సాక్షి, తాడేపల్లి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్‌సీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. రోజురోజుకీ పార్టీలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా-రంగా మిత్రమండలి సభ్యులు షేక్ బాబు, ఇమ్రాన్ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్ పాల్గొన్నారు.
రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ వెళ్లడం ఏంటి?
పార్టీలో చేరిన అనంతరం వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనైతికమంటూ మండిపడ్డారు. కూటమి ఏర్పడింది ప్రజలు కోసం కాదు.. వారి స్వార్థం కోసం. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ ఏనాడూ ఆలోచించలేదు. రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ వెళ్లడం ఏంటి?. పవన్ వెంట కాపులెవరూ ఉండరు’’ అంటూ వంగవీటి నరేంద్ర తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment