ఫైటర్‌ పైలెట్‌ | payal rajput dons a special role as female airforce fighter pilot | Sakshi
Sakshi News home page

ఫైటర్‌ పైలెట్‌

Published Mon, Feb 3 2020 4:56 AM | Last Updated on Mon, Feb 3 2020 4:56 AM

payal rajput dons a special role as female airforce fighter pilot - Sakshi

పాయల్‌ రాజ్‌పుత్‌

పాకిస్తాన్‌ జైలులో ఖైదీగా ఉన్న ఓ భారతీయ బాక్సర్‌ ఎలా బయటపడ్డాడు? అతనికి ఎవరు సహాయం చేశారు? అసలు.. అతను ఖైదు కావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అన్న అంశాల నేపథ్యంలో జయంత్‌ సి. పరాన్జి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నరేంద్ర’. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ ఫీమేల్‌ ఫైటర్‌ పైలెట్‌గా నటిస్తున్నారు. ‘‘పాకిస్తాన్‌ జైలులో ఖైదీ అయిన భారతీయ మాజీ బాక్సర్‌గా నీలేష్‌ నటిస్తున్నారు.

స్వేచ్ఛా పోరాటానికి మద్దతు ఇచ్చే మానవ హక్కుల కార్యకర్తగా బ్రెజిలియన్‌ బ్యూటీ ఇసాబెల్లా లియేటి కనిపిస్తారు. భారత ఖైదీలను రక్షించే ప్రయత్నంలో తనను తాను త్యాగం చేసుకునే ఆప్షన్‌ ఖైదీ పాత్రను డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ ద గ్రేట్‌ ఖలి చేశారు. ఈ సినిమాలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రామ్‌ సంపత్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement