KS RamaRAO
-
చేజింగ్.. చేజింగ్
విజయ్ దేవరకొండ ఎవర్నో చేజ్ (వెంబడించడం) చేస్తున్నారు. ఇంతMీ వాళ్లతో విజయ్‌కి పనేంటి? దాని వెనక ఉన్న కారణమేంటి? ఆ కథేంటి? తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాలి. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. కేయస్ రామారావు సమర్పణలో కేయస్ వల్లభ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసబెల్లే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సింగరేణి ఉద్యోగి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ కణల్ కణ్ణన్ ఆధ్వర్యంలో ఓ చేజింగ్ సీన్‌ని చిత్రీకరిస్తున్నారు. -
తెలుగువారికీ చూపించాలనిపించింది
‘‘తమిళ చిత్రం ‘కణ’ చూసి ఆశ్చర్యపోయా. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాలనుకున్నాం. అందుకే ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’గా రీమేక్ చేసి, తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం’’ అని నిర్మాత కేయస్ రామారావు అన్నారు. ఐశ్వర్యా రాజేష్, రాజేంద్ర ప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘సినిమా ఫస్ట్ కాపీ ఎప్పుడో సిద్ధమైంది. కానీ ఎక్కువమంది ఆడియన్స్‌కు రీచ్ కావాలని ఈ నెల 23న విడుదల చేస్తున్నాం. మన తెలుగు అమ్మాయి ఐశ్వర్యా రాజేష్ నటించిన క్రికెట్ బ్యాక్‌డ్రాప్ చిత్రం ఇది. తమిళంలో ఐదు పెద్ద సినిమాల మధ్య విడుదలై కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఇలాంటి ఒక మంచి కథకు భీమనేని శ్రీనివాసరావుగారైతే న్యాయం చేయగలరని దర్శకునిగా తీసుకున్నాం. ఆయన బాగా తీశారు. హనుమాన్ చౌదరి చాలా మంచి డైలాగ్స్ రాశారు. ఈ నెల 18న ప్రీ–రిలీజ్ వేడుక జరుపబోతున్నాం’’ అన్నారు. ‘‘ఏ సినిమా చేసినా ఒకే కమిట్మెంట్తో చేస్తాను. పెద్దా, చిన్నా అనే తేడాలు ఆలోచించకుండా కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదిరిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు భీమనేని. ‘‘నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన కేయస్ రామారావుగారికి థ్యాంక్స్. భీమనేనిగారితో ‘సుడిగాడు’ సినిమాకు వర్క్ చేశాను. అలాగే ‘కేజీఎఫ్’ తర్వాత నేను డైలాగ్స్ రాసిన చిత్రం ఇది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది’’ అన్నారు మాటల రచయిత హనుమాన్ చౌదరి. -
కొత్త కథల్ని ఆదరిస్తున్నారు
‘‘వైకుంఠపాళి’ చిత్ర నిర్మాత ఆదినారాయణకు సినిమాలంటే ప్యాషన్. ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. ఈ సినిమా టైటిల్, ట్రైలర్ కొత్తగా ఉన్నాయి. ప్రేక్షకులు కొత్త కథలను ఆదరిస్తోన్న ఈ తరుణంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు అన్నారు. సాయికేతన్, మేరి జంటగా అజ్గర్ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైకుంఠపాళి’. ఎస్‌కెఎమ్‌యల్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమా పాటలను కె.యస్. రామారావు విడుదల చేశారు. దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘వైకుంఠపాళి’ అందరికీ బాగా తెలిసిన ఆట. అలాంటి గేమ్‌తో హారర్ సినిమా చేయడం మంచి ఆలోచన. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోన్న ఈ సమయంలో ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు. ‘‘ఓ కొత్త పాయింట్‌తో తీసిన చిత్రమిది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఆదినారాయణగారిలాంటి నిర్మాతలు ఉంటే సినిమా విడుదల కోసం కష్టపడాల్సిన పనేలేదు’’ అన్నారు అజ్గర్ అలీ. ‘‘మంచి కథ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా థియేటర్స్ ఇస్తున్నారు. మా సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తి అయింది. త్వరలో సినిమాని విడుదల చేస్తున్నాం. మా బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 5గా హరీష్ కుమార్ ముక్కి దర్శకత్వంలో ‘మిస్టర్ లోన్లీ’ (‘వీడి చుట్టూ అమ్మాయిలే’ అన్నది ఉపశీర్షిక) షూటింగ్ త్వరలో ప్రారంభించబోతున్నాం’’ అన్నారు కాండ్రేగుల ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్ కొండేటి, సాయి వెంకట్, సంగీత దర్శకుడు ప్రమోద్, సాయి కేతన్, హీరోయిన్స్ ప్రియా వల్లభి, నీలమ్ నైనా తదితరులు పాల్గొన్నారు. ‘‘వైకుంఠపాళి’ చిత్ర నిర్మాత ఆదినారాయణకు సినిమాలంటే ప్యాషన్. ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. ఈ సినిమా టైటిల్, ట్రైలర్ కొత్తగా ఉన్నాయి. ప్రేక్షకులు కొత్త కథలను ఆదరిస్తోన్న ఈ తరుణంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు అన్నారు. సాయికేతన్, మేరి జంటగా అజ్గర్ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైకుంఠపాళి’. ఎస్‌కెఎమ్‌యల్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమా పాటలను కె.యస్. రామారావు విడుదల చేశారు. దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘వైకుంఠపాళి’ అందరికీ బాగా తెలిసిన ఆట. అలాంటి గేమ్‌తో హారర్ సినిమా చేయడం మంచి ఆలోచన. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోన్న ఈ సమయంలో ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు. ‘‘ఓ కొత్త పాయింట్‌తో తీసిన చిత్రమిది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఆదినారాయణగారిలాంటి నిర్మాతలు ఉంటే సినిమా విడుదల కోసం కష్టపడాల్సిన పనేలేదు’’ అన్నారు అజ్గర్ అలీ. ‘‘మంచి కథ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా థియేటర్స్ ఇస్తున్నారు. మా సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తి అయింది. త్వరలో సినిమాని విడుదల చేస్తున్నాం. మా బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 5గా హరీష్ కుమార్ ముక్కి దర్శకత్వంలో ‘మిస్టర్ లోన్లీ’ (‘వీడి చుట్టూ అమ్మాయిలే’ అన్నది ఉపశీర్షిక) షూటింగ్ త్వరలో ప్రారంభించబోతున్నాం’’ అన్నారు కాండ్రేగుల ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్ కొండేటి, సాయి వెంకట్, సంగీత దర్శకుడు ప్రమోద్, సాయి కేతన్, హీరోయిన్స్ ప్రియా వల్లభి, నీలమ్ నైనా తదితరులు పాల్గొన్నారు. -
అదే అంకిత భావంతో ఉన్నా
‘‘యాభై ఏళ్ల క్రితం నా మూవీ మేకింగ్ స్టైల్ ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. అలాగే పని జరగనప్పుడు వచ్చే కోపం కూడా అలానే ఉంది. కానీ పని విషయంలో మాత్రం అంకిత భావం తగ్గలేదు. టెక్నికల్‌గా చాలా అడ్వాన్డ్స్ స్టేజ్‌కి వచ్చాం. సినిమా క్వాలిటీ పెరగడంతో మంచి సినిమాలు రావడానికి అవకాశాలు ఎక్కువయ్యాయి’’ అని నిర్మాత కేఎస్ రామారావు అన్నారు. ఐశ్వర్యారాజేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’. తమిళంలో రూపొందిన ‘కనా’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. క్రియేటివ్ కమర్షియల్‌పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల రెండో వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కేఎస్. రామారావు చెప్పిన విశేషాలు. ► మా బ్యానర్లో రాబోతున్న మంచి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. తమిళంలో విడుదలైన ‘కనా’ సినిమాను చూశాను. ఈ చిత్రాన్ని ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు చూపించాలని ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్ చేశాం. తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన మంచి ఎమోషనల్ స్టోరీ. క్రికెట్ బేస్‌తో పాటు కంటెంట్ ఉన్న స్టోరీ. ఈ చిత్రం క్రికెట్ అభిమానులతోపాటు యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు భీమనేని తెరకెక్కించారు. ► ఒక సాధారణ రైతుబిడ్డగా పుట్టి ఇండియా క్రికెట్ టీమ్‌లో ఆడాలని కష్టపడే ఓ యువతి పాత్రలో ఐశ్వర్య