Narendra
-
ఏం అనుభవం ఉందని BR నాయుడుని చైర్మన్ చేశారు
-
మందేసి చిందేసిన టీడీపీ ఎమ్మెల్యే
-
మందేసి చిందేసిన బాపట్ల ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ పీకలదాకా మద్యం తాగి చిందేశారు. కైపులో తీన్మార్ డాన్స్‌లు చేస్తూ, పార్టీ ఇచి్చన బీజేపీ నేతకు లిప్‌కిస్‌లు ఇచ్చి మరీ ఊగిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 10న పాండురంగాపురం యాగంటి రిసార్ట్‌లో మందు పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సతీష్ అనుచరులు హాజరయ్యారు. అందరూ మద్యం తాగి తందనాలాడారు.బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం ఆ పారీ్టకి హాజరయ్యారు. మద్యం మత్తులో అన్నం సతీష్ ప్రభాకర్ భీమ్లానాయక్ పాట పెట్టించుకుని డాన్స్ చేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం సతీష్‌తో కలిసి బెల్లీడాన్స్, తీన్మార్ స్టెప్పులు వేశారు. అంతటితో ఆగకుండా సతీష్ చేతిలోని మద్యం గ్లాసు అందుకుని గటగటా తాగేశారు. ఆ తరువాత సతీష్ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు.ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడి వారు ఆయనకు కైపెక్కిందని గుసగుసలాడుకోగా.. వీడియో చూసిన జనం తాగితే తాగారు గానీ... ఎమ్మెల్యేగా ఉండి బుగ్గలు నిమరడాలు, ముద్దులు పెట్టడాలు ఏమిటంటూ చీదరించుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ కైపుగోల సోషల్ మీడియాల్ యమ ట్రెండింగ్‌గా మారింది. -
లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి
అల్లిపురం (విశాఖ): లోన్ యాప్ వేధింపులకు విశాఖ నగరంలో ఓ యువకుడు బలైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. మహారాణిపేట సీఐ బి.భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన సూరాడ నరేంద్ర తన భార్య అఖిలాదేవి, తల్లి, తండ్రితో కలసి జీవిస్తున్నాడు. ఇతనికి వివాహమై సుమారు 50 రోజులైంది. సముద్రంలో వేటకు వెళ్లి వస్తుంటాడు. భార్య అఖిల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఇంటి అవసరాల నిమిత్తం నరేంద్ర ఆన్లైన్ యాప్‌లో రూ.2 వేలు రుణం తీసుకున్నాడు. ఆ మొత్తం చెల్లించేశాడు. కానీ.. రుణం తిరిగి చెల్లించాలంటూ లోన్ యాప్ నిర్వాహకులు అఖిల సెల్‌ఫోన్‌కు నరేంద్ర, అఖిల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి పంపించారు. లోన్ తక్షణమే తీర్చకపోతే వాటిని ఇతరులకు సైతం పంపిస్తామని బెదిరించారు. ఇంటికి వచ్చిన తరువాత నరేంద్రను అఖిల ఈ విషయం అడగ్గా.. ఇంటి అవసరాల నిమిత్తం తీసుకున్నట్టు చెప్పాడు. తర్వాత అఖిల ఆస్పత్రిలో డ్యూటీకి వెళ్లిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో అఖిల అత్త ఫోన్‌చేసి నరేంద్ర తలుపులు తీయటం లేదని చెప్పటంతో ఇంటికి చేరుకుంది. తలుపులు కొట్టినా ఎంతకీ తీయక పోవటంతో పక్కనే ఉన్న కిటికీలోంచి చూడగా.. నరేంద్ర గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. దీంతో తలుపులు విరగ్గొట్టి నరేంద్రను కిందికి దించి కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందంయువకుడి మరణానికి కారణమైన లోన్ యాప్ నిర్వాహకులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, మహిళలను అవమానించడం, నేరపూరిత బెదిరింపు, మరొకరి గుర్తింపును మోసపూరితంగా ఉపయోగించడం, ఎలక్ట్రానిక్ రూపంలో లైంగిక, అసభ్యకరమైన విషయాలను ప్రచురించడం, ప్రసారం చేయడం తదితర నేరాలపై బీఎన్ఎస్ 108, 79, 351(2), ఐటీ యాక్ట్ సెక్షన్ 66 (సి), 67(ఎ) కింద కేసు నమోదు చేశామని తెలిపారు. మృతుని మొబైల్ ఫోన్‌ను పరిశీలించి నేరస్తులను గుర్తించేందుకు సైబర్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. -
త్వరలోనే సీఎం పాపం పండుతుంది
కుషాయిగూడ: శిశుపాలుడి పాపాల మాదిరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాపాలను ప్రజలు లెక్కబెడుతున్నారని.. తొందరలోనే ఆయన పాపం పండుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. లగచర్ల ఘటనకు సంబంధించి నమోదైన కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని మాజీ మంత్రులు మహమూద్ అలీ, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ శనివారం చర్లపల్లి జైల్లో ములాఖత్ అయ్యారు.నరేందర్‌రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం జైలు ఆవరణలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్న నరేందర్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారన్నారు. తనలాగే చేయని తప్పునకు ప్రభుత్వం జైల్లో పెట్టిన 30 మంది పేద, గిరిజన, దళిత రైతులకు అండగా ఉండాలని, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పాలని నరేందర్‌రెడ్డి కోరారని కేటీఆర్ తెలిపారు. రైతన్నలకు అండగా కేసీఆర్ ఉన్నారని.. న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయన్నారు. ముఖ్యమంత్రి సొంతూరులో ఆయన సోదరులు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఇంటికి తోవ లేకుండా గోడ కట్టడంతో క్షోభతో ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారం ఉందని సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకొనేలా ఒత్తిడి తెచ్చిన సీఎం సోదరుడు నుముల గురువారెడ్డి చేస్తున్న అరాచకాన్ని ప్రజలు గమనించాలన్నారు. రేవంత్‌రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. -
బీజేపీ నేత నరేంద్రుడి రాసలీలలు
పట్నంబజారు (గుంటూరు): బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్ సోషల్ మీడియా సాక్షిగా వివాదంలో కూరుకుపోయారు. ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ ‘రేపు నాతో వస్తావా’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.రేపు మందు కొడదాం.. పోయినసారి లాగే చేద్దాం’ అంటూ చేసిన అసభ్యకర సంభాషణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలోకి రావడంతో ఆయన ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
బాలుడి దారుణ హత్య
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో పన్నెండేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిని గుప్త నిధుల కోసం చంపారా? లేదా డబ్బుల కోసమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివి. బాల్కొండకు చెందిన బండి నరేందర్.. నచ్చు రాకేశ్ మేనమామ అయిన నాగాపూర్‌కు చెందిన దశరథ్ మేకలను మేతకు తీసుకుని వెళ్తాడు. దీంతో రాకేశ్ కుటుంబ సభ్యులకు పరిచయమయ్యాడు. గణపతులను చూసి వద్దామని చెప్పి ఈ నెల 11న బండి నరేందర్ చిట్టాపూర్ గ్రామానికి చెందిన బాలుడు నచ్చు రాకేశ్‌ను.. బాల్కొండకు తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా రాకేశ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నరేందర్‌ను ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాక పోవడంతో బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా శనివారం ఉదయం బాల్కొండలోని ఖిల్లా ప్రాంతంలో బాలుడి మృతదేహం ఉందని చిట్టాపూర్ గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. బాలుడి మృతదేహంపై దుస్తులు లేకపోగా.. ఎడమ కంటి భాగంపై బండరాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఖిల్లాలోని ఓ గుహ ముందు హత్య చేసి మృతదేహాన్ని కొద్దిదూరంలో పారేశారు. ఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. బాలుడిని నరేందర్ హత్య చేసి ఉంటాడని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. నరేందర్‌తో వెళ్లేముందు బాలుడు తన అన్న మణికంఠకు ఫోను చేసి చెప్పాడని తెలిపారు. పోలీసులు నరేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అనుమానితుడు నేరాన్ని అంగీకరించలేదని పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి దర్యాçప్తు చేపట్టి నిందితులను పట్టుకుంటామన్నారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని నరేందర్‌ను తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్య జరిగిన మర్నాడు కూడా నరేందర్ తన భార్య మొబైల్‌తో ఫోన్ చేసి.. రాకేశ్ ఖానాపూర్ వద్ద ఉన్నాడని అబద్ధం చెప్పాడని వివరించారు. హత్య జరిగిన రోజు ఉదయం నరేందర్.. మొదట బాలుడి అన్న మణికంఠకు ఫోన్‌చేసి ఖిల్లా వద్దకు రమ్మన్నాడని, మణికంఠ వెళ్లకపోవడంతో రాకేశ్‌ను తీసుకెళ్లినట్లు వివరించారు. న్యాయం చేస్తామని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి హామీ ఇవ్వడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనను విరమించారు. హతుని తండ్రి రెండేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
పవన్ కు అదిరిపోయే కౌంటర్..
-
ప్రియుడి మోజులో.. భర్తనే కడతేర్చింది..
ఒంగోలు టౌన్: ప్రియుడి మోజులో పడి ఆమె ఏకంగా భర్తనే హతమార్చింది. తన వ్యవహారం బయట పడేసరికి భర్త మందలించడం.. భర్త బతికుంటే తమ ‘బంధం’ కష్ట మని భావించిన ఆ మహిళ.. కిరాయి ముఠా, ప్రియుడి సాయంతో కట్టుకున్న భర్తనే దారుణంగా కడతేర్చింది.. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎఫ్ ఇన్స్పెక్టర్ చల్లా వెంకటనరేంద్రబాబు హత్య కేసులో మృతుడి భార్యతో సహా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఆ యువకుడికి అలా దగ్గరైంది.. ఒంగోలులోని పీఎఫ్ ఆఫీసులో ఇన్స్పెక్టర్గా పనిచేసే చల్లా వెంకటనరేంద్రబాబు పొదిలిలోని పీఎన్ఆర్ కాలనీ మూడో లైనులో నివాసముంటున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీప్రియ, ఇద్దరు పిల్లలు. వారి ఇంటి ఎదురుగా అద్దె ఇంట్లో ఉంటున్న కొండ శశికుమార్ అనే యువకుడికి లక్ష్మీప్రియ దగ్గరైంది. వారి వ్యవహారం తెలిసిన నరేంద్ర.. ఇద్దరినీ తీవ్రంగా మందలిస్తూ వస్తున్నాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు శశితో కలిసి పథకం రచించింది. ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో నెల్లూరుకు చెందిన కిరాయి హంతకులతో రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున నరేంద్ర గాఢ నిద్రలో ఉన్న సమయంలో శశితో పాటు.. నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన నలుగురు యువకులు కలిసి నరేంద్ర గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. మృతదేహాన్ని వంటగదిలోకి తీసుకెళ్లి తాడుతో వేలాడ దీశారు. భార్యభర్తల గొడవలతో విసిగివేసారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు యత్నించారు. ఇదిలా ఉండగా, కిరాయి ముఠా తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తొలుత రూ.50 వేలు మాత్రమే అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన డబ్బు కోసం వారు ఫోన్లు చేస్తుండటంతో భయపడిపోయిన శశిపోలీసులకు లొంగిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితులు.. లక్ష్మీప్రియతో పాటుగా ఆమె ప్రియుడు కొండ శశికుమార్, నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన షేక్ నహీద్, షేక్ ఫజ్లూ, సయ్యద్ సిద్దిక్, షేక్ ముబారక్‌లను అరెస్టు చేసినట్టు ఎస్పీ దామోదర్ వివరించారు. -
బాబు మాయ మాటలకు వంగవీటి నరేంద్ర స్ట్రాంగ్ కౌంటర్
-
టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరుగార్చిన దద్దమ్మ..
-
‘వంగవీటి త్యాగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారు’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్, వంగవీటి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయని, కానీ వంగవీటి రాధా టీడీపీలో చేరి సీఎం జగన్‌ని విమర్శించటం సరికాదని రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘2014లో సీటు ఇస్తే రాధా ఓడిపోయారు. 2019లో వేరే సీటు ఇస్తానని సీఎం జగన్ చెప్తే కాదని పార్టీ మారారు. అంతకుముందు వరకు నా తండ్రిని చంపినది టీడీపీ వారే అని చెప్పారు. ఇప్పుడేమో మాట మార్చి మాట్లాడుతున్నారు. వంగవీటి రంగా త్యాగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారు. రంగా ఆశయం టీడీపీ పతనం. కానీ రాధా మాత్రం అదే టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరు గార్చారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజధాని అడ్డం పెట్టుకుని చంద్రబాబుకు ఓట్లు వేయిస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన రాజకీయం ఉంటుందా?. .. వైఎస్సార్సీపీకి చెందిన కాపు మహిళలపై కమ్మ నేతలు దాడి చేస్తే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదు?. తెనాలిలో గీతాంజలి చావుకు కారణమైన టీడీపీ వారిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?. జనసేనలోని వీర మహిళలకు ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు?. వీర మహిళలు, జనసేన కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేయాలి. జనసేనను చంద్రబాబుకు తాకట్టు పెట్టిన పవన్ కల్యాణ్‌ను గట్టిగా ప్రశ్నించాలి. .. ధవళేశ్వరం బ్యారేజి కట్టించిన కాటన్ దొరని ప్రజలు ఇప్పటికీ పూజలు చేస్తున్నారు. మరి హైదరాబాద్‌ని కట్టించానని చెప్పుకునే చంద్రబాబును ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు?. ఎందుకంటే.. చంద్రబాబు పచ్చి మోసగాడు, అబద్దాల కోరు అని తెలుసు కాబట్టే. సీఎం జగన్ ప్రజలకు మేలు చేసినందునే ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు’’ అని వంగవీటీ నరేంద్ర అన్నారు. -
వంగవీటి రంగా ఆశయం తెలుగుదేశం పతనం
-
కంటైనర్ లో డబ్బుల మూటలు...అడ్డంగా దొరికిన టీడీపీ అభ్యర్థి
-
టీడీపీ అభ్యర్థి కంపెనీలో సోదాలు.. కంటైనర్‌లో భారీగా నగదు
సాక్షి, బాపట్ల: బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు సోదాలు చేపట్టారు. చీరాల మండలం కావూరి వారిపాలెంలోని కంపెనీలో సోదాలు చేపట్టారు. కంటైనర్‌లో రూ.56 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన నగదుగా గుర్తించారు. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కంటైనర్‌లో ఉన్న నగదును పోలీసులు సీజ్ చేశారు. -
వైఎస్సార్సీపీలో చేరిన వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. రోజురోజుకీ పార్టీలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా-రంగా మిత్రమండలి సభ్యులు షేక్ బాబు, ఇమ్రాన్ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్ పాల్గొన్నారు. రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ వెళ్లడం ఏంటి? పార్టీలో చేరిన అనంతరం వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనైతికమంటూ మండిపడ్డారు. కూటమి ఏర్పడింది ప్రజలు కోసం కాదు.. వారి స్వార్థం కోసం. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ ఏనాడూ ఆలోచించలేదు. రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ వెళ్లడం ఏంటి?. పవన్ వెంట కాపులెవరూ ఉండరు’’ అంటూ వంగవీటి నరేంద్ర తేల్చిచెప్పారు. -
బంజారా హిల్స్ సీఐ కేసులో కీలక విషయాలు
-
ఏసీబీ వలలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్
-
యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్ మృతి
నూజివీడు : వినాయక నిమజ్జనాల సందర్భంగా విధులు నిర్వహిస్తూ ఓ యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర(32) ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో శనివారం రాత్రి డీజే ఆపమని చెప్పిన కానిస్టేబుల్ నరేంద్రపై ఉలాస రామకృష్ణ అనే యువకుడు తలపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నరేంద్రను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని సోమవారం తెల్లవారుజామున నూజివీడు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీంతో ఏరియా ఆస్పత్రి వద్దకు నూజివీడు సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది, అధికారులు, మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు చేరుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కొద్దిసేపు ఆందోళన చేశారు. కాగా, ఏరియా ఆస్పత్రిలో ఉన్న నరేంద్ర భౌతికకాయాన్ని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఏలూరు డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి కూడా నివాళులర్పించారు. అనంతరం నరేంద్ర స్వగ్రామమైన ఎనీ్టఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం పోలిశెట్టిపాడులో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకి జనవరి 22 ముహూర్తం..?
