Saidharam tej
-
హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మెగాహీరో
ప్రేమించి పెళ్లి చేసుకోవడ ఇండస్ట్రీలో కొత్తేం కాదు. హీరోహీరోయిన్లు ఈ పాటికే చాలామంది ఇలా లవ్ మ్యారేజులు చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలోనే వరుణ్ తేజ్ ఇలానే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఒక్కటయ్యాడు. అయితే ఈ లిస్టులో మెగా హీరో సాయిధరమ్ కూడా చేరబోతున్నాడని గత కొన్నిరోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. హీరోయిన్ మెహ్రీన్‌తో ఏడడుగులు వేయబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై స్వయంగా సాయితేజ్ క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)'ఊషా పరిణయం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగ్గా.. దీనికి చీఫ్ గెస్ట్‌గా సాయితేజ్ వచ్చాడు. ఇందులోనే 'మీ లవ్ గురించి చెప్పండి' అని యాంకర్ అడగ్గా.. 'వన్‌సైడ్ లవ్ ఉంది. అటు నుంచి ఎలాంటి స్పందన లేదు (నవ్వుతూ). ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి, మాట్లాడేలోపు 'మీకు పెళ్లి అయిపోయిందట కదా' అనే ఆన్సర్ వస్తోంది. నాకు పెళ్లా? అని ఆశ్చర్యపోతుంటే.. మీడియాలో చూశామని అంటున్నారు అని నవ్వుతూ సాయితేజ్ క్లారిటీ ఇచ్చేశాడు.'త్వరలో మెగా ఇంట పెళ్లి సందడి అంటూ న్యూస్ వస్తోంది. మీ వివాహం విషయంలో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. నిజమేనా?' యాంకర్ అడగ్గా.. 'నా సినిమాలో 'నో పెళ్లి' (సోలో బ్రతుకే సో బెటర్) అనే పాట ఉంది తెలుసు కదా' అని అసలు విషయాన్ని దాటవేశాడు. సో అదన్నమాట సంగతి. ప్రస్తుతం 'హనుమన్' నిర్మాతలతో సాయితేజ్ ఓ సినిమా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?) -
మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు
సాధారణంగా సినిమాలు రిలీజైన తర్వాత లేదంటే విడుదలకు దగ్గర పడుతున్న టైంలో అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి. కానీ మెగాహీరో సాయిధరమ్ తేజ్ చిత్రానికి మాత్రం షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడీ విషయం మెగా అభిమానుల మధ్య చర్చకు కారణమైంది. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్.. 'విరూపాక్ష' సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హారర్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం హిట్ అయింది. దీని తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో 'గాంజా శంకర్' అనే సినిమాని నాలుగు నెలల క్రితం ప్రకటించారు. ఆ తర్వాత షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) తాజాగా ఈ చిత్రబృందానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి నోటీసులు వచ్చాయి. టైటిల్లోని 'గాంజా' అనే పదాన్ని తొలగించాలని సూచించారు. సినిమాలోనూ డ్రగ్స్‌కి సంబంధించిన సీన్స్ ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, యువతపై ఈ టైటిల్ ప్రభావం చూపించొచ్చని, వెంటనే మార్చాలని చెప్పారు. అయితే ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ అప్పట్లో వచ్చాయి. ఎందుకంటే టీజర్ లాంటి వీడియో రిలీజ్ చేసి చాలా రోజులైంది గానీ ఇప్పటివరకు సెట్స్‌పైకి వెళ్లినట్లు సమాచారం లేదు. అలాంటిది ఇప్పుడు టీఎస్ న్యాబ్ వాళ్ల నుంచి నోటీసులు రావడంతో.. ఆగిపోయిన మూవీకి నోటీసులు రావడం ఏంటబ్బా అని కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: పార్టీ పేరు మార్చిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే?) -
మా మామ మెగాస్టార్ అయితే కష్టాలు ఉండవా..?
-
నా సగం జీవితం 'రేయ్' సినిమాకే పోయింది
-
మెగాహీరో పుట్టినరోజు.. వాళ్లకోసం రూ.20 లక్షలు విరాళం!
మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఆదివారం పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. పలువురు సినీ ప్రముఖులు అతడికి విషెస్ చెప్పారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఎవరూ ఊహించని ఓ మంచి పనిచేసిన ఈ కుర్రహీరో శెభాష్ అనిపించుకున్నాడు. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్) మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్.. కెరీర్ ప్రారంభంలో వరస హిట్స్ కొట్టాడు. కానీ తర్వాత రొటీన్ కమర్షియల్ సినిమాలతో ఘోరంగా దెబ్బతిన్నాడు. మధ్యలో 'రిపబ్లిక్' లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అలాంటిది 2021లో ఇతడికి బైక్ ప్రమాదం జరగడం, కోమాలోకి వెళ్లిపోవడంతో బతుకుతాడా లేదా అనుకున్నారు. కానీ కోలుకుని మళ్లీ తిరిగొచ్చాడు. ఈ ఏడాది 'విరూపాక్ష', 'బ్రో' చిత్రాలతో ఆకట్టుకున్న సాయితేజ్.. గతంతో పోలిస్తే ఆలోచన పరంగా చాలా మారిపోయాడు. ఇప్పుడు తన పుట్టినరోజున ఏకంగా రూ.20 లక్షలు విరాళమిచ్చాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆర్మీ అధికారుల భార్యలకు రూ.10 లక్షలు.. ఏపీ-తెలంగాణ పోలీసులకు రూ.10 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ట్వీట్ చేశాడు. దీంతో అందరూ ఇతడిని ప్రశంసిస్తున్నారు. (ఇదీ చదవండి: స్టార్ హీరో షూటింగ్లో ప్రమాదం.. ఆయన మృతి!) Exercising my responsibility & Paying respect to the ones who sacrifice their today for our tomorrow, EVERYDAY 🙋♂️ Thank you Indian Army, A P Police & Telangana Police & their ever sacrificing families.@adgpi@TelanganaCOPs @APPOLICE100 pic.twitter.com/tHM6RkTER8 — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 15, 2023 -
సాయితేజ్-స్వాతి.. ఆ విషయం ఇప్పుడు బయటపెట్టారు!
మెగాహీరో సాయిధరమ్ తేజ్‌ని హీరోయిన్ స్వాతి స్టేజీపై ముద్దుపెట్టుకుంది. అయితే వీళ్లిద్దరూ యాక్టర్స్ అని, టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారని చాలామందికి తెలుసు. కలిసి కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో తమ బాండింగ్ గురించి చెబుతూనే ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఇది ఆసక్తి కలిగిస్తోంది. కలర్స్ టాక్ షోతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. 'అష్టాచమ్మా' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. కొన్నాళ్ల పాటు పలు చిత్రాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని, నటనకు కాస్త బ్రేక్ ఇచ్చింది. కొన్నాళ్ల ముందే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టేసింది. ఈమె హీరోయిన్గా నటించిన 'మంత్ ఆఫ్ మధు' మూవీ అక్టోబరు 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ వేడుకని మంగళవారం నిర్వహించారు. దీనికి గెస్ట్‌గా వచ్చిన మెగాహీరో సాయితేజ్.. స్వాతి గురించి పలు విషయాలు రివీల్ చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 37 సినిమాలు) 'స్వాతి గురించి చెప్పాలంటే మీ అందరికీ కలర్స్ స్వాతి. కానీ నాకు మాత్రం స్వాతిగాడు. ఎందుకంటే కాలేజీ రోజుల నుంచే స్వాతి నాకు బెస్ట్ ఫ్రెండ్. కలర్స్ స్వాతిగా మొదలై స్వాతి అయింది. ఆ తర్వాత స్వాతిగాడు అయింది. ఈ మూవీ స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్త్ స్వాతి' అని సాయిధరమ్ తేజ్ చెప్పాడు. ఆ వెంటనే ఇతడిని హగ్ చేసుకున్న స్వాతి బుగ్గపై ముద్దుపెట్టింది. ఇక స్వాతి మాట్లాడుతూ.. 'మేం ఇద్దరం కలిసి చదువుకున్నాం. సినిమాల్లోకి నేను ముందే వచ్చేశాను కాబట్టి తనకంటే పెద్దదాన్ని అని మీరందరూ అనుకుంటున్నారేమో. కానీ మా ఇద్దరికీ ఒకే ఏజ్(వయసు). ఒకే కాలేజీలో డిగ్రీ చేశాం. ఎగ్జామ్స్ లో నేను చూపిస్తేనే పాసయ్యాడు(నవ్వుతూ). ఏడాదిగా కలిసి 'సత్య' అనే ప్రాజెక్ట్ చేశాం. తేజూ నా జీవితంలో ఎప్పుడూ సపోర్ట్ సిస్టంలా ఉంటూ వస్తున్నాడు. థాంక్యూ తేజు' అని అతడితో బాండింగ్ గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!) -
సాయితేజ్ పక్కనున్న వ్యక్తిని గుర్తుపట్టారా? స్టార్ హీరో కొడుకు!
మెగాహీరో సాయిధరమ్ తేజ్ జోష్‌లో కనిపిస్తున్నాడు. బైక్ యాక్సిడెంట్ తర్వాత రెండు సినిమాలు చేశాడు. అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఓ వైపు ప్రమోషన్స్ చేస్తూనే మరోవైపు తన ఫ్రెండ్స్‌తో కలిసి మరో ప్రాజెక్ట్ కోసం రెడీ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన ఓ రెండు పిక్స్ వైరల్‌గా మారిపోయాయి. అయితే ఈ ఫొటోల్లో సాయితేజ్‌తో ఉన్న ఓ వ్యక్తి కాస్త తెలిసిన ముఖంలా అనిపించాడు. ఇంతకీ అతడెవరో గుర్తుపట్టారా? 'బ్రో' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించన సాయితేజ్.. తర్వాత చిత్రం సంపత్ నంది డైరెక్షన్లో చేయబోతున్నాడు. దీనికి 'గాంజా శంకర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి ముందే ఓ షార్ట్ ఫిల్మ్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. అవును మీరు విన్నది నిజమే. మెగాహీరో సాయిధరమ్ తేజ్.. 'సత్య' అనే షార్ట్ ఫిల్మ్‌లో చాలా రోజుల క్రితమే నటించాడు. (ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్) ఆర్మీ జవాన్, అతడి ప్రేయసి మధ్య జరిగే కథతో ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సీనియర్ నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. పైన ఫొటోలో సాయితేజ్ పక్కన బ్లాక్ టీషర్ట్‌లో ఉన్నది అతడే. గతంలో హీరోగా నందిని 'నర్సింగ్ హోమ్', 'ఊరంతా అనుకుంటున్నారు' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు. 'ఐనా ఇష్టం నువ్వు' అనే మూవీ కూడా చేశాడు. అయితే ఇవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనపెట్టేశాడు. అయితే ఇప్పుడు లావుగా మారిపోవడంతో నరేశ్ కొడుకు నవీన్‌ని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. మరోవైపు సాయితేజ్-మంచు మనోజ్-నవీన్ బెస్ట్ ఫ్రెండ్స్. సమయం చిక్కినప్పుడల్లా వీళ్ల ముగ్గురు కలుస్తుంటారు. హీరోగా మెప్పించలేకపోయిన నవీన్.. దర్శకుడిగా మారిపోయాడు. సాయితేజ్‌తో ఓ షార్ట్ ఫిల్మ్ తీసి అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయిపోయాడు. త్వరలో ఇది రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: సెట్లో అవమానాలు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!) -
'బ్రో' ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్!