నటించింది. ప్యారలల్‌గా రైతుసమస్యలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఐశ్వర్య రాజేష్ తండ్రి అమర్నాథ్ సీనియర్ హీరో. మన కమెడియన్ శ్రీలక్ష్మీ మేనకోడలు తను. వీరిద్దరి వారసత్వ నటన ఐశ్వర్యకు వచ్చింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారు అద్భుతమైన పాత్ర చేశారు. శివ కార్తికేయన్, ‘వెన్నెల’ కిశోర్, కార్తీక్‌రాజు క్యారెక్టర్స్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉంది. జూలై 2న ప్రీ–రిలీజ్ ఈవెంట్‌ను జరపబోతున్నాం. ఈ కార్యక్రమానికి విమెన్ టీమ్ ఇండియా కెప్టెన్‌గా చేసిన మిథాలీరాజ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొనున్నారు. ► పెద్దసినిమాలు చేస్తున్నప్పుడు ఎంత సంతృప్తిగా ఉంటానో ‘పుణ్యస్త్రీ, మాతృదేవోభవ, ముత్యమంత ముద్దు’ తీస్తున్నప్పుడూ అంతే సంతృప్తిగా ఫీలవుతాను. ఇవన్నీ కూడా సినిమాలపై ఇంకోవైపు నాకున్న ఇంట్రెస్ట్‌ను తెలియజేసే చిత్రాలు..‘కౌసల్య కృష్ణమూర్తి’ కూడా అలాంటిదే. -
టీయస్సార్ మీద బయోపిక్ తీయాలి
2010 నుంచి కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి టీవీ 9తో కలసి ‘టీయస్సార్ – టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ పేరుతో అవార్డ్ ఫంక్షన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2017–2018 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను వచ్చే నెల 17న విశాఖపట్టణంలో నిర్వహించనున్నారు. ఈ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌గా టీయస్సార్ వ్యవహరించనున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, కేయస్ రామారావు, నరేశ్, రఘురామ కృష్ణంరాజు, కామినేని శోభనా, జీవిత, నగ్మా, మీనా, జ్యూరీ సభ్యులు. అవార్డు వేడుక వివరాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్ మాట్లాడుతూ – ‘‘సినిమా పవర్ఫుల్ మీడియమ్. కోట్లాది మందిని ఆనందింపజేస్తుంది. కళాకారులని జనం అభిమానిస్తారు, ఆరాధిస్తారు. అలాగే మా అవార్డ్స్ ఫంక్షన్లో నిర్ణయం కూడా ప్రజలదే. వాళ్ల ఓటింగ్‌ని పరిగణించి జ్యూరీ సభ్యులు విజేతలను ప్రకటిస్తారు. కళాకారులు ఆనందం పొందితే నాకు కొత్త శక్తి వస్తుంది. విద్యాబాలన్‌కు శ్రీదేవి మెమోరియల్ అవార్డ్ అందిస్తాం’’ అన్నారు. ‘‘బ్రతికున్నంత కాలం అవార్డులు గెలవడానికి ప్రయత్నిస్తాం’ అని అక్కినేని నాగేశ్వరరావుగారు ఓసారి నాతో అన్నారు. కళాకారుల ఆకలి అలాంటిది. ఆ కళాకారుల ఆకలి తీరుస్తున్నారు సుబ్బరామిరెడ్డిగారు. శివుణ్ణి నటరాజు అంటాం. ఆయన్ను ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞాపించిందే చేస్తున్నారు టీయస్సార్‌గారు. ఈయన జీవితం ఆధారంగా బయోపిక్ తీయాలి’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ‘‘టీయస్సార్‌గారు నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఆయన నిర్మించిన ‘గ్యాంగ్మాష్టార్’ సినిమాలో యాక్ట్ చేశాను. మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు నగ్మా. ‘‘చలికి దుప్పట్లు, కళాకారులకు చప్పట్లు ముఖ్యం’’ అన్నారు నరేశ్. ‘‘నాన్నగారి అడుగు జాడల్లోనే నడుస్తున్నాను. కళాకారులను అభినందించడానికి ఎంతో శ్రమపడతారు నాన్న. నాన్నగారి ఆటోబయోగ్రఫీ రాయిస్తున్నాం. ‘టీచింగ్స్ ఆఫ్ టీయస్సార్’ పేరుతో ఆ బుక్ ఈ ఏడాది తీసుకొస్తాం’’ అన్నారు పింకీ రెడ్డి. ‘‘గవర్నమెంట్లు నంది అవార్డ్స్ ఫంక్షనే వరుసగా చేయలేకపోతున్న తరుణంలో టీయస్సార్ వరుసగా ఈ అవార్డ్ పంక్షన్స్ చేయడం అభినందనీయం’’ అన్నారు నిర్మాత కేయస్ రామారావు. ‘‘హైదరాబాద్ వచ్చి చాలా రోజులైంది. సంతోషంగా ఉంది. మమ్మల్ని జ్యూరీ సభ్యులుగా నియమించినందుకు మా బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తాం’’ అన్నారు మీనా. ఈ కార్యక్రమంలో కామినేని శోభన పాల్గొన్నారు. -
అందమైన అనుభవం
‘‘నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యేవాడినని కె.ఎస్.రామారావుగారు చెప్పడం శుద్ధ అబద్ధం. ఎందుకంటే.. నేను మాంటిస్సోరి స్కూల్లో చదువుకునే రోజుల్లో రామారావుగారు కె.ఎస్.ప్రకాశ్రావుగారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేవారు’’ అని నిర్మాత సి. అశ్వనీదత్ అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యు’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ చిత్రం గ్రాండ్ ప్రీ–రిలీజ్ వేడుకలో అశ్వనీదత్ మాట్లాడుతూ– ‘‘మా సూర్యారావు పేటలో ఆ రోజుల్లో రామారావుగారిని కలవడమంటే గ్లామర్‌గా ఫీలయ్యేవాళ్లం. ఆయన్ను చూసి గర్వపడతాం. ఇవాల్టికి కూడా ఆయన సినిమాల్లో ఉన్నంత మ్యూజిక్ మన సినిమాల్లో లేదేమో అని ఫీల్ అవుతుంటాను’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి సినిమాకి నేను తీసుకురాలేని ఇళయరాజాగారిని తీసుకొచ్చి సినిమాలు చేసి హిట్స్ కొట్టేసరికి రామారావుగారంటే చిన్న అసూయ ఉండేది. ఆయనతో సినిమాలు తీయడంలో పోటీ పడేవాణ్ని. ఈ మధ్య ఆయన సినిమాలు రెండు, మూడు సరిగ్గా ఆడలేదు. అంతా సవ్యంగానే ఉందా? అంటే.. ‘బాస్.. లాభమా నష్టమా? అని ఆలోచించను. నా దగ్గర ఆఖరి రూపాయి ఉన్నంత వరకు సినిమాల్లోనే పెడతాను.. సినిమాల్లోనే చనిపోతా’ అన్నారు. అది విని నా గుండె జల్లుమంది. రామారావుగారి అంతటి ప్యాషన్‌ను మళ్లీ అశ్వనీదత్గారిలోనే చూడాలి. ఇలా సినిమాలను ప్రేమిస్తున్న స్నేహితులు ఉండటం నా అదృష్టం. దశాబ్దాలు కొనసాగేంత డెడికేషన్ ఉన్న హీరో తేజు’’ అన్నారు. ‘‘నేను రేడియో పబ్లిసిటీ చేస్తున్న సమయంలో అశ్వనీదత్, అల్లు అరవింద్గారితో పరిచయం ఉంది. అంత గొప్ప నిర్మాతల స్థాయి కాకపోయినా వారితో ఈ వేదిక పంచుకునే స్థాయి రావడం నా అదృష్టం’’ అన్నారు కె.ఎస్.రామారావు. ‘‘నా కెరీర్లో ఓ ఇంపార్టెంట్ మూవీని కరుణాకరన్‌గారు డైరెక్ట్ చేస్తే కె.ఎస్.రామారావుగారు నిర్మించారు. ఇదొక బ్యూటీఫుల్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘తొలిప్రేమ’ నుంచి ఈ రోజు వరకు నేను చేసిన ఈ ప్రయాణంలో నా హీరోలు, నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారు లేకుంటే నేను లేను. తక్కువ సినిమాలే చేసినా పెద్ద నిర్మాతలతో చేశా. జాతీయ అవార్డు తీసుకున్నంత ఆనందంగా ఉంది’’ అన్నారు ఎ.కరుణాకరన్. -
రాసి పెట్టి ఉంటే వస్తాయి
‘‘నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది ‘శతమానం భవతి’ చిత్రంలోనే. మిగిలిన చిత్రాల్లో సగం క్యారెక్టర్, ఇద్దరు ముగ్గురు నాయికల్లో ఓ నాయికగా నటించాను. ‘తేజ్ ఐ లవ్ యు’లో నేను ఇంతకు ముందెన్నడూ చేయని పాత్ర చేశా’’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో కె.యస్. రామారావు నిర్మించిన ‘తేజ్ ఐ లవ్ యు’ ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు నందిని. రియల్ లైఫ్‌లో నేను మాటకారిని. నందిని పాత్ర కూడా మాటకారే. యుఎస్ నుంచి ఓ పర్పస్ కోసం హైదరాబాద్ వచ్చే పాత్ర. చాలా వేరియేషన్స్ ఉంటాయి. పాత్రను బట్టే నేను సినిమా ఎంచుకుంటా. కరుణాకరన్‌గారు హీరోయిన్లను చూపించే విధానం, ఆయన రూపుదిద్దే పాత్రలు చాలా ఇష్టం. సాంగ్స్ తీసేటప్పుడు తేజ్ ఫస్ట్ టేక్‌లోనే స్టెప్పులు చేసేసేవారు. నేను మాత్రం రిహార్సల్స్ చేసి చేసేదాన్ని. నేను తెలుగు నేర్చుకోవడానికి కారణం త్రివిక్రమ్‌గారు. ‘అఆ’ షూటింగ్లో నాకు ట్రాన్స్‌లేట్ చేసేవారు. రెండో సినిమాకు తెలుగు నేర్చుకోవాలని అప్పుడే అనిపించింది. ప్రస్తుతం కన్నడ సినిమా చేస్తున్నా. అందుకే కన్నడ నేర్చుకుంటున్నా. ‘రంగస్థలం’ సినిమా చూడగానే సుకుమార్‌గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ఆ పాత్రకి సమంత 101 పర్సెంట్ యాప్ట్ అనిపించింది. మన కోసం రాసిపెట్టిన పాత్రలే మనకు వస్తాయి. ఇంకా బోల్డ్ పాత్రలు, చాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నా. మలయాళంలో మంచి సినిమా అవకాశాలు వచ్చినప్పుడు నేను తెలుగులో చాలా బిజీగా ఉండటంతో చేయలేదు’’ అన్నారు. -
