నా చివరి ప్రేమ కథ ఇదే | World Famous Lover Trailer Release | Sakshi
Sakshi News home page

నా చివరి ప్రేమ కథ ఇదే

Published Fri, Feb 7 2020 3:01 AM | Last Updated on Fri, Feb 7 2020 3:01 AM

World Famous Lover Trailer Release - Sakshi

వల్లభ, ఇజా బెల్లా, కేథరీన్, విజయ్‌ దేవరకొండ, రాశీ ఖన్నా, కేయస్‌ రామారావు, క్రాంతి మాధవ్‌

‘‘నా గత చిత్రాలన్నింటిలో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా కోసమే ఎక్కువ కష్టపడ్డా. ఈ సినిమాకి నేనేం హడావిడి చెయ్యలేదు. ఈ ట్రైలర్‌తో బయట హడావిడి స్టార్ట్‌ అవుతుంది. నా చివరి ప్రేమ కథా చిత్రమిది’’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లే లెయితే కథానాయికలుగా నటించారు. కె.ఎస్‌. రామారావు సమర్పణలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మనిషిగా   కొంచెం మారుతున్నా.. టేస్టులు కొంచెం మారుతున్నాయి. లైఫ్‌లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఈ సినిమా చేస్తున్నప్పుడే ఇదే నా చివరి ప్రేమకథా చిత్రం అని తెలిసిపోయింది. అందుకే ఈ సినిమాని పూర్తిగా ప్రేమతో నింపేశాం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. క్రాంతి మాధవ్‌కు పెద్ద సక్సెస్‌ రావాలి’’ అన్నారు. ‘‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ తెలుగు ప్రేక్షకుల సినిమాలా ఉండదు.. హాలీవుడ్, హిందీ సినిమాలా ఉంటుంది.

ప్రతి సినిమా లవర్‌కి మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు కె.ఎస్‌. రామారావు. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ తర్వాత ఈ బ్యానర్‌లో ఇది నా రెండో సినిమా. ఈ సినిమాలో అందరూ తమ పాత్రల్లో జీవించారు’’ అన్నారు క్రాంతి మాధవ్‌. ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో, చేసిన పాత్రల్లో ఈ సినిమాలోని యామిని పాత్ర బెస్ట్‌’’ అన్నారు రాశీఖన్నా. ‘‘ఈ సినిమాలో స్మిత అనే భిన్నమైన పాత్ర చేశా’’ అన్నారు కేథరిన్‌. ‘‘ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు ఇజా బెల్లా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement