megha akash
-
అది దా సారు!
హీరోయిన్ మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సః కుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ కిరణ్ హీరోగా నటిస్తున్నారు. హెచ్. మహాదేవ గౌడ, హెచ్. నాగరత్న నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ‘అది దా సారు...’ పాట లిరికల్ వీడియోను నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం ఇవ్వగా, భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘కుటుంబ నేపథ్యంలో వస్తున్న మా ‘సః కుటుంబానాం’ టైటిల్‌తోనే అంచనాలు పెంచేసింది. ‘అది దా సారు...’ పాటలోని లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మధు దాసరి, ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్: రోహిత్ కుమార్ పద్మనాభ, లైన్‌ప్రొడ్యూసర్: అంకిత్ కనయ్. -
Vikkatakavi Review: ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: వికటకవి (ఆరు ఎపిసోడ్లు)నటీనటులు: నరేశ్అగస్త్య, మేఘా ఆకాశ్, షైజు, అమిత్ తివారీ, తారక్ పొన్నప్ప, రఘుకుంచె, నిమ్మల రవితేజ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామ్ తాళ్లూరిదర్శకత్వం: ప్రదీప్ మద్దాలిఓటీటీ: జీ5 (నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది)‘వికటకవి’ కథేంటంటే..ఈ సినిమా కథ 1940-70ల మధ్యకాలంలో సాగుతుంది. రామకృష్ణ(నరేశ్ అగస్త్య) డిటెక్లివ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ.. డబ్బు కోసం డిటెక్టివ్‌గా మారతాడు. పోలీసులకు సైతం అంతుచిక్కని కొన్ని కేసులను తన తెలివితేటలతో పరిష్కరిస్తాడు. అతని గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్.. రామకృష్ణను అమరగిరి ప్రాంతానికి పంపిస్తాడు. అమరగిరిలో ఓ వింత ఘటన జరుగుతుంటుంది. రాత్రివేళలో అక్కడి దేవతల గుట్టకు వెళ్లిన జనాలు గతాన్ని మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం కారణంగానే ఇలా జరుగుతుందని ఆ ఊరి జనాలు భావిస్తారు. అందులో నిజమెంత ఉందని తెలుసుకునేందుకు రామకృష్ణ దేవతల గుట్టకు వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అందరి మాదిరే రామకృష్ణ కూడా గతాన్ని మర్చిపోయాడా? దేవతల గుట్టకు వెళ్లిన రామకృష్ణకు తెలిసిన నిజమేంటి? అతనితో పాటు అమరగిరి సంస్థాన రాజు రాజా నరసింహా (షిజు అబ్దుల్ రషీద్) మనవరాలు లక్ష్మి (మేఘా ఆకాష్) కూడా దేవతల గుట్టకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజా నరసింహ కొడుకు మహాదేవ్ (తారక్ పొన్నప్ప), కోడలు గౌరీ (రమ్య దుర్గా కృష్ణన్) వల్ల అమరగిరికి వచ్చిన శాపం ఏమిటి? అమరగిరి ప్రాంతానికి రామకృష్ణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే..?డిటెక్టివ్ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ మాత్రం ‘వికటకవి’ అనే చెప్పాలి. కథ 1970 నుంచి 40కి వెళ్లడం..అక్కడ నుంచి మళ్లీ 90లోకి రావడంతో ఓ డిఫరెంట్ వెబ్ సీరీస్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సిరీస్ ప్రారంభమైన కాసేపటికే దేవతలగుట్ట సమస్య వెనుక ఎవరో ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. కానీ అది ఎవరు అనేది చివరి వరకు తెలియజేకుండా కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు ప్రదీప్ మద్దాలి సఫలం అయ్యాడు. కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్నా... ఎంగేజ్ చేసేలా కథనాన్ని నడిపించాడు. రచయిత తేజ దేశరాజ్ ఈ కథను సాధారణ డిటెక్టివ్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా అనేక క్లిష్టమైన ఉపకథలను, చారిత్రక సంఘటనలను చక్కగా మిళితం చేసి ఓ డిఫరెంట్ స్టోరీని క్రియేట్ చేశాడు. ఆ స్టోరీని అంతే డిఫరెంట్‌గా తెరపై చూపించడాడు దర్శకుడు. ఓ భారీ కథను పరిమితమైన ఓటీటీ బడ్జెట్‌తో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు దర్శకుడు ప్రదీప్‌ను అభినందించాల్సిందే. తొలి ఎపిసోడ్‌లోనే ఒకవైపు అమరగిరి ఊరి సమస్యను పరిచయం చేసి, మరోవైపు రామకృష్ణ తెలివితేటలను చూపించి అసలు కథను ప్రారంభించాడు. ఇక హీరో అమరగిరికి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. దేవతల గుట్టపై ఉన్న అంతుచిక్కని రహస్యాన్ని చేధించేందుకు రామకృష్ణ చేసే ప్రయత్నం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోగా.. కథనం నెమ్మదిగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపులో ఈ సిరీస్‌కి కొనసాగింపుగా ‘వికటకవి 2’ ఉంటుందని ప్రకటించి షాకిచ్చారు మేకర్స్. ‘వికటకవి 2’ చూడాలంటే.. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. లాజిక్స్‌ని పట్టించుకోకుండా చూస్తే ఈ సిరీస్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేశ్ అగస్త్య ఒదిగిపోయాడు. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ చూస్తే..నిజమైన డిటెక్టివ్‌ని స్క్రీన్ మీద చూసినట్లే అనిపిస్తుంది. మేఘా ఆకాశ్‌కు ఓ మంచి పాత్ర లభించింది. తెరపై ఆమె చాలా హుందాగా కనిపించింది. అమిత్ తివారీ, షైజు, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సిరీస్ చాలా బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్‌కి మరో ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1940-70నాటి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
నీలి రంగు చీరలో అదరగొడుతున్న హీరోయిన్ మేఘ ఆకాష్ (ఫొటోలు)
-
చీరలో ముద్దుగుమ్మలా అలరిస్తున్న మేఘా ఆకాష్ (ఫోటోలు)
-
టాలీవుడ్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీల్లో వెబ్ సిరీసులకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ లాంటి సిరీస్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే ఏ భాషలోనైనా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అయితే తెలుగులో స్ట్రైట్ వెబ్ సిరీస్‌లు చాలా తక్కువే వచ్చాయి. తాజాగా తెలుగులో తెరకెక్కించిన డిటెక్టివ్ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి రానుంది.(ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన డిటెక్టివ్ సిరీస్ 'వికటకవి'. ఈ వెబ్ సిరీస్‌కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఈ సిరీస్‌ను తెరకెక్కించడం మరో విశేషం. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. The suspenseful and suspicious tale of Amaragiri and the mystery that follows it. 🫣It will see you on screens from 28th November 💥#Vikkatakavi, Amaragiri and the team wish you a Happy Diwali 🪔#VikkatakaviOnZee5@nareshagastya @akash_megha @pradeepmaddali @srtmovies pic.twitter.com/0b2G7b69Lz— ZEE5 Telugu (@ZEE5Telugu) November 1, 2024 -
ఘనంగా మేఘా ఆకాష్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు.!
-
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా రిసెప్షన్ (ఫొటోలు)
-
వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ సాయివిష్ణు అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. తాజాగా తన రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. ఇది నా జీవితంలో ఫేవరేట్ చాప్టర్ అంటూ భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో పలువురు సినీతారలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చెన్నైలో జరిగిన మేఘా ఆకాష్, సాయివిష్ణు వివాహ రిసెప్షన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు డీఎంకే మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ( ఇది చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్.. మెహందీ ఫొటోలు)కాగా.. నితిన్ 'లై' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది మేఘా ఆకాశ్. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా కొన్ని మూవీస్ చేసింది. తెలుగులో 'లై'తో పాటు ఛల్ మోహన్ రంగ, రాజరాజ చోర, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, బూ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనే రెండు మూవీస్ చేస్తోంది. కోలీవుడ్‌లో 2019లో పెట్టా మూవీతో ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాశ్.. ఎన్నై నోకి పాయుమ్ తోట, వంద రాజావ తాన్ వరవానే చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా సబానాయగన్, వడకుపట్టి రామసామి సినిమాలతో మెప్పించింది. சென்னையில் நடைபெற்ற தமிழ்நாடு காங்கிரஸ் கமிட்டி முன்னாள் தலைவர் திரு. சு.திருநாவுக்கரசர் அவர்களின் மகன் எஸ்.ஆர்.டி.சாய் விஷ்ணு - மேகா ஆகாஷ் ஆகியோரது திருமண வரவேற்பு நிகழ்ச்சியில் மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் கலந்துகொண்டு மரக்கன்று பசுமைக்கூடை வழங்கி மணமக்களை… pic.twitter.com/OQXqNfAowD— CMOTamilNadu (@CMOTamilnadu) September 14, 2024 View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్.. మెహందీ ఫొటోలు
హీరోయిన్ మేఘా ఆకాశ్ పెళ్లికి రెడీ అయిపోయింది. గత నెలలో సడన్‌గా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత కొన్నిరోజులకు పెళ్లి కార్డులు పంచింది. సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వాళ్లకు కూడా కార్డ్ ఇచ్చింది. మొన్నీమధ్య శ్రీలంకలో బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. ఇప్పుడు పెళ్లి పనులు షురూ చేసింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు.. ఏకంగా 20 రోజులు)నితిన్ 'లై' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది మేఘా ఆకాశ్. ఈమెది చెన్నై. అలా తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా కొన్ని మూవీస్ చేసింది. తెలుగులో 'లై'తో పాటు ఛల్ మోహన్ రంగ, రాజరాజ చోర, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, బూ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనే రెండు మూవీస్ చేస్తోంది.మేఘా ఆకాశ్.. విష్ణు అనే వ్యక్తిని పెళ్లాడబోతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తోంది గానీ పెళ్లెప్పుడు? ఎక్కడ జరగనుందనే విషయాల్ని మాత్రం సీక్రెట్‌గానే ఉంచింది. మెహందీ లేటెస్ట్గా జరిగిందంటే ఒకటి రెండు రోజుల్లోనే పెళ్లి జరగడం గ్యారంటీ. (ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి ఎదురుదెబ్బ) -
హీరోయిన్ మేఘా ఆకాశ్ బ్యాచిలర్ పార్టీ.. శ్రీలంకలో ఫుల్ చిల్ (ఫొటోలు)
-
Megha Akash: త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు!
-
Megha Akash : హీరోయిన్ మేఘా ఆకాశ్ నిశ్చితార్థం (చిత్రాలు)
-
నిశ్చితార్థంతో సర్ప్రైజ్.. టాలీవుడ్ హీరోయిన్ పెళ్లికి రెడీ
యంగ్ హీరో మేఘా ఆకాశ్ నిశ్చితార్థం చేసుకుంది. మొన్నటివరకు ఈమె పెళ్లి గురించి రకరకాల గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిని నిజం చేస్తూ సాయి విష్ణు అనే కుర్రాడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన మూడు ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆగస్టు 22న ఈ శుభకార్యం జరిగినట్లు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)మేఘా ఆకాశ్ విషయానికొస్తే.. చెన్నైలో పుట్టి పెరిగింది. తెలుగు హీరో నితిన్ 'లై' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనే ఛల్ 'మోహన రంగ', 'రాజరాజ చోర', 'డియర్ మేఘ', 'గుర్తుందా శీతాకాలం', 'ప్రేమదేశం', 'రావణాసుర', 'బూ', 'మనుచరిత్ర' మూవీస్ చేసింది. తమిళంలోనూ రజనీకాంత్ 'పేటా'తో పాటు బోలెడన్ని చిత్రాల్లో నటించింది. కాకపోతే ఈమెకు సరైన బ్రేక్ రాలేదు.గత కొన్నిరోజుల నుంచి మేఘా ఆకాశ్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుతో వివాహం చేసుకోనుందని అన్నారు. ఇవన్నీ అలా ఉండగానే సాయి విష్ణు అనే కుర్రాడితో ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. కాకపోతే ఇతడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ లాంటివి మాత్రం ప్రస్తుతానికి తెలియట్లేదు. ఏదేమైనా మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందనమాట. ఇదలా ఉంచితే తెలుగు హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరఖ్‌ని పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్) -
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పెళ్లికి రెడీ? నిజమేంటి?
మరో తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా? చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఏకంగా వెడ్డింగ్ వైబ్స్ అని కొన్ని ఫొటోలు పోస్ట్ చేయడంతోనే ఈ చర్చంతా తెరపైకి వచ్చింది. గతంలో ఈమె పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? పెళ్లి గురించి వస్తున్న వార్తల సంగతేంటి అనేది ఓసారి చూద్దాం.తమిళ బ్యూటీ మేఘా ఆకాశ్.. 'లై' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. గతేడాది ఓ మూడు చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఈమె పెళ్లి గురించి వార్తలొచ్చాయి. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కొడుకుని పెళ్లి చేసుకోనుందని మాట్లాడుకున్నారు. ఎవరూ స్పందిచకపోవడంతో దీని గురించి అందరూ మర్చిపోయారు.తాజాగా మరోసారి కొత్త పెళ్లి కూతురు లుక్‌లో మేఘా ఆకాశ్ దర్శనమిచ్చింది. వెడ్డింగ్ వైబ్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. దీంతో మరోసారి ఈమె మ్యారేజ్ హాట్ టాపిక్ అయిపోయింది. త్వరలో చేసుకోనుందని అన్నారు. మేఘా పెళ్లి న్యూస్ నిజమే అయినప్పటికీ.. మరికొన్ని రోజుల తర్వాతే అది ఉండొచ్చని తెలుస్తోంది. లేటెస్ట్ పిక్స్ మాత్రం యాడ్ షూట్‌కి సంబంధించినవి అని తెలుస్తోంది. -
కుటుంబ కథాంశంతో ‘సఃకుటుంబానాం’
రామ్ కిరణ్, మేఘ ఆకాష్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హెచ్.మహదేవ గౌడ్ నిర్మాత. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ,మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలంలో ఇంత మంది ఆరిస్టులు, ఇంత మంచి కాంబినేషన్స్‌తో ఏ సినిమా రాలేదు. ఇందులో చాలా మంచి కథ ఉంది. ఎవరూ ఊహించని రీతిలో ఈ చిత్రం ఉంటుంది. నిర్మాత మహదేవ్ మాట్లాడుతూ.. అచ్చమైన తెలుగు టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అందరు మెచ్చేలా కుటుంబ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. -
తెలంగాణ బ్యాక్ డ్రాప్ వెబ్ సిరీస్.. ఆ ఓటీటీలోనే రిలీజ్?
ఓటీటీల వల్ల చాలామంది సినిమాలు, వెబ్ సిరీసులకు బాగా అలవాటుపడిపోయారు. కొత్త రిలీజులు ఏమున్నాయా? వాటిని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు స్ట్రెయిట్ వెబ్ సిరీస్ ఒకటి రెడీ అయిపోయింది. తెలంగాణ నేపథ్యంగా ఈ సిరీస్ తీయడం విశేషం. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు ఆచితూచి సినిమాలు, సిరీసులు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులోనూ 'దూత' లాంటి స్ట్రెయిట్ వెబ్ సిరీస్ వచ్చింది. అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు అలానే 'వికటకవి' అనే డిటెక్టివ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో తీసిన ఈ తెలుగు వెబ్ సిరీసులో నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరించారు. ఇకపోతే ఈ సిరీస్ జీ5 ఓటీటీలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. డేట్ చెప్పాల్సి ఉంది. అయితే ఏప్రిల్ చివర్లో లేదా మే తొలివారంలో స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) -
సడన్‌గా ఓటీటీ వచ్చేసిన స్టార్ కమెడియన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం, మేఘా ఆకాష్ జంటగా నటించిన వడక్కుపట్టి రామసామి. పీరియాడికల్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు కార్తిక్ యోగి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 1960-70 కాలంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందించారు. మంగళవారం నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. స్టార్ కమెడియన్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అభిమానుల అంచనాలను అందుకోవడంపై బోల్తా కొట్టింది. కానీ గతంలో సంతానం - కార్తిక్ యోగి కాంబినేషన్లో వచ్చిన డిక్కీలోనా అనే మూవీ కమర్షియల్ సక్సెస్ కావడంతో వడక్కుపట్టి రామసామిపై అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. కేవలం రూ.5.5 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు సాధించింది. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ సినిమాతోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం త్వరలోనే తెలుగులోనూ అందుబాటులోకి రానుందని టాక్. After a thundering response for the theatrical release, Fun-filled social drama #VadakkupattiRamasamy is now available on @PrimeVideoIN #VadakkupattiRamasamyOnPrime @karthikyogidir @akash_megha @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @RajaS_official @Sunilofficial… pic.twitter.com/rqAoormWfu — Santhanam (@iamsanthanam) March 12, 2024 -
షూటింగ్ సమయంలో బామ్మ చనిపోవడంతో..: హీరోయిన్
తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ తమిళంలో నిర్మించిన చిత్రం వడక్కుపట్టి రామసామి. కమెడియన్ సంతానం కథానాయకుడిగా నటించిన ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్గా నటించారు. ఎంఎస్ భాస్కర్, కూల్ జయంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. కార్తీక్ యోగి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 2వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. అతడితో నటించాలనుందన్న అల్లు శిరీష్ ఈ సందర్భంగా శనివారం ఉదయం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు శిరీష్ మాట్లాడుతూ.. హాస్య పాత్రలు పోషిస్తున్నప్పటి నుంచి నటుడు సంతానంను గమనిస్తున్నానని, ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ కథానాయకుడిగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. సంతానం హాస్యం అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ఇంటర్వ్యూలు కూడా ఆసక్తిగా చూస్తుంటానని చెప్పారు. సంతానంతో కలిసి నటించాలనుందన్నారు. 65 రోజుల్లో షూటింగ్ పూర్తి సంతానం మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వ ప్రసాద్ తనతో రెండు చిత్రాలు చేస్తున్నారని, అందులో మొదటిగా విడుదలవుతున్న చిత్రం ఈ వడక్కుపట్టి రామసామి అని చెప్పారు. 65 రోజుల్లో ఈ చిత్రాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా భారీస్థాయిలో నిర్మించారని చెప్పారు. తాను నటించిన చిత్రాలన్నింటికంటే ఇది భారీ బడ్జెట్ చిత్రమన్నారు. అర్థం చేసుకున్నారు మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన విశ్వ ప్రసాద్‌కు, క్రియేటివ్ నిర్మాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారన్నారు. షూటింగ్ సమయంలో తన బామ్మ మరణించడంతో చాలా బాధపడ్డానని, దాన్ని అర్థం చేసుకుని అండగా నిలిచారని చెప్పారు. మంచి బలమైన పాత్రను ఇచ్చిన దర్శకుడు కార్తీక్ యోగికి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: క్యాన్సర్‌తో చనిపోయిన ప్రముఖ హీరోయిన్.. ప్రముఖుల నివాళి -
ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదు: యంగ్ డైరెక్టర్
ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సంతానం లేటెస్ట్ మూవీ 'ఉడక్కపట్టి రామస్వామి'. దర్శకుడు కార్తీక్ యోగి తీసిన ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో మేఘాఆకాష్ హీరోయిన్గా నటించింది. ఇక రిలీజ్ దగ్గర పడిన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం చైన్నెలో ప్రెస్ మీట ఏర్పాటు చేసి సినిమా గురించి పలు విషయాల్ని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు) 'ఇది 1974లో జరిగే కామెడీ మూవీ. సంతానం మట్టికుండల వ్యాపారిగా.. మేఘా ఆకాష్ మిలటరీ డాక్టర్‌గా నటించారు చెప్పారు. మద్రాస్ ఐ అనే అంటువ్యాధి కొత్తగా వ్యాపిస్తున్న సమయాన్ని హీరో ఎలా తనకు అనుకూలంగా వాడుకుంటాడు అనే విషయాన్ని కామెడీతో మిక్స్ చేసి సినిమా తీశాం. ఇది ఎవరి మనోభావాలకు దెబ్బతీయదు' అని దర్శకుడు కార్తీక్ యోగి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'హనుమాన్' తెచ్చిన జోష్.. రాముడి పాత్రలో మెగాహీరో రామ్ చరణ్?) -
ఎల్లో డ్రెస్‌లో నభా నటేశ్ అందాలు.. మంచుకొండల్లో కేజీఎఫ్ భామ!
►ఎల్లో డ్రెస్‌లో నభా నటేశ్ అందాలు ►మంచుకొండల్లో చిల్ అవుతోన్న కేజీఎఫ్ భామ ►గుర్రంతో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సవారీ ►అరెంజ్ డ్రెస్సులో ఊర్వశి రౌతేలా హోయలు ►వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న సాక్షి అగర్వాల్ ►కొత్త ఏడాది బీచ్‌లో చిల్ అవుతోన్న మేఘా ఆకాశ్ ► అలాంటి వీడియో షేర్ చేసిన అమలాపాల్.. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
సెట్లో బర్త్‌డే సెలెబ్రేషన్స్..చీరకట్టులో మరింత అందంగామేఘా ఆకాశ్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్‌లో మేఘా ఆకాశ్ ఒకరు. లై సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే..సినిమాల్లోనూ ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తుంది. నేడు(అక్టోబర్ 26) ఆ అమ్మడి పుట్టిన రోజు. ఈ సారి తన బర్త్‌డే సెలెబ్రేషన్స్‌ని సఃకుటుంబనాం సినిమా సెట్స్‌లో జరుపుకుంది. అచ్చం తెలుగమ్మాయిలా చీర కట్టుకొని.. చిత్రబృందం సమక్షంలో కేక్ కట్ చేసింది. అనంతరం యూనిట్ అంతా తనకు విషెస్ తెలియజేశారు. సఃకుటుంబనాం సినిమా విషయానికొస్తే.. ఇందులో రామ్ కిరణ్ హీరోగా నటిస్తున్నాడు. హెచ్ఎన్జీ మూవీస్ సినిమాస్ పతాకంపై ఉదయ్‌శర్మ దర్శకత్వంలో హెచ్.మహాదేవ్ గౌడ, హెచ్.నాగరత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాహుల్ రామకృష్ణ. రచ్చరవి, శుభలేఖ సుధాకర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మేఘ ఆకాష్ పై అదిరిపోయే పంచులతో బిత్తిరి సత్తి
-
మేఘా ఆకాశ్ కొత్త సినిమా.. డిఫరెంట్ టైటిల్
మేఘాఆకాశ్ హీరోయిన్గా నటిస్తున్న కొత్త సినిమాకు 'సఃకుటుంబనాం' పేరు పెట్టారు. హైదరాబాద్‌లో ఆదివారం లాంచనంగా ఈ చిత్రం ప్రారంభమైంది. రామ్ కిరణ్ హీరోగా నటిస్తుండగా.. హెచ్ఎన్జీ మూవీస్ సినిమాస్ పతాకంపై హెచ్.మహాదేవ్ గౌడ, హెచ్.నాగరత్నం నిర్మిస్తున్నారు. ఉదయ్‌శర్మ దర్శకుడు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగాఫ్రర్ చిన్నిప్రకాష్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం క్లాప్‌నిచ్చారు. (ఇదీ చదవండి: ఆమెతో ప్రేమ-పెళ్లి.. 'జవాన్' డైరెక్టర్‌పై అలాంటి కామెంట్స్!) సినిమాలో తన పాత్ర గురించి వినగానే కొత్త హీరో అని చూడకుండా మేఘా ఆకాష్ వెంటనే ఒప్పుకున్నారని దర్శకుడు చెప్పాడు. క్లీన్‌ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రం అందరికి నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇక మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. ఈ మూవీలో నా పాత్ర పేరు సిరి. నాకు బాగా నచ్చిన పాత్ర. ఇందులో నటించడం ఆనందంగా వుందని చెప్పింది. ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ విజేత చేతికి అందని రూ.25 లక్షలు.. పట్టించుకోని టీమ్) -
ఆ గ్యారంటీ ఇవ్వగలను
‘‘ఏ సీజన్లో అయినా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇప్పుడు మేం తీసిన ‘మను చరిత్ర’ కూడా ఓ మంచి చిత్రంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే గ్యారంటీ ఇవ్వగలను’’ అని శివ కందుకూరి అన్నారు. శివ కందుకూరి హీరోగా భరత్ పెదగాని దర్శకత్వంలో ఎన్. శ్రీనివాసరెడ్డి నిర్మించిన చిత్రం ‘మను చరిత్ర’. మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్లు. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో శివ కందుకూరి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో మను అనే క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఏడెనిమిదేళ్ల టైమ్ పీరియడ్‌లో ఈ సినిమా సాగుతుంది. అందుకే ‘మను చరిత్ర’ అని టైటిల్ పెట్టాం. ట్రైలర్లో యాక్షన్ కనిపిస్తున్నప్పటికీ సినిమాలో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది. తన నిజజీవితంలోని వ్యక్తుల నుంచి స్ఫూర్తి ΄÷ంది ఈ సినిమాలోని ΄ాత్రలను డిజైన్ చేసినట్లు, అలాగే తన ముగ్గురు స్నేహితుల వ్యక్తిత్వాలను మిళితం చేసి మను ΄ాత్రను డిజైన్ చేసినట్లు దర్శకుడు భరత్ నాతో చె΄్పారు. మా నాన్నగారు (నిర్మాత రాజ్ కందుకూరి) ‘మను చరిత్ర’ సినిమా చూసి, నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి బాగా యాక్ట్ చేశావని అన్నారు. దాన్ని పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను’’ అని అన్నారు. -
‘మనుచరిత్ర’ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘మనుచరిత్ర’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మేఘా ఆకాష్‌కు పెళ్లి?
నటి మేఘా ఆకాష్ పెళ్లికి సిద్ధమవుతుందా? ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం ఇదే. చైన్నెలో పుట్టి పెరిగిన నటి మేఘా ఆకాష్ తండ్రి తమిళుడు. తల్లి మలయాళి. చైన్నెలోనే చదువు పూర్తి చేసిన మేఘా ఆకాష్ నటిగా రంగప్రవేశం చేసింది మాత్రం టాలీవుడ్లో. 2017లో లై అనే చిత్రం ద్వారా నితిన్‌కు జంటగా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఛల్ మోహన రంగా తదితర చిత్రాలలో నటించింది. తమిళంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పేట చిత్రంతో పరిచయమైంది. ఆ తరువాత ఇక్కడ ఒరు పక్క కథై, శింబు సరసన వందా రాజాదాన్ వరువేన్, అధర్వకు జంటగా భూమరాంగ్, ధనుష్ సరసన ఎన్నై నోక్కి పాయుమ్ తూటా తదితర చిత్రాలలో నటించింది. హిందీలోనూ నటిస్తున్న మేఘా ఆకాష్ పెళ్లికి రెడీ అయ్యిందని, ఒక రాజకీయనాయకుడు కొడుకుతో త్వరలోనే ఏడు అడుగులు వేయనున్నుట్లు ప్రచారం, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దీనిపై స్పందించిన ఆమె తల్లి మేఘా ఆకాష్ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. అవన్నీ వదంతులేనని ఒక భేటీలో పేర్కొన్నారు. మేఘా ఆకాష్ నూతన చిత్రం విడుదల సమయంలో కూడా ఇన్ని ఫోన్‌కాల్స్ వచ్చేవి కావని, ఇప్పుడు వరుసగా ఫోన్స్ వస్తున్నాయని అన్నారు. అయినా తన కూతురు పెళ్లి విషయాన్ని అందరికీ ముందుగానే వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఇలాంటి వదంతులు ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదని ఆమె అన్నారు. కాగా మేఘా ఆకాష్ ప్రస్తుతం తమిళంలో విజయ్‌ఆంటోనికి జంటగా నటించిన మళై పడిక్కాద మనిదన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
ఇప్పుడే పరిచయమే...
శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మను చరిత్ర’. ఈ మూవీతో భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్.శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఇప్పుడే పరిచయమే...’ పాటని హీరోయిన్ సంయుక్త మీనన్ లాంచ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, ఆర్మాన్ మాలిక్ పాడారు. -
గాఢమైన ప్రేమకథ
శివ కందుకూరి హీరోగా నటించిన తాజా ఇంటెన్స్ లవ్ స్టోరీ (గాఢమైన ప్రేమకథ) ‘మను చరిత్ర’. ఇందులో మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించారు. భరత్ పెదగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్. శ్రీనివాస రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను జూన్ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీ విజయ ఫిల్మ్స్ ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. ‘‘వరంగల్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది. ఇందులో ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్‌ను శివ చేశారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్. -
చెపాక్ స్టేడియంలో సందడి.. ఆ హీరోయిన్‌కు కేక్ తినిపించిన ధోని..!
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో నటించిన యువ తమిళ నటి మేఘా ఆకాష్. ముఖ్యంగా తమిళంలో రజనీకాంత్‌తో కలిసి పేట చిత్రంలోనూ, ధనుష్ సరసన ఎనై నోక్కి పాయుమ్ తూటా చిత్రంలోనూ నటించింది. అదేవిధంగా శింబుకు జంటగా వందా రాజాదాన్ వరువేన్ చిత్రంలో నటించింది. అయితే ఇప్పటికీ ఈ భామకు అనుకున్న స్థాయిలో స్టార్ అంతస్థు రాలేదని చెప్పాలి. అందుకు కారణం సరైన సక్సెస్ పడకపోవడమే అని భావించవచ్చు. కాగా ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గురించి తెలుపుతూ తాను చైన్నెలో పుట్టిన పెరిగిన అచ్చ తమిళ అమ్మాయినని చెప్పింది. అమ్మ, నాన్నలకు ఒకత్తే కూతురునని, బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ చదివినట్లు తెలిపింది. నాకు చిన్నతనంలో బిడియం ఎక్కువ అని చెప్పింది. నలుగురితో ధైర్యంగా మాట్లాడడం కూడా తెలీదని, దానిని మార్చుకోవాలని భావించినట్లు పేర్కొంది. దీంతో తాను చదువుకుంటునే పాకెట్ మనీ కోసం చిన్న చిన్న వాణిజ్య ప్రకటనల్లో నటించానని చెప్పింది. ఆ తరువాత సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని తెలిపింది. తన చూట్టూ ఉన్న తన తల్లి తనతో ఉండాల్సిందేనని చెప్పింది. చిత్ర షూటింగ్‌లకు కూడా తనతో తల్లి వస్తుందని తెలిపింది. తనకు క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని అంటే చాలా ఇష్టమని, తాను ఆయన వీరాభిమానినని చెప్పింది. ఇక నటి త్రిష అంటే చాలా ఇష్టమని పేర్కొంది. పుస్తకాలు చదవడం, పాటలు వినడం తన హాబీ అని మేఘా ఆకాష్ పేర్కొంది. వైరల్‌గా ఫోటో! ఇదిలాఉండగా.. ఇటీవల చెపాక్ వేదికగా చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లిన మేఘ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చప్పట్లు కొడుతూ ధోని టీమ్‌ను ఎంకరేజ్ చేసింది. చెన్నై ఓడిపోవడంతో ఒకింత నిరాశకు గురైంది. ఈనేపథ్యంలో ధోనితో కలిసి ఆమె దిగిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
ప్రేక్షకులు థ్రిల్ అవుతారు
‘‘రావణాసుర’ మూవీలో నాది చాలా కీలకమైన పాత్ర. కామెడీ, ఇంటెన్స్.. ఇలా వేరియేషన్స్ ఉంటాయి. ఆ పాత్ర చేయడం సవాల్‌గా అనిపించింది’’ అని మేఘా ఆకాష్ అన్నారు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ చిత్రంలో ఓ హీరోయిన్గా నటించిన మేఘా ఆకాష్ మాట్లాడుతూ–‘‘రావణాసుర’లో నేను రిచ్, క్లాసీ అమ్మాయిగా కనిపిస్తాను. ఈ మూవీలో చాలా మలుపులు, ట్విస్ట్‌లు, సర్ప్రైజ్లు ఉన్నాయి. ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. సుధీర్ వర్మగారు ఒక యాక్టర్‌కి చాలా కంఫర్ట్ జోన్ ఇస్తారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీతో ఒక సినిమా, మా అమ్మగారి సమర్పణలో ఓ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. -
రావణాసురుడి ముద్దుగుమ్మలు క్యూట్ ముచ్చట్లు
-
రావణాసుర విజయంపై నమ్మకం ఉంది
‘‘రావణాసుర’ చిత్రం నన్నెంతో అలరించింది. కచ్చితంగా ప్రేక్షకులందర్నీ కూడా అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు రవితేజ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’ టైటిల్, ఆ టైటిల్ డిజైన్ క్రెడిట్ నిర్మాత అభిషేక్‌కు దక్కుతుంది. అతను మల్టీటాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలుగా మాకు మంచి పేరు రావాలని, భవిష్యత్‌లో మేమిద్దరం కలిసి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హిట్‌తో సుధీర్ వర్మ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాలి. ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యాక్‌బోన్స్ అయిన శేత, నమ్రత, వింధ్యా రెడ్డిగార్లకు థ్యాంక్స్. నా ఉత్సాహం, నా ప్రోత్సాహం నా అభిమానులే’’ అని అన్నారు. ‘‘రవితేజగారి నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకు కష్టపడాలని చెప్పారు. సుధీర్‌వర్మ అద్భుతమైన దర్శకుడు. ఆయన నన్ను కొత్తగా చూపించారనే అనుకుంటున్నాను’’ అన్నారు సుశాంత్. ‘‘రావణాసుర’ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘రవితేజగారి ‘ఆంజనేయులు’ సినిమాకు దర్శకత్వ విభాగంలో వర్క్ చేశాను. దర్శకుడిగా ఆయనతో ఓ సినిమా చేయాలనుకున్నాను. ‘రావణాసుర’ వంటి మంచి స్టోరీకి డైరెక్టర్‌గా నన్ను సెలక్ట్ చేసుకున్న రవితేజగారికి ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ హండ్రెండ్ పర్సెంట్ థ్రిల్ అవుతారు’’ అన్నారు సుధీర్‌వర్మ. మేఘా ఆకాష్, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ. మ్యూజిక్ డైరెక్టర్స్ హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, రైటర్ శ్రీకాంత్ విస్సా తదితరులు పాల్గొన్నారు. -
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు...
‘వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే.. ముల్లోకాల ఏ మూల ఉన్నా నీ అందాల సంకీర్తనే’ అని పాడుతున్నారు రావణాసుర. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘రావణాసుర’. సుశాంత్ కీ రోల్ చేసిన ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లు. రవితేజ, అభిషేక్ నామా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఈ చిత్రంలోని ‘వెయ్యిన్నొక్క జిల్లాల..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. వెంకటేశ్ ‘సూర్య ఐపీఎస్’ చిత్రంలోని ‘వెయ్యిన్నొక్క జిల్లాలకు..’ పాటకు ఇది రీమిక్స్ వెర్షన్. అప్పట్లో ఈ పాటకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అనురాగ్ కులకర్ణి ఈ లేటెస్ట్ వెర్షన్‌ను పాడారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్. -
మాస్ హీరో రవితేజ ‘రావణాసుర’ టీజర్ స్టిల్స్ (ఫోటోలు)
-
నువ్వు లేకుండా ఎలా బతకాలి?: మేఘా ఆకాశ్ ఎమోషనల్
హీరోయిన్ మేఘా ఆకాశ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ బుధవారం (మార్చి 1) కన్నుమూసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఎమోషనలైంది మేఘా. 'ప్రియమైన అమ్మమ్మ.. నువ్వు లేకుండా ఎలా బతకాలి? అలాంటి ఒక రోజు వస్తుందని నేనెన్నడూ ఊహించలేదు. కానీ నేను నీలాంటిదాన్నే కాబట్టి ఎలాగోలా బతికేస్తాను. నువ్వు ఎంతో సరదాగా, దయామయురాలిగా ఉండేదానివి. అందరికీ కడుపు నింపి వారి ముఖంలో చిరునవ్వు చూసి సంతోషించేదానివి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి. నీతోనే గాసిప్స్ మాట్లాడేదాన్ని. ఇకమీదట నీతో మాట్లాడలేను, నీ మాటలు వినబడవు అని ఆలోచిస్తేనే నా హృదయం ముక్కలవుతోంది. కానీ ఇప్పుడు నువ్వు కోరుకున్న నీ వ్యక్తి దగ్గరకు వెళ్లిపోయావు. మనం కలిసున్న ఆదివారాలు నేనెప్పటికీ మర్చిపోలేను. ఇకపై ఆదివారాలు ఒకేలా ఉండవు. మా అందరిలో నిన్ను చూసుకుంటాం. మాలోనే నువ్వు జీవించి ఉంటావు. నువ్వే నా ఫస్ట్ లవ్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి..' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
నటుడు సంతానంతో మేఘా ఆకాష్ రొమాన్స్!
తమిళసినిమా: సంతానంతో రొమాన్స్ చేయడానికి నటి మేఘా ఆకాష్ సిద్ధమయ్యారు. సంతానం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వడకుపట్టి రామసామి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఇంతకుముందు సంతానం హీరోగా డిక్కీలూన అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అదే సంస్థపై ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం వడకుపట్టి రామసామి. కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. నటుడు జాన్ విజయ్ ఎంఎస్ భాస్కర్, రవి మరియ, మొటై రాజేంద్రన్, నిళల్గల్ రవి, శేషు, ప్రశాంత్, జాక్విలిన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాన్ రోల్డెన్ సంగీతాన్ని, దీపక్ చాయాగ్రహణంను అందిస్తున్నారు. తాజాగా కథానాయకిగా మేఘా ఆకాష్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా మేఘా ఆకాష్‌ను కోలీవుడ్‌లో చూసి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న యాదూమ్ ఊరే యావరుమ్ కేళీర్, మానై పిడిక్కాద మనిదన్, సింగిల్ శంకరుమ్ స్మార్ట్ పోన్ సిమ్రానుమ్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా వడకు పట్టి రామసామి చిత్రంలో ఈమె డాక్టర్‌గా నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోందని చెప్పారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
ప్రేమదేశం సినిమా రివ్యూ, ఎలా ఉందంటే?
టైటిల్: ప్రేమదేశం నటీనటులు: మధుబాల, త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర, తనికెళ్ల బరణి, వైష్ణవి చైతన్య మరియు ఇతరులు దర్శకుడు: శ్రీకాంత్ సిద్ధమ్ సంగీతం: మణిశర్మ ప్రొడక్షన్ హౌస్: సిరి క్రియేటివ్ వర్క్స్ నిర్మాత: శిరీష సిద్ధమ్ విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023 సంక్రాంతికి మాస్ మసాలా సినిమాలు థియేటర్లో ఎంత గోల చేశాయో చూశాం. ఆ సందడి తర్వాత మనముందుకు వచ్చిన స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం "ప్రేమదేశం". త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాలతార మధుబాల ప్రత్యేక పాత్రలో మెరిసింది. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శిరీష సిద్ధమ్ నిర్మించారు. రఘు కళ్యాణ్ రెడ్డి, రాములు అసోసియేట్ ప్రొడ్యూసర్స్‌గా,కమల్, కిరణ్, రూపా, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. తాజాగా రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో చూద్దాం.. కథ ఒకే కాలేజీలో చదువుకుంటున్న అర్జున్ (త్రిగున్), ఆద్య (మేఘా ఆకాష్)లకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా ఎప్పుడూ వారి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసుకోరు. చివరికి వారిద్దరూ లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఒక ప్లేస్ దగ్గర కలుసుకొని లవ్ ప్రపోజ్ చేసుకుందామని నిర్ణయించుకుంటారు. ఆ ప్లేస్ పేరే " ప్రేమ దేశం". ప్రేమికుల దినోత్సవం రోజు లవ్ ప్రపోజ్ చేసుకోవడానికి వస్తున్న వీరికి అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. మరోవైపు రిషి (అజయ్ కతుర్వాల్) అనే అబ్బాయి మూడు సంవత్సరాల నుంచి మాయ అనే అమ్మాయి వెంట తిరుగుతుంటాడు, ఎట్టకేలకు ఆమె రిషి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరికీ పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఇంకోవైపు పెళ్లి కోసం తంటాలు పడుతుంటాడు శివ. శివకు అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయికి శివ నచ్చడు. ఆ అమ్మాయికి శివ నచ్చితే అతడికి ఆ అమ్మాయి నచ్చదు. ఈ క్రమంలో అనూహ్యంగా మాయతో శివ పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఎంతో ఇష్టంగా ప్రేమించిన రిషి (అజయ్)తో తాళి కట్టించుకోవాల్సిన మాయ శివను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్దపడింది? అర్జున్, ఆద్యల యాక్సిడెంట్‌కు శివ, రిషి , మాయల మధ్య ఉన్న లింకేంటి? ఈ రెండు కథలు ఒకే దగ్గర కలవడానికి కారణమేంటి ? చివరకు అర్జున్, ఆద్యలు ఒకటయ్యారా లేదా? అనేదే మిగతా కథ. నటీనటుల పనితీరు త్రిగున్, మేఘా ఆకాష్ పరిణతితో నటించారు. త్రిగున్‌కు తల్లిగా నటించిన మధుబాల తన పాత్రలో అదరగొట్టింది. కాలేజీ ఎపిసోడ్స్‌లో కూడా మధుబాల అల్లరితో పాటు అద్భుతంగా నటించింది. అజయ్,శివ, మాయల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ బాగుంటాయి. మాయ తండ్రిగా తనికెళ్ల భరణి, రిషిగా అజయ్ తమ నటనతో మెప్పించారు. బేబీ సినిమాలో చేసిన వైష్ణవి చైతన్య మాయ చెల్లి క్యారెక్టర్‌తో కనువిందు చేసింది. సాంకేతిక నిపుణుల పనితీరు ఫస్ట్ హాఫ్‌లో యూత్‌ను కాలేజీ డేస్‌లోకి తీసుకెళ్ళిన దర్శకుడు సెకండ్ హాఫ్‌లో లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, వన్ సైడ్ లవ్‌లోని డిఫరెంట్ యాంగిల్స్ చూపించాడు. కానీ కొన్ని చోట్ల సీన్స్ నీరసంగా సాగదీసినట్లుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ సజాద్ కక్కు ఇచ్చిన విజువల్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కిరణ్ తుంపెర ఇంకాస్త ఎడిటింగ్ చేయాల్సింది. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ, రియల్ సతీష్, డ్రాగన్ ప్రకాష్ ల ఫైట్స్ పర్వాలేదనిపించాయి. హీరో అర్జున్, వాళ్ల అమ్మ మధుభాల మధ్య రాసుకున్న సన్నివేశాలు చూస్తున్నప్పుడు "అమ్మా నాన్న తమిళ అమ్మాయి" సినిమా గుర్తుచేసేలా ఉంటుంది. అక్కడక్కడా ఇది మనకు తెలిసిన కథే అనిపించేలా ఉంటుంది. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది. చదవండి: ఓ మగాడు కాటేసిన మహిళ.. గానమే ప్రాణంగా శంకర శాస్త్రి -
తారలా తళుకులీనుతున్న మేఘా ఆకాశ్.. ఈ ట్రెండీ లుక్ వెనుక..
మేఘా ఆకాశ్... ‘లై’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నటికి సోషల్ మీడియాలోనూ తెగ క్రేజ్ ఉంది. సందర్భానికి తగ్గట్టు ట్రెండీ, ట్రెడిషనల్ దుస్తుల్లో మెరుస్తూ ఫ్యాషన్ వరల్డ్‌లో తనకంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది. ఆ స్టయిల్‌కి సిగ్నేచర్ అయిన బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. మ్యాడర్ మచ్ మ్యాడర్ మచ్ స్థాపకురాలు.. అనితా చంద్రమోహన్. ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లోని చేనేత కలెక్షన్స్‌లో ‘మ్యాడర్ మచ్’ డిజైన్స్ ఉండాలన్నది ఆమె లక్ష్యం. సహజ రంగులను ఉపయోగించి, స్థానిక అద్దకం, చేనేత కళాకారులతోనే ఇక్కడి ప్రతి డిజైన్ రూపుదిద్దుకుంటుంది. గులాబీ, ఎరుపు రంగు అద్దకం కోసం ఎక్కువగా ఉపయోగించే మంజిష్ఠ (చెక్క) ఈ బ్రాండ్ ప్రధాన వస్తువు. దీనిని ఇంగ్లిష్‌లో ‘ఇండియన్ మ్యాడర్ అని పిలుస్తారు. అందుకే, ఈ బ్రాండ్‌కు ‘మ్యాడర్ మచ్’ అని పేరు పెట్టారు. ఇక వీటి డిజైన్, నాణ్యత ఫస్ట్‌క్లాస్. ధరలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. PC: Instagram వి విబితా ఎడ్వర్డ్, విజేతా ఎడ్వర్డ్.. ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. బటన్ మేకర్స్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే వారికి బటన్ మేకింగ్‌లోని సూక్ష్మ విషయాలు సహా అన్నీ తెలుసు. చెల్లెలు విబితా.. తయారీ లోపంతో తిరస్కరించిన బటన్స్‌తో ఫ్యాషన్ ఉపకరణాలను చేసేది. ఆమె ఆలోచనకు అక్క విజేతా తోడైంది. వెంటనే, 2018లో ‘వి’ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించారు. 85 శాతం రీసైక్లింగ్‌కు వచ్చిన బటన్స్నే వాడతారు. పర్యావరణానికి హాని కలిగించే సింథటిక్, పాలియస్టర్ బటన్స్‌ను ఉపయోగించరు. ఇక వీటి ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నింటిలోనూ ఈ జ్యూయెలరినీ కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: మ్యాడర్ మచ్ ధర: రూ. 35,580 జ్యూయెలరీ బ్రాండ్: వి ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ప్రయాణాలు చేయటం చాలా ఇష్టం. అందుకే, నా దుస్తుల్లో ఎక్కువగా క్యాజువల్ వేర్స్ ఉంటాయి. నా స్టయిల్ ఎప్పుడూ సింపుల్‌గానే ఉంటుంది. – మేఘా ఆకాశ్. ∙దీపిక కొండి -
నిర్మాణ రంగంలో రాణిస్తున్న లేడీ ప్రొడ్యూసర్స్, ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చింది వీరే
అమ్మాయిలంటే సిల్వర్ స్క్రీన్‌పై మెరవడానికే.. స్క్రీన్ వెనక టెక్నీషియన్స్గానో, సినిమాలకు పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్‌గా సూట్ అవ్వరనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అందుకే ఈ రెండు విభాగాల్లో తక్కువమంది ఉంటారు. అయితే రోజులు మారుతున్నాయి. మహిళా సాంకేతిక నిపుణులు పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది నిర్మాణ రంగంలో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య పెరిగింది. అరడజను మందికి పైగా ఈ ఏడాది నిర్మాతలుగా పరిచయం కావడం ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పువచ్చు. ఇక ఈ ఏడాది ఫిలిం మేకింగ్ (నిర్మాణం)లోకి వచ్చిన మేడమ్స్ గురించి తెలుసుకుందాం. దివంగత ప్రముఖ నటులు, నిర్మాత కృష్ణంరాజు పెద్ద కుమార్తె సాయి ప్రసీద ‘రాధేశ్యామ్’ సినిమాతో ఈ ఏడాది నిర్మాతగా పరిచయం అయ్యారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్ (యూవీ క్రియేషన్స్)లతో కలిసి ప్రసీద (గోపీకృష్ణా మూవీస్) ఈ సినిమా నిర్మించారు. నిర్మాణరంగంలోకి అడుగు పెట్టక ముందు విదేశాల్లో ప్రసీద ప్రొడక్షన్ కోర్స్‌లో చేశారు. మరోవైపు దివంగత ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దివ్య దీప్తి నిర్మించిన తొలి చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, సంజన జంటగా నటించారు. తండ్రి దర్శకత్వం వహించిన చిత్రాల షూటింగ్‌లకు దివ్య వెళ్లేవారు. అలా ఫిలిం మేకింగ్‌పై అవగాహన పెంచుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా మారారు. సమంత టైటిల్ రోల్ చేసిన ‘శాకుంతలం’ సినిమాకు నీలిమ ఓ నిర్మాత. ఈ ఏడాది నవంబరులో విడుదల కావాల్సిన ఈ పీరియాడికల్ ఫిల్మ్ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇక నిర్మాణరంగంలో ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ది ప్రత్యేక స్థానం. ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన చిత్రాలకు (సిరి సిరి మువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం..) పదికిపైగా జాతీయ అవార్డులు వచ్చాయి. ఏడిద నాగేశ్వరరావు వారసురాలిగా ఆయన మనవరాలు ఏడిద శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రం ద్వారా నిర్మాతగా తొలి అడుగు వేశారు. శ్రీజ ఎంటర్టైన్మెంట్స్పై రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జంటగా నటించారు. కాగా ప్రస్తుతం తెలుగులో ఉన్న అగ్ర నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. ఆయన కుమార్తె హన్షిత రెడ్డి నిర్మాణరంగంపై దృష్టి సారిస్తున్నారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘దిల్’ రాజు డిజిటల్ కంటెంట్‌ను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్లో ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ కూడా ఆరంభమైంది. ఈ సిరీస్‌కు దర్శకుడు హరీష్ శంకర్ కథ ఇచ్చారు. బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకుంటున్న ఈ సిరీస్‌కి హన్షిత రెడ్డి ఓ నిర్మాతగా ఉన్నారు. యాక్షన్ టు ప్రొడక్షన్ హీరోయిన్లు కూడా నిర్మాతలుగా మారు తుంటారు. హీరోయిన్ మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ నిర్మాతగా మారారు. రాహుల్ విజయ్, మేఘా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మాటే మంత్రము’ చిత్రానికి బిందు ఆకాష్ ఓ నిర్మాతగా ఉన్నారు. పేరు తల్లిది అయినప్పటికీ కూతురు మేఘా ఆకాష్ సపోర్ట్‌తోనే బిందు నిర్మాత అయ్యుంటారని ఊహించవచ్చు. ఇక మలయాళ బ్యూటీ ఐశ్వర్యా లక్ష్మి ‘గార్గి’ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అయ్యారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే టాప్ హీరోయిన్ కీర్తీ సురేష్ త్వరలో ఓ ప్రొడక్షన్ హౌస్ ఆరంభించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందీలోనూ.. బాలీవుడ్‌లోనూ ఈ ఏడాది లేడీ నిర్మాతల జాబితాలో కొందరు హీరోయిన్ల పేర్లు చేరాయి. హన్సల్ మెహతా తెరకెక్కించనున్న ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్‌లో నటించి, నిర్మించనున్నారు కరీనా కపూర్. ఏక్తా కపూర్‌తో కలిసి ఆమె ఈ సినిమా నిర్మించనున్నారు. ఇక షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఆలియా భట్ ‘డార్లింగ్స్’ అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ఆలియా నటించారు కూడా. హీరోయిన్ కృతీ కుల్హారి కూడా ‘నాయిక’ అనే సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇలా నిర్మాణ రంగంలోనూ స్త్రీ శక్తి ప్రవేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. -
మిస్ రెబల్
మేఘా ఆకాష్, రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాటే మంత్రము’. అభిమన్యు బద్ది ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిందు ఆకాష్ (మేఘా ఆకాష్ తల్లి) సమర్పణలో ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సుశాంత్ రెడ్డి కథ అందించారు. అక్టోబరు 26 మేఘా బర్త్ డే సందర్భంగా ‘మాటే మంత్రము’లోని ఆమె క్యారెక్టర్ నేమ్, లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో కావ్య అనే రెబల్ అమ్మాయిగా నటించారు మేఘా ఆకాష్. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: మనోజ్ రెడ్డి. చిత్రయూనిట్ పేర్కొంది. -
రాహుల్ విజయ్, మేఘా ఆకాష్‌ల మూవీ టైటిల్ ఖారారు
రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా అభిమన్యు బద్ది దర్శకత్వం వహిస్తున్న సినిమాకి ‘మాటే మంత్రము’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. కాగా రాహుల్ విజయ్ బర్త్ డే (జూన్ 7) సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ– ‘‘గోవా నేపథ్యంలో జరిగే రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమిది. సుశాంత్ రెడ్డి అందించిన కథ ఆసక్తిగా ఉంటుంది. మా సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: మనోజ్ రెడ్డి. -
‘మాటే మంత్రము’ అంటున్న మేఘ ఆకాష్
రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ హీరోహీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. రాహుల్ విజయ్ బర్త్‌డే సందర్భంగా మంగళవారం ఈ చిత్రం టైటిల్‌ని అనౌన్స్ చేశారు మేకర్స్. 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘మాటే మంత్రము’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ...మా హీరో పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేస్తున్నాం. ఈ చిత్రానికి "మాటే మంత్రము" అనే పేరును ఖరారు చేశాం. ఇది మా సినిమాకు యాప్ట్ టైటిల్. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ గోవాలో చిత్రీకరించాం. ప్రస్తుతం 90 శాతం షూటింగ్ పూర్తయింది. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్నారు. -
‘ప్రేమదేశం’ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన
1996లో వచ్చిన ‘ప్రేమదేశం’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు.. అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాదాపు దశాబ్దం పాటు ఎక్కడ చూసిన అవే పాటలు వినిపించాయి. చాలాకాలం తర్వాత ఇప్పుడు అదే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతుంది.మేఘా ఆకాశ్, త్రిగున్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన మ్యూజికల్ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో ఈ సినిమా గ్లిమ్స్ ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసిందిశ్రీకాంత్ సిద్దం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శిరీష సిద్ధం నిర్మిస్తున్నారు. అలనాటి అందాల తార మధుబాల ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో లో చిత్రీకరించబడుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
మిర్చి శివ హీరోగా మూవీ.. ఆసక్తిగా లుంగీ కట్టిన హల్క్ పోస్టర్
చెన్నై సినిమా: మిర్చి శివ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం 'సింగిల్ శంకరుమ్.. స్మార్ట్ ఫోన్ సిమ్రానుమ్'. నటి మేఘా ఆకాష్, అంజు కురియన్ కథానాయికలుగా, గాయకు డు మనో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. పి.ఎస్.విఘ్నేష్ షా దర్శకుడిగా పరిచయమవు తున్న ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ పతాకంపై కె.కుమార్ నిర్మిస్తున్నారు. ఆర్థర్ ఎ.విల్సన్ చాయాగ్రహణం, లియోస్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈచిత్రం చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువా రం విడుదల చేసినట్లు దర్శకుడు చెప్పారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో శివ మోకాళ్లపై వంగి ఉండటం, అతన్ని పట్టుకుని హాలీవుడ్ సూపర్ హీరోస్ హల్క్, ఐరన్ మ్యాన్లు ఉండటం మనం చూడొచ్చు. ఇందులో హల్క్ లుంగీ ధరించి ఉండటమే కాకుండా చెంపై పుట్టుమచ్చ, నుదిటిపై విబూదితో చాలా ఆసక్తిగా ఉంది. ఇక ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ వండర్ వుమెన్ వంటి కేప్ ధరించి, అతని వెనుక కత్తి ఉండటాన్ని మనం గమనించవచ్చు. చదవండి: సల్మాన్‌కు నటి ముద్దులు, హగ్గులు.. మందు కొట్టావా? అంటూ ట్రోలింగ్ Feeling extremely happy to release the first look of #singleshankarumsmartphonesimranum 😍 @actorshiva @akash_megha @AnjuKurian10 @vignesh_sha @larkstudios_chn @makapa_anand @kumarkarupannan @leon_james @ArthurWisonA @Gdurairaj10 @editorBoopathi @dineshashok_13 @proyuvraaj pic.twitter.com/CgaOmgMBrX — vignesh sha (@vignesh_sha) May 4, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాహుల్‌తో జోడీ కడుతున్న మేఘా ఆకాశ్
రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయవుతున్నారు. మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో కోట ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. అభిమన్యు మాట్లాడుతూ– ‘‘గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమిది. ప్రేక్షకులు కొత్త అనుభూతి పొందేలా తెరకెక్కించబోతున్నాం’’ అన్నారు. ‘‘డియర్ మేఘ’ చిత్రానికి సుశాంత్, అభిమన్యుతో కలిసి పని చేశాను. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మేఘా ఆకాష్. ‘‘కూల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు రాహుల్ విజయ్. ‘‘హైదరాబాద్‌లో 15 రోజులు, గోవాలో 10 రోజులు షూటింగ్ చేస్తాం. 25 రోజుల్లోనే షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట. ‘వెన్నెల’ కిషోర్, అర్జున్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర. చదవండి: అజయ్ జడేజా బ్రేకప్ స్టోరీ: మ్యాచ్ ఫిక్సింగ్.. మాధురీ దీక్షిత్‌ని దూరం చేసిందా! -
రావణాసుర షురూ
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ షురూ అయింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం భోగి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు చిరంజీవి క్లాప్ ఇచ్చారు. దర్శకులు కేయస్ రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. ఈ సందర్భంగా ‘రావణాసుర’ పోస్టర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్లో పేర్కొంది చిత్రబృందం. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా ‘రావణాసుర’ రూపొందనుంది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని అభిషేక్ నామా అన్నారు. సుశాంత్ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్, కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సీఈఓ: పోతిని వాసు. -
