ISABELLA
-
రాశీ ఖన్నా బెదిరించేది
‘‘నా సినిమాలకి బజ్ ఉండేది మీవల్లే (అభిమానులు) అని నాకు అర్థమైంది. మీ రౌడీస్ వల్ల, తెలుగు సినిమా ప్రేక్షకుల వల్ల ఈ బజ్ క్రియేట్ అవుతోంది. నేను నటించిన ఏ సినిమాకి వెళ్లినా మీకు ఒక కొత్త అనుభూతి ఉంటుందని గ్యారంటీ ఇస్తున్నా. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కూడా మీకొక కొత్త అనుభూతి ఇస్తుంది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్, ఇజాబెల్లే లెయితే హీరోయిన్లుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నేను ముంబైలో షూటింగులో ఉండటం వల్ల ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకి ఎక్కువగా ప్రమోట్ చెయ్యలేదు. రాశీఖన్నా అయితే ‘నువ్వు రావాలి, బజ్ క్రియేట్ చెయ్యాలి, హైప్ క్రియేట్ చెయ్యాలి’ అని రోజూ ఫోన్ చేస్తూ నన్ను బెదిరిస్తూ వచ్చింది. ఈ సినిమా ఏమవుతుందో నాకు తెలియదు. మీరే చెప్పాలి’’ అన్నారు. ‘‘మా నాన్నగారు ‘అభిలాష’, ‘ఛాలెంజ్’ లాంటి సినిమాలు వైజాగ్‌లో తీశారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వేడుకకి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు కె.ఎ. వల్లభ. ‘‘మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి విజయ్ దేవరకొండ నలుగురు అమ్మాయిలతో ఈ సినిమా చేశాడు. థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చెయ్యండి’’ అన్నారు క్రాంతి మాధవ్. ‘‘ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది’’ అన్నారు రాశీ ఖన్నా. -
నేను సిక్స్ కొట్టాలనే దిగుతా
‘‘చాలామంది దగ్గర తెలివితేటలు, ప్రతిభ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన ప్రతిభ, మంచితనం, తెలివితేటలు కలిపి ఉన్న మనిషి విజయ్. అతని ప్రయాణం ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లు. కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఒకనాడు నేను ఈర్ష్య పడేంత ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు. సినిమాని ఆయన ప్రేమించినంతగా నేను ప్రేమిస్తానా? అని నాకే ఒక్కోసారి సందేహం వస్తుంటుంది’’ అన్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘అప్పట్లో చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలని తీశారు రామారావుగారు. మళ్లీ అంతకు మించిన హిట్ ఈ సినిమా ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నేను, కేఎస్ రామారావు విజయవాడ నుంచి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఒక నిర్మాతగా ఆయనతో పోటీపడేవాణ్ని. మా సంస్థ నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం విజయ్’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ‘‘ఈ సినిమాతో విజయ్ మరోసారి అందర్నీ అలరిస్తాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత డి. సురేష్ బాబు. ‘‘అర్జున్ రెడ్డి’కి ముందు, ‘అర్జున్ రెడ్డి’కి తర్వాత అనేలా విజయ్ కెరీర్ నడుస్తోంది. తన ఫ్యాన్స్, ప్రేక్షకులకు వినోదం కావాలని కోరుకుంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ రాశా’’ అన్నారు క్రాంతిమాధవ్. ‘‘విజయ్ ఎనర్జీ ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. విజయ్, రాశీ ఖన్నా పోటాపోటీగా నటించారు’’ అన్నారు కేఎస్ రామారావు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘2016లో ‘పెళ్ళిచూపులు’ సినిమాతో ఒక లీడ్ యాక్టర్‌గా మీ ముందుకు వచ్చా. ఈ నాలుగేళ్లలో హిట్లు కొట్టినం.. చేతి నుంచి జారిపోయిన సినిమాలూ ఉన్నాయి. ఈ జర్నీలో స్థిరమైన వాటిలో మీరు (ఫ్యాన్స్) ఉన్నారు. నేను సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్, డబుల్ నాకు ఓపిక లేదు. ఇక నుంచి సిక్సులు కొట్టడానికే చూస్తా’’ అన్నారు. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా, ఇజాబెల్లా, కేథరిన్, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ మాట్లాడారు. -
ఈ సినిమాతో నా ఇమేజ్ మారిపోతుంది
‘‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ రిలీజ్ అయినప్పుడు టీజర్ బావుంది అన్నారు. కానీ నా పాత్రకి కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇలాంటి పాత్ర రాశీఖన్నా ఎందుకు చేసింది? అన్నారు. యాక్టర్ అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తూ ఉండలేం కదా. ఎప్పుడో ఓసారి దాన్ని బ్రేక్ చేయాలి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో అలాంటి ప్రయత్నం చేశాను. ఈ సినిమాతో నా ఇమేజ్ మారిపోతుంది అనుకుంటున్నాను’’ అన్నారు రాశీఖన్నా. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్, ఇజబెల్లా కథానాయికలుగా నటించిన ఈ సినిమాను కేయస్ రామారావు నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో నేను చేసిన యామినీ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. స్ట్రాంగ్ రోల్. చాలెంజింగ్‌గా అనిపించింది. ► యామినీ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. నా పాత్ర నేనే చేసినట్టుంది. నిజ జీవితంలో నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ని. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేను. స్ట్రాంగ్ ఉమెన్ ఎమోషనల్ సైడ్‌ని బయటకు చూపించకూడదనుకుంటాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ► సాధారణంగా నాకు లవ్ స్టోరీలంటే చాలా ఇష్టం. దర్శకుడు క్రాంతి మాధవ్‌గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ► సినిమాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నేనే ఉండాలి అనుకోను. మనం చేసే పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి. నలుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ నాకేం ప్రాబ్లమ్ లేదు. యాక్టర్‌గా నేను చాలా సెక్యూర్‌గా ఉంటాను.ఒకవేళ ఈ సినిమాలో నా పాత్ర కాకుండా వేరే పాత్రను ఎంచుకోమంటే ఐశ్వర్యా రాజేశ్ చేసిన పాత్ర చేస్తాను. ► వేలంటైన్స్ డే అంటే నాకు ఇష్టం. ప్రేమను చెప్పడానికి ధైర్యం తెచ్చుకుని చెబుతుంటారు. వేలంటైన్స్ డేకి ఇది పర్పెక్ట్ సినిమా. ప్రస్తుతం రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో ప్రకటిస్తాను. ► ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు ‘అర్జున్ రెడ్డి 2’ అన్నారు. కానీ ట్రైలర్‌తో ఆ అభిప్రాయం మారిపోయింది. విజయ్ గడ్డంతో ఉంటే అర్జున్ రెడ్డిలానే ఉంటారు. కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం ఉండదు. -
ఆ పేరొస్తే చాలు
‘‘బాక్సాఫీస్ వసూళ్ల గురించి నేను పట్టించుకోను. నా పాత్రకి న్యాయం చేయడానికి 100శాతం కష్టపడతా. నా నటన బాగుందనే పేరు వస్తే చాలనుకునే మనస్తత్వం నాది’’ అని కేథరిన్ అన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లే లెయితే కథానాయికలుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేథరిన్ మాట్లాడుతూ– ‘‘ప్రేమ, పెళ్లి, అనుబంధాలు వంటి అంశాలను ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో చక్కగా చెప్పారు. ఆధునిక ఆలోచనలతో స్వంతంత్ర భావాలున్న స్మిత అనే అమ్మాయి పాత్రలో నటించాను. ఈ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. నేనొక బొగ్గు గనిలో పని చేస్తుంటాను. ఆ ప్రాంతంలో పని చేసే హీరోతో నాకున్న అనుబంధం ఏంటి? అతని జీవితంపై నా ప్రభావం ఎంత? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఈ చిత్రంలో నలుగురు కథానాయికలు ఉన్నా అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. ఇద్దరు ముగ్గురు కథానాయికలు ఉన్న చిత్రాల్లో నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. విజయ్ దేవరకొండతో పని చేయడం మంచి అనుభూతినిచ్చింది. సెట్స్‌లో ప్రశాంతంగా ఉంటూ పనిలో మాత్రం పర్ఫెక్షన్ కనబరచాలని తపిస్తాడు. ఇది నా కెరీర్లో విభిన్న చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. సవాల్‌తో కూడిన పాత్రలు చేసి, ప్రేక్షకుల అభిమానం పొందాలనుకుంటున్నా’’ అన్నారు. -
నా చివరి ప్రేమ కథ ఇదే
‘‘నా గత చిత్రాలన్నింటిలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా కోసమే ఎక్కువ కష్టపడ్డా. ఈ సినిమాకి నేనేం హడావిడి చెయ్యలేదు. ఈ ట్రైలర్‌తో బయట హడావిడి స్టార్ట్ అవుతుంది. నా చివరి ప్రేమ కథా చిత్రమిది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లే లెయితే కథానాయికలుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మనిషిగా కొంచెం మారుతున్నా.. టేస్టులు కొంచెం మారుతున్నాయి. లైఫ్‌లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఈ సినిమా చేస్తున్నప్పుడే ఇదే నా చివరి ప్రేమకథా చిత్రం అని తెలిసిపోయింది. అందుకే ఈ సినిమాని పూర్తిగా ప్రేమతో నింపేశాం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. క్రాంతి మాధవ్‌కు పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు. ‘‘వరల్డ్ ఫేమస్ లవర్’ తెలుగు ప్రేక్షకుల సినిమాలా ఉండదు.. హాలీవుడ్, హిందీ సినిమాలా ఉంటుంది. ప్రతి సినిమా లవర్‌కి మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు కె.ఎస్. రామారావు. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ తర్వాత ఈ బ్యానర్లో ఇది నా రెండో సినిమా. ఈ సినిమాలో అందరూ తమ పాత్రల్లో జీవించారు’’ అన్నారు క్రాంతి మాధవ్. ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో, చేసిన పాత్రల్లో ఈ సినిమాలోని యామిని పాత్ర బెస్ట్’’ అన్నారు రాశీఖన్నా. ‘‘ఈ సినిమాలో స్మిత అనే భిన్నమైన పాత్ర చేశా’’ అన్నారు కేథరిన్. ‘‘ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు ఇజా బెల్లా. -
ఫైటర్ పైలెట్
పాకిస్తాన్ జైలులో ఖైదీగా ఉన్న ఓ భారతీయ బాక్సర్ ఎలా బయటపడ్డాడు? అతనికి ఎవరు సహాయం చేశారు? అసలు.. అతను ఖైదు కావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అన్న అంశాల నేపథ్యంలో జయంత్ సి. పరాన్జి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నరేంద్ర’. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఫీమేల్ ఫైటర్ పైలెట్‌గా నటిస్తున్నారు. ‘‘పాకిస్తాన్ జైలులో ఖైదీ అయిన భారతీయ మాజీ బాక్సర్‌గా నీలేష్ నటిస్తున్నారు. స్వేచ్ఛా పోరాటానికి మద్దతు ఇచ్చే మానవ హక్కుల కార్యకర్తగా బ్రెజిలియన్ బ్యూటీ ఇసాబెల్లా లియేటి కనిపిస్తారు. భారత ఖైదీలను రక్షించే ప్రయత్నంలో తనను తాను త్యాగం చేసుకునే ఆప్షన్ ఖైదీ పాత్రను డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ద గ్రేట్ ఖలి చేశారు. ఈ సినిమాలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రామ్ సంపత్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. -
ట్రైలర్ రెడీ
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్, కేథరీన్, ఇజబెల్లా నటించారు. ఈ సినిమాలో నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు విజయ్. ఈ లుక్స్ ఉన్న మిస్టరీకి ఈ గురువారం క్లూ దొరుకుతుంది. ఈ చిత్రం ట్రైలర్ గురువారం విడుదల కానుంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతోంది. -
ప్రేమికుల రోజున..
ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు విజయ్ దేవరకొండ. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేయస్ రామారావు సమర్పణలో కేయస్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక్క షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ఒకటికి మించి లుక్స్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్. -
చేజింగ్.. చేజింగ్
విజయ్ దేవరకొండ ఎవర్నో చేజ్ (వెంబడించడం) చేస్తున్నారు. ఇంతMీ వాళ్లతో విజయ్‌కి పనేంటి? దాని వెనక ఉన్న కారణమేంటి? ఆ కథేంటి? తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాలి. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. కేయస్ రామారావు సమర్పణలో కేయస్ వల్లభ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసబెల్లే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సింగరేణి ఉద్యోగి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ కణల్ కణ్ణన్ ఆధ్వర్యంలో ఓ చేజింగ్ సీన్‌ని చిత్రీకరిస్తున్నారు. -
నాలుగో బ్యూటీ
ఆల్రెడీ ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీలోకి కేథరిన్ థెరీసా కూడా జాయిన్ అయ్యారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్ రామారావు సమర్పణలో కేఎస్ వల్లభ నిర్మిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా నాలుగో బ్యూటీగా కేథరిన్ కూడా తోడయ్యారు. ప్రస్తుతం కొత్తగూడెంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సింగరేణి కార్మికుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ షెడ్యూల్లో కేథరిన్ కూడా పాల్గొంటున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. -
‘హగ్’ ఇచ్చిన పూరి..!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తొలి అంతర్జాతీయ షార్ట్ ఫిలింను రిలీజ్ చేశాడు. తన గురువు రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో తొలి పోస్టర్ రిలీజ్ చేసిన పూరి, షార్ట్ ఫిలిం కూడా అదే రేంజ్ లో రూపొందించాడు. పెద్దగా కంటెంట్ ఏమీ లేకుండానే.. కేవలం వాయిస్ ఓవర్ తో మూడున్నర నిమిషాల షార్ట్ ఫిలింను నడిపించాడు. చెట్ల వల్ల కలిగే లాభాలు.. వాటిని మనం ఎందుకు కాపాడుకోవాలి అనే విషయాలను ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడు. చివర్లో.. పోస్టర్ లో రిలీజ్ చేసిన న్యూడ్ స్టిల్ తో తన మార్క్ చూపించాడు పూరి. క్వాలిటీ పరంగా మాత్రం హగ్ ఆకట్టుకుంటుంది. ఇసాబెల్లా అందాలు, సందీప్ చౌత నేపథ్యం సంగీతం.. పూరి టేకింగ్ ఇలా అన్నీ కలిసి హగ్ షార్ట్ ఫిలింకు అంతర్జాతీయ స్థాయి తీసుకువచ్చాయి. My 1st international short film #HUG They don’t need us , We need them ... here’s the link 👇🏻https://t.co/rf6S6Ni0UU#PCfilm@PuriConnects @Charmmeofficial @Sandeep_Chowta @junaid_editor @anilpaduri — PURI JAGAN (@purijagan) 31 December 2017 -
పూరి జగన్నాథ్ షార్ట్ ఫిలిం ‘హగ్’
-
టీనేజ్ మిలియనీర్లు..
అద్భుతమైన ఆలోచనలను ఆచరణలో పెట్టి విజయం సాధించే సత్తా ఉండాలే కానీ వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు వయసుతో పనిలేదు. అందరిలాగా చదువు.. మార్కులు, ర్యాంకులు అంటూ ఉండిపోకుండా.. తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి వ్యాపార రంగంలో విజయపథాన నడిచిన బాలలు చాలామందే ఉన్నారు. బాల్యంలోనే వ్యాపారం ప్రారంభించి, విజయం సాధించిన కొందరు టీనేజర్ల గురించి తెలుసుకుందాం.. ఎరిక్ ఫిన్‌మన్.. అమెరికాకు చెందిన ఎరిక్ ఫిన్‌మన్ చిన్నప్పటినుంచి చదువులో చురుకుగానే ఉండేవాడు. అయితే పాఠశాలలో నిత్యం తోటి విద్యార్థుల నుంచి శారీరకంగా, మానసికంగా వేధింపులు ఎదుర్కొనేవాడు. దీంతో తరచూ అనేక పాఠశాలలు మారాల్సి వచ్చేది. చివరకు పదిహేనేళ్లు వచ్చేసరికి ఈ వేధింపులు భరించలేక పాఠశాలకు వెళ్లడమే మానేశాడు. అయితే విద్యార్జనకు మాత్రం దూరం కాలేదు. ఇంట్లోనే ఉండి కంప్యూటర్ సాయంతో వివిధ కొత్త కోర్సులు నేర్చుకున్నాడు. తను నేర్చుకున్న విషయాలతో బోటాంగిల్ (రోబోటిక్స్, యాంగిల్ల కలయికతో రూపొందింది) ప్రాజెక్టును చేపట్టాడు. తనలాగే చాలామంది పాఠశాలల్లో వేధింపులకు గురవుతూ, చదువుపై దృష్టి సారించలేకపోతున్నారని, అలాంటివారికి ఇంటినుంచే చదువుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో బోటాంగిల్ను రూపొందించాడు. ఇదో ఆన్లైన్ ఎడ్యుకేషనల్ పోర్టల్. పదిహేనేళ్ల వయసులో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు వాళ్ల నాన్నమ్మ వెయ్యి డాలర్లు అందించింది. ఈ డబ్బుతో ఎరిక్ బోటాంగిల్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ దశలో ఇది మంచి విజయం సాధించింది. దీనికి బిట్కాన్ సంస్థ ఆర్థిక తోడ్పాటును అందించింది. ఎరిక్‌కు లక్ష డాలర్లు అందించింది. ఈ తోడ్పాటుతో బోటాం గిల్‌ను మరింతగా అభివృద్ధి చేసేం దుకు ఎరిక్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు 20 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. టీనేజ్లోనే ఎరిక్ చేసిన ప్రయత్నం అతడ్ని లక్ష డాలర్ల సంస్థకు అధిపతిని చేసిం ది. భవిష్యత్‌లో మరింత వృద్ధి దిశగా ఎరిక్ యత్నిస్తున్నాడు. ఎలినా మోర్స్.. లాలీపాప్స్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయితే వీటిని ఎక్కువగా తింటే దంతాలు పాడైపోతాయి. దంతాలు పాడవకుండా, ఆరోగ్యాన్నిచ్చే లాలిపాప్స్ తయారు చేయాలనే ఆలోచనతో రూపొందినవే జాలీపాప్స్. వీటిని రూపొందించింది ఎలినా మోర్స్. తనకెంతో ఇష్టమైన చెల్లికి, మంచి లాలీపాప్స్ అందించాలనే సంకల్పంతో ఏడేళ్ల వయస్సులో ఎలినా జాలీపాప్స్ని తయారు చేసింది. ఫ్రూట్ ఫ్లేవర్‌లో ఉండే వీటిని దంతాలకు హాని కలిగించని పదార్థాలతో, బీట్రూట్ రసంతో తయారు చేసింది. 