్నారా? నేను ఇలా చెబితే నమ్మశక్యంగా ఉంటుందో లేదో తెలియదు కానీ హిట్ కోసం నేనెప్పుడూ సినిమా తీయలేదు. తీసిన తర్వాత జనానికి నచ్చితే హిట్ అవుతుంది అనుకునేవాణ్ణి. హిట్ కోసం తీయాలంటే అప్పటికి మార్కెట్లో ఉన్న హిట్ ఫార్ములాని వాడాలనిపిస్తుంది. అప్పుడు అది సినిమా మ్యానుఫాక్చరింగ్ అవుతుంది తప్ప మేకింగ్ అవ్వదు. అలా చేయడం నాకు చేతకాదు. ఒకవేళ హిట్ కోసమే చేసేలా అయితే మంచి థ్రిల్లర్ సబ్జెక్టో, హీరో ఓరియంటెడ్ కథలో చేస్తాను కానీ ఇదెందుకు చేస్తాను? ఒకవేళ అలాంటి సినిమాలు తీసినా హిట్ అవుతాయని గ్యారంటీ ఏంటి? నా అనుభవంలో నాకు అర్థమయిందేంటంటే ఎవ్వరూ హిట్ సినిమా తీయలేరు. తీసిన సినిమాలు హిట్ అవుతాయి... అంతే. ► ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా హవా సాగుతోంది. ఈ ట్రెండ్‌ని మీరెలా చూస్తారు? నా చిన్నప్పటినుంచి మా ఊర్లో హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మన సినిమా (తెలుగు) దేశం నలు మూలలకు వెళుతోంది. అన్ని ప్రాంతాల వాళ్లు ఆదరిస్తున్నారు. ఇది కేవలం సౌత్ సినిమాలా కాకుండా సౌత్ సినిమాని కూడా ఇండియన్ సినిమాగా చేయొచ్చు అనే అర్థంతో పాన్ ఇండియా సినిమా అంటున్నారని అనుకుంటున్నాను. ► మీరు పాన్ ఇండియా సినిమా ట్రై చేస్తారా? ఏమో చెప్పలేం. అది సినిమాను బట్టి ఉంటుంది. ► కరోనా వల్ల ఇండస్ట్రీలో చాలామందికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. కానీ దానికంటే ముందే మీకు రెండేళ్లు గ్యాప్ వచ్చింది.. కారణం? ఆటోమేటిక్‌గా వచ్చేసింది అలా. ఫ్లాప్ అయిన తర్వాత పుంజుకోవడం కష్టం. హిట్.. ఫ్లాప్ అనేది నేను తీసుకోను. కానీ ఆ ఎఫెక్ట్ నా మీదుంటుంది. హిట్ కోసమని మెట్టు దిగి, దిగజారి ప్రజల్ని మభ్యపెట్టి సినిమా తీయలేను. రాజీ పడలేను. ఎంత ఆకలేసినా సింహం గడ్డి తినదు కదా. గ్యాప్ అయితే ఫ్లాప్స్ వల్లే వచ్చింది. హిట్ ఇస్తుంటేనే ఇండస్ట్రీలో ఫాస్ట్‌గా ఉంటాం. ► ప్రేక్షకుల మైండ్ సెట్ మారిందని కొంత వల్గర్ కామెడీ, రేంజ్‌కి మించిన వయొలెన్స్ తీస్తున్నారు కొందరు... దీని గురించి మీరేం అంటారు? ప్రేక్షకుల మైండ్ సెట్ మారలేదని నా అభిప్రాయం. అయినా ఇదో ఫేజ్ అనుకుంటున్నాను. మనం ఆ తరం (పాత సినిమాలు) చూశాం కాబట్టి ఇప్పుడు సినిమాలు చూసి బాధపడతాం. కానీ ఇప్పటివాళ్లు ఇవే చూశారు కాబట్టి వారికి ఇదే కరెక్ట్ అనిపిస్తుందేమో. ► ఫార్ములా ఫాలో కాకపోతే మీరు పోటీలో ఎలా నిలబడతారు? సినిమా తీసే ఫార్మాట్ ఒక్కటే మారింది. బేసిక్ ఎమోషన్స్ అన్నీ అవే. అదే లవ్, అదే ఫ్యామిలీ, అదే విలనిజం అన్నీ అవే. మంచి మీద చెడు గెలుస్తుంది అని చివర్లో చెప్పడం. కొన్నిసార్లు రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతాయి. అలా అని ప్రయాణం మానేస్తామా? మన ప్రయాణం మనది. మనం ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకుండా, వీలైతే మన వల్ల కొందరైనా పాజిటివ్‌గా ఉండగలుగుతున్నారా అనేదే మనం పట్టించుకోవాల్సింది. సో.. పోటీ గురించి భయపడటం, బాధపడటం నాకు రాదు. ► అలాగే ఒకప్పుడు ఎమోషన్ అంటే బలంగా చూపించేవారు. ఇప్పుడు కొన్ని చిత్రాల్లో లైటర్‌వీన్‌గా కనిపిస్తోంది. అదేమంటే ట్రెండ్ మారిందంటున్నారు... ఎమోషన్ని స్ట్రాంగ్‌గా చూపించడానికి ఇష్టపడటంలేదా? తెలియడం లేదా? చేతకావడం లేదా? దాసరిగారిలా, కేవీ రెడ్డిగారిలా, విశ్వనాథ్‌గారిలా సినిమాలు తీయలేం. అలా ఎవ్వరూ తీయలేరు కాబట్టి ట్రెండ్ మారింది అనుకుందామా? కరెక్ట్‌గా తీయగలిగితే అలా అనుకోనక్కర్లేదా? మరి.. కరెక్ట్‌గా తీయడం అంటే ఏంటని నన్ను అడగకండి. నాక్కూడా తెలియదు. ‘శంకరాభరణం’ సినిమాను ప్రపంచం ఆదరించింది కదా? ట్రెండ్ అంటూ ఏదీ లేదు. ట్రెండ్ అంటే నా దృష్టిలో బూతు. మనకు రామాయణం, మహాభారతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నీ అందర్నీ నీతిగా నిజాయితీగా సామరస్యంగా ఉండాలనే బోధించాయి. ఏ మతమయినా ఇదే చెప్పింది. ఇప్పటికీ మనం వాటినే అనుసరిస్తున్నాం. ఇప్పుడు సినిమా కూడా ఒక మతంలా అయిపోయింది. ఏం మాట్లాడాలి? ఏం బట్టలు వేసుకోవాలి? అన్నీ సినిమా చెబుతుంది. సో... అలాంటి మీడియమ్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం ఏం చేసినా సోషల్ బెనిఫిట్ ఉండాలి. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్.. ఇలా అన్నింటికీ ఉపయోగపడేలా తీయాలి. ► ‘రంగ మార్తాండ’కి చిరంజీవి చెప్పిన వాయిస్ ఓవర్ గురించి? ఒక నటుడు తనని తనెలా అర్థం చేసుకుంటాడు? అనేది ఓ కాన్సెప్ట్‌లా అనుకుని, వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకున్నాను. రచయిత లక్ష్మీ భూపాల్‌తో రెగ్యులర్ పాటలా.. మాటాలా వద్దు.. షాయిరీలా చెప్పిద్దాం.. అలా రాయమని అన్నాను. ఇదే మాట ఇళయరాజాగారికి చెబితే ‘నువ్వు రాయించుకుని తీసుకురా చేద్దాం’ అన్నారు. బ్రహ్మాండంగా వచ్చింది. ఈ వాయిస్ ఓవర్‌ని ఏదైనా పెద్ద యాక్టర్‌తో చెప్పిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు తట్టినవి రెండే పేర్లు. సీనియర్ ఎన్టీఆర్‌గారు... చిరంజీవిగారు. చిరంజీవిగారికి ఫోన్ చేస్తే, రమ్మన్నారు. వెళ్లి, వివరించాను. షాయరీ ఐడియా విని ఆయన థ్రిల్లయ్యారు. ‘నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంది’ అన్నారు. ► అన్నం’ సినిమా అనౌన్స్ చేశారు? ‘రంగ మార్తాండ’ తర్వాత అదే చేస్తాను. ‘సింధూరం, ఖడ్గం, మహాత్మ’ ఆ జోన్ ఫిల్మ్ ఇది. ఫుడ్ మాఫియా, వ్యవసాయం, అన్నం, మనిషి తన స్వార్థం కోసం ఆవుల్ని, కోళ్లను ఎలా వాడుకుంటున్నాడు? అనేది కాన్సెప్ట్. ► ‘రంగ మార్తాండ’ సినిమాలో ఒక నటుడు తన రియల్ లైఫ్ గురించి ఏం తెలుసుకున్నాడో చూపిస్తున్నారు. మరి.. మీ లైఫ్‌ని విశ్లేషించుకుంటే మీకేమనిపిస్తోంది? నా అర్హతకి కొన్ని వేల రెట్లు ఎక్కువే ఇచ్చింది ఈ జీవితం. ఇప్పుడు నా మనసిక స్థితి ఎలా ఉందంటే.. ఏం చేసినా అది నేను చేయలేదు. అది (విధి) చేయించింది నాతో. ఎంత కాలం చేయించదలచుకుంటే అంత కాలం చేయిస్తుంది. నేనంటూ ఏం కోరుకోవడం లేదు. మన పుట్టుక మన కంట్రోల్లో లేదు. ఎప్పుడు పోతామో కూడా తెలియదు. మా ఊరి నుంచి మద్రాస్ తోసింది, అక్కడి నుంచి వర్మగారి దగ్గరకు తోసింది హైదరాబాద్‌కు. అక్కడ నుంచి దర్శకుడిని అయ్యాను. అన్నీ అలా జరుగుతూ వచ్చేశాయి.. అంతే. ► చాలామంది ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.. మీకు ఆ ఉద్దేశం లేదా? వచ్చే ఏడాది చేసే ప్లాన్ ఉంది. ఇప్పుడే చెప్పను కానీ పెద్ద బ్లాస్ట్ అది. 200–300 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఓటీటీలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. స్టార్సే ఉండాలని రూల్ కూడా లేదు. సినిమాను స్వచ్ఛంగా తీయొచ్చు. ► మీ సినిమాల్లో హీరోలతో బ్రహ్మాండంగా నటింపజేశారు. మీ అబ్బాయి రిత్విక్తో సినిమా చేస్తారా? వాడేం అవ్వాలనుకుంటాడో అది వాడి ఇష్టం. కాసేపేమో ఫుట్‌బాల్ అంటాడు. రేసర్ అంటాడు. యాక్టర్ అంటాడు. ఇప్పుడు టీనేజ్‌లో ఉన్నాడు కదా. కొత్తది ఏది చూసినా దాని మీదకు ధ్యాస వెళ్లిపోతుంది. ► మీ అబ్బాయి ఏమైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనేం అనుకోవడంలేదు. వాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నాకు, రమ్యకృష్ణకి బిడ్డ అయ్యాడంటేనే వాడి అదృష్టం మీకు అర్థం అవుతుంది కదా (నవ్వుతూ). – డి.జి. భవాని -
ఇదొక ఆధ్యాత్మిక అనుభవం
‘‘నా జీవితంలో నేను సంపాదించిన అతి పెద్ద అమూల్యమైన ఆస్తి (సంగీత దర్శకుడు ఇళయరాజాని ఉద్దేశించి). ఇది ఆ భగవంతుని ఆశీర్వాదం. గొప్ప విషయాలు ఏదో ఒక టైమ్‌లో ముగిసిపోతాయి. అలాగే,, మా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో సంతృప్తికరంగా, విజయవంతంగా పూర్తయింది. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం’’ అని దర్శకుడు కృష్ణవంశీ ట్వీట్ చేశారు. ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతదర్శకుడు. ఆయన ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా జరిగిన నేపథ్య సంగీతం గురువారంతో పూర్తయింది. ఈ విషయాన్ని పేర్కొని, ఇళయరాజాతో దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు కృష్ణవంశీ. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మికా రాజశేఖర్, అలీ రేజా తదితరులు నటించారు. -
గ్లిజరిన్ లేకుండానే ఏడ్చేశాను
Krithi Shetty: ‘‘బంగార్రాజు’ కథని 2020లో విన్నాను. ఆ తర్వాతే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను చూశాను. అందులోని కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చింది. ఆ రెఫరెన్స్‌తో ‘బంగార్రాజు’ చేసేటప్పుడు ఒత్తిడి అనిపించలేదు. సంక్రాంతి లాంటి చక్కని సినిమా ‘బంగార్రాజు’. ఇందులో తొలిసారి ఫోక్ సాంగ్ చేశాను’’ అని హీరోయిన్ కృతీశెట్టి అన్నారు. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతీ శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘బంగార్రాజు’లో నాగచైతన్యకి జోడీగా నటించిన కృతీశెట్టి విలేకరులతో మాట్లాడుతూ... ► ‘బంగార్రాజు’ లో నా పాత్ర నాగలక్ష్మి గురించి కల్యాణ్ కృష్ణగారు చెప్పినప్పుడు నవ్వేశాను. ఇలాంటివారు కూడా ఉంటారా? అనిపించింది. అందుకే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నా. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతారనుకుంటున్నా. బీటెక్ చదివిన గ్రామ సర్పంచ్‌గా చేశాను. నా పాత్ర ఫన్‌గా ఉంటుంది. నాగార్జున సార్‌తో సినిమా అన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో? అనిపించింది. కానీ ఆయన తోటి నటులపై చూపించిన గౌరవం, హుందాతనం చూసి ఆశ్చర్యపోయాను. నేను జూనియర్ అని కాకుండా తోటి టీమ్మేట్లా చూశారు. నాగచైతన్యగారు కూడా చాలా కూల్‌గా, సరదాగా ఉంటారు. ► నేను చదివిన సైకాలజీ సినిమా రంగానికి బాగా ఉపయోగపడింది. సైకాలజీ స్టూడెంట్‌గా అందర్నీ గమనిస్తుంటాను. నాగార్జున సార్ షాట్ లేనప్పుడు చాలా క్లాసీగా మాట్లాడతారు. షాట్ రెడీ అనగానే వెంటనే పాత్రలో లీనమవుతారు.. అది చాలా గ్రేట్. రమ్యకృష్ణగారి నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. ► నేను గ్లిజరిన్ లేకుండా ఏడుపు సీన్స్ చేస్తాను. నటిగా ఎదగడానికి ఉపయోగపడే, నాకు నచ్చిన పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. నాకు సంక్రాంతి గురించి పెద్దగా తెలీదు.. కానీ ‘బంగార్రాజు’ చేస్తున్నప్పుడు తెలిసింది. సంక్రాంతికి ఏ సినిమా విడుదలయినా చూస్తామని నాకు తెలిసిన తెలుగువారు చెప్పడంతో ఇక్కడివారు సినిమాని ఎంతగా ప్రేమిస్తారో అర్థమయింది. ► ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా పూర్తి చేశాను. ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్‌తో మరో సినిమా చేస్తున్నాను. లేడీ ఓరియంటెడ్ కథ ఇంకా ఫైనల్ కాలేదు. -
ప్రతి పాట వజ్రంలా ఉంటుంది
‘‘బంగార్రాజు’ చిత్రంలో ప్రతి పాట ఓ వజ్రంలా ఉంటుంది. ఇది సూపర్ హిట్ ఆల్బమ్. లిరిక్ రైటర్స్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్యం ఉంటుంది’’ అని నాగార్జున అన్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. నాగార్జున నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బంగార్రాజు మ్యూజికల్ నైట్’ లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘అభిమానులందర్నీ ఇక్కడకు పిలవలేకపోయినందుకు క్షమించాలి. జనవరి 14 అన్నపూర్ణ స్టూడియోకు చాలా ముఖ్యమైన తేది. అదే రోజున అన్నపూర్ణ పుట్టింది. యాభై ఏళ్ల క్రితం ‘దసరా బుల్లోడు’తో నాన్నగారు(అక్కినేని నాగేశ్వరరావు) సంక్రాంతికి దుమ్ములేపారు.. ఆ చిత్రం కూడా మ్యూజికల్ హిట్. సినిమా సక్సెస్‌లో సగ భాగం మ్యూజిక్దే. ఆ సగం సక్సెస్‌ను అనూప్‌కు ఇస్తున్నాం. జనవరి 11న ‘బంగార్రాజు’ ట్రైలర్ రాబోతోంది. జనవరి 14 పండుగ రోజున పండుగలాంటి ‘బంగార్రాజు’ ను తీసుకొస్తున్నాం’’ అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ– ‘‘బంగార్రాజు’ ఆడియోను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. అనూప్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. మా లిరిక్ రైటర్స్‌కి థ్యాంక్స్. ఇది పండుగ లాంటి సినిమా. అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ–‘‘సినిమా సక్సెన్ స్థాయిని నిర్ణయించేది సంగీతమే. ‘బంగార్రాజు’ కు ఇంత మంచి సంగీతం ఇచ్చిన అనూప్ రూబెన్స్‌కి థ్యాంక్స్. నాగ్ సర్ ప్రతి సినిమా మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టరే. ‘బంగార్రాజు’ పాటలు కూడా అలాగే ఉంటాయి. ఇండస్ట్రీలో బంగార్రాజు అంటే నాగ్ సారే.. ఇప్పుడు ఆయ నకు పోటీగా చిన్న బంగార్రాజు(నాగచైతన్య) ఎక్కడా తగ్గలేదు’’ అన్నారు. ‘‘ఈ మ్యూజికల్ నైట్తోనే సంక్రాంతి ప్రారంభమైనట్టుంది’ అని నిర్మాత జీ స్టూడియోస్ ప్రసాద్ అన్నారు. హీరోలు సుమంత్, సుశాంత్, నిర్మాత నాగ సుశీల, కెమెరామేన్ యువరాజ్, హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్ మాట్లాడారు. -
బంగార్రాజు చిత్రం నుంచి మరో లిరికల్.. 'నా కోసం నువ్వు' అంటూ
Bangarraju Movie Another Lyrical Song Released: టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున సినీ కెరీర్లో మంచి విజయాన్ని సాధించిన సినిమాల్లో ఒకటి 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపించి అలరించారు. ఈ సినిమాకు 'బంగార్రాజు' పేరుతో ప్రీక్వేల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా కల్యాణ్ కృష్ణ డెరెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఒక అందమైన మెలోడీ పాటను విడుదల చేశారు మేకర్స్. 'నా కోసం నువ్వు' అంటూ సాగే ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించగా, ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. పాటలో అనూప్ రూబెన్స్ సంగీతం అద్భుతంగా ఉంది. ఈ లిరికల్ వీడియో చివరిలో నాగర్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ పాట టీజర్‌ను డిసెంబర్ 2న విడుదల చేయగా పూర్తి సాంగ్‌ను ఇవాళ (డిసెంబర్ 5) న రీలీజ్ చేశారు. ఇంతకుముందు 'నాగలక్ష్మీ' పాత్రలో కనిపించిన కృతి శెట్టి లుక్కు మంచి ఆదరణ లభించింది. అలాగే నాగార్జున పాడిన 'లడ్డుండా' లిరికల్ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'బంగర్రాజు' సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా, చై సరసన కృతి శెట్టి కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్డూడియోస్, అన్నపూర్ణ స్డూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. Here’s #NaaKosam https://t.co/XaBO3LUx24 from #Bangarraju another beautiful melody from @anuprubens with @sidsriram magic .. happy listening !! @iamnagarjuna@IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @ZeeStudios_ @zeemusiccompany@zeemusicsouth — chaitanya akkineni (@chay_akkineni) December 5, 2021 ఇదీ చదవండి: నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు నాన్నా.. చైతూ ట్వీట్ వైరల్ -
మరోసారి బిగ్ బాస్ హోస్ట్‌గా...రమ్యకృష్ణ
కమల్‌హాసన్ కరోనాతో క్వారంటైన్లో ఉంటున్నందున ఆయన హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్ బాస్ 5’ పరిస్థితి ఏంటి? అనే చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక హోస్ట్ లిస్ట్‌లో కమల్ కుమార్తె శ్రుతీహాసన్, రమ్యకృష్ణల పేర్లు వినిపించాయి. అయితే శ్రుతి తన సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ‘బిగ్ బాస్’కి డేట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి అట. అందుకే నిర్వాహకులు రమ్యకృష్ణను ఖరారు చేశారు. గతంలో తెలుగు ‘బిగ్ బాస్ 3’ అప్పుడు హోస్ట్ నాగార్జున కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటే, ఆ స్థానంలో రమ్యకృష్ణ కొన్నాళ్ల పాటు షోను నడిపారు. ఇప్పుడు ఆమె తమిళ ‘బిగ్ బాస్’కి హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. రమ్యకృష్ణను స్వాగతిస్తూ.. కమల్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. -
‘బంగార్రాజు’తో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ !
‘కింగ్’ నాగార్జున అక్కినేని-రమ్యకృష్ణ జంటగా డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయన’. ఎలాంటి అంచనాలు లేకుండా 2016లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో డైరెక్టర్ కల్యాణ్ దీనికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే బంగార్రాజును సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు డైరెక్టర్ ప్రకటించినప్పటి నుంచి దీనికి సంపాదించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఇందులో అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ నటిస్తుండగా చైకి జోడిగా సమంత నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సమంత కాదని తమిళ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బంగార్రాజు నుంచి మరో అసక్తికిర అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. తాజా సమచారం ప్రకారం ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రదను చిత్రం బృందం సంప్రదించినట్లు సమాచారం. డైరెక్టర్ కల్యాణ్ ఆమెను కలిసి పాత్రను వివరించగా అది నచ్చడంతో జయప్రద గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ మూవీ కోసం డెట్స్ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్లో టాక్. కాగా కొంతకాలంగా జయప్రద తెలుగు తెరపై కనిపించడం లేదు. చాలా గ్యాప్ తర్వాత ‘బంగార్రాజు’ మూవీతో టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇవ్వడం నిజంగా ఆమె అభిమానులకు పండగే. అలాగే దీనితో పాటు జయప్రద ఓ వెబ్ సిరీస్‌తో కూడా త్వరలో ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కూడా నాగార్జునకు జోడిగా నటి రమ్యకృష్ణ నటించనుంది. చదవండి: నాగార్జున యాక్షన్ మూవీ: జూన్‌లో ప్రారంభం -
చీరలో అనసూయ సోయగాలు.. కూతురుతో సురేఖ రచ్చ రచ్చ
నా బలం, బలహీనత వీళ్లే అంటూ బర్త్‌డే వేడుకల ఫోటోని అభిమానులతో పంచుకుంది నటి సురేఖ వాణి యువర్ లిమిట్స్ ఈజ్ యువర్ మైండ్ అంటూ వేదాంతాలు చెబుతుంది హాట్ బ్యూటీ అనసూయ సెకండ్ డోస్ టీకా తీసుకున్న రమ్యకృష్ణ ‘అఖండ’కి సంబంధించి ఓ షెడ్యూల్‌కి ప్యాకప్ చెప్పి స్టైల్‌గా నడుస్తూ స్లోమోషన్లో వీడియో తీసి అభిమానులతో పంచుకుంది ప్రగ్యాజైస్వాల్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Ramya Krishnan (@meramyakrishnan) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
హీరోగా రాఘవేంద్రుడు
దర్శకులు రాఘవేంద్రరావు తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్లో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు సాధారణం. ఆయన తదుపరి సినిమాలోనూ ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలిసింది. అయితే ఇది ఆయన దర్శకుడిగా తెరకెక్కించే సినిమాలో కాదు. హీరోగా చేయబోతున్న సినిమాలో. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఆయన కథానాయకుడిగా, నలుగురు హీరోయిన్లతో ఓ సినిమా ప్రస్తుతం ప్లానింగ్‌లో ఉంది. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్లు రమ్యకృష్ణ, శ్రియ, సమంత, ఓ కొత్త హీరోయిన్ నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ సినిమాలో రాఘవేంద్రరావు భార్యగా రమ్యకృష్ణ కనిపిస్తారట. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకుడు. జనార్దన∙మహర్షి కథారచయిత, చంద్రబోస్ పాటల రచయిత, కీరవాణి సంగీత దర్శకుడు. -
కట్ చెప్పలేదు.. కట్టేసుకున్నారు..!
(వెబ్ స్పెషల్): ఇంటర్వ్యూల్లో చాలా మంది హీరోయిన్లు చెప్పే మాట తాము డైరెక్టర్స్ చాయిస్ అని. అంటే.. దర్శకులు చెప్పినట్లు తాము చేస్తామని అర్థం. కొన్ని కొన్ని సార్లు ఈ చెప్పే వారి మాటలు అవతలి వారి మనసును తాకుతాయి. దాంతో ఒకరి మీద ఒకరికి ఇష్టం, ప్రేమ కలుగుతాయి. అది కాస్త పెళ్లికి దారి తీస్తుంది. దాంతో కట్ చెప్పలేక వారితో జీవితాన్ని ముడి వేసుకున్నారు. హీరోయిన్లు దర్శకులను వివాహం చేసుకోవడం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. మరి ఇంతకు ఏ హీరోయిన్ ఏ దర్శకుడిని పరిణయం ఆడిందో చూడండి.. సుహాసిని-మణిరత్నం హీరోయిన్, దర్శకుల వివాహం టాపిక్ వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది సుహాసిని-మణిరత్నంల పేర్లే. ఆమె అందం, అభినయాల కలబోత అయితే.. ఆయన భారతీయ ఆత్మను ప్రతిబింబించే చిత్రాల దర్శకుడు. వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి 1988లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. దివంగత దర్శకుడు కె. బాలచందర్ ఒత్తిడి మేరకే తాము వివాహం చేసుకున్నామంటారు సుహాసిని. వీరికి ఒక కుమారుడు నందన్ ఉన్నాడు. (చదవండి: పెద్దన్నయ్య) రేవతి - సురేష్ చంద్ర సురేష్ చంద్ర దర్శత్వంలో రేవతి రెండు చిత్రాల్లో నటించారు. అలా ఏర్పడ్డ పరిచయంతో ఈ జంట ప్రేమలో పడ్డారు. 1986లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. కృష్ణవంశీ - రమ్య కృష్ణ కృష్ణవంశీ తెరకెక్కించిన చంద్రలేఖ చిత్రంలో రమ్యకృష్ణ నటించారు. అలా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ జంట 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు రిత్విక్ ఉన్నాడు. రోజా - సెల్వమణి రోజాని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది సెల్వమణి. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. 2002లో రోజా, సెల్వమణిలు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు, పాప ఉన్నారు. శరణ్య-పొన్నవనన్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు శరణ్య. కానీ 1980-90ల కాలంలో ఈమె చాలా తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేశారు. అప్పుడే దర్శకుడు పొన్నవనన్తో ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకున్నారు.(చదవండి:ఇదే నాకు పెద్ద బర్త్‌డే గిఫ్ట్ ) ఖుష్బూ-సుందర్ ఇద్దరు కలిసి ఒక్క చిత్రం కూడా చేయలేదు. కన్నడ నిర్మాత అయిన సుందర్‌ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఖుష్బూ. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. వారి పేరు అవంతిక అనందిత. సీత- పార్థిపన్ సీనియర్ నటి సీత, దర్శకుడు పార్థిపన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 1990లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమర్తెలు, ఓ దత్తత తీసుకున్న కొడుకు ఉన్నారు. 2001లో ఈ జంట విడాకులతో విడిపోయారు. ఆ తర్వాత సీత మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. (చదవండి: జీవితం ఉన్నది అనుభవించడానికే..) దేవయాని- రాజ్ కుమారన్ దర్శకుడు రాజ్ కుమారన్, దేవయానిల లవ్ ఎఫైర్ అప్పట్లో ఒక సెన్సేషన్. రాజ్ కుమారన్ దర్శత్వంలో దేవయాని నీ వరువై ఏనా అనే చిత్రంలో నటించారు. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు. అమలాపాల్ - విజయ్ దర్శకుడు అమలాపాల్, విజయ్ ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. వీరే కాక దర్శకుడు సెల్వ రాఘన్, హరి, ప్రియ దర్శన్ వంటి వారు హీరోయిన్లనే వివాహం చేసుకున్నారు. -
చిరంజీవి కూడా వెబ్‌సిరీస్‌లో..
‘పరుగులు లేవు. మేకప్ లూ.. పేకప్లూ లేవు. అరుపులూ.. హడావుడీ లేదు. పొల్యూషన్ లేదు. చుట్టూ నిశ్శబ్ధమే.. కుటుంబంతో మమేకమే’ అంటున్నారు సినీ నటి ఎవర్ గ్రీన్ గ్లామర్ హీరోయిన్ రమ్యకృష్ణ. టాలీవుడ్ అగ్రగామి హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడారాణించి.. బాహుబలి సినిమా తర్వాత మరిన్ని ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ స్టార్ యాక్ట్రెస్ గతేడాదే వెబ్‌సిరీస్‌లో కూడా నటించారు. క్వీన్ పేరుతో రూపొందిన ఆ వెబ్‌సిరీస్ తెలుగులో డబ్ అయి జీ తెలుగు చానెల్లో ప్రసారం కానుంది. ఒక వెబ్‌సిరీస్ తెలుగు టీవీ చానెల్లో ప్రసారం అవుతుండటం కూడా ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. సినిమాల్లో బిజీ బిజీ.. ప్రస్తుతం కృష్ణవంశీ తీస్తున్న రంగమార్తాండ, పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న చిత్రం, సాయిధరమ్ తేజ్ సినిమా.. ఇలా పలు చిత్రాల్లో నటిస్తున్నా. క్వీన్ సీజన్–2 కూడా చేయాలి. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, రెండు హిందీ ప్రాజెక్టŠస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడాలి లాక్డౌన్ తర్వాత ఏమవుతుందో..? నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏవీ ఉండవు. నాకొచ్చిన, వస్తున్నవన్నీ నేను కోరుకున్నవే అన్నట్టు ఉంటాయి. కాబట్టి అవే నా డ్రీమ్ రోల్స్ అనుకోవచ్చు(నవ్వుతూ)..లాక్డౌన్ నా జీవితంలో ముందెన్నడూ ఎరుగని అనుభవాన్ని ఇచ్చింది. హాయిగా ఉంది. ఇలాంటి టైమ్ లైఫ్‌లో దొరకలేదు. ఇలాంటి టైమ్ మళ్లీ దొరకదేమో కూడా.. దాదాపు రెండు నెలలైందేమో గుమ్మం దాటి. ఓ వైపు టైమంతా మన చేతుల్లోకి రావడం, ఫ్యామిలీతో మరింత టైమ్ స్పెండ్ చేయడం చాలా బాగున్నా.. మరోవైపు ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండటం, మన దేశంలో వలస కూలీలు, ఆహారం లేని నిరుపేదల దుస్థితి చూస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తోంది. వాళ్లంతా తమ తమ ఊర్లకు వెళ్లి.. బాగుండాలని కోరుకుంటున్నాను. ‘క్వీన్’ను ఆమెతో పోలుస్తున్నారు.. నేను నటించిన తొలి వెబ్‌సిరీస్ క్వీన్. దీని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ చాలా ప్రజ్ఞావంతులు. ఆయన స్ట్రాంగ్ స్క్రిప్తో వస్తారు. చాలా బాగా తీస్తారని తెలుసు. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? అందుకే చేశా. ఇక ఇందులో నా పాత్ర జయలలితను పోలినట్టు ఉందని అంటున్నారు. అది ఎవరికి తోచినట్టు వారు పోల్చుకోవచ్చు.. దానికి నేనేం చేయలేను. అనితా శివకుమారన్ రాసిన క్వీన్ నవల ఆధారంగా తీసిన చిత్రమిది. ఇది తెలుగు ప్రేక్షకులకు కూడా జీ తెలుగు చానెల్లో వచ్చే సోమవారం నుంచి సీరియల్‌గా అందిస్తుండటం నాకు మరింత ఆనందంగా అనిపిస్తోంది. క్వీన్ సినిమా చేయడం ద్వారా రాజకీయ ఆకాంక్షలు, ఆలోచనలు ఏమీ రాలేదు. వస్తాయా? అంటే భవిష్యత్‌లో ఏమవుతుందీ చెప్పలేం కదా.. ఒత్తిడి వద్దు.. జాగ్రత్తలు వీడొద్దు.. రేపేమవుతుంది? రేపేం కాదు? అనేది తెలియడం లేదు. కంటికి కనపడని శత్రువుతో చేసే యుద్ధం కాబట్టి మానసిక ప్రశాంతతను కొంత కోల్పోతాం. ఇది మనల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. కరోనాతో మనం కలిసి బతకాల్సిందే అంటున్నారు. కాబట్టి బీ స్ట్రాంగ్, భయం, ఒత్తిడి మనల్ని తమ ఆధీనంలోకి తీసుకోకుండా పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలి.. జాగ్రత్తలు పాటించండి. ఒకసారి ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఈ టైమ్ తప్పకుండా మెమొరబుల్ అవుతుంది. ఇలాంటి ఫ్రీ టైమ్ మళ్లీ వస్తుందా? అనిపిస్తుంది. కానీ మళ్లీ వచ్చినా ఇలాంటి కరోనా లాంటి కారణంతో కాకుండా రావాలని మాత్రం కోరుకుంటున్నా. ప్రేక్షకుల హృదయాల్లో వెబ్.. డబ్ ప్రస్తుతం వెబ్‌సిరీస్ కోసం చాలా వైవిధ్యభరితమైన ఆసక్తికరమైన కథాంశాలు ఎంచుకుంటున్నారు. దీని వల్ల నటులకు వెరైటీ రోల్స్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ కరోనా దెబ్బకు వెబ్‌సిరీస్‌కి మరీ డిమాండ్ బాగా పెరిగింది. అయితే సినిమాలు చూడటం కోసం థియేటర్స్‌కి జనం వెళ్లడం మానేస్తారు అనను గానీ వెబ్‌సిరీస్ కూడా అదేస్థాయిలో ఆదరణ వస్తుందని చెప్పగలను. ఇకపై కూడా వెబ్‌సిరీస్‌లో నటిస్తాను. తెలుగులో చిరంజీవిలాంటి అగ్రనటులు కూడా వెబ్‌సిరీస్‌లో నటిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారితో కాంబినేషన్‌గా నాకు ఏదైనా మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను. ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ఆఫర్లున్నాయి. వెబ్‌సిరీస్‌లో సాంగ్స్ ఉండవు నిజమే.. అయినా నేనిప్పుడేం సాంగ్స్ చేస్తాను చెప్పండి?(నవ్వుతూ).. సాంగ్స్కంటే వెబ్‌సిరీస్‌లో కంటెంటే పెద్ద ఆకర్షణ. -
డాక్టర్‌గా సాయితేజ్
త్వరలో డాక్టర్‌గా ఆసుపత్రికి వెళ్లనున్నారట సాయితేజ్. దేవ కట్టా దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను ఏప్రిల్‌లో ఆరంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాలో కథరీత్యా సాయితేజ్ డాక్టర్ పాత్రలో నటిస్తారట. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఏలూరులో జరుగుతుందని సమాచారం. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తారని టాక్. ప్రస్తుతం ‘సోలో బతుకే సో బెటర్’ చిత్రంలో స్టూడెంట్‌గా సాయితేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘ఆ సినిమాలకు’ తొలగిన అడ్డంకులు
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పలు చిత్రాల నిర్మాణాలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యాయి. ప్రముఖ నటి రమ్యకృష్ణ క్వీన్‌కు, నటి కంగనా రనౌత్ తలైవికి, నిత్యా మీనన్ ది ఐరన్ లేడీ చిత్రాలకు ఆటంకాలు తొలిగిపోయాయి. వీటి నిర్మాణాలను నిర్భయంగా జరుపుకోవచ్చు. అందుకు స్వయంగా మద్రాసు హైకోర్టునే పచ్చజెండా ఊపింది. దర్శకుడు విజయ్... జయలలిత బయోపిక్‌ను తలైవి పేరుతో నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న విషయం, అందులో జయలలిత పాత్రలో బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా మహిళా దర్శకురాలు ప్రియదర్శిని దీ ఐరన్ లేడీ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో జయలలితగా నటి నిత్యామీనన్ నటించనున్న సంగతి విదితమే. ఇకపోతే దర్శకుడు గౌతమ్ మీనన్ జయలలిత జీవిత చరిత్రను నటి రమ్యకృష్ణ టైటిల్ పాత్రలో క్వీన్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. కాగా వీటిని తన అనుమతి లేకుండా రూపొందించడాన్ని నిషేధించాలని జయలలిత సోదరుడి కుమార్తె దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే ఒకసారి విచారణ జరిగింది. దీప పిటిషన్‌కు సమాధానం ఇస్తూ పిటిషన్‌ను దాఖలు చేయాల్సిందిగా దర్శకుడు గౌతమ్‌మీనన్‌కు, విజయ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. గురువారం న్యాయమూర్తులు సెంథిల్‌కుమార్, రామమూర్తిల సమక్షంలో విచారణకు వచ్చింది. ఇరు తరఫు వాదనలు విన్న న్యాయమూర్తులు జయలలిత బయోపిక్‌ను చిత్రాలుగా తెరకెక్కించడాన్ని నిషేధించలేం అని తీర్పునిచ్చారు. అయితే దర్శక నిర్మాతలు ఇది కల్పిత సన్నివేశాలతో రూపొందించినట్లు టైటిల్ కార్డులో ప్రకటించాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే పూర్తి అయిన రమ్యకృష్ణ నటించిన వెబ్ సిరీస్ క్వీన్ శనివారం నుంచి ఆన్లైన్లో ప్రసారం కానుంది. -
రొమాంటిక్‌లో గెస్ట్
దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి తన కొత్త సినిమా కోసం రొమాంటిక్‌గా మారిన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. కేతికా శర్మ హీరోయిన్. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. బుధవారం నుంచి ఈ సినిమా షూటింగ్లో రమ్యకృష్ణ పాల్గొంటున్నారు. ఈ సినిమాలో ఆల్రెడీ బాలీవుడ్ భామ మందిరా బేడీ కీలక పాత్ర చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత... క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తదుపరి సినిమా ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ బాగా ఉంది. ఆయన నెక్ట్స్ సినిమాను బుధవారం అధికారికంగా ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ జంటగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్నారు కృష్ణవంశీ. అభిషేక్ జాకర్, మధు కలిపు నిర్మించనున్నారు. ఈ సినిమా ‘నటసామ్రాట్’ అనే మరాఠీ సినిమాకు రీమేక్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 2004లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. అంటే.. 15 ఏళ్ల తర్వాత మళ్లీ భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ యాక్ట్ చేయబోతున్నారు. అయితే అప్పుడు గెస్ట్ రోల్. ఇప్పుడు కథానాయిక. -
ప్రతీకారం తీర్చుకునే చాన్స్ ఇచ్చిన రమ్యకృష్ణ
పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కోసం విదేశాలకు వెళ్లిన నాగ్.. వీకెండ్ ఎపిసోడ్‌కు దూరంగా ఉండిపోయాడు. దీంతో రమ్యకృష్ణ ఆ బాధ్యతను చేపట్టింది. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని పంపిస్తూ.. బిగ్‌బాస్ ప్రేక్షకులను నాగ్ పలకరించాడు. వచ్చే వారం మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపాడు. ఇక రమ్యకృష్ణ తన టైమింగ్‌తో షోను నడిపించింది. ఒక్కసారిగా రమ్యకృష్ణను చూసిన హౌస్మేట్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియో సందేశం ద్వారా నాగ్.. హౌస్‌మేట్స్‌తో ముచ్చటించాడు. ఈ ఒక్క వారం తమ ఇంటి సభ్యులను చూసుకోమని రమ్యకృష్ణకు సూచించాడు. రమ్యకృష్ణతో జాగ్రత్తగా ఉండమని హౌస్‌మేట్స్‌ను హెచ్చరించాడు. అనంతరం షోను ప్రారంభించిన రమ్యకృష్ణ ఇంటి సభ్యులతో ఓ ఆటను ఆడించింది. తాను క్లాప్స్ కొట్టిన ప్రతీసారి మంచి, చెడు అంటూ ఓ హౌస్మేట్స్ గురించి మార్చుకుంటూ చెప్పాలని తెలిపింది. దీనిలో భాగంగా మొదటగా.. బాబా భాస్కర్, పునర్నవిలను పిలిచింది. వంట బాగా చేస్తాడని, ఎప్పుడూ కిచెన్లోనే ఉంటాడని బాబా గురించి పునర్నవి చెప్పుకొచ్చింది. ఇక బాబా కూడా పునర్నవి గురించి చెబుతూ ఉండగా.. వెంటవెంటనే క్లాప్స్ కొడుతూ బాబాను తికమకపెట్టింది. దీంతో ఏం చెప్పాలో బాబాకు దిక్కుతోచలేదు. మహేష్-వితికా, అలీ-శ్రీముఖి, రవి-హిమజ, శివజ్యోతి-రాహుల్‌లను పిలిచి ఇదే మాదిరిగా ఆటపట్టించింది. ఇక వారందర్నీ హౌస్‌లో తమకు జరిగిన అన్యాయాల గురించి చెప్పమని ఇంటి సభ్యులను కోరింది. అయితే సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అందరూ వితికాను టార్గెట్ చేయడంపై.. రవి, రాహుల్, వరుణ్‌లను నిలదీసింది. ఎందుకు అమ్మాయిలనే టార్గెట్ చేశారని, మగవారిని ఎందుకు ఎంచుకోలేదని ప్రశ్నించింది. అలా అమ్మాయిలను టార్గెట్ చేసినందుకు గానూ.. వరుణ్ మొహంపై వితికా చేత కోల్డ్ కాఫీ పోయించింది. రాహుల్‌కు ఇష్టమైన టీ షర్ట్‌ను ముక్కముక్కలుగా చేయమని ఆర్డర్ వేసింది. ఇక శివజ్యోతి బెడ్‌ను రవి తడపడంతో.. అతని బెడ్‌ను తడిపే అవకాశం శివజ్యోతికి ఇచ్చింది. ఇలా తాను అన్యాయమని ఫీలైన సంఘటనలను గుర్తు చేసుకుని.. వాటికి ప్రతీకార చర్యలు తీసుకునేలా అందరికీ అవకాశమిచ్చింది. (బిగ్‌బాస్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు) శనివారం ఎపిసోడ్ఎంటర్టైన్ మెంట్‌తో ముగిసినా.. ఆదివారం ఏం జరగనుందో చూడాలి. అయితే సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఆరోవారంలో ఎలిమినేషన్‌ను ఎత్తివేసినట్లు తెలుస్తోంది. మరి ఆడియెన్స్ వేసిన ఓట్లు.. బూడిదలో పోసిన పన్నీరేనా? అని ప్రశ్నించేవారికి ఏం సమాధానం చెబుతారో చూడాలి. -
బిగ్‌బాస్ హోస్ట్‌గా ‘శివగామి’
-
బిగ్‌బాస్ హోస్ట్‌గా ‘శివగామి’
బిగ్‌బాస్ ఆరో వారాంతంలో రాజమాత శివగామి హోస్ట్‌గా వ్యవహరించనుంది. బిగ్‌బాస్ రాజ్యాన్ని చక్కదిద్దేందుకు శివగామి అధికారాన్ని చేపట్టింది. ఈ వీకెండ్లో హోస్ట్‌గా వచ్చి.. ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు రమ్యకృష్ణ రెడీ అయింది. నాగార్జున విదేశాల్లో ఉండటంతో ఈ వీకెండ్‌ను ఓ స్పెషల్ గెస్ట్చే నిర్వహిస్తారనే వార్తలు వైరల్ అయినా.. అవన్నీ రూమర్సే అని కొట్టిపారేశారు. చివరకు అవే నిజమయ్యాయి. రాజు దూరంగా ఉన్నప్పుడు.. రాణి వచ్చిందంటూ రిలీజ్ చేసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ వీకెండ్ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే నా మాట.. నా మాటే శాసనం అని తనశైలిలో చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ఈ వారం ఎలిమినేషన్ ఉండబోదని మరో టాక్ వినిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్ ఏరేంజ్‌లో ఉంటుందో చూడాలి. -
ఆ ఇద్దరి కాంబినేషన్లో..
సినిమా: కోలీవుడ్‌లో నాటి నేటి నాయికలతో చిత్రాలు చేసే ట్రెండ్ నడుస్తోందా అని అనుకునేలా క్రేజీ కాంబినేషన్లలో చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇటీవల జాక్‌పాట్ చిత్రంలో నటి జ్యోతిక, రేవతి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం నటి త్రిష, సిమ్రాన్ కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా నటి హన్సిక, రమ్యకృష్ణ కలిసి నటించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన గులేభాకావళి వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్ ఇటీవల నటి జ్యోతిక, రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన జాక్‌పాట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత శుక్రవారమే తెరపైకి వచ్చింది. ఈ రెండూ వినోదమే ప్రధానంగా రూపొందిన చిత్రాలన్నవి గమనార్హం. కాగా కల్యాణ్ చిత్రానికి సిద్ధమైపోయారు. ఈయన తాజా చిత్రానికి కామెడీనే ప్రధాన అంశంగా తీసుకున్నట్లు సమాచారం. నటి హన్సిక కథానాయకిగా నటించనున్న ఇందులో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా హన్సిక, రమ్యకృష్ణ కలిసి 2015లో ఆంబళ అనే చిత్రంలో నటించారు. అందులో విశాల్ హీరో. కాగా ప్రస్తుతం నటి హన్సిక నటిస్తున్న తన 50వ చిత్రం నిర్మాణంలో ఉందన్నది గమనార్హం. ఇది ఆరంభం నుంచే చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మధ్య ఆ చిత్రం ఊసే ఎవరూ ఎత్తడం లేదు. కారణాలేమిటో తెలియదు గానీ, ఆ తరువాత నటి హన్సికకు మరో అవకాశం రాలేదు. అలాంటిది ఈ ముద్దుగుమ్మకు దర్శకుడు కల్యాణ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఇంతకుముందు తాను దర్శకత్వం వహించిన గులేభాకావళి చిత్ర నాయకి హన్సికనే అన్నది గమనార్హం. ఆ చిత్రం మంచి హిట్ అయ్యింది. ఆ సెంటిమెట్తోనే దర్శకుడు కల్యాణ్ తన తాజా చిత్రానికి ఆమెను ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
రాజమాత టు రాష్ట్రమాత
పాత్ర ఎంత క్లిష్టంగా ఉన్నా కూడా తాను అలవోకగా చేయగలనని నిరూపిస్తూ వస్తూనే ఉన్నారు రమ్యకృష్ణ. ‘నరసింహ’లోని నీలాంబరి, ‘బాహుబలి’లో శివగామి వంటి పాత్రలు అందుకు ఉదాహరణలు. ఇప్పుడు అలాంటిదే మరో చాలెంజింగ్ పాత్రకు రెడీ అయ్యారట రమ్యకృష్ణ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత పాత్రను పోషించనున్నారట. ఆల్రెడీ జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో మూడు సినిమాలు రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది మరో సినిమానా అంటే కాదు.. ఇది వెబ్ సిరీస్ అట. ‘ఘర్షణ, ఏ మాయ చేసావె’ ఫేమ్ గౌతమ్ మీనన్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయనున్నారట. 30 ఎపిసోడ్లుగా సాగే ఈ వెబ్ సిరీస్‌లో జయలలిత జీవితానికి సంబంధించిన అన్ని ఘట్టాలను కవర్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేశ్ (బాబీ) నిర్మించనున్నారు అనే వార్తలు వినిపించాయి. కానీ ఈ నిర్మాణంలో ఆయన భాగం కారని వెంకటేశ్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. -
మరోసారి అత్తగా..
ఇటీవల వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంలో పవర్ఫుల్ అత్తగా కనిపించిన రమ్యకృష్ణ మరోసారి అత్త పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సుందర్ సి. దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తున్నారు. ముందుగా నదియా పాత్రలో ఖుష్భు కనిపిస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా శింబు అత్త పాత్రను రమ్యకృష్ణ పోషించనున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా మేఘా ఆకాశ్, కేథరీన్ థెరీసా నటిస్తున్నారు. ఫైనల్‌గా అత్త దొరికేసింది. ఇక అత్తారింటికి దారి వెతికే పనిలో బిజీ అయ్యారు శింబు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. -
మూడు రోజుల్లో 23 కోట్లు.. నేను నమ్మలేకపోయా!
‘‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఇచ్చి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా కలెక్షన్స్ గురించి చెప్పినప్పుడు ముందు నమ్మలేకపోయా. ముఖ్యంగా మౌత్ టాక్ని చాలా పాజిటివ్‌గా స్ప్రెడ్ చేసిన వారికి, చేస్తున్నవారికి థ్యాంక్స్’’ అని నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ, నరేశ్, పృథ్వీ ఇతర పాత్రల్లో నటించారు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో నాగవంశీ. ఎస్, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేయగా, మూడు రోజులకి దాదాపు 23 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా లుక్ చాలా ఫ్రెష్‌గా, డిఫరెంట్‌గా, బాడీ లాంగ్వేజ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉందని అంటున్నారు. ఒక యాక్టర్‌కి ఇవే బెస్ట్ కాంప్లిమెంట్స్. థ్యాంక్యూ మారుతిగారు. అప్పుడు ‘ప్రేమమ్’, ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలతో హిట్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘శైలజారెడ్డి అల్లుడ్ని తెలుగు ప్రేక్షకులు సొంత అల్లుyì లా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం వసూళ్లు మాకు చాలా ఆనందాన్ని, ఎనర్జీని ఇచ్చాయి. నా గత చిత్రాల కంటే ఈ చిత్రం బాగుందని ఫోన్లు చేస్తున్నారు’’ అన్నారు మారుతి. ‘‘ఈ సక్సెస్ మీట్‌కి కారణం ప్రేక్షకులే. వారికి థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. నటులు నరేశ్, పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి తదితరులు పాల్గొన్నారు. -
అవే నన్ను నిలబెట్టాయి
‘‘నేను చేసిన వెరైటీ రోల్స్ మాత్రమే నన్ను ఇలా నిలబెట్టాయి. అలాంటివి చేస్తూనే ఉంటాను. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రెగ్యులర్‌గా కనిపించే అత్తా, అల్లుళ్లు కామెడీ మూవీలా ఉండదు. చూస్తే కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఇందులో కొత్త అత్త, కొత్త అల్లుణ్ని చూస్తారు’’ అని రమ్యకృష్ణ అన్నారు. నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా గురువారం రిలీజైంది. మంచి ఓపెనింగ్స్ సాధించిందని చిత్రబృందం పేర్కొంది. ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా రమ్యకృష్ణ సినిమా విశేషాలు పంచుకుంటూ – ‘‘నా బర్త్‌డే టైమ్‌లో రిలీజైన మా చిత్రం సూపర్ హిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అందరం జెన్యూన్‌గా కష్టపడ్డాం. ఇందులో మారుతిగారు నా కోసం రెండు షేడ్స్ ఉన్న పాత్ర రాశారు. చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తారాయన. నా కెరీర్లో ఫాస్ట్‌గా కంప్లీట్ చేసిన మూవీ ఇదే. కామెడీ సీన్స్ మధ్యలో ఆపేసి మరీ నవ్వేవాళ్లం. నా చుట్టూ కామెడీ జరుగుతుంటే సీరియస్‌గా ఉండటం కష్టంగా అనిపించేది. చైతన్య వెరీ డౌన్ టు ఎర్త్. యాక్టర్‌గా చాలా బాగా ఎదుగుతున్నాడు. నన్ను కన్విన్స్ చేసే సీన్లో బాగా యాక్ట్ చేశాడు. -
వేసవిలో అల్లుడొస్తాడు!
సంక్రాంతి పండక్కి కొత్త అల్లుడు అత్తింటికి వెళ్తాడు. కానీ మా సినిమాలోని అల్లుడు మాత్రం వేసవిలో వస్తాడు అంటున్నారు డైరెక్టర్ మారుతి. నాగచైతన్య హీరోగా మారుతి దర్వకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో అనూ ఇమ్యాన్యుయేల్ కథానాయిక. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ‘‘అందరూ నాగచైతన్య మూవీ గురించి అడుగుతున్నారు. అతను ‘సవ్యసాచి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. నేనూ మీలాగే (ఫ్యాన్స్) తనకోసం వెయిట్ చేస్తున్నాను. మేలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాం. డోంట్ వర్రీ.. ఫ్యాన్స్‌కు ఎలా కావాలో అలానే ఉంటుంది సినిమా’’ అని మారుతి పేర్కొన్నారు. సో.. వేసవికి అల్లుడొస్తాడన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే... చందు మొండేటి దర్వకత్వంలో నాగచైతన్య హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘సవ్యసాచి’ మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
బాహుబలి.. ఓ పాఠం!
‘బాహుబలి’ సినిమా ఖాతాలో మరో రికార్డు చేరింది. అదేంటంటే.. ‘బాహుబలి’ సినిమా సక్సెస్‌ను పాఠంగా చెప్పబోతున్నారు. ఈ చిత్ర విజయాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎమ్ఎ) ఓ కేస్ స్టడీగా తీసుకుని, పరిశోధన చేయనున్నట్లు అక్కడి ప్రొఫెసర్ భరతన్ కందస్వామి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి’ చక్కని మార్కెటింగ్ స్ట్రాటజీతో మంచి వసూళ్లు రాబట్టింది. సీక్వెల్స్ తీస్తున్నప్పుడు ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయితే రెండో పార్ట్‌కి పబ్లిసిటీ ఈజీగా వస్తుంది. మార్కెటింగ్ సులువు అవుతుంది. ప్రధానంగా నేను సీక్వెల్స్ నిర్మాణం, మార్కెటింగ్ మంత్ర, కలెక్షన్స్ మీద దృష్టి పెట్టబోతున్నాను. ఈ విషయాల్లో అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులకు డిజిటల్ మార్కెట్ గురించి కూడా చెబుతాం. సినిమా ఇండస్ట్రీ గురించి అన్ని కోణాల నుంచి విద్యార్థులకు తెలియజేయనున్నాం.అందుకే సక్సెస్ సాధించిన ‘బాహుబలి’ సినిమాను ఓ కేస్ స్టడీగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి’ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచింది. -
గ్యాంగ్ .. బ్యాంగ్.. దుమ్మురేపిన సూర్య
సాక్షి, హైదరాబాద్: ‘గ్యాంగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హీరో సూర్య డ్యాన్సులతో దుమ్మురేపారు. తొలిసారి ఈ సినిమాలో తన పాత్రకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకొన్నానని, తన ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నానని సూర్య అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న తమ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ వేడుకలో హీరోయిన్ కీర్తిసురేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ నటి రమ్యకృష్ణతోపాటు పలువురు చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. -
నెక్ట్స్ టార్గెట్!
ఆల్ సెట్ అయితే హీరో రామ్‌చరణ్ నెక్ట్స్ టార్గెట్ చేసే విలన్ నేమ్ ప్రతాప్ రవినే అని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఎవరీ ప్రతాప్ రవి? అంటే... రక్తచరిత్రను బయటికి తీయాల్సిందే. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పేస్తాం. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్తచరిత్ర’ సినిమాలో ప్రతాప్ రవి క్యారెక్టర్‌ను బీ టౌన్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు అజిత్ హీరోగా చేసిన తమిళ చిత్రం ‘వివేగం’ లో వివేక్ ఒబెరాయ్‌నే విలన్. మళ్లీ తెలుగు తెరపై వివేక్ కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వివేక్‌ను ప్రతినాయకుడి పాత్రకు సెలక్ట్ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోందని ఫిల్మ్‌నగర్ టాక్. అంతే కాదండోయ్.. ఓ కీలక పాత్రకు శివగామిని.. అదేనండి.. రమ్యకృష్ణను సంప్రదించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
అమ్మోరు గుర్తుకొస్తోంది – నందినీరెడ్డి
‘నరసింహ’ చిత్రంలో నీలాంబరి, ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రమ్యకృష్ణ. తాజాగా ‘మాతంగి’గా ప్రేక్షకులను అలరించబోతున్నారు రమ్య. ఆమె ప్రధాన పాత్రలో కన్నన తమ్మార్కులమ్ దర్శకత్వంలో మలయాళ హిట్ మూవీ ‘మాతంగి’ని అదే పేరుతో రమ్యకృష్ణ సోదరి వినయకృష్ణన్ తెలుగులోకి అనువదించారు. ఈ నెల 15న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘రమ్యగారికి వినయ బిగ్గెస్ట్ క్రిటిక్. ఆమెకు ఏదీ త్వరగా నచ్చదు. ‘మాతంగి’ని ఆమె తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారంటే ఈ చిత్రంలో ఏదో విషయం ఉంటుంది. రమ్యగారి ‘మాతంగి’ లుక్ చూస్తుంటే ‘అమ్మోరు’ సినిమా గుర్తుకొస్తోంది’’ అన్నారు. ‘‘తెలుగులో మేం తొలిసారి చేస్తున్న చిన్న ప్రయత్నం ‘మాతంగి’. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఎడిట్ చేసింది కృష్ణవంశీగారే’’ అన్నారు రమ్యకృష్ణ. ఈ వేడుకలో రమ్యకృష్ణవంశీల తనయుడు రిత్విక్ పాల్గొన్నాడు. నటుడు ఓంపురి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి రచన: వెన్నెలకంటి, సంగీతం: రతీష్ వేగ. -
పొంగల్‌కి వరోమ్
... అంటే పొంగలి తింటారా? అని అడుగుతున్నామేమో అనుకుంటున్నారా? నో చాన్స్. వరోమ్ అంటే వస్తాం అని అర్థం. సంక్రాంతిని తమిళంలో పొంగల్ అంటారు. వచ్చే సంక్రాంతికి సూర్య ఇటు తెలుగు అటు తమిళ సినిమాల రిలీజ్ రేస్‌లో ఉన్నారు. ఆయన హీరోగా ‘తానా సేంద కూట్టమ్’ అనే చిత్రం రూపొందుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ కథానాయిక. తెలుగులో ‘గ్యాంగ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. శనివారం ‘గ్యాంగ్’ ఫస్ట్ లుక్‌తోపాటు సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ‘‘షూటింగ్ కంప్లీట్ అయింది. సూర్య సార్, విఘ్నేష్ శివన్.. మొత్తం యూనిట్‌ని మిస్ అవుతున్నా. పొంగల్‌కి వరోమ్’’ అన్నారు కీర్తీ సురేశ్. ‘‘సూర్య చిత్రాన్ని మా బ్యానర్లో రిలీజ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అనిరు«ద్ మంచి సంగీతం అందిచారు. కీర్తీ సురేశ్ నటన హైలైట్. కార్తీక్, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటించారు’’ అన్నారు వంశీ, ప్రమోద్. -
డిఫరెంట్ బాలకృష్ణుడు
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’ సినిమాలో సిక్స్‌ప్యాక్ దేహంతో కనిపించ నున్నారు. నారా రోహిత్, రెజీనా జంటగా రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో పవన్ మల్లెల దర్శకత్వంలో బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీవినోద్ నందమూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్, రొమాన్స్, మంచి పాటలతో ఆసక్తికరంగా సాగే చిత్రమిది. పవన్ మల్లెల పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కించారు. నారా రోహిత్ గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. పృధ్వీ, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు కామెడీ ట్రాక్ అలరిస్తుంది. రమ్యకృష్ణ ఇందులో పవర్ఫుల్ రోల్లో నటించారు. మణిశర్మగారి సంగీతం, నేపథ్య సంగీతం పెద్ద ఎసెట్. ఈ నెలాఖరులో పాటలు రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: డి.యోగానంద్. -
నయా బాలకృష్ణుడు!
బాలకృష్ణుడు...పేరు కొంచెం క్లాసీగా ఉన్నా కుర్రాడిలో మాత్రం మాస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లున్నాయి. ఏదైనా తేడా కొట్టిందో విలన్స్‌ను ఇరగదీస్తాడంతే. సిక్స్‌ప్యాక్ ఉన్నప్పుడు ఆ మాత్రం కుమ్మేయడానికి ఆలోచించడు కదా. హీరో నారా రోహిత్‌నే ఈ నయా బాలకృష్ణుడు. పవన్ మల్లెల దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం ‘బాలకృష్ణుడు’. సరస్‌చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ మూవీస్ పతాకాలపై మహేంద్రబాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నందమూరి నిర్మిస్తున్నారు. రెజీనా కథనాయిక. మణిశర్మ స్వరకర్త. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కంప్లీట్ కమర్షియల్ చిత్రమిది. ఈ సినిమా కోసం నారా రోహిత్ తొలిసారి సిక్స్‌ప్యాక్ చేశారు. ఆయన సూపర్‌గా నటిస్తున్నారు. పవన్ మల్లెల చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దసరాకు టీజర్‌ను రిలీజ్ చేయనున్నాం. మణిశర్మగారి మ్యూజిక్ సినిమాకు హైలైట్’’ అన్నారు. -
'రమ్యకృష్ణ అంత పిరికిది కాదు'
హైదరాబాద్ : చనిపోయిందన్న గంట ముందే తన కుమార్తె ఫోన్లో మాట్లాడిందని ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రమ్యకృష్ణ తల్లి ఉషారాణి తెలిపారు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన రమ్యకృష్ణ అనే యువతి వారం క్రితం ఆస్ట్రేలియాలో వారం క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకు వచ్చారు. కాగా రమ్యకృష్ణకు నాలుగేళ్ల క్రితం మెల్బోర్న్కు చెందిన మహంత్‌తో వివాహం జరిగింది. కుమార్తె మృతిపై రమ్యకృష్ణ తల్లి మాట్లాడుతూ 'నాతో మాట్లాడిన తర్వాత మళ్లీ కాల్ వచ్చింది. (చదవండి..ఆస్ట్రేలియాలో ఎన్నారై యువతి అనుమానస్పద మృతి) ఆ రెండు గంటల్లో ఏమి జరిగిందో ఏమో చనిపోయిందని ఫోన్ వచ్చింది. అది కూడా మహంత్ చెప్పలేదు. అతడి కంపెనీలో చేసే అబ్బాయి సమాచారం ఇచ్చాడు. మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. చాలా ధైర్యవంతురాలు, కష్టాలకు అధైర్యపడదు. కొద్దిరోజుల క్రితం కారు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కూడా చాలా ధైర్యంగా ఉంది. నా కూతురిది ఆత్మహత్య కాదు, హత్యే. అందుకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలి. నా కూతురును అత్తమామలు సూటిపోటీ మాటలతో వేధించేవారు. ఎన్నోసార్లు నాతో చెప్పుకుని బాధపడింది. పరోక్షంగా కారకులైన అత్తమామలపై కూడా చర్యలు తీసుకోవాలి.' అని డిమాండ్ చేశారు. తమ కుమార్తె మృతదేహం ఇచ్చేంతవరకూ మమ్మల్ని మహంత్ తన చెప్పుచేతల్లో ఉంచుకున్నాడని రమ్యకృష్ణ తండ్రి పూర్ణచంద్రరావు అన్నారు. నా కూతురు ఉరేసుకున్నందన్న దానికి ఆధారం లేదు. మహంత్ పొంతన లేని సమాధానం చెబుతున్నాడని ఆస్ట్రేలియా పోలీసులే అన్నారని ఆయన తెలిపారు. మహంత్‌తో పాటు అతడి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని మహంత్ తండ్రి సుబ్రహ్మణ్యం అన్నారు. తాను 15 రోజులపాటు ఆస్ట్రేలియాలోనే ఉన్నానని, భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. కాగా రమ్యకృష్ణ మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం మహంత్ తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. -
ఆస్ట్రేలియాలో ఎన్నారై యువతి అనుమానస్పద మృతి
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లికి చెందిన రమ్యకృష్ణ అనే యువతి నాలుగు ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన మహంత్‌తో వివాహమైంది. వారం కిందట ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తునట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు చెందిన పూర్ణచంద్రరావు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నారు. ఆ కుటుంబం ప్రస్తుతం కూకట్‌పల్లిలో నివాసం ఉంటోంది. ఆయన కుమార్తె రమ్యకృష్ణకు మెల్బోర్న్కు చెందిన మహంత్‌తో వివాహమైంది. వివాహ సమయంలో రెండు అపార్టుమెంట్లు, కిలో బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. మహంత్ చేపట్టిన పిజ్జా వ్యాపారం కోసం కూడా రూ.40 లక్షలు అందజేశారు. అయితే, ఈ దంపతులకు పిల్లల్లేరు. ఈ నేపథ్యంలో వారం క్రితం రమ్యకృష్ణ చనిపోయినట్లు కుటుంబసభ్యులకు అక్కడి నుంచి సమాచారం అందింది. శుక్రవారం రాత్రి విమానంలో ఆమె మృతదేహం హైదరాబాద్ చేరుకుంది. కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహాన్ని పరిశీలించి, అత్తింటి వారే చంపారని ఆరోపిస్తున్నారు. చనిపోయిందని చెబుతున్న రోజు కూడా ఆమె తమతో ఫోన్లో మాట్లాడిందని చెబుతున్నారు. వ్యాపారంలో నష్టాన్ని భర్తీ చేసేందుకు అదనపు కట్నం కోసం మహంత్ వేధిసున్నాడని తెలుస్తుంది. అయితే, పిల్లలు పుట్టలేదని ఆమెను హింసించారని ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. -
శివగామి.. వచ్చేసింది!