'మను చరిత్ర' టీజర్ రిలీజ్
‘‘ఇంటెన్స్ లవ్‌స్టోరీతో వచ్చిన చిత్రాలు కచ్చితంగా హిట్ అవుతాయి. ‘మను చరిత్ర’ కూడా అలాంటిదే కాబట్టి తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది. ఈ చిత్రాన్ని దేనితోనూ పోల్చను. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా భరత్ కథ రాసుకున్నాడు’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘మను చరిత్ర’. భరత్ పెదగాని దర్శకత్వంలో నార్ల శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. భరత్ పెదగాని మాట్లాడుతూ– ‘‘సిరాశ్రీ వల్లే ఈ చిత్రం ప్రారంభమైంది. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. చంద్రబోస్‌గారు మా సినిమాకు రెండు పాటలు రాయడమే కాకుండా నటించారు’’ అన్నారు. ‘‘మంచి కథతో తీసిన మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని సినిమాలు తీస్తాం’’ అన్నారు నార్ల శ్రీనివాసరెడ్డి. శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ప్రతి నటుడు తన కెరీర్లో ఓ మంచి సినిమా చేయాలనుకుంటాడు. ఆకోరిక నాకీ చిత్రంతోనే నెరవేరింది’’ అన్నారు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ మాట్లాడారు. -
‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
-
‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
టైటిల్ : రాజ రాజ చోర నటీనటులు : శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్ తదితరులు నిర్మాణ సంస్థ : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు : అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ దర్శకత్వం : హసిత్ గోలి సంగీతం : వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ : వేద రమణ్ శంకరన్ ఎడిటింగ్: విప్లవ్ విడుదల తేది : ఆగస్ట్ 19,2021 చిత్ర పరిశ్రమలో ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. విలక్షణ నటనతో, వైవిద్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. యావరేజ్ నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ యంగ్ హీరో సెక్సెస్కి ‘గాలి సంపత్’ బ్రేక్ వేశాడు. దీంతో కాస్త వెనకడుగు వేసిన శ్రీవిష్ణు.. ఈ సారి ఎలాగైనా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలనే కసితో ‘రాజ రారజ చోర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు మూవీ ప్రమోషన్స్ కూగా గ్రాండ్‌గా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘రాజ రాజ చోర’ఏ మేరకు అందుకుంది? ఈ సినిమాతో శ్రీవిష్ణు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడా లేదా? రివ్యూలో చూద్దాం. రాజ రాజ చోర కథేంటంటే భాస్కర్ (శ్రీవిష్ణు) ఓ చిన్న దొంగ. ఓ జిరాక్స్ షాపులో పని చేస్తూ అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. పైకి మాత్రం తాను ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. అలా చెప్పుకొనే సంజన అలియాస్ సంజు(మేఘ ఆకాశ్)తో ప్రేమాయణం సాగిస్తాడు. అయితే భాస్కర్‌కు అప్పటికే విద్య( సునైన)తో పెళ్లి జరిగుతుంది. వాళ్లిద్దరికి ఒక బాబు కూడా ఉంటాడు. అయినప్పటికీ భాస్కర్ సంజనతో ఎందుకు ప్రేమాయణం సాగించాడు? తాను ప్రేమించిన వ్యక్తి సాఫ్టవేర్ ఇంజనీర్ కాదనీ, అతనికి పెళ్లై, బాబు కూడా ఉన్నాడని తెలిసిన తర్వాత సంజన పరిస్థితి ఏంటి? దొంగగా పట్టుబడి పోలీసులకి చిక్కిన భాస్కర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే? ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. దొంగగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా రెండు కోణాల్లో అద్భుత నటనను కనబరిచాడు. తనదైన మేనరిజమ్స్‌తో నవ్విస్తూనే.. ఎమోషనల్ సీన్స్‌ని కూడా అద్భుతంగా పండించాడు. సినిమా మొత్తం తన భూజాల మీద వేసుకొని కథని నడిపించాడు. హీరో భార్య విద్య పాత్రలో సునైనా ఒదిగిపోయింది. మధ్యతరగతికి చెందిన వివాహితగా ఆకట్టుకుంది. ఇక సంజూగా మేఘా ఆకాశ్ పర్వాలేదనిపించింది. పోలీస్ అధికారి విలియమ్ రెడ్డి పాత్రలో రవిబాబు ఒదిగిపోయిన తీరు బాగుంది. స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. అవినీతి పోలీసు అధికారిగా అదరగొట్టేశాడు. అంజమ్మ పాత్రలో గంగవ్వ మెప్పించింది. తనదైన పంచులతో నవ్వులు పూయిచింది. శ్రీకాంత్ అయ్యంగర్, అజయ్ ఘోష్, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే? అవసరాల కోసం దొంగగా మారిన ఓ వ్యక్తి.. తన తప్పును తెలుసుకొని మంచి వాడిగా ఎలా మారాడనేదే ఈ సినిమా కథ. మనసు మాట వినకుండా.. డబ్బు కోసం ఆశ పడి చేసే ఏ పనైనా తప్పే అనే సందేశాన్ని కామెడీ యాంగిల్లో చూపించాడు దర్శకుడు హసిత్ గోలి. దానికి కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చి కథను నడిపించాడు. సాధారణంగా దర్శకులు సేఫ్‌గా ఉండేందుకు తమ తొలి సినిమాని ప్రేమ కథతో ప్రారంభిస్తారు. కానీ డైరెక్టర్ హిసిత్ మాత్రం తన డెబ్యూ మూవీనే ఇలాంటి కొత్త తరహా కథను చెప్పాలనుకొనే ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. అనుకున్నది తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. భాస్కర్, విద్యల సంబంధించిన సన్నివేశాలు మొదలయ్యాక కథలో వేగం పెరుతుంది. అయితే కథను సాగదీస్తూ అసలు విషయాన్ని ఇంటర్వెల్ వరకు లాగడం ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇంటర్వెల్ ముందు పోలీసులకు శ్రీవిష్ణు పట్టుబడినప్పుడు వచ్చే సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. అంతేకాదు సెండాఫ్‌పై అంచనాలను పెంచుతుంది. కానీ అక్కడ కూడా కథను నెమ్మదిగా సాగడం కాస్త మైనస్. కథను ఎమోషనల్‌గా డీల్ చేయడానికి స్కోప్ ఉన్నప్పటీ.. డ్రామాపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు దర్శకుడు. సెకండాఫ్‌లో భాస్కర్ దొంగతనం చేసే సీన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే, తనికెళ్ల భరణి చెప్పే ప్రవచనాలతో ముడిపెడుతూ కథని నడిపించిన విధానం బాగుంటుంది. ఇక ఈసినిమాకు ప్రధాన బలం వివేక్ సాగర్ సంగీతం. పాటలు అంతంతమాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతంతో అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సెకండాఫ్‌లో వచ్చే సిధ్ శ్రీరామ్ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించేవిధంగా ఉంటుంది. వేద రమణ్ శంకరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ విప్లవ్ తన కత్తెరకు ఇంకా చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘నారప్ప’ ఓటీటీలోకి రావడంతో రెండ్రోజులు భోజనం చేయలేదు
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘నేను వెంకటేశ్‌గారి వీరాభిమానిని. ‘నారప్ప’ చిత్రం ఓటీటీలోకి రావడంతో బాధ వేసి రెండు రోజులు భోజనం చేయలేదు. పెద్ద సినిమాలు థియేటర్లలోకి రావాలంటే మాలాంటి చిన్న సినిమాలను బాగా ఆదరించాలి.. అప్పుడే మన సూపర్‌స్టార్ సినిమాలను స్క్రీన్‌పై చూసుకుంటాం. అందరి హీరోల అభిమానులు మా సినిమాని ఆదరిస్తే అనిల్‌గారు చెప్పినట్లు ప్యాన్ ఇండియా చిత్రం అవుతుంది. రాజ రాజ చోర సినిమా చూసే మహిళలకు నేను చాలా రోజులు గుర్తిండిపోతాను. నన్ను చాలా అభిమానిస్తారు. ‘రాజరాజ చోర’ సినిమా ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. ఇది మన తెలుగు సినిమా. విడుదల తర్వాత ప్రతి భాషలోనూ ఈ చిత్రాన్ని కచ్చితంగా రీమేక్ చేస్తారు’ అని అన్నాడు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. శ్రీ విష్ణు కథల ఎంపిక బాగుంటుందని, ఈ చిత్రం తన కెరీర్లో ఓ బెస్ట్ మూవీ కావాలని కోరుకుంటున్నానన్నాడు. ‘రాజ రాజ చోర’ సినిమా చూశా.. కచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’ అని హీరో నారా రోహిత్ చెప్పుకొచ్చాడు. అలాగే డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. ‘నేను కూడా శ్రీవిష్ణుకు పెద్ద అభిమానిని. ఈ సినిమాలో కొంటె శ్రీవిష్ణును చూస్తారు’అని అన్నాడు. కాగా కార్యక్రమంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ, నటుడు తనికెళ్ల భరణి, హీరోయిన్స్ మేఘా ఆకాష్, సునైన పాల్గొన్నారు. -
ఇప్పుడు ప్రయోగాలకు రెడీ!
‘‘లై, ఛల్ మోహన రంగ’ చిత్రాల తర్వాత తెలుగులో నాకు సరైన కథలు రాలేదు.. అందుకే ఏదీ ఒప్పుకోకపోవడంతో ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో తమిళంలో మంచి స్క్రిప్ట్స్ రావడంతో అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను. ప్రస్తుతం తెలుగులోనూ మంచి కథా బలం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నాను’’ అని హీరోయిన్ మేఘా ఆకాశ్ అన్నారు. శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. హితేశ్ గోలి దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేఘా ఆకాశ్ మాట్లాడుతూ.. ‘‘నేనెప్పుడూ భాష ఆధారంగా స్క్రిప్ట్స్ ఒప్పుకోను. మంచి కథ ఏ భాషలో ఉన్నా నటిస్తా. ‘రాజరాజ చోర’ కథ వైవిధ్యంగా ఉంది. నా నిజ జీవితానికి భిన్నమైన పాత్రను ఇందులో చేశాను. ఇప్పుడు ఓ స్థాయికి వచ్చాను కాబట్టి ప్రయోగాత్మక పాత్రలు చేయాలనుకుంటున్నాను. మా అమ్మ, నాన్న నా సినిమాల ఎంపికలో జోక్యం చేసుకోరు. అమ్మ కథ వింటుంది కానీ చేయాలా? వద్దా? అనే నిర్ణయం నాదే. ప్రస్తుతం ‘డియర్ మేఘ, మనుచరిత్ర, గుర్తుందా శీతాకాలం (అతిథి పాత్ర)’ చేస్తున్నాను. మరో సినిమా ప్రకటన త్వరలో వస్తుంది’’ అన్నారు. -
ఆగస్ట్ 19న వస్తున్న ‘రాజ రాజ చోర’
యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లు. హితేశ్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగగా హిలేరియస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఎంటర్టైనింగ్ టీజర్, పాటలు సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకోవాలని, మంచి సినిమాలను చూడాలనుకుంటున్నారు. `రాజ రాజ చోర` ఈ అపరిమితమైన వినోదాన్ని అందించడం ఖాయం అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
Dear Megha: నాకు లవ్‌లో పీహెచ్డీ ఉంది
‘హాయ్ నేను మేఘా స్వరూప్. నాకు లవ్‌లో పీహెచ్డీ ఉంది. నిన్ను చూసినన్నిసార్లు బుక్స్ చూసి ఉంటే క్లాస్ టాపర్ అయ్యుండేదాన్ని’ అంటూ మేఘా ఆకాశ్ చెప్పే డైలాగులతో విడుదలైంది ‘డియర్ మేఘ’ సినిమా టీజర్. అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు హీరోలుగా, మేఘా ఆకాశ్ హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ని మేఘా రిలీజ్ చేశారు. అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ– ‘‘సుశాంత్, నేను చాలా కథలు విన్నాం.. వాటిలో ‘డియర్ మేఘ’ కథ నచ్చి, నిర్మించాం. సుశాంత్ రెడ్డి, మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్ ఆగస్టులో థియేటర్లలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మా సినిమా వంద శాతం ప్రేక్షకుల మనసులను తాకుతుంది’’ అన్నారు సుశాంత్ రెడ్డి. ‘‘నాకు తెలుగు సినిమాలు చేయడం ఇష్టం కానీ పలు కారణాలతో ఇక్కడ ఎక్కువగా చేయలేకపోతున్నాను’’ అన్నారు మేఘా ఆకాశ్. ‘‘నా కాలేజ్ డేస్‌లో తరుణ్, ఉదయ్ కిరణ్, సిద్ధార్థ్ మంచి ప్రేమకథా సినిమాలు చేసేవారు.. అలాంటి ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను ‘డియర్ మేఘ’లో చూపించబోతున్నాం’’ అన్నారు అదిత్ అరుణ్. సంగీత దర్శకుడు హరి గౌర మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఐ ఆండ్రూ. -
గంగవ్వ నోటి వెంట శ్రీవిష్ణు ‘చోర గాథ’
శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజ రాజ చోర’. సునయన, మేఘా ఆకాశ్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను ‘చోర గాథ బై గంగవ్వ’ పేరుతో చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ‘నీకు ఊ.. కొట్టే కథ తెలుసా? ఏది చెప్పినా ఊ.. కొట్టాలి’ అని అసలు కథ మొదలు పెడుతుంది గంగవ్వ. ‘అనగనగా ఓ సూర్యుడు ఉంటడు. ఆ సూర్యడేమో భూమికి ప్రాణం ఇచ్చాడు. భూమి నుంచి కోతి, బంగారం వచ్చాయి’ అంటూ సాగే ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గంగవ్వ చెప్పుకొచ్చిన ఈ కథ రాజు, దొంగ, కిరీటం చూట్టు తిరగనుందనేది అర్థమైంది. చివరకు ఈ మూడింటి మధ్య ఏం జరిగింది, రాజు కిరీటాన్ని ఎత్తుకెళ్లిన ఆ దొంగ దొరుకుతాడా? లేదా? అనే ప్రశ్నతో ముగించిన గంగవ్వ చోర గాథ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ జూన్ 18న విడుదల కానుంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో తనికెళ్ల భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. -
మేఘా ఆకాశ్.. ‘డియర్ మేఘ’
మేఘ ఏదో బాధలో ఉంది. ఈ బాధకు కారణం ఎవరు? మేఘ కళ్లు ఎందుకు చెమర్చాయి? అనేది ‘డియర్ మేఘ’ సినిమా చూస్తే తెలుస్తుంది. మేఘా ఆకాశ్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘డియర్ మేఘ’. అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. సుశాంత్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రానా, గౌతమ్ వాసుదేవమీనన్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విజయ్ సేతుపతి విడుదల చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. మోషన్ పోస్టర్లో మేఘ కన్నీరు పెట్టుకుంటూ, బాధలో ఉన్నట్లు కనబడుతుంది. ‘‘మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: ఐ ఆండ్రూ, ఎడిటర్: ప్రవీణ్ పూడి. -
తమన్నా రాకతో గ్రాఫ్ మారిపోయింది
సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడంలో విడుదలై విజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. నాగశేఖర్, భావనా రవి, ఎం.ఎస్. రెడ్డి, చినబాబు నిర్మిస్తున్నారు. నాగశేఖర్ దర్శకుడు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతున్న సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నేను హీరో అయినా, తమన్నాగారు రియల్ హీరో. ఆమె ఈ సినిమాలో చేస్తున్నారని ప్రకటించినప్పటి నుండి ‘గుర్తుందా శీతాకాలం’ గ్రాఫ్ మారిపోయింది. ఈ సినిమాలో చేస్తున్న మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్ టైమ్‌లో చాలా సినిమాలు చూశాను, ఎన్నో కథలు విన్నాను. ఈ సినిమా ఆఫర్ రాగానే ఎందుకో ఈ సినిమాలో నటించాలనుకున్నాను. రొమాంటిక్ డ్రామాలో నటించి చాలాకాలం అయింది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ హీరో’’ అన్నారు. దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ– ‘‘కన్నడంలో నేను స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగులో ఇది నాకు మొదటి సినిమానే. నటీనటులు, టెక్నీషియన్లు నూటికి నూరు శాతం ప్రతిభ ఉన్నవారు. ఎంతో తపనతో సినిమా చేస్తున్నారు’’ అన్నారు. ‘‘బహుశా ఈ సినిమాకు పనిచేయటం మొదలుపెట్టిన తొలి వ్యక్తి నేనే అనుకుంటున్నాను. నేను మాటలు అందించిన ‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఓ బేబి’ సినిమాల తరహాలో పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు మాటల రచయిత లక్ష్మీభూపాల్. సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీభూపాల్ గారు ఈ సినిమా కోసం వేసవిలో పని చేయటం ప్రారంభిస్తే, నేను వర్షాకాలంలో ప్రారంభించాను. ఈ సినిమా మంచి మ్యూజికల్ ఫీల్ గుడ్ మూవీగా మిగిలిపోతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చినబాబు, సంపత్ కుమార్, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొ న్నారు. -
శీతాకాలానికి అతిథి
‘‘బొంబాటుగుందిరా పోరి...’’ అని పాడుతూ మేఘా ఆకాశ్‌ని ’లై’ సినిమాలో ఆటపట్టించారు నితిన్. తెలుగులో మేఘా ఆకాశ్‌కి ఇది తొలి సినిమా. ఆ పాట చాలా ఫేమస్. ఈ సినిమా ద్వారా మేఘాకి బాగానే పేరొచ్చింది. ఆ తర్వాత ’చల్ మోహనరంగ’ సినిమాలో నటించారామె. రజనీకాంత్ ’పేటా’లో కూడా మంచి పాత్ర చేశారీ బ్యూటీ. ఇప్పుడు తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’లో అతిథి పాత్ర చేయడానికి అంగీకరించారు. సత్యదేవ్, తమన్నా జంటగా రొమాంటిక్ ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాగశేఖర్, భావనా రవి నిర్మిస్తున్నారు. నాగశేఖర్ దర్శకుడు. నేటినుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకోనుంది. హీరో సత్యదేవ్ పాత్రతో మేఘా పాత్ర ట్రావెల్ అవుతుందట. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ చింతల. -
‘గుర్తుందా శీతాకాలం’లో మేఘా ఆకాశ్
ఈ మధ్యకాలంలో సినిమా కంటెంట్‌కే బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. అది స్టార్ హీరో సినిమానా. . పెద్ద డైరెక్టర్ తీస్తున్నాడా.. భారీ బడ్జెట్‌తో తీస్తే బ్లాక్‌బస్టరే.. అనుకునే రోజులకు కాలం చెల్లిపోయింది. కంటెంట్ బాగుంటే ఇవేమీ ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. అలాంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మూవీ లవర్స్ టేస్ట్‌ని బట్టే నడుచుకుంటున్నారు మేకర్స్ కూడా. అలాగే కథలో దమ్ముంటే ఎవరితో నటించడానికైనా, ఏ బ్యానర్లో సినిమా తీస్తున్నా ఓకే అంటున్నారు నటీనటులు. అలాంటి కాంబినేషన్లు కూడా బాగానే వర్కవుట్ అవుతున్నాయి. తాజాగా సత్యదేవ్, తమన్నా కూడా ఓ సినిమాలో జోడీ కడుతున్నారు. ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో ఈ జంట ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ని సెప్టెంబర్‌లోనే విడుదల చేసింది మూవీ టీమ్. అది మూవీ లవర్స్‌ను బాగానే ఆకట్టుకుంది. ఇక పలు కన్నడ చిత్రాలతో శాండిల్‌వుడ్‌లో తనేంటో నిరూపించుకున్న నాగశేఖర్ ‘గుర్తుందా శీతాకాలం’తో టాలీవుడ్లోకి అడుగు పెడతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బయటికి వచ్చింది. ఒక కీలక పాత్ర కోసం తమిళ ముద్దుగుమ్మ మేఘా ఆకాశ్‌ను తీసుకుంటున్నారట. ఈ ఏడాది కన్నడలో రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన లవ్ మాక్‌టెయిల్‌కు రీమేక్ ఈ చిత్రం. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉండగా ఇప్పటికే ఇద్దరు ఫైనల్ అయ్యారు. అయితే కొద్దిరోజుల క్రితం బడ్జెట్ సమస్యలతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చినా అవన్నీ పుకార్లని తేలిపోయింది. షూటింగ్ త్వరగా ముగించుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. -
రాజరాజచోర ప్రారంభం
శ్రీ విష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజ రాజ చోర’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కరోనా బ్రేక్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం తిరిగి ప్రారంభం అయింది. మేఘా ఆకాశ్, సునయిన కథానాయికలు. యస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నివాళులు అర్పించి, చిత్రీకరణ ప్రారంభించారు. ‘ఒక వినూత్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్. ‘సినిమా పూర్తయ్యేవరకూ రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం’ అన్నారు సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. తనికెళ్ల భరణి, రవిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: వేదరామన్, సంగీతం: వివేక్ సాగర్. -
నిహా పోయి మేఘా వచ్చె!
తమిళంలో ఓ సినిమా చేస్తున్నట్టు వేసవిలో ప్రకటించారు నిహారిక. నూతన దర్శకురాలు స్వాతిని డైరెక్షన్లో అశోక్ సెల్వన్ హీరోగా నిహారిక హీరోయిన్గా ఈ సినిమా రూపొందాల్సింది. అయితే ఈ సినిమా నుంచి నిహారిక తప్పుకున్నారని తెలిసింది. ఆమె స్థానంలో ‘ఛల్ మోహన్ రంగ, లై’ సినిమాల్లో నటించిన మేఘా ఆకాశ్‌ను తీసుకున్నారట. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ మొదలవ్వాలి. అయితే కోవిడ్ వల్ల చిత్రీకరణలన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈలోగా పెళ్లి పనులతో డేట్స్ ఇష్యూ రావడంతో చిత్రబృందంతో మాట్లాడి సినిమానుంచి తప్పుకున్నారట నిహారిక. అక్టోబర్‌లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. -
నిహారిక స్థానంలో మేఘా ఆకాశ్
సాక్షి, హైదరాబాద్: అశోక్ సెల్వన్ హీరోగా త్వరలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో మెగా డాటర్ కొణిదెల నిహారిక స్థానంలో మేఘా ఆకాశ్ నటించనున్నారు. కెనన్యా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వాతిని తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట నిహారిక ఎంపికైంది. అయితే ఇటీవల నిహారిక నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలో ఆమె పెళ్లి పీటల ఎక్కనున్న నేపథ్యంలో డేట్స్ లేకపోవడంతో ఈ చిత్రం నుంచి నిహారిక వైదొలగినట్లు సమాచారం. ఆమె స్థానంలో మేఘా ఆకాశ్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం ఇటీవల వెల్లడించింది. (చదవండి: నిహారిక - చైతన్యల నిశ్చితార్థం) దీనిపై నిర్మాత సెల్వకుమార్ స్పందిస్తూ.. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర విభిన్నంగా ఉంటుందన్నారు. అందుకే తొలుత నిహారికను ఎంచుకున్నామన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ పాత్రకు హీరోయిన్ మేఘా ఆకాశ్ సరిగ్గా సరిపోతుందని దర్శకురాలు పేర్కొన్నారు. ఆ పాత్రకు మేఘా సరిపోతుందనిపించి వెంటనే ఆమెను సంప్రదించి కథను వివరించామన్నారు. తనకు కూడా కథ నచ్చడంతో ఒకే చెప్పిందన్నారు. త్వరలోనే సినిమా టైటిల్‌ను ఖరారు చేసి వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత పేర్కొన్నారు. (చదవండి: నిహారిక ఎంగేజ్మెంట్: వైరల్ వీడియో) -
స్ట్రయిట్ తెలుగు సినిమాలు నిర్మిస్తా
‘‘గౌతమ్ మీన¯Œl గారి సినిమాల్లో మొదట్లో రొమాన్స్ ఉంటే క్లైమాక్స్‌లో యాక్ష¯Œ ఉంటుంది. కానీ ‘తూటా’లో 70 శాతం యాక్ష¯Œ ఉంటుంది’’ అని తాతారెడ్డి అన్నారు. ధనుష్ హీరోగా గౌతమ్ మీన¯Œ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఎన్నై నోకి పాయమ్ తోట’. మేఘా ఆకాష్ కథానాయికగా నటించారు. ఈ చిత్రం ‘తూటా’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో విజయభేరి పతాకంపై జి.తాతారెడ్డి, జి.సత్యానారాయణ రెడ్డి జనవరి 1న ‘తూటా’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తాతారెడ్డి మాట్లాడుతూ –‘‘ఎమ్మెస్ బయో టెక్నాలజీ చదివి సైంటిస్ట్‌గా రెండేళ్లు పని చేశాను. సినిమాలపై నాకున్న ఆసక్తితో ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘లవర్స్ డే’ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. ‘తూటా’ సినిమాతో నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు హ్యాపీ. ‘తూటా’లో కథనం ప్రకారం కుటుంబకథకు అండర్ వరల్డ్ టచ్ ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ‘తూటా’లో మార్పులు చేశాం.. స్క్రీ¯Œ ప్లే స్పీడ్‌గా సాగుతుంది. ప్రేక్షకులకు ఇది స్ట్రయిట్ తెలుగు చిత్రంలానే అనిపిస్తుంది. స్ట్రయిట్ తెలుగు సినిమాలను నిర్మిస్తాను. ‘మీతో వర్క్ చేయడం కంఫర్ట్‌గా ఉంటుంది.. ఓ సినిమా చేస్తా’ అని గౌతమ్ మీన¯Œ గారు ఓ సందర్భంలో నాతో అన్నారు. మంచి కథ కుదిరితే కొత్త దర్శకులతోనూ సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు. -
తూటా వస్తోంది
ధనుష్, మేఘా ఆకాష్ జంటగా గౌతమ్ మీన¯Œ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తోట’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘తూటా’ పేరుతో గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో విజయభేరి బ్యానర్‌పై జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి ఈ నెల 27న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జి.తాతరెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ఈ సినిమా తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంగా ఉన్నాం. ఇప్పటికే విడుదలయిన పోస్టర్స్, సాంగ్స్‌కు, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు బాగున్నాయి. ధనుష్‌కి కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటం మాకు కలిసొస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దర్బుక శివ. -
కొత్త కథాంశం
ఇటీవల విడుదలైన వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో అభిలాష్ పాత్రలో మంచి నటనను కనబరిచి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ యువ నటుడు అధర్వ మురళి. తమిళంలో అధర్వ హీరోగా నటించిన చిత్రం ‘బూమరాంగ్’. ఆర్. కణ్ణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ఇందూజ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘కమర్షియల్ హంగులతో పాటు ప్రేక్షకులు కోరుకునే కొత్త కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. అధర్వ అద్భుతంగా నటించారు. రధన్ మంచి ఆల్బమ్ ఇచ్చారు. త్వరలో పాటలను, అక్టోబరులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు సీహెచ్ సతీష్‌కుమార్. సతీష్, ఆర్జె బాలాజీ, ఉపేన్ పటేల్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు ప్రసన్న ఎస్.కుమార్ కెమెరామన్. -
తప్పుకోలేదు... తప్పించారు
‘‘నిర్మాణ సంస్థలకు నా నుంచి సరైన మద్దతు లభించదనే నెపంతో నన్ను ఓ సినిమా నుంచి హీరోయిన్గా తొలగించారు’’ అని వాపోయారు అమలా పాల్. విజయ్ సేతుపతి హీరోగా విజయ్ కృష్ణన్ దర్శకత్వంలో చంద్ర ఆర్ట్స్ పతాకంపై తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా అమలా పాల్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె స్థానంలో హీరోయిన్గా మేఘా ఆకాష్‌ను తీసుకున్నారు. అమలా పాల్ భారీ పారితోషికం డిమాండ్ చేయడంవల్లే ఆమెను ఈ సినిమా నుంచి తొలగించారనే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. ఈ వివాదం గురించి అమలా పాల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘ప్రొడక్షన్ హౌస్‌లకు నా వంతుగా సపోర్ట్ చేస్తున్నానా? లేదా? అనే విషయంలో ఆత్మశోధన చేసుకునే ప్రక్రియలో భాగంగా ఈ పోస్ట్ పెడుతున్నాను. దశాబ ్దకాలంగా నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. నా పరిచయస్తులు, నా సహనటీనటులు ఇప్పటివరకు నాపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు. నేను నిర్మాణ సంస్థలకు చాలా సపోర్టివ్‌గా ఉంటాను. ఇందకు కొన్ని ఊదాహరణలు చెప్పదలచుకున్నాను. ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ సినిమా ప్రొడ్యూసర్ నాకు ఇవ్వాల్సిన పారితోషకాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు. కానీ ఆయన ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని నా డబ్బులు నాకు ఇచ్చే తీరాలని ఆయన్ను ఒత్తిడి చేయలేదు. అలాగే నేను నటించి రిలీజ్‌కు సిద్ధమైన ‘అదో అంద పరవై పోల’ షూటింగ్ సమయంలో నాకు ఓ చిన్న గ్రామంలో వసతి ఏర్పాటు చేశారు. కావాలనుకుంటే సిటీలో హోటల్ రూమ్ బుక్ చేయమని నేను అడగొచ్చు. కానీ చిత్రబృందం సమయం, డబ్బులు వృథా కాకూడదని నేను అడ్జస్ట్ అయ్యానే. అంతేకాదు నేను ఇచ్చిన డేట్స్ కన్నా ఇంకా సమయం కేటాయించాల్సి వచ్చింది. పైగా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ ఖర్చులన్నీ నేనే భరించాను. ఇక ‘ఆడై’ (తెలుగులో ‘ఆమె’) సినిమాని సాలరీ కమ్ ప్రాఫిట్ షేర్ బేసిస్ మీద కమిటై చేశాను. కేవలం అడ్వాన్స్ మాత్రమే తీసుకుని ఈసినిమా షూటింగ్‌ను పూర్తి చేశాను. ఇలా నేను చేస్తున్న సినిమాల నిర్మాణ æసంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, నా అవసరాలకు రెండోప్రాధాన్యతను ఇస్తున్నాను. ఇప్పుడు కూడా చంద్ర ఆర్ట్స్ నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న సినిమాలోని నా పాత్ర కోసం నా సొంత ఖర్చులతో కాస్ట్యూమ్స్ కొనడానికి ముంబై వచ్చాను. ఈ సంస్థ ఎప్పుడూ ఆర్థికపరమైన వివాదాల్లో నిలుస్తూనే ఉంటుంది. నేను ఊటీలో ఏవేవో సౌకర్యాలు అడిగానని, తమ నిర్మాణసంస్థకు నేను సరిపోనని చెప్పి నన్ను హీరోయిన్గా తొలగించారు. కనీసం ఈ విషయం గురించి నాతో సరైనచర్చలు జరపకుండానే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ నేను భారీ పారితోషికం డిమాండ్ చేశానని ఆరోపించారు. ‘ఆడై’ టీజర్ రిలీజ్ తర్వాత నన్ను తప్పించారు. ఇలాంటి నిర్మాణ సంస్థల ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పుకొచ్చారు అమలాపాల్. ఇంకా చెబుతూ – ‘‘విజయ్ సేతుపతిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఈ అవకాశం చేజారింది. చంద్ర ప్రొడక్షన్స్ వల్ల ఇండస్ట్రీలో వత్తిపరంగా నా నడత గురించి వినిపిస్తున్న పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టేందుకే నేను ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు అమలా పాల్. -
మేఘా ఇన్.. అమలా అవుట్
అమలాపాల్ హీరోయిన్గా ఎంపికైన సినిమాలో ఆమెకు బదులుగా హీరోయిన్ మేఘా ఆకాష్‌ను చిత్రబృందం ఫైనలైజ్ చేశారన్నది కోలీవుడ్ తాజా ఖబర్. విజయ్ సేతుపతి హీరోగా వెంకట్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల చెన్నైలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. తొలుత ఈ సినిమాకి కథానాయికగా అమలా పాల్‌ను తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్‌లోకి మేఘా వచ్చారని సమాచారం. ఆల్రెడీ ఊటీలో ఈ సినిమా చిత్రీకరణ కూడా జరుగుతోంది. అయితే.. సడన్‌గా ఇప్పుడు అమలా ఎందుకు ఈ సినిమా చేయడం లేదు అంటే... ఏదో కొత్త సినిమాకు సైన్ చేశారని కొందరు, రెమ్యునరేషన్ ప్రాబ్లమ్ అని మరికొందరు అంటున్నారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం స్పందించలేదు. -
మేఘాకు జాక్‌పాట్
సినిమా రంగంలో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. ఏ చిత్రంలో ఎవరు ఉంటారో, ఎవరు వైదొలుగుతారో చెప్పలేం. ఇప్పుడు నటి అమలాపాల్ విషయంలో ఇదే జరిగింది. చిత్ర ప్రారంభం నుంచి ఈ అమ్మడి పేరు మారుమోగింది. తీరా చిత్ర షూటింగ్ మొదలైన తరువాత తను లేదంటున్నారు. అమలాపాల్ ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాదు తను నటించిన తాజా చిత్రం ఆడై టీజర్‌తో సంచలనం సృష్టించారు. తాజాగా మరోసారి ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు. నటుడు విజయ్‌సేతుపతి నటిస్తున్న 33వ సినిమా ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా వెంకట కృష్ణ రోహంత్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. చంద్రా ఆర్ట్స్ పతాకంపై ఇసక్కిదురై నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్‌సేతుపతికి జంటగా నటి అమలాపాల్‌ను ఎంపిక చేశారు. దర్శకుడు మగిళ్ తరుమేని ప్రతినాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం పళనిలో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇది మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్‌సేతుపతి సంగీత కళాకారుడిగా నటిస్తున్నారు. తాజా సమాచారం ఏమిటంటే ఈ చిత్రం నుంచి అమలాపాల్ వైదొలిగారు. కాల్షీట్స్ సమస్య కారణంగానే అమలాపాల్ చిత్రం నుంచి తప్పుకున్నట్టుగా చిత్ర వర్గాలు చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు అమలాపాల్ స్థానాన్ని మరో నటి మేఘాఆకాశ్ భర్తీ చేశారు. ఇది ఈమెకు జాక్‌పాట్ అనే చెప్పాలి. ఎందుకంటే మేఘాఆకాశ్ తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్నా సరైన సక్సెస్‌ను ఈ అమ్మడు చూడలేదు. కాలాలో చిన్న పాత్రలో నటించినా ఆ విజయం రజనీకాంత్‌కే చెందుతుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల శింబుకు జంటగా వందా రాజావాదాన్ వరువేన్ చిత్రంలో కథానాయకిగా నటించిన మేఘాఆకాశ్కు ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఈ సమయంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశం ఈ అమ్మడికి లభించడం నిజంగా లక్కీనే. ఈ చిత్రం షూటింగ్లో మేఘాఆకాశ్ మంగళవారం జాయిన్ అయ్యారని చిత్ర వర్గాలు తెలిపారు. ఈ చిత్రం అయినా ఈ అమ్మడి జాతకాన్ని మార్చుతుందేమో చూడాలి. -
భావోద్వేగ ప్రేమకథ
హీరోయిన్ కాజల్ అగర్వాల్ నిర్మాతగా మారారు. ఆమె సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘మను చరిత్ర’. ‘ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ ఏ పెయిన్ఫుల్ జాయ్’ అన్నది ఉపశీర్షిక. నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా, ‘లై’ ఫేమ్ మేఘా ఆకాష్ హీరోయిన్గా నటిస్తున్నారు. భరత్ కుమార్ పి. దర్శకత్వం వహిస్తున్నారు. ఆపిల్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎన్.శ్రీనివాస్ రెడ్డి, కాజల్ అగర్వాల్ మేనేజర్ పి.రాన్సన్ జోసెఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, కాజల్ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సుధీర్ వర్మ, నిర్మాత సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘ఎమోషనల్ ఇన్టెన్స్ లవ్‌స్టోరీ ఇది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. నిర్మాతలు అనిల్ సుంకర, రాజ్ కందుకూరి, అనిల్ కన్నెగంటి, ‘మధుర’ శ్రీధర్, కృష్ణ చైతన్య, కొండా విజయ్‌కుమార్, రాధాకృష్ణ, శివ నిర్వాణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సÐŒ . -
కాజల్ సమర్పణలో ‘మను చరిత్ర’
శివ కందుకూరి, మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మను చరిత్ర’. ఈ చిత్రం శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కాజల్ అగర్వాల్ క్లాప్ కొట్టగా.. సి.కల్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అజయ్ భూపతి ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. సుధీర్ వర్మ, సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్, అనీల్ సుంకర, రాజ్ కందుకూరి, అనీల్ కన్నెగంటి, మధుర శ్రీధర్, సాహు గారపాటి, కృష్ణ చైతన్య, కొండా విజయ్‌కుమార్, రాధాకృష్ణ, శివ నిర్వాణ, సుధీర్ వర్మ, అజయ్ భూపతి సహా పలువురు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సినిమాతో రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్నాడు. మేఘా ఆకాశ్, శివకుజంటగా నటిస్తున్నారు. భరత్ కుమార్.పి దర్శకుడు. గోపీసుందర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మేనేజర్ రాన్సన్ జోసెఫ్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. ఆయనతో కలిసి ఎన్.శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమోషనల్ ఇన్ టెన్స్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ ఏ పెయిన్ఫుల్ జాయ్’ అనేది ట్యాగ్‌లైన్. డాలీ ధనుంజయ్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
మెగా హీరోతో ఫ్లాప్ హీరోయిన్!
వరుస సినిమాలు చేస్తున్న ఒక్క హిట్ కూడా దక్కని సౌత్ హీరోయిన్ మేఘా ఆకాష్. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘లై’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ బ్యూటీ తరువాత తెలుగులో ఛల్ మోహన్ రంగ సినిమాలోనూ నితిన్‌కు జోడిగా నటించింది. తరువాత తమిళ్లో నటించిన రెండు సినిమాలు ఈ అమ్మడి కెరీర్‌కు ఉపయోగపడలేదు. అంతేకాదు మరో రెండు తమిళ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా మేఘాను ఓ మెగా హీరో సినిమాలో హీరోయిన్గా ఫైనల్ చేశారట. మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే ఎన్నారై భామ మనీషా రాజ్‌ను తీసుకున్నారు. మరి ఇప్పుడు మనిషాను పక్కన పెట్టి మేఘాను తీసుకున్నారా.. లేక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారా అన్న విషయం తెలియాల్సి ఉంది.మరి ఈ ఈ సినిమా అయినా మేఘాకు తొలి సక్సెస్ అందిస్తుందేమో చూడాలి. -
అందరినీ ఆకట్టుకునేలా ‘బూమరాంగ్’
బూమరాంగ్ చిత్రం జనరంజకంగా ఉంటుందని ఈ చిత్ర కథానాయకుడు అధర్వ పేర్కొన్నారు. ఈయనకు జంటగా ఇందుజా, మేఘాఆకాశ్ నటించారు. దర్శకుడు ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. రథన్ సంగీతాన్ని, సెల్వ ఛా యాగ్రహణం అందించిన ఈ చిత్రం 8న తెరపైకి రావడానికి ముస్తాబైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఆర్.కన్నన్ మాట్లాడుతూ.. ఒక చిత్రం అనుకున్న విధంగా రూపొందించాలంటే హీరో సహకారం అవసరం అన్నారు. అలా ఈ చిత్రానికి నటుడు అధర్వ బలంగా నిలిచారని అన్నారు. అందుకే తాను అధర్వతో మరో చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. బూమరాంగ్ చిత్రానికి సహకారాన్ని అందించిన పంకజ్ మెహతా, అన్భుచెలియన్, రాంప్రసాద్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. బూమరాంగ్ చిత్రాన్ని మంచి తేదీలో విడుదల చేయడానికి సహకరించిన ట్రైడెంట్స్ ఆర్ట్స్ రవీంద్రన్‌కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని దర్శక నిర్మాత ఆర్.కన్నన్ అన్నారు. చిత్ర కథానాయకుడు అధర్వ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభించామో, ఎప్పుడు పూర్తి చేశామో తెలియలేదన్నారు. అంతవేగంగా బూమరాంగ్ చిత్రాన్ని పూర్తి చేశామని తెలిపారు. బూమరాంగ్ అంటే కర్మ అని అర్థం అని, మనం ఏం చేశామో అదే మనకు తిరిగి వస్తుందని అన్నారు. ఈ చిత్రం కోసం ప్రచార బృందం అంటూ ఏమీ ఉండదన్నారు. ఈ చిత్రాన్ని తాము అంతా కలిసి జనరంజకంగా రావడానికి శ్రమించి పని చేశామని చెప్పారు. ఇందులో హీరోయిన్లుగా నటించిన మేఘాఆకాశ్, ఇందుజా ఇద్దరూ తమిళ భాష తెలిసిన నటీమణులనీ, వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందనీ అధర్వ పేర్కొన్నారు. -
ఇంకా కలగానే ఉందంటోన్న హీరోయిన్
అది ఇంకా కలగానే ఉంది అంటోంది నటి మేఘాఆకాశ్. ఒరు పక్క కథై చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తరువాత టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అక్కడ చల్ మోహనరంగా, లై వంటి రెండు చిత్రాలు చేసినా అవి ఆశించిన విజయాలను సాధించలేదు. అదేవిధంగా తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్లో అవకాశాన్ని అందుకుంది. అక్కడ శాటిలైట్ శంకర్ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌పైనే ఆశలు పెట్టుకుంది. కోలీవుడ్‌లో జీవితంలో గుర్తుండిపోయే అవకాశాన్ని అందుకుంది. అదే సూపర్‌స్టార్‌తో పేట చిత్రంలో నటించడం. ప్రస్తుతం అధర్వతో రోమాన్స్ చేసిన బూమరాంగ్ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఈ సందర్భంగా మేఘాఆకాశ్తో చిన్న భేటీ.. ప్ర: సినీ రంగప్రవేశం గురించి? జ: చిన్న వయసు నుంచే సినిమారంగం అంటే చాలా ఇష్టం. అందుకే నటి కావాలని ఆశపడ్డాను. కళాశాలలో చదువుతున్నప్పుడు దర్శకుడు బాలాజీధరణీధరన్ ఒరు పక్క కథై చిత్రంలో నటించే అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామా, చదువును పూర్తి చేద్దామా? అన్న సందిగ్ధ పరిస్థితిలో ఉన్నా, చివరికి నటనకే మొగ్గు చూపాను. ఆ చిత్రంలో నటించడం నచ్చడంతో నటిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. ప్ర: పేట చిత్రంలో నటించే అవకాశం వరించడం గురించి? జ: రజనీకాంత్‌తో నటించాలన్నది ప్రతి ఒక్క నటి కల. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిననే భావిస్తున్నాను. పేట చిత్రం అలా కుదిరింది. తొలి రోజుల్లోనే రజనీకాంత్ చిత్రంలో నటించే అవకాశం రావడం సాధారణ విషయం కాదు. ఆ చిత్రం తరువాత శింబుతో నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం తెరపైకి వచ్చింది. త్వరలో ధనుష్‌తో జతకట్టిన ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా, అధర్వకు జంటగా నటించిన బూమరాంగ్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. పేట చిత్రం నాకు చాలా లక్కీ. ఇప్పటికీ రజనీకాంత్‌తో కలిసి నటించానన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా. అది ఇంకా కలగానే ఉంది. ప్ర: శింబు సరసన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రంలో నటించిన అనుభవం గురించి? జ: తెలుగులో నేను నటించిన చిత్రాలు చూసి దర్శకుడు సుందర్.సీ ఈ నటే నా చిత్రంలో మాయ పాత్రకు బాగుంటుందని నిర్ణయించుకున్నారట. ఆయన దర్శకత్వం వహించిన చాలా చిత్రాలు నేను చూశాను. సుందర్.సీ చిత్రాలు చాలా జాలీగా, ఎంటర్‌టెయిన్‌మెంట్‌గా ఉంటాయి. అదే విధంగా వందా రాజావాదాన్ వరువేన్ చిత్రంలో మాయ పాత్ర లభించింది. ఇక శింబు పాత్ర కూడా చాలా వరకు జాలీగా ఉండటంతో షూటింగ్ సెట్లో అంతా సందడి వాతావరణమే. ఆ చిత్ర టీమ్‌తో కలిసి పని చేయడం కొత్త అనుభవం. ప్ర: బూమరాంగ్ చిత్రం గురించి? జ: నేను ఇప్పటి వరకూ నటించిన చిత్రాల కంటే భిన్నమైన చిత్రం బూమరాంగ్. ఈ చిత్రంలో నా పాత్ర పేరు జీజీ. విజువల్ కమ్యునికేషన్ విద్యార్థినిగా నటించాను. చిత్రంలో ప్రేమ ఉంటుంది. అదే సమయంలో సమాజానికి అవసరమైన సందేశం ఉంటుంది. ఒక పక్క వినోదంగా ఉంటూనే మరో పక్క చాలా సీరియస్‌గా సాగుతుంది. అలా పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో కూడిన కమర్షియల్ కథాంశంతో కూడిన చిత్రం. ఇందులో నటించడం నాకు సరికొత్త అనుభవం. అధర్వ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాత్ర కోసం కఠినంగా శ్రమిస్తారు. ఆధర్వ, నటుడు సతీశ్ కలిస్తే ఆట పట్టించడం, జోకులు అంటూ సరదాల సందడే. వారు నన్నూ ఆట పట్టించారు. ప్ర: సరే ఎలాంటి పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారు? జ: నిజం చెప్పాలంటే నాకు కథతో పయనించే పాత్రలు లభిస్తే చాలు. ఫలాన పాత్రల్లో నటించాలన్న కోరికలు నాకు లేవు. వైవిధ్యభరిత పాత్రలు, సవాల్‌తో కూడిన పాత్రల్లో నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. -
ఇన్నాళ్లకు విడుదలవుతోంది..!
క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘ఎన్నై నోకి పాయుమ్ తొట్ట’. చాలా క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆర్ధిక పరమైన కారణాల వల్ల చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్నిచిత్ర నిర్మాత మధన్ అధికారికంగా ప్రకటించారు. ‘ఎన్నై నోకి పాయుమ్ తొట్ట’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ సాధించినట్టుగా వెల్లడించారు. త్వరలోనే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శశికుమార్ కీలక పాత్రలో నటించారు. Finally #ENPTCensoredUA 😍🔥 Audio & Release date Soon | Summer Release ❤️ #ENPT pic.twitter.com/o5a21tHWYc — A2 Studio (@a2studoffl) 15 February 2019 -
భయం వేసింది!
కథానాయిక మేఘా ఆకాశ్ పేరు మారింది. ఒక్క నిమిషం... ఆమె మార్చుకోలేదు. హ్యాకర్స్ మార్చారు. అవును.. మేఘా ఆకాశ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను హ్యాకర్స్ హ్యాక్ చేసి రష్యాకి చెందిన ఓ డీజే ఆర్టిస్టు పేరు పెట్టారు. అంతటితో ఆగకుండా కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలను కూడా అప్లోడ్ చేశారు. అయితే ఆ ఫొటోలు మేఘా ఆకాశ్వి కాదు. ఈ విషయంపై మేఘా ఆకాశ్ స్పందించారు. ‘‘నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. మా టీమ్ చాలా కష్టపడి మళ్లీ నా అకౌంట్ యాక్సెస్‌ను తిరిగి తెచ్చారు. కానీ నా వ్యక్తిగత ఖాతాను హ్యాకర్స్ హ్యాక్ చేయడంతో చాలా భయం వేసింది. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ఇటీవల కమల్‌హాసన్ చిన్న కుమార్తె అక్షరా హాసన్, హీరోయిన్ హన్సిక సోషల్ మీడియా అకౌంట్స్ కూడా హ్యాక్ అయిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా హీరోయిన్ల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతుండటం గమనించాల్సిన విషయం. ఇక మేఘా సినిమాల విషయానికి వస్తే... ఇటీవల రజనీకాంత్ ‘పేట’ సినిమాలో కీలక పాత్ర చేసిన ఈ బ్యూటీ ‘శాటిలైట్ శంకర్’ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. -
హ్యాకింగ్ బారిన పడ్డ మరో హీరోయిన్
నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ మేఘా ఆకాష్. రెండో సినిమా కూడా నితిన్‌కు జోడిగా నటించిన ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయి సక్సెస్ దక్కలేదు. దీంతో కోలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మేఘాకు షాక్ తగిలింది. తాజాగా ఈ అమ్మడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. దాదాపు ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడి సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ చేసి రష్యాకు చెందిన ఒక కాస్మోటిక్ హస్పిటల్‌కు చెందిన పోస్టింగ్‌లు చేశారు. వీటిలో కొన్ని అభ్యంతరకర ఫోటోలు కూడా ఉండటంతో మేఘా అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మేఘా ఆకాష్ ట్విట్టర్ ద్వారా తన ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అయ్యిందని అభిమానులకు తెలిపారు. ‘ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయ్యింది. ఆ అకౌంట్లో వచ్చే మెసేజ్‌లు పోస్టింగ్‌లను పట్టించుకోకండి’ అంటూ ట్వీట్ చేశారు. Instagram hacked! Kindly please ignore all the messages and random things! My backend team working on it.. will retrieve it asap...Thank you🙏🏽🙏🏽🙏🏽 — Megha Akash (@akash_megha) 4 February 2019 -
కటౌట్లు పెట్టొద్దు
ఏ హీరో అయినా తన సినిమా రిలీజ్ రోజు థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఉండాలని కోరుకుంటాడు. ఎన్ని కటౌట్లుంటే అంత స్టార్డమ్ ఏర్పరచుకున్నట్టు లెక్క. కానీ తమిళ నటుడు శింబు మాత్రం తన తర్వాతి సినిమా నుంచి కటౌట్లు ఏర్పాటు చేయొద్దని ఫ్యాన్స్‌ని కోరారు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం రీమేక్ ‘వందా రాజావాదాన్ వరువేన్’ సినిమాలో నటì ంచారు శింబు. ఈ చిత్రానికి సుందర్ సి. దర్శకుడు. మేఘా ఆకాశ్, కేథరీన్ థెరీసా కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు శింబు. ‘‘నా సినిమా రిలీజ్ అని పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లు కట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృథా చేయకండి. దానికి బదులు మీ ఇంట్లో వాళ్లకు కొత్త దుస్తులు కొనండి, చిన్నపిల్లలకు చాక్లెట్లు కొనండి. అప్పుడు నేనింకా హ్యాపీగా ఫీల్ అవుతాను’’ అని శింబు పేర్కొన్నారు. -
ఫ్లాప్ హీరోయిన్‌తో నాని..!
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం జెర్సీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్‌తో ఓ సినిమా చేయనున్నట్టుగా ప్రకటించాడు. ఈ సినిమా కూడా విక్రమ్ స్టైల్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నానితో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. వీరిలో ఒక హీరోయిన్గా మేఘా ఆకాష్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మేఘా తొలి సినిమాతో నిరాశపరిచింది. తరువాత మరోసారి నితిన్‌కు జోడిగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో తెలుగులో మేఘా కెరీర్ ముగిసినట్టే అని భావించారు. అయితే తాజాగా నాని సినిమాలో ఛాన్స్ రావటంతో మేఘా కెరీర్ ఊపందుకుంటుదన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా పేట సినిమాలో కనిపించిన మేఘా ఆకాష్‌కు మంచి పేరొచ్చింది. -
చాన్స్ కొట్టేశారా?
తెలుగులో అనుకున్నంత స్పీడ్‌గా సినిమాలు ఒప్పుకోకపోయినా తమిళంలో మంచి ఫామ్‌తో దూసుకెళ్తున్నారు మేఘా ఆకాశ్. ఇటీవలే రజనీకాంత్ ‘పేట’ సినిమాలో చిన్న రోల్ కూడా చేశారు. తాజాగా తెలుగులో నాని సరసన హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేశారని టాక్. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్, నాని కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీసీ శ్రీరామ్ కెమెరామేన్. ఈ సినిమాలో హీరోయిన్గా మేఘా ఆకాశ్ పేరుని ఫిక్స్ చేశారట. సినిమా అనౌన్స్మెంట్ రోజు ‘నాని... మరో ఐదుగురు’ అంటూ పేర్కొన్నారు చిత్రబృందం. అంటే ఈ సినిమాలో ఐదుగురు భామలు ఉండే ఛాన్స్ ఉందా? వేచి చూడాలి. ‘జెర్సీ’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూట్లో జాయిన్ అవుతారట నాని. -
ఖుషీ ఖుషీగా..
సినిమా: అనుకున్నవి జరగకపోవడం, ఊహించనివి జరగడం ఇదే జీవితం. అదృష్టం చెప్పిరాదు. దురదృష్టం చెప్పిపోదు. అలా ఎన్నో ఏళ్లుగా సూపర్‌స్టార్‌తో ఒక్క సన్నివేశంలోనైనా నటించే అవకాశం కోసం నటి త్రిష జపం చేసిందనే చెప్పవచ్చు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి ప్రకటించగానే కాలానే చివరి చిత్రం అనే ప్రచారం జరగడంతో పాపం త్రిష ఇక తన కల కల్లే అనుకున్నారంతా. అదేవిధంగా ఆమె కంటే సీనియర్ నటి సిమ్రాన్. ఆమె ఒక్క రజనీకాంత్ మినహా కోలీవుడ్‌లో ప్రముఖ హీరోలందరితోనూ నటించింది. సూపర్‌స్టార్‌తో నటించలేదన్న కొరత ఈ అమ్మడికీ ఉండేది. అలా సిమ్రాన్, త్రిషలిద్దరి ఆకాంక్షలను రజనీకాంత్ పేట చిత్రంతో తీర్చారు. రెండు మూడు సన్నివేశాల్లో వచ్చి పోయే పాత్రలే అయినా త్రిష, సిమ్రాన్ ఇద్దరూ హ్యాపీ. ఇక వీరిద్దరికంటే యమ ఖుషీ అయిపోతున్న మరో నటి ఉంది. ఆమె మేఘాఆకాశ్. పేట చిత్రం ఈ జాణ జీవితంలో మరపురాని చిత్రంగా నిలిచిపోతోంది. తెలుగులో రెండు మూడు చిత్రాలు చేసిన మేఘాఆకాశ్ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయ్యింది. ఒరు పక్క కథై చిత్రంతో పరిచయమై, ధనుష్‌తో ఎన్నై నోక్కి పాయుంతోట్టా చిత్రంలో రొమాన్స్ చేసింది. ఇక శింబుతో వందా రాజావాదాన్ వరువేన్ చిత్రంలోనూ డ్యూయెట్లు పాడింది. అయితే ఈ మూడు చిత్రాలు ఇంకా వెండితెరపైకి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేట చిత్రంలో కళాశాల విద్యార్థినిగా నటించే లక్కీచాన్స్‌ను కొట్టేసింది. పేట చిత్రం గురువారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో నటించిన ఈ పేట చిత్రం ఆమె జీవితంతో విడుదలైన తొలి తమిళ చిత్రంగా నమోదైంది. ఇది మేఘాఆకాశ్ ఊహించనిదే. అయినా జరిగి మధురమైన అనుభూతిని మిగల్చడంతో మేఘ యమ ఖుషీగా పొంగళ్ పండగ చేసుకుంటోంది. అంతేకాదు ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పుకుని తెగ ఆనందపడిపోతోంది. ఈమె సంతోష పడుతున్న మరో విషయం అమ్మడు పనిలో పనిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేసింది. అక్కడ శాట్‌లైట్ శంకర్ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అలా 2018 రెండు మరచిపోలేని అవకాశాలను అందించి పోగా, 2019 పేట తొలిచిత్రంగా విడుదలై విజయానందానిచ్చింది. ఇక శింబుతో నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. మొత్తం మీద మేఘాఆకాశ్ ఫుల్‌జోష్‌లో ఉంది.