'ఆచార్య' తర్వాత మెగాహీరోలు చేస్తున్న మల్టీస్టారర్ 'బ్రో'. యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పవన్ కల్యాణ్ హీరో కంటే తక్కువ-అతిథి పాత్ర కంటే ఎక్కువ ఉండే రోల్ చేశాడు. ఈ శుక్రవారం అంటే జూలై 28న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ వరకు ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. మిగతా ప్రేక్షకులు మాత్రం 'బ్రో' మీద 50-50 నమ్మకంతో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో హీరో సాయిధరమ్ తేజ్.. ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) 2021 డిసెంబరులో విడుదలైన సినిమా 'వినోదయ సీతం'. సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. 99 నిమిషాల నిడివితో ఉన్న ఈ చిత్రం.. తెలుగులోనూ డబ్ అయింది. దీన్ని తెలుగులో 'బ్రో'గా రీమేక్ చేశారు. ఇక్కడ కాస్త డ్యూరేషన్ పెంచారు. ఒరిజినల్లో ఓ పెద్దాయన పాత్ర-సముద్రఖని ఉంటారు. ఇందులో పెద్దాయన స్థానంలో సాయితేజ్, సముద్రఖని ప్లేసులో పవన్ వచ్చారు. విడుదలకి వారం ముందు కూడా 'బ్రో'పై పెద్దగా హైప్ లేదు. దీంతో పవన్ పాత పాటని మరోసారి రీ క్రియేట్ చేశారు. 42 సెకన్లున్న ఈ వీడియోని తాజాగా రిలీజ్ చేయగా, కాస్తంత హైప్ వచ్చింది. అయితే ఈ సాంగ్ సినిమాలో ఉంటుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు. ఇప్పుడు వాళ్లకు షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇది జస్ట్ ప్రమోషనల్ సాంగ్ మాత్రమే. అదే విషయాన్ని సాయిధరమ్ తేజ్.. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. దీన్నిబట్టి 'బ్రో' ఫ్యాన్స్.. ఆ పాట బిగ్ స్క్రీన్ పై కష్టమే. అంతగా చూడాలనుకుంటే యూట్యూబ్‌లో చూసుకోండి. Promotional song ..!#BroTheAvatar #Bro pic.twitter.com/ByoLJoXEfb — ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) July 26, 2023 (ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?) -
మెగా ప్రిన్సెస్ క్లీంకారపై సాయి తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మెగా ప్రిన్సెస్ క్లీంకార ఎలా ఉంటుంది? తండ్రి రామ్ చరణ్‌లా ఉంటుందా? లేక తల్లి ఉపాసనలా ఉంటుందా? చిరంజీవి పోలికలు వచ్చాయా? లేవా?.. మెగా అభిమానుల మనసుల్లో మెదలుతున్న ప్రశ్నలివి. క్లీంకార జన్మించి నెల రోజులు దాటినా.. ఇప్పటికీ ఆమె ముఖాన్ని మాత్రం బాహ్య ప్రపంచానికి చూపించలేదు. కొన్ని ఫోటోలు, వీడియోలను వదిలినా.. కూతురి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు ఉపాసన-రామ్ చరణ్. దీంతో క్లీంకార ఎలా ఉందనే క్యూరియాసిటీ మెగా ప్యాన్స్‌లో మరింత పెరిగింది. ఫోటోలను షేర్ చేయండంటూ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్-ఉపాసలను వేడుకుంటున్నారు. అయినా కూడా ఇప్పటికీ మెగా ప్రిన్సెస్ ఫోటోలు బయటకు రాలేదు. అయితే తాజాగా క్లీంకారకు ఎవరి పోలీకలు వచ్చాయో చెప్పేశాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. క్లీంకార ప్రస్తావన వచ్చింది. ‘క్లీంకారకు తండ్రి పోలికలు వచ్చాయి. అచ్చం రామ్ చరణ్‌లాగే ఉంటుంది. కళ్లు చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చాయి. కూతురు తండ్రి పోలీకలతో పుడితే అదృష్టం అంటారు. క్లీంకార విషయంలో అదే జరిగింది’అని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. (చదవండి: టాలీవుడ్లో టాప్ వన్ హీరో, టాప్ వన్ హీరోయిన్ ఎవరంటే..?) -
కొంత గ్యాప్ తీసుకున్న స్టార్స్.. ఎందుకో తెలుసా..?
ప్రతీ క్యారెక్టర్ సవాల్‌గా అనిపించక పో వచ్చు. అయితే కొన్ని క్యారెక్టర్స్ మాత్రం చాలెంజ్ చేస్తాయి. మంచి మేకోవర్ని డిమాండ్ చేస్తాయి. అలాంటి క్యారెక్టర్స్‌ని చాలెంజ్‌గా తీసుకుని మేకోవర్ అయి పో తుంటారు స్టార్స్. ఇప్పుడు కొందరు స్టార్స్ కొత్త మేకోవర్ కోసం షూటింగ్స్ నుంచి కొంత గ్యాప్ తీసుకుని, స్పెషల్‌గా ట్రైన్ కావాలనుకుంటున్నారు. ఆ స్టార్స్ గురించి తెలుసుకుందాం. ఫారెస్ట్‌లో యాక్షన్ దాదాపు మూడు నెలల పాటు మహేశ్‌బాబు ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని తెలుస్తోంది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ అడ్వెంచరెస్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాదిప్రారంభంలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు దర్శక–రచయిత విజయేంద్రప్రసాద్. ఈ చిత్రంలో హీరో మహేశ్‌బాబు సరికొత్త సర్ప్రైజింగ్ లుక్‌లో కనిపించనున్నారట. ఇందు కోసం మహేశ్ మూడు నెలల కఠోర శ్రమతో కూడిన ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారన్నది ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఫిల్మ్ ఇది. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంటారట మహేశ్. ఈ గ్యాప్‌లో రాజమౌళి సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటారని తెలిసింది. వార్ ట్రైనింగ్ ఏ పాత్రలోనైనా లీనమై పో తారు ఎన్టీఆర్. ఇందుకోసం ఆయన ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారు. క్లిష్టమైన వర్కౌట్స్ చేయడానికి కూడా వెనకాడరు. ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాల కోసం ఎన్టీఆర్ కష్టపడి ఎలా మేకోవర్ అయ్యారో తెలిసిందే. ఎన్టీఆర్ మరోసారి మేకోవర్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. హిందీలో యశ్‌రాజ్ చోప్రాబ్యానర్పై స్పై యూనివర్స్‌లో భాగంగా ఆదిత్యా చోప్రా‘వార్ 2’ చిత్రం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్ రోల్స్ చేయనున్నారు. ఈ కథ రీత్యా ఎన్టీఆర్ పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ‘వార్ 2’ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లోప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాలోని తన రోల్, లుక్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని సెప్టెంబరు చివరికల్లా పూర్తి చేసి, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘వార్ 2’ ట్రైనింగ్‌లో బిజీ అయి పో యి, డిసెంబరులో షూటింగ్లో జాయిన్ అవ్వాలన్నది ఎన్టీఆర్ ప్లాన్ అట. మరో సర్ప్రైజ్ ‘పుష్ప’ చిత్రంలో అల్లు అర్జున్ మేకోవర్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మరోసారి ఆడియన్స్ వావ్ అనేలా అల్లు అర్జున్ మేకోవర్, లుక్ ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గెటప్ కొత్తగా ఉంటుందని, ఈ గెటప్ మేకోవర్ కోసం అల్లు అర్జున్ కొంత టైమ్ తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా కోసం వర్కౌట్ చేస్తారని తెలుస్తోంది. ఆరు నెలల విరామం దాదాపు ఆరు నెలలు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు సాయిధరమ్ తేజ్. ఫిజికల్‌గా ఇంకొంచెం స్ట్రాంగ్‌గా అవ్వాలనుకుంటున్నానని, ఇందుకోసం ఆరు నెలల సమయం పడుతుందనీ సాయిధరమ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సాయిధరమ్ తర్వాతి చిత్రం సంపత్ నంది దర్శకత్వంలో ఉంటుంది. భారీ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. సో.. ఆరు నెలల బ్రేక్‌లో సాయిధరమ్ ఫిట్నెస్ కోసం చేసే వర్కౌట్స్ ఈ సినిమాకు కూడా ఉపయోగపడతాయని, తను సరికొత్త మాస్ లుక్‌లో కనిపించే అవకాశం ఉందని భోగట్టా. ఇలా షూటింగ్స్ నుంచి కొంత గ్యాప్ తీసుకుని తమ కొత్త సినిమాల గెటప్‌ల కోసం ట్రైనింగ్ తీసుకోవడానికి మరికొందరు స్టార్స్ కూడా రెడీ అవుతున్నారు. -
మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారుతున్న ఆ పేరు!?
మెగా ఫ్యామిలీకి గత కొన్నాళ్ల నుంచి అన్నీ కలిసొస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ రావడంతో రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత చాన్నాళ్ల సినిమాలకు దూరమైన సాయిధరమ్ తేజ్.. 'విరూపాక్ష'తో హిట్ కొట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కొన్నిరోజుల ముందు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇప్పుడేమో రామ్ చరణ్ కు కూతురు పుట్టింది. ఇలా ఒకటి తర్వాత ఒకటి గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?) ఇలా మెగాఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. మరోవైపు హీరోలందరూ సినిమాలు చేస్తూ పుల్ బిజీ. ఇలాంటి టైంలో మెగాహీరోల సినిమా టైటిల్స్ లోని ఓ పేరు సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. 'విరూపాక్ష' తర్వాత సాయితేజ్ నటిస్తున్న మూవీకి 'గాంజా శంకర్' అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు టాక్ రావడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీకి సంపత్ నంది దీనికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. గతంలో చిరంజీవి హీరోగా 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'శంకర్ దాదా జిందాబాద్' మూవీ చేశారు. పవన్ కల్యాణ్ 'గుడుంబా శంకర్' చేశారు. ఇప్పుడు చిరు మళ్లీ 'భోళా శంకర్' అనే చిత్రం చేస్తున్నారు. తాజాగా సాయిధరమ్ తేజ్.. 'గాంజా శంకర్' అనే మాస్ టైటిల్ ని తన కొత్త మూవీ కోసం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా అందర 'శంకర్' అనే పేరుని టైటిల్ ఉపయోగించడం సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్గా మారింది. భవిష్యత్తులో మిగతా మెగా హీరోలు కూడా ఈ పేరుతో సినిమాలేమైనా చేస్తారేమో!? (ఇదీ చదవండి: మేనేజర్ మోసం.. రష్మిక షాకింగ్ నిర్ణయం!) -
టాంగో ఇక లేదు.. సాయి తేజ్ ఎమోషనల్ పోస్ట్
మెగాహీరోల్లో సాయిధరమ్ తేజ్ కాస్త డిఫరెంట్. కెరీర్ ప్రారంభంలో రొటీన్ కమర్షియల్ సినిమాలు చేశాడు. ఫెయిల్యూర్స్ చూశాడు. దీంతో రూట్ మార్చి గత నాలుగైదు సినిమాలతో భిన్నంగా ప్రయత్నించాడు. హిట్స్ అందుకున్నాడు. రీసెంట్ గా 'విరూపాక్ష'తో సూపర్ సక్సెస్ అందుకున్న సాయితేజ్.. ఇప్పుడు అనుకోని ఓ విషయం జరగడంతో బాధపడుతున్నాడు. (ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా) చాలామంది సెలబ్రిటీలు పెట్స్ ని ఎక్కువగా పెంచుతూ, గారాభంగా చూసుకుంటూ ఉంటారు. అలా సాయితేజ్ దగ్గర టాంగో అనే పెట్ డాగ్ ఉంది. గతంలో దీనితో తీసుకున్న పలు ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఇప్పుడు అది చనిపోయిందని చెబుతూ ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 'నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు సంతోషంతో నిండిపోతుంది. నువ్వు ఇక లేవనే నిజాన్ని నా మనసు తీసుకోలేకపోతోంది. నా డార్కెస్ట్ మూమెంట్స్ లో తోడుగా ఉన్నావ్. నేను హ్యాపీగా ఉండేందుకు కారణమయ్యావు. లవ్ యూ మై బండ ఫెలో టాంగో' అని సాయితేజ్.. ఇన్ స్టాలో తన పెట్ డాగ్ తో తీసుకున్న ఫొటోని పోస్ట్ చేశాడు. ఎమోనషల్ అయ్యాడు. (ఇదీ చదవండి: వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా?) View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) -
చరణ్ అన్న క్యూట్ గ ఉంటాడు..
-
‘హిడింబ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘హిడింబ’ ట్రైలర్ అదిరిపోయింది
‘‘క్రికెట్ వల్ల అశ్విన్ తో నాకు పరిచయం ఏర్పడింది. అశ్విన్ హీరోగా నటించిన ‘హిడింబ’ ట్రైలర్ లాంచ్‌కు రావడం సంతోషంగా ఉంది. ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు సాయిధరమ్ తేజ్. అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందు తున్న చిత్రం ‘హిడింబ’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సాయిధరమ్ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. అశ్విన్ బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ నా కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. ఈ సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను’’ అన్నారు నందితా శ్వేత. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నుంచి హిస్టారికల్ ఫిక్షన్ కు వెళ్లే చిత్రమిది. అశ్విన్ యాక్టింగ్ స్కిల్స్ ఈ సినిమాతో తెలుస్తాయి’’ అన్నారు అనిల్. ‘‘అశ్విన్ సపోర్ట్ వల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: వికాస్ బాడిస, కెమెరా: బి. రాజశేఖర్. -
నాకు యాక్సిడెంట్ అయిన విషయం ఎప్పుడో మర్చిపోయా.. అది నాకు స్వీట్ మెమోరీ
-
పోస్టర్ చూద్దాం.. ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్
పండగ చేద్దాం.. పోస్టర్ చూద్దాం అన్నట్లు ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని పోస్టర్లను చూద్దాం. ♦ వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. ♦ పల్లకి మోస్తున్నారు గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘రామబాణం’. ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ♦ నాగచైతన్య పోలీస్‌గా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘కస్టడీ’. కృతీ శెట్టి హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న రిలీజవుతుంది. ♦ కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ♦ ‘మామా మశ్చింద్ర’ చిత్రంలో ట్రిపుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు సుదీర్‌బాబు. దర్శక–నటుడు హర్షవర్థన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో దుర్గ, పరశురామ్, డీజే పాత్రల్లో కనిపిస్తారు సుధీర్‌బాబు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ♦ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కానుంది. ♦ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘అర్జునదారి గాండీవ’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ♦ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’. 2012 యుగాంతం కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మాత. ♦ పోలీసాఫీసర్‌గా కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ‘మీటర్’. అతుల్యా రవి హీరోయిన్గా నటించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ల సమర్పణలో చెర్రీ (చిరంజీవి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం ‘అహింస’. గీతికా తివారి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు. పి. కిరణ్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ ‘రౌడీబాయ్స్’ ఫేమ్ ఆశిష్ హీరోగా రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘సెల్ఫీష్ ’. ఈ చిత్రానికి విశాల్ కాశి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి సహనిర్మాతలు. ♦ రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాను రమణ మొగిలి, తిరుపతిరెడ్డి బీరం నిర్మించారు. ‘‘స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
దరువెయ్ బాగా వచ్చింది – సాయిరామ్ శంకర్
‘‘వెయ్ దరువెయ్’ టీజర్ ఆసక్తిగా ఉంది. ఈ సినిమా హిట్ కావాలి. సాయి అన్నకి, డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు మరిన్ని అవకాశాలు రావాలి’’ అన్నారు హీరో సాయిధరమ్ తేజ్. సాయిరామ్ శంకర్, యాశా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. దేవరాజు పొత్తూరు నిర్మించిన ఈ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్‌ని సాయిధరమ్ రిలీజ్ చేశారు. సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలకు విశేష స్పందన లభించింది. సినిమా బాగా వచ్చింది.. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సాయిరామ్, దేవరాజుగార్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను’’ అన్నారు నవీన్ రెడ్డి. ‘‘సాయిరామ్గారి కెరీర్లో మరొక మంచి చిత్రం అవుతుంది’’ అన్నారు దేవరాజ్. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: ముత్యాల సతీష్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: జనగాని కార్తీక్, శ్రీపాల్ చొల్లేటి. -
సాయిధరమ్ తేజ్ పై అపోలో హెల్త్ బులిటెన్
-
థియేటర్లలోనే మెగా మేనల్లుడి ‘సోలో’సందడి
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోలోగా రావడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ లాక్డౌన్ నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సాయిధరమ్ తేజ్ ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తున్నాడు. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఎస్వీసీసీ నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూర్చారు. డేరింగ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్ర నిర్మాత. సాయిధరమ్ తేజ్ సరసన సభా నటేష్ కథనాయిక. జీ స్టూడియోస్ ప్రకటన మేరకు లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలయ్యే మొదటి సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ కొత్త రికార్డ్ సృష్టించనుంది. ఇప్పటి వరకు థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నట్టు ఎవరు ప్రకటించలేదు.. ఇక మెగా మేనల్లుడే సోలోగా సందడి చేయనున్నాడు. ప్రస్తుతం దేవ కట్టా దర్శకత్వంలో కొత్త సినిమాని సాయిధరమ్ తేజ్ పట్టాలెక్కించనున్నాడు. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ చిత్రం.. అక్టోబరు రెండో వారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెట్టింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తేజ్ ఓ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో అభిమానులు అనుకుంటున్నారు. Let's meet in Theaters this Christmas🎄 🥳 Supreme Hero @IamSaiDharamTej's #SoloBrathukeSoBetter will release in theaters on Dec 25th!#SBSBOnDec25th@NabhaNatesh @MusicThaman @subbucinema @BvsnP @bkrsatish @SonyMusicSouth @ZeeStudios_ pic.twitter.com/rEGFGF4tor — SVCC (@SVCCofficial) November 28, 2020 -
ప్రభాస్ అన్నా.. సారీ లెఫ్ట్ అవుతున్నా: తేజ్
"నో పెళ్లి.. దాని తల్లి.. ఈ తప్పే చేయకురా వెళ్లి.." అంటూ 'సోలో బతుకే సో బెటర్'లో అందరికీ ఉపదేశమిచ్చారు మెగా హీరో సాయిధరమ్ తేజ్. కానీ విచిత్రంగా ఈ పాట విడుదలైన తర్వాత టాలీవుడ్లో కొందరి పెళ్లిళ్లు జరిపోగా, మరికొందరికి వివాహ ఘడియలు ముంచుకు రావడంతో లగ్నతాంబూలాలు పెట్టేసుకున్నారు. వీళ్లు మాత్రమే కాదు.. తాజాగా తాను కూడా పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సిగ్నల్ ఇచ్చేశారు సాయి ధరమ్. "ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం కానీ, ఆ టైం వచ్చినప్పుడు తప్పదు మరి అని చెప్పుకొస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. (నా విజయం వాయిదా పడిందనుకున్నా!) ఇందులో బ్యాచిలర్ హీరోలందరూ కలిసి ఉన్న 'సింగిల్ ఆర్మీ' అనే వాట్సాప్ గ్రూప్ నుంచి నిఖిల్, నితిన్, రానా.. ఇలా ఒక్కొక్కరు లెఫ్ట్ అయ్యారు. చివర్లో "ప్రభాస్ అన్నా.. సారీ, ఇప్పుడు నా వంతు వచ్చిందం"టూ సుప్రీం హీరో కూడా లెఫ్ట్ అయ్యారు. దీంతో ఆయన కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని అభిమానులు అంటున్నారు. అయితే ఈ విషయం గురించి పూర్తి క్లారిటీ రావాలంటే రేపు ఉదయం 10 గంటల వరకు వేచి ఉండాల్సిందే. (‘మెగా కుటుంబం ఎదగడానికి ఇదే కారణం’) -
సంచలనం రేపుతున్న అనుష్క ‘నిశ్శబ్దం’
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్ధం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అనుష్క, మాధవన్ లుక్స్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాకుండా భాగమతి చిత్రం తర్వాత అనుష్క నటిస్తుండటం.. విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మాధవన్ కూడా ఉండటంతో ఈ చిత్రంపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తాజాగా దీపావళి కానుకగా చిత్రానికి సంబంధించిన ప్రి టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రి టీజర్‌ను పరీక్షిస్తే డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మాధవన్ వయోలిన్ ప్లే చేయడం టీజర్లో చూపించారు. ఇక అనుష్క చేతి వేళ్లు ఓ ముద్రను ప్రతిబింబిచేలా ఉన్నాయి. ఆ ముద్ర దేనికి సంకేతమో తెలియాలంటే పూర్తి టీజర్ లేదా సినిమాను చూడాల్సిందే. ఇక అనుష్క బర్త్ డే(నవంబర్ 7) కానుకగా పూర్తి టీజర్‌ను విడుదల చేయనున్నారు. తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ‘కిల్ బిల్’ మూవీలో విలన్‌గా నటించిన మైఖేల్ మ్యాడిసన్, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఫ్యామిలీస్‌ను టచ్ చేసిన ప్రతిరోజు పండగే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న హీరో సాయి ధరమ్ తేజ్.. మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండగే’ వంటి కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ–నిర్మాత. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పస్ట్ లుక్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మోషన్ పోస్టర్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా కనెక్ట్ చేసింది. సాయి తేజ్‌కు తాతయ్య పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటిస్తున్నారు. రావు రమేశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. -
ఏడాది చివర్లో పండగ
సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ–నిర్మాత. ఈ సినిమాను డిసెంబరు 20న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం వెల్లడించింది. ‘‘కుటుంబ భావోద్వేగాలతో ఈ సినిమాను చక్కగా తెరకెక్కిస్తున్నారు మారుతి. సాయి తేజ్‌కు తాతయ్య పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటిస్తున్నారు. రావురమేష్గారిది కీలక పాత్ర. సాయి తేజ్‌ను కొత్త పాత్రలో చూడబోతున్నారు. ఈ సినిమాలో తాత–మనవడి మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కటుంబ విలువలు, ఆప్యాయతలతో ఈ సినిమా మంచి ఎమోషనల్‌గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు. -
వాళ్లలా నొప్పించి సంపాదించడం లేదు
‘‘గెలుపు, ఓటమి అనేది దేవుడు సృష్టించింది కాదు. మనం పెట్టుకున్న గేమ్ అది. ఇందులో ఫస్ట్ వస్తే సక్సెస్. అది త్వరగా సాధిస్తే సక్సెస్. ఇలా అన్నీ మనం ఆడుకుంటున్న ఆటలు. ఇలా ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్లు పరిగెడుతున్నాం. గెలిచిన వాడిని అభినందించకపోయినా పర్వాలేదు కానీ ఓడిపోయినవాడిని తక్కువ చేయడానికి ప్రయత్నించకుండా ఉండాలి’’ అని సునీల్ అన్నారు. సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియ దర్శన్, నివేథా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో కమెడియన్ పాత్రలో ప్రేక్షకులను అలరించిన సునీల్ పంచుకున్న విశేషాలు... ► మనోజ్, విష్ణులతో సినిమాలు చేసే సమయం నుంచి తేజు నాకు తెలుసు. మాతో చాలా బాగా కలసిపోయేవాడు. అప్పట్లో తేజుని హీరోగా పెట్టి నేను ఓ సినిమా దర్శకత్వం చేద్దామనుకున్నాను. ఇప్పటికి కలసి యాక్ట్ చేసే చాన్స్ వచ్చింది. ► నా గ్లాస్‌మేట్స్ చాలా మంది ఉన్నారు. చెబితే లిస్ట్ సరిపోదు. ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో త్రివిక్రమ్ ఒకరు. ఆనందం అయినా, బాధ అయినా తనతో పంచుకోవాలనుకుంటాను. కష్టం దాటగలిగే కాన్ఫిడెన్స్ మాలో నింపేవాడు త్రివిక్రమ్. ► ఇప్పుడు టెక్నాలజీని(ఫేస్బుక్, ట్వీటర్) ఉపయోగాల కంటే అనవసరమైన వాటికే వాడుతున్నాం. ఇటీవల ఏదో యూట్యూబ్ వీడియోలో నేను చనిపోయాను అని ఓ వీడియో పోస్ట్ చేసేశారు. అంటే వ్యూస్ కోసం వేరే వాళ్లను హర్ట్ చేసేస్తారా? లీగల్‌గా ప్రొసీడ్ అవుదాం అనుకున్నాం, కానీ వాళ్లు సారీ చెప్పేశారు. వాళ్లను మళ్లీ ఇబ్బంది పెడితే నాకేం వస్తుంది? అని వదిలేశాను. వాళ్లలా ఎదుటి వ్యక్తిని నొప్పించి నేను సంపాదించడం లేదు. అందర్నీ నవ్వించి సంపాదిస్తున్నాను. ► సోషల్ మీడియా రావడం వల్ల ప్రతిదీ వార్త అయిపోయింది. ఆ వార్త చదువుతూ మీ టైమ్‌ను వేస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇంకో మంచి ఆలోచన చేయొచ్చు కదా? ► కమెడియన్ నుంచి హీరోగా మారినప్పుడు యాక్షన్ కామెడీ చేద్దాం అనుకున్నాను. హాలీవుడ్ సినిమాల్లో హీరో పక్కన ఉండే క్యారెక్టర్లు కూడా ఫిట్‌గా సిక్స్ ప్యాక్స్తోనే కనిపిస్తారు. యాక్షన్ కామెడీ హీరోగా చేయాలని సిన్సియర్‌గా ట్రై చేశా. హీరోగా సినిమాలు చేస్తున్నానని కామెడీ పాత్రలు చేయమని అడగడం తగ్గించారు దర్శక–నిర్మాతలు. హీరోగా నాకు నచ్చినవి కొన్ని ఉంటే నిర్మాతల వల్ల ఒప్పుకున్న సినిమాలు మరికొన్ని. అప్పుడు ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నా నాతో చాలా మంది నిలబడ్డారు. నాకు ఇండస్ట్రీలో ఎవరితో గొడవలు లేవు. అందరితో బావుంటాను. నా అదృష్టం అదే. ► మన సినిమాలు ఎక్కువ శాతం హాలీవుడ్ కాపీయే. మనవి వాళ్ల దగ్గరకు వెళ్లడం ఉండదు. ► హీరోగా కాకుండా కమెడియన్‌గా కొనసాగాలనుకుంటున్నాను. అప్పుడు నెలకు 2సార్లు తప్పకుండా ప్రేక్షకులను పలకరించవచ్చు. హీరోగా సంపాదిస్తున్న దానికంటే తక్కువ వస్తుంది కదా? అని మీరు అడిగితే ఒకేసారి పది రూపాయిలు తీసుకున్నా, పదిసార్లు రూపాయి తీసుకున్నా అంతే కదా అంటాను. ► కామెడీ సినిమాలకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. మనం కథ రాయకుండా కామెడీ సినిమాలు లేవు అనడం కరెక్ట్ కాదు. ‘మొన్న’ ఎఫ్ 2’ సక్సెసే ఇందుకు నిదర్శనం. ► ప్రస్తుతం అల్లు అర్జున్– త్రివిక్రమ్, రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలో చేస్తున్నాను. నా అభిమాన హీరోతో ఓ పెద్ద సినిమాలో చేస్తున్నాను (చిరంజీవి–కొరటాల శివ సినిమాను ఉద్దేశిస్తూ). -
చిత్రయూనిట్
-
చిత్రా.. లహరి..
ఈ రోజు గురువారం సాయంత్రం కచ్చితంగా ‘చిత్రలహరి’ చూడాలి. ఇలా ప్రతి గురువారం కోసం ఎదురుచూసే రోజులవి. 1990వ దశకంలో ప్రతి గురువారం దూరదర్శన్‌లో వచ్చే ఆ ఆరు పాటల కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎదురు చూసేవారు. ఇప్పుడు అదే పేరు ‘చిత్రలహరి’తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురాజ్ నాయకా నాయికలుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. చక్కటి ఫ్యామిలీ కథలను అందించే దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. నవంబర్లోనే ప్రారంభమైన ఈ చిత్రం దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్న ఇద్దరి పేర్లు ‘చిత్రా’, ‘లహరి’ అని సమాచారం. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయనున్నారట చిత్రబృందం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. -
రెట్రో బర్త్‌డే పార్టీ
ప్రతి బర్త్‌డేకి మనం కొంచెం ముందుకెళ్తుంటాం. అంటే వయస్సులో. కానీ ఈ బర్త్‌డేకి రాశీఖన్నా వెనక్కి వెళ్లారు. ఒక సంవత్సరం తగ్గిపోయిందా? అంటే కాదు.. ఏకంగా 20, 30 ఏళ్లు వెనక్కి. ప్రతి బర్త్‌డేని ఒక థీమ్‌తో సెలబ్రేట్ చేసుకుంటారు రాశీ. ఈ ఏడాది పార్టీ థీమ్ రెట్రో. అంటే పాత కాలంలో ఎలా ఉండేదో అలా అన్నట్టు. పాత క్యాసెట్లు, టెలిఫోన్, టీవీలు డెకరేట్ చేసి పార్టీ చేసుకున్నారామె. గురువారం రాశీ ఖన్నా బర్త్‌డే. ప్రతి సంవత్సరం స్కూల్ ఫ్రెండ్స్ నుంచి, ప్రస్తుతం ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌తో సహా అందర్నీ ఆహ్వానించి సెలబ్రేట్ చేసుకుంటారు. మొన్న జరిగిన రాశీ బర్త్‌డే పార్టీలో కొన్ని ఫోటోలు. ఈ పార్టీలో రకుల్, మంచు లక్ష్మీ, రామ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, విద్యుల్లేఖా రామన్ తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్త యాంగిల్
‘‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘చిత్రలహరి’ సినిమా రూపొందుతోంది. ‘హలో’ ఫేమ్ కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తున్నారు. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘చిత్రలహరి’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ ఇవ్వగా, సాయిధరమ్ తేజ్ తల్లి విజయ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) మాట్లాడుతూ– ‘‘రామ్‌చరణ్‌తో ‘రంగస్థలం’ తర్వాత మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధరమ్ తేజ్‌తో మా బ్యానర్లో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. హార్ట్ టచిం గ్, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను చక్కగా తెరకెక్కించడంలో కిషోర్ బెస్ట్. అన్ని అంశాలతో తేజ్‌ను సరికొత్త యాంగిల్లో చూపించనున్నాం. నవంబర్ మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సి.ఇ.వో/ సి.ఒ.ఐ: పి.చిరంజీవి, లైన్‌ప్రొడ్యూసర్: కె.వి.వి.బాల సుబ్రమణ్యం. -
పోస్టర్లో పేరులా నిర్మాత మిగిలిపోకూడదు
నిర్మాతకు ఫ్రీడమ్ లేదంటుంటారు. అసలు ఫ్రీడమే నిర్మాతది కదా. అతనికి ఫ్రీడమ్ ఇవ్వడం ఏంటి? ఓ మంచి సినిమా తీయడం కోసం కావాల్సినవన్నీ తను సమకూర్చుకోగలగాలి. తన టేస్ట్‌కి తగ్గట్టుగా సినిమా తీయించుకోవాలి’’ అని కేయస్ రామారావు అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తేజ్ ఐలవ్ యు’. క్రియేటీవ్ కమర్షియల్ బ్యానర్‌పై కేయస్ రామారావు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేయస్ రామారావు పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘తేజ్ ఐ లవ్యూ’ మా బ్యానర్లో వస్తున్న 45వ సినిమా. ఇప్పటివరకూ మా బ్యానర్లో నిర్మించిన మంచి చిత్రాల్లో ఇది మరో మంచి చిత్రం. లవ్, ఎమోషన్స్, మంచి ఫీల్‌తో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్. గోపీసుందర్ సంగీతం, కరుణాకరన్ టేకింగ్ స్టైల్, ఆండ్రూ అందమైన ఫొటోగ్రఫీ, సాయి ధరమ్– అనుపమ పెయిర్ మా సినిమాకు ప్లస్. ► నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 6 దశాబ్దాలు అవుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉంటున్నప్పటి నుంచి కథలు వినడం, చదవడం అలవాటైంది. అది మా బ్యానర్లో నిర్మించిన చిత్రాల కథల సెలెక్షన్‌కి ఉపయోగపడింది. మొదట్లో సినిమాలకు రేడియోల ద్వారా పబ్లిసిటీ చేసేవాణ్ణి. అప్పట్లో అందరూ నన్ను రేడియో రామారావు, పబ్లిసిటీ రామారావు అని కూడా పిలిచేవాళ్లు. డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను అంత క్యాపబుల్ కాదేమో అనుకుంటాను. అప్పట్లో సౌందర్యకు ఓ కథ కూడా చెప్పాను. ► నిర్మాతలు రెండు రకాలు ఉంటారు. కేవలం పోస్టర్ మీద పేరులా ఉండేవాళ్లు ఒక రకం. మంచి కంటెంట్‌తో సినిమా తీద్దాం. మన బ్యానర్ పేరు గుర్తుండిపోయేలా సినిమా తీయాలని అనుకునేవాళ్లు మరో రకం. నిర్మాతలు అనే వాళ్లు కేవలం కాంబినేషన్ సెట్ చేసేవాళ్లు కాదు. ► కొత్త నిర్మాతలు వస్తున్నారు.. వెళ్లిపోతున్నారు అనడం కరెక్ట్ కాదు. ‘రంగస్థలం’ తీసింది కొత్తవాళ్లే. ‘బాహుబలి’ తీసింది కూడా కొత్తవాళ్లే కదా. కొత్త పాత అని ఉండదు. ఎంత ఇష్టంతో నిర్మాత సినిమా తీశారన్నది ముఖ్యం. ► రచయిత యండమూరితో మళ్లీ అసోసియేట్ అవ్వడం లేదా? అని అడుగుతున్నారు. ఆయన నవలలు రాయడం తగ్గించాడు. నేను సినిమాలు తీయడం తగ్గించాను కదా (నవ్వుతూ). ► రామ్ చరణ్ ఫస్ట్ సినిమా నుంచి ఆయన నెక్ట్స్ సినిమా తీయాలనే అనుకున్నాను. ఎవ్వరైనా అనుకుంటారు. చిరంజీవిగారితో కూడా మళ్లీ ఓ సినిమా తీయాలనుంది. ఛాన్స్ ఉంటే చరణ్ కంటే ముందే చిరంజీవిగారితో సినిమా తీయాలనుంది. చిరంజీవిగారితో దాదాపు నాలుగు దశాబ్దాల పరిచయం ఉంది. ఆయనకు, నాకు మధ్యలో కొన్ని డిస్ట్రబెన్స్ వచ్చినా ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆ పేజీని మేమిద్దరం ఎప్పుడో తిప్పేశాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇండస్ట్రీలో డిస్ట్రబెన్సెస్ జరుగుతుంటాయి. కానీ అనవసరమైన వాటిని అవసరమైన దానికంటే ఎక్కువ చూపించకూడదని నా ఉద్దేశం. ► మా బ్యానర్లో నెక్ట్స్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ విపరీతంగా పెరిగింది. మంచి కంటెంట్‌తో సినిమా తీయాలని దర్శకులందరిలో పోటీ వాతావరణం ఉంది. ఇది మంచి పరిణామం. -
నీట్ అండ్ క్లీన్ మూవీ
‘‘క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్లో 35 సంవత్సరాల క్రితం నుంచి సినిమాలు తీస్తున్నా. మా సంస్థ నుంచి ఇప్పటివరకు 44 సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు తీస్తున్న ‘తేజ్’ 45వ సినిమా. ఇంకా వైవిధ్యమైన మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాలని ఆరాట పడుతున్నా. నా చివరి శ్వాస వరకూ సినిమాలు తీస్తూనే ఉంటా’’ అని నిర్మాత కె.ఎస్. రామారావు అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యు’ అన్నది ఉపశీర్షిక. కె.ఎస్. రామారావు, వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘మంచి లవ్, ఫ్యామిలీ డ్రామా ఇది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, సెన్సార్ కట్స్కి వీలు లేకుండా నీట్‌గా, క్లీన్‌గా సెంటిమెంట్, ఎమోషన్స్‌ని కలగలిపి కరుణాకరన్ అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఎంత పెద్ద హీరో అయినా కరుణాకరన్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారని నా నమ్మకం. అలాంటి ఆయనతో ‘వాసు’ చిత్రం తర్వాత నేను రెండో సినిమా ‘తేజ్’ తీశా. ఈ చిత్రంలోని మొదటి పాటని క్రికెట్ మ్యాచ్ ద్వారా రేపు రిలీజ్ చేస్తున్నాం. 9న పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ బేనర్లో ఇంత మంచి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. క్యూట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘తేజ్’ చిత్రం అందరికీ నచ్చుతుంది. తేజ్, అనుపమ సూపర్బ్‌గా చేశారు’’ అన్నారు కరుణాకరన్. -
హలో గురు
వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘గురు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు రితికా సింగ్. రియల్ లైఫ్‌లో బాక్సర్ అయిన ఈ ముంబై బ్యూటీ రీల్ లైఫ్‌లోనూ బాక్సర్‌గా అలరించారు. లారెన్స్ హీరోగా వచ్చిన ‘శివలింగా’ చిత్రంతో తమిళ ప్రేక్షకులనూ ఆకట్టుకున్న రితికా తాజాగా ఓ తమిళ చిత్రంతో పాటు తెలుగు సినిమా చేస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా హరినా«ద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నీవెవరో’ చిత్రంలో రితికా ఓ కథానాయిక. తాజాగా ఆమె సాయిధరమ్ తేజ్ సరసన నటించే క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నారని అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు చోటుండగా ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్‌ని ఓ హీరోయిన్గా ఎంచుకున్నారు. రెండో కథానాయికగా అనుపమా పరమేశ్వరన్ తీసుకున్నారనే వార్తలొచ్చాయి. తాజాగా ఆ అవకాశం రితికా సింగ్‌కి దక్కినట్లు భోగట్టా. ఆ పాత్రకు రితికా అయితే సరిగ్గా సరిపోతారన్నది చిత్రబృందం ఆలోచనట మరి.. ఈ ముంబై బ్యూటీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. -
మంచి ఫీల్
‘తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్’ వంటి రొమాంటిక్ చిత్రాలను అందించిన ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యు’ అన్నది ఉపశీర్షిక. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. మంచి లవ్ ఫీల్‌తో సాగుతుంది. ప్యారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతోంది. జూన్ 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: అండ్రూ.ఐ, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, సహనిర్మాత: వల్లభ. -
తేజ్... నిన్ను ప్రేమిస్తున్నా
‘‘నేను, మా డైరెక్టర్ ‘తేజ్’ పూర్తి సినిమాని ఆడిటోరియంలో చూశాం. సాయిధరమ్ తేజ్ పాత్ర, నటించిన విధానం నాకు కొత్తగా, సర్ప్రైజింగ్గా అనిపించింది. మంచి టైమింగ్‌తో ఎంటర్టైనింగ్గా గొప్పగా నటించాడు. ఫుల్‌టైమ్ లవ్‌స్టోరీలో తను నటించడం ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటున్నా’’ అని నిర్మాత కె.ఎస్.రామారావు అన్నారు. సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రానికి ‘తేజ్’ టైటిల్ ప్రకటించారు. ‘ఐ లవ్ యు’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ–‘‘తేజ్ తన పాత్రలో జీవించాడు. అనుపమా ఎంత మంచి నటో తెలిసిందే. ఇద్దరూ పోటీపడి నటించారు. ప్రేమ, ఎంటర్టైన్మెంట్తో పాటు భావోద్వేగాలతో కుటుంబమంతా కలిసి చూసేలా తెరకెక్కించిన ందుకు కరుణాకరన్‌కు కృతజ్ఞతలు. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలు తీయడానికి ప్యారిస్ వెళుతున్నాం. మేలో రీ–రికార్డింగ్ చేసి, అతి త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందంగా, గ్రాండ్‌గా వచ్చింది. రామారావు సార్ మేకింగ్‌లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. చాలా సంతోషంగా ఉంది. ‘తేజ్’ గురించి మేం చెప్పడం కంటే సినిమా చూశాక మీరు (ప్రేక్షకులు) చెబితే బాగుంటుంది’’ అన్నారు కరుణాకరన్. ‘‘డార్లింగ్’ సినిమా తర్వాత కరుణాకరన్‌గారు నాకు మళ్లీ ఈ సినిమాలో అవకాశం ఇచ్చి, మంచి డైలాగ్స్ రాయించారు. ఈ సినిమా కూడా ‘తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ’ సినిమాల్లా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు రచయిత ‘డార్లింగ్’ స్వామి. ఈ చిత్రానికి కెమెరా: ఆండ్రూ ఐ., సంగీతం: గోపీసుందర్, సహ నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ. -
చిత్రలహరిలో జతగా..
క్లాస్ అండ్ మాస్... సినిమా ఏదైనా ప్రతి సినిమాకు నటనలో వైవిధ్యం చూపిస్తూ ముందుకెళ్తున్నారు హీరో సాయిధరమ్ తేజ్. ఫీల్‌గుడ్ మూవీస్‌ను తెరకెక్కించే దర్శకుల్లో ముందుంటారు కిశోర్ తిరుమల. పర్టిక్యులర్‌గా ఇప్పుడు వీరిద్దరి గురించే ఎందుకు చెబుతున్నామంటే.. యస్.. మీ ఊహ నిజమే. సాయిధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందనుందని సమాచారం. ఇందులో మేఘా ఆకాశ్‌ను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారమ్. ఈ చిత్రానికి ‘చిత్రలహరి’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమా జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ హీరోగా ఓ సినిమా రూపొందు తోంది. కేయస్ రామారావు నిర్మి స్తోన్న ఈ చిత్రంలో అనుపమ హీరోయిన్. -
దేవుడు వరమందిస్తే..
ఫేమస్ పాటల పల్లవితో మూవీ టైటిల్‌ను ఎంపిక చేసుకున్న కుర్రహీరోల జాబితాలో తాజాగా సాయిధరమ్ తేజ్ కూడా చేరబోతున్నారని టాక్. సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. ఈ చిత్రానికి ‘దేవుడు వరమందిస్తే...’ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నారని సమాచారం. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘6టీన్స్’ చిత్రంలోని ‘దేవుడు వరమందిస్తే.. నే నిన్నే కోరుకుంటాలే’ పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఆల్రెడీ హీరో రామ్ చిత్రానికి ‘హలో గురు ప్రేమకోసమే..’ అని, శర్వానంద్ చిత్రానికి ‘పడి పడి లేచె మనసు’ అనే టైటిల్స్‌ను ఖరారు చేశారు. -
విన్నర్ కాంబినేషన్ రిపీట్
హీరో సాయిధరమ్ తేజ్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నుంచి స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్– జె.పుల్లారావు మాట్లాడుతూ ‘‘సాయి ధరమ్ తేజ్, గోపీచంద్ కాంబినేషన్లో సినిమా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఒక కొత్త జోనర్లో ఈ సినిమా ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌ను ధరమ్ తేజ్ ఇదివరకు చేయలేదు. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. -
ఇద్దరం కలిసి సక్సెస్‌మీట్ పెడతాం
‘‘రీమిక్స్ సాంగ్స్ కావాలని నేనెప్పుడూ అడగలేదు. అది డైరెక్టర్స్ ఛాయిస్. ఆ రీమిక్స్‌కి నా బెస్ట్ ఇవ్వటానికి కృషి చేస్తాను. నాలుగు రీమిక్స్ సాంగ్స్‌ను ఎంజాయ్ చేస్తూ, బాధ్యతగా చేశాను’’ అన్నారు సాయిధరమ్ తేజ్. వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఎప్పుడూ ట్రై చేయడు. ఫ్రెండ్స్, పేరెంట్స్ వల్ల కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చే ప్రాసెస్‌లో ఎంత ఇంటిలిజెంట్‌గా బిహేవ్ చేసి, తన వాళ్లను కాపాడుకుంటాడనే పాయింట్‌తో నా క్యారెక్టర్ని బిల్డ్ చేశారు.మనకి హెల్ప్ చేసినవాళ్లను ఎప్పుడూ మరచిపోకూడదు. వాళ్లకు అవసరం వచ్చినప్పుడు మనం వాళ్లకు ఉండాలనే మెసేజ్ ఉంది. ► ఫస్ట్ టైమ్ ఫుల్ లñ ంగ్త్ కమర్షియల్ మూవీ చేశా. కొత్తగా అనిపించింది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ప్రతి సినిమా బ్రేక్ ఇస్తుందనే చేస్తాం. అన్ని సినిమాలకూ ఒకేలా కష్టపడతాం. ► వినాయక్‌గారు ఏం చెప్పినా చేసేస్తాం. ఆయన అడిగే విధానం అంత బావుంటుంది. అంత కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు మన దృష్టి మొత్తం మన డైలాగ్స్ మీద, మన షాట్స్ మీద పెట్టుకొని ఇంకా బాగా వర్క్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్‌తో చేస్తే ఇలా ఉంటుందా? అనిపించింది. నాలో మా ఇద్దరి మావయ్యలు కనిపిస్తారని, వినాయక్‌గారు దాన్ని బెస్ట్‌గా యుటిలైజ్ చేసుకొని ఆడియన్స్‌కు ఇవ్వాలనుకున్నారు. ఆకుల శివగారు రాసిన కథకు ఆయన స్టైల్లో స్క్రీన్‌ప్లే రాశారు. నేనెంత ఇంటెలిజెంట్ అంటే ఒక 60 పర్సెంట్ అనుకుంటున్నాను. కానీ నా గురువులందరూ ఇంటెలిజెంట్సే. ► నా లాస్ట్ సినిమాల్లో చేసిన తప్పులు ఎనలైజ్ చేసుకుంటున్నాను. డైరెక్టర్స్ అనుకున్నట్టుగానే తీశారు కానీ ఆడియన్స్ ఆశించింది ఇవ్వలేకపోయాం. అది ఎవ్వరి తప్పు కాదు. సినిమా అంటేనే కలñ క్టివ్ ఎఫర్ట్. ఎవర్నీ బ్లేమ్ చేయడానికి లేదు. ► వరుణ్, నేను ఒకేసారి రావాలనుకోలేదు. అది తెలియకుండా జరిగింది. ఇద్దరం కూర్చుని డిస్కస్ చేశాం. కానీ ప్రొడ్యూసర్స్ ఇష్యూ కదా అని చేతులు ఎత్తేశాం. కానీ నాకనిపించింది ఇద్దరం ఒకేసారి హిట్ కొడితే ఆ కిక్కే వేరని. మా మెగా హీరోస్ ఇంతమంది అయ్యేసరికి ఇలా రిలీజ్ డేట్ ఇష్యూ అవుతోంది అంటే.. మాకు ఇదో టెస్ట్ అనుకుంటాను. ప్రేక్షకులకు రెండు సినిమాలు నచ్చుతాయని ఆశిస్తున్నాను. మా సినిమాలు హిట్ అయ్యాక వరుణ్, నేను కలిసి సక్సెస్ మీట్ పెడతాం. ⇒ మీ స్పెషల్ ఫ్రెండ్ రెజీనా ఈ మధ్య ఓ యంగ్ హీరోతో లవ్‌లో పడి, కెరీర్ పాడు చేసుకున్నా అన్నారు. మీ ఒపీనియన్? ► క్లోజ్ ఫ్రెండే.. కాదనడంలేదు. కానీ తన పర్సనల్ విషయాల గురించి నేను కామెంట్ చేయదలచుకోలేదు. -
ఆ అన్నదమ్ములిద్దరూ కలిస్తే తేజ్
‘‘తేజూతో ‘చమకు చమకు..’ సాంగ్ చేసేటప్పుడు చిరంజీవి గారే గుర్తుకొచ్చారు. రెండు మూడు సీన్స్‌లో పవన్‌కల్యాణ్‌లా తేజు కనపడేలా తీశాం. ఎందుకంటే చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గారు కలిస్తే ఎలా ఉంటుందో తేజు స్టైల్ అలా ఉంటుంది’’ అన్నారు వీవీ వినాయక్. సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వినాయక్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఈ నెల 9న విడుదలవుతోంది. రాజమండ్రిలో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో వినాయక్ మాట్లాడుతూ– ‘‘మెగా ఫ్యామిలీలోని కష్టపడే తత్వం తేజులోనూ ఉంది. తేజు కూడా చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్ అంత పెద్ద స్టార్ కావాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పట్నుంచి పెద్ద డైరెక్టర్ని అవుతానని నమ్మినవారిలో సి.కల్యాణ్ అన్నయ్య ఒకరు. ఆయన రామానాయుడిగారిలా వంద సినిమాలు తీస్తారు. ఆ జర్నీలో నేనూ ఉంటాను. మాతోపాటు విడుదలవుతున్న ‘తొలి ప్రేమ’, ‘గాయత్రి’ సినిమాలు పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘అత్తకి యముడు అమ్మాయికి మొగుడు’ సినిమా వంద రోజుల ఫంక్షన్ తర్వాత ఆ రేంజ్లో గ్రాండ్‌గా జరుగుతున్న ఫంక్షన్ ‘ఇంటిలిజెంట్’. నాకెంతో ఇష్టమైన డైరెక్టర్ వినాయక్‌గారు. ఇంత మంచి సినిమా చేసే చాన్స్ ఇచ్చారు. ప్రేక్షకులకు, మెగా ఫ్యాన్స్‌కు ఈ సినిమా గుర్తుండిపోయేలా ఉంటుంది. మెగాస్టార్, పవర్‌స్టార్, మెగాపవర్‌స్టార్, స్టైలిష్ స్టార్, వరుణ్.. నాకు పంచభూతాలు. చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గారు, నాగబాబుగారు నాకు గురువులు. వారు లేకుండా ఈ స్టేజ్‌పై నేను లేను’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు తేజ్ చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. వినాయక్ సినిమాను ఇరగదీశారు. పాటలు చూస్తుంటే చిరంజీవిగారి సాంగ్స్ చూస్తున్నట్లుంటుంది. ఓ దర్శకుడు కారు దిగగానే సింహం, పులి, ఏనుగులా గంభీరంగా అనిపించేవారిలో దాసరిగారు ఒకరు. ఆయన తర్వాత అలా అనిపించే దర్శకుడు వినాయక్ మాత్రమే’’ అన్నారు సి.కల్యాణ్. -
ఆయన ఎప్పుడు పిలిచినా కాదనను – ప్రభాస్
సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సీకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘లెట్స్ డు’ను హీరో ప్రభాస్ ఆదివారం రిలీజ్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘సాంగ్ లాంచ్ చేయాలని వినాయక్‌గారు మొహమాటపడుతూ పిలిచారు. ఆయన ఒక్క మెసేజ్ చేసి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తా. ఆయన ఎప్పుడు పిలిచినా కాదనను. వినాయక్‌గారితో సినిమా చేయడం లక్కీ అని తేజ్‌కు చెప్పాను. చిరంజీవిగారు చేసిన ‘చమకు.. చమకు..’ నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్. ఈ సాంగ్‌ను తేజ్ ఎలా చేశాడో చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ‘‘ప్రభాస్ అంటే స్నేహానికి నిలువెత్తు రూపం. ప్రభాస్ లాంటి మనిషి ఇండస్ట్రీలో ఉండటం అరుదు. సినిమాలో తేజ్ ఇరగదీశాడు’’ అన్నారు దర్శకుడు వినాయక్. ‘‘ప్రభాస్ అన్నను ఫ్యామిలీ మెంబర్లా ఫీలవుతాం. సాంగ్‌ను రిలీజ్ చేసిన ప్రభాస్ అన్నకు థ్యాంక్స్’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. -
నాన్నగారి కోరిక నెరవేరింది
‘‘మా నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు. సి.కల్యాణ్‌గారి సంస్థలో ఓ సినిమా చేయమని. ‘ఇంటిలిజెంట్’ చిత్రంతో మా నాన్నగారి కోరిక నెరవేరింది. కల్యాణ్‌గారు నిర్మాతలా కాకుండా మా అన్నయ్యలాగా అనిపించారు. సెట్లో ఇద్దరు అన్నదమ్ములం ఉన్నట్టు అనిపించింది’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. సాయిధరమ్ తేజ్, లావణ్యా త్రిపాఠి జంటగా వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినాయక్ మాట్లాడుతూ– ‘‘కృష్ణ’ సినిమాలాగా ఈ చిత్రంలోనూ అన్ని అంశాలుంటాయి. తేజ్ బాగా చేశాడు. తను ఎంత ఎదిగినా అన్నయ్యలాగా(చిరంజీవి) ఇలాగే ఉండాలి. ‘కొండవీటి దొంగ’ సినిమాలోని ‘చమక్కు చమక్కు’ పాటను రీమిక్స్ చేశాం’’ అన్నారు. ‘‘మా సినిమా ఏ చిత్రానికీ పోటీ కాదు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్’ కుటుంబ ప్రేక్షకులకూ నచ్చుతుంది. సినిమా చూశా. చాలా బాగా నచ్చింది’’ అన్నారు సి.కల్యాణ్. ‘‘మావయ్యతో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా తర్వాత వినాయక్‌గారు నాతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం. డబ్బింగ్లో కొన్ని సీన్లు చూసి ఇవి చేసింది నేనేనా? అని షాక్ అయ్యాను. మా సినిమాతో పాటు వస్తున్న వరుణ్‌తేజ్ ‘తొలిప్రేమ’ సినిమా కూడా హిట్ కావాలి’’ అన్నారు సాయిధరమ్ తేజ్. లావణ్యా త్రిపాఠి, నటుడు సప్తగిరి, కథ, మాటల రచయిత శివ ఆకుల తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్, సంగీతం: తమన్, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా. -
ఊరంతా అనుకుంటున్నారు
‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్రంతో ప్రేక్షకులకు నవ్వులు పంచడంతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నవీన్ విజయ్‌కృష్ణ. ప్రస్తుతం తండ్రి నరేష్‌తో కలిసి ‘విఠలాచార్య’ సినిమాలో నటిస్తున్న నవీన్ పుట్టినరోజును(మంగళవారం) పురస్కరించుకొని మూడో సినిమా ప్రకటించారు. బాలాజీ సనాల దర్శకత్వంలో రోవస్కైర్ ఎంటర్టైన్మెంట్స్–యు–ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి– ఎ.పద్మనాభరెడ్డి నిర్మించనున్న ఈ సినిమాకి ‘ఊరంతా అనుకుంటున్నారు’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను నవీన్ విజయ్‌కృష్ణ మిత్రుడు హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు. ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కీలకపాత్ర పోషించనున్నారు. ఈ నెల 22 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. మేఘా చౌదరి, సోఫియా సింగ్, జయసుధ, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ, కెమెరా: జి.లింగబాబు, లైన్ ప్రొడ్యూసర్: శ్రీరమ్య గోగుల. -
మేకింగ్ ఆఫ్ మూవీ - జవాన్
-
ఓటమి వల్లే గెలుపు
‘‘జవాన్’ టైటిల్ వినగానే మిలటరీ నేపథ్యంలో సినిమా ఉంటుందేమో అనుకుంటారు. ఈ సినిమాలో ఆర్మీని టచ్ చేయలేదు. సామాజిక బాధ్యత అనేది మెయిన్ పాయింట్’’ అని సాయిధరమ్‌తేజ్ అన్నారు. సాయిధరమ్, మెహరీన్ జంటగా బి.వి.ఎస్. రవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన ‘జవాన్’ ఈ రోజు విడుదలవుతోన్న సందర్భంగా తేజ్ పంచుకున్న విశేషాలు... ► ‘జవాన్’ కథ విన్న వెంటనే ఓకే చెప్పేశా. ఇందులో నేను చేసిన జై పాత్ర నా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుంది. హుద్‌హుద్ తుపాను, చెన్నైలో వరదలు, నిజాంపేటలో వర్షపు నీరొచ్చినప్పుడు సామాజిక బాధ్యతగా ఎలా స్పందించానో సినిమాలో నా పాత్ర అలానే ఉంటుంది. ► ప్రతి ఒక్కరూ మన ఇంట్లోని సమస్యలను ఎదుర్కోడానికి జవాన్లాగా నిలబడతాం. దాన్ని బేస్ చేసుకుని సినిమా తీశాం. జవాన్ అంటే అందరూ ఆర్మీ అనుకుంటారు. కానీ, సమస్యల్ని ఎదుర్కొనే మనమందరమూ జవాన్లమే అని రవిగారు చక్కగా చెప్పారు. ► సినిమా బాగా రాకపోవడంతో రీషూట్స్ జరిగాయనీ.. నిర్మాతలు హ్యాపీగా లేరనీ.. కొరటాల శివగారు స్క్రిప్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యారన్నది అవాస్తవం. రవిగారు–కొరటాలగారు బెస్ట్ ఫ్రెండ్స్. వారి మధ్య మా సినిమా డిస్కషన్స్ వచ్చినప్పుడు కొరటాలగారు సలహా ఇచ్చారంతే. ► ఈ ఏడాది మార్చి 31న షూటింగ్ ప్రారంభించాం. సెప్టెంబర్ 1న విడుదల చేయాలనుకున్నాం. కానీ, ప్రతివారం వరుసగా సినిమాలు విడుదల ఉండటంతో ప్రేక్షకులు నా సినిమానే ఎందుకు చూడాలి? అనుకున్నా. నిర్మాతలకు డబ్బులు రావాలి. నాకు హిట్ కావాలి. మా చిత్రం ప్రేక్షకులకు బాగా చేరువ కావాలనే ఉద్దేశంతో షూటింగ్ మెల్లగా చేశాం. అందుకే రిలీజ్ లేట్ అయింది. ► హిట్టు, ఫ్లాప్‌లను ఎలా తీసుకుంటారనే ప్రశ్నకు బదులిస్తూ... రెండింటి గురించి పెద్దగా పట్టించుకోను. మన పని కరెక్ట్‌గా చేశామా? లేదా? అని ఆలోచిస్తా. సినిమా ఫ్లాప్ అయితే.. ఎక్కడ తప్పు జరిగింది? తెలుసుకుని తర్వాత సినిమాకి జాగ్రత్త పడతా. సక్సెస్, ఫెయిల్యూర్లను వేర్వేరుగా చూడను. అయినా ఓటమి వల్లే గెలుపు వస్తుంది. ► జనరల్‌గా నేను నవ్వుతూ ఉంటాను. కానీ, ఈ సినిమాలో నవ్వకూడదు. చాలా మెచ్యూర్డ్‌గా మసులుకోవాలి. అందుకు నేను మెంటల్‌గా ప్రిపేర్ అయ్యా. నా నుంచి ఇంత మంచి నటన రాబట్టుకున్న క్రెడిట్ మొత్తం రవిగారిదే. ► ‘విన్నర్’ సినిమా తర్వాత నేను అమ్మాయిల వెంటపడి టీజ్ చేసే సన్నివేశాలు, పాటలు చేయనని చెప్పేశా. ఈ సినిమాలో మెహరీన్‌ది నన్ను డామినేట్ చేసే పాత్ర. చాలా బాగా చేసింది. తమన్ చాలా మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. రాశీఖన్నాతో పాట పాడించాలనే ఐడియా తమన్‌దే. ► వినాయక్‌గారితో చేస్తోన్న సినిమా 60 శాతం పూర్తయింది. ఫిబ్రవరిలో రీలీజ్ అనుకుంటున్నాం. ఆ తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేస్తా. మరికొన్ని కథలు వింటున్నా. -
ఈ సినిమా కోసం క్లాసులకి వెళ్లా!
‘‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ విడుదలైన రెండో రోజే ‘జవాన్’కి సంతకం చేశా. అప్పటికి నాకసలు ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా తెలీదు. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే... ఇప్పటికీ నాకు ఈ కథ పూర్తిగా తెలీదు. రవిగారు నాపైన పెట్టుకున్న నమ్మకంతోనే ఈ చిత్రం ఒప్పుకున్నా. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. కచ్చితంగా హిట్ అవుతుంది’’ అని మెహరీన్ అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జవాన్’. ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మెహరీన్ మాట్లాడుతూ– ‘‘సినిమాలో నా పాత్ర పేర భార్గవి. పెయింటర్ని. వెరీ బబ్లీ గాళ్. నా గత సినిమాల్లో కంటే ఇందులో కొంచెం ఎక్కువ గ్లామరస్‌గా కనిపిస్తా. సాయిధరమ్ తేజ్ ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఈ సినిమాతో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. తను మంచి డ్యాన్సర్. నాకు పెద్దగా డ్యాన్స్ రాదు. అందుకని, ఈ సినిమా కోసం డ్యాన్స్ క్లాసులకి వెళ్లా. ప్రాక్టీస్ కోసం ఇక్కడ సినిమాలు చేసి, తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోవాలనుకోవడం లేదు. నా దృష్టిలో టాలీవుడ్, బాలీవుడ్ వేర్వేరు కాదు. తెలుగు సినిమా నాకు ఎప్పటికీ ఎక్కువే. ఇప్పుడు తెలుగు సినిమానే టాప్‌లో ఉంది. ప్రస్తుతానికి గోపీచంద్ 25వ సినిమా ఒక్కటే కమిట్ అయ్యా’’ అన్నారు. -
ఆడితే నా చుట్టూ పదిమంది... లేదంటే పదిమంది చుట్టూ నేను!
‘‘ఇప్పటివరకూ 70 సినిమాలకు పైగా రచయితగా పనిచేశా. ‘వాంటెడ్’తో దర్శకుడిగా మారా. ఆ సినిమాను అనుకున్నట్టుగా తీయలేకపోయా. ‘జవాన్’ విషయంలో నా తప్పుల్ని రిపీట్ కానివ్వలేదు. ఈసారి నాలోని రచయిత కన్నా దర్శకుడే ఎక్కువ డామినేట్ చేశాడు. సినిమా తప్పకుండా హిట్టవుతుందని చెప్పగలను’’ అని బీవీయస్ రవి అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా ఆయన దర్శకత్వంలో కృష్ణ నిర్మించిన సిన్మా ‘జవాన్’. ‘దిల్’ రాజు సమర్పకులు. వచ్చే నెల 1న విడుదలవుతోన్న ఈ సినిమా గురించి బీవీయస్ రవి మాట్లాడుతూ– ‘‘ప్రతి వ్యక్తికీ ఓ లక్ష్యం ఉంటుంది. అందరి ఉమ్మడి లక్ష్యం దేశం కావాలి. దేశం కోసం నీది, నాది అనే భావలను పక్కన పెట్టి అందరం ఒక్కటై మనం అనే భావనతో ముందుకు సాగాలి’ అనే థీమ్‌తో, సందేశంతో సినిమా తీశా. కథంతా డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) నేపథ్యంలో జరుగుతుంది. పోస్టర్లు, ట్రైలర్లలో కథేంటో చెప్పేశా. కథ రాశాక (సాయిధరమ్) తేజ్‌నే హీరోగా అనుకున్నా. సినిమాలో తేజ్ ఆర్ఎస్ఎస్ జవాన్‌గా కనిపిస్తాడు. ‘కష్టం తనదాకా వస్తే కదిలేవాడు మనిషి కాడు, కష్టం ఎక్కడుందో తెలుసుకుని వెళ్లేవాడు మనిషి’– అనేది తేజ్ క్యారెక్టరైజేషన్. తను చేసిన గత సినిమాల్లో పాత్రలకంటే విభిన్నమైన పాత్ర. యాక్టింగ్ పరంగా, లుక్స్ పరంగా కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. తేజ్ కెరీర్లో ‘జవాన్’ ఓ కీలక మలుపుగా నిలుస్తుందనే నమ్మకముంది. ఈ సినిమా నా కెరీర్‌కు చాలా ఇంపార్టెంట్. ఇది ఆడితే పదిమంది నాకు డబ్బులిచ్చి సినిమాలు తీయమంటారు. లేదంటే పది మంది చుట్టూ నేను తిరుగుతా. ఒక్కటి మాత్రం చెప్పగలను... భవిష్యత్తులోనూ విలువలతో కూడిన సినిమాలు తీయాలనుకుంటున్నా’’ అన్నారు. -
ట్రైలర్ చూస్తే సినిమా హిట్ అనిపిస్తోంది – సమంత
‘‘సినిమా ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన వ్యక్తి మహేంద్ర. బాలకృష్ణగారికి ‘మువ్వగోపాలుడు’, ఎన్టీఆర్‌కి ‘బృందావనం’ హిట్ అయినట్లే, ‘బాలకృష్ణుడు’ సినిమా నారా రోహిత్‌కి పెద్ద హిట్ అవ్వాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్’రాజు ట్రైలర్ లాంచ్ చేశారు. ఆడియో సీడీలను హీరోయిన్ సమంత విడుదల చేయగా, హీరో సాయిధరమ్ తేజ్ అందుకున్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘మహేంద్రగారు నిర్మించిన ఈ తొలి సినిమా పెద్ద సక్సెస్ కావాలి. పవన్ మల్లెల ఐదేళ్లుగా నాకు మంచి మిత్రుడు. ట్రైలర్ చూస్తే సినిమా పెద్ద హిట్ సాధిస్తుందనిపిస్తో్తంది’’ అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన సినిమాలు చేసిన నేను మంచి కథ కుదిరితే కమర్షియల్ మూవీ చేయాలనుకున్నా. ఆ టైమ్‌లో పవన్ మల్లెల ‘బాలకృష్ణుడు’ కథ చెప్పారు. నాకంటే సినిమా ఎక్కువగా మాట్లాడాలని కోరుకుంటున్నా. సినిమా కోసం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను. పవన్ నా వెనక పడి బరువు తగ్గమనేవాడు. నేను తగ్గానంటే ఆ క్రెడిట్ తనకే దక్కుతుంది. ఈ నెల 24న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి ఏం చేయాలని తిరుగుతున్నప్పుడు మహేంద్రతో స్నేహం కుదిరింది. ఎప్పుడూ తిప్పుతూ ఉండేవాడు. నాకు చిరాకు వచ్చి విజయవాడ వెళ్లిపోయా. సినిమా చేద్దామంటూ హైదరాబాద్‌కు పిలిపించి ‘బాలకృష్ణుడు’ చేయించాడు’’ అన్నారు పవన్ మల్లెల. దర్శకులు మారుతి, కల్యాణ్ కృష్ణ, హీరో నాగశౌర్య, హీరోయిన్ రాశీఖన్నా, నిర్మాత బెల్లంకొండ సురేష్, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నటులు ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
బంగారు... ఓ మంచి పెప్పీ సాంగ్
‘దేశభక్తి అనేది కిరీటం కాదు... కృతజ్ఞత’ అనే థీమ్‌తో తెరకెక్కిన సినిమా ‘జవాన్’. ఇంటికొక్కడు... అనేది ఉపశీర్షిక. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి బీవీఎస్ రవి దర్శకుడు. ఈ నెల 19న హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీవీఎస్ రవి మాట్లాడుతూ– ‘‘దేశానికి రక్షణగా జవానులు ఉంటారు. అలాగే, ప్రతి ఇంటికీ జవాన్ ఉండాలి, ఉంటాడు కూడా! దేశంలోని తన ఇంటినీ, ఇంట్లోవారినీ తన గుండెల్లో పెట్టుకుని బాధ్యతతో మా జవాన్ కాపాడుకుంటాడు. అందుకే, ‘కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది’ అని టీజర్లో చెప్పాం. అలాగే, ‘దేశభక్తి అనేది కిరీటం కాదు... కృతజ్ఞత’ డైలాగ్. ఇవి విన్నవాళ్లు ఫోనులు చేసి ‘మనసు పెట్టి రాశావ్’ అని ప్రశంసించారు. నిజంగానే ఈ డైలాగులు, కథను మనసుపెట్టి రాశాను. మనసుపెట్టి సినిమాను తీశాను. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్’’ అన్నారు. డిసెంబర్ 1న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రసమర్పకుడు ‘దిల్’ రాజు, నిర్మాత కృష్ణ తెలిపారు. ‘జవాన్’లో రాశీ ఖన్నా బంగారు: హీరోయిన్గా వరుస హిట్స్‌లో ఉన్న రాశీ ఖన్నా... సింగర్‌గానూ జోరు చూపిస్తున్నారు. ‘జోరు’తో సింగర్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశి.. రీసెంట్గా రెండు సినిమాల్లో పాటలు పాడారు. అయితే... రెండిటిలోనూ హీరోయిన్ ఆమె కాదు. నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’లో ఓ పాట పాడారు. శుక్రవారం ఆ ఆడియో విడుదలైంది. సాయిధరమ్ తేజ్ ‘జవాన్’లో పాడిన పాట త్వరలో విడుదల కానుంది. ‘‘జవాన్’లో మంచి పెప్పీ సాంగ్ పాడడం ఆనందంగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు బీవీఎస్ రవిలకు థ్యాంక్స్’’ అని రాశి ట్వీట్ చేశారు. ‘‘వాట్ ఎ టాలెంట్. ‘బంగారు...’ పాటకు రాశి వాయిస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఎప్పుడెప్పుడు ఈ పాట విడుదలవుతుందా? అని ఎదురుచూస్తున్నా’’ అని రాశికి తమన్ రిప్లై ఇచ్చారు. -
కథ కుదరాలంతే!
అవును... కథ కుదిరితే, అంతా కుదిరితే తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు రావడం కొత్తేమీ కాదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’, ‘ఊపిరి’ లాంటి సినిమాలు వచ్చాయి. త్వరలో నాగార్జున, నాని కలసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారు. ఈ లిస్ట్‌లో మహేశ్‌బాబు–సాయిధరమ్ తేజ్ చేరనున్నారని సమాచారం. ‘సీతమ్మ వాకిట్లో...’తో ఈ తరంలో మల్టీస్టారర్ మూవీస్‌కి నాంది పలికిన వెంకీ–మహేశ్ కథ కుదిరితే ఎవరి కాంబినేషన్లో చేయడానికైనా రెడీ అని పలు సందర్భాల్లో చెప్పారు. ఆల్రెడీ వెంకీ ఓ మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పైన వార్త చదివితే తెలుస్తుంది. రెండు రోజుల క్రితం నిర్మాత ‘దిల్’ రాజు మనవడు ఆరాన్ష్ బర్త్‌డే ఫంక్షన్‌కు కొందరు స్టార్స్ హాజరైన విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్లో సాయిధరమ్ తేజ్‌తో మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఓకేనా? అని మహేశ్‌బాబును వంశీపైడిపల్లి అడగ్గా... ‘‘కథ కుదరాలంతే. నేను రెడీనే’’ అన్నారట. ఇటు సాయిధరమ్ కూడా రెడీ అట. ఆల్రెడీ నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి ‘ఊపిరి’ వంటి మల్టీస్టారర్ హిట్ సినిమా తీశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ ఓ సినిమా చేయన్నారు. అంటే... అది మల్టీస్టారరా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
రక్షించేవాళ్లకు ఎందుకు భయపడాలి?
ప్రజల రక్షణ కోసమే ఉన్న పోలీసుల్ని చూసి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేసినోళ్లు భయపడాలి తప్ప సాధారణ ప్రజలు ఎందుకు భయపడాలి? అనే అంశాలను చర్చించడంతో పాటు ఓ అంతర్జాతీయ సమస్యను స్పృశిస్తూ... దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన సినిమా ‘నక్షత్రం’. సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యతారలుగా కె. శ్రీనివాసులు, వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టు 4న సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘పోలీస్ అవ్వాలని ప్రయత్నించే ఓ యువకుడి కథే ఈ సినిమా. హనుమంతుని శక్తియుక్తులు, సేవాభావం పోలీసుల్లో కనిపిస్తాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ఏదైనా సమస్యను చివరికి పరిష్కరించేది పోలీసే. మనం వాళ్లను చూసే దృక్పథం మారాలని ఈ సినిమాలో చెప్పా’’ అన్నారు. తులసి, జేడీ చక్రవర్తి, ప్రకాశ్‌రాజ్, శివాజీరాజా తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్, పద్మశ్రీ, కిరణ్ తటవర్తి, సంగీతం: భీమ్స్, భరత్, హరి గౌర. -
మరో మెగా హీరోతో వినాయక్
మాస్ సినిమాల దర్శకుడు వినాయక్, ఖైదీ నంబర్ 150 సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అల్లుడు శీను, అఖిల్ సినిమాలు నిరాశపరచటంతో కష్టాల్లో పడ్డ వినాయక్, చిరు రీ ఎంట్రీ సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చాడు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న యంగ్ హీరోలకు మరోసారి వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక కలిగించాడు. అందుకే ఇప్పటికే సక్సెస్‌పుల్ హీరోలుగా ప్రూవ్ చేసుకున్న యంగ్ హీరోలు వినాయక్ డైరెక్షన్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దర్శకుడిగా సక్సెస్ అయిన తరువాత వినాయక్ ఎక్కువగా మెగా హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవితో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్లతోనూ సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన ఈ మాస్ డైరెక్టర్ ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్‌తో వినాయక్ సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మంచి ఫాంలో ఉన్న సాయి, వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్‌తో కలిసి సినిమా చేస్తే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నాడు. అందుకే త్వరలో వినాయక్ దర్వకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
'పవర్ స్టార్ అని అరవండయ్యా.. కమాన్'
'మీరంత ప్రేమగా అరుస్తుంటే నేను ఆపలేను బ్రదర్.. కంటిన్యూ.. చాలా రోజులైపోయింది ఇలాగ విని .. గట్టిగా ఒకసారి పవర్ స్టార్ అని అరవండయ్యా.. కమాన్' అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన 'తిక్క' సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ధరమ్ తేజ్.. మామ పవన్ మీదున్న అభిమానాన్ని ఉత్సాహంగా ప్రదర్శించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. మెగా హీరోలకు సంబంధించిన సినీ వేడుకలన్నిటిలో పవన్ ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ హాలును హోరెత్తించడం పవన్ ఫ్యాన్స్‌కి అలవాటే. ఇటీవలే 'సరైనోడు' సినిమాకి సంబంధించిన ఓ వేడుకలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. పవన్ ఫ్యాన్స్‌పై కాస్త అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ అని చెప్పమంటూ పవన్ ఫ్యాన్స్ అరిచిన అరుపులకు.. 'చెప్పను బ్రదర్' అంటూ బన్నీ చిరు కోపాన్ని ప్రదర్శించాడు. దాంతో 'చెప్పను బ్రదర్' అనే ట్యాగ్‌తో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. ఇక ఆ తర్వాత బన్నీ తగిన వివరణ కూడా ఇచ్చుకోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు ధరమ్ తేజ్ కొత్త సినిమా ఆడియో ఫంక్షన్లో కూడా పవన్ ఫ్యాన్స్ చేసే హడావుడిని 'ఆపలేను బ్రదర్' అంటూ ఫ్యాన్స్‌ను ఉత్తేజపరచడం, వారితో కలిసి పవర్ స్టార్ అంటూ బిగ్గరగా నినాదాలు చేయడం పవన్ కల్యాణ్ అభిమానులను మహదానందపరిచింది. మీరు ఎన్నిసార్లు అరవమన్నా అరుస్తూనే ఉంటాను.. పవర్ స్టార్, మెగా స్టార్, మెగా పవర్ స్టార్.. అంటూ ఈ యువ హీరో అభిమానుల మనసు దోచుకున్నాడు. ధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ 'ఆపలేను బ్రదర్' ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బన్నీ 'చెప్పను బ్రదర్'కి సరైన కౌంటర్ పడిందంటూ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కాగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'తిక్క' సినిమా ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘తిక్క’ ఆడియో రిలీజ్
-
ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యా
‘‘ఒక భయంతో తేజూ కెరీర్ మొదలుపెట్టాడు. ఇంత సక్సెస్ఫుల్ అయినా ఆ భయం అలాగే ఉంది. దాన్ని ఆలాగే పెట్టుకో తేజ్. ఆ భయం ఉన్నంతకాలం ఎప్పుడూ ఇలా కష్టపడుతూ ఉంటావ్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నీ ప్రతిభకి, కష్టపడే తత్వానికి ఇంకా ఎత్తుకు వెళ్తావ్. ఎన్ని తిక్కలకు ఓ లెక్క ఉంటుందో తెలీదు గానీ, ఈ తిక్కకు మాత్రం తప్పకుండా ఓ లెక్క ఉంటుందని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా నటీనటులుగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘తిక్క’. ఎస్.ఎస్.తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని వంశీ పైడిపల్లి ఆవిష్కరించి, సాయిధరమ్ తేజ్‌కి అందించారు. జానారెడ్డి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ - ‘‘చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఆశీర్వాదాలతోనే మీ అందరి (అభిమానులు) ప్రేమను పొందగలుగుతున్నాను. వాళ్లు లేకుండా నేను లేను. ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేకప్ ఉంటుంది. మనకు ఎప్పుడూ ఉండేది బ్రేకప్ (నవ్వుతూ) కాబట్టి ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ఎక్కడా రాజీ పడకుండా రోహిణ్ చిత్రాన్ని నిర్మించారు. సునీల్ బాగా తీశారు. తమన్ మంచి ఆల్బమ్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఫ్లాప్ దర్శకుణ్ణి అయినా నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన తేజూ, నిర్మాత రోహిణ్లకు థ్యాంక్స్’’ అని సునీల్ రెడ్డి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘చిన్నప్పట్నుంచి మెగా ఫ్యామిలీ అంటే అభిమానం. తేజూతో ఈ చిత్రం తీస్తుంటే నా బ్రదర్‌తో వర్క్ చేసినట్టు అనిపించింది. మా చిత్రంలో పాటలు పాడిన ధనుష్, శింబులకు థ్యాంక్స్. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆగస్టు 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్, మాగంటి గోపీనాథ్, కె.ఎస్.రామారావు, ‘దిల్’ రాజు, నందినీ రెడ్డి, తమన్ తదితరులతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. -
అప్పుడు విలన్, ఇప్పుడు ఫాదర్
లెజెండ్ సినిమాతో విలన్‌గా టర్న్ తీసుకున్న జగపతిబాబు, ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలలో యమా బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో విలన్, తండ్రి పాత్రలు చేస్తున్న ఈ మాజీ హీరో.., తమిళ, మలయాళ సినిమాల మీద కూడా దృష్టి పెట్టాడు. ఇప్పటికే లింగా సినిమాలో సూపర్ స్టార్‌కు విలన్‌గా నటించిన జగ్గుబాయ్, ఇప్పుడు విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ నటిస్తున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న పులిమురుగన్ సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇతర భాషల్లో బిజీ అవుతున్నా తెలుగు సినిమాలను మాత్రం బాగానే మ్యానేజ్ చేస్తున్నాడు. పిల్లానువ్వులేని జీవితం సినిమాలో సాయిధరమ్ తేజ్‌కు విలన్‌గా నటించిన జగపతిబాబు, నెక్ట్స్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సాయికి తండ్రిగా నటించడానికి అంగకీరించాడు జగపతిబాబు. -
రిస్క్ చేస్తున్న కళ్యాణ్‌రామ్
పటాస్ సినిమాతో చాలా కాలం తరువాత సక్సెస్ చూసిన కళ్యాణ్‌రామ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో భారీ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. పటాస్‌తో పాటు షూటింగ్ జరుపుకున్న షేర్ సినిమాను దసరా బరిలో దించడానికి రెడీ అవుతున్నాడు. ఇంత వరకు ప్రమోషన్ కూడా స్టార్ చేయని ఈ సినిమాను ఇంత షార్ట్ గ్యాప్‌లో రిలీజ్ చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే దసరా బరిలో మెగా హీరోలు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాను సెప్టెంబర్ 24న రిలీజ్ చేస్తున్నారు. ఆడియో రిలీజ్ కూడా అయిన ఈ సినిమా విజయంపై చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఈ సినిమా తరువాత వారం గ్యాప్‌లోనే మరో మెగా హీరో వరుణ్ కూడా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కిన 'కంచె' సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు వరుణ్. సుబ్రమణ్యం ఫర్ సేల్, కంచె సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుండగానే తన షేర్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. రుద్రమదేవి పోస్ట్ పోన్ కావటంతో ఖాళీ అయిన అక్టోబర్ 9న షేర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ప్రమోషన్ కూడా స్టార్ చేయని ఈ సినిమాను ఇంత భారీ కాంపిటిషన్ మధ్య రిలీజ్ చేయటం రిస్క్ అంటున్నారు ఫ్యాన్స్. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయిధరమ్ తేజ్
హైదరాబాద్: యువ హీరో సాయిధరమ్ తేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారి ఆశీస్సులు పొందారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన 'పిల్లా నువ్వులేని జీవితం' ఇటీవల విడుదలైంది. ఇదిలావుండగా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 7 కంపార్ట్మెంట్లు నిండాయి.