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి సినిమాలో మూడో పోస్టర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ సినిమాలో 'శివగామి' పాత్ర పోషించిన రమ్యకృష్ణ నిలువెత్తు పోస్టర్‌ను తాజాగా రాజమౌళి తన ట్విట్టర్, ఫేస్బుక్ పేజీల ద్వారా విడుదల చేశారు. ఇప్పటికే ప్రభాస్, అనుష్కల పోస్టర్లు విడుదల చేసిన రాజమౌళి.. వరుసగా మూడో పోస్టర్లో రమ్యకృష్ణను పరిచయం చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ తాను ఇంత డెప్త్ ఉన్న పాత్రను డీల్ చేయలేదని, అలాగే ఇంత సామర్థ్యం ఉన్న నటులతో కూడా చేయలేదని రాజమౌళి ఆ ట్వీట్లో చెప్పారు. గడిచిన రెండున్నరేళ్లుగా తమ యూనిట్ మొత్తానికి ఆమె 'డ్రైవింగ్ ఫోర్స్'గా ఉన్నారంటూ అభినందనలతో ముంచెత్తారు. Sivagami is played by Ramya Krishna garu.. #Baahubali the beginning #LiveTheEpic — rajamouli ss (@ssrajamouli) May 6, 2015 Never before have I dealt with a character so intense and an actor so capable. She is the driving force4 our whole unit these past 2.5 years — rajamouli ss (@ssrajamouli) May 8, 2015 -
ఆమెది ఇప్పటికీ చెక్కుచెదరని అందం: నాగ్
నాగార్జున.. రమ్యకృష్ణ ఈ కాంబినేషన్ అంటే చాలు, బోలెడన్ని అలనాటి హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. సంకీర్తన, ఇద్దరూ ఇద్దరే, క్రిమినల్, ఘరానా బుల్లోడు, హలో బ్రదర్, అన్నమయ్య.. ఇలాంటి అనేక సినిమాల్లో వీరిద్దరి జంట అప్పట్లో హల్చల్ చేసింది. అలాంటి రమ్యకృష్ణతో నాగార్జున మళ్లీ ఇన్నాళ్లకు మరో సినిమా చేస్తున్నారు. 15 ఏళ్లు దాటినా ఆమె అందం ఇప్పటికీ చెక్కుచెదరలేదని ప్రశంసల వర్షం కురిపించాడు. వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నాగార్జున డబుల్ రోల్ పోషిస్తున్నారు. తాత, మనవళ్లుగా నాగార్జునే నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను, విశేషాలను నాగార్జున తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసుకున్నారు. 1500 ఏళ్ల క్రితం నాటి వైష్ణవాలయంలో షూటింగ్ జరుగుతోందని నాగ్ తెలిపారు. #scn shooting in a vishnu temple1500 years old with dear ramyakrishna after 15 years/as gorgeous as ever:)👍 pic.twitter.com/sokQ30wgLh — Nagarjuna Akkineni (@iamnagarjuna) March 10, 2015 -
హీరోయిన్ల హంగామా!
తారలు దిగి వచ్చిన వేళ... మల్లెలు నడిచొచ్చిన వేళ... అన్నట్టుగా ఆదివారం రాత్రి చెన్నైలోని ఓ ప్రై వేట్ హోటల్లో దక్షిణాది అగ్రశ్రేణి కథానాయికలంతా సందడి చేశారు. రమ్యకృష్ణ, నయనతార, త్రిష, అమలాపాల్... ఇలా ఈ అందాల తారలందరూ కలిసి పండగ చేసుకున్నారు. ఈ పండగకు ముఖ్య కారకురాలు త్రిష. ఆదివారం తన పుట్టినరోజు. ఈ వేడుకను అత్యంత సన్నిహితుల మధ్య జరుపుకున్నారామె. ఒకప్పుడు నయనతార, త్రిష మధ్య మనస్పర్థలున్నప్పటికీ ఆ తర్వాత స్నేహితులయ్యారు. రమ్యకృష్ణ, త్రిష ఎప్పట్నుంచో క్లోజ్‌ఫ్రెండ్స్. ఇక అమలాపాల్, నికిషా పటేల్.. ఇలా త్రిష స్నేహితుల జాబితాలో చాలామందే ఉన్నారు. వీళ్లల్లో త్రిష బర్త్‌డే పార్టీకి చాలామంది హాజరయ్యారు. వాళ్లతో కలిసి బర్త్‌డే బేబీ త్రిష ఫొటోలు దిగారు. -
మన నీలాంబరికి నలభై ఐదేళ్లు..
జోలాజోలమ్మజోలా.. జేజేలా జోలా అంటూ జోలపాట పాడినా, బంచికు బంబం చెయ్యి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా అంటూ యోగ విన్యాసాలు చేసినా, రోజ్ రోజ్ రోజాపువ్వా అని హీరోతో పొగిడించుకునే అరవిరిసిన రోజాలా కనిపించినా.. అమ్మోరై దుష్టశిక్షణ చేసినా.. అవన్నీ ఆమెకే చెల్లు. కూచిపూడి, భరతనాట్యం.. రెండింటిలోనూ ప్రవీణ. అమాయకపు పల్లెపిల్లలా కనిపించాలన్నా, ఒంటినిండా పొగరు చూపించే నీలాంబరి పాత్ర ధరించాలన్నా.. ఆమెకే సాధ్యం. ఇప్పటికే ఆమెవరో అర్థమైంది కదూ.. అవును.. రమ్యకృష్ణ. తమిళనాట ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు అయిన రమ్యకృష్ణ ఆదివారం 45వ పుట్టినరోజు జరుపుకొంటోంది. దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో తన అసమాన ప్రతిభా పాటవాలతో నటించి, కుర్రకారును ఉర్రూతలూగించిన రమ్యకృష్ణ టీనేజిలోకి అడుగుపెడుతూనే సినిమా రంగంలోకీ అడుగుపెట్టింది. ఎనిమిదో తరగతి చదువుతూనే తమిళంలో ‘వెల్లై మనసు’ లో ప్రధాన ప్రాత పోషించింది. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ‘బాల మిత్రులు’ 1987లో విడుదల అయింది. కె. రాఘంద్రేరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగింది. దాదాపుగా తెలుగుహీరోలు అందరితోనూ ఆమెకు విజయవంతమైన సినిమాలున్నాయి. నరసింహ చిత్రంలో రజనీకాంత్‌తో పోటీపడి మరీ చేసిన 'నీలాంబరి' పాత్రను ప్రేక్షకులు ఇప్పుటికీ మరిచిపోలేరు. ఈ సినిమా దక్షిణ భారతదేశంలో కాకుండా, సింగపూర్, లండన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. స్వతహాగా మంచి నృత్యకారిణి అయిన రమ్యకృష్ణ.. ఇటీవలే న్యూయార్క్, డల్లాస్ వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణకు ఇద్దరు కుమారులు. వారిలో రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఆమె ఇప్పుడు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేందుకు ‘జరా మస్తీ జరా ధూమ్’ అనే టీవీ షో ప్రారంభించింది. త్వరలో మరిన్ని రకరకాల టీవీ షోలు చేయలన్ని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో సినిమాలో రమ్యకృష్ణ ఉంటే చాలు.. అది ఫ్లాపే అన్న టాక్ వచ్చినా, 'అల్లుడుగారు' సినిమాతో ఆ విమర్శలన్నింటినీ తిప్పికొట్టింది. తర్వాత నుంచి ఆమె నటించిన చిత్రాలన్నీ సూపర్హిట్లే. ఇప్పుడు చేస్తున్న, చేయబోతున్న టీవీ షోలు కూడా విజయవంతం కావాలని ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆశిద్దాం.. -
‘బాహుబలి’లో రాజమాతగా?
గ్లామర్, నాన్-గ్లామర్.. ఏ పాత్రనైనా సునాయాసంగా చేయగలరు రమ్యకృష్ణ. అమ్మాయిలా యువహృదయాల్లో కలవరం పుట్టించి, అమ్మోరుగా చేతులెత్తి మొక్కేలా అభినయించారామె. ఇక, నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర అయితే ఏ స్థాయిలో విజృంభిస్తారో చెప్పడానికి ‘నరసింహ’ సినిమాలో నీలాంబరి కేరక్టర్ చాలు. ఇప్పుడు రమ్యకృష్ణ రాజమాతగా మౌల్డ్ అయ్యారని సమాచారం. భారీ చిత్రం ‘బాహుబలి’ కోసమే ఆమె ఈ అవతారం ఎత్తారని వినికిడి. ప్రభాస్, రానా, అనుష్క కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో ప్రభాస్, రానాల తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నారట. రియల్ లైఫ్‌లో ఇంత పెద్ద కొడుకులు ఉండే వయసులో రమ్య లేకపోయినా రీల్ మీద ఈ పాత్రను అద్భుతంగా పోషిస్తారనే నమ్మకంతోనూ పైగా ఇది రాజసం ఉట్టిపడే పాత్ర కాబట్టి ఆమెను తీసుకుని ఉంటారని ఊహించవచ్చు.