చేజింగ్‌.. చేజింగ్‌ | vijay devarakonda next movie Chasing Scene shooting in hyderabad | Sakshi
Sakshi News home page

చేజింగ్‌.. చేజింగ్‌

Published Fri, Sep 6 2019 5:48 AM | Last Updated on Fri, Sep 6 2019 5:48 AM

vijay devarakonda next movie Chasing Scene shooting in hyderabad - Sakshi

విజయ్‌ దేవరకొండ ఎవర్నో చేజ్‌ (వెంబడించడం) చేస్తున్నారు. ఇంతMీ  వాళ్లతో విజయ్‌కి పనేంటి? దాని వెనక ఉన్న కారణమేంటి? ఆ కథేంటి? తెలియాలంటే సినిమా రిలీజ్‌ వరకూ వేచి చూడాలి. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఫేమ్‌ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. కేయస్‌ రామారావు సమర్పణలో కేయస్‌ వల్లభ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసబెల్లే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ సింగరేణి ఉద్యోగి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ నగర శివార్లలో జరుగుతోంది. ఫైట్‌ మాస్టర్‌ కణల్‌ కణ్ణన్‌ ఆధ్వర్యంలో ఓ చేజింగ్‌ సీన్‌ని చిత్రీకరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement