
అనుపమాపరమేశ్వరన్, సాయిధరమ్ తేజ్
‘తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్’ వంటి రొమాంటిక్ చిత్రాలను అందించిన ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యు’ అన్నది ఉపశీర్షిక. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. మంచి లవ్ ఫీల్‌తో సాగుతుంది. ప్యారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతోంది. జూన్ 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: అండ్రూ.ఐ, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, సహనిర్మాత: వల్లభ.
Comments
Please login to add a commentAdd a comment