7,500 డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైన జాలీపాప్ల తయారీ సంస్థ ప్రస్తుతం లక్షల డాలర్ల విలువ కలిగి ఉంది. జాలీపాప్స్ తయారీ ఎలినాకు వ్యాపారవేత్తగా ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అమెరికా ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామా రెండు సార్లు ఎలినాను వైట్‌హౌస్‌కు ప్రత్యేక అతిథిగా కూడా ఆహ్వానించారు. అలా ప్రస్తుతం పదేళ్ల వయసు కలిగిన ఎలినా ఓ మిలియన్ డాలర్ల వ్యాపార సంస్థకు అధిపతిగా కొనసాగుతోంది. ఇసబెల్లా రోస్ టేలర్.. ఫ్యాషన్ రంగంలో రాణించడానికి కావాల్సింది సృజనాత్మకత. దీనికి వయసుతో పనిలేదు. అందుకే అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఇసబెల్లా రోస్ టేలర్ ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోతోంది. దాదాపు మూడేళ్లక్రితం పన్నెండేళ్ల వయస్సులోనే తన పేరుమీద ఇసబెల్లా రోస్ టేలర్ పేరుతో డిజైనర్ వేర్ కలెక్షన్‌ను ప్రారంభించింది. వివిధ రంగులు, గ్రాఫిక్స్, డిజైన్లతో ఇసబెల్లా రూపొందించిన దుస్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అమెరికాలో అత్యధిక మార్కెట్ కలిగిన యువ డిజైనర్‌గా ఇసబెల్లాకు ఫ్యాషన్ రంగంలో గుర్తింపు దక్కింది. ఇంట్లోనే విద్యనభ్యసించిన ఇసబెల్లా ఈ రంగంలో రాణించడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రస్తుతం తన పేరు మీద విక్రయిస్తున్న దుస్తులతో టీనేజ్లోనే ఇసబెల్లా లక్షల డాలర్లు ఆర్జిస్తోంది. బెల్లా వీమ్స్.. టీనేజ్లోనే వ్యాపార సంస్థను ప్రారంభించి విజయం సాధించిన వ్యాపారవేత్తల్లో బెల్లావీమ్స్ ఒకరు. అమెరికాలోని ఆరిజోనా ప్రాంతానికి చెందిన బెల్లాకు బ్రేస్లెట్లు, నెక్లెస్‌లు, లాకెట్లు వంటి ఆభరణాలు అంటే చాలా ఇష్టం. బెల్లా వీటిని సొంతంగానే తయారు చేసుకునేది. తనకు చిన్నప్పటి నుంచి కారు కొనుక్కోవాలని కోరిక. ఈ కోరికను తల్లిదండ్రులకు చెబితే కారు కొనుక్కునేందుకు ఒక్క డాలర్ కూడా ఇవ్వమని, సొంతంగా కష్టపడిన డబ్బులతోనే కొనుక్కోవాలని సూచించారు. ఎలాగైనా కారు కొనుక్కోవాలనే తన కోరికను నెరవేర్చుకోవడం కోసం తన ప్రతిభకు పదును పెట్టింది. దాదాపు పద్నాలుగేళ్ల వయసులో (2010) తనకు తెలిసిన నగలు తయారు చేసి, ఓ సంస్థను స్థాపించింది. ఆ సంస్థ పేరు ఒరిగామి ఓల్. వినియోగదారులు కోరుకునే డిజైనర్ నగలను తయారు చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. దీంతో ఒరిగామి ఓల్ పెద్ద విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సంస్థ విలువ దాదాపు 250 మిలియన్ డాలర్లుగా ఉంది. మేడిసన్ రాబిన్సన్.. ఆసక్తితో చేసే చిన్న ప్రయత్నాలు కూడా ఒక్కోసారి జీవితాన్ని మార్చేస్తాయి. అందుకు ఉదాహరణ మేడిసన్ రాబిన్సన్. ఆస్ట్రేలియాకు చెందిన మేడిసన్‌కు బీచ్‌లో ఆడుకోవడమన్నా, సముద్రపు జీవులన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే దాదాపు పదేళ్లక్రితం వయసులో సముద్రపు జీవుల స్ఫూర్తితో కొన్ని పాదరక్షలు రూపొందించింది. వీటిపై పలు జలచరా చిత్రాల్ని ముద్రించింది. ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక ఓ రిటైల్ ట్రేడ్ ఎగ్జిబిషన్లో వీటిని ప్రదర్శించింది. ఆ డిజైన్లు చూసి ఆశ్చర్యపోయిన పలు పాదరక్షల తయారీ సంస్థలు మేడిసన్‌కు భారీ ఆర్డర్లు ఇచ్చాయి. దీంతో ఎనిమిదేళ్ల వయసులో మేడిసన్ తయారు చేసిన పాదరక్షలు ఆమెకు లక్షల డాలర్లు తెచ్చిపెట్టాయి.