పోస్టర్లో పేరులా నిర్మాత మిగిలిపోకూడదు
నిర్మాతకు ఫ్రీడమ్ లేదంటుంటారు. అసలు ఫ్రీడమే నిర్మాతది కదా. అతనికి ఫ్రీడమ్ ఇవ్వడం ఏంటి? ఓ మంచి సినిమా తీయడం కోసం కావాల్సినవన్నీ తను సమకూర్చుకోగలగాలి. తన టేస్ట్‌కి తగ్గట్టుగా సినిమా తీయించుకోవాలి’’ అని కేయస్ రామారావు అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తేజ్ ఐలవ్ యు’. క్రియేటీవ్ కమర్షియల్ బ్యానర్‌పై కేయస్ రామారావు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేయస్ రామారావు పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘తేజ్ ఐ లవ్యూ’ మా బ్యానర్లో వస్తున్న 45వ సినిమా. ఇప్పటివరకూ మా బ్యానర్లో నిర్మించిన మంచి చిత్రాల్లో ఇది మరో మంచి చిత్రం. లవ్, ఎమోషన్స్, మంచి ఫీల్‌తో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్. గోపీసుందర్ సంగీతం, కరుణాకరన్ టేకింగ్ స్టైల్, ఆండ్రూ అందమైన ఫొటోగ్రఫీ, సాయి ధరమ్– అనుపమ పెయిర్ మా సినిమాకు ప్లస్. ► నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 6 దశాబ్దాలు అవుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉంటున్నప్పటి నుంచి కథలు వినడం, చదవడం అలవాటైంది. అది మా బ్యానర్లో నిర్మించిన చిత్రాల కథల సెలెక్షన్‌కి ఉపయోగపడింది. మొదట్లో సినిమాలకు రేడియోల ద్వారా పబ్లిసిటీ చేసేవాణ్ణి. అప్పట్లో అందరూ నన్ను రేడియో రామారావు, పబ్లిసిటీ రామారావు అని కూడా పిలిచేవాళ్లు. డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను అంత క్యాపబుల్ కాదేమో అనుకుంటాను. అప్పట్లో సౌందర్యకు ఓ కథ కూడా చెప్పాను. ► నిర్మాతలు రెండు రకాలు ఉంటారు. కేవలం పోస్టర్ మీద పేరులా ఉండేవాళ్లు ఒక రకం. మంచి కంటెంట్‌తో సినిమా తీద్దాం. మన బ్యానర్ పేరు గుర్తుండిపోయేలా సినిమా తీయాలని అనుకునేవాళ్లు మరో రకం. నిర్మాతలు అనే వాళ్లు కేవలం కాంబినేషన్ సెట్ చేసేవాళ్లు కాదు. ► కొత్త నిర్మాతలు వస్తున్నారు.. వెళ్లిపోతున్నారు అనడం కరెక్ట్ కాదు. ‘రంగస్థలం’ తీసింది కొత్తవాళ్లే. ‘బాహుబలి’ తీసింది కూడా కొత్తవాళ్లే కదా. కొత్త పాత అని ఉండదు. ఎంత ఇష్టంతో నిర్మాత సినిమా తీశారన్నది ముఖ్యం. ► రచయిత యండమూరితో మళ్లీ అసోసియేట్ అవ్వడం లేదా? అని అడుగుతున్నారు. ఆయన నవలలు రాయడం తగ్గించాడు. నేను సినిమాలు తీయడం తగ్గించాను కదా (నవ్వుతూ). ► రామ్ చరణ్ ఫస్ట్ సినిమా నుంచి ఆయన నెక్ట్స్ సినిమా తీయాలనే అనుకున్నాను. ఎవ్వరైనా అనుకుంటారు. చిరంజీవిగారితో కూడా మళ్లీ ఓ సినిమా తీయాలనుంది. ఛాన్స్ ఉంటే చరణ్ కంటే ముందే చిరంజీవిగారితో సినిమా తీయాలనుంది. చిరంజీవిగారితో దాదాపు నాలుగు దశాబ్దాల పరిచయం ఉంది. ఆయనకు, నాకు మధ్యలో కొన్ని డిస్ట్రబెన్స్ వచ్చినా ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆ పేజీని మేమిద్దరం ఎప్పుడో తిప్పేశాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇండస్ట్రీలో డిస్ట్రబెన్సెస్ జరుగుతుంటాయి. కానీ అనవసరమైన వాటిని అవసరమైన దానికంటే ఎక్కువ చూపించకూడదని నా ఉద్దేశం. ► మా బ్యానర్లో నెక్ట్స్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ విపరీతంగా పెరిగింది. మంచి కంటెంట్‌తో సినిమా తీయాలని దర్శకులందరిలో పోటీ వాతావరణం ఉంది. ఇది మంచి పరిణామం. -
ఆమె టార్చర్ పెట్టింది : సాయిధరమ్
లవ్ స్టోరీల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రూపొందిన చిత్రం ‘తేజ్’.. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎస్ రామారావు నిర్మించారు. ‘తేజ్’ మూవీలో హీరోయిన్ అనుపమా తనను టార్చర్ పెట్టిందని, ఇదిగో ప్రూఫ్ అంటూ సాయిధరమ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. కొంతసేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూలై 6న రిలీజ్‌కు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఆండ్రూ, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, సహ నిర్మాత: వల్లభ. -
‘తేజ్..’ అందమైన ప్రేమకవితలాంటి సినిమా!
సాక్షి, హైదరాబాద్ : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘తేజూ.. ఐ లవ్ యూ’. ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ తాజాగా నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కేఎస్ రామారావు, దర్శకుడు కరుణాకరన్, హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎస్ రామారావు మాట్లాడతూ.. ‘ఈ సినిమా కరుణాకరన్ బ్రాండ్ తగినట్టు ఉంటుంది. అందమయిన లవ్ స్టోరీ తీశాం. అందమయిన ప్రేమకవితలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కచ్చితంగా విజయవంతం అవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ.. ‘క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లో ఇది నా రెండో సినిమా. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఎగ్జామ్ రాసిన స్టూడెంట్‌లా ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. హీరో తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆడియో బాగా సక్సెస్ అయ్యింది’ అని సంతోషం వ్యక్తం చేశారు. జులై 6న ఈ సినిమా విడుదల అవుతుందని తెలిపారు. ఇది క్యూట్ సినిమా అని, తన లైఫ్‌లో ఒక మంచి సినిమాగా గుర్తుండిపోతుందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. -
నీట్ అండ్ క్లీన్ మూవీ
‘‘క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్లో 35 సంవత్సరాల క్రితం నుంచి సినిమాలు తీస్తున్నా. మా సంస్థ నుంచి ఇప్పటివరకు 44 సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు తీస్తున్న ‘తేజ్’ 45వ సినిమా. ఇంకా వైవిధ్యమైన మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాలని ఆరాట పడుతున్నా. నా చివరి శ్వాస వరకూ సినిమాలు తీస్తూనే ఉంటా’’ అని నిర్మాత కె.ఎస్. రామారావు అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యు’ అన్నది ఉపశీర్షిక. కె.ఎస్. రామారావు, వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘మంచి లవ్, ఫ్యామిలీ డ్రామా ఇది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, సెన్సార్ కట్స్కి వీలు లేకుండా నీట్‌గా, క్లీన్‌గా సెంటిమెంట్, ఎమోషన్స్‌ని కలగలిపి కరుణాకరన్ అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఎంత పెద్ద హీరో అయినా కరుణాకరన్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారని నా నమ్మకం. అలాంటి ఆయనతో ‘వాసు’ చిత్రం తర్వాత నేను రెండో సినిమా ‘తేజ్’ తీశా. ఈ చిత్రంలోని మొదటి పాటని క్రికెట్ మ్యాచ్ ద్వారా రేపు రిలీజ్ చేస్తున్నాం. 9న పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ బేనర్లో ఇంత మంచి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. క్యూట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘తేజ్’ చిత్రం అందరికీ నచ్చుతుంది. తేజ్, అనుపమ సూపర్బ్‌గా చేశారు’’ అన్నారు కరుణాకరన్. -
మంచి ఫీల్
‘తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్’ వంటి రొమాంటిక్ చిత్రాలను అందించిన ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యు’ అన్నది ఉపశీర్షిక. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. మంచి లవ్ ఫీల్‌తో సాగుతుంది. ప్యారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతోంది. జూన్ 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: అండ్రూ.ఐ, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, సహనిర్మాత: వల్లభ. -
తేజ్... నిన్ను ప్రేమిస్తున్నా
‘‘నేను, మా డైరెక్టర్ ‘తేజ్’ పూర్తి సినిమాని ఆడిటోరియంలో చూశాం. సాయిధరమ్ తేజ్ పాత్ర, నటించిన విధానం నాకు కొత్తగా, సర్ప్రైజింగ్గా అనిపించింది. మంచి టైమింగ్‌తో ఎంటర్టైనింగ్గా గొప్పగా నటించాడు. ఫుల్‌టైమ్ లవ్‌స్టోరీలో తను నటించడం ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటున్నా’’ అని నిర్మాత కె.ఎస్.రామారావు అన్నారు. సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రానికి ‘తేజ్’ టైటిల్ ప్రకటించారు. ‘ఐ లవ్ యు’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ–‘‘తేజ్ తన పాత్రలో జీవించాడు. అనుపమా ఎంత మంచి నటో తెలిసిందే. ఇద్దరూ పోటీపడి నటించారు. ప్రేమ, ఎంటర్టైన్మెంట్తో పాటు భావోద్వేగాలతో కుటుంబమంతా కలిసి చూసేలా తెరకెక్కించిన ందుకు కరుణాకరన్‌కు కృతజ్ఞతలు. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలు తీయడానికి ప్యారిస్ వెళుతున్నాం. మేలో రీ–రికార్డింగ్ చేసి, అతి త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందంగా, గ్రాండ్‌గా వచ్చింది. రామారావు సార్ మేకింగ్‌లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. చాలా సంతోషంగా ఉంది. ‘తేజ్’ గురించి మేం చెప్పడం కంటే సినిమా చూశాక మీరు (ప్రేక్షకులు) చెబితే బాగుంటుంది’’ అన్నారు కరుణాకరన్. ‘‘డార్లింగ్’ సినిమా తర్వాత కరుణాకరన్‌గారు నాకు మళ్లీ ఈ సినిమాలో అవకాశం ఇచ్చి, మంచి డైలాగ్స్ రాయించారు. ఈ సినిమా కూడా ‘తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ’ సినిమాల్లా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు రచయిత ‘డార్లింగ్’ స్వామి. ఈ చిత్రానికి కెమెరా: ఆండ్రూ ఐ., సంగీతం: గోపీసుందర్, సహ నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ. -
తేజు చాలా ఎనర్జిటిక్ – కేయస్ రామారావు
‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది. కరుణాకరన్ అద్భుతమైన కథని అంతే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన అటూ ఇటూ తిరుగుతూ సెట్లోనే ఎక్సర్సైజ్లు చేస్తున్నారు. ఇంతమంది నటీనటులు, సాంకేతిక నిపుణులను కో–ఆర్డినేట్ చేసుకుంటూ వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు’’ అని నిర్మాత కేయస్ రామారావు అన్నారు. సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేయస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘మా హీరో తేజు వింటర్లో డేట్స్ ఇవ్వమంటే సమ్మర్లో ఇచ్చారు (నవ్వుతూ). తేజు చాలా ఎనర్జిటిక్‌గా నటిస్తున్నాడు. ఈ నెల 11కి మేజర్ పార్ట్ పూర్తవుతుంది. 23, 24 తేదీల్లో విమానాశ్రయంలో షూటింగ్ జరపనున్నాం. మే మొదటి వారంలో ఫ్రాన్స్‌లో రెండు పాటలు చిత్రీకరించనున్నాం. ‘డార్లింగ్’ స్వామి చక్కటి డైలాగులు రాశాడు’’ అన్నారు. ‘‘టైటిల్ అనుకోలేదు. ఓ మంచి టైటిల్ అనుకుని త్వరలో చెబుతాం’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘క్యూట్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రమిది. చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి’’ అన్నారు కరుణాకరన్. అనుపమా పరమేశ్వరన్, కెమెరామెన్ ఆండ్రూ, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సహ నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ. -
కేఎస్ రామారావుకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు కేఎస్ రామారావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కేఎస్ రామారావుతో పాటు కార్యదర్శికి, మరో నలుగురికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన గురువారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కేఎస్ రామారావును అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 41 నిబంధన పాటించాలని, కేఎస్ రామారావుకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కాగా ఈ నెల 24న ఫిలింనగర్‌లోని ఫిలింనగర్ కన్వెన్షన్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లో పోర్టికో కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు మిగతా కార్యవర్గంపైన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. -
తలసానితో టాలీవుడ్ పెద్దలు భేటీ
హైదరాబాద్ : తెలంగాణ వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో తెలుగు చిత్రపరిశ్రమ పెద్దలు సోమవారం భేటీ అయ్యారు. వారు ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. త్వరలో సినీ ప్రముఖలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి తలసానిని కలిసిన వారిలో కేఎస్ రామారావు, దగ్గుబాటి సురేష్ బాబు తదితరులు ఉన్నారు. -
నాది నలభై ఏళ్ల ప్రస్థానం
‘‘ఒకప్పటి సినిమాల్లో కథ ఉండేది. ఇప్పటి సినిమాల్లో కథాకాకరకాయ్ ఏమీ ఉండదు. తలాతోకా లేని సినిమాలు చాలా వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో కూడా తెలీని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సినిమా పరిశ్రమ పరిస్థితి అయితే మాత్రం అంత బాగా లేదు’’ అని కె.ఎస్.రామారావు ఆవేదన వెలిబుచ్చారు. రేడియోలో వాణిజ్య ప్రకటనలతో మొదలై తరువాతి కాలంలో చిత్ర నిర్మాణానికి విస్తరించిన ‘క్రియేటివ్ కమర్షియల్స్’ సంస్థకు 40 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఈ సంస్థ అధినేత కె.ఎస్.రామారావు గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ‘‘1974లో రేడియో పబ్లిసిటీ రంగంలో క్రియేటివ్ కమర్షియల్స్ ప్రస్థానం మొదలైంది. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని అప్పట్లో విభిన్నంగా ప్రమోట్ చేశాం. ఆ ఏడాది విడుదలైన చిత్రాల్లో లెజెండ్రీ హిట్ అంటే అదే. 1981లో ‘మౌనగీతం’ చిత్రంతో నిర్మాతగా మారాను. అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవిలో కసి, పట్టుదల చూసి ఆయన్ను హీరోగా పెట్టి ‘అభిలాష’ తీశాను. అప్పట్నుంచి ఇప్పటివరకూ అశ్లీలం, ద్వంద్వార్థ సంభాషణలకు ఆస్కారం లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను మాత్రమే నిర్మిస్తూ వచ్చాం. ఇక నుంచి కూడా మా నుంచి అలాంటి సినిమాలే వస్తాయి’’ అని నమ్మకంగా చెప్పారు కేఎస్. ‘‘చిరంజీవికి ‘మరణమృదంగం’ సమయంలో ‘సూపర్‌స్టార్’ బిరుదు ఇద్దామనుకున్నాం. అయితే... అప్పటికే ఆ బిరుదుతో కృష్ణగారు పాపులర్. అందుకే ‘మెగాస్టార్’ బిరుదు ఇచ్చాం. నిజంగా అది చాలా అరుదైన బిరుదు’’ అని గత స్మృతుల్ని నెమరేసుకున్నారు కేఎస్ రామారావు. -
పవిత్రంగా ప్రేమిస్తే బావుంటుంది
‘‘నేను యువకుడిగా ఉన్నప్పటి సంఘటనలన్నీ ఈ కథ వింటుండగా గుర్తుకొచ్చాయి. పవిత్రంగా ప్రేమిస్తే బావుంటుందనేది ఈ సినిమా కాన్సెప్ట్’’ అని చిత్ర సమర్పకుడు కేయస్ రామారావు చెప్పారు. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సీసీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి పీవీపి ప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, రఘురామరాజు క్లాప్ ఇచ్చారు. రమేష్‌ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ -‘‘కథ చాలా బావుంది. సాయిమాధవ్ చాలా గొప్ప డైలాగులు రాశారు’’ అన్నారు. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా కాదని దర్శకుడు పేర్కొన్నారు. బొంబాయిలాంటి ఫీల్ ఉన్న సినిమా ఇదని నిత్యామీనన్ అన్నారు. సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ -‘‘ ‘కృష్ణం వందే జగద్గురుమ్’ తర్వాత నన్ను నేను నిరూపించుకునే సినిమా ఇది. ఈ భూమ్మీద ఎంత పాతబడినా కొత్తగా అనిపించే అంశాలు రెండు. ఒకటి మానవుడు. రెండు ప్రేమ. ఈ సినిమాలో ప్రేమను కొత్తగా చూపిస్తున్నాం’’ అని చెప్పారు. మంచి టీమ్‌తో పని చేస్తున్నానని నాజర్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: తమ్ముడు సత్యం.