రమ్యకృష్ణ
ఇటీవల వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంలో పవర్‌ఫుల్ అత్తగా కనిపించిన రమ్యకృష్ణ మరోసారి అత్త పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సుందర్ సి. దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తున్నారు. ముందుగా నదియా పాత్రలో ఖుష్భు కనిపిస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా శింబు అత్త పాత్రను రమ్యకృష్ణ పోషించనున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా మేఘా ఆకాశ్, కేథరీన్ థెరీసా నటిస్తున్నారు. ఫైనల్‌గా అత్త దొరికేసింది. ఇక అత్తారింటికి దారి వెతికే పనిలో బిజీ అయ్యారు శింబు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment