
క్లాస్ అండ్ మాస్... సినిమా ఏదైనా ప్రతి సినిమాకు నటనలో వైవిధ్యం చూపిస్తూ ముందుకెళ్తున్నారు హీరో సాయిధరమ్ తేజ్. ఫీల్‌గుడ్ మూవీస్‌ను తెరకెక్కించే దర్శకుల్లో ముందుంటారు కిశోర్ తిరుమల. పర్టిక్యులర్‌గా ఇప్పుడు వీరిద్దరి గురించే ఎందుకు చెబుతున్నామంటే.. యస్.. మీ ఊహ నిజమే.
సాయిధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందనుందని సమాచారం. ఇందులో మేఘా ఆకాశ్‌ను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారమ్. ఈ చిత్రానికి ‘చిత్రలహరి’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమా జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ హీరోగా ఓ సినిమా రూపొందు తోంది. కేయస్ రామారావు నిర్మి స్తోన్న ఈ చిత్రంలో అనుపమ హీరోయిన్.
Comments
Please login to add a commentAdd a comment