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి 20–24 మధ్య ఉంటుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. మూడంతస్తుల్లో నిర్మాణం జరుపుకుంటున్న రామాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ చివరి నాటికి సిద్ధమైపోతుందని వెల్లడించారు. జనవరి 22న ఆలయంలో శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట జరిపే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని చెప్పారు. జనవరి 20–24 మధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తాలు దివ్యంగా ఉన్నాయని ప్రధాని రావడానికి ఏ రోజు వీలవుతుందో అదే రోజు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఆ తేదీని పీఎంఒ కార్యాలయం ఖరారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మంగళవారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇచ్చారు. అందులో ఆయన పలు విషయాలు వెల్లడించారు. చదవండి: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు -
మోసగాడి యాక్షన్
చంద్రకాంత్ దత్త, నరేందర్, రేఖ నీరోషా ప్రధాన పాత్రల్లో బర్ల నారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘చీటర్’. యస్ఆర్ఆర్ ప్రొడక్షన్స పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘చీటర్’ ఫస్ట్ లుక్ బాగుంది.. సినిమా హిట్ కావాలి’’అన్నారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ఇది. విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు బర్ల నారాయణ. ‘‘మా సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. -
దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..
Did MS Dhoni Intentionally Choose To Not Show His Elder Brother In Biopic?: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వినగానే.. మిస్టర్ కూల్.. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన లెజెండరీ కెప్టెన్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన తలా... ఠక్కున గుర్తుకువచ్చే విషయాలివే! భారత క్రికెటర్‌గా శిఖరాగ్రాలను అధిరోహించిన ధోని వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు! అదేంటి.. మేము కూడా ధోని బయోపిక్.. ఎంఎస్ ధోని:ది అన్‌టోల్డ్ స్టోరీ చూశాం! ధోని తల్లిదండ్రులు పాన్‌సింగ్, దేవకీ దేవి, ధోని సోదరి జయంతి గుప్తా గురించి తెలుసు! ఇక మహేంద్రుడి భార్య సాక్షి సింగ్, కుమార్తె జీవా ధోని గురించి తెలిసిందే! ఇంతకంటే.. కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముందనుకుంటున్నారా?! ధోని తోబుట్టువు! ఉందండీ!.. దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ధోని మరో తోబుట్టువు, సోదరుడి గురించి ప్రస్తావించలేదు. అవును.. ధోనికి ఓ అన్న ఉన్నాడు. అతడి పేరు నరేంద్ర సింగ్ ధోని. కొన్నాళ్ల క్రితం ధోని రాంచిలోని తన పొలంలో ముగ్గురు వ్యక్తులతో దిగిన ఫొటోను నెట్టింట వైరల్ అయింది. అతడు నరేంద్రేనా? ఐపీఎల్-2023 టైటిల్ గెలిచిన తర్వాత నరేంద్ర.. ధోనిని కలిశాడని ది క్రిక్టైమ్ వెల్లడించింది. ధోని గ్యారేజీ టూర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న తరుణంలో ఈ ఫొటోలను తెరమీదకు తెచ్చారు కొంతమంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చి దాదాపు వెయ్యి కోట్లకు అధిపతిగా ఎదిగిన ధోని.. అన్న గురించి మాత్రం ఎందుకు ఎప్పుడూ ప్రస్తావించలేదో అర్థం కావడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది! అతడి పరిస్థితి చూస్తుంటే దీనస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోందని సానుభూతి చూపిస్తున్నారు. బయోపిక్‌లోనూ అతడి ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఎంఎస్ అభిమానులు కూడా ఇందుకు దీటుగానే బదులిస్తున్నారు. నరేంద్ర సింగ్ ధోని గతంలో టెలిగ్రాఫ్ ఇండియా పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ట్రోల్స్‌కు సమాధానమిస్తున్నారు.\ తనకు నేను సాయం చేయలేదు.. అయినా ‘మహీ బాల్యం, యువకుడిగా ఉన్నపుడు కష్టాలు పడ్డ సమయంలో నేను తనకు సాయం చేసిందేమీ లేదు.. ఈ ప్రపంచానికి ఎంఎస్డీగా పరిచయమవడంలో కూడా నా ప్రమేయమేమీ లేదు. నిజానికి ఈ సినిమా మహీ గురించి.. అతడి కుటుంబం గురించి కాదు! ఇరికించాల్సిన అవసరం లేదు మహీ నాకంటే పదేళ్లు చిన్నవాడు. తను మొదటిసారి బ్యాట్ పట్టుకునే సమయానికి నేను రాంచి నుంచి వెళ్లిపోయాను. ఉన్నత విద్య కోసం అల్మోరాలోని కుమాన్ యూనివర్సిటీకి వెళ్లిపోయాను. అయితే, మహీకి కొన్ని విషయాల్లో నేను నైతికంగా అండగా ఉన్నప్పటికీ అవన్నీ సినిమాలో ఇరికించాల్సిన అవసరం లేదు’’ అని నరేంద్ర సింగ్ ధోని నాటి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. రాజకీయ నాయకుడిగా కాగా నరేంద్ర సింగ్ ధోనికి రాజకీయాలంటే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. 2013లో అతడు సమాజ్‌వాదీ పార్టీలో చేరినట్లు సమాచారం. అంతకుముందు బీజేపీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2007లో వివాహం చేసుకున్న నరేంద్రకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. 42 ఏళ్ల ధోని ఐపీఎల్-2024లోనూ బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగానే కనిపిస్తున్నాయి. చదవండి: 20 లక్షలు పెట్టాడు.. గూస్బంప్స్ వచ్చాయి! ఏకంగా కోటి 70 లక్షలు.. కళ్లెమ్మట నీళ్లు.. సూర్యకు 32, నాకింకా 22 ఏళ్లే.. అతడితో పోలికా?: పాక్ బ్యాటర్ ఓవరాక్షన్ -
పవన్ పై వంగవీటి నరేంద్ర ప్రశ్నలు
-
World Boxing Championships: నరేందర్ ముందుకు... శివ థాపాకు చుక్కెదురు
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నరేందర్ బెర్వాల్ (ప్లస్ 92 కేజీలు), గోవింద్ సహాని (48 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... దీపక్ కుమార్ (51 కేజీలు) రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. అయితే స్టార్ బాక్సర్ శివ థాపా పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. తొలి రౌండ్ బౌట్లలో నరేందర్ 4–1తో మొహమ్మద్ అబ్రోరిదినోవ్ (తజికిస్తాన్)పై, గోవింద్ 5–0తో మెహ్రోన్ షఫియెవ్ (తజికిస్తాన్)పై, దీపక్ 5–0తో లూయిస్ డెల్గాడో (ఈక్వెడోర్)పై విజయం సాధించారు. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన శివ థాపా ఈసారి మాత్రం నిరాశపరిచాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్లో బరిలోకి దిగిన శివ థాపా 3–4తో డోస్ రెస్ యురీ (బ్రెజిల్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో భారత బాక్సర్లు హుసాముద్దీన్ (57 కేజీలు), ఆశిష్ చౌధరీ (80 కేజీలు), నవీన్ (92 కేజీలు) పోటీపడతారు. -
త్రిపుర రెవన్యూ శాఖ మంత్రి కన్నుమూత.. సీఎం సంతాపం
అగర్తలా: త్రిపుర రెవన్యూ శాఖ మంత్రి, ఇండీజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) చీఫ్ నరేంద్ర చంద్ర దేవవర్మ(84) కన్నుమూశారు. రాష్ట్ర రాజధాని అగర్తలలోని గోవింద్ వల్లభ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో గత శుక్రవారం ఆసుపత్రిలో చేరారు దేవవర్మ. మెదడులోని నరాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల సర్జరీ చేశారు వైద్యులు. ఆ తర్వాత ఐసీయూకి మార్చి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ‘రాష్ట్ర కేబినెట్ సీనియర్ సభ్యులు ఎన్.సీ.దేవవర్మ మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నా. ఓం శాంతి!’ అని ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సాహా. మరోవైపు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి సంతాపం ప్రకటించారు రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది దేవవర్మ పార్టీ ఐపీఎఫ్టీ. 2018లో ఐపీఎఫ్టీతో జతకట్టి అప్పటి లెఫ్ట్ ఫ్రంట్‌ను అధికారంలో నుంచి దించింది బీజేపీ. 1997లో ఐపీఎఫ్టీ ఏర్పడినప్పటికీ 2001లో విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత 2009లో దేవవర్మ నేతృత్వంలో మళ్లీ పార్టీ పుంజుకుంది. త్రిపురతో పాటు ఢిల్లీలోనూ పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు దేవవర్మ. ఇదీ చదవండి: షాకింగ్: యువతిని కారుతో 4 కిమీ ఈడ్చుకెళ్లి.. నగ్నంగా వదిలేసి! -
రంగా ఎదుగుదలను ఓర్వలేక ఓ పార్టీ పొట్టన పెట్టుకుంది
చల్లపల్లి (అవనిగడ్డ): తనను నమ్మినవారికోసం ఎన్నో కష్టాలు పడుతూ, కుట్రలు, కుతంత్రాల మధ్య విజయపథంలో పయనిస్తున్న వంగవీటి మోహనరంగాను చూసి తట్టుకోలేక స్వార్థ ఆలోచనతో ఒక పార్టీ ఆయన్ని హత్యచేసేవరకు నిద్రపోలేదని రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర చెప్పారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆయన వర్ధంతి సందర్భంగా సోమవారం నరేంద్ర ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా రంగా విగ్రహం పెడుతున్నారంటే తప్పుచేసిన వారి వెన్నులో వణుకు పుడుతోందని చెప్పారు. నాడు రంగాను చంపిన పార్టీ నాయకులు ఇప్పుడు ఆయన విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. రంగా విగ్రహాలు పెడతామని, వర్ధంతి, జయంతి చేస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాధారంగా మిత్రమండలి జిల్లా అధ్యక్షుడు ‘బుల్లెట్’ ధర్మారావు, జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కల్యాణి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ పాల్గొన్నారు. -
చట్ట ప్రకారమే టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరెస్ట్
సాక్షి, అమరావతి: కేసుల దర్యాప్తులో చట్టప్రకారమే వ్యవహరిస్తున్నామని సీఐడీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్టు చేసిన ప్రతిసారీ వారిని అధికారులు కొట్టారంటూ దుష్ప్రచారానికి పాల్పడటాన్ని ఖండించింది. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కేసులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబును అరెస్టు చేసినట్టు వెల్లడించింది. ‘గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కార్యాలయంలోని కీలక అధికారి భార్య.. అందుకు సహకరించిన ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులు.. ఆ మహిళతో పాటు ఎయిర్ ఇండియా సిబ్బందిని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు’ అంటూ సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేసిన కేసులో ఆయన్ని అరెస్టు చేసినట్టు తెలిపింది. నరేంద్రబాబు తన ఫోన్ నుంచి వివిధ వాట్సాప్ గ్రూపుల్లో ఆ మెసేజ్‌లు పోస్టు చేయడం ద్వారా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పింది. ఆయన్ని విచారించేందుకు ఇంటికి వెళ్లగా ఆయన తన ఫోన్లోని మెసేజ్‌లను డిలీట్ చేసేందుకు యత్నించారని తెలిపింది. దాంతో ఐపీసీ సెక్షన్ 201ను అదనంగా నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఆ ప్రకటనలో సీఐడీ వెల్లడించింది. -
టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ అరెస్ట్
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టిన కేసులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని మీడియా కో ఆర్డినేటర్ దారపునేని నరేంద్రను సీఐడీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తున్న ఒక మహిళను గన్నవరం విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సెప్టెంబరు 9న అరెస్టు చేశారు. ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి భార్య అంటూ కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. ‘సీఎంవోలోని ఓ కీలక అధికారి భార్య దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ గన్నవరం విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఆమెతోపాటు ఎయిర్ ఇండియా సిబ్బందిని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు..’ అంటూ ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి ఆ మహిళ ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఏ అధికారి కుటుంబసభ్యురాలు కాదు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. దీనిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియా కో ఆర్డినేటర్ దారపునేని నరేంద్ర కూడా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినట్టు సీఐడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. నరేంద్ర స్వయంగా దుష్ప్రచార పోస్టులు పెట్టడమేగాక ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా సూపర్ స్ప్రెడర్గా వ్యవహరించారని, కుట్రపూరితంగానే ఇదంతా చేశారని తేలింది. దీంతో అతడిపై క్రైమ్ నంబర్ 61/22 కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదే అంశంపై సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేసినం దుకు జర్నలిస్ట్ అంకబాబును సీఐడీ అధికారులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
నెహ్రూ టు నరేంద్ర
భారత స్వాతంత్య్ర సమరం, స్వాతంత్య్రం వచ్చిన సందర్భం, రెండో ప్రపంచ యుద్ధానంతర పరిణామాలు, ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం, ప్రపంచ పరిస్థితులు కలసి భారత ప్రధానమంత్రి పదవికి రూపురేఖలను ఇచ్చాయి. దేశంలో బ్రిటిష్ వలస వాసనలు, మారిన రాజకీయ తాత్త్వికతలను అవగతం చేసుకుంటూ, అవి తెచ్చిన సమస్యలను అధిగమిస్తూ దేశాన్ని పునర్నిర్మాణం చేసే గురుతర బాధ్యతను మన ప్రధానులు నిర్వహించారు. 1947 నుంచి 2022 వరకు భారతీయులు 14 మంది ప్రధానుల పాలనను వీక్షించారు. ఒక్కొక్క ప్రత్యేకతతో ఒక్కొక్క ప్రధాని చరిత్ర ప్రసిద్ధులయ్యారు. 1947–1977 ప్రథమ ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ. 16 ఏళ్ల 286 రోజుల నెహ్రూ పాలనా కాలమే ఇప్పటికి వరకు రికార్డు. తరువాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ హయాం 11, 4 సంవత్సరాలతో రెండో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మూడో స్థానంలో నిలుస్తారు. లాల్ బహదూర్‌శాస్త్రి (19 నెలలు), గుల్జారీలాల్ నందా (రెండు పర్యాయాలు ఆపద్ధర్మ ప్రధాని, 27 రోజులు), రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు (ఐదేసి సంవత్సరాలు) ప్రధాని పదవిలో ఉన్నారు. మొత్తంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రధానులే దాదాపు 56 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలన్న నిర్ణయం తరువాత ఏర్పడిన జాతీయ ప్రభుత్వానికి (1946) నాయకత్వం వహించినవారు నెహ్రూయే. ఆపై 1947 ఆగస్ట్ 15 నుంచి స్వతంత్ర భారత తొలి ప్రధాని. దేశ విభజన నాటి నెత్తుటి మరకలు ఆరకుండానే 1947 అక్టోబర్‌లో పాకిస్తాన్ తో యుద్ధం చేయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన, అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు, ఐఐటీలు, భారీ నీటిపారుదల పథకాలు, భారీ పరిశ్రమలు ఆయన హయాం ప్రత్యేకతలు. 1962లో ఆయన పాలనలోనే చైనాతో యుద్ధం జరిగింది. అది చేదు ఫలితాలను మిగిల్చింది. 1964 లో నెహ్రూ మరణంతో లాల్ బహదూర్‌శాస్త్రి ప్రధాని అయ్యారు. 1965లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఓడిన పాకిస్తాన్ తో శాంతి ఒప్పందం మీద సంతకాలు చేయడానికి తాష్కెంట్ (సోవియెట్ రష్యా) వెళ్లిన శాస్త్రి అక్కడే అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు. జైజవాన్ జై కిసాన్ ఆయన నినాదమే. తరువాత 1966లో ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఇందిర పాలన అంటే కొన్ని వెలుగులు, ఎక్కువ చీకట్ల సమ్మేళనం. ఆమె బ్యాంకులను జాతీయం చేశారు. రాజభరణాలు రద్దు చేశారు. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నికలో ఆమె నిర్వహించిన విధ్వంసక భూమికతో కాంగ్రెస్ చీలిపోయింది. పార్టీ నిర్ణయించిన నీలం సంజీవరెడ్డిన ఓడించి, తాను నిలబెట్టిన వీవీ గిరిని ‘ఆత్మ ప్రబోధం’ నినాదంతో గెలిపించిన అపకీర్తి ఆమెది. 1971లో ఇందిర కూడా పాకిస్తాన్ తో యుద్ధం చేశారు. ఆ యుద్ధ ఫలశ్రుతి భారత్ గెలుపు, బంగ్లాదేశ్ ఆవిర్భావం. ఇందిర హయాంకు మకుటాయమానమైనది 1974 నాటి పోఖ్రాన్ అణపరీక్ష (స్మైలింగ్ బుద్ధ). దీనితో భారత్ ప్రపంచంలోనే అణుపాటవం ఉన్న ఆరోదేశంగా ఆవిర్భవించింది. 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఇందిర చరిత్రలో తన స్థానాన్ని తానే చిన్నబుచ్చుకున్నారు. అలా కాంగ్రెస్‌కు ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించి పెట్టిన ఘనత కూడా ఆమెదే. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత 1977లో జనతా పార్టీ ఏర్పడింది. అందులో భారతీయ జనసంఘ్ భాగస్వామి అయింది. ద్వంద్వ సభ్యత్వం కారణంగా జనతా పార్టీని వీడిన జనసంఘ్ సభ్యులు 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. భారత రాజకీయాలలో జాతీయ స్థాయి పార్టీగా కాంగ్రెస్‌కు ఉన్న స్థానాన్ని కూలదోసిన పార్టీగా బీజేపీ ఎదగడం చరిత్ర. జనతా పార్టీ, ప్రభుత్వం కుప్ప కూలిపోవడంతో 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగి ఇందిర మళ్లీ ప్రధాని అయ్యారు. ఇది కూడా చరిత్రలో ఒక అనూహ్య ఘట్టమే. అత్యవసర పరిస్థితి తరువాత ఘోరంగా ఓడిపోయిన పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. రెండో దశ ఏలుబడిలో ఆమె చేసిన సాహసోపేత నిర్ణయం అమృత్సర్ స్వర్ణాలయం మీద ఆపరేషన్ బ్లూ స్టార్, పేరిట సైనిక చర్య. కానీ అది సాహసం కాదు, దుస్సాహసమేనని చరిత్ర రుజువు చేసింది. ఆ చర్య నుంచి వచ్చిన ప్రతీకార జ్వాలకే ఆమె 1984లో ఆహుతయ్యారు. అంగరక్షకులే కాల్చి చంపారు. ఇందిర భారత తొలి మహిళా ప్రధానిగానే కాదు, హత్యకు గురైన తొలి ప్రధానిగా కూడా చరిత్రకు ఎక్కారు. 1977–1980 ఈ కొద్దికాలంలోనే భారతదేశం ఇద్దరు ప్రధానులను చూసింది. ఒకరు మొరార్జీ దేశాయ్, మరొకరు చౌధురి చరణ్‌సింగ్. నెహ్రూతో, ఇందిరతో ప్రధాని పదవికి పోటీ పడిన మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ గెలిచిన తరువాత ప్రధాని పదవిని చేపట్టారు. స్వాతంత్య్ర సమరస్ఫూర్తి, గాంధేయవాదం మూర్తీభవించిన ప్రధాని ఆయన. వరసగా పది కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ఉన్న మొరార్జీ ప్రధానిగా రెండు సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే పదవిలో ఉన్నారు. జనతా పార్టీ పతనమే ఇందుకు కారణం. ద్వంద్వ సభ్యత్వం, రాజ్ నారాయణ్ రగడ, మాజీ జనసంఘీయుల నిష్క్రమణ వంటి కారణాలు ఆయన రాజీనామాకు దారి తీశాయి. తరువాత చౌదరి చరణ్‌సింగ్ ప్రధాని అయ్యారు. ప్రధానిగా పార్లమెంట్‌కు వెళ్లకుండా రాజీనామా చేసిన ప్రధానిగా మిగిలారు. భారత్‌కు సంకీర్ణ ప్రభుత్వాలు తప్పవన్న సంకేతం ఈ కాలం ఇచ్చింది. 1984–1996 ఇందిర హత్య తరువాత ఆమె పెద్ద కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యారు. తల్లి హత్యతో ప్రధాని పదవిని అధిష్టించిన రాజీవ్, మాజీ ప్రధానిగా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో హత్యకు గురయ్యారు. షాబోనో కేసు, హిందువుల కోసం అయోధ్య తలుపులు తెరవడం, భోపాల్ విషవాయువు విషాదం, బోఫోర్స్ తుపాకుల అవినీతి వ్యవహారం ఆయన హయాంలోనే జరిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతానికి ఆయన కృషి ఆరంభించారు. రాజీవ్ మంత్రివర్గంలోనే ఆర్థిక, రక్షణ శాఖలను నిర్వహించిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ బోఫోర్స్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి, జనతాదళ్ కూటమి బలంతో ప్రధాని పదవిని చేపట్టారు. ఉపప్రధాని దేవీలాల్‌తో వీపీ సింగ్‌కు విభేదాలు తీవ్రమైనాయి. అలాంటి సందర్భంలో సింగ్ మండల్ కమిషన్ నివేదికను బయటకు తీశారని చెబుతారు. ఎల్‌కె అడ్వాణిని అయోధ్య రథం మీద నుంచి దించడంతో వీపీ సింగ్‌ను ప్రధాని పదవి నుంచి బీజేపీ దించివేసింది. సింగ్ తరువాత చంద్రశేఖర్ కాంగ్రెస్ ‘బయటి నుంచి మద్దతు’తో ప్రధాని అయ్యారు. చంద్రశేఖర్ సమాజ్‌వాదీ జనతా పార్టీ మైనారిటీ ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా ఆమోదింప చేయలేకపోయింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఈ ప్రభుత్వం బంగారాన్ని కుదువ పెట్టవలసి వచ్చింది. చంద్రశేఖర్ తరువాత తెలుగువారు పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ఒక తీవ్ర సంక్షోభం నుంచి బయటపడవేసిన వారు పీవీ. కానీ అయోధ్య వివాస్పద కట్టడం ఆయన హయాంలోనే కూలింది. మైనారిటీ ప్రభుత్వమే అయినా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఘనత పీవీ ప్రభుత్వానికి ఉంది. 1996–2004 ఒక రాజకీయ సంక్షుభిత దేశంగానే భారత్ కొత్త మిలీనియంలోకి అడుగు పెట్టింది. కాంగ్రెస్ ప్రభను కోల్పోతుండగా, బీజేపీ బలపడుతున్న కాలమది. అలాగే హంగ్ యుగం కూడా. ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి చిరకాలం కొనసాగింది. 1996లో జరిగిన ఎన్నికలలో అతి పెద్ద మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ హంగ్ లోక్‌సభ ఏర్పడింది. వాజపేయి తొలిసారి 1996 మే 16 న ప్రధానిగా ప్రమాణం చేశారు. 1996 జూన్ 1 న రాజీనామా చేశారు. తరువాత హెచ్డి దేవెగౌడ ప్రధాని అయ్యారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. సీతారాం కేసరి నాయకత్వంలోని కాంగ్రెస్ యథాప్రకారం బయట నుంచి మద్దతు ఇచ్చింది. కానీ 11 మాసాలకే ఆయన ప్రభుత్వం పడిపోయింది. దేవెగౌడ వారసునిగా ఇందర్‌కుమార్ గుజ్రాల్ పదవీ స్వీకారం చేశారు. విదేశ వ్యవహారాలలో దిట్ట అయిన గుజ్రాల్ కూడా 11 మాసాలు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సంబంధాల గురించి గుజ్రాల్ సిద్ధాంతం పేరుతో ఒక విధానం ప్రసిద్ధమైంది. 1998లో మళ్లీ మధ్యంతర ఎన్నికలను దేశం ఎదుర్కొనవలసి వచ్చింది. ఈసారి చాలా పార్టీలు బీజేపీ వెనుక నిలిచాయి. నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ కూటమి ఏర్పడి, వాజపేయి ప్రధాని అయ్యారు. కూటమిలో భాగస్వామి అన్నా డీఎంకే మద్దతు ఉపసంహరించుకొనడంతో ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోయింది. 1999లో మళ్లీ ఉప ఎన్నికలు జరిగి ఎన్ డీఏ విజయం సాధించింది. వాజపేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. కొద్ది నెలలు మినహా పూర్తి సమయం అధికారంలో కొనసాగారు. తన పదమూడు మాసాల పాలనలోనే వాజపేయి పోఖ్రాన్ 2 అణుపరీక్ష జరిపించారు. మూడోసారి ప్రధాని అయినప్పుడు పాకిస్తాన్ తో కార్గిల్ సంఘర్షణ జరిగింది. లాహోర్ బస్సు దౌత్యం వంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. 2004–2022 2004లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికమంత్రి, ఆర్థిక సంస్కరణల శిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. 2009 ఎన్నికలలో కూడా మళ్లీ యూపీఏ గెలిచి ఆయనే ప్రధాని అయ్యారు. యూపీఏ మొదటి దశ సజావుగానే సాగినా, రెండో దశ అవినీతి ఆరోపణలను మూటగట్టుకుంది. 2014 ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. 2019లో జరిగిన ఎన్నికలలో మరొకసారి మోదీకే భారతీయులు పట్టం కట్టారు. ముప్పయ్ ఏళ్ల తరువాత తిరుగులేని మెజారిటీ సాధించిన పార్టీగా 302 సీట్లు బీజేపీ సాధించింది. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా ఎంపిక చేసిన ఘనతను కూడా బీజేపీ దక్కించుకుంది. – డా. గోపరాజు నారాయణరావుఎడిటర్, ‘జాగృతి’ (చదవండి: మహాత్మా మన్నించు..) -
టీడీపీ నేత నరేంద్ర నిర్వాకం.. పెళ్లి చేసుకొని..
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేత నిర్వాకం బయటపడింది. పెళ్లి చేసుకొని ఐదేళ్ల నుంచి కాపురం చేయకుండా తప్పించుకు తిరుగుతున్నాడని భార్య నవ్యత ఆరోపిస్తోంది. ఏదో ఒక సాకుతో తనకు దూరంగా ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే తనను వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని తల్లిదండ్రులతో కలిసి కృష్ణా నది ఒడ్డున దీక్షకు దిగింది. చదవండి: (తప్పు మీద తప్పు.. ఇదేనా చంద్రబాబు ‘పెద్దరికం’?) -
AP: రైలు ప్రయాణికులకు శుభవార్త.. 22 నుంచి రైళ్ల సంఖ్య పెంపు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా కాకినాడ టౌన్–లింగంపల్లి–కాకినాడ మీదుగా రైళ్ల రవాణా సంఖ్యను పెంచామని గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం నరేంద్ర వర్మ గురువారం వెల్లడించారు. చదవండి: తీర్థ యాత్రలకు ప్రత్యేక పర్యాటక రైళ్లు నంబర్ 07275 రైలు కాకినాడ టౌన్–లింగంపల్లి వయా గుంటూరు డివిజన్ మీదుగా ఈ నెల 22, 25 ,27, 29 వరకు ఈ సంఖ్యను పెంచామని తెలిపారు. అలాగే 07276 నంబర్ రైలు లింగంపల్లి–కాకినాడటౌన్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ఈ నెల 23, 26, 28, 30వ తేదీల వరకు రైళ్ల సంఖ్యను పెంచామని చెప్పారు. -
వంగవీటి రంగాను చంపించిన వ్యక్తి చంద్రబాబు: వంగవీటి నరేంద్ర
సాక్షి, విజయవాడ: చంద్రబాబు దొంగ ఏడ్పులతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడని బీజేపీ నేత వంగవీటి నరేంద్ర అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కంటి వెంట ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యుల క్యారెక్టర్‌ను కించపరిచిన వ్యక్తి చంద్రబాబు. ముద్రగడ భార్యను పోలీసులతో పచ్చి బూతులు తిట్టించారు. చిరంజీవి గురించి.. ఆయన కూతురు గురించి తప్పుడు ప్రచారం చేయించారు. పవన్ కల్యాణ్ తల్లి గురించి, భార్యల గురించి ఇష్టానుసారంగా తిట్టించిన వ్యక్తి. వంగవీటి రంగాను చంపించిన వ్యక్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్యను, తల్లిని శాసనసభలో తిట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ వంగవీటి నరేంద్ర తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చదవండి: (విధి ఎవర్నీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుంది: ఆర్కే రోజా) -
ప్రముఖ గాయకుడు కన్నుమూత.. ప్రధాని సంతాపం
న్యూఢిల్లీ: ప్రముఖ గాయకుడు నరేంద్ర చంచల్(80) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కాగా పంజాబ్‌లో జన్మించిన నరేంద్ర చంచల్.. ‘భజన్ కింగ్’గా గుర్తింపు పొందారు. ఆధ్యాత్మిక భజనలతో పాటు పలు హిందీ పాటలు ఆలపించిన ఆయన, బాబి సినిమాలోని ‘బేషక్ మందిర్ మసీద్’ పాటకు గానూ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నారు. (చదవండి: ‘ది కశ్మీరీ ఫైల్స్’.. బెదిరింపులకు భయపడను ) ప్రధాని సంతాపం నరేంద్ర చంచల్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. తన మధురమైన గానంతో ఆధ్యాత్మిక ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక దిగ్గజ గాయకురాలు లతా మంగేష్కర్ సైతం సోషల్ మీడియా వేదికగా నరేంద్ర చంచల్‌కు నివాళులు అర్పించారు. అదే విధంగా టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ నరేంద్ర చంచల్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఆయన కుటుంబానికి ప్రగాభ సానుభూతి ప్రకటించాడు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆయనను స్మరించుకుంటూ ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించింది. लोकप्रिय भजन गायक नरेंद्र चंचल जी के निधन के समाचार से अत्यंत दुख हुआ है। उन्होंने भजन गायन की दुनिया में अपनी ओजपूर्ण आवाज से विशिष्ट पहचान बनाई। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम् शांति! — Narendra Modi (@narendramodi) January 22, 2021 Deeply saddened to learn that iconic and most loved #NarendraChanchal ji has left us for the heavenly abode. In prayers for his soul to rest in peace. Heartfelt condolences to his family 🙏🙏 — Harbhajan Turbanator (@harbhajan_singh) January 22, 2021 मुझे अभी पता चला की बहुत गुणी गायक, मातारानी के भक्त नरेंद्र चंचल जी का आज स्वर्गवास हुआ. ये सुनके मुझे बहुत दुख हुआ.वो बहुत अच्छे इंसान थे,ईश्वर उनकी आत्मा को शांति प्रदान करें.मैं उनको विनम्र श्रद्धांजली अर्पण करती हूँ. — Lata Mangeshkar (@mangeshkarlata) January 22, 2021 -
ఫైటర్ పైలెట్
పాకిస్తాన్ జైలులో ఖైదీగా ఉన్న ఓ భారతీయ బాక్సర్ ఎలా బయటపడ్డాడు? అతనికి ఎవరు సహాయం చేశారు? అసలు.. అతను ఖైదు కావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అన్న అంశాల నేపథ్యంలో జయంత్ సి. పరాన్జి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నరేంద్ర’. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఫీమేల్ ఫైటర్ పైలెట్‌గా నటిస్తున్నారు. ‘‘పాకిస్తాన్ జైలులో ఖైదీ అయిన భారతీయ మాజీ బాక్సర్‌గా నీలేష్ నటిస్తున్నారు. స్వేచ్ఛా పోరాటానికి మద్దతు ఇచ్చే మానవ హక్కుల కార్యకర్తగా బ్రెజిలియన్ బ్యూటీ ఇసాబెల్లా లియేటి కనిపిస్తారు. భారత ఖైదీలను రక్షించే ప్రయత్నంలో తనను తాను త్యాగం చేసుకునే ఆప్షన్ ఖైదీ పాత్రను డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ద గ్రేట్ ఖలి చేశారు. ఈ సినిమాలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రామ్ సంపత్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. -
ఉపాధి వేటలో విజేత
గల్ఫ్ డెస్క్: ఒమాన్‌లో సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూనే సేవా రంగంలోనూ రాణిస్తున్నారు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన నరేంద్ర పన్నీరు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తన తండ్రి ఎల్లయ్య బాటలోనే గల్ఫ్‌కు పయనమయ్యాడు. గల్ఫ్ దేశాల్లో టెలికం రంగం ప్రైవేటీకరణ ఆరంభమైన మొదట్లోనే సర్వీస్ ప్రొవైడర్‌గా సబ్ కాంట్రాక్టును దక్కించుకున్న ఎల్లయ్య తక్కువ సమయంలోనే ఖతార్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. టెలికం రంగంలో ఉపాధి పొందడానికి గల్ఫ్ దేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ఎల్లయ్య తన కుమారునికి అదే రంగంలో శిక్షణ ఇప్పించి నైపుణ్యం ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దారు. ఖతార్ మంత్రితో తండ్రికి స్నేహం.. నరేందర్ తండ్రి ఎల్లయ్య ఉపాధి కోసం ఖతార్‌కు 1980లో వెళ్లాడు. అక్కడ ఆయన వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. బట్టలు కుట్టి అమ్ముతున్న ఎల్లయ్య వద్దకు అప్పట్లో ఖతార్ సమాచార శాఖ మంత్రి వచ్చి వెళ్లేవారు. 1984లో ఖతర్ టెలికం రంగాన్ని ప్రైవేటీకరించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో సర్వీస్ ప్రొవైడర్(కాంట్రాక్టర్)ల సేవలు అవసరం అయ్యాయి. మంత్రి ప్రోత్సాహంతో ఎల్లయ్య కొత్తగా టెలికం వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆయన 2010 వరకు ఖతార్‌లో టెలికం వ్యాపారాన్ని కొనసాగించారు. ఒమాన్‌లో సొంతంగా వ్యాపారం.. ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఫైబర్ టెక్నాలజీని పూర్తిచేసిన నరేంద్ర మొదట ఉపాధి కోసం టెలికం రంగంలో పనిచేశారు. అయితే ఇక్కడ టెలికం రంగంలో పనిచేస్తే వేతనాలు తక్కువగా ఉండటంతో నరేందర్ ఖతార్‌లో ఉన్న తండ్రి వద్దకు 2002లో వెళ్లారు. తండ్రికి సొంతంగా వ్యాపారం ఉన్నా నరేందర్ మాత్రం ఖతార్‌లోని ఒరిడో అనే టెలికం కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. 2012లో స్వదేశానికి తిరిగివచ్చిన నరేందర్.. ఖతార్ కంటే ఒమాన్‌లో అవకాశాలు మెండుగా ఉన్నాయని గుర్తించి 2013లో ఒమాన్‌కు వెళ్లి అక్కడ టెలికం వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నరేందర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఒమాన్‌లోని అల్ కువైర్ పట్టణంలో టెలికం వ్యాపారాన్ని నిర్వహిస్తూ కుటుంబ సమేతంగా నివసిస్తున్నారు. సేవా కార్యక్రమాలు.. నరేంద్ర ఒమాన్‌లో వ్యాపారం నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి చేయూతనందిస్తున్నారు. ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అనే సంస్థను ఆరంభించి ఆ సంస్థ ద్వారా ఖల్లివెల్లి కార్మికులకు స్వదేశానికి వెళ్లడానికి టిక్కెట్లను సమకూర్చడం, ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను ఇంటికి పంపించడం, కంపెనీ యజమానుల చేతుల్లో మోసపోయిన వారికి న్యాయ సహాయం అందించడం తదితర సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఒమాన్‌లోని అధికారులతో ఉన్న సంబంధాలతో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులకు సహాయ సహకారాలను నరేంద్ర అందిస్తున్నారు. కళలు, సాహస క్రీడలు.. ఒక వైపు వ్యాపారం, మరో వైపు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న నరేందర్ సమయం చిక్కినప్పుడు కళలు, సాహస క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ జానపద గాయకుడైన నరేంద్ర ఉత్సాహవంతులైన వారిని గుర్తించి వారిని మంచి గాయకులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ జానపద గీతాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున, ఉగాది పర్వదినం సందర్భంగా ఆలపించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బతుకమ్మ సంబరాలను, అంతర్జాతీయ యోగా దినోత్సవాలను కూడా ఒమాన్‌లో నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కళల పట్ల ఎంత మక్కువ చూపుతున్నాడో.. సాహస క్రీడల పట్ల అంతే ఆసక్తిని కనబరుస్తున్నారు. స్విమ్మింగ్‌తో పాటు పారాగ్లైడింగ్ లాంటి సాహస క్రీడలో నరేందర్ ప్రత్యేకతే వేరు. పారాగ్లైడింగ్‌లో కమర్షియల్ లైసెన్స్ పొంది ఇటీవలే 3,700 ఫీట్ల ఎత్తు నుంచి దూకి తన సాహసాన్ని చాటాడు. నాన్నే గురువు ఒమాన్‌లో సొంతంగా టెలికం వ్యాపారం నిర్వహించడానికి నాకు మా నాన్నే మార్గదర్శి. నాన్న చెప్పినట్లు టెలికం రంగాన్ని ఎంచుకున్నా. సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా స్ఫూర్తి మా నాన్ననే. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మన సహాయం కోసం ఎదురు చూసేవారికి కచ్చితంగా తోడుగా ఉండాలని నాన్న ఎప్పుడు చెబుతుండేవారు. అందువల్లే సేవా కార్యక్రమాలను బాధ్యతగా కొనసాగిస్తున్నా.– నరేంద్ర పన్నీరు -
హీరోగానే కాదు... కామెడీ పాత్రలూ చేస్తా
‘‘హాస్యనటులు హీరోగా సక్సెస్ కాలేరనే మాటలను అంతగా నమ్మను. మంచి కథ, ఆలోచనా విధానం, సరైన ప్రణాళిక ఉంటే సక్సెస్ కావొచ్చు’’ అని సప్తగిరి అన్నారు. అరుణ్ పవార్ దర్శకత్వంలో సప్తగిరి హీరోగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. వైభవి జోషి కథానాయికగా నటించారు. నరేంద్ర యడ్ల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సప్తగిరి చెప్పిన విశేషాలు... ►కథ బాగాలేకపోతే ఏ సినిమా ఆడే పరిస్థితి లేదు. కథపై నమ్మకంతోనే ఈ సినిమా చేశా. ఇందులో గోవింద అనే దొంగ పాత్ర పోషించాను. క్యాన్సర్ బాధితులకు న్యాయం చేయాలనే ఓ దొంగ కథ ఇది. ఓ వజ్రం చుట్టూ కథ అంతా తిరుగుతుంది. ఇందులో మూడు గెటప్స్‌లో కనిపిస్తాను. కుక్క, పాము పాత్రలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటాయి. కర్నూలులోని బెలూన్గుహల్లో ప్రాణాలకు తెగించి సన్నివేశాలను చిత్రీకరించాం. ►హీరోగా ఇది నా మూడో సినిమా. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ’ సినిమాలు సందేశాత్మకం. ఈ సినిమాలోనూ క్యాన్సర్ బాధితుల సమస్యలను ప్రస్తావించాం. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ తీసిన అరుణ్ పవార్‌తో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓ సెంటిమెంట్లా కూడా భావిస్తున్నాను. ►నా గత సినిమాల్లో కామెడీ కంటెంట్ కాస్త తక్కువగా ఉండటానికి కారణం నాలోని అసిస్టెంట్ డైరెక్టరే. నా సినిమాలో ఏదో ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను. అలాగని డైరెక్షన్లో ఇన్వాల్వ్ కాను. నా అభిప్రాయాలు, సూచనలు పంచుకుంటానంతే. ఈ సినిమాలో సందేశంతో పాటు మంచి కామెడీ ఉంది. ఇంటర్వెల్ తర్వాత ‘జబర్దస్త్’ టీమ్ హంగామా ఉంటుంది. ►నిజానికి నేను కమెడియన్ అవుదామని ఇండస్ట్రీలోకి రాలేదు. ‘సింధూరం, భారతీయుడు’ సినిమాలు చూసి ప్రేరణ పొంది వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. కానీ నాకు కమెడియన్‌గా అవకాశాలు వచ్చాయి. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రం ఒక్కటే నాలో మంచి కమెడియన్ ఉన్నాడని నాకు తెలిసేలా చేసింది. హీరోగా మారిన తర్వాత నేను హాస్య పాత్రలు చేయనని వారే (దర్శక–నిర్మాతలను ఉద్దేశిస్తూ) డిసైడ్ అయ్యారు. కమెడియన్ పాత్రలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇక సునీల్ అన్నగురించి నేను ప్రస్తావించలేను. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. నాకు చేతనైనంతలో మా ఊరికి ఏదో సాయం చేస్తున్నాను. ఒక ఊరిని దత్తత తీసుకునేంత స్థాయికి రాలేదు. రావాలని కోరుకుంటున్నాను. ►ప్రస్తుతం సందీప్‌కిషన్ సినిమాలో హాస్య నటుడిగా చేస్తున్నాను. నేను హీరోగా ‘దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది 2’ సినిమాల్లో నటించబోతున్నాను. మరో రెండు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా. -
రాధాకృష్ణ టీడీపీలో చేరడం బాధాకరం: వగవీటి నరేంద్ర
-
పంచ్ పడుద్ది
‘ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావ గారూ బాగున్నారా, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, లక్ష్మీనరసింహ’ వంటి సూపర్‌హిట్స్ అందించిన జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘నరేంద్ర’. నిలేష్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ మోడల్ ఇజా బెల్లాని హీరోయిన్గా ఫిక్స్చేశారు. జయంత్ సి.పరాన్జీ మాట్లాడుతూ– ‘‘చాంపియన్‌గా ఎదిగిన ఓ బాక్సర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటికే తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయింది. కొత్త షెడ్యూల్ మార్చి 10 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ రెజ్లింగ్‌లో భారతదేశం తరపున సత్తా చాటుతున్న స్టార్ రెజ్లర్ గ్రేట్ కాళీ ఈ చిత్రంలో నటిస్తుండం విశేషం. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సంపత్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. అన్ని ఎమోషన్స్‌తో ప్రేక్షకులను మెప్పించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘జయంత్గారి వంటి సీనియర్ డైరెక్టర్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో చాలెంజింగ్ రోల్ చేస్తున్నాను. మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు ఇజాబెల్లా. ఈ చిత్రానికి సంగీతం: రామ్ సంపత్, కెమెరా: వీరేన్ తంబిదొరై, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయలగుండ్ల, నిర్మాత: ఈషాన్ ఎంటర్టైన్మెంట్. -
టాలీవుడ్‌కి రెజ్లింగ్ స్టార్
ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) రెజ్లర్ ‘ది గ్రేట్ ఖలీ’ తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరేంద్ర’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు ఈ ఏడడుగుల రెజ్లర్. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో, అమెరికన్ టీవీ షోల్లో నటించిన ఖలీ ‘బిగ్‌బాస్ 4’లో కూడా కనిపించి అభిమానులను అలరించారు. స్పోర్ట్స్ డ్రామాగా జయంత్ తెరకెక్కిస్తున్న తాజా సినిమాలో నీలేష్ ఎటి, ఇజబెల్లా జంటగా నటిస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్ నేపథ్యంలో సినిమా రూపొందుతుండటంతో ఇస్లామిక్ దేశంలో చిత్రీకరణ జరిపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘నరేంద్ర’ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా, ఈ సినిమాతో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సంపత్ టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: ఇషాన్ ఎంటర్టైన్మెంట్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయలగుండ్ల, కెమెరా: విరీన్ తంబిదొరై, సంగీతం: రామ్ సంపత్, కథ–దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ. -
జయంత్ సినిమాలో రెజ్లింగ్ స్టార్
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లను డైరెక్ట్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ. కమర్షియల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న జయంత్ కొంత కాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. చివరగా గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన జయదేవ్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు జయంత్. మరోసారి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన నిలేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు జయంత్. ‘నరేంద్ర’ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈషన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమాలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ద గ్రేట్ ఖలీ కీలక పాత్రలో కనిపించనున్నాడు. -
చిలుక సాయం
కోసల రాజ్యంలో నరేంద్రుడనే రైతు ఉండేవాడు. తనకు వాటాగా సంక్రమించిన కొద్దిపాటి పొలంలో ఆరుగాలం కష్టపడి పొట్టపోసుకునేవాడు. ప్రతి ఒక్కరికీ తలలో నాలుకలా ఉండేవాడు. ఉన్నంతలోనే అందరికీ సహాయం చేసేవాడు. అతనికి పశుపక్ష్యాదులంటే ఎనలేని ప్రేమ. అతని ఇల్లు ఎన్నో జంతువుల నిలయం. ఒక జంతు ప్రదర్శన శాలలా కనబడేది. తను పస్తులున్నా సరే, వాటికి మాత్రం ఏ లోటూ లేకుండా చూసుకునేవాడు. పేదవాడైనా సరే, ఊరిలో అతడు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేవాడు. ఒక రోజు ఎప్పటిలాగే నరేంద్రుడు తన పొలంలో పనిచేసుకుంటున్నాడు. పొలంలోని చెట్టుకింద, ఒక రామ చిలుక గాయాలతో కనిపించింది. అరే, చిలుకకు ఏమై ఉంటుంది. ఎగరడం లేదు, అనుకుంటూ దానిని చేతిలోకి తీసుకున్నాడు. కొన ఊపిరితో ఉంది. రెక్కలకు తీవ్ర గాయాలు కనిపించాయి. వెంటనే దానిని ఇంటికి తీసుకెళ్ళాడు. తెలిసిన వైద్యం చేశాడు. రామ చిలుక, మెల్లగా కోలుకోసాగింది. ప్రతిరోజూ రామ చిలుకకు ఇష్టమైన పండ్లు తినిపించేవాడు. దాంతో వారి మధ్య మంచి స్నేహం కుదిరింది. నరేంద్రుడు, ఆ చిలుకతో రోజు ఎన్నో కబుర్లు చెప్పేవాడు. చిలుక సైతం, తన పలుకులతో స్పందించేది చిలుక భాష నరేంద్రుడికి, నరేంద్రుడి భాష చిలుకకు అర్థమయ్యేంత అవగాహన పెరిగింది.చిలుక పూర్తిగా కోలుకుంది. ఒకరోజు నరేంద్రునితో ‘‘నా ప్రాణాలు కాపాడినందుకు, నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నేను మా అమ్మ, నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను, నీ వద్దకు తీరిక దొరికినప్పుడల్లా వచ్చిపోతాను సెలవిప్పించండి’’ అంది రామ చిలుక. ’సరే’, అన్నాడు బాధగా నరేంద్రుడు. ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయింది రామ చిలుక. నరేంద్రుడు చాలా మంచివాడు. అతనికి ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంది రామ చిలుక. దానికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే రాణి గారి అంతఃపురం చేరింది. రాణి గారి ముత్యాల హారాన్ని నోట కరుచుకొని, నరేంద్రుని ఇంటి వద్ద వదిలేసి వెళ్ళిపోయింది.నరేంద్రుడు హారాన్ని చూశాడు. ఈ విలువైన హారం ఇక్కడికి ఎలా వచ్చింది, అనుకుంటూ చేతిలోకి తీసుకున్నాడు. పరిశీలించాడు.ఇది చాలా విలువైన ఆభరణంలా ఉంది. బహుశ రాజకుటుంబీకులకు చెందినది కావచ్చు అని అనుకొని దానిని భద్రంగా రాజ భవనానికి తీసుకెళ్ళాడు. రాజును దర్శించి, ‘‘ప్రభూ! నా ఇంటి ముందు ఈ ముత్యాల హారం పడి ఉంది. ఎలా వచ్చిందో తెలియదు. మీకు అప్పగించాలని వచ్చాను’’ అని విన్నవించాడు. రాజు జాగ్రత్తగా పరిశీలించి, రాణి ధరించే ఆభరణంగా గుర్తించాడు.రాజు, నరేంద్రుని నిజాయతీని మెచ్చుకొని, అతడిని ఖజానా కాపలాదారుగా నియమించాడు. నరేంద్రుడు చాలా సంతోషించాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒక రోజు రామచిలుక అతని ఇంటికి వచ్చింది. నరేంద్రునితో, ‘‘ఒక బందిపోటు దొంగల ముఠా రాజు గారి ఖజానాపై కన్నేసింది. దానిపై దాడిచేసి ఖజానాను లూటీ చేయాలని వారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ ముఠా అడవిలోని మర్రిచెట్టు కింద సమావేశమై ఎలా దాడి చేయాలనే దానిపై మాట్లాడుకుంటున్నారు. వారి మాటలను నేను చెట్టు పై నుంచి విన్నాను’’ అని చెప్పింది.నరేంద్రుడు వెంటనే ఈ విషయాన్ని రాజుకు తెలియజేశాడు. రాజు సైనికులను అప్రమత్తం చేశాడు. దొంగల ముఠా దాడిని సులువుగా తిప్పికొట్టారు. ముఠాలోని దొంగలందరినీ బంధించి, రాజుగారి ముందు హాజరుపరచారు. నరేంద్రుని తెలివిని, తెగువను మెచ్చుకున్న రాజు అతనికి సైన్యంలో ఉన్నతోద్యోగం ఇచ్చాడు. మరికొన్ని నెలలు గడిచాయి మళ్ళీ రామచిలుక ఇంటికి వచ్చి నరేంద్రుడిని కలిసింది. ‘‘రాజు గారిని కూలదోయడానికి దాయాదులు కుట్ర పన్నుతున్నారు. నేను దాయాదుల మాటలు విన్నాను. రాజును మరింత జాగ్రత్తగా ఉండమని చెప్పు’’ అని చెప్పి వెళ్ళింది.నరేంద్రుడు ఈ విషయాన్ని రాజుకు తెలియజేశాడు. రాజు ముందుగా ఈ విషయాన్ని నమ్మలేదు. అయినప్పటికి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు.నమ్మకమైన అంగరక్షకులను నియమించుకున్నాడు. అనుకున్నట్టు గానే దాయాదులు రాజ మందిరంపై దాడి చేశారు. అయితే అంగరక్షకులు దాడిని తిప్పికొట్టారు. రాజు సురక్షితంగా బయటపడ్డారు.రాజు వెంటనే నరేంద్రుడిని రమ్మని కబురు పంపాడు. ‘‘నీకు రుణపడి ఉంటాను. నీ ముందస్తు సమాచారం వల్లనే నేను ప్రాణాలతో బయటపడ్డాను. నీ వంటి విధేయులు నాకు ఎంతో అవసరం. నా రాజ్యానికి మరింత అవసరం. నిన్ను సైన్యాధ్యక్షునిగా నియమిస్తున్నాను’’ అంటూ ఉత్తర్వులు జారీ చేశాడు.ఏడాది గడిచాక ఒక రోజు చిలుక మళ్ళీ వచ్చింది. నరేంద్రునితో ముచ్చటిస్తూ ‘‘ఒక ముఖ్యమైన వార్తను మోసుకు వచ్చాను. రాజ్యానికి ఉత్తరాన ఉన్న సరిహద్దు రాజ్యం ఈ రాజ్యాన్ని కబళించాలని వ్యూహ రచన చేస్తోంది. నీవు నీ సైన్యంతో అప్రమత్తంగా ఉండు’’ అంటూ వారి సైనిక కదలికలను ఎప్పటికప్పుడు నరేంద్రునికి చేరవేసింది. యుద్ధంలో నరేంద్రుని సైన్యం, పొరుగు రాజు సేనలను చిత్తు చేసింది. నరేంద్రుని పేరు ప్రఖ్యాతలు దశ దిశలా వ్యాపించాయి. నరేంద్రుని శక్తియుక్తులపై రాజుకు పూర్తిగా నమ్మకం ఎర్పడింది.కొన్నాళ్లకు రాజు వ్యాధిగ్రస్తుడై మంచం పట్టాడు. వైద్యులు నయంగాని వ్యాధి అని చేతులెత్తేశారు. దీంతో రాజు మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేశాడు. వారితో చర్చించి, వారి ఆమోదంతో నరేంద్రుడిని రాజుగా ప్రకటించాడు. నరేంద్రుని పట్టాభిషేకం ఘనంగా జరిగింది. రామచిలుకలు పూల మాలతో సన్మానించాయి. చిలుక సహాయానికి, ఆ పక్షిని రాజ్య పక్షిగా ప్రకటించాడు. తన రాజ్యంలోజంతు హింసను నిషేధించి, జనరంజకంగా పరిపాలిస్తూ ప్రజల మన్ననలను పొందసాగాడు. - పుల్లూరు జగదీశ్వరరావు -
స్ఫూర్తి నింపే చిత్రాలు రావాలి
‘‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’ సినిమా చాలా బాగుంది. చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూపించారు. బాల–బాలికల్లో స్ఫూర్తి నింపే ఇలాంటి గొప్ప చిత్రాలు తరచూ రావాలి’’ అని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బాలల చిత్రం ‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’. 2015 నవంబర్4న విడుదలైన ఈ చిత్రం 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం అందుకుంది. తాజాగా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పురస్కారాలు అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఆదిత్య’ చిత్రంలో నేనూ నటించాను. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘పిల్లలతో సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టం. ఆ శ్రమను గుర్తించే మా చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నాకు నంది పురస్కారం అందించారు’’ అన్నారు భీమగాని సుధాకర్ గౌడ్. నటుడు సుమన్ పాల్గొన్నారు. -
కొండా సురేఖ వర్సస్ నన్నపునేని..
సాక్షి, వరంగల్ రూరల్: వరంగల్ నగరంలోని ఇక్బాల్ మినార్ కూల్చివేత వ్యవహారంతో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఇంతకాలం చాప కింద నీరులా విస్తరిస్తున్న అసమ్మతి, ఆధిపత్య పోరు బయటపడ్డాయి. అధికార పార్టీకి చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరగా భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే తరహా పరిస్థితి ఉంది. ఉద్యమ కాలం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన, తొలి ప్రభుత్వం ఏర్పాటు వరకు టీఆర్ఎస్కు ఉమ్మడి వరంగల్ జిల్లా వెన్నుదన్నుగా నిలిచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీల ఏర్పాటు ఈ జిల్లా నుంచే మొదలైంది. ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా అధికార పార్టీ నేతల మధ్యే వర్గపోరు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. కొండా వర్సస్ నన్నపునేని.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ, మేయర్ నన్నపునేని నరేందర్ మధ్య గత రెండేళ్లుగా వర్గపోరు నడుస్తోంది. కొంతకాలం వారి మధ్య విభేదాలు సమసిపోయినట్లు కనిపించినా, గత ఆరు నెలలుగా ఇవి పరస్పర ఆరోపణలు, దూషణల వరకు వెళ్లాయి. ముఖ్యంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్, రంజాన్ ఇఫ్తార్ విందులు వీరి మధ్య పొలిటికల్ హీట్‌ను మరింత పెంచాయి. ఇరువర్గాలకు చెందిన అనుచరులు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించి బలప్రదర్శన చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఆ దశను దాటి ఏకంగా ఎదుటి వర్గంపై బాహటంగా విమర్శలు చేసే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. వరంగల్ పోచమ్మమైదాన్‌లో ఇక్బాల్ మినార్ను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు రోడ్డుపై ఎమ్మెల్యే కొండా సురేఖ ఆధ్వర్యంలో బైఠాయించారు. మరుసటి రోజు వరంగల్‌లోని ఓ గార్డెన్లో ముస్లిం నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘మేయర్ నరేందర్ నువ్వో బచ్చా’ అంటూ నేరుగా ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. శనివారం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మేయర్ నరేందర్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 2014లో తాను త్యాగం చేస్తే నే సురేఖకు టికెట్ వచ్చిందని, సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు నష్టం చేకూర్చితే నరసింహా అవతారం ఎత్తుతానని స్వరం పెంచారు. ఇదిలా ఉండగా మరోవైపు కొండా కుటుంబం నుంచి తమకు ప్రాణ హానీ ఉందని, తమకు రక్షణ కల్పిం చాలంటూ ఈ నెల 20న 15 డివిజన్ కార్పొరేటర్ శారదజోషి నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కొండా, నన్నపునేని మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరినా ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇదే తీరు.. మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రస్తు త ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత మధ్య గత మూడేళ్లుగా వర్గపోరు నడుస్తోంది. కవిత పార్టీకి వచ్చిన కొత్తలోనే ఆమె రాకను వ్యతిరేకిస్తూ శంకర్‌నాయక్ ఘాటైన వ్యా ఖ్యలు చేశారు. దీనిపై పార్టీ పెద్దలు ఎమ్మెల్యేను వివరణ అడిగారు. అయినా అక్కడి పరిస్థితిలో మార్పు రాలేదు. పార్టీపరంగా ఇరువర్గాలు వేర్వేరుగానే కార్యక్రమాలు చేపడుతున్నాయి. భూపాలపల్లి నియోజకవర్గంలో విచిత్రంగా త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్పీకర్ మధుసూదనాచారి ఉండగా గండ్ర సత్యనారాయణరావు టిక్కెట్ హామీతో పార్టీ చేరినట్లు ప్రచారం జరిగింది. వారిలో టిక్కెట్ ఎవరికి దక్కుతుందో అనే ఊగిసలాట కొనసాగుతుండగానే భూపాలపల్లి టికెట్ కొండా సుస్మిత పటేల్‌కే అంటూ కొండా దంపతులు ప్రకటించడం సంచలనంగా మారింది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తొలుత కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యకు చెందిన అనుచరుల మధ్య కొంతకాలం వర్గపోరు నడిచింది. ఆ తర్వాత అంతా సద్దుమణిగిన తర్వాత తెరపైకి రాజాçరపు ప్రతాప్ వచ్చారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యేకు పోటీగా రాజారపు ప్రతాప్ కార్యక్రమాలు చేపట్టడంపై రాజయ్య వర్గం ఫైర్ అవుతోంది. ఒకటి తర్వాత ఒకటిగా గ్రూపు రాజకీయాలు, వర్గపోరు బహిర్గతమవుతున్నా పార్టీపరంగా అధిష్ఠానం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఈ వర్గపోరు ఎక్కడి వరకు వెళ్తుందనేది ఆసక్తిగా మారింది. -
యాక్షన్ థ్రిల్లర్‌గా ‘నరేంద్ర’
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లను డైరెక్ట్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ. కమర్షియల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న జయంత్ కొంత కాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. చివరగా గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన జయదేవ్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు జయంత్. మరోసారి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన నిలేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు జయంత్. ‘నరేంద్ర’ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈషన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. -
మల్లెపువ్వుంత స్వచ్ఛంగా..
మమత, నరేంద్ర, షఫీ, ప్రియ ముఖ్య తారలుగా గౌతమ్. ఎమ్ రూపొందిస్తున్న మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ‘సిరిమల్లె పువ్వా’. ఎస్.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై కౌసర్ జహాన్ నిర్మిస్తున్నారు. తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ చేతుల మీదగా ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక మెసేజ్ ఉన్న వెరైటీ చిత్రం. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. టైటిల్‌కు తగ్గట్టుగానే సిరిమల్లె పువ్వంత స్వచ్ఛంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘గౌతమ్‌గారు చెప్పిన కథ ఎంతో నచ్చింది. మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి’’ అన్నారు కౌసర్ జహాన్. తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షులు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహనరావు, సు«ధాకర్ గోగికర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు కెమెరా: సూర్య, ప్రభాకర్, ఫిరోజ్, సంగీతం: రామ్ మోహన్. -
కుల, మతాల మధ్య చిచ్చు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీలు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి తమాషా చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా ఆరోపించారు. ఖమ్మం అర్బన్ మండలం చింతగుర్తిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితం సత్యం అధ్యక్షతన గురువారం రాత్రి నిర్వహించిన ప్రజా చైతన్య సభలో కుంతియా మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆదుకోవాల్సిన కేసీఆర్ ప్రభుత్వం వారి ఆకాంక్షలు, ఆశలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, అయితే ఈ చిచ్చు వారికే అంటుకోవడం ఖాయమన్నారు. గిట్టుబాటు ధర అడిగిన రైతులను దేశ ద్రోహుల మాదిరిగా బేడీలు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భావించి సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రకటిస్తే.. అందుకు భిన్నంగా కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు ఛిద్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రభంజనంలో వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ గాలికి కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, దేశంలో మోడీ శకం ముగిసినట్లేనన్నారు. గుజరాత్ ప్రజల తీర్పు ముందే ఊహించిన మోదీ పదిరోజుల నుంచి ఒక ప్రకటన సైతం చేయలేని దుస్థితి నెలకొందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందనడానికి ఇది ఉదాహరణగా పేర్కొన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి: ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడక తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగ యువత ఇప్పుడు తీవ్ర నిరాశ, నైరాశ్యంతో కొట్టు మిట్టాడుతోందన్నారు. కొలువులు అడిగిన నిరుద్యోగ యువకులను కేసీఆర్ ప్రభుత్వం జైళ్లలో వేస్తోందని, ఇంతటి నిరంకుశ పాలన గతంలో లేదన్నారు. రాష్ట్రంలో 2014 నాటికి 1,07,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉంటే.. కేసీఆర్ ప్రభుత్వం కనీసం 7 వేల ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేని దుస్థితిలో ఉందన్నారు. ఇక తెలంగాణ తెచ్చుకున్న ప్రయోజనం ఏముంటుందో.. నిరుద్యోగులకు ఉపశమనం ఎలా కలుగుతుందో కేసీఆర్ ప్రభుత్వమే సంజాయిషీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బలహీన, బడుగు వర్గాల కోసం అనేక పథకాలను అమలు చేయడమే కాకుండా.. లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతిగా అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకేసారి రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని సీతారామసాగర్ ప్రాజెక్టు అంచనా విలువలను పదింతలు చేసి కాంట్రాక్టర్లు, ప్రభుత్వం ప్రజల సొమ్మును దండుకుంటున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సభలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, మాజీ మంత్రి బలరాంనాయక్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, శాసనమండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎదురులేని మోదీ
వాషింగ్టన్: దేశ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ కొనసాగుతున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సర్వే సంస్థ ప్యూ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో 88 శాతం పాయింట్లతో మోదీ అగ్రస్థానంలో, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 58 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత వరసగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి 57%, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 39% పాయింట్లు దక్కాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్య 2,464 భారతీయులపై ఈ సర్వే నిర్వహించించారు. దీని ప్రకారం.. ప్రతి పది మందిలో 8 మంది దేశ ఆర్థి క పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రతి 10 మందిలో 9 మంది మోదీపై సానుకూలంగా స్పందించారు. ఇప్పటికీ దేశంలో మత కలహాలు ఆందోళన కలిగించే విషయమని కొందరు చెప్పారు. -
సిటీవాసులను కాపాడిన తమిళ పోలీసులు
సాక్షి, చెన్నై : చెన్నైలోని మెరీనా బీచ్‌లో స్నానానికి దిగిన అన్నదమ్ములను రాక్షస అల నీటిలోకి లాక్కెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన రమణ (35), నరేంద్ర (28)లు చెన్నై మదురవాయల్ కృష్ణానగర్‌లోని తమ బంధువుల ఇంటికి ఇటీవల వచ్చారు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం మెరీనా బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగిన వీరిని రాక్షస అల నీటిలోకి లాక్కెళ్లడంతో స్థానికులు కేకలు వేశారు. అక్కడ గస్తీలో ఉన్న పోలీసులు రమణ, నరేంద్రలను రక్షించి ఒడ్డుకు చేర్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అన్నదమ్ములిద్దరినీ రక్షించిన పోలీసులను స్థానికులు అభినందించారు. -
తల్లి, కుమారుడిపై కత్తితో దాడి
విజయవాడ: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ లో పనిచేసే పద్మ, ఆమె కుమారుడు నరేంద్ర సోమవారం ఉదయం బైక్‌పై వెళ్తుండగా శంకర్ అనే వ్యక్తి వారిపై కత్తితో దాడి చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో తల్లీ,కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కుమారుడు మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పద్మతో గతంలో శంకర్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల వీరిమధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని, అవే హత్యాయత్నానికి దారి తీసి ఉంటాయని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
నరేంద్రకు రాష్ట్రపతి ప్రశంస
బండిఆత్మకూరు: ఆటోమేటిక్ హెల్మెట్‌ను తయారు చేసిన సంతజూటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి నరేంద్రను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంశించినట్లు ఉపాధ్యాయుడు రవిశంకర్ తెలిపారు. శనివారం ఆయన న్యూఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడారు. ఈనెల 4 నుంచి 10వ తేదీ దాకా నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ కార్యక్రమం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహిస్తున్నారన్నారు. మొదటి రెండు రోజులు దేశంలో ఎంపికైన ఇన్స్పైర్ అవార్డుల్లో విద్యార్థులు తయారు చేసిన 60 ప్రాజెక్టులను ప్రదర్శిస్తారన్నారు. ఇందులో తమ విద్యార్థి తయారు చేసిన ఆటోమేటిక్ హెల్మెట్‌కు కూడా ఒకటిగా నిలిచిందన్నారు. రాష్ట్రపతి స్వయంగా వచ్చి విద్యార్థి తయారు చేసిన ఆటోమేటిక్ హెల్మెట్ పరిశీలించారన్నారు. -
ఇంటి నుంచి వెళ్లి శవమయ్యాడు!
రైలు పట్టాలపై యువకుడి మృతదేహం మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు అక్కిరెడ్డిపాలెం (గాజువాక) : రాత్రి ఇంటి నుంచి స్నేహితుడితో బయటకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి మరుసటి రోజు తెల్లారేసరికి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. తల్లిదండ్రు లకు తీరని శోకాన్ని మిగిల్చాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... 59వ వార్డు నాతయ్యపాలెంలో నివాసముంటున్న అమరాపు ఆనందరావు చిల్లర వ్యాపారం నిర్వహిస్తున్నాడు. భార్య ప్రమీల, టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన కుమార్తె రమ్య, కుమారుడు నరేంద్రతో నివాసం ఉంటున్నాడు. నరేంద్ర నరవ ప్రాంతంలోని ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి నరేంద్రకు స్నేహితుడి నుంచి ఫోన్ రావడంతో బయటకు వెళ్లాడు. తల్లిదండ్రులు వారించినా ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లాడు. బయటకు వెళ్లిన కుమారుడు ఎంతకీ రాకపోవడంతో రాత్రంతా ఆందోళనలో కుటుంబ సభ్యులు గడిపారు. తెలిసిన వారందరినీ విచారించినా ఫలితం లేకపోయింది. శనివారం దువ్వాడ రైల్వే పోలీసుల నుంచి నరేంద్ర ఫోన్ నుంచి తల్లిదండ్రులకు కాల్ వచ్చింది. షీలానగర్ నుంచి నరవకు వెళ్లే రైల్వే బ్రిడ్జిపై ఒక యువకుడు మృతి చెంది ఉన్నట్లు తెలపారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పట్టాలపై ఉన్న నరేంద్ర మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఒక చేతి మణికట్టు, కాలి పాదం వరకు తొలగిన ఆనవాళ్లుతో పాటు ముఖం ఒకవైపు చెక్కుకుపోయిన గుర్తులు ఉన్నాయని బంధువులు తెలిపారు. రైల్వే పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. కేజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం నాతయ్యపాలెం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతిపై అనుమానాలు! నాతయ్యపాలెం బంగారుమాంబ ఆలయం వద్ద నివాసం ఉంటున్న నరేంద్ర అంత దూరంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై చనిపోవడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో నరేంద్రకు ఫోన్ చేసింది ఎవరనేది తెలియదని తల్లిదండ్రులు అంటున్నారు. మృతిపై అనుమానాలు ఉన్నాయని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని బంధువులు అంటున్నారు. సెల్ కాల్ డేటా ద్వారా అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని, ఆ కోణంలో విచారణ చేపట్టాల్సిందిగా గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు -
అటవీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
► పరిస్థితి విషమం.. నంద్యాల ఆస్పత్రికి తరలింపు ► ఉన్నతాధికారులు వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్ ► జూనియర్‌కు పదోన్నతి కల్పించారని మనస్తాపం ► సూసైడ్ నోట్లో ముగ్గురి అధికారుల పేర్లు గిద్దలూరు : ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక అటవీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఆయన్ను నంద్యాలలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి ముందు సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఈ సంఘటన పట్టణంలోని రాచర్ల రోడ్డు ఎస్టీ కాలనీలో సోమవారం జరిగింది. గుండ్లకమ్మ రేంజి పరిధిలోని మాలకొండపెంట బీట్‌లో ఆర్.నరేంద్ర అనే యువకుడు ఏబీఓగా పనిచేస్తున్నాడు. తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి నరేంద్రను స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తీసుకెళ్లారు. నరేంద్ర రాసిన సూసైడ్ నోట్ కథనం ప్రకారం.. నరేంద్ర ఎఫ్‌బీఓగా పదోన్నతి పొందేందుకు సీనియారిటీ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు. ఆ పదోన్నతిని నరేంద్రకు కాకుండా డీఎఫ్ఓ సామాజిక వర్గానికి చెందిన మరొకరికి ఇచ్చారు. తనకెందుకు ఇవ్వలేదంటూ అతడు డీఎఫ్ఓను ప్రశ్నించాడు. ఇది మనసులో పెట్టుకుని కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు ఎస్.నబీరసూల్, షేక్ ఖుద్దూస్, షేక్ నజీర్అహ్మద్లు ఈ నెల 7వ తేదీన నరేంద్రను కులం పేరుతో దూషించి గెంటేశారు. అదే రోజు అతడు ఆ ముగ్గురిపై స్థానిక పోలీసుస్టేషన్లో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశాడు. దీన్ని మనసులో ఉంచుకుని ఆ ముగ్గురు అధికారులు నరేంద్రపై డీఎఫ్‌ఓకు లేనిపోనివి చెప్పారు. డిపార్ట్మెంటల్ విచారణల పేరుతో అధికారులు వేధించారు. పదోన్నతి రాకపోవడం.. వేధింపులు భరించలేక ఆయన తీవ్ర మనస్తాపం చెందాడు. సీనియర్ అయిన తనకు పదోన్నతి ఇవ్వలేదని నరేంద్ర సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తక్కువ కులం వాడినంటూ హేళన చేశారని, తన చావుకు ఎస్.నబీరసూల్, ఖుద్దూస్, నజీర్అహ్మద్లని నరేంద్ర రాసిన సూసైడ్ నోట్లో ఉంది. -
అటవీ శాఖ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఓ అటవీశాఖ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు ప్రమోషన్ రాకుండా ఉన్నత అధికారులు అడ్డుకోవడంతో మనస్తాపం చెందిన నరేంద్ర ఈ రోజు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. నరేంద్రను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వర్సిటీ నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు
ఎస్కేయూ: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మియామీలో రామన్‌ఫెలోషిప్ ప్రాజెక్ట్‌లో వర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర మద్దు ఏడాది పాటు పరిశోధన చేయాల్సి ఉంది. ఇందుకు ఎస్కేయూ అనుమతించలేదు. నరేంద్ర మద్దు హైకోర్డును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ దుర్గాప్రసాద్‌తో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. అకడమిక్ పురోగతిలో భాగంగా చేస్తున్న పరిశోధనలకు అనుమతి ఎందుకు ఇవ్వకూడదని వర్సిటీ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కోర్టు తీర్పు ఆధారంగా తనను విధుల నుంచి రిలీవ్ చేయాలని ఎస్కేయూ ఉన్నతాధికారులను నరేంద్ర కోరారు. -
టీటీడీ ఉద్యోగుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు
- అదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే నెపంతో సోదాలు - కోట్ల రూపాయలు విలువచేసే డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం తిరుచానూరు/తిరుపతి క్రైం : ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఫిర్యాదులు అందడంతో తిరుపతికి చెందిన ముగ్గురు టీటీడీ అధికారుల ఇళ్లపై ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కోట్లాది రూపాయల విలువజేసే డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నియామక విభాగపు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నరేంద్రరెడ్డి, తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మోహన్ రెడ్డి, తిరుమల కల్యాణకట్టలో సూపర్వైజర్గా పనిచేస్తున్న తంగవేలు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కొంతకాలంగా వారిపై నిఘా పెట్టారు. మంగళవారం తిరుచానూరు వసుంధరనగర్‌లో నివాసం ఉంటున్న నరేంద్ర రెడ్డి, తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెలో ఉంటున్న మోహన్ రెడ్డి, కొర్లగుంటలో ఉంటున్న తంగవేలు ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. అదే సమయంలో నలుగురు నరేంద్ర రెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. వీరి ఇళ్లల్లో నుంచి దాదాపు కోట్లాది రూపాయల విలువైన డాక్యుమెంట్లు, ఇంటి పత్రాలు, బ్యాంకు లాకర్లు, బ్యాంక్ పాసుబుక్కులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో దాడులు చేసినట్లు ఏసీబి డీఎస్పీ తెలిపారు. అయితే, పూర్తి స్థాయిలో విచారణతో పాటు సోదాలు నిర్వహిస్తేనే ఎంత అక్రమ ఆస్తులు కూడబెట్టారనే సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. వీరితో వ్యాపారం చేసిన వారిపైనా త్వరలోనే దాడులు చేస్తామని డీఎస్పీ చెప్పారు. -
ప్రధాని మోదీ ఇప్పటికీ టాపరే!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య తరగతి ప్రజల దృష్టిలో నేటికీ టాపర్ అంటున్నాయి తాజా సర్వేలు. భారత్ లోని ప్రధాన ఏడు నగరాల్లో జరిపిన సర్వేలలో మోదీనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఈటీ-టీఎన్ఎస్ సర్వేలో వెల్లడి అయ్యాయి. నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓ బలమైన మెజారిటీ తో అధికారాన్ని కైవసం చేసుకొని దాదాపు రెండు సంవత్సరాలు గడిచింది. అయిప్పటికీ మోదీనే అధిక మద్దతు కలిగి ఉన్నట్లు ఈటీ-టీఎన్ఎస్ సర్వే లెక్కలు నిరూపిస్తున్నాయి. ఆయన అజెండాలో కీలక అంశాల సంస్కరణలో వైఫల్యం చెందడంతోపాటు, అనేక వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం రేటింగ్స్ లో ఫస్ట్ మార్కును మాత్రం కోల్పోలేదని తాజా సర్వేలు తేల్చి చెప్పాయి. ఆర్థిక పనితీరులో 86 శాతం, ఉద్యోగ సృష్టిలో 62 శాతం, భవిష్యత్ ప్రణాళికల విషయంలో 58 శాతం మోదీ ప్రభుత్వం మార్కులు కొట్టేసిందని సర్వే లెక్కలు చెప్తున్నాయి. అచ్చేదిన్ ఆనేవాలా హై అంటూ నమ్మకంగా చెప్పే మోదీ ప్రజల్లో నేటికీ మొదటి స్థానంలోనే ఉన్నారని ఈటీ-టీఎన్ఎస్ సర్వే చెప్తోంది. -
జగన్ సహా 13 మందిపై కేసు
► ‘సాక్షి’పై ఎమ్మెల్యే నరేంద్ర ఫిర్యాదు ► తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాశారంటూ పొన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పొన్నూరు: సాక్షి దినపత్రిక, టీవీ చానళ్లలో టీడీపీకి, తమ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వార్తలు వచ్చాయని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డి.నరేంద్రకుమార్ ఆదివారం గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు బాధ్యులైన కె. రామచంద్రమూర్తి (ప్రింటర్, పబ్లిషర్ ఆఫ్ సాక్షి తెలుగు డైలీ న్యూస్‌పేపర్), వి.మురళి (ఎడిటర్), వైఎస్ భారతీరెడ్డి (చైర్పర్సన్ ఆఫ్ జగతి పబ్లికేషన్స్), జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ డెరైక్టర్లు హన్నప్పనహల్లి వీరన్న ఈశ్వరయ్య, వై.ఈశ్వరప్రసాదరెడ్డి, వి.శ్రీధరరెడ్డి, రాజప్రసాదరెడ్డి, పి.వి.కె.ప్రసాద్, ప్రకాశరావు అంతుర్ నారాయణ్, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ డెరైక్టర్లు ఎల్.బలరాంరెడ్డి, వీర్మణి బాలరాజు, బండి రాణిరెడ్డి, వైఎస్ జగన్ (పొలిటికల్ మెంటర్ ఆఫ్ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్), ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సాహసబాలలకు జాతీయ పురస్కారాలు ప్రదానం
-
మోదీకి క్వీన్ ఎలిజబెత్ విందు
లండన్ : బ్రిటన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్వీన్ ఎలిజబెత్ అతిథి సత్కారం ఇచ్చారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న మోదీ గౌరవార్థం శుక్రవారం బకింగ్ హ్యామ్ ప్యాలెస్‌లో క్వీన్ ఎలిజబెత్..ఆయనకు విందు ఇచ్చారు. అనంతరం వెంబ్లే స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ సభకు సుమారు 60 వేల మందిపైగా ఎన్నారైలు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున ఎన్నారైలు చేరుకున్నారు. అనంతరం మోదీ బ్రిటన్ ప్రధాని కామెరూన్ తో భేటీ అవుతారు. ఇక మూడో రోజు పర్యటనలో భాగంగా మోదీ ఉత్తర లండన్ లో అంబేద్కర్ మెమోరియల్ ను, 12వ శతాబ్దపు తత్వవేత్త బసవేశ్వర విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
చికిత్స పొందుతూ మృతిచెందిన యువతి ఆస్పత్రిలో కోలుకుంటున్న యువకుడు నక్కపల్లి/పాయకరావుపేట:పెళ్లికితల్లిదండ్రులు నిరాకరిస్తున్నారన్న కారణంగా ప్రేమంజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడగా, యువకుడు తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తండ్రి సత్తిబాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు, తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామానికి చెందిన ఉలవకాయల పార్వతి(21) అదేగ్రామానికిచెందిన వేముల నరేంద్రలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మేనత్త మేనమామపిల్లలు,పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పార్వతి తల్లిదండ్రులు ఆమెకు బయట వ్యక్తితో వివాహం చేయడానికి సంబంధాలుచూస్తున్నారు. ఈ విషయం తెలిసిన ప్రేమికులిద్దరూ ఈనెల 22న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరూ సమీపంలో ఉన్న తోటలో పడిఉండటాన్ని చూసి బంధువులు తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. యవతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడకు తీసుకెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి సమయంలో ఆమె మృతి చెందినట్లు తండ్రి సత్తిబాబు పోలీసులకు తెలిపాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. -
న్యూక్లియర్ సప్లయర్ గ్రూపులో భారత్?
బీజింగ్: అణు సరఫరాదారుల (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ) బృందంలో భారత్‌కు సభ్యత్వం అంశం గురించి భారత్- చైనాల మధ్య మొదటి సారి చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ మీడియాకు వివరించారు. మోదీ పర్యటన వివరాలను ఆయన తెలిపారు. చైనా ప్రధాని జిన్ పింగ్ సమావేశ వివరాలు, 24 ఒప్పందాలపై సంతకాలు తదితర విషయాలను విలేకర్లకు తెలిపారు. పాకిస్థాన్‌లో పెట్రేగుతున్నఉగ్రవాదం, ఉగ్రవాదంపై ఇరుదేశాల పోరు, ఐరాస భద్రతా మండలిలో చేపట్టాల్సిన సంస్కరణలు చర్చకు వచ్చాయన్నారు. గుజరాత్లో మోదీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి నమూనాను చైనాలో అమలు చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆ దేశ ప్రధాని చెప్పారని తెలిపారు. అలాగే నేపాల్ భూకంప తదనంతర పరిస్థితులపై కూడా చర్చించారన్నారు. ఇరు ప్రధానుల భేటీ తర్వాత నరేంద్ర మోదీ ప్రసంగ వివరాలను తెలుపుతూ భారత్ - చైనా సరిహద్దులో శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారన్నారు. కాగా అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల పట్ల అగ్రరాజ్యాలు వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించిన ప్రధానమంత్రి .. 'భారత్‌లో కాలుష్యం పెరిగిపోతోందని వివిధ దేశాల ఏజెన్సీలు లెక్కలతో సహా మనల్ని నిందిస్తాయి.. కానీ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల్ని కడతామంటే మాత్రం గగ్గోలు పెడతాయి. దయచేసి మాకు అనుమతులు మంజూరుచేయండి' అని గ్లోబర్ న్యూక్లియర్ కమిటీని మోదీ గతంలో విజ్ఞప్తి చేశారు. -
ప్రధాని మోదీని కలవనున్న వైఎస్ జగన్
-
మీ నాయకుడెవరు?
ముంబై: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకుడెవరో ప్రకటించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ బీజేపీకి సవాలు విసిరారు. నరేంద్ర మోడీ పేరిట ఓట్లు అడగటాన్ని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోజువారీ నిర్ణయాలు చేసేది ముఖ్యమంత్రి అని, ప్రధాన మంత్రి కాదని పేర్కొన్నారు. పదిహేనేళ్ల కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం ఉన్నపక్షంలో వారిని తొలగించేందుకు వెనుకాడబోమని చవాన్ స్పష్టం చేశారు. యువతకు, మహిళలకు మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పారు. అదే సమయంలో తమ నియోజకవర్గాలను తీర్చిదిద్దిన వారిని విస్మరించబోమని కూడా ఆయన తేల్చి చెప్పారు. దీనిని బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో అనుభవానికి, యువతకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు చవాన్ సూచనప్రాయంగా వెల్లడించారు. ‘మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేరు. ఢిల్లీలో మాకు మోడీ ఉన్నాడని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుండవచ్చు. కానీ ఎలా సాధ్యమవుతుంది. ఇక్కడ రోజువారీ వ్యవహారాలను నడపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా?’ అని సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకుడెవరో ప్రకటించాలని అన్నారు. నాయకత్వం అంశంపై బీజేపీ, శివసేనల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. మహాకూటమిగా ఉద్ధవ్ ఠాక్రే నాయకునిగా ఉంటారని శివసేన ఇదివరకే ప్రకటించింది. ప్రజలు పార్టీని, పార్టీ విధానాలను, పార్టీ నేతను బట్టి ఎన్నుకుంటారని చవాన్ పేర్కొన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ నాయకులను ప్రకటించాయని, బీజేపీ మాత్రమే ఇంతవరక వెల్లడించలేదని అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారానికి వస్తుందని చవాన్ ధీమా వ్యక్తం చేశారు. గత రెండు నెలల కాలంలో అనేక ప్రజల నిర్ణయాల్లో మార్పు వచ్చిందన్నారు. ఉప ఎన్నికల ఫలితాలను బట్టి ప్రజల తీర్పు విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు, రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఓటర్లు భిన్నంగా స్పందిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిస్తారా అన్న ప్రశ్నకు చవాన్ సానుకూలంగా స్పందించారు. అయితే గత ఐదు, పదేళ్లుగా నియోజకవర్గాలను తీర్చిదిద్దిన ఎమ్మెల్యేలను వదిలివేయబోమని స్పష్టం చేశారు. మంచిపనులు చేసిన ఎమ్మెల్యేలకు మరో అవకాశం తప్పకుండా ఇస్తామని చెప్పారు. తమ పార్టీలో యువత, మహిళలు చురుకుగా పని చేస్తున్నారని, విద్యావంతులకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉందని అన్నారు. -
అవునండీ.. విప్ జారీ చేశాం.. అయితే?!
-
ఎందుకీ అఘాయిత్యం?
మైనర్ ప్రేమికుల ఆత్మహత్యాయత్నం అబ్బాయి మృతి, చావుబతుకుల్లో బాలిక రావికమతం: అంతుబట్టని కారణంతో మైనారిటీ తీరని బాలుడు, బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిలో బాలుడు మృతి చెందగా, బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉంది. పి.పొన్నవోలు శివారు పెదకుముందానిపేట గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ ప్రేమికులు బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ప్రియుడు మృతిచెందగా, బాలిక విశాఖలోని ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పెద్దలకు కనీసం తెలియని ఈ ప్రేమ వ్యవహారంపై ఎవ్వరేమన్నారో తెలియదుగానీ తనువులు చాలించాలనే కఠిన నిర్ణయం తీసుకుని వీరు కన్నవారికి కన్నీరు మిగిల్చారు. ఇంతకీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. గ్రామానికి చెందిన నరేంద్ర (17), సమీపంలోనే నివాసం ఉంటున్న కల్పన(14) కొంతకాలంగా ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. కల్పన మేడివాడ హైస్కూల్లో ఏడో తరగతి పూర్తి చేసింది. నరేంద్ర గతంలో ఎనిమిది వరకూ చదివి ఖాళీగా ఉంటున్నాడు. బధవారం రాత్రి వీరిరువురూ కొత్తకోటలోని కల్పన తాతగారింటికి వచ్చారు. వారు ఇంటి వద్ద లేకపోవడంతో అక్కడికి సమీపంలోని హైస్కూల్ గ్రౌండ్‌కు వెళ్లారు. అప్పటికే కొని సిద్ధంగా ఉంచుకున్న గుళికలు మింగేశారు. కాసేపటికి గింజుకుంటూ వారి బంధువులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. దీంతో ఉభయుల బంధువులూ అక్కడికి చేరుకుని వెంటనే నర్సీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా నరేంద్ర మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కల్పన అపస్మారక స్థితికి చేరుకోవడంతో నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో ప్రథమ చికిత్సచేసి ఆపై విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతోంది. తహశీల్దార్ భాస్కరరావు ఆ గ్రామం వెళ్లి విచారించారు. వారిద్దరూ ఎపుడూ కలిసి ఉన్నట్లు కూడా చూడలేదని, ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదని అక్కడివారు తహశీల్దార్‌కు వివరించారు. కొత్తకోట ఎస్ఐ శిరీష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అందరూ ఆశావహులే...
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా వ్యవధి ఉండటంతో మంత్రి పదవులకోసం పోటీ ఎక్కువైంది. జిల్లాలో ఆశావహుల సంఖ్య బాగానే ఉంది. సీనియారిటీ, సిన్సియారిటీ అంటూ కొంతమంది నేతలు చెబుతుంటే మరికొంత మంది మాత్రం సామాజిక వర్గాన్ని నమ్ముకుంటున్నారు. గ్రూపులుగా విడిపోయిన దేశం ఎమ్మెల్యేలు మంత్రి పదవి తనదంటే తనదేనని అనుయాయుల వద్ద చెబుతున్నారు. సాక్షిప్రతినిధి, గుంటూరు: జిల్లాలో 17 శాసనసభ స్థానాలకూ 12 స్థానాలను దక్కించుకుని పట్టు సాధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు మంత్రి పదవులకోసం పట్టుపడుతున్నారు. సీనియారిటీ... సామాజికవర్గాలవారీగా తమకు అనుకూలమైన సమీకరణలు సృష్టించుకుని అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అవసరాన్ని బట్టి పైరవీలూ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా జిల్లా నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(తెనాలి), ధూళిపాళ్ల నరేంద్ర(పొన్నూరు), ప్రత్తిపాటి పుల్లారావు(చిలకలూరిపేట), యరపతినేని శ్రీనివాసరావు(గురజాల),కోడెలశివప్రసాదరావు(సత్తెనపల్లి),జి.వి.ఆంజనేయులు(వినుకొండ), మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి(గుంటూరువెస్ట్), నక్కా ఆనంద్‌బాబు(వేమూరు) మంత్రి పదవులను ఆశిస్తున్నవారిలో ఉన్నారు. అయితే వీరిలో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నక్కా ఆనందబాబు తప్ప మిగిలిన వారంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. వీరిలో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుంద న్న ధీమాలో ధూళిపాళ్ల నరేంద్ర ఉండగా, మాజీ మంత్రులైన ఆలపాటి రాజేంద్రప్రసాద్, కోడెల శివప్రసాద్‌లు అనుభవమున్న తమకు తప్పకుండా మంత్రిపదవి వస్తుందని భావిస్తున్నారు. అదేసమయంలో జిల్లా పార్టీ అధ్యక్షునిగా పదేళ్ల పాటు పార్టీకి సేవలందించిన తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ప్రత్తిపాటి పుల్లారావు అధిష్టానం వద్ద ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఎవరూ చంద్రబాబునాయుడు పర్యటనకు ముందుకు రాలేదని, ఆ సమయంలో తన నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనను ఏర్పాటు చేసి విజయవంతం చేశానని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెబుతున్నారు. అలాగే వినుకొండ నుంచి రెండుసార్లు ఎక్కువ మెజార్టీతో గెలిపించిన తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కొంతమంది అధిష్టానానికి దగ్గరగా ఉండే నేతలతో వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు సిఫార్సులు చేయిస్తున్నారు. మాకు రాకున్నా... ఆయనకు రాకూడదు జిల్లాలో తమలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు కాని కోడెలకు మాత్రం మంత్రి పదవి ఇవ్వవద్దంటూ కొంతమంది నాయకులు చంద్రబాబునాయుడును కోరినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే కోడెలకు బీజేపీ అగ్రనాయకుడైన వెంకయ్యనాయుడుతో మంచి సంబంధాలు ఉండటంతో ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవచ్చనే అనుమానాలను సైతం వారు వ్యక్తం చేస్తున్నారు. గ్రూపులుగా విడిపోయిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులకోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇక నరసరావుపేట ఎంపీగా పోటీచేసే అవకాశమివ్వాలని కోరిన వేణుగోపాలరెడ్డిని గుంటూరు పశ్చిమనుంచి పోటీచేసి గెలిచి వస్తే మంత్రి పదవి ఇస్తానంటూ బాబు హామీ ఇచ్చారనీ, దాని ప్రకారం తనకు అవకాశం తప్పక దక్కుతుందని ఆయన అనుయాయుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదెంతవరకు నిలబెట్టుకుంటారన్నది వేచి చూడాలి. వేమూరు నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నక్కా ఆనందబాబుకు ఎస్సీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆయన అనుయాయులు ఆశపడుతున్నారు. అయితే ఇందులో మరో చిన్న తిరకాసును సైతం వారు చెబుతున్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు మంత్రి పదవి ఇస్తే ఆయన శిష్యుడైన నక్కా ఆనందబాబుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు. పైరవీల జోరు.. టీడీపీలో చక్రం తిప్పుతున్న సుజనాచౌదరి, సీఎం రమేష్‌తో కొంతమంది నాయకులు సంప్రదింపులు జరుపుతుండగా మరికొంతమంది మాత్రం బీజేపీలోని జాతీయ నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను నమ్ముకుంటున్నారు. ఏది ఏమైనా జూన్2న కొత్త రాష్ట్రం అవతరించిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గం కూర్పు పెద్ద సవాల్ కాకతప్పదని భావిస్తున్నారు. -
దంపతుల కలహం.. ఆరుగురు బలి
ఒడిశాలో విషాదం అత్త, మామ సహా ఐదుగురిని కాల్చి చంపిన కానిస్టేబుల్ అనంతరం తానూ ఆత్మహత్య కొరాపుట్(ఒడిశా), భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఆరు నిండు ప్రాణాలను బలిగొంది. భార్య మీద కోపంతో ఓ వ్యక్తి అత్తింటి వారిలో నలుగురిని, వారితో పాటు ఉన్న కారు డ్రైవర్‌ను కాల్చి చంపడమే కాకుండా, చివరకు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒడిశాలోని కొరాపుట్‌లో సోమవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిస్ట్రిక్ట్ వాలెంటరీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న నరేంద్ర కండపాన్ కుటుంబంతో కలసి స్థానిక ఓల్డ్ మైనింగ్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. కోపోద్రిక్తుడైన నరేంద్ర తన భార్య జ్యోతిర్మయి ఎడమ కాలిపై ఇనుపరాడ్‌తో కొట్టాడు. దీంతో ఆమె భయంతో వేరే గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని, వెంటనే వచ్చి కాపాడాలని తండ్రి జలేందర్ సమర్లియాకు ఫోన్ చేసింది. ఆందోళన చెందిన ఆమె తండ్రి అద్దె కారులో భార్య హేమలత, కుమారుడు మిథున్, తొమ్మిదేళ్ల కుమార్తె రచన లతో కలసి రాత్రి 12 గంటల సమయంలో కొరాపుట్ చేరుకున్నాడు. ఇంటి ముందు కారు ఆగిన శబ్దం విన్ననరేంద్ర మరింత ఆగ్రహంతో ముందుకెళ్లాడు.కారులో ఉన్న అత్తమామలు, బావమరిది, మరదలితో పాటు డ్రైవర్‌పై తనవద్ద ఉన్న ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం, ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న తుప్పల మధ్యకు వెళ్లి తుపాకీతో పేల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడేళ్ల క్రితమే పెళ్లిచేసుకున్న నరేంద్ర, జ్యోతిర్మయిలకు ఏడాదిన్నర వయసున్న పాప ఉంది. -
ఏదీ నీ ‘పవార్’!
సాక్షి, ముంబై: ‘రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతన్నలను ప్రకృతి విపత్తు ఆగమాగం చేసింది. ఇలాంటి వీరికి మేమున్నామనే భరోసాను కలిగించే నాయకుడే కరువయ్యారు. బ్యాంక్ రుణాలు కూడా అన్నదాతలకు సకాలంలో అందడం లేదు. వీరు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి చేజారిపోతోంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న రాష్ట్రానికి చెందిన శరద్ పవార్ సమాధానం చెప్పాల’ని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీల కూటమిని గద్దె దింపాలని వార్ధాలో గురువారం జరిగిన బహిరంగ సభలో ప్రజలకు పిలుపునిచ్చారు. తొలుత మరాఠీలో తన ప్రసంగాన్ని ప్రారంభించి స్థానికులను ఆకట్టుకున్న మోడీ, వడగళ్ల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థులపై మాటల తూటాలను పేల్చారు. ‘లాల్ బహదూర్ శాస్త్రి’ జై జవాన్, జై కిసాన్ అనే నినాదాన్ని అందించారు. కానీ ప్రస్తుతం మనదేశంలో జవాన్లు (సైనికులు), రైతులు సురక్షితంగా లేరన్నారు. రైతులను గిట్టుబాటు ధరలు లభించడం లేదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ‘రైతులకు బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేవలం ఐదు శాతం రుణాలే రైతులకు అందుతున్నాయి. మిగతా 95 శాతం రుణాలను పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు ఇస్తోంది. ఇలా వ్యవహరిస్తే రైతులు ఆత్మహత్యలు ఎలా తగ్గుతాయ’ని మోడీ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో వచ్చిన అనంతరం రైతులకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులను ఆదుకుంటామని, సాగుతాగు నీటిపై ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టులు రూపొందిస్తామని చెప్పారు. పత్తి రైతుల కోసం ‘ఫైవ్ ఎఫ్ ఫార్ములా’ రూపొందిస్తామన్నారు. ఈ సభలో బీజేపీ ప్రముఖ నాయకులతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
రాత్రికిరాత్రే దుకాణం లూటీ
జమ్మికుంట టౌన్, న్యూస్‌లైన్ : పట్టణంలోని మహాలక్ష్మీ జ్యువెల్లర్స్లో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఈ దుకాణం పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండడం గమనార్హం. బాధితుడు ముక్కా నారాయణ కథనం ప్రకారం... షాపును రోజూలాగే రాత్రి 9 గంటల ప్రాంతంలో బంద్ చేశారు. ఉదయం షెట్టర్ పైకి లేపి ఉండడంతో పక్కనే ఉన్న దుకాణదారులు గుర్తించి యజమానికి తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. శిక్షణ డీఎస్పీ సుధీంద్ర, రూరల్ సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని కరీంనగర్ నుంచి క్లూస్‌టీంను రప్పించారు. వారు ఆధారాలు సేకరించారు. షాపులో సీసీ కెమెరాలున్నా అవి సరిగా పని చేయకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడుతున్నారు. సుమారు రూ.8 ల క్షల రూపాయల విలువ చేసే 16 కిలోల వెండి ఆభరణాలు చోరీ అయ్యాయని, వెనకరూములో ఉన్న బంగారం లాకర్‌ను మాత్రం దొంగలు ముట్టుకోలేదని బాధితుడు పేర్కొన్నాడు. అయితే నాలుగు కిలోలు మాత్రమే పోయినట్లుగా కేసు నమోదైంది. దుకాణంలోని రశీదు పుస్తకం ఆధారంగానే కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు
ఎన్జీవోస్కాలనీ, న్యూస్‌లైన్ : తమ వద్దకు వచ్చే ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నామని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజింగ్ డెరైక్టర్, చైర్మన్ నరేంద్ర అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని ఏబీకే మాల్లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వరంగల్ రీజియన్ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ నరేంద్ర విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది వరంగల్ రీజియన్ పరిధిలో *2000 వేల కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు నిర్వహించామని, వచ్చే ఏడాదిలో ఈ సంఖ్యను *5,000 వేల కోట్లకు పెంచేందుకు ప్రణాళికలు రూపొం దించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,059 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయని తెలిపారు. గతంలో తమ బ్యాంకు సేవలు ఎక్కువగా పట్టణాలు, నగరాల్లో అందుబాటులో ఉండేవని, కొత్తగా ఈ ఏడాది 156 బ్రాంచ్‌లు ప్రారంభించగా వీటిలో 60 శాఖలను గ్రామీణ ప్రాంతాల్లోనే నెలకొల్పినట్లు వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా మరో 26 శాఖలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా త మ బ్యాంకు సేవలను విస్తరిస్తున్నామని, ఇందు లో భాగంగా వ్యవసాయం, సూక్ష్మ, చిన్న తర హా యూనిట్లకు రుణాలను విరివిగా అందజేస్తున్నామని చెప్పారు. ఐఓబీ తరపున ఇప్పటికే అగ్రిమేళా కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు పంటలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. రైతులకు వ్యవసాయరుణాలు ఇచ్చేందుకు దేశ వ్యాప్తం గా తమకు 40 బ్యాంకులు ఉన్నాయన్నారు. కొలంబో, హంగ్‌కాంగ్, సియోల్, సింగపూర్‌లో కూడా తమ బ్రాంచ్‌లను నెలకొల్పి విదేశాల్లో తమ సేవలను విస్తరింపజేశామన్నారు. రాబోయే మూడునెలల్లో బ్యాంకు బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఖాతాదారులను ఆకట్టుకునేందుకు గిఫ్ట్‌కార్డు, లిటిల్‌స్టార్ అకౌం ట్ వంటి పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వరంగల్‌లో రీజినల్ సెంటర్‌ను ప్రారంభించడం ద్వారా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో తమ సేవలు మరింత విస్తరింపజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, రీజినల్ సెంటర్ ప్రారంభాన్ని పురస్కరించుకుని 20 మంది లబ్ధిదారులకు సీఎండీ *20 కోట్ల రుణాలను చెక్‌ల ద్వారా పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్యాంకు సీనియర్ రీజినల్ మేనేజర్ కె.జీవానందం, చీఫ్ మేనేజర్ ఎం.రాజేశ్వరి, ఐఓబీ నేషనల్ బ్యాంకింగ్ జనరల్ మేనేజర్ పవన్కుమార్గార్గ్, హైదరాబాద్ చీఫ్ రీజినల్ మేనేజర్ కె.స్వామినాథన్, బ్రాంచ్ మేనేజర్లు రామకృష్ణపట్నాయక్, ఆంజనేయరెడ్డి, నాగప్రసాద్, వీరన్న, రంజిత్, ఐఓబీ ఆఫీసర్స్ అసోషియేషన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సుబ్బారావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అంచిరెడ్డి, అవార్డ్స్ స్టాఫ్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్మోహన్రావు, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.రాజేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రత్నవీరాచారి, నాయకుడు రత్నాకర్‌రెడ్డి, బిల్డర్స్ అసోషియేషన్ నాయకుడు చిదురాల రఘునాథ్, ఫోరం బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ పాల్గొన